సాక్షి, హైదరాబాద్: కోవిడ్ రెండో దశతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు ఊరట కోసం పల్లెబాట పడుతున్నారు. బుధవారం నుంచి పిల్లలకు దసరా సెలవులు కావడంతో సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే నగరం నుంచి వివిధ మార్గాల్లో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించిన దక్షిణమధ్య రైల్వే రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ఆర్టీసీతో పాటు ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలు కాచుకొని ఉన్నాయి.
చదవండి: తీరొక్క పూల పండుగ.. బతుకమ్మ
నేటి నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
► నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 4200 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది.
► నుంచే ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.
► తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా ఎక్కువ మంది తరలి వెళ్లనున్న దృష్ట్యా మహాత్మాగాంధీ, జూబ్లీబస్‌స్టేషన్‌లతో పాటు ఉప్పల్, ఎల్‌బీనగర్, ఆరాంఘర్ చౌరస్తా, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల నుంచి నేరుగా బస్సులు బయలుదేరనున్నాయి.
► ఈ బస్సుల్లో చార్జీలు రెగ్యులర్ కంటే అదనంగా ఉంటాయి. కనీసం 30 మంది ఉంటే డైరెక్ట్ బస్సు
దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని మరో ప్రత్యేక సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ఏదో ఒక కాలనీ నుంచి లేదా పనిచేసే స్థలం నుంచి కనీసం 30 మంది లేదా అంతకంటే ఎక్కువ ప్రయాణికులు ఉంటే వాళ్లు బయలుదేరే స్థలం నుంచి చేరుకోవలసిన గమ్యస్థానం వరకు డైరెక్ట్ బస్సును ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. నగరంలోని ఆర్టీసీ సమాచార కేంద్రాలను సంప్రదిస్తే ఈ సదుపాయం లభిస్తుందన్నారు. అలాగే సమీపంలోని డిపో నుంచి కూడా బస్సును బుక్ చేసుకోవచ్చు. భవన నిర్మాణ రంగంలో, పారిశ్రామిక ప్రాంతాల్లో పని చేసే ఒకే ప్రాంతానికి చెందిన కార్మికులు, కాంట్రాక్టర్‌ల వద్ద పని చేసే ఒకే ప్రాంతానికి చెందిన వలస కూలీలు, ఒకే ప్రాంతానికి వెళ్లవలసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
పండుగ బస్సుల సమాచారం కోసం ఏర్పాటు చేసిన కేంద్రాల ఫోన్ నెంబర్లు
► రేతిఫైల్ బస్ స్టేషన్- 9959226154
► కోఠి బస్ స్టేషన్-9959226160
► ఎంజీబీఎస్-9959226257
► జూబ్లీ బస్‌స్టేషన్-9959226246
Comments
Please login to add a commentAdd a comment