Bathukamma festival
-
Singer Mangli: పాట పల్లకీ ఎక్కి
‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అంటూ బతుకమ్మను కీర్తిస్తూ మంగ్లీ పాడారు. ఆ పాటతో ప్రపంచవ్యాప్తంగా ఆమె కీర్తి సాధించారు. బతుకమ్మ సంబరాల్లో ఈ పాట వినిపించకుండా ఉండదు. బతుకమ్మ అంటే ‘తంగేడు’ పువ్వు ప్రత్యేకం. బతుకమ్మ పాటల్లో మంగ్లీ పాడిన పాటలు ప్రత్యేకం. నవరాత్రి సందర్భంగా తాను పాడిన తొలి బతుకమ్మ పాట గురించి, ఇతర విశేషాలను గాయని మంగ్లీ ‘సాక్షి’తో ఈ విధంగా పంచుకున్నారు. ‘‘బతుకమ్మ పండగ అంటే మంగ్లీ పాటలు ఉండాల్సిందే అన్నట్లుగా నన్ను అభిమానిస్తున్నారు. ఇది నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా... ఇలా ప్రపంచంలో ఎక్కడెక్కడ తెలుగువాళ్లు ఉన్నారో అక్కడ బతుకమ్మ పండగ అంటే నా పాట వినపడుతోంది. ‘ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి దూసి తెచ్చి... తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి... పచ్చి తంగెడుతో గుమ్మాడీ పూలు చేర్చి... బంగారు బతుకమ్మను ఇంటిలొ పేర్చి...’ అంటూ నేను పాడిన బతుకమ్మ పాటలో ‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అని కూడా ఉంటుంది. అలా నా ఈ ఫస్ట్ పాట నన్ను శ్రోతలకు ఎంత దగ్గర చేసిందంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఈ పాట పాడమని అడుగుతుంటారు. నా లైఫ్‌లో బతుకమ్మ అంటేనే చాలా ప్రత్యేకం. నా కెరీర్లోనే ప్రాథమిక గీతంగా మారిపోయింది ‘బతుకమ్మ’. విదేశాల్లో బతుకమ్మ ఆడాను నేను విదేశాల్లోని తెలుగువారితో కలిసి బతుకమ్మ పండగ చేసుకున్నాను. బతుకమ్మ ఆడాను... పాడాను... వాళ్లతోనూ ఆడించాను. మంగ్లీ పాట ఎప్పుడు వస్తుందంటూ వాళ్లు ఎదురు చూడటం నాకో మంచి అనుభూతి. నా తెలంగాణ ప్రజలు నన్ను ఎంతో గొప్పగా ఓన్ చేసుకున్నారు. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను.రెండూ ప్రకృతి పండగలే... మేం తీజ్ పండగ చేసుకుంటాం. బతుకమ్మ పండగ కూడా అలానే. తీజ్ పండగకు మేం మొలకలను పూజిస్తాం. బతుకమ్మను పూలతో పూజిస్తాం. మొలకలు, పువ్వులు... రెండూ చెట్ల నుంచే వస్తాయి కాబట్టి రెండూ ప్రకృతి పండగలే. అందుకే బతుకమ్మ పాట పాడే తొలి అవకాశం వచ్చినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ‘తెలంగాణలో పుట్టి... పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..వటే’ అంటూ మిట్టపల్లి సురేందర్ అన్న అద్భుతంగా రాయడం, నేను పాడటం, బొబ్బిలి సురేష్ మ్యూజిక్ చేయడం అన్నీ బాగా కుదిరాయి. పాటలు అందరూ బాగా పాడతారు... బాగా రాస్తారు... బాగా మ్యూజిక్ చేస్తారు. కానీ ఆ పాటను ఎంత బాగా చూపించామన్నది చాలా ముఖ్యం. దామోదర్ రెడ్డి తన డైరెక్షన్‌తో ఈ పాటను బాగా చూపించాడు. అన్నీ బాగా కుదరడంతో ఈ పాట జనాల్లోకి వెళ్లింది.ప్రతి ఇల్లూ ఆమెకు నిలయమే నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను. దేవుడు లేనిదే మనం లేము. ప్రతి ఒక్క దేవుడికి గుడి ఉంటుంది కానీ బతుకమ్మకు మాత్రం గుడి ఉండదు. మిట్టపల్లె సురేందర్ అన్న ‘పచ్చి పాల వెన్నెలా...’ పాటలో ఈ విషయాన్ని ఎంత గొప్పగా వర్ణించాడంటే... ఆ పాటలో ఆమెకి ఉన్నన్ని గుళ్లు ఏ దేవుడికీ ఉండవని రాశాడు. గుడి లేని ఆ దైవానికి ప్రతి ఒక్క ఇల్లూ నిలయమే. ప్రతి ఇంట్లో ఆమెను పూజిస్తారు కదా. ప్రతి ఇంట్లోనూ ఆమెను తయారు చేస్తారు. ఏ దేవతనూ తయారు చేసి పూజ చేయరు. కానీ గౌరమ్మను తయారు చేసి మరీ పూజిస్తారు. అందుకే ప్రతి ఒక్క ఇల్లూ ఆమెకు గుడే.సంబరాలన్నీ జనాలతోనే... నేను బతుకమ్మను తొలిసారి తయారు చేసింది 2013లో. ఒక చానెల్ కోసం చేశాను. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం తయారు చేస్తున్నాను. మా ఇంట్లో బతుకమ్మ పండగను జరుపుకుంటాం. అయితే తొమ్మిది రోజులు అమ్మవారి అలంకారం వంటివి చేసే వీలుండదు. నేనెక్కువగా బయటే జనాలతో పండగ చేసుకుంటా. నా బతుకమ్మ సంబరాలు మొత్తం జనాలతోనో అయిపోతాయి. ఇది కూడా అదృష్టమే.పూలనే దేవుడిలా పూజిస్తాం మనం ప్రతి దేవుణ్ణి పూలతో పూజిస్తాం. కానీ పూలనే దేవుడిలా పూజించి, కొబ్బరికాయ కొట్టి, అగరుబత్తులు వెలిగించడం అనేది బతుకమ్మకే జరుగుతుంది. ఈ పండగలో ఉన్న గొప్పతనం ఏంటంటే మగవాళ్లంతా ముందుండి తమ ఇంటి ఆడవాళ్లను దగ్గరుండి ఆడమని... పాడమని ప్రోత్సహిస్తుంటారు. తెలంగాణలో మహిళల్ని గౌరవించినంతగా ఇంకెక్కడా గౌరవించరు. అమ్మని అయినా బిడ్డల్ని అయినా ఎంతో గౌరవంగా చూస్తారు. ముందుండి నడిపిస్తారు. అంత గొప్ప కల్చర్ తెలంగాణాది. ఉన్నోళ్లు... లేనోళ్లు... మంచి చీరలు కట్టుకుని పండగ చేసుకుంటారు’’ అంటూ మా ఇంట్లో అమ్మకి, ఇంకా అందరికీ కొత్త బట్టలు కొంటాను. ఆనందంగా పండగ జరుపు కుంటాం అన్నారు మంగ్లీ.ఇది సందర్భం కాకపోయినా చెబుతున్నాను... నేను హనుమంతుణ్ణి బాగా పూజిస్తాను. ఆయన గుడి కట్టించాను. నేను కట్టించాలనుకున్నాను.... ఆయన కట్టించుకున్నాడు. గుడి లేకుండా నేను ఆయన్ను చూడలేకపోయాను. నా సంకల్పం నెరవేర్చు తండ్రీ అనుకున్నాను... నెరవేర్చాడు. నేను చేసిన ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చిన డబ్బుతో కట్టించాను. ఆయన ఆజ్ఞ లేనిదే అది జరుగుతుందా? ఇది అద్భుతమైన అవకాశమే కదా. – డి.జి. భవాని -
కరీంనగర్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
దుర్గార్తిశమనీ దశదిశలా దసరా
జగన్మాత అయిన దుర్గాదేవి దుర్గతులను దూరం చేస్తుందని, ఆర్తత్రాణ పరాయణ అని భక్తుల నమ్మకం. ఆర్తితో పూజించే భక్తులకు ఆపదలు రాకుండా చూసుకుంటుందని, ఐహిక ఆముష్మిక సుఖశాంతులను ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం. అందుకే ద్వాత్రింశన్నామ స్తోత్రం దుర్గాదేవిని దుర్గార్తిశమనీ అని స్తుతిస్తోంది.ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్ష పాడ్యమి నుంచి దశమి వరకు దేవీ నవరాత్రులు జరుగుతాయి. శరదృతువులో వచ్చే నవరాత్రులు గనుక వీటిని శరన్నవరాత్రులు అని, చివరి రోజైన దశమి రోజును విజయ దశమిగా, దసరా పండుగగా జరుపుకుంటారు గనుక వీటిని దసరా నవరాత్రులని కూడా అంటారు. ఈ నవరాత్రి వేడుకల్లో దుర్గాదేవిని వివిధ రూపాలలో ఆరాధిస్తారు.‘భూతాని దుర్గా! భువనాని దుర్గా! స్త్రీయో నరాశ్చపి పశుశ్చ దుర్గా!యద్యద్ధి దృశ్యం ఖలు నైవ దుర్గా! దుర్గా స్వరూపాదపరం న కించిత్.’పై శ్లోకానికి తాత్పర్యం ఏమిటంటే, సమస్త ప్రాణికోటి దుర్గా స్వరూపమే! సమస్త లోకాలూ దుర్గా స్వరూపమే! స్త్రీలు పురుషులు పశువులు అన్నీ దుర్గా స్వరూపమే! లోకంలో కంటికి కనిపించేవన్నీ దుర్గా స్వరూపమే! దుర్గా స్వరూపం కానిదంటూ ఏదీ లేదు. దుర్గాదేవిని నమ్ముకున్న భక్తుల భావన ఇది.దేవీ నవరాత్రులను అష్టాదశ శక్తిపీఠాలు సహా అమ్మవారి ఆలయాలన్నింటిలోనూ అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ ఆలయంలో విశేషంగా జరుపుకొంటారు. నవరాత్రులలో కనకదుర్గ అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి, రోజుకో నైవేద్యాన్ని నివేదిస్తారు.నవరాత్రులలో కనకదుర్గాదేవి అలంకారాలు1 మొదటిరోజున శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా బంగారురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా తీపి బూందీ, సుండలు సమర్పిస్తారు.2 రెండో రోజున శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా గులాబిరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పెసరపప్పు పాయసాన్ని సమర్పిస్తారు.3 మూడో రోజున శ్రీ గాయత్రీదేవిగా కనకాంబరంరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. అల్లం గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు.4 నాలుగో రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా గంధంరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. దద్ధ్యోదనం, కట్టెపొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు.5 ఐదో రోజున శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా బంగారు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పులిహోర, పెసర బూరెలను సమర్పిస్తారు.6 ఆరో రోజున శ్రీ మహాలక్ష్మీదేవిగా గులాబిరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పూర్ణాలు, క్షీరాన్నం సమర్పిస్తారు.7 ఏడో రోజున శ్రీ సరస్వతీదేవిగా తెలుపురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పరమాన్నం, దధ్యోదనం, అటుకులు, బెల్లం, శనగ పప్పు సమర్పిస్తారు.8 ఎనిమిదో రోజున శ్రీ దుర్గాదేవిగా ఎరుపురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. పులగం, పులిహోరలను నైవేద్యంగా సమర్పిస్తారు.9 తొమ్మిదో రోజున శ్రీ మహిషాసురమర్దనిగా ముదురు గోధుమరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పులగం, పులిహోర, గారెలు, నిమ్మరసం, వడపప్పు, పానకం సమర్పిస్తారు.10 పదో రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవిగా ఆకుపచ్చరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా లడ్డూలను సమర్పిస్తారు.నవదుర్గల ఆరాధనదసరా నవరాత్రులలో అమ్మవారిని నవదుర్గల రూపాలలో కూడా పూజిస్తారు. శ్రీచక్రంలోని నవచక్రాలలో కొలువుండే దుర్గాదేవి నవరూపాల గురించి బ్రహ్మదేవుడు మార్కండేయునికి చెప్పినట్లుగా వరాహ పురాణం చెబుతోంది. వరాహ పురాణం చెప్పిన ప్రకారం–ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీతృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చసప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టకమ్నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాఃఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనాఈ నవరాత్రులలో దుర్గాదేవి భక్తులు అమ్మవారిని శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అనే నవదుర్గా రూపాలలో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.దుర్గా సప్తశతిలో అమ్మవారి తొమ్మిదిరూపాల ప్రస్తావన మరోవిధంగా ఉన్నా, వాటిని నవదుర్గలుగా పేర్కొనలేదు. దుర్గా సప్తశతిలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, నంద, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రామరీ అనే రూపాల ప్రస్తావన ఉంది. కొన్నిచోట్ల నవరాత్రులలో అమ్మవారిని ఈ రూపాలలో కూడా ప్రత్యేక అలంకరణలు, నైవేద్యాలతో ఆరాధించే సంప్రదాయం ఉంది. శమీపూజనవరాత్రుల చివరి రోజైన విజయ దశమినాడు శమీపూజ చేయడం ఆనవాయితీ. పాండవులు అరణ్యవాసం ముగించుకుని, అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను, వస్త్రాలను ఎవరికీ కనిపించకుండా శమీవృక్షం– అంటే జమ్మిచెట్టు మీద దాచారు. అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత వారు శమీవృక్షానికి పూజించి, దానిపై తాము దాచుకున్న ఆయుధాలను వస్త్రాలను తిరిగి తీసుకున్నారు. శమీవృక్షంలో అపరాజితా దేవి కొలువై ఉంటుందని నమ్మకం. అపరాజితా దేవి ఆశీస్సులతోనే పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై విజయం సాధించినట్లు మహాభారతం చెబుతోంది. శ్రీరాముడు కూడా విజయదశమి రోజున అపరాజితా దేవిని పూజించి, రావణునిపై విజయం సాధించినట్లు రామాయణం చెబుతోంది. ఈ సందర్భంగా చాలాచోట్ల ఆయుధపూజలు కూడా జరుపుతారు. తెలంగాణలో శమీపూజ తర్వాత పాలపిట్ట దర్శనం చేసుకునే ఆచారం కూడా ఉంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనమైన తర్వాత శమీవృక్షం వద్దకు చేరుకుని, అపరాజితా దేవిని పూజించిన తర్వాత– ‘శమీ శమయుతే పాపం శమీ శత్రు వినాశినీఅర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ’ అనే శ్లోకాన్ని పఠిస్తూ, శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కొందరు శమీ అష్టోత్తరాన్ని కూడా పఠించి, పూజ జరుపుతారు. శమీపూజ చేయడం వల్ల అపరాజితా దేవి ఆశీస్సులు లభించడమే కాకుండా, శనిదోష నివారణ జరుగుతుందని ప్రతీతి.దసరా నవరాత్రుల సమయంలో తెలంగాణలో బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరుపుకొంటారు. రకరకాల రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి, మహిళలు బతుకమ్మ చుట్టూ వలయాకారంలో తిరుగుతూ, పాటలు పాడుతూ సందడి చేస్తారు. ఈ నవరాత్రుల రోజులలో కొన్ని ప్రాంతాల్లోని మహిళలు ‘గ్రామ కుంకుమ నోము’, ‘కైలాసగౌరీ నోము’ వంటి నోములను నోచుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపండుగగా నిర్వహిస్తోంది. బతుకమ్మ పండుగలోనూ రోజుకో తీరులో నైవేద్యాలను సమర్పిస్తారు.పూల వేడుక బతుకమ్మ పండుగఎంగిలిపూల బతుకమ్మ: మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. మహాలయ అమావాస్య రోజున ఈ పండుగ మొదలవుతుంది. ఈ రోజున బియ్యప్పిండి, నూకలు, నువ్వులు కలిపి నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు చేస్తారు. రెండో రోజు జరిగే ఈ వేడుకను అటుకుల బతుకమ్మ అంటారు. ఈ రోజున సప్పిడి పప్పు, అటుకులు, బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు.ముద్దపప్పు బతుకమ్మ: మూడో రోజు వేడుకను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈ రోజున పాలు, బెల్లం, ముద్దపప్పుతో తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు.నానేబియ్యం బతుకమ్మ: నాలుగో రోజు వేడుకను నానేబియ్యం బతుకమ్మ అంటారు.ఈ రోజున నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు.అట్ల బతుకమ్మ: ఐదో రోజు వేడుకను అట్ల బతుకమ్మ అంటారు. ఈ రోజున అమ్మవారికి అట్లు లేదా దోశలను నైవేద్యంగా సమర్పిస్తారు.అలిగిన బతుకమ్మ: ఆరో రోజు వేడుకను అలిగిన బతుకమ్మ అంటారు. ఈ రోజున నైవేద్యమేమీ సమర్పించరు.వేపపండ్ల బతుకమ్మ: ఏడో రోజు వేడుకను వేపపండ్ల బతుకమ్మ అంటారు. ఈ రోజున బాగా వేపిన బియ్యప్పిండితో వేపపండ్లలా వంటకాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.వెన్నముద్దల బతుకమ్మ: ఎనిమిదో రోజు వేడుకను వెన్నముద్దల బతుకమ్మ అంటారు. ఈ రోజున నువ్వులు, బెల్లం వెన్నముద్ద లేదా నెయ్యిలో కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.సద్దుల బతుకమ్మ: తొమ్మిదో రోజు వేడుకను సద్దుల బతుకమ్మ అంటారు. ఇదే రోజున దుర్గాష్టమి జరుపుకొంటారు. ఈ రోజున బతుకమ్మకు పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం– ఐదు రకాల నైవేద్యాలను సమర్పిస్తారు.ఆడపడుచులందరూ అత్తవారింటి నుంచి వచ్చి పుట్టింట్లో ఈ తొమ్మిదిరోజుల పూల పండుగను జరుపుకొంటారు. పండుగ ముగిసిన తర్వాత బతుకమ్మను దగ్గర్లో ఉన్న జలాల్లో నిమజ్జనం చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలనాడు ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల బతుకమ్మ పండుగను జరుపుకొంటారు. పన్యాల జగన్నాథదాసు -
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బతుకమ్మ సంబురాలు (ఫొటోలు)
-
హైదరాబాద్ : రవీంద్రభారతిలో అటుకుల బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
‘తెలంగాణ’ జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
తెలంగాణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
పూల పండుగ వచ్చేసింది.. నేటి నుంచి బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
కూకట్‌పల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం (ఫొటోలు)
-
Bathukamma 2024: పూల పండుగ బతుకమ్మ..సంబురాలు లోడింగ్
తెలంగాణా ఆడబిడ్డలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసే వేడుక బతుకమ్మ. ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీక బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటుభక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. రంగుల రంగుల పూలతో తెలంగాణా పల్లెలు కళ కళలాడుతాయి. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ లాంటి ఆటపాటలతో సందడి నెలకొంటుంది. దీంతో ఇప్పటికే తెలంగాణా ఆడబిడ్డలు సంబరాలకు రెడీ అయిపోతున్నారు.పండుగ సంబురాలు ఎపుడు మొదలు2024లో భాద్రపద అమావాస్య అక్టోబరు 2 బుధవారం రోజు వచ్చింది. ఇలా ప్రారంభమయ్యే వేడుకలు తొమ్మిది రోజుల పాటు అత్యంగా ఉత్సాహంగా సాగుతాయి అక్టోబరు 10న సద్దుల బతుకమ్మ వేడుకతో ఈ బతుకమ్మ సంబరాలు ఘనంగా ముగుస్తాయి.దసరా నవరాత్రుల సమయంలో తెలంగాణ ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ బతుకమ్మ, గునుగు పూలు, బంతి, చేమంతి, తంగేడు, కట్ల, సీతమ్మవారి జడ, గుమ్మడి పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ తొమ్మిది రోజులు పాటు, పలు నైవేద్యాలతో కులం, మతం, చిన్నా పెద్ద, ప్రాంతం అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే అద్భుతమైన పండుగ. తొమ్మిది రోజులు, తొమ్మిది రకాల బతుకమ్మలుఅక్టోబరు 2 తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మనాలుగో రోజు నానేబియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మఆరో రోజు అలిగిన బతుకమ్మ ఏడో రోజు వేపకాయల బతుకమ్మఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మతొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఆఖరి రోజైన తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మను పూజించి, అందంగా ముస్తామైన ఆడబిడ్డలు అత్యంత ఉత్సాహంగా బతుకమ్మలను మధ్యలో పెట్టి ఆడి పాడితారు. గౌరమ్మకు నైవేద్యాలు సమర్పిస్తారు. బతుకమ్మను చివరకు గంగమ్మ చెంతకు చేరుస్తారు.దీంతో బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి. -
పోర్ట్ ల్యాండ్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
-
చికాగోలో బతుకమ్మ, దసరా సంబరాలు
-
న్యూజెర్సీలో బతుకమ్మ, దసరా సంబరాలు
-
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ టిప్యాడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
-
బతుకమ్మ ఊరేగింపులో రెచ్చిపోయిన టీడీపీ రౌడీలు
-
సింగపూర్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరం!
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో అంబరాన్ని అంటిన బతుకమ్మ సంబరం. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఇక్కడి సంబవాంగ్ పార్క్‌లో అక్టోబర్ 21 న ఎంతో కన్నుల పండుగ గా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్న పెద్ద తేడా అనే లేకుండా అందరు సాంప్రదాయ పాటలు ఆటలతో ఎంతో హుషారుగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో పాటలతో ఈ వేడుకలు మిన్నంటాయి. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎంతో మంది ఎన్నారైలు సుమారు 3 వేల నుంచి 4 వేల వరకు పాల్గొని బతుకమ్మ ఆడారు. సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగు వారందరు స్థానికులకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేసేలా విశేష ఆదరణ కలుగజేసినందుకు టీసీఎస్ఎస్ చరిత్రలో నిలిచిపోయిందని సొసైటీ సభ్యులు అన్నారు. ఈ సంబురాల్లో అందంగా ముస్తాబైన బతుకమ్మలకు సౌజన్య డేకోర్ వారు బహుమతులు అందజేశారు. వీరితో పాటు సింగా దాండియా వారు లక్కీ డ్రాలో 10 మంది అదృష్ట విజేతలకు చీరలు అందజేయడం జరిగింది. ఇరు తెలుగు రాష్ట్రాల తెలుగు వారు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ వైభవాన్ని చాటి చెప్పడం ఎంతో సంతోషకరం అని సంబరాలు విజయవంతంగా జరుగుటకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు టీసీఎస్ఎస్ సభ్యులు. టీసీఎస్ఎస్ ప్రేరణతో ఇతర సంస్థలు కూడా బతుకమ్మ నిర్వహించుకోవడం అభినందినీయం అని అన్నారు. ఈ ఏడు బతుకమ్మ సంబురాలకు టీసీఎస్ఎస్ ప్రత్యేకంగా తయారు చేయించిన బతుకమ్మ ప్రధాన ఆకర్షణ గ నిలిచింది. ఈ సారి యూట్యూబ్‌లో విడుదల చేసిన సింగపూర్ బతుకమ్మ ప్రోమో పాట వేల వీక్షణాలతో దూసుకుపోయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి మొదలగు వారు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు సొసైటీ మహిళా విభాగ సభ్యులు రోజా రమణి, గడప స్వాతి, బసిక అనిత రెడ్డి, జూలూరు పద్మజ, సునీత రెడ్డి, హేమ లత, దీప నల్ల, గోనె రజిత, కాసర్ల వందన, రాధికా రెడ్డి నల్ల, బొందుగుల ఉమా రాణి, నంగునూరు సౌజన్య, నడికట్ల కళ్యాణి, హరిత విజాపుర్, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సౌజన్యమాదారపు, ఎర్రమ రెడ్డి దీప్తి, సృజన వెంగళ, హర్షిణి మామిడాల, సుధా రాణి పెసరు మొదలగు వారు ఈ బతుకమ్మ పండుగ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ సారి వేడుకలను సొసైటీ ఫేస్ బుక్ యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది. (చదవండి: సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు) -
కేసీఆర్ పాలనలో రాష్ట్రం పురోగతి
ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుకు సాగుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రి హరీశ్‌రావు దంపతులు సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కోమటి చెరువువద్ద మంత్రితో మహిళలు, యువతులు సెల్పిలు, ఫొటోలు దిగడానికి పోటీపడ్డారు. మహిళలు తీసుకువచ్చిన ఫలహారాలు తింటూ మంత్రి వారితో ముచ్చటించారు. అనంతరం మాట్లాడుతూ ఎండాకాలాన్ని వానా కాలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలు కాళేశ్వరం జలాలతో నిండు కుండల్లా మారాయన్నారు. సమైక్య రాష్ట్రంలో కరెంటు లేక ఇబ్బందులు పడ్డామని, నేడు నీరు, విద్యుత్ సరఫరా నిరంతరం జరుగుతోందని అన్నారు. మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ప్రజలందరూ బతుకమ్మ పండుగ చేసుకున్న విధంగానే దసరాను కూడా వైభవంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు బీఆర్ఎస్ యువజన నాయకుడు జువ్వన కనకరాజు ఆధ్వర్యంలో తయారు చేసిన భారీ బతుకమ్మను మంత్రి హరీశ్‌రావు తిలకించారు. -
బతుకమ్మ మీరే చేస్తారా..!? మాకు మనసుంది.. పండుగ మేము చేస్తామంటూ..
సాక్షి, కరీంనగర్: తీరొక్క పూలతో బతుకమ్మను తయారు చేసి వేడుకల్లో పాల్గొన్న ముస్లిం యువతి సుల్తానా బేగం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. మండలంలోని బూర్గుపల్లికి చెందిన సుల్తానాబేగం ఆదివారం బతుకమ్మను పేర్చి గ్రామస్తులతో కలిసి సంబురంగా వేడుకల్లో పాల్గొంది. సుల్తానా బేగంను ఎమ్మెల్యే రవిశంకర్, సర్పంచ్ రమ్య, ఎంపీటీసీ లక్ష్మి అభినందించారు. -
ఘనంగా బతుకమ్మ వేడుకలు!
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ రోజున 'గౌరమ్మను' పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పండుగను అంగరంగా వైభవంగా జరుపుతారు. ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. పార్వతి గురించి పాటలాగా పాడుతూ.. ఆనందంతో బతుకమ్మను జరుపుకుంటారు. ఆడపడచులు, యువకులు, పిల్లలు, పెద్దలు తమ ఆనందాన్ని చూపే కన్నుల పండుగగా.. తెలంగాణ ప్రజలకు ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ ఈ బతుకమ్మ. ఈ సందర్భంగా పల్లెలు, పట్టణాల్లో ఆలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో పల్లెలు, పట్టణాలు తీరొక్క పూల శోభ సంతరించుకోనుంది. ఈ క్రమంలో చెరువుల వద్ద నిమజ్జన ప్రదేశాల్లో రంగుల ఆహ్లాదం ఎంతో చూడముచ్చట. పౌష్టికాహారం, చిరుధాన్యాలు, కూరగాయలు, గాజులు, చేతివృత్తులతో తయారు చేసిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణీయం. బతుకమ్మ పండుగ కేవలం కటుంబాలకు, ఇంటికే పరిమితం కాదు, తెలంగాణలోని అన్నీ రంగాలవారిగా.. విద్యా, వైద్యా, సాంకేతిక, వివిధ పరిశ్రమల్లో బతుకమ్మ వేడుకల నిర్వహణ ఎంతో కన్నుల పండుగగా చెప్పవచ్చు అనడానికి నిదర్శనంగా.. 'డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ కార్యాలయంలో' శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. 'డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగం' డైరెక్టర్ వి ఫణిభూషణ్‌శర్మ ఈ వేడుకలకు హాజరయ్యారు. 'జాయింట్ డైరెక్టర్లు' హెచ్ శైలజారాణి, పి రజిని, తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. రంగారెడ్డి హైదరాబాద్ 'పే అండ్ అకౌంట్ ఆఫిసర్స్' మహ్మద్ ఆరిఫ్, ఆర్ వి రామగోపాల్ అండ్ స్టాఫ్, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగ సిబ్బంది, తదితరులు బతుకమ్మ వేడుకల సందర్భంగా హాజరయ్యారు. బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళల్ని మరింత ప్రోత్సహించే దిశలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఇలాంటి మరెన్నో పండుగలు జరుపుకోవాలని డైరెక్టర్ కోరుతూ.. అందుకు అందరి ప్రోత్సాహం ఎంతో అవసరమని తెలిపారు. -
ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ
-
సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్ బతుకమ్మ2023 పండగను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంబవాంగ్ పార్క్‌లో ఈ బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. ప్రతీ ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా సింగపూర్‌లో తెలుగు వాళ్లలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సింగపూర్‌లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వారు కూడా బతుకమ్మ, బోనాలు జరుపుకోవడం ఎంతో అభినందనీయని సింగపూర్ కల్చరల్ సొసైటీ సభ్యులు అన్నారు. తెలంగాణ సాంప్రదాయ పండగలను అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అందంగా బతుకమ్మ పేర్చిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తామని తెలిపారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌గా ఉన్న వాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
Bathukamma Celebrations: డీజీపీ కార్యాలయం లో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)
-
డల్లాస్ లో ఘనంగా చిన్న బతుకమ్మ
-
హైదరాబాద్‌లో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)
-
సింగపూర్ లో బతుకమ్మ సంబరాలు షురూ
-
Bathukamma Celebrations Photos: కూకట్‌పల్లిలో బతుకమ్మ సందడి (ఫోటోలు)
-
కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
బతుకమ్మ చీరలు రెడీ.. నేటి నుంచి గ్రామాల్లో పంపిణీ
కరీంనగర్‌రూరల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగా ఏటా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తోంది. 2017 నుంచి ఆహార భద్రత కార్డు కలిగి ఉండి, 18 ఏళ్లు దాటిన మహిళలకు అందిస్తున్న చీరలను ఈనెల 4 నుంచి 14వ తేదీ వరకు పంపిణి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈఏడాది జిల్లావ్యాప్తంగా 3,53,707 చీరలు అవసరం కాగా ఇప్పటివరకు 2.79 లక్షల చీరలు వచ్చాయి. ఇంకా 74,707 చీరలు రావాల్సి ఉన్నాయి. మంగళవారం జిల్లాలోని గోదాముల నుంచి చీరల స్టాక్‌ను పంచాయతీ అధికారులకు అప్పగించారు. బుధవారం నుంచి జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్లో చీరలు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, రేషన్‌డీలరు, స్వశక్తి సంఘాల ఆధ్వర్యంలో మహిళలకు పంపిణీ చేయనున్నారు. -
పది రోజుల పాటు పది అవతారాల్లో దుర్గాదేవి
-
ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు
-
హైదరాబాద్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
Photo Feature: బతుకమ్మ చీరలను మూటలు కట్టేందుకు వాడుతున్న మహిళలు
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను లబ్ధిదారులు వివిధ పనుల కోసం వినియోగిస్తున్నారు. కొంతమంది పంట పొలాల్లోకి అడవి పందులు రాకుండా చేల చుట్టూ కడుతుండగా.. మరికొందరు మూటలు కట్టేందుకు వాడుతున్నారు. శనివారం ధారూరు సంతకు వచ్చిన ఓ మహిళా రైతు బతుకమ్మ చీరల్లో ఆకు కూరలు మూట కట్టి తీసుకువచ్చింది. ఇదేమని ప్రశ్నించగా.. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పాలిస్టర్ చీరలు కట్టుకునేలా లేవని, మూడేళ్లుగా వీటిని పొలం వద్ద బెదుర్లు పెట్టేందుకే వినియోగిస్తున్నామని తెలిపారు. – ధారూరు (వికారాబాద్) -
బహుజన బతుకమ్మ ఆడదాం
మన సమాజపు ఆవరణలోని పునాది ఉపరితలాల్లో పరివ్యాప్తి చెంది, సమాజపు లోతుల్లోకి పాతుకుపోయిన కులవివక్ష, లింగ వివక్ష గురించి మాట్లాడుకోవడానికి మున్నూట ఆరవై ఐదు రోజులు సరిపోవు. అలాంటి వివక్షకు గురవుతున్న బహుజన సమాజపు స్త్రీలు అచ్చంగా ఆడి పాడేదే బతుకమ్మ పండుగ. చారిత్రక తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనూ, తదనంతర విప్లవోద్యమంలోనూ, అలాగే స్వరాష్ట్ర సాధన పోరాటంలోనూ బతుకమ్మ ఒక ఉద్యమ పతాకగా మన చేతికందింది. నిషేధాలకు గురై కూడా కొనసాగుతున్న అంటరానితనం, అన్ని రంగాల్లో ప్రబలిన కులవివక్ష, పితృస్వామ్యం, బతుకమ్మ పండుగల్లోనూ వ్యక్తమవుతుంది. ప్రజలంతా జరుపుకునే పండుగల్లోనూ ఊరూ–వాడల్ని విభజించే కుల వివక్షకు వ్యతిరేకంగా ‘కల్సి ఆడుదాం– కల్సి పాడుదాం–కల్సి పోరాడుదాం’ అంటూ తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బహుజన బతుకమ్మ ద్వారా పండుగల్లోని అసమానతలను, వివక్షను సరిచేస్తూ దీన్నొక పంటల పండుగగా జరుపుతున్నాం. అందుకే ‘బహుజన బతుకమ్మ కేవలం ఉత్సవం మాత్రమే కాదు ఉద్యమం’ అంటూ చాటుతున్నాం. బతుకమ్మ బహుజన సాంప్రదాయం. పురాణ ఇతి హాసాల్లో బతుకమ్మ గురించి ఏమి చెప్పినా బతుకమ్మ మాత్రం తెలంగాణ పంటల పండుగ. మత కోణం నుండి దీనిని బ్రాహ్మణీకరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు దూరంగా నిశ్చేష్ఠులై ఉండలేము కదా! తెలంగాణ ఉత్పత్తి విధానంలోని నవధాన్యాల సంస్కృతిని ఎత్తిపడ్తూ దానితో ముడిపడ్డ పంటలనూ, ఆ పంటలకు నీరిచ్చే చెరువులూ, కుంటలనూ; వాటికి ఆదరువైన గుట్టలూ, కొండలనూ కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. అలా ప్రతి ఏటా వర్తమాన సమస్యలతో జోడించి బహుజన బతుకమ్మను కొనసాగిస్తున్నాం. నా అనుభవంలో ఏ కులానికి ఆ కులం కలిసి ఆడు కోవడం, బతుకమ్మను నీళ్లల్లో వేసి సాగనంపి మాలో మేమే సద్దులు ఇచ్చిపుచ్చుకునే వాళ్ళం. నా చిన్నతనంలో కుల వాడలు, వెలివాడలు స్పష్టంగా ఉన్న కాలంలో కుర్మోళ్ల బతుకమ్మ, రెడ్డోళ్ల బతుకమ్మ అంటూ పోటీపడేవాళ్ళం. నిన్న మొన్నటిదాకా కూడా దళితుల బతుకమ్మ ఊర్లోళ్ళ బతుకమ్మతో కలిపి ఆడుకోవడం అనేది లేకుండా పోయిన విషయం మన గమనంలో ఉంది. గడిచిన 12 ఏళ్ల అనుభవంలో దళితుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింప చేస్తూ ఊరుతోపాటు ఆడి పాడి వారితో కలిసి ఒకే చెరువులో నిమజ్జనం చేయడమే ఒక విప్లవాత్మక చర్యగా ప్రజలు భావించారు. ఇక గర్భగుడిలోకి దళితుల ప్రవేశం గురించి పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుందేమో! ఇంకా కొన్ని గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతి అమలు జరుగుతోంది. ఇప్పటికీ భూమిలేని దళితులు కోకొల్లలు. వారికి కనీస భూమి ఇవ్వాలి. వారు ఊరుతో కలిసి ఆడుకొని, సహపంక్తి భోజనాలు చేసుకుని ఆత్మ గౌరవంగా పండుగ చేసుకునేలా ప్రజలు ఐక్యతను చాటాలి. - విమలక్క ప్రజా గాయని -
బతుకమ్మ-దసరా పండగకి ఊరెళ్లిపోతా మామ...బస్టాండ్ లు,రైల్వేస్టేషన్లు కిటకిట (ఫొటోలు)
-
కేజిన్నర వెండి, బంగారంతో కూకట్‌పల్లిలో బతుకమ్మ.. వైరల్ ఫొటో
సాక్షి, హైదరాబాద్: బంతి, చామంతి పువ్వుల్లో బతుకమ్మ పసిడి కాంతులీనడం తెలిసిందే. కానీ.. బంగారంతోనే బతుకమ్మను తయారు చేశారు కూకట్‌పల్లికి చెందిన నాయినేని శ్రీవైష్ణవి, శ్రీనైన. శుక్రవారం ఆటకోసం బంగారు బతుకమ్మను అందంగా ముస్తాబు చేసి తీసుకురావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బతుకమ్మ పండుగ సందర్భంగా వారి తాత సీహెచ్.జనార్దన్‌రావు ఆ అరుదైన బతుకమ్మను కానుకగా ఇచ్చినట్లు వారు తెలిపారు. సుమారు కేజీన్నర వెండికి బంగారాన్ని జోడించి పూల ఆకృతిలో బతుకమ్మను తయారు చేయించినట్లు వెల్లడించారు. బంగారంతో తయారు చేసిన మొట్టమొదటి బతుకమ్మ కావడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. చదవండి: దేవీ శరన్నవరాత్రులు: అమ్మవారికి రూ.5,55,55,555తో అలంకారం -
కామారెడ్డిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
-
మ్యూనిచ్ నగరంలో కన్నుల పండువగా బతుకమ్మ సంబురాలు
మునిచ్ నగరంలో తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బతుకమ్మ కన్నుల పండుగల జరిగింది. ఈ వేడుకల్లో 200లకు పైగా ఎన్నారై మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ ఆటపాటలతో ఆ ప్రాంత పరిసరాలు మార్మోగాయి. ఆడపడుచులు రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది ఉయ్యాల పాటలు పాడారు. ఈ కార్యక్రమ నిర్వాహకుడ ఆనంద్ మాట్లాడుతూ.. తెలంగాణలో జరుపుకున్న విధంగానే జర్మనీలోను బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో స్థిరపడిన తెలంగాణ, తెలుగు వాసులు కూడా బతుకమ్మ సంబురాలను ఘనంగ నిర్వహించుకోవాలన్నారు. మునిచ్ నగరంలో జరిగిన బతుకమ్మ సంబురాలు జర్మనీ లోని ఇతర నగరాలకు కూడా స్ఫూర్తినిచ్చాయి. అనంతరం నిర్వాహకులు అరవింద్, నరేష్, శ్రీనివాస్, వికాస్ ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. -
బతుకమ్మ, జానపద సాంగ్స్‌తో ఉర్రూతలూగిస్తున్న సింగర్స్
సాక్షి, కరీంనగర్: బతుకమ్మ తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే పండుగ. ఇందులో ప్రధానంగా పువ్వులను పూజిస్తారు. ఆడబిడ్డలు అందంగా బతుకమ్మలు పేర్చి, ఒక్కచోట ఆడిపాడతారు. బతుకమ్మ అంటే అందరికీ గుర్తొచ్చేవి బతుకులోంచి పుట్టిన బతుకమ్మ పాటలు. పండుగ సమయంలో 9 రోజులు ఈ పాటలతో వీధులన్నీ మార్మోగుతుంటాయి. కాలానికనుగుణంగా తెలంగాణలో సంప్రదాయ బతుకమ్మ పాటలు సరికొత్త సొబగులు అద్దుకొని, సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. వీటికి ఎంతోమంది గాయనీగాయకులు కొత్త రెక్కలు తొడిగారు. తమ ప్రతిభతో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నారు. కరీంనగర్లో బతుకమ్మ మ్యూజిక్ చానల్ ద్వారా గేయ రచయిత పొద్దుపొడుపు శంకర్ ‘పూతాపూలన్ని పూచే లేత కొమ్మలు అక్కాసెల్లేలు తల్లిగారిల్లు’ అంటూ కొత్త పాటను విడుదల చేశారు. ఉయ్యాలో రామ ఉయ్యాలో అంటూ కరీంనగర్‌కు చెందిన అమూల్య కోటి కొత్త పాటను యూట్యూబ్‌లో సోమవారం విడుదల చేయగా ఇప్పటివరకు వేలాది మంది వీక్షించారు. తమ పాటలతో ప్రజాదరణ పొందుతున్న ఇలాంటి పలువురు గాయకులపై ప్రత్యేక కథనం. చిన్నీ మా బతుకమ్మ : తేలు విజయ కరీంనగర్‌కు చెందిన దంపతులు తేలు వెంకటరాజం–నర్సమ్మ దంపతులకు 1980లో జూన్ 21న తేలు విజయ జన్మించింది. చిన్ననాటి నుంచే తన కుటుంబసభ్యులు పాడే జానపదాలు వింటూ పెరిగింది. 1998లో ‘తండాకు వోతాండు గుడుంబా తాగుతాండు..’ అంటూ పాడి, తొలి పాటతోనే గుర్తింపు తెచ్చుకుంది. 2007లో ‘బతుకమ్మ’ సినిమాలో ‘ఊరికి ఉత్తరానా వలలో..’ అనే పాట పాడింది. 2015లో ‘చిన్నీ మా బతుకమ్మ’ పాటకు 8 లక్షల వ్యూస్ వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ ఉద్యమ గాయనిగా’ అవార్డు అందుకుంది. ఈ ఏడాది పువ్వుల బతుకమ్మతోపాటు మరో 6 బతుకమ్మ పాటలు పాడింది. బతుకమ్మా.. బతుకమ్మా : చిలివేరు శ్రీకాంత్ కరీంనగర్‌లోని సాయినగర్ చెందిన చిలివేరు పోచమ్మ–విజయ్ దంపతులకు శ్రీకాంత్ 1985 నవంబర్ 24న జన్మించారు. నాన్న స్వయంగా భజనలు, కీర్తనలు, అక్క భక్తి పాటలు పాటడంతో వాటిపై ఇతనికి మక్కువ ఏర్పడింది. ఇంటర్మీడియట్ నుంచే ప్రముఖ టెలివిజన్ షోలో గాయకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడు. పాడుతా తీయగా, వన్స్‌మోర్ ప్లీజ్, స్టార్ అంత్యాక్షరీ షోలో పాల్గొని, పేరు తెచ్చుకున్నాడు. గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యంపై పాటలు రాసి, పాడాడు. బతుకమ్మా.. బతుకమ్మా.. మా తల్లీ బతుకమ్మ పాటను శ్రీకాంత్ స్టూడియో యూట్యూబ్ చానల్ ద్వారా గత సోమవారం సాయంత్రం విడుదల చేయగా 19 గంటల్లో 4,500 వ్యూస్ వచ్చాయి. ఓ నిర్మలా.. : వొల్లాల వాణి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్‌నగర్‌కు చెందిన వొల్లాల వాణి 2016లో పాడిన ఘల్లు ఘల్లునా.. ఓ నిర్మలా అనే బతుకమ్మ పాటతో గుర్తింపు పొందింది. దీనికి ఇప్పటివరకు 72 లక్షల వ్యూస్ వచ్చాయి. ఏటా బతుకమ్మ పండుగకు ఏ గ్రామంలో చూసినా ఇదే పాట మారుమోగుతోంది. ఆస్ట్రేలియా, దుబాయ్, ఖతర్ దేశాల్లో జరిగిన వేడుకల్లో తన పాటలతో హోరెత్తించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జిల్లా ఉత్తమ గాయనిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకుంది. ఈ నెల 24న విడుదలైన కోడి కూత వెట్టగానే రాంభజన అనే పాటకు 2 లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. నల్లమద్ది చెట్టు కింద.. : సుంకోజు నాగలక్ష్మి సుంకోజు నాగలక్ష్మిది రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని బందనకల్. బతుకుదెరువు కోసం సిరిసిల్లకు వచ్చిన ఈమె కుటుంబం తంగళ్లపల్లి మండల కేంద్రంలో స్థిరపడింది. చిన్నతనం నుంచే నాగలక్ష్మికి పాటలన్నా, పాడటం అన్నా ఇష్టం. అర్కమిత్ర ఫౌండేషన్ నిర్వహించిన పోటీల్లో గెల్చుకున్న బహుమతి ఆమెకు స్ఫూర్తినిచ్చింది. బొజ్జ రేవతి దగ్గర కర్నాటక సంగీతాన్ని సాధన చేసి, తన పాటకు శాస్త్రీయతను జోడించింది. మొదటి రెండేళ్లలోనే సుమారు 80 జానపద గీతాలను ఆలపించింది. నల్లమద్ది చెట్టు కింద అనే పాటతో పేరు తెచ్చుకుంది. యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ 30 మిలియన్లకు పైగా వ్యూయర్షిప్ సంపాదించింది. ఇటీవల బతుకమ్మ కోసం ఆలపించిన పాటలూ జనాదరణ పొందాయి. ఏమే పిల్లా అన్నప్పుడల్లా.. : శిరీష రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డినగర్‌కు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు అశోక్ కూతురు శిరీష. పాటల ప్రయాణంలో దూసుకుపోతోంది. చిన్ననాడు దసరా ఉత్సవాల్లో పాడాలని ప్రోత్సహించిన నాన్న మాటలే ఆ తర్వాత కాలంలో తనకో కెరీర్‌ను సృష్టించాయి. పసితనంలో అక్కడే ఆర్కెస్ట్రా నిర్వహిస్తున్న ప్రదీప్ శిరీష స్వర మాధుర్యం, లయ జ్ఞానాన్ని గుర్తించాడు. శిక్షణ ఇస్తే మంచి గాయని అవుతుందని ఆమె తండ్రిని ఒప్పించాడు. ఫలితంగా ఆర్కెస్ట్రా సింగర్‌గా చాలాచోట్ల కచేరీలు చేసింది. తర్వాత యూట్యూబ్ స్టార్ అయ్యింది.నాలుగేళ్లలోనే వెయ్యి పాటలు ఆలపించిన శిరీష, పాటలు, వాటి షూటింగ్‌లతో బిజీ అయిపోయింది. ఏమే పిల్లా అన్నప్పుడల్లా.. అనే జానపద పాటతో ప్రజల గుండెల్లో చోటు దక్కించుకుంది. సినీ తారలు సైతం ఈ పాటకు స్టెప్పులేశారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో శిరీష పాటలకు లక్షల సంఖ్యలో వ్యూయర్స్ ఉన్నారు. ఇటీవల రూపొందించిన బతుకమ్మ పాటలు కూడా మంచి గుర్తింపు పొందాయి. -
బతుకమ్మ, దసరా, దీపావళి.. పండుగ ఏదైనా పూల సాగుతో సిరులే..
సాక్షి, కరీంనగర్: కొందరు రైతులు సీజనల్ పంటలతోపాటు పూల సాగు చేస్తుంటే మరికొందరు సాధారణ పంటలతో విసిగిపోయి, పూల తోటలపై దృష్టిసారించారు. పండుగలు, శుభకార్యాల నెలలకు అనుగుణంగా రకరకాల పూలతో సిరులు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి, మల్లన్న పట్నాలు, శివరాత్రి తదితర పర్వదినాల్లో, పెళ్లిళ్లలో పూలకు డిమాండ్ ఉంటుంది. ఆయా పండుగలకు అనుగుణంగా రైతన్నలు బంతి, చామంతి, గడ్డి చామంతి, పట్టుకుచ్చులు, గల్లండ, లిల్లీపూలు సాగు చేస్తూ మంచి దిగుబడులు, ఆదాయం పొందుతున్నారు. తొమ్మిది రోజుల బతుకమ్మ సందడి ప్రారంభమైన నేపథ్యంలో పూలు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్న కర్షకులపై ప్రత్యేక కథనం. చింతల్‌పేట్‌లో బంతి, చామంతి పూలు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని చింతల్‌పేట్‌కు చెందిన రైతు ఇప్ప గంగాధర్ ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం పరిసరాల నుంచి బంతి, చామంతి, గడ్డి చామంతి మొక్కలను రూ.3 నుంచి రూ.5 చొప్పున వెచ్చించి, తీసుకువస్తున్నాడు. వీటిని ఎకరం 10 గుంటల్లో నాటుతున్నాడు. నాటిన నెల రోజుల నుంచి పూతకు వస్తాయి. ఆ తర్వాత వారం, పది రోజుల్లోనే తెంపి విక్రయిస్తున్నాడు. చీడపీడల నివారణకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పురుగు మందులు ఖర్చవుతుందని, భూసారం పెంచడానికి ఎక్కువగా సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తున్నానని గంగాధర్ తెలిపాడు. చదవండి: బతుకమ్మ పండుగ.. తొమ్మిది రోజులు ఎనిమిది నైవేద్యాలు! సాధారణ సీజన్లో బంతి కిలో ధర రూ.50 నుంచి రూ.60, చామంతి, గడ్డి చామంతి కిలో ధర రూ.150 నుంచి రూ.170 వరకు ఉంటుంది. ఇక బతుకమ్మ, దసరా సీజన్లలో బంతికి కిలో రూ.100, చామంతి రూ.200 వరకు, గడ్డి చామంతి రూ.50 వరకు ఉంటుందని పేర్కొన్నాడు. ప్రస్తుత సీజన్లో పూలన్నీ విక్రయిస్తే రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెప్పాడు. కండ్లపల్లిలో లిల్లీపూలు జగిత్యాల మండలంలోని కండ్లపల్లికి చెందిన చందా సుధాకర్ లిల్లీపూలు సాగు చేస్తున్నాడు. వీటి గడ్డలు 20 కిలోలకు రూ.800 వెచ్చించి, నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం నుంచి తీసుకువస్తున్నాడు. భూమిని నాలుగైదు సార్లు బాగా దున్ని, పొడి దుక్కి చేస్తాడు. తర్వాత పేడ, కోడి ఎరువు వేస్తాడు. అనంతరం లిల్లీపూల గడ్డలను పొలంలో నాటుతాడు. ఒక్కసారి నాటితే మూడేళ్ల వరకు పూలు పూస్తాయి. నాటిన 3 నెలలకు దిగుబడి వస్తుంది. చదవండి: Bathukamma: పండగ వెనుక ఎన్ని కథలున్నా.. బతుకమ్మ ప్రత్యేకత ఇదే ఫిబ్రవరి, మార్చి, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో పూలు ఎక్కువగా వస్తాయి. వీటిని జగిత్యాల మార్కెట్‌కు తరలిస్తున్నాడు. ఏటా రెండుసార్లు తోటకు డీఏపీతోపాటు 3 నెలలకోసారి పొటాష్, యూరియా అందిస్తుంటాడు. ఈ పూలు మార్కెట్లో కిలోకు రూ.100 పలుకుతున్నాయి. నిత్యం 8 నుంచి 10 కిలోలను మార్కెట్‌కు తరలిస్తున్నట్లు సుధాకర్ తెలిపాడు. ఏడాదికి పంటకు రూ.60 వేల వరకు ఖర్చు పెడితే, మార్కెట్లో డిమాండ్‌ను బట్టి రూ.1.75 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెప్పాడు. నాగారం, తెనుగుపల్లెలో పట్టుకుచ్చులు బతుకమ్మ పేర్చాలంటే తంగేడు పూలతోపాటు గుమ్మడి, కట్ల, గోరింట, పట్టుకుచ్చుల(సీతమ్మ జడ) పూలు ఉండాల్సిందే. ముఖ్యంగా పట్టుకుచ్చులు బతుకమ్మకు ప్రత్యేక ఆకర్షణ తీసుకువస్తాయి. ఈ పూలకు పెట్టింది పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలంలోని నాగారం, తెనుగుపల్లె గ్రామాలు. గ్రామస్తులు ఏటా బతుకమ్మ సందర్భంగా 10 గుంటల నుంచి ఎకరం వరకు పట్టుకుచ్చులు సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. పూలను సమీపంలోని గోదావరిఖని, ఎన్టీపీసీ, రామగుండం తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. నాగారానికి చెందిన తాళ్ల శ్రీనివాస్ 20 ఏళ్లుగా ఎకరం భూమిలో పట్టుకుచ్చులు సాగు చేస్తున్నాడు. విత్తనం అలికిననాటి నుంచి పువ్వుకోసే వరకు వరి, పత్తి పంటల్లాగే అన్నిరకాల ఎరువులు వేస్తామని తెలిపాడు. ఈ ఏడాది కొత్త రకం సాగు చేశానని, ఇటీవల కురిసిన వర్షాలకు తోటలో కలుపు తీయలేకపోయామని చెప్పాడు. ఇప్పటివరకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టానని, వర్షాల వల్ల ఆశించిన దిగుబడి రాలేదన్నాడు. పెట్టుబడి వస్తుందో, రాదోనని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపాడు. గతేడాది ఇదే పెట్టుబడికి ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల ఆదాయం పొందినట్లు పేర్కొన్నాడు. మామిడాలపల్లిలో బంతి, పట్టుకుచ్చులు వరి పంటతో నష్టాలు చూసిన కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని మామిడాలపల్లి రైతు కొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి బంతి, పట్టుకుచ్చుల పూలు సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. గతేడాది 1.20 ఎకరాల్లో బంతి విత్తనాలు వేయగా పంట చేతికివచ్చే సమయంలో వర్షాలు కురిసి, పెట్టుబడి కూడా చేతికి రాలేదు. ఈ ఏడాది ఎకరన్నర భూమిలో బంతి, 20 గుంటల్లో పట్టుకుచ్చుల విత్తనాలు వేశాడు. మొక్కలు ఏపుగా పెరిగి, పూలు విపరీతంగా పూశాయి. వారం రోజుల్లో సద్దుల బతుకమ్మ, దసరా పండుగలు ఉన్నాయి. ప్రస్తుతం కిలోకు రూ.100 నుంచి రూ.130 వరకు చేను వద్దే విక్రయిస్తున్నానని తెలిపాడు. ఇతర ప్రాంతాల నుంచి ఇప్పటికే ఆర్డర్లు వచ్చాయన్నాడు. పూల సాగుకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టానని, రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. మొక్కలకు నీటి కోసం మల్చింగ్‌తోపాటు డ్రిప్ ఏర్పాటు చేశానని, దీనివల్ల నీటి తడులకు కూడా ఇబ్బంది కలగలేదని పేర్కొన్నాడు. వరి సాగు చేసే రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండించాలని సూచిస్తున్నాడు. మంగళ్లపల్లిలో బంతి, చామంతి, మల్లె పూలు రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మంగళ్లపల్లిలో 190 కుటుంబాలున్నాయి. అందరికీ వ్యవసాయమే జీవనాధారం. సుమారు 50 కుటుంబాలు బంతి, చామంతి, మల్లె పూలతో ఉపాధి పొందుతున్నారు. సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా పూలు సాగు చేస్తామని రైతు బాదనవేణి బాలరాజు తెలిపాడు. వీటిని సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలతోపాటు కరీంనగర్ మార్కెట్‌కు కూడా తరలిస్తామన్నాడు. నిత్యం 2 నుంచి 3 క్వింటాళ్ల వరకు విక్రయిస్తామని, శుభకార్యాలు, పండుగల సమయాల్లో గిరాకీ ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. సాధారణ రోజుల్లో కిలోకు రూ.50 నుంచి 70 వరకు, దసరా, బతుకమ్మ, దీపావళి తదితర ప్రత్యేక రోజుల్లో రూ.100 నుంచి రూ.150 వరకు విక్రయిస్తామని పేర్కొన్నాడు. పూల సాగుతో వచ్చిన ఆదాయాన్ని కుటుంబ పోషణకు, పత్తిసాగు పెట్టుబడికి వినియోగిస్తామని చెప్పాడు. పూల విత్తనాలను ప్రభుత్వం రాయితీపై ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాడు. తిమ్మాపూర్‌లో బతుకమ్మ కోసమే.. తిమ్మాపూర్(మానకొండూర్): మండలంలో అనేక మంది రైతులు బతుకమ్మ పండుగ కోసమే సుమారు 50 ఎకరాల్లో సీతజడ(పట్టుకుచ్చులు), 50 ఎకరాల్లో బంతి తోటలు సాగు చేస్తున్నారు. ఇందుకు కావాల్సిన మొక్కలను నర్సరీల నుంచి తెచ్చుకుంటున్నారు. వ్యాపారులు ఆయా తోటల వద్దకే వెళ్లి, ముందస్తుగా డబ్బులు చెల్లించి, బుక్ చేసుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. (ఫొటోలు)
-
కొత్త వివాదంలో హెల్త్ డైరెక్టర్.. బతుకమ్మ ముందు డీజే టిల్లు పాటకు స్టెప్పులు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు గడల శ్రీనివాపరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కొత్తగూడెం శ్రీనగర్ కాలనీ డీఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు ఓ సినిమా పాటకు డ్యాన్స్ చేశారు. డీజే టిల్లు పాటకు బతుకమ్మ ముందు స్టెప్పులేశారు. దీనిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రంగా భావించే బతుకమ్మ సంబరాల్లో సినిమా పాటలకు స్టెప్పులేయడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ సంసృతి,సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాల్లో సినిమా పాటలకు డ్యాన్సు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక శ్రీనివాసరావు డ్యాన్స్ వ్యవమారం తాజాగా చర్చనీయంశంగా మారింది. కాగా హెల్త్ డైరెక్టర్ కాంట్రవర్సీలో ఇరుక్కోవడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకముందు ఓ తండాలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొనడంతో శ్రీనివాసరావు క్షుద్రపూజలు నిర్వహించినట్లు ప్రచారం జరిగింది. చదవండి: హీరో లెవల్లో యువకుడి బైక్ స్టంట్.. ఝలక్ ఇచ్చిన పోలీసులు -
బతుకమ్మ పండుగ.. తొమ్మిది రోజులు ఎనిమిది నైవేద్యాలు!
సాక్షి, హైదరాబాద్: అవనిపై పచ్చని పైటేసినట్టు ఆకుపచ్చని మొక్కలన్నీ అందంగా సింగారించుకునే వేళ.. నిండిన చెరువులు, పండిన పంటలతో అలరారే సమయం.. కురిసే చినుకుల తాకిడితో పుడమి తల్లి పచ్చగా మెరిసే క్షణాల్లో తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా భావిస్తున్న పూల పండుగ బతుకమ్మ ప్రారంభమవుతోంది. పూలతో దేవుడిని కొలిచే దేశంలో.. ఆ పూలనే దేవతగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పట్టే బతుకమ్మ సంబరాలు ఏటా పెద్ద అమవాస్య నుంచి తొమ్మిది రోజులపాటు జరుగుతాయి. ఆడపడుచులు తీరొక్క పూలతో, రకరకాల పిండి వంటలతో గౌరీదేవిని పూజిస్తారు. ప్రకృతిలో లభించే రకరకాల పూలను బతుకమ్మగా పేర్చి, ఆటపాటలతో పూజించి దగ్గరలోని చెరువుల్లో నిమజ్ఞనం చేస్తారు. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. బతుకమ్మ అంటే.. బతుకమ్మ అనే పదానికి తెలంగాణలో విభిన్న పర్యాయ పదాల వాడుకలో ఉన్నాయి. ముఖ్యంగా బతుకమ్మ అంటే పూలతో కూడిన అమరిక అని అర్థం. ఈ కాలంలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మలను కొన్ని వరుసలు పేరుస్తారు. మ«ధ్యలో పసుపుతో చేసిన స్థూపాకారావు పదార్థాన్ని లేదా గుమ్మడి పూవులో నుంచి తీసిన మధ్య భా గాన్ని ఉంచుతారు. దీన్ని బొడ్డెమ్మ అని పిలుస్తారు. కొందరు బొడ్డెమ్మను దుర్గగా కొలుస్తారు. బతుకు అంటే తెలుగులో జీవించే లేదా జీవితం అని అర్థం. అమ్మ అంటే తల్లి అని అర్థం. దాన్నే బతుకమ్మ అని అంటారు. పండుగ నేపథ్యం ఇదీ.. 19వ శతాబ్దం పూర్వార్థం నిత్యం దారిద్య్రం, భయంకర అంటువ్యాధులు, ప్రకృతి బీభత్సాలతో తెలంగాణలోని గ్రామాల్లో అనేక మంది ప్రజలు చనిపోయేవారు. ఈ క్రమంలో ప్రజలు తమ కష్టాల నుంచి గట్టెక్కేందుకు, తమకు పుట్టిన పిల్లలు అనారోగ్యం బారిన పడి చనిపోకుండా బతకటానికి బతుకమ్మ(బతుకు+అమ్మ) పండుగను సృష్టించుకున్నారు. మరో కథనం ప్రకారం.. ఒక కాపు కుటుంబంలో ఏడో సంతానంగా పుట్టిన అమ్మాయే బతుకమ్మ. అంతకుముందు పుట్టి చనిపోయిన వారిలో కలవకూడదనే భావనతో ‘బతుకమ్మ’ అని పిలుచుకుంటూ పెంచుతారు. బతుకమ్మ ఎదిగాక పెళ్లి చేస్తారు. ఓ పండుగ రోజు బతుకమ్మ పుట్టింటికి వస్తుంది. అన్న భార్యతో కలిసి చెరువుకు స్నానానికి వెళ్తుంది. అక్కడ ఒడ్డున పెట్టిన ఇద్దరి చీరలు కలిసిపోయి వదిన చీరను బతుకమ్మ కట్టుకుంటుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి, వదిన బతుకమ్మ గొంతు నులిమి, చంపేసి చెరువు గట్టున పాతిపెడుతుంది. తర్వాత ఆమె తంగేడు చెట్టుగా మొలుస్తుంది. బతుకమ్మ తన భర్తకు కలలో కనిపించి, జరిగిన విషయం చెప్పి, తనను తీసుకుపొమ్మంటుంది. అలా పండుగ ప్రారంభమైందని చెబుతారు. ఎంగిలిపూల బతుకమ్మ.. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. పండుగకు ముందు ఆయా పుష్పాలన్నీ వివిధ కీటకాల పరాగ సంపర్కం కారణంగా ఎంగిలి పడ్డాయని తలచి ఎంగిలిపూలుగా పరిగణిస్తారు. పితృ అమావాస్య రోజు స్వర్గస్తులైన పెద్దలకు బియ్యం ఇచ్చుకొని, వారిని దేవతలుగా ఆరాధిస్తారు కాబట్టి ఈ నేపథ్యంలో తెచ్చిన పూలన్నీ ఎంగిలి పడ్డట్టుగా భావిస్తారు. అటుకుల బతుకమ్మ.. రెండోరోజు అటుకల బతుకమ్మగా పిలుస్తారు. రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడపడుచులందరూ ఆట పాటలతో సందడి చేస్తారు. బెల్లం, అటుకులు, పప్పుతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ముద్దపప్పు బతుకమ్మ.. మూడోరోజు ముద్ద పప్పు బతుకమ్మగా జరపుకుంటారు. బెల్లం, ముద్దపప్పు, పాలతో నైవేద్యం తయారు చేస్తారు. నానబియ్యం బతుకమ్మ.. నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మను జరుపుకుంటారు. తంగేడు, గునుగు పూలతో బతుకమ్మను నాలుగు వరుసలుగా పేరుస్తారు. గౌరమ్మను పెట్టి, ఆడిపాడి, దగ్గరలోని చెరువులో నిమజ్ఞనం చేస్తారు. ఈ సందర్భంగా నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లంతో కలిపి ముద్దలుగా తయారుచేసి, నైవేద్యంగా సమర్పిస్తారు. అట్ల బతుకమ్మ.. ఐదోరోజు అట్ల బతుకమ్మ జరుపుకుంటారు. తంగేడు, మందారం, చామంతి, గునుగు, గుమ్మడి పూలతో ఐదు వరుసలు పేర్చి, బతుకమ్మను త యారు చేస్తారు. బియ్యం పిండితో తయారు చేసిన అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. అలిగిన బతుకమ్మ.. ఆరోరోజు అలిగిన బతుకమ్మ. బతుకమ్మను పూలతో అలకరించరు. నైవేద్యం సమర్పించరు. బతుకమ్మను పేర్చి ఆడకుండా నిమజ్జనం చేస్తారు. వేపకాయల బతుకమ్మ.. ఏడోరోజు వేపకాయల బతుకమ్మ జరుపుకుంటారు. ఈరోజు తంగేడు, చామంతి, గులాబీ, గునుగు పూలతో బతుకమ్మను ఏడు వరుసల్లో పేరుస్తారు. బియ్యం పిండిని వేప పండ్లుగా తయారు చేసి, నైవేద్యం సమర్పిస్తారు. వెన్నెముద్దల బతుకమ్మ.. ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ. తంగేడు, చామంతి, గునుగు, గులాబీ, గడ్డిపూలతో కలిపి ఎనిమిది వరుసల్లో బతుకమ్మను పేరుస్తారు. అమ్మవారికి ఇష్టమైన నువ్వులు, వెన్న, బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు. సద్దుల బతుకమ్మ.. బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో సద్దుల బతుకమ్మ చివరిది. ఈరోజు అన్ని రకాల పూలతో భారీ బతుకమ్మలను పేరుస్తారు. మహిళలు నూతన వస్త్రాలు ధరించి, ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను పెట్టి, ఆటపాటలతో గౌరమ్మను పూజిస్తారు. పెరుగు అన్నం, నువ్వుల అన్నం వంటి ఐదు రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం కుటుంబ సమేతంగా ప్రసాదాన్ని అరగిస్తారు. -
Bathukamma: 25 నుంచి బతుకమ్మ ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ తెలిపారు. ఈనెల 25 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం బీఆర్కేఆర్ భవన్లో సమీక్ష నిర్వహించారు. సద్దుల బతుకమ్మ జరిగే అక్టోబర్ 3న ట్యాంక్‌బండ్ వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బతుకమ్మ ఘాట్, ట్యాంక్ బండ్, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలన్నారు. ఎల్బీ స్టేడియం, నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ, ట్యాంక్ బండ్ వద్ద విద్యుత్ దీపాలంకరణ, బారికేడింగ్, మంచినీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్స్ సరఫరా, మొబైల్ టాయిలెట్స్, నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. మహిళలు ఉత్సవాల్లో భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశమున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను నియమించాలన్నారు. బతుకమ్మ పండుగపై ఆకర్షణీయమైన డిజైన్లతో మెట్రో పిల్లర్లను అలంకరించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలు 25 నుంచి ప్రారంభం కానున్నాయని, బతుకమ్మ ఉత్సవాలు కూడా అదే రోజున ప్రారంభం అవుతాయని తెలిపారు. -
ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు.
నల్లరాజుపాలెం(అనంతసాగరం): ఫిన్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యం లో దసరా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయని అధ్యక్షులు పార్లపల్లి రఘునాధ్ రెడ్డి గారు తెలియజేసారు. విదేశాల్లో ఉన్నప్పటికి మన సంస్కృతి సంప్రదాయాలకు విలువ నిచ్చి మన తెలుగు వాళ్లు అక్కడ ఎంతో ఆనందంగా ఈ పండుగలని జరుపుకున్నారని అన్నారు. దాదాపు రెండు వందల మందికి పైగా ఈ వేడుకలకు హాజరై వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. రెండు సంవత్సరాలు పాటు కరోనా మహమ్మారితో ఇబ్బంది పడిన జనాలకి ఈ కార్యక్రమం మంచి మానసిక ఉల్లాసాన్నిచ్చిందని అన్నారు. దసరా పాటలతో, నృత్యాలతో కూడిన ఈ కార్యక్రమం దాదాపు ఏడు గంటల పాటు కొనసాగిందని అన్నారు. కార్యక్రమం కొనసాగటానికి సంస్థ నిర్వాహకులు సింగపురం వినయ్ , అడబాల శ్రీవల్లి, రోజా రమణి మోలుపోజు, శృతి కొట్రిక్, స్పందన ఈచూరి తదితరులు కృషిచేశారని తెలిపారు. తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యత సాధించినటువంటి బతుకమ్మ పండుగ సందర్బంగా వివిధ రకాల పూల అలంకరణతో బతుకమ్మని తయారు చేయించి, పిల్లలు, ఆడపడుచులందరు పాల్గొని బతుకమ్మ కోలాటం ఆడించేందుకు బజ్జురి లచ్చిరెడ్డి, దాసరి వాసు, వెన్నెల శివశంకర్, గంధం అభిషేక్ , పంగనామాల వంశి కృష్ణ, వారణాసి వెంకట రాకేష్ ఎంతో కృషి చేశారని తెలిపారు. కాగా, ఇక ముందు కూడా ఫిన్లాండ్లో మరిన్నికార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇక్కడున్న మన తెలుగు వాళ్లకి అండగా ఉంటామని తెలుగు సంఘం ఉపాధ్యాక్షులు ఓలేటి సుబ్రమణ్య మూర్తి గారు, జ్యోతిస్వరూప్ అనుమలశెట్టి గారు, సత్యనారాయణ గారు తెలియజేశారు. -
పోయిరా బతుకమ్మ ఉయ్యాలో.. మళ్లీ రా బతుకమ్మ..ఉయ్యాలో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ కోలాహలం సందడి సందడిగా కొనసాగుతోంది. తీరొక్క పూలతో మహిళలంతా వీధివీధినా బతుకమ్మను పేర్చి ఆడిపాడే వేడుక తుది దశకు చేరుకుంది. మహాలయ అమావాస్య నుంచి రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, తొమ్మిది రోజులు, నైవేద్యాలు, తొమ్మిది రూపాల్లో అమ్మవారిని పూజిస్తారు. చివరి రోజైన సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలు ముగుస్తాయి. పోయిరా బతుకమ్మ ఉయ్యాలో ..మళ్లీ రా బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడబిడ్డలు సద్దుల బతుకమ్మ నాడు ఆ గౌరమ్మ తల్లికి ఘనంగా వీడ్కోలు పలుకుతారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, సత్తుపిండి, కొబ్బరన్నం, నువ్వులన్నం ఇలా ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి గౌరమ్మకు నైవేద్యాన్ని సమర్పిస్తారు. చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు చెరువులో నిమజ్జనం చేయడంతోఈ వేడుకలు ముగుస్తాయి. తొమ్మిది రోజుల ఉత్సాహాన్ని ఏడాదంతా నింపుకుంటారు ఆడబిడ్డలు. -
Bathukamma 2021: తీరొక్క పూలతో ఫారిన్ బతుకమ్మ
కూకట్పల్లి: దేశంలోని పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి తీసుకువచ్చిన తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చారు కూకట్‌పల్లికి చెందిన గుండాల అర్చన. నెల రోజులపాటు ఆమె పూలను సేకరించి బతుకమ్మను తీర్చిదిద్దారు. న్యూజిలాండ్‌లోని తన స్నేహితులతో పూలను పార్శిల్లో తెప్పించారు. దేశంలోని కశ్మీర్, కన్యాకుమారి, కొడైకెనాల్, ఊటీ, బెంగళూర్ తదితర ప్రాంతాల నుంచి సైతం పుష్పాలను సేకరించి దాదాపు 13 అడుగుల మేర కమలం ఆకారంలో బతుకమ్మను పేర్చారు. గతంలో మెదక్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ ప్రాంతాల నుంచి పూలను తీసుకురావటానికి అర్చన అత్త చంద్రమ్మ రూ.లక్షలు ఖర్చు చేసేవారు. ఈసారి ఆమె కోడలు ఏకంగా విదేశాల నుంచి పూలను తెప్పించి బతుకమ్మను పేర్చడం గమనార్హం. ఈ బతుకమ్మకు బుధవారం ప్రత్యేక పూజలు చేసి మేళతాళాలు, భారీ ర్యాలీతో ఐడీఎల్ చెరువు వద్దకు తీసుకెళ్లారు. -
సద్దుల బతుకమ్మ: నువ్వుల ముద్దలు, సత్తుపిండి, కొబ్బరి పొడి, పల్లి పిండి..
సాక్షి, పెద్దపల్లి: బతుకమ్మ మానవ సంబంధాలకే పరిమితం కాకుండా అతివలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆడపడుచుల్లో ఆరోగ్యకాంతులను వెలిగిస్తుంది. ఆటపాటలతో మానసికోల్లాసమే కాదు, బతుకమ్మ ఆడిన తర్వాత సద్ది పేరుతో ఇచ్చిన్నమ్మ వాయినం.. పుచ్చుకుంటినమ్మ వాయినం.. అంటూ మహిళలు ఫలహారాలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ఫలాహారాలు చేస్తారు. వీటిల్లో అనేక పోషక విలువలున్నాయి... శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను ఫలహారాల రూపంలో బతుకమ్మ అందిస్తోంది. బతుకమ్మ సద్దిలో ‘ఐరన్’ స్త్రీలు, పిల్లల్లో ఐరన్ లోపం కనిపిస్తుంది. బతుకమ్మ వేడుకల్లో తయారు చేసుకునే సద్దిలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. సత్తుపిండి, పెసర ముద్దలు, నువ్వులు, కొబ్బరి, పల్లిపొడి లేదా ముద్దలు ఉంటాయి. ఇవన్నీ పండుగ సమయానికి చేతికి వచ్చే చిరుధాన్యాలు కాబట్టి వీటిని తింటే ఆరోగ్యకరమని పెద్దలు చెబుతున్నారు. ఒక్కోరోజు ఒక్కో తరహా పిండి వంటలను తయారు చేస్తుంటారు. చదవండి: నేడు, రేపు సద్దుల బతుకమ్మ వేడుకలు నువ్వుల ముద్దలు నువ్వులు ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. వీటితో పొడి చేస్తారు. నువ్వుల్లో అమైనోయాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ముఖ్యమైనవి. జింక్, కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. జింక్ మొదడును చురుకుగా ఉండేలా చేస్తుంది. కాల్షియం ఎమకల ధృడత్వాన్ని పెంచుతుంది. సత్తు పిండి బతుకమ్మ వేడుకల్లో తొలిరోజు ఆకువక్కలు, తులసీదళాలు, దానిమ్మగింజలు, శనగపప్పు, పెసరపప్పు, నువ్వులు, మొక్కజొన్న గింజల సత్తు పిండిని తీసుకెళ్తారు. సత్తుపిండిలో పీచు అధికంగా, కార్బొహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. పీచు పదార్థాల వల్ల మలబద్దకం రాదు. రెండోరోజు పప్పు బెల్లం, రేగు పండ్లు, మూడో రోజు పూర్ణాలు, నాల్గోరోజు బెల్లం బియ్యం, ఐదో రోజు అట్లు, ఎనిమిదో రోజు నువ్వులు, బెల్లం కలిపిన వెన్న ముద్దలు, తొ మ్మిదోరోజు బియ్యం పిండి, గోధుమపిండి, బె ల్లంతో మలీద ముద్దలు తయారు చేస్తారు. íఇవి బతుకమ్మకు పెట్టే ప్రత్యేక నైవేద్యాలు పెసర ముద్దలు పెసర్లను ఉడకబెట్టి అందులో బెల్లం కలిపి ముద్దలుగా తయారు చేస్తారు. ఇది జీర్ణశక్తిని పెంచడంతోపాటు జీర్ణ సంబంధిత వ్యాధులనూ తగ్గిస్తుంది. కొబ్బరి పొడి కొబ్బరిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. మహిళల ఆరోగ్యానికి పొడి చాలా ఉపయోగపడుతుంది. పెరుగన్నం, పులిహోర... పెరుగన్నంలో పల్లీలు, వివిధ రకాల ధాన్యాలను కలుపుతారు. చింతపండు లేదా నిమ్మరసంతో చేసిన పులిహోర ప్రసాదంగా వాడుతున్నారు. చిన్న గాయాల నుంచి క్యాన్సర్ వరకు పసుపు విరుగుడుగా పని చేస్తుంది. చింతపండు గుజ్జులో విటమిన్ ‘సి’ అత్యధికంగా ఉంటుంది. పంచామృతాల్లో పెరుగు ఒకటి దీనిలో పోషక విలువలు మెండు. దీంతో అన్నం కలిపి కమ్మనైన నైవేద్యాన్ని సమరి్పస్తారు. ఇందులో ప్రొటీన్, కాల్షియం, రిబోప్లా విటమిన్, విటమిన్ బీ6, బీ12, వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండే పెరుగులో లాక్‌లో బాసిల్లై అధికంగా ఉంటుంది. పల్లి పిండి పల్లి పిండి శరీర ఎదుగుదలకు అత్యంత ప్రాధానమైంది. అధిక ప్రోటీన్లతోపాటు రుచికరంగా ఉండడంతో చాలా మంది ఇష్టంగా తింటారు. దీనికి బెల్లం జోడించడంతో కావల్సిన పోషకాలు లభిస్తాయి. వీటిని ముద్దలుగా సైతం చేస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది సత్తుపిండితో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. రుచిగా ఉండే సత్తుపిండి పిల్లలకు, మహిళలకు చాలా ప్రొటీన్స్‌ను అందిస్తాయి. ఐరన్, కాల్షియంతో కండరాల పటిష్టత, ఎముకల గట్టితనం, పిల్లల్లో ఎదుగుదల వంటి అనేక రకాల ఉపయోగాలున్నాయి. షాపుల్లోని స్వీట్స్ తినడంకంటే, సాంప్రదాయ పిండివంటలను ప్రతీ ఒక్కరూ తినడం బెటర్. బతుకమ్మ ఆరోగ్యాన్ని పెంచే ప్రత్యేకమైన పండుగ. – రాజశేఖర్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్, గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి -
బతుకమ్మ సంబురాలు : ‘‘వేపకాయల బతుకమ్మ' ప్రత్యేకత ఇదే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి చిహ్నమైన బతుకమ్మ సంబరాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం ఏడవ రోజు వేపకాయల బతుకమ్మగా ఈ వేడుకను నిర్వహించుకుంటారు. తొమ్మిది రోజులు పాటుసాగనున్న ఈ సంబురంలో ఈ రోజు సకినాల పిండితో వేపకాయల నైవేద్యాన్ని ప్రసాదంగా నివేదిస్తారు. మహిళలు ఉత్సాహంగా ఆడిపాడుతూ చల్లగా దీవించుతల్లీ అంటూ గౌరమ్మకు మొక్కుతారు. ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ సంబురాలను ముగించుకున్న మహిళలు ఏడో రోజు వేపకాయల బతుకమ్మగా జరుపుకుంటారు. ‘‘వాడవాడంత ఉయ్యాలో.. పూల వనమాయే ఉయ్యాలో’’ అంటూ తంగేడు, గునుగు, చామంతి, గులాబి పూలతో ఏడంతరాలు పేర్చి ఆడుకొంటారు. వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు. లేదా పప్పు, బెల్లం నైవేద్యంగా పెడతారు. అనంతరం ఆ బతుకమ్మను చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేస్తారు. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ వేడుకలు 9 రోజులపాటు కొనసాగుతాయి. తెలంగాణ వీధులన్నీ రంగురంగుల పూలతో అందంగా అలంకరించిని బతుకమ్మలతో కళకళలాడుతున్నాయి. అందమైన కన్నెపిల్లలు, చక్కటి ముస్తాబుతో మహిళలతో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూంది. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ వేడుకలు 9వ రోజున సద్దులబతుకమ్మతో వేడుకలు ముగియనున్నాయి. సెప్టెంబరు, అక్టోబరు మాసాలు ప్రజలకు పండుగల నెలలుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెలల్లో రెండు పెద్ద పండుగలొస్తాయి. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ కాగా మరొకటి దసరా లేదా విజయ దశమి. ముఖ్యంగా తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ఈ రెండు పండుగల్లో ఇంటికి వచ్చిన కొత్త పెళ్లికూతుళ్లతో ఆయా కుటుంబాలు కోలాహలంగా ఉంటాయి. మరోవైపు మహిళలు భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజించడంతో పాటు దసరా సంబరాలకు సిద్ధమవుతున్నారు. దసరా పండుగ సమీపిస్తున్న సమయంలో దుకాణాల్లో షాపింగులతో కళకళలాడుతున్నాయి. అటు పూల దుకాణాలు, ఇటు వస్త్ర, బంగారు ఆభరణాలు షాపులు కొనుగోలుదారులతో బిజీ బిజీగా ఉన్నాయి. -
బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో!
-
తెలంగాణ: నేటి నుంచి స్కూళ్లకు సెలవులు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ రెండో దశతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు ఊరట కోసం పల్లెబాట పడుతున్నారు. బుధవారం నుంచి పిల్లలకు దసరా సెలవులు కావడంతో సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే నగరం నుంచి వివిధ మార్గాల్లో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించిన దక్షిణమధ్య రైల్వే రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ఆర్టీసీతో పాటు ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలు కాచుకొని ఉన్నాయి. చదవండి: తీరొక్క పూల పండుగ.. బతుకమ్మ నేటి నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ► నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 4200 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ► నుంచే ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ► తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా ఎక్కువ మంది తరలి వెళ్లనున్న దృష్ట్యా మహాత్మాగాంధీ, జూబ్లీబస్‌స్టేషన్‌లతో పాటు ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ చౌరస్తా, కూకట్పల్లి తదితర ప్రాంతాల నుంచి నేరుగా బస్సులు బయలుదేరనున్నాయి. ► ఈ బస్సుల్లో చార్జీలు రెగ్యులర్ కంటే అదనంగా ఉంటాయి. కనీసం 30 మంది ఉంటే డైరెక్ట్ బస్సు దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని మరో ప్రత్యేక సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ఏదో ఒక కాలనీ నుంచి లేదా పనిచేసే స్థలం నుంచి కనీసం 30 మంది లేదా అంతకంటే ఎక్కువ ప్రయాణికులు ఉంటే వాళ్లు బయలుదేరే స్థలం నుంచి చేరుకోవలసిన గమ్యస్థానం వరకు డైరెక్ట్ బస్సును ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. నగరంలోని ఆర్టీసీ సమాచార కేంద్రాలను సంప్రదిస్తే ఈ సదుపాయం లభిస్తుందన్నారు. అలాగే సమీపంలోని డిపో నుంచి కూడా బస్సును బుక్ చేసుకోవచ్చు. భవన నిర్మాణ రంగంలో, పారిశ్రామిక ప్రాంతాల్లో పని చేసే ఒకే ప్రాంతానికి చెందిన కార్మికులు, కాంట్రాక్టర్ల వద్ద పని చేసే ఒకే ప్రాంతానికి చెందిన వలస కూలీలు, ఒకే ప్రాంతానికి వెళ్లవలసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పండుగ బస్సుల సమాచారం కోసం ఏర్పాటు చేసిన కేంద్రాల ఫోన్ నెంబర్లు ► రేతిఫైల్ బస్ స్టేషన్- 9959226154 ► కోఠి బస్ స్టేషన్-9959226160 ► ఎంజీబీఎస్-9959226257 ► జూబ్లీ బస్‌స్టేషన్-9959226246 -
గౌతమ్ మీనన్ దర్శకత్వం, ఎఆర్ రెహమాన్ సంగీతంతో ‘బతుకమ్మ’ పాట
తెలంగాణలో అతి పెద్ద పండగ బతుకమ్మ. తొమ్మిది రోజులపాటు ఘనంగా జరుపుకునే ఈ పండగకు ఆదరణ పెరిగిపోతుంది. ఒకప్పుడు పల్లెల్లో మాత్రమే కనిపించే బతుకమ్మ వేడుకలు ఇప్పుడు పట్టణ ప్రజలు సైతం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్టం వచ్చినప్పుటి నుంచి బతుకమ్మ పండగ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది. అంతేగాక ప్రతి ఏడాది బతుకమ్మ పాటలు రాష్ట్రంతో పాటు ప్రపంచ దేశాల్లోను మారుమోగుతున్నాయి. ప్రతి ఎడాది బతుకమ్మ సంబరాల్లో భాగం ఒక కొత్త పాటను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఎడాది లాగే ఈ సారి కూడా బతుకమ్మ పాటపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందుకే ఈ సారి బతుకమ్మ పాట అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఎడాది బతుకమ్మ పాటకు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించగా, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ‘అల్లిపూల వెన్నెల’ అంటూ సాగే ఈ పాట హైదరాబాద్ సమీపంలోనే భూదాన్ పోచంపల్లిలో చిత్రీకరణ జరుపుకుంది. రేపు సాయంత్రం 5:30 గంటలకు తెలంగాణ జాగృతి, ఎమ్మెల్సీ కవిత ఈ పాటను విడుదల చేయనున్నారు. అంతేగాక ఈ సాంగ్‌ను ఇతర భాషల్లోకి సైతం అనువదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఎడాది అక్టోబర్ 6 నుంచి బతుకుమ్మ పండుగ సంబరాలు ప్రారంభం కానున్నాయి. -
బతుకమ్మ చీరల పంపిణీ ఫోటోలు
-
సద్దులు.. పాటల సుద్దులు
సాక్షి, కరీంనగర్: ప్రపంచంలో ఎక్కడా మహిళలకంటూ ప్రత్యేక పండుగ లేదు. కానీ తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ ఆ లోటును పూడ్చింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ తొమ్మిది రోజులపాటు పూలను పూజించే గొప్ప సంస్కృతికి మన రాష్ట్రం వేదిక. పండుగ ముగిసేవరకు పల్లె, పట్టణం తేడా లేకుండా సందడి వాతావరణం నెలకొంటుంది. ఏడాదికోసారి ఆడబిడ్డలు తమ కష్టాలు, బాధలను మరిచి, ఆనందంగా గడిపే సమయమిది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గత వారం రోజులుగా ఆటపాటలతో పూల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. శనివారం జరిగే సద్దుల బతుకమ్మతో గౌరమ్మను సాగనంపేందుకు సిద్ధమవుతున్నారు. గునుగు పూలు తెలుగు లోగిళ్లలో సందడి... తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలుగు లోగిళ్లన్నీ సందడిగా మారుతాయి. పండుగ సందర్భంగా అత్తవారింటి నుంచి తమ ఆడబిడ్డలను పుట్టింటికి ఆహ్వానిస్తారు. సూర్యోదయానికి ముందే నిద్ర లేచిన మహిళలు, యువతులు ఇల్లు, వాకిలిని శుభ్రం చేస్తారు. కొత్త దుస్తులు ధరిస్తారు. మధ్యాహ్న సమయానికి అన్నదమ్ములు తీసుకుచ్చిన పూలతో బతుకమ్మను అందంగా పేర్చి, పూజ చేస్తారు. చివరి రోజు రెండు బతుకమ్మలు తొమ్మిది రోజులపాటు ఆటపాటలతో సాగే వేడుకల్లో చివరి రోజు సద్దుల బతుకమ్మ నాడు మాత్రం రెండు బతుకమ్మలు పేరుస్తారు. ముఖ్యంగా మన ఇళ్లలో ఆడబిడ్డకు వివాహం చేసి, అత్తారింటికి సాగనంపినప్పుడు తోడు పెళ్లికూతురుగా మరొకరని పంపిస్తాం. ఇదే సంప్రదాయాన్ని బతుకమ్మకూ కొనసాగిస్తున్నారు. నిమజ్జనం రోజు పెద్ద బతుకమ్మను తల్లిగా, చిన్న బతుకమ్మను కూతురుగా భావించి, పూలతో అందంగా పేర్చి సాగనంపుతారు. చామంతి పూలు పిండి పదార్థాలకు ప్రత్యేకత.. వానకాలం ముగిసి, చలికాలం ప్రారంభమయ్యే సమయంలో వచ్చే సద్దుల బతుకమ్మ రోజు వాయినాలు ఇచ్చుకునేందుకు పిండి పదార్థాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. పెసలు, బియ్యం పిండితో సత్తు, పులిహోర, పెరుగన్నం తదితరాలు సిద్ధం చేస్తారు. ఇవన్నీ వాతావరణం మార్పునకు లోనైన సమయంలో మానవ సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచే ఔషధీయ విలువలను కలిగి ఉంటాయి. బతుకమ్మల నిమజ్జనం తర్వాత ఈ పిండిపదార్థాలను మహిళలు వాయినం ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మను ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ప్రత్యేక బడ్జెట్‌తో రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందుకోసం సర్కారు చాలా చోట్ల బతుకమ్మ ఘాట్లను నిర్మించింది. ఇదీ పండుగ నేపథ్యం.. తెలంగాణ జానపదుల పండుగగా ప్రారంభమై ఆ తర్వాత నగరాలకు, విదేశాలకు సైతం విస్తరించిన బతుకమ్మ పుట్టుక వెనక ఆసక్తికర కథనాలెన్నో ఉన్నాయి. కాకతీయ చక్రవర్తుల కాలంలో అంటే 12వ శతాబ్ది నుంచి ఈ పండుగ ఉన్నట్లు ఆధారాలు న్నాయి. పూలను బతుకుగా భావించి, మహిళలు పూబొడ్డెను గౌరమ్మగా పూజించడం వల్ల బతుకమ్మ అనే పేరు వచ్చిందని భావన. మహిషాసుర సంహారం కోసం అవతరించిన దుర్గాదేవి తొమ్మిది రోజుల్లో పెరిగి, పెద్దదై రాక్షస సంహారం చేయడంతో ఆమె అనుగ్రహం కోరి మహిళలు చేసే ఆరాధనే బతుకమ్మ అనేది ఒక నేపథ్యం. గంగాగౌరీ సంవాదంలో భాగంగా శివుడు తన తలపై పెట్టుకున్న గంగను చూసి, పార్వతి అసూయ పడుతుంది. గంగను అందరూ పూజిస్తున్నారని తన తల్లితో చెబుతుంది. అప్పడు తల్లి ఓదార్చి గంగ మీద నిన్ను పూల తెప్పలా తేలించి, పూజించేలా చేస్తానంటుంది. అదే బతుకమ్మగా రూపాంతతరం చెందిందని కూడా చెబుతారు. పూర్వం అక్కెమ్మ అనే యువతికి ఏడుగురు అన్నలుంటే పెద్ద వదిన పాలలో విషం కలిపి, మరదలికి తాగించి చంపుతుంది. ఆ తర్వాత ఆమె శవాన్ని ఊరి బయట పాతి పెడుతుంది. అక్కడ అడవి తంగేడు చెట్టు పుట్టి విరగబూస్తుంది. ఊరికి వెళ్లి వచ్చిన అన్నలు చెల్లెకు పూలిద్దామని తెంపబోతే ఆమె ఆత్మ తన మరణం గురించి చెబుతుంది. అప్పుడు అన్నలు నీకు ఏం కావాలో కోరుకొమ్మంటే ఈ తంగెడు పూలల్లో నన్ను చూసుకోమని, ఏటా నా పేర పండుగ చేయండని అంటుంది. ఇలా ఈ పండుగ ప్రారంభమైనట్లు మరో కథ. చాలా కాలం కిందట సంతానం కోసం పరితపిస్తున్న దంపతులకు ఓ అమ్మాయి దొరకగా అమ్మవారి ప్రసాదంగా భావించి, పెంచి పెద్ద చేస్తారు. ఆమె పలు మహిమలు చూపుతూ లోకహిత కార్యాలు చేస్తుంది. దీంతో మహిళలు ఆమె చుట్టూ చేరి, దైవ స్వరూపంగా భావించి, పూజలు చేస్తారు. ఇది క్రమంగా బతుకమ్మ పండుగ నిర్వహించేందుకు కారణమైందని ఇతిహాసం. మరో కథలో ఓ దంపతులకు కలిగిన పిల్లలు కలిగినట్లుగా మరణిస్తుంటే పార్వతిని ప్రార్ధించారట. ఆమె దయతో ఒక కూతురు కలిగి, బతుకుతుందట. ఆమెకు బతుకమ్మ అని నామకరణం చేయడంతో ఈ పండుగ వచ్చిందని ప్రతీతి. తీరొక్క పూల కూర్పు ‘బతుకమ్మ’ మహిళలు గుమ్మడి, తంగేడు, గునుగు, పట్టుకుచ్చులు, చామంతి, కట్ల, గోరింట తదితర పూలతో గోపురం ఆకారంలో బతుకమ్మను పేరుస్తారు. దాని పైభాగంలో గౌరీదేవికి ప్రతిరూపమైన గుమ్మడి పువ్వు, పసుపు ముద్దలను ఉంచుతారు. అనంతరం అగర్బత్తీలు, ప్రమిదలు వెలిగించి, వీధుల కూడళ్లకు తీసుకెళ్లి బతుకమ్మలను ఒక్కచోట చేర్చుతారు. పాట తెలిసిన పెద్దావిడ ఒకరు బతుకమ్మ పాటను ఆలపిస్తే మిగిలిన వాళ్లంతా ఆమెను అనుసరిస్తూ గొంతు కలుపుతారు. బతుకు పాటలు, శ్రమజీవుల వెతలు, గౌరీదేవి మహత్యం, పతివ్రతల ఇతివృత్తాలు ప్రధానాంశాలుగా బతుకమ్మ పాటలు పాడుతారు. అర్ధరాత్రి వరకు ఆడిపాడి, సమీపంలోని చెరువులు, కుంటలు, జలాశయాల్లో బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. కరీంనగర్లో నిమజ్జన ప్రాంతాలు నగరంలోని మానేరు వాగు బ్రిడ్జి సమీపంలోని వేద పాఠశాల వద్ద, రాంచంద్రపూర్ కాలనీలోని మానేరు డ్యాం, కొత్తపల్లి చెరువు, కిసాన్నగరలోని గర్లకుంట, చింతకుంట కాలువ వద్ద బతుకమ్మ నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
పగబట్టిన వరుణుడు: ఇంకెక్కడి దసరా!
(వెబ్ స్పెషల్స్): ఒకవైపు కరోనా వైరస్ మహమ్మారి... మరోవైపు ప్రకృతి తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికిస్తున్నాయి. పండుగల నాటికైనా చక్కబడతామనుకున్న జనావళికి తీవ్ర నిరాశే ఎదురైంది. అటు కోవిడ్-19 ఆంక్షలు, ఇటు పగబట్టిన వరుణుడు దిక్కుతోచని స్థితి. ప్రధానంగా హైదరాబాదు నగరంలో ఎటునుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అంతుపట్టక నగర వాసులు బిక్కు బిక్కుమంటున్నారు. ఎడతెగని వర్షాలు, వరదలతో 2020 దసరాలో పండుగ వాతావరణమే కనిపించకుండా పోతోంది. దసరా అంటేనే సరదా. విజయానికి సూచికగా మాత్రమే విజయాలను సమకూర్చే పండుగగా విజయదశమి ప్రతీతి. కొత్తబట్టలు, సరికొత్త వాహనాలు, కొంగొత్త ఆశలతో ఈ పండుగ బోలెడంత సంబురాన్ని మోసు కొచ్చేది. కానీ ఏడాది పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అటు కరోనా, ఇటు ప్రకృతి ప్రకోపం భక్తుల దసరా ఉత్సవాలపై నీళ్లు జల్లాయి. అంతేకాదు పండుగ సీజన్ పై కోటి ఆశలు పెట్టుకున్న వ్యాపారులను కూడా ఘోరంగా దెబ్బతీశాయి. పండుగ సందర్బంగానైనా కొద్దో గొప్పో వ్యాపారం జరిగి, కాస్త తెప్పరిల్లుదామనుకున్న చిన్న, పెద్ద వ్యాపార వర్గం ఆశలను అడియాసలు చేసేసాయి. దసరాలో మరో సంబురం బతుకమ్మ. శీతాకాలపు తొలి రోజుల ప్రకృతి సౌందర్యంలో పువ్వుల రాశినే దేవతామూర్తిగా భావించి పూజ చేయడం ప్రత్యేక విశేషం. ఇది తెలంగాణ ఆడపడుచుల పూల సంబురం. గునుగు, తంగేడు పూలు బంతి, చేమంతి, నంది వర్ధనంలాంటి రంగు రంగుల పూలను తీర్చి..బతుకవమ్మా అంటూ దీవించే అపురూప దృశ్యం. కానీ 2020 దసరా మాత్రం దేశవ్యాప్తంగా ప్రదానంగా తెలంగాణా ప్రజలకు ఒక చేదు జ్ఞాపకాన్నే మిగులుస్తోంది. తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో ఆనందంగా ఎదురుచూసే సంబురం బతుకమ్మ. ఈ శరన్నవరాత్రుల్లో బతుకమ్మ ఆటపాటల ఉత్సాహం, కోలాహల వాతావరణం కన్నుల పండువగా ఉంటుంది. జమిలిగా, లయబద్ధంగా చప్పట్లతో, కోలాటాలతో ఎంతో సందడి చేస్తారు. ఏడాదికి సరిపడా స్ఫూర్తిని పొందుతారు. ప్రస్తుతం అంతటి ఉత్సాహం, కోలాహలం, సందడి ఎక్కడా కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. ఎవరికి వారే చాలా పరిమితంగా బతుకమ్మలాడుతూ మళ్లీ ఏడాదైనా తమ కష్టాలు తీరేలా చూడు తల్లీ అంటూ ఆ గౌరమ్మకు మొక్కుతున్నారు. కనిపించని దసరా జోష్ గత ఏడు నెలలుగా స్థబ్దుగా ఉండి, లాక్ డౌన్ అంక్షల సడలింపు తరువాత కూడా పెద్దగా డిమాండ్ లేక వెలవెల బోయిన వ్యాపార వాణిజ్య సంస్థలు పండుగ సీజన్ బిజినెస్ పై చాలా ఆశలు పెట్టుకున్నాయి. అటు భారీ డిస్కౌంట్లు, తగ్గింపు ఆఫర్లు, ఉచిత ఆఫర్లు అంటూ ఇలా రకరకాల పేర్లతో కొనుగోలుదార్లను ఆకట్టుకునేందుకు వ్యాపార సంస్థలూ సిద్ధమైనాయి. ఆ మేరకు కొద్దిగా మార్కెట్లో సందడి నెలకొంది. పల్లె, పట్టణ ప్రాంతల్లో నూతన వస్త్రాల కొనుగోళ్లు, ఇతర ఎలక్ట్రానిక్, గృహోపకరణాలు, వాహనాలు, ఇతర వస్తువుల కొనుగోళ్ల జోరు అందుకుంది. కానీ ఇంతలోనే భారీ వర్షాలు పరిస్థితిని అతాలకుతలం చేసేశాయి. క్యుములో నింబస్ మేఘ గర్జనలు నగర వాసులను వణికించాయి. దీంతో మొదట్లో నెలకొన్న దసరా జోష్ కనుమరుగు కావడంతో వ్యాపారులు డీలాపడిపోయారు. సందడి లేని మార్కెట్లు దసరా, బతుకమ్మ పండుగ అంటూనే పూలపండుగ. అద్భుతమైన పూల జాతర. ప్రధానంగా బంతి, చేమంతి, లాంటివాటితోపాటు, గునుగు, తంగేడు, నంది వర్ధనం, గుమ్మడి పూలు లాంటివాటికి డిమాండ్ ఉంటుంది. రకరకాల, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చడంతోపాటు ప్రతి ఇంటిని అందంగా పూలతో అలంకరించడం ఆనవాయితీ. ఇంటి గుమ్మాలేకాదు.. ఏ చిన్నకార్యాలయం గేటు చూసినా.. విరబూసిన పూల అలంకరణలతో కళకళలాడుతుంటాయి. అలాగే విజయదశమి రోజున దాదాపు ప్రతి ఇంట్లో, కార్యాలయాల్లో ఆయుధ పూజలు నిర్వహించడం పరపరంగా వస్తోంది. తీరైన గుమ్మడికాయలను కొట్టడం విజయదశమి రోజున అందరూ చేస్తుంటారు. ఇక బొమ్మల కొలువు సరేసరి. కానీ పూలు, పూల దండలు, నిమ్మకాయలు, రకరకాల బొమ్మలను విక్రయించే విక్రయదారులు గిరాకీ లేక నీరుగారి పోయారు. దశమి రోజుకు డిమాండ్ పుంజుకుంటుందన్న ఆశలు అంతంతమాత్రమే. ముంచెత్తిన వానలు, కట్టలు తెగిన చెరువులు, పొంగిన నాలాలు దసరా పండుగ అనే మాటనే మర్చిపోయేలా చేశాయి. ప్రాణాలరచేతిలో పెట్టుకుని, పిల్లాపాపలతో బతుకుజీవుడా కాలం వెళ్ల దీస్తున్న దయనీయ స్థితి. ఎపుడు ఏవైపు నుంచి మబ్బులు కమ్మేస్తాయో తెలియదు..ఎటునుంచి వరద ముంచుకొస్తుందో తెలియని గందరగోళ పరిస్థితులలో నగర ప్రజ కాలం వెళ్లదీస్తోంది. దీంతో నగర వ్యాపారంపైనే ఎక్కువగా ఆధారపడే గ్రామీణ విక్రేతలు, చిన్న వ్యాపారస్తులు మరింత సంక్షోభంలో పడిపోయారు. బోసిపోయిన షాపింగ్ మాల్స్ పండుగ వచ్చిందంటే పిల్లాపాపలకు కొత్తబట్టల సందడి. దీంతో దసరా, దీపావళి పండుగలకు ఇసుక వేస్తే రాలనంతగా పలు షాపింగ్ మాల్స్ కిటకిట లాడిపోయేవి. ఒక దశలో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయ్యేంతగా కొనుగోలు దారులు బారులు తీరేవారు. కానీ ఏడాది దసరా పండుగ సందర్భంగా సీన్ రివర్స్. కొనుగోలుదారులు లేక షోరూంలు బోసిపోయాయి. అసలే కోవిడ్-19 దెబ్బకు దిగాలు పడిన వ్యాపారులు ఈ వరదలతో మరింత బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయో, ఎప్పటికి వ్యాపారం పుంజుకుంటుందో తెలియని అయోమయం. అయితే చెడుపై మంచి విజయం సాధించినట్టుగా, అజ్ఞాతవాసానికి స్వస్తి చెప్పిన పాండవులను విజయం వరించినట్టుగా తమకూ మంచిరోజులు రావాలని పిల్లాపెద్దా వేయి దేవుళ్లకు మనసులోనే మొక్కుతున్నారు. -
మంగ్లీ ఎక్స్‌క్లూజివ్ సాంగ్
-
కూకట్‌పల్లిలో బతుకమ్మ వేడుకలు
-
మంచి బతుకునీయమ్మా బతుకమ్మా
మన పూర్వీకులు ఇనుము – ఉక్కు తయారీకి తంగేడుచెక్కను వాడేవారట. తోలుతయారీకి తంగేడు ఎంత అవసరమో అందరికి తెలుసు. గునుగుకు నీళ్ళను శుభ్రపరిచే గుణముంది. తమకు నిత్యజీవితావసరాలైన తంగేడు, గునుగుపూలతో మనపూర్వీకులు తమ అమ్మదేవతని పూజించే రూపమే పరిణామంలో జాతరగా మారివుంటుంది. గునుగు, తంగేడుపువ్వులతో కొప్పురం రూపంలో పూలబతుకమ్మను పేర్చి, శిఖరం లేదా సిగమీద గుమ్మడి పువ్వుంచి, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. పూజపువ్వులను తొక్కుట్లవెయ్యని ఆచారమే బతుకమ్మలను నీళ్ళలో వదిలే సంప్రదాయమైంది. సాధారణంగా హిందువులు ఆచరించే పండుగలన్నిట్లో అటు సామాజిక ఇటు శాస్త్రీయ కోణాలు దర్శనిమిస్తాయి. అంతర్లీనంగా సమాజానికి తమ కర్తవ్యాన్ని గుర్తుకు తెస్తాయి. అయితే... బతుకమ్మ పండగకు ప్రకృతి రమణీయతకు విడదీయరాని అనుబంధం ఉందనేందుకు నిదర్శనంగా బతుకమ్మలను ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలు, ఆకులతో ఆకర్షణీయంగా తయారు చేసి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకుంటుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు ‘బొడ్డెమ్మ‘ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ ఎలా పుట్టింది? జానపదులు తమకు సంతు కలగాలని, పుట్టిన పిల్లలను చల్లగా చూడమని అమ్మదేవతల ముందు కట్టిన ముడుపులు, మొక్కులు చెల్లించుకుంటారు. కొంతమంది పుట్టిన పిల్లలు పుట్టినట్లు చనిపోతుంటే, పిల్లలు పుట్టిన వెంటనే పెంట మీద వేసి తెచ్చుకుని ‘పెంటమ్మ లేదా పెంటయ్య’ అని పేరు పెట్టుకుంటారు. మరి కొందరు పుట్టినపిల్లల్ని ఎవరికైనా ఇచ్చి ‘బిచ్చంగా’ తిరిగియ్యమని కోరుకుంటారు. అట్లా తీసుకున్న పిల్లలకు ‘భిక్షపతి, భిక్షమ్మ’లని పేరు పెట్టుకుంటారు. వాళ్ళే బుచ్చపతి, బుచ్చమ్మలుగా పిలువబడు తుంటారు. ఇట్లాంటి సందర్భాల్లోనే బతుకనిపిల్ల బారెడనే సామెతలు పుట్టాయి. పిల్లల్ని బతికించమనే వేడుకునే దేవతల్లో బతుకమ్మ ఒక దేవత. ఆ దేవత వరాన బతికితే బతుకమ్మ, బతుకయ్యలని పేర్లు పెట్టుకుంటారు. ఈ పూలపండుగ బతుకమ్మ ఎంగిలిపూలతో మొదలుపెట్టి సద్దులబతుకమ్మతో ముగిసిపోతుంది. బొడ్డెమ్మ పండుగ నాడు ‘బొడ్డెమ్మ బొడ్డెమ్మా వలలో, బిడ్డాలెందారే.. వలలో’ అని పాడే పాట సంతానం గురించే కదా. నాటి రోజుల్లో నీళ్ళాడే(ప్రసవ)సమయాల్లో శిశుమరణాలు జాస్తిగా వుండేవి. నీటిరేవులే ఆనాటి తల్లులకు ప్రసూతిస్థలాలు. నీళ్ళల్లో ప్రసవించే సమయంలో తల్లులు తమ సంతు బతికినందుకు ప్రతీకగా నీటివారన పెరిగే తంగేడు, గునుగు పూలముద్దలను నిమజ్జనం చేసి వుంటారు. ఆ తల్లుల ఆచారమే బతుకమ్మపండుగగా మారివుంటుంది. ఇది తెలంగాణా ప్రాంతానికే చెందడం మన గొప్ప సంస్కృతికి సాక్ష్యం. కూష్మాండినికి ప్రతీకగా గుమ్మడిపువ్వును పూజించే ఆచారమే బతుకమ్మగా మారిందని కొందరి అభిప్రాయం. బతుకమ్మ వెనుక బౌద్ధం? బతుకమ్మల తయారీలో చాలా భేదాలు కనిపిస్తాయి. బతుకమ్మలు స్తూపాల ఆకారంలో వుంటాయి. లింగాల తయారీలో కూడా ఇటువంటి సంప్రదాయముందని చాలాచోట్ల చెప్పబడింది. పూర్వం బౌద్ధులు తమ ఆరాధనలో భాగంగా చేసుకున్న స్తూపాలను పూలు, మట్టి, ఇసుక, పేడ, రాయి, ఇటుకలతో తయారు చేసుకునేవారు. బౌద్ధభిక్షుకులు నిరంతరం ప్రయాణిస్తుండడం వల్ల స్తూపారాధనకు తమకు దొరికిన వాటినే స్తూపాలుగా చేసుకుని బుద్దునికి ప్రతీకగా నమస్కరించేవారు. పూలు, ఇసుక, మట్టి, పేడ స్తూపాలను నీటిలో కలిపేసేవారు మర్యాదగా. వాళ్ళు తిరుగాడిన ప్రదేశాల్లోని ఎన్నో వాగులు, ప్రవాహాలు భిక్కేరులుగా పిలువబడుతున్నది ఒక్క తెలంగాణలోనే. అందువల్లనే తొలుత బౌద్ధులైన గిరిజనులు, వనజనులు ఈ ఆచారాన్ని కొనసాగించి వుంటారు. దానికి వారి కోరికలు మన్నించిన అమ్మదేవతకు ప్రతీకగా తర్వాత చేసుకుని వుంటారు. పిదప కాలాల్లో వచ్చిన మతపరిణామాలవల్ల ఈ దేవతలను తమ తమ మతదేవతలు గా చేసుకున్నారు. ఆ దేవతలే బౌద్ధంలో హారీతిగా, జైనంలో ఆమ్రకూష్మాండినిగా, హిందూమతంలో అంబికగా పూజింపబడ్డారు. తెలంగాణాలో అతిప్రాచీనమైన అమ్మదేవతల ఆరాధనమే తల్లులరూపంలో ఏ దేవత వచ్చినా తమదేవతల్లో కలుపుకున్న సంప్రదాయమే బతుకమ్మజాతరగా నిలిచిపోయింది. దసరాపండుగతో బతుకమ్మను కలుపడం, అమ్మదేవతలను కాకుండా పితృదేవతలను పూజించే ఆచారంగా మారడం ‘పెత్రామాస’(పితృ అమావాస్య) ను ఈ పండుగలో చేర్చడం తర్వాతి కాలాల్లో వచ్చిన పరిణామమే. ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. అలాగే జొన్న పంట కోతకు సిధ్ధంగా తలలూపుతూ ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని రంగు రంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు.. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. పాటల వెనుక ఉండే మర్మం ఇదే.. –శ్రీకాంత్ శర్మ, హిందూ ధర్మచక్రం -
17న ఎంగిలిపూల బతుకమ్మ
సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవాలనే అంశంపై గందరగోళం నెలకొంది. దీన్ని తెరదించడానికి తెలంగాణ రాష్ట్ర వైదిక పురోహిత సంఘం బాధ్యులు మంగళవారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ‘కుడా’ గార్డెన్స్‌లో సమావేశమయ్యారు. పండుగల నిర్వహణపై చర్చించి ప్రజల సందేహాలను నివృత్తి చేస్తూ పలు తీర్మానాలు చేశారు. ఈ నెల 17వ తేదీ గురువారం భాద్రపద బహుళ అమావాస్య (పితృ అమావాస్య) రోజున ఎప్పటిలాగే పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడంతో పాటు అదేరోజు ఆనవాయితీ ప్రకారం ఎంగిలిపూల బతుకమ్మ జరుపుకోవాలని సూచించారు. నెల రోజుల తర్వాత అక్టోబర్ 17వ తేదీ శనివారం నిజ ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి తిథి మొదలు 8 రోజుల పాటు బతుకమ్మ ఆడుకొని అదే నెల 24వ తేదీ శనివారం ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) రోజున సద్దుల బతుకమ్మ జరుపుకోవాలన్నారు. గతంలో 1963, 1982, 2001ల్లో కూడా ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ మధ్య నెల రోజుల వ్యవధి వచ్చిందని ఈ సందర్భంగా పండితులు గుర్తు చేశారు. ఈ సమావేశంలో పురోహిత సంఘం రాష్ట్ర కన్వీనర్ తాండ్ర నాగేంద్రశర్మ, పండితులు ఎల్లంభట్ల సీతారామశాస్త్రి, తాండ్ర పిచ్చయ్యశాస్త్రి, వెలిదె యుగేందర్‌శర్మ, డాక్టర్ ప్రసాద్‌శర్మ, మరిగంటి శ్రీకాంతాచార్య, డింగరి వాసుదేవాచార్యులు, గుదిమెళ్ల విజయకుమారాచార్యులు, గంగు సత్యనారాయణశర్మ, డాక్టర్ శేషభట్టార్ వెంకటరమణాచార్యులు, మెట్టెపల్లి హరిశర్మ, పీతాంబరి శ్రీకాంతాచార్యులు, బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు. -
భాగ్యనగరం.. బతుకమ్మ వనం
-
అబుదాబిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
అబుదాబి : తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని తెలంగాణవాసులు ఆదేశ రాజధాని అబుదాబిలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. అక్కడి తెలంగాణ సంఘం గత నెలరోజులుగా ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసింది. ఈ అద్భుత కార్యక్రమానికి స్థానిక ఇండియన్ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదికైంది. అయితే ఎడారి ప్రాంతం కావడం వల్ల పూలు దొరకడం చాలా కష్టం. కొనుగోలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో నిర్వాహకులు ఇండియా నుంచి రకరకాల పూలను, వందల కిలోల్లో తెప్పించి అబుదాబిని పూలవనంగా మార్చారు. శనివారం ఉదయం ఇండియా నుంచి తెచ్చిన తీరొక్క పూలతో, పల్లె వాతావరణాన్ని తలపించేలా ముస్తాబు చేశారు. ఈ వేడుక కోసం వందలాది మహిళలు, చిన్నారులు నెల రోజులు కష్టపడి రూపొందించిన నృత్య ప్రదర్శనలతో, బతుకమ్మ పాటలతో ప్రాంగణాన్ని మార్మోగించారు. ఇండియా నుంచి వచ్చిన ప్రమఖ కవి గాయకులు కోకిల నాగరాజు, సాయిచంద్‌లతో పాటు టీన్యూస్లోని ధూమ్‌ధామ్ ముచ్చట్లు యాంకర్ కుమారి ఉదయ శ్రీలు వివిధ రకాల ఆటపాటలతో ప్రేక్షకులను అలరించారు. అనంతరం తెలంగాణ సాంప్రదాయం ప్రతిబింబించేలా డప్పు వాయిద్యం, కోలాటాల సందడి మధ్యలో అన్ని బతుకమ్మలను ప్రాంగణానికి తోడ్కొని వెళ్లారు. ఈ కార్యక్రమంలో జంటల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ నుంచి తెప్పించిన పిండి వంటలు అందరినీ విశేషంగా ఆకర్షించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యుఏఈలోని భారత రాయబార కార్యాలయంలో ఫస్ట్ సెక్రటరీ శ్రీమతి పూజ వెర్నెకర్, ఐఎఫ్ఎస్ అధికారిణి హాజరయ్యారు. వారుకూడా తెలంగాణ మహిళలతో బతుకమ్మ ఆడిపాడారు. తదనంతరం కార్యక్రమ నిర్వాహకులు 10 అందమైన బతుకమ్మలకు, ప్రాంగణానికి మొదటగా వచ్చిన 5 బతుకమ్మలకు, అందంగా ముస్తాబైన చిన్నారులకు, చక్కగా బతుకమ్మ నాట్యం చేసిన మహిళలకు, జంటలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదాతలైన బూర్జిల్ హాస్పిటల్, పే ఇట్, రాయల్ రెజిస్, ఎస్పాకో, ఎన్ఎంసి, యుఏఈ ఎక్సేంజ్, ఆసమ్ సలోన్, రోచన గ్రూప్ వారిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. చివరగా గౌరీపూజ చేసి బతుకమ్మను కృతిమ కొలనులో నిమజ్జనం చేశారు. అనంతరం ప్రసాదాలు తీసుకుని, విందు భోజనం చేశారు. ఈ కార్యక్రమాన్నిగోపాల్, వంశీ, కమలాకర్, శ్రీనివాస్, సాగర్, గంగన్న, సంతోష్, జగదీష్, రాజశ్రీనివాస రావు, అశోక్ , శ్రీనివాస్ రెడ్డి, పావని, అర్చన, వనిత, మంజు, సౌజన్య , లక్ష్మి, సుధ తదితరులు దగ్గరుండి నడిపించారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఉత్సవాలను విదేశాలలో ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని నిర్వాహకులు తెలియజేశారు. -
ఇస్తే రెండు చీరలివ్వండి.. లేకపోతే వద్దు !
సాక్షి, సంగారెడ్డి : బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం ఇచ్చే చీరలను శనివారం మహిళలు తిరస్కరించారు. మాకు గతేడాది చీరలు ఇవ్వలేదనీ, ఈ ఏడాదీ మాకు చీరలివ్వవద్దంటూ పట్టుబట్టారు. ఇవ్వదల్చుకుంటే గతేడాది, ఈ ఏడాదికి కలిపి రెండు చీరలు ఇవ్వాలని లేకపోతే వద్దని ఆ మహిళలు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్ మండలం గొంగుళూర్, చౌటకూర్ గ్రామాల్లో జరిగిందీ సంఘటన. ఈ సందర్భంగా రెండు గ్రామాల్లో అధికారులు, మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. గతేడాది ఎన్నికల కారణంగా చీరలు ఇవ్వలేకపోయామని అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. -
తెలంగాణ : ఉత్సాహంగా మొదలైన బతుకమ్మ వేడుకలు
-
ఐక్యతకు ప్రతీక బతుకమ్మ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐక్యత, సామరస్యాలకు ప్రతీక బతుకమ్మ పండగ సంబురాలని సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే బతుకమ్మ సంబురాల కార్యక్రమంపై హరిత ప్లాజాలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ సమీక్ష నిర్వహించారు. బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల పూల పండుగ కరపత్రాలను విడుదల చేశారు. ఈ నెల 28 నుంచి వరంగల్ జిల్లాలో భద్రకాళి అమ్మవారు ఆలయంలో 10 వేల మంది ఆడపడుచులతో బతుకమ్మ ప్రారంభం అవుతుందని తెలిపారు. బతుకమ్మ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలని మహిళలకు పిలుపునిచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణలోనే ఉందని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు రోజుకోక బతుకమ్మను అలంకరించి ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. -
వీర పోరాటాల గడ్డ తెలంగాణ
సాక్షి, సప్తగిరికాలనీ(కరీంనగర్): ‘తెలంగాణ చరిత్ర ఐదు వేల సంవత్సరాలది. నాలుగు వేల సంవత్సరాల కింద ఇనుప పనిముట్లు, కత్తులు తదితర వస్తువుల తయారీ ఇక్కడే జరిగింది.. పురావస్తు శాఖ తవ్వకాల్లో మనకు ఆధారాలు దొరికాయి.. ఎందరో త్యాగాల ఫలితం.. వీర పోరాటాల గడ్డే మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం..’ అని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రజ్ఞా భారతి, ఇతిహాస సంకలన సమితి ఆధ్వర్యంలో మూడు రోజులుగా కరీంనగర్లో నిర్వహిస్తున్న తెలంగాణ వైభవం కార్యక్రమం ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌తో కలిసి ఆయన హాజరై ప్రసంగించారు. సంసృతి లేకపోతే మనం లేమని, విలువలు క్షీణిస్తున్న ఈ రోజుల్లో పిల్లలు, యువతరానికి నిజమైన తెలంగాణ గొప్పతనం తెలియ చేయడం చాలా మెచ్చుకోదగ్గ విషయమని, రాబోయే రోజుల్లో ప్రాచీన తెలంగాణ వైభవాన్ని అన్ని జిల్లాల్లో ఇటువంటి సదస్సులు, సమావేశాల ద్వారా విసృతం చేయాలని తెలిపారు. అస్థిత్వాన్ని నిలబెట్టుకోవాలంటే చరిత్రను మరువద్దుని సూచించారు. సర్ధార్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా నిజాం రజాకార్ల రాక్షసత్వాన్ని అణచివేసి మనకు నిజమైన స్వాతంత్య్రాన్ని 1948 సెప్టెంబర్ 17న తెచ్చిపెట్టారని గుర్తు చేశారు. పటేల్‌కు తెలంగాణ ఎప్పుడూ రుణపడే ఉంటుందన్నారు. తెలంగాణ వైభవాన్ని అందరికీ తెలిసేలా చేసిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ కొందరు తెలంగాణ చరిత్రను తిరగేస్తున్నారని, వారి చరిత్రే రాబోయే తరాల కు అందించాలని వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉద్యమాలు చేస్తుంటే అవి పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. బతుకమ్మ అంటే మనకు గౌరమ్మ అని, గౌరమ్మను దేవతగా పూజిస్తుంటే ఆ బతుకమ్మను డిస్కో ఆటగా మారుస్తున్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా పటేల్ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. నాడు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పటేల్ ఫొటో పెట్టుకొని దేని కోసం ఉద్యమాలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక సెప్టెంబర్ 17న గొప్పగా చేసుకొందామన్న వారు ఇప్పుడు మరువడం విడ్డూరమన్నారు. పటేల్, కుమురంభీం, చాకలి అయిలమ్మ, రాణి రుద్రమాదేవి వంటి వాళ్లను మరిచి నేడు నిజాం సమాధి వద్ద మోకారిళ్లుతున్నారని విమర్శించారు. ప్రజ్ఞాభారతి రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు ఎల్.రాజభాస్కర్ రెడ్డి, డి.నిరంజనాచారి మాట్లాడుతూ మూడు రోజుల్లో 2600 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలంగాణ వైభవాన్ని చూపించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకలన సమితి రాష్ట్ర, జిల్లా బాధ్యులు బూర్ల దక్షిణమూర్తి, రాజేందర్ చడ్డా, దత్తాత్రేయ శాస్త్రీ, గిరిధర్, రఘు, గాజుల రవీందర్, నంది శ్రీనివాస్, మురళీ మనోహరచారి, విద్యాసంస్థల భాద్యులు అనంతరెడ్డి, రమణారావు, శ్రీనివాస్‌రావు, రాజేశ్, వేద సం హిత, సత్యగిరి, విజయభారతి పాల్గొన్నారు. ప్రదర్శనలను తిలకించిన గవర్నర్.. తెలంగాణ వైభవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆదివారం రాత్రి హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ బండి సంజయ్‌కుమార్ తిలకించారు. పురాతన కాలం నాటి నాణేలు, తెలంగాణ సంసృతిని చూపెట్టిన సమ్మక్క సారలమ్మ, ఎలగందుల ఖిల్ల, గోల్కొండ ఫోర్టు, బతుకమ్మ తదితర ప్రదర్శనలను తిలకించారు. అనంతరం పలువురు విద్యాసంస్థలకు బాధ్యులకు గవర్నర్ జ్ఞాపికలను బహూకరించారు. కాగా గవర్నర్‌ను ప్రజ్ఞా భారతి, ఇతిహాస సంకలన సమితి బాధ్యులు ఘనంగా సన్మానించారు. -
‘బతుకమ్మ పండుగను విజయవంతం చేయాలి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో బతుకమ్మ ఏర్పాట్లను నిర్వహిస్తామని ఆబ్కారి, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై మంగళవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మ ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజుల పాటు రాష్ట్రంలో అంగరంగ వైభవంగా జరపాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలతో సమనవ్యయం చేసుకొని బతుకమ్మ పండగను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, టూరిజం కమిషనర్ సునీతా భగవత్, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పర్యాటక శాఖ అధికారులు మహేష్, ఎస్ఈ అశోక్ పాల్గొన్నారు. -
పండుగకు ముందే బతుకమ్మ చీరలు
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ సందర్భంగా ఏటా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరలను ఈ ఏడాది నిర్ణీత గడువులోగా లబ్దిదారులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుండగా, గతేడాది ముందస్తు అసెంబ్లీ ఎన్నికల మూలంగా చీరల పంపిణీలో జాప్యం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎలాంటి అవాంతరాలు లేకుండా పండుగ నాటికి చీరల పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో బతుకమ్మ చీరల కోసం రూ.320 కోట్లు విలువ చేసే 6.84 కోట్ల మీటర్ల వ్రస్తాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మేరకు సిరిసిల్లలోని వివిధ యాజమాన్యాల పరిధిలో ఉన్న మరమగ్గాలకు చీరల నేత అప్పగించారు. ఇప్పటివరకు 4.67 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి జరగ్గా.. కోటి చీరలకు గాను 60 లక్షల చీరల తయారీ పూర్తయింది. జిల్లాల వారీ లక్ష్యాలకు అనుగుణంగా ఇప్పటివరకు 25 లక్షల చీరలను సరఫరా చేయగా, ఈ నెలాఖరులోగా 50 లక్షల చీరలను జిల్లాలకు చేరవేస్తారు. ప్రత్యేక లోగోతో బతుకమ్మ చీరలు.. ఈ ఏడాది బతుకమ్మ చీరల తయారీలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బంగారు జరీ వర్ణం అంచుతో.. వృద్ధుల కోసం ఆరు గజాలు, మిగతా వారికి ఫ్యాన్సీ చీరలు తయారు చేస్తున్నారు. 80 రంగుల్లో ఉన్న చీరలకు జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ (నిఫ్ట్) నిపుణులు డిజైనింగ్ చేశారు. ఏటా లక్షల సంఖ్యలో చీరల తయారీ జరుగుతున్న నేపథ్యంలో గద్వాల, పోచంపల్లి చీరల తరహాలో సిరిసిల్ల చీరలకు ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. సిరిసిల్ల చీరలకు ప్రాచుర్యం తెచ్చేందుకు బతుకమ్మ చీరలపై శిరిశాల లేదా శ్రీశాల పేరిట ప్రత్యేక లోగోను తయారు చేయాలని చేనేత శాఖ నిర్ణయించింది. మూడేళ్లలో రూ. 900 కోట్ల ఆర్డర్లు.. సిరిసిల్లలో వివిధ యాజమాన్యాల పరిధిలో 23 వేలకు పైగా మరమగ్గాలు ఉండగా, వీటిలో 17 వేలకు పైగా మగ్గాలపై బతుకమ్మ చీరల తయారీ కొనసాగుతోంది. రోజుకు తొమ్మిది లక్షల మీటర్ల బతుకమ్మ చీరల వస్త్ర ఉత్పత్తి జరుగుతుండగా.. సిరిసిల్ల మరమగ్గాల కార్మికులకు ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు క్రమం తప్పకుండా వస్తున్నాయి. బతుకమ్మతో పాటు రంజాన్, క్రిస్మస్ కానుకలు, కేసీఆర్ కిట్లు, యూనిఫామ్‌లకు సంబంధించిన వస్త్ర ఉత్పత్తి ఇక్కడే జరుగుతోంది. వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి మూడేళ్లలో రూ.900 కోట్ల మేర ఆర్డర్లు అందాయి. 9,435 మంది కారి్మకులు బతుకమ్మ చీరల తయారీతో ఉపాధి పొందుతుండగా.. గతంలో వీరి నెలవారీ ఆదాయం రూ.8,000 లోపే ఉండేది. ప్రస్తుతం సగటున ఒక్కో కారి్మకుడికి రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం లభిస్తున్నట్లు చేనేత శాఖ అంచనా వేస్తోంది. -
సెప్టెంబర్ 15 నాటికి బతుకమ్మ చీరలు
సాక్షి, హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీలో గతంలో తలెత్తిన అవాంతరాలను దృష్టిలో పెట్టుకుని.. ఈ ఏడాది చీరల తయారీని సెప్టెంబర్ 15లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు నిర్దేశించింది. 6.30 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి జరగాల్సి ఉండటంతో.. ఫిబ్రవరిలోనే చేనేత సహకార సంఘాలకు చీరల తయారీకి చేనేత సహకార సంఘాల సమాఖ్య ఆర్డర్ ఇచ్చింది. గతంతో పోలిస్తే రంగులు, డిజైన్ల ఎంపికలోనూ వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ వివిధ రంగుల్లో 50 రకాలైన చీరలను ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరులోగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలో 2017 నుంచి అర్హులైన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చీరలు పంపిణీ చేస్తోంది. రెండేళ్లుగా సుమారు 90లక్షల మందికి పైగా ఉచితంగా చీరలు పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది 95లక్షల చీరల పంపిణీని లక్ష్యంగా నిర్దేశించింది. చీరల తయారీ బాధ్యతను సిరిసిల్లలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు అప్పగించారు. బతుకమ్మ చీరల పంపిణీకి సంబంధించి తొలి ఏడాది.. అనగా 2017లో ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడంతో.. సిరిసిల్ల చేనేత సహకార సంఘాలు సకాలంలో చీరల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించలేక పోయాయి. దీంతో 3.75కోట్ల మీటర్ల వస్త్రాన్ని సిరిసిల్ల మరమగ్గాల మీద సిద్ధం చేయగా, మరో 2.36కోట్ల మీటర్ల వస్త్రాన్ని గుజరాత్‌లోని సూరత్ నుంచి దిగుమతి చేసుకున్నారు. సూరత్ నుంచి దిగుమతి చేసుకున్న వస్త్రం నాణ్యతపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో 2018 బతుకమ్మ చీరల తయారీకి సంబంధించిన ఆర్డర్‌ను పూర్తిగా సిరిసిల్ల నేత కార్మికులే స్థానికంగా మరమగ్గాలపై సిద్ధం చేశారు. సుమారు 6 కోట్ల మీటర్ల వస్త్రాన్ని సకాలంలో సిద్ధం చేసినా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బతుకమ్మ చీరల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. దీంతో ఎన్నికలు ముగిసిన తర్వాత గత ఏడాది డిసెంబర్ మూడో వారంలో ఈ చీరల పంపిణీ ప్రారంభించి..ఈ ఏడాది జనవరి వరకు పంపిణీ ప్రక్రియ కొనసాగించారు. టెస్కో ద్వారా రూ.450 కోట్ల ఆర్డర్లు తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్ (టెస్కో) ద్వారా రాష్ట్రంలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు ఈ ఏడాది సుమారు రూ.450 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కాయి. ఈ ఏడాది రూ.280 కోట్లు బతుకమ్మ చీరల రూపంలో సిరిసిల్ల చేనేత సహకార సంఘాలకు ఆర్డర్ లభించింది. వీటితో పాటు రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా పంపిణీ చేసే వస్త్రాల ఉత్పత్తి ఆర్డర్ కూడా ఈ సంఘాలకే దక్కింది. కేసీఆర్ కిట్ల ద్వారా బాలింతలకు ఇచ్చే చీరలతో పాటు, వివిధ ప్రభుత్వ సంక్షేమ శాఖలకు సంబంధించి దుప్పట్లు, కార్పెట్ల తయారీ ఆర్డర్లను సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ జిల్లాలోని చేనేత సహకార సంఘాలకు అప్పగించారు. ఇదిలా ఉంటే బతుకమ్మ చీరల ద్వారా ఉపాధి పొందుతున్న సిరిసిల్ల చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం నుంచి బకాయిలు సకాలంలో విడుదల కావడం లేదు. గత ఏడాది బతుకమ్మ చీరలు, రంజాన్ వస్త్రాల తయారీకి సంబంధించి టెస్కో నుంచి రూ.25 కోట్ల మేర ఈ సంఘాలకు విడుదల కావాల్సి ఉంది. 95 లక్షల మందికి పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బతుకమ్మ చీరల పంపిణీకి రెండేళ్లుగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ మూడో వారంలో లబ్ధిదారులకు చీరలు అందేలా చేనేత శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ముదురు రంగులతో కూడిన 50 రకాలైన డిజైన్లను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిపుణులు రూపొందించారు. చీర అంచులు, కొంగు డిజైన్లలో వైవిధ్యం ఉండేలా రూపొందించడంతో పాటు, చీరతో పాటు రవిక బట్టను కూడా అందిస్తారు. ఈ ఏడాది సుమారు 6.30 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తి చేయాలని సిరిసిల్ల చేనేత సహకార సంఘాలకు ఆర్డర్ ఇవ్వగా.. 95లక్షల మందికి చీరలు పంపిణీ చేయనున్నారు. వీటి తయారీ ద్వారా సిరిసిల్లలో 22వేలకు పైగా మరమగ్గాలపై ఆధారపడిన 20వేల మంది చేనేత కార్మికులకు సుమారు ఆరు నెలల పాటు ఉపాధి దక్కనుంది. గతంలో సగటున నెలకు రూ.6 వేల నుంచి రూ.8వేల వరకు వేతనం పొందిన కార్మికులు.. ప్రస్తుత ఆర్డర్లతో సుమారు రూ.20వేల వరకు ఆర్జిస్తున్నారు. -
లండన్‌లో చేనేత బతుకమ్మ సంబరాలు
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్ లో చేనేత బతుకమ్మ దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి వెయ్యి మందికి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని టాక్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం అన్నారు. అదే స్పూర్తితో రాష్ట్ర ఆపదర్మ మంత్రి కేటీఆర్ కృషికి తమ వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ఈ సంవత్సరం కూడా వేడుకలను 'చేనేత బతుకమ్మ దసరా సంబరాలు' గా జరుపుకున్నామన్నారు. టాక్ పిలుపు మేరకు హాజరైన ప్రవాసులు చేనేత బట్టలు ధరించి పాల్గొనడం తమకెంతో సంతోషాన్ని, స్ఫూర్తినిచ్చిందని ఈవెంట్స్ ఇంచార్జ్ అశోక్ గౌడ్ దూసరి తెలిపారు. కల్చరల్ ఇంచార్జ్ సత్య చిలుముల మాట్లాడుతూ, దసరా పండుగ సందర్బంగా స్వదేశం నుండి తెచ్చిన శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఏర్పాటు చేసిన దసరా 'అలాయ్ బలాయ్' అందరిని ఆకట్టుకుందన్నారు. చేనేత శాలువాలను ఒకరికొరకు పరస్పరం వేసుకొని, జమ్మి(బంగారం)ని ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకొని, చేనేతకు చేయూతగా వీలైనన్ని సందర్భాల్లో చేనేత బట్టలు దరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. హాజరైన ప్రవాస సంఘాల ప్రతినిధులు ఐక్యతను చాటుతూ మనమంతా ఒకటే అంటూ చేయి చేయి కలిపి అభివాదం చేశారు. జమ్మి ఆకులు పంచుకుంటూ లండన్ పట్టణానికి ‘అలాయ్ బలాయ్’ ల తెలంగాణ స్నేహమాధుర్యాన్ని ప్రత్యక్షంగా రుచి చూపించారని పలువురు ప్రశంసించారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ, దసరాపండగ సందర్బంగా మహిళలందరు భక్తిశ్రద్ధలతో గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటలతో, కోలాటాల నృత్యాలతో, చప్పట్లు కలుపుతూ, రంగు రంగుల బతుకమ్మలతో సందడి చేశారు. బతుకమ్మల మధ్య చార్మినార్ ఆకృతితో పూలతో అలంకరించిన ప్రతిమ వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విదేశాల్లో స్థిరపడ్డా కానీ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటల్లో పాల్గొనడమే కాకుండా, చిన్న చిన్న బతుకమ్మలతో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు. ఈ కార్యక్రమంలో భారత హై కమీషన్ ప్రతినిధి అమిత్ శర్మతో పాటు ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ.. ఈ వేడుకల్లో భాగంగా గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నట్టు పండుగకి వచ్చే ప్రతీ ఒక్కరినీ చేనేతవస్త్రాలు ధరించాలని కోరామని, అలాగే చాలామంది చేనేత వస్త్రాలు ధరించడం సంతోషంగా ఉందన్నారు. పండగకు అడబిడ్డలను చేనేత శాలువాలతో సత్కరించిన కేటీఆర్‌కు, యూకే అడబిడ్డల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న ఎంపీ కవితకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కవితతో కేవలం పోస్టర్ ఆవిష్కరణ మాత్రమే కాకుండా, వారి ఆలోచలనకు ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపకుడు, ఎన్నారై టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, టాక్ అధ్యక్షులు పవిత్ర రెడ్డి కంది, ఉపాధ్యక్షులు సేరు సంజయ్, స్వాతి బుడగం, ముఖ్య సభ్యులు గోపాల్ మేకల, మట్టా రెడ్డి, వెంకట్ రెడ్డి దొంతుల, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ జెల్ల, అశోక్ గౌడ్ దూసరి, రత్నాకర్ కడుదుల, మల్లా రెడ్డి, రంజిత్ చాతరాజు, సాయి బూరుగుపల్లి, సత్యం కంది, వంశీ వందనపు, వేణు గోపాల్ రెడ్డి, గణేష్ పాస్తం, రాకేష్ పటేల్, నవీన్ భువనగిరి, రవి రత్తినేని, రవి ప్రదీప్ పులుసు, సత్య చిలుముల, శ్రీధర్ రెడ్డి, రాజేష్ వర్మ, రవి కిరణ్, వెంకీ సుధీరెడ్డి, సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, జస్వంత్, భరత్ బాశెట్టి, వేణు నక్కిరెడ్డి వంశీ పొన్నం, రాజేష్ వాకా, నగేష్ బచ్చనబోయిన, రవీందర్ రెడ్డి, సతీష్ రెడ్డి బండ మహిళా విభాగం సభ్యులు, సుప్రజ పులుసు, ప్రవల్లిక భువనగిరి, క్రాంతి రత్తినేని, శ్రావ్య వందనపు, మమత జక్కీ, శ్వేతా మహేందర్, ప్రియాంక తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు. -
డల్లాస్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
డల్లాస్ : తెలుగు పీపుల్స్ అసోసియేషన్ (టీపాడ్) ఆధ్వర్యంలో అమెరికాలోని డల్లాస్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ సంబరాల్లో నటి అనూ ఇమ్మాన్యుయేల్ ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ ఆడి, జమ్మి పూజలో పాల్గొన్నారు. డల్లాస్‌లోని అలెన్ ఈవెంట్ సెంటర్‌ని మహిళలు, యువతులు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. టీపాడ్ సభ్యులతో పాటు, పక్కనున్న ఓక్లాహోమా, కన్సాస్, ఆర్కాన్సాస్ రాష్ట్రాలకు చెందిన భారతీయులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. టీపాడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాల్లో దాదాపు 10 వేల మంది పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వేణు భాగ్యనగర్, విక్రమ్ జనగాం, జయ తెలకపల్లి, రత్న ఉప్పల, నరేష్ సంకిరెడ్డి, సతీష్ నగిల్లా, కళ్యాణి తాడిమెటి, గంగ దేవర, అనురాధ మేకల, లక్ష్మీ పొరెడ్డి, బుచి రెడ్డి గోల్, వంశీ కృష్ణ ఉప్పలదాడియం, అపర్ణ కొల్లూరి, అనుష వనం, జయశ్రీ మురుకుట్ల, అపర్ణ ఎద్దుల, రేణుక చనుమోలు, శ్రీనివాస్ తుల, శ్రీనివాస్ కంచర్ల, రవీంద్రనాథ్ దూళిపల్లి, స్వప్న తుమ్మపాల, శశిరెడ్డి కర్రి, వందన గౌరు, మాధవి మెంట, మంజుల తొడుపునూరి, గాయత్రి గిరి, మాధవి ఓంకార్, శ్రీనివాస్ అన్నమనేని, శ్రీనివాస్ కూటికంటి, శ్రవణ్ నిదిగంటి, శ్రీకాంత్ రౌతు, తిల్క వన్నంపుల, శరత్ పున్రెడ్డి పాల్గొన్నారు. -
ట్యాంక్‌బండ్ : ఘనంగా సద్దుల బతుకమ్మ
-
సద్దులకు సిద్ధం
-
విశ్వవ్యాప్త సౌరభం!
-
సిడ్నీలో బతుకమ్మ సంబరాలు
సిడ్నీ : సిడ్నీ నగరంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఆస్ట్రేలియన్ స్టేట్ అసోసియేషన్ (ATSA) ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. దాదాపు వెయ్యి మంది మహిళలు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు. ఆటపాటలు, కోలాటాలతో ఆ ప్రాంతం అంతా సందడిగా మారింది. నార్త్మీడ్ హైస్కూల్ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలను జరుపి అనంతరం.. ప్యారమట్ట నదిలో నిమజ్జనం చేశారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఈ బతుకమ్మ సంబరాల్ని జరుపుకున్నామని, గత పదమూడు సంవత్సరాలుగా జరుపుకుంటున్న ATSA వేడుకలన్నంటికి ఈ బతుకమ్మ వేడుక తలమానీకమని ATSA అధ్యక్షుడు రవిందర్ చింతామణి అన్నారు. -
సింగపూర్‌లో బతుకమ్మ సంబరాలు
సింగపూర్ : సింగపూర్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సింగపూర్ తెలంగాణ ఫ్రెండ్స్, సింగపూర్ తెలుగు సమాజం సంస్థలు సంయుక్తంగా నిర్వహించారు. బతుకమ్మ ఆటపాటలతో, కోలాటాలతో ప్రాంగణమంతా హోరెత్తింది. తెలంగాణ ప్రముఖ గాయకురాలు వొల్లాల వాణి, మిట్ట సౌమ్య గారి ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సుమారు 2500మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ‘మేము అడుగగానే మాతో కలసి ఈ బతుకమ్మ సంబరాలలో పనిచేయడానికి ముందుకు వచ్చిన సింగపూర్ తెలుగు సమాజం వారికి హృదయ పూర్వక ధన్యవాదములు ..ఇంకా ముందు ముందు తెలుగు వారందరికీ కోసం ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామ’ని సింగపూర్ తెలంగాణ ఫ్రెండ్స్ కి చెందిన పెద్ది చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.. మనిషి ప్రకృతితో మమేకమయ్యే ఈ పూల పండుగ ఘనమైన సంస్కృతి, సాంప్రదాయాలకు తెలంగాణ ప్రతీక అని, వెయ్యి సంత్సరాల పైగా చరిత్ర కలిగిన ఈ పండుగను సింగపూర్ లో ఇంత సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుందన్నారు. సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగువారందికీ ఈ సందర్భంగా తెలుగు సమాజం తరుపున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ వేడుకలో పాల్గొని విజయవంతం చేయడంలో సహకరించిన వారందరికీ, స్పాన్సర్స్ కు పెద్ది చంద్ర శేఖర్ రెడ్డి పేరు పేరున ధన్యవాదములు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి అహర్నిశలు కృషిచేసిన కృష్ణ ప్రసాద్ రావు వేరమళ్ళ, చిట్ల విక్రమ్ పటేల్, యశరవేణి విజయ్, వెంకట రమణ రెడ్డి, మొగిలి రాజేందర్ రెడ్డి, దామోదర్, చిలుక సురేష్, నల్ల వేణు, మురళి మోహన్ రెడ్డి, రంజిత్ రావు, అంకటి తిరుపతి, సి హెచ్ మహేష్, చల్ల కృష్ణ, పింగిళి భరత్, గుడిపల్లి చంద్ర, మంచుకంటి శ్రీధర్, తిరుమల రెడ్డి, ఆర్ సి రెడ్డి, తీపి రెడ్డి రవీందర్ రెడ్డి, రవీందర్ రావు, మోతుకూరి రవి, గోసంగి శంకర మూర్తి, ముసుకు శేఖర్ రెడ్డి, వేముల సురేష్, మాసర్తి వెంకటేష్, గోలి శ్రీధర్ రెడ్డి, ముద్దం అశోక్, యెల్ల రామ్ రెడ్డి, కందుకూరి జగన్, అనసూరి రవి, మడిపల్లి రామ్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. -
సిడ్నీలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
సిడ్నీ : సిడ్నీ బతుకమ్మ మరియు దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (SBDF), ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ATF)ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సిడ్నీ దుర్గా ఆలయం ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో అక్కడి వీధులు మార్మోగాయి. వేల మైళ్ల దూరంలో ఉంటున్నా.. తెలంగాణ ఎన్నారైల మనసుంతా తెలంగాణ పైనే ఉంటుందని సిడ్నీ బతుకమ్మ అధ్యక్షుడు అనిల్ మునగాల పేర్కొన్నారు. అందరూ ఒక్కచోట కూడి బతుకమ్మ పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని SBDF చైర్మన్ రామ్ రెడ్డి గుమ్మడవాలి తెలిపారు. ఈ బతుకమ్మ సంబురాల్లో సుమారు 1700 నుండి 2000 మంది వరకు పాల్గొన్నారు. తెలంగాణ జానపద గీతాలతో గోరెటి వెంకన్న మరియు జంగి రెడ్డి జనాలను ఉర్రూతలు ఊగించారు.ప్రవాస తెలంగాణవాసులే కాకుండా.. పంజాబీలు, చైనీయులు, తమిళులతో పాటు వివిధ రాష్ర్టాలకు చెందిన వారు కూడా పాల్గొని బతుకమ్మ వేడుకలు గొప్పగా ఉన్నాయని అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జూలియా ఫిన్ , హుగ్ మక్డ్రాట్, సూసై బెంజమిన్, ఇండియన్ హై కమిషన్ కార్యదర్శి ఎస్.కే. వర్మ బతుకమ్మ వేడుకల్లో విశిష్ట అతిథులుగా హాజరయ్యారు . ఈ బతుకమ్మ వేడుకలకు సమన్వయ కర్తలుగా రామ్ రెడ్డి గుమ్మడవాలి, సుమేషు రెడ్డి సూర్య, శశి మానేం, గోవెర్దన్ రెడ్డి, హారిక మానేం, కవిత రెడ్డి, ప్రశాంత్ కడపర్తి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సునీల్ కల్లూరి, మిథున్ లోక, వినయ్ యమా, ప్రదీప్ తెడ్ల, , అనిల్ మునగాల, సందీప్ మునగాల, హారిక మన్నెం, వాత్సహాల ముద్దం, కిశోరె రెడ్డి, నటరాజ్ వాసం, డేవిడ్ రాజు, ఇంద్రసేన్ రెడ్డి, పాపి రెడ్డి, నర్సింహా రెడ్డి, ప్రమోద్ రెడ్డి, వాసు టూట్కుర్, లతా కడపర్తి, సాయి కిరణ్ చిన్నబోయిన, ప్రదీప్ సేరి, ప్రదీప్ తెడ్ల, వినోద్ ఏలేటి, వినయ్ కుమార్, కిశోరె యాదవ్, కిరణ్ అల్లూరి, పద్మిని చాడ, సంగీత కోట్ల, రాజేష్ అర్షణపల్లి, పాపి రెడ్డి, అశోక్ మాలిష్, ఇంద్రసేన్ రెడ్డి, ప్రమోద్ ఏలేటి, కావ్య గుమ్మడవాలి ఇతర సంఘాల అధ్యక్షలు తదితరులు పాల్గొన్నారు. -
ఆటా ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు
చికాగో : తెలంగాణ రాష్ట్ర పండుగైన బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ వాసులు ఘనంగా నిర్వహిస్తున్నారు. చికాగోలోని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దాదాపు 300 మంది మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరూ రంగురంగుపూలతో బతుకమ్మలను తయారు చేసి తమ వెంట తీసుకొచ్చారు. ఆటపాటలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. ఈ కార్యక్రమంలో హనుమంత్ రెడ్డి, మెహర్ మాదవరం, లక్ష్మీ బోయపల్లి, భాను స్వర్గం, వెంకట్ తుడి, మహిపాల్ వంచ, హరి రైనీ, సునీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితురాలైన జానపద గాయనీ రాగం శాలినీ ఆలపించిన పాటలు హుషారెత్తించాయి. -
జర్మనీలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
జర్మనీ : మ్యూనిచ్ నగరం లో తెలంగాణా సంస్కృతికి ప్రతిబింబమైన సద్దుల బతుకమ్మ కన్నుల పండుగల జరిగింది. ఈ వేడుకల్లో 200లకు పైగా ఎన్నారై మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ ఆటపాటలతో అక్కడి పరిసరాలు మార్మోగాయి. ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది ఉయ్యాల పాటలు పాడారు. తెలంగాణలో జరుపుకున్న విధంగానే జర్మనీలోనూ బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో స్థిరపడిన తెలంగాణ, తెలుగు వాసులు కూడా బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించుకోవాలని నిర్వాహకులు అరవింద్ గుంత, నరేష్ మేసినేని, రమేష్, వికాస్, శ్రీనివాస్, మహేష్, శివ, సుష్మ మేసినేని అన్నారు. మ్యూనిచ్ నగరంలో జరిగిన బతుకమ్మ సంబరాలు జర్మనీలోని మిగితా నగరాలకు స్ఫూర్తినిచ్చాయి. -
బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్
-
టీపీఏడీ ఆధ్వర్యంలో ఘనంగా బొడ్డెమ్మ పండుగ
ప్రిస్కో : బొడ్డెమ్మ.. బొడ్డెమ్మ కోల్ బిడ్డాలెందరో కోల్.. అంటూ బొడ్డెమ్మ పాటలు ఫ్రిస్కోలో మార్మోగాయి. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (టీపీఏడీ) ఆధ్వర్యంలో బొడ్డెమ్మ పండగను ఘనంగా జరిపారు. చిన్న బతుకమ్మ పండుగకు ముందే బొడ్డెమ్మ వేడుకలు మొదలవుతాయి. పీటపై మట్టితో చేసిన బొడ్డెమ్మను పెట్టి.. పూలతో అలంకరించి.. ఎర్రమట్టి(జాజు)తో చుట్టూ అలికి.. ఆడపడుచులు బొడ్డెమ్మ పాటలు పాడారు. ఈ వేడుకల్లో 100మందికి పైగా మహిళలు, యువతులు పాల్గొన్నారు. బతుకమ్మ టీమ్ ఛైర్ మాధవి లోకిరెడ్డి, కో ఛైర్ మంజూల తోడుపునూరి, టీపీఏడీ వాలంటీర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డల్లాస్‌లోని వివిధ ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను నిర్వహించాలని టీపీఏడీ అధ్యక్షులు శ్రీని గంగాధర, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఛైర్ శారదా సింగిరెడ్డి, ఫౌండేషన్ కమిటీ ఛైర్ రఘువీరా బండారు, టీపీఏడీ నాయకులు రమణ లష్కర్, చంద్రా పోలీస్‌లు ప్రణాళికలు సిద్దం చేశారు. కొపెల్‌లో అక్టోబర్ 8న ఎంగిలిపూలు బతుకమ్మ, అక్టోబర్ 13న అల్లెన్ ఈవెంట్ సెంటర్లో సద్దులు బతుకమ్మ నిర్వహించనున్నట్టు తెలిపారు. -
ఘనంగా బతుకమ్మ పండుగ
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్‌లో జరగనున్న పండుగను రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా నిర్వహించేందుకు అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై సీఎస్ ఎస్.కె.జోషి మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బతుకమ్మ పండగ అక్టోబర్ 9న ప్రారంభమవుతుందని, 17న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, పీపుల్స్‌ప్లాజాలో పండగ వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పండగను విశ్వవ్యాప్తం చేసేందుకు అధికారుల కమిటీ సూచనలు అందించాలని, వీటి ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.