Festival gift
-
బతుకమ్మ చీరలు రెడీ.. నేటి నుంచి గ్రామాల్లో పంపిణీ
కరీంనగర్‌రూరల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగా ఏటా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తోంది. 2017 నుంచి ఆహార భద్రత కార్డు కలిగి ఉండి, 18 ఏళ్లు దాటిన మహిళలకు అందిస్తున్న చీరలను ఈనెల 4 నుంచి 14వ తేదీ వరకు పంపిణి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈఏడాది జిల్లావ్యాప్తంగా 3,53,707 చీరలు అవసరం కాగా ఇప్పటివరకు 2.79 లక్షల చీరలు వచ్చాయి. ఇంకా 74,707 చీరలు రావాల్సి ఉన్నాయి. మంగళవారం జిల్లాలోని గోదాముల నుంచి చీరల స్టాక్‌ను పంచాయతీ అధికారులకు అప్పగించారు. బుధవారం నుంచి జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్లో చీరలు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, రేషన్‌డీలరు, స్వశక్తి సంఘాల ఆధ్వర్యంలో మహిళలకు పంపిణీ చేయనున్నారు. -
Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్ ఇచ్చారంటే.. దిల్ ఖుష్!!
పండగంటే పెద్దగా ఉండాలి. గిఫ్ట్ ఇస్తే గుర్తుండిపోవాలి. అందునా దీపావళి ప్రతిఒక్కరికీ ప్రత్యేకమైనది. మీ సన్నిహితులకు ఈ గిఫ్ట్‌లు ఇచ్చారంటే మీ మధుర స్నేహం చిరకాలం నిలిచిపోతుంది. పైగా వాటిని అస్సలు కాదనరు కూడా. డ్రై ఫ్రూట్స్ బాస్కెట్ మీ లైఫ్‌లో ప్రత్యేక వ్యక్తులకు ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలంటే డ్రై ఫ్రూట్స్ బాస్కెట్ బెస్ట్! ఇదేకాకుండా బిస్కెట్లు, చాక్లెట్లు, టోఫీలు, కప్‌కేక్‌లు వంటి ఇతర తినగలిగిన వస్తువులు ఉన్న బాస్కెట్లను కూడా గిఫ్ట్‌లుగా ఇవ్వొచ్చు. కుకీస్ గిఫ్ట్ కుకీస్‌లను బహుమతిగా ఇవ్వవడం మంచి ఎంపిక. టీ, కాఫీలతో తినడానికి ఇవి ఉత్తమమైనవి. ఈ రోజుల్లో, చోకో చిప్, జీడిపప్పు బాదం, తాజా పండ్లు వంటి అనేక రకాల కుకీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని మీ ప్రియమైన వ్యక్తులకు ఇస్తే అస్సలు వద్దనరు. చదవండి: Millet Snacks: చిరుధాన్యాలతో చిరుతిళ్ల వ్యాపారం!.. కోట్లలో లాభం.. ఫ్రూట్ బాస్కెట్ మీ స్నేహితులకు ఇష్టమైన పండ్లను కొనుగోలు చేసి ప్రత్యేకంగా తయారుచేసిన బుట్టలో అందంగా సర్ది కూడా గిఫ్టులుగా ఇవ్వొచ్చు. స్నాక్స్ మీరు ఏదైనా విభిన్నంగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే.. అల్పాహారంగా తినగలిగే స్నాక్స్ ఐటమ్స్ మిక్స్ చేసిన గిఫ్ట్ బాక్స్‌ను తయారు చేసి ఇవ్వొచ్చు. ఇందులో పోహా, ఓట్స్ మ్యాగీ, ఇడ్లీ దోస పిండి, రవ్వ ఇడ్లీ పిండి, చాక్లెట్లు, టోఫీ పెట్టుకోవచ్చు. టెట్రా జ్యూస్ ప్యాక్ మిక్స్ విభిన్న రుచుల్లో ఉండో టెట్రా జ్యూస్ ప్యాక్‌లతో కూడా గిఫ్ట్ బాక్స్‌లను తయారు చేయవచ్చు. వీటిని కూడా మీ ప్రియమైన వారికి ప్రత్యేకంగా అందించవచ్చు. చదవండి: Pink Cafe: చాయ్‌తోపాటు.. మీ సమస్యలకు పరిష్కారం కూడా.. -
పండుగ బొనాంజా : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్
-
అదిగో మూజలెల్లి!
నాకు ఏ పండుగ వచ్చినా ఇద్దరు అక్కలను, ఒక చెల్లెను తీసుకురావడం మళ్లీ పండుగ తరువాత వారిని తొలి రావడం, వాళ్లు ఉన్న అయిదు, ఆరురోజులు ఇల్లంతా సందడి సందడిగా ఉండి వాళ్లు వెళ్లగానే అంతా నిశ్శబ్దంగా ఉండటం, ఏమితోచక పోవడంతో నాకు కూడా పండుగలు కాని ఏదైనా కార్యక్రమాలు కాని ఎప్పుడెప్పుడు జరుగుతాయా! అక్కలను ఎప్పుడు తీసుకరావాలి అనిపించేది. అది 1994 సంవత్సరం సంక్రాంతి పండుగ. మా అక్కలు యశోదక్క, సత్తెక్క మరియు చెల్లి నర్సవ్వను తీసుకొని వచ్చాను. ఇంట్లో వాళ్ళు వారి వారి పిల్లలతో సందడిగా, ఆటలు మాటలతో హుషారుగా ఉంటే నేను అలా బయటికి వెళ్లొస్తా అని వెళ్లి ఒక అయిదారుగంటలు స్నేహితులతో మాట్లాడి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా గొడవ గొడవ జరుగుతోంది.ఏందబ్బా ఇంతమంది కూడిండ్రు, ఏం జరిగి ఉండొచ్చు అనుకుంటూ లోపలికి పోయేసరికి ‘‘ఇంకోసారి నన్ను పండుగకు తీసుకురావద్దు. నేను రాను’’ అన్నది మా సత్తెక్క. ‘‘మేము ఏమన్నా అన్నామా! నీ బిడ్డే ఆ ముసలామెను అంటే ఆమె మనల్ని తిట్టబట్టే’’ అని అమ్మ అంటుంది. ‘‘ఏదో చిన్నపిల్ల తెల్వక అన్నది అని చెప్పొచ్చు కదా. మీరు కూడా తిట్టబడ్తిరి. అందుకే ఇంకోసారి నేను రాను’’ అంటోంది అక్క ‘‘ఏ! ఆగండి, అసలేం జరిగింది?’’ అని నేను అడిగేసరికి–‘కాదురా తమ్మీ! మన పక్కింటి ఎల్లవ్వను మన పద్మ (అక్క బిడ్డ) ముసలెల్లి ముసలెల్లి అన్నదట. అందుకే ఆమెతో పాటు మన అమ్మ నన్ను నా బిడ్డను తిడుతున్నరు. నేనింకోసారి రాను’’ ఏడుపందుకుంది అక్క ‘‘మరి గా ముసలిదాని జోలి గీ పిల్లకెందుకు, మనింట్లో మనముండక’’ అంటోంది అమ్మ.‘‘నా బిడ్డకు తెలుసా! చెప్పరా తమ్మీ’’ అన్నది అక్క. ‘‘అట్లగాదక్కా! గా పక్కింటి ముసలామె జోలి మన పద్మకెందుకొచ్చింది. ఆ ముసలామె కోపానికెందుకొచ్చింది, నాకేమి అర్థం అయితలేదుగని ఒకసారి పద్మను పిలువు అడుగుదాం’’ అన్నాను. ‘‘పద్మా... పద్మా నువ్వెమన్నవు బిడ్డా? మామయ్యకు చెప్పు’’‘‘నేను మా చెల్లిని అంటే గామె నన్ను కొట్టింది మామయ్యా’’‘‘మరి ముసలెల్లి అంటే కోపం రాదారా పద్మా. తప్పు కాదా’’‘‘మూజలెల్లిని అంటే ఆమెకేంది?’’‘‘ఆమె పేరు పెట్టి అనుకుంట ఆమెకేంది అంటవేమిరా. ఆమెకు కోపం రాదా?’’‘‘నేనామెనెందుకన్నా. మూజలెల్లిని అన్నా’’‘‘అరే! పరేశాను చేస్తందేమిరో, ఇదేదో తిరకాసు ఉన్నట్లుంది’’నాకు ఏదో అనుమానమొచ్చి ‘‘ఏదీ ఏ ముసలెల్లిని అన్నవో చూపిద్దువురా’’ అన్నాను.గబగబా నన్ను బయటికి వేలుపట్టుకొని తీసుకొచ్చి ఇంటిపక్కన ఎల్లవ్వ గోడపైకి చూపిస్తూ...‘‘అగ్గో గా మూజలెల్లి’’అన్నది.అటు చూసిన నాకు, అక్కలకు, అమ్మకు అక్కడ పోగైన మందికి, తిట్టిన ఎల్లవ్వకు నవ్వు ఆగుతలేదు.‘‘ఓసినీ పోరీ! అప్పుడే చూపెడితే అయిపోయేది కదా’’ అంటుంది ఇటుపక్క ఇంటిఅయిలమ్మ.అందరి నవ్వుకు కారణం అక్కడ ఉన్నది....ఊసరవెల్లి! అది జరిగి ఇన్ని సంవత్సరాలయినా ఇప్పటికీ బాగా నవ్వుకుంటాం. – మినుముల భిక్షపతిగౌడ్, సముద్రాల, జనగామ జిల్లా -
కానుక..నాసిరకం
అమలాపురం :‘మేడిపండు చూడ మేలిమై ఉండు.. పొట్టవిప్పి చూడ పురుగులుండు’ అన్న చందంగా ఉన్నాయి చంద్రన్న పండగ కానుకలు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఇస్తున్న పండగ కానుకల్లో నాణ్యత లోపిస్తోంది. క్రిస్మస్, సంక్రాంతి పండగలకు పంపిణీ చేసిన చంద్రన్న కానుకల్లో పప్పులు పుచ్చిపోగా, బెల్లం జావగారి పోతోంది. పండుగ నాడు పిండివంటలు చేసుకోవాలని కానుకను అందుకునేందుకు వెళుతున్న పేదలు సరుకులను చూసి నీరుగారిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీ ఆరంభమైంది. ఇప్పటికే క్రిస్మస్ పండగ నాడు కొంతమందికి వీటిని అందించారు. బియ్యం, పంచదార, కిరోసిన్లతోపాటు కందిపప్పు, శనగపప్పు అరకేజీ చొప్పున, నెయ్యి 100 గ్రాములు, గోధుమ పిండి కేజీ, బెల్లం, పామాయిల్ అరకేజీ చొప్పున పంపిణీ చేస్తున్నారు. పేదల ఇంట పండగ పిండివంటలు చేసేందుకు వీటిని ఉచితంగా అందజేస్తున్నారు. అయితే సరుకుల నాణ్యత అంతంత మాత్రంగానే ఉంది. కందిపప్పు, శనగపప్పు తక్కువ రకంవి ఇస్తున్నారు. వీటిలో పుచ్చులు, నలిగిపోయిన పప్పు బద్దలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక బెల్లం గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జావగారి ముద్దలా ఉంటోంది. కొన్నిచోట్ల బెల్లం పాకంలా మారి ప్యాకెట్ల నుంచి కారిపోవడం చూసి డీలర్లే గగ్గోలు పెడుతున్నారు. కొన్ని దుకాణాలకు నెయ్యి ఇంకా చేరలేదు. సరుకులు చేరకపోవడం వల్ల పంపిణీ ఆలస్యమవుతోందని, ఈ సమయంలో బెల్లం పాకంలా మారిపోవడం తమకు సమస్యగా మారుతోందని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. వీటి పంపిణీ జిల్లాలో గురువారం నుంచి అధికారికంగా ఆరంభించారు. చాలాచోట్ల అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఈ పంపిణీని ప్రారంభించారు. అయితే ఈ-పాస్ సర్వర్ పనిచేయకపోవడంతో సరుకుల పంపిణీ అంతంత మాత్రంగానే సాగింది. సర్వర్‌ను మార్చాలని గతం నుంచీ డిమాండ్ వినిపిస్తున్నా పట్టించుకునేవారు లేకుండా పోయారు. దీనితో పండగ నాటికి అందరికీ కానుకల పంపిణీ జరుగుతుందనే నమ్మకం లేకుండా పోయింది. ఇదీ కానుక సరుకుల స్థితి.. మండపేట నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా సుమారు 20 వేల మంది కార్డుదారులకు చంద్రన్న క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. బెల్లం, శనగలు నాసిరకంగా ఉన్నాయని కార్డుదారులు విమర్శించారు. సంక్రాంతి కానుకలకు సంబంధించి దుకాణాలకు నెయ్యి సరఫరా ఇంకా జరగలేదు. ఇప్పటికే షాపుల్లోకి చేరిన బెల్లం నీరుగారుతోంది. పండుగ సమీపిస్తున్నా సరుకులు ఇంకా పంపిణీ కావడంలేదని కార్డుదారులు విమర్శిస్తున్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో సరుకులు బాగానే ఉన్నా తూకాల్లో తేడాలు ఉన్నట్టు రేషన్‌కార్డుదారులు చెబుతున్నారు. డబ్బాలో ఇస్తున్న తక్కువగా ఉంటోంది. కందిపప్పు నాసిరకంగా ఉంది. బెల్లం కూడా నాణ్యమైనది కాదు.ప్రత్తిపాడు నియోజకవర్గంలో వారం క్రితం చంద్రన్న కానుక సరుకులు రేషన్‌డిపోలకు చేరాయి. చంద్రన్న సంచులు రాకపోవడంతో ఆన్లైన్ సైట్ ఓపెన్ కాలేదు. సరుకులు కూడా పూర్తిస్థాయిలో రాలేదు. ఆలస్యం కావడంతో బెల్లం పాకంగా మారుతోంది. ముమ్మిడివరంలో సరుకులు ఇంకా పంపిణీ కాలేదు. అమలాపురంలో నాసిరకం పప్పు డీలర్లకు చేరింది. మామిడికుదురులో బెల్లం జావగారి పాకంలా మారింది. రాజమండ్రి రూరల్‌లో పలుచోట బెల్లం తూకంలో 25 గ్రా ముల నుంచి 50 గ్రాముల తేడా వస్తోంది. రంపచోడవరం నియోజకవర్గంలో గిరిజనులు సరుకుల కోసం తరలివస్తూ, ఇంకా ఇవ్వడం లేదని తెలిసి నిట్టూర్చి వెనుదిరుగుతున్నారు.