కరీంనగర్‌రూరల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగా ఏటా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తోంది. 2017 నుంచి ఆహార భద్రత కార్డు కలిగి ఉండి, 18 ఏళ్లు దాటిన మహిళలకు అందిస్తున్న చీరలను ఈనెల 4 నుంచి 14వ తేదీ వరకు పంపిణి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఈఏడాది జిల్లావ్యాప్తంగా 3,53,707 చీరలు అవసరం కాగా ఇప్పటివరకు 2.79 లక్షల చీరలు వచ్చాయి. ఇంకా 74,707 చీరలు రావాల్సి ఉన్నాయి. మంగళవారం జిల్లాలోని గోదాముల నుంచి చీరల స్టాక్‌ను పంచాయతీ అధికారులకు అప్పగించారు. బుధవారం నుంచి జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్‌లో చీరలు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, రేషన్‌డీలరు, స్వశక్తి సంఘాల ఆధ్వర్యంలో మహిళలకు పంపిణీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment