schools holidays
-
TS: స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. వివరాల ప్రకారం.. సంక్రాంతి పండుగకు తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. ఈ క్రమంలోనే మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. ఇక, జనవరి 13న రెండో శనివారం కాగా.. 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయి. -
శీతాకాల సెలవులు ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: స్కూల్ విద్యార్థులకు ఢిల్లీ ప్రభుత్వం శీతాకాల సెలవులు ప్రకటించింది. 2023-2024 విద్యా సంవత్సరానికి గాను వచ్చే ఏడాది.. జనవరి 1 నుంచి 6 వరకు స్కూల్స్‌కు శీతాకాల సెలవులు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం డెరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓ సర్య్కూలర్‌ను విడుదల చేసింది. సాధారణంగా ప్రతి ఏడాది పాఠశాల విద్యార్థులకు ఢిల్లీ ప్రభుత్వం శీతాకాల సెలవులు ప్రకటిస్తుందన్న విషయం తెలిసిందే. Delhi Government’s Directorate of Education issues circular for winter vacation in Delhi Govt Schools. The Winter Vacation for Academic Session 2023-2024 is scheduled to be observed from 1st January 2024 (Monday) to 6th January 2024 (Saturday) pic.twitter.com/P1GXIROySN — ANI (@ANI) December 6, 2023 15 రోజులు పాటు ఉండే సెలవులను ఈసారీ 6 రోజులకే పరిమితం చేశారు. ఢిల్లీలోని తీవ్రమైన వాయు కాలుష్యం కారణంగా గత నవంబర్ నెల మొదట్లో 9వ తేదీ నుంచి 18వరకు స్కూల్స్ మూసివేసిన సంగతి విదితమే. అందుకే ప్రతి యేటా జనవరి 1 నుంచి 15 వరకు ఇవ్వాల్సిన సెలవును ఈసారి ఆరు రోజులకే తగ్గించినట్లు తెలుస్తోంది. -
HYD: రేపు, ఎల్లుండి విద్యాసంస్థలు బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నవంబర్ 30న(గురవారం) పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రేపు(బుధవారం), ఎల్లుండి(గురువారం) అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో రేపు, ఎల్లుండి హైదరాబాద్ పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. ఇక, మళ్లీ డిసెంబర్ ఒకటో తేదీన విద్యాసంస్థలు యథావిధిగా ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సమాచారం ఇచ్చారు. *In view of the Telangana Assembly Elections 2023, all educational institutions in Hyderabad district will remain closed on 29th and 30th Nov 2023.* *Regular activities resume on 1 Dec 2023.*@TelanganaCS @CEO_Telangana — Collector Hyderabad (@Collector_HYD) November 28, 2023 -
ఢిల్లీలో జనం ఉక్కిరిబిక్కిరి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. వాయు నాణ్యత పడిపోతోంది. వరుసగా ఆరో రోజు ఆదివారం సైతం పొగ మంచు దట్టంగా కమ్మేసింది. నగరంలో కాలుష్యం మరోసారి ‘అత్యంత తీవ్రం’ కేటగిరీలోకి చేరింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) శనివారం సాయంత్రం 4 గంటలకు 415 ఉండగా, ఆదివారం ఉదయం 7 గంటలకు 460గా దిగజారింది. కలుíÙత గాలితో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలకు సెలవులను ప్రభుత్వం మరో ఐదు రోజులపాటు పొడిగించింది. ఈ నెల 10వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. 6 నుంచి 12వ తరగతి వరకు స్కూళ్లు తెరిచే ఉంటాయని పేర్కొంది. విద్యార్థులు ఆన్లైన్ తరగతులు కూడా వినవచ్చని ఢిల్లీ విద్యా శాఖ మంత్రి సూచించారు. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండడం, పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాలను దహనం చేస్తుండడంతో ఢిల్లీలో వాయు నాణ్యత పడిపోతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల రాజధానుల కంటే ఢిల్లీలో వాయు నాణ్యత అత్యంత దారుణంగా ఉన్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. వాణిజ్య వాహనాలకు నో ఎంట్రీ ఢిల్లీలో వాయు నాణ్యత నానాటికీ పడిపోతుండడం, కాలుష్యం పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిర్మాణ పనులపై నిషేధం విధిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కాలుష్యానికి కారణమయ్యే రవాణా వాహనాలు, వాణిజ్య వాహనాల ప్రవేశాన్ని నిషేధించింది. -
తెలంగాణలో నేడు, రేపు స్కూల్స్ బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలకు నేడు, రేపు సెలవులు ప్రకటించింది. భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్రంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తున్నట్టు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో కుండపోత వాన కురుస్తోంది. చెరువులు, వాగులు, వంగలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. భారీ నుంచి అతిభారీవర్ష హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. Keeping in view of the heavy rainfall in the state and under the instructions of the Honourable CM, KCR garu, the Govt has decided to declare holidays for two days to all education institutions in the state. That is Thursday and Friday. — SabithaReddy (@SabithaindraTRS) July 20, 2023 రాత్రి వీచిన ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్‌లో భారీ వర్షం కురుస్తోంది. అటవీ ప్రాంతాల్లో ప్రమాదకరస్థాయిలో వాగులు ప్రవహిస్తున్నాయి. కుమ్రంభీం జిల్లా బెజ్జూర్‌లో 14 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యాయి. ఇది కూడా చదవండి: తెలంగాణ: అంతటా కుండపోత.. లోతట్టు జలమయం.. అతిభారీ వర్షాల హెచ్చరిక -
TS: స్కూల్స్‌కు సెలవులు పొడిగింపు.. విద్యాశాఖ క్లారిటీ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్కూల్స్ ప్రారంభంపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈనెల 12(జూన్ 12) సోమవారం నుంచి స్కూల్స్ రీ ఓపెన్ కానున్నట్టు శుక్రవారం విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈనెల 12 పాఠశాలలు తెరుచుకోనున్నాయి. దీంతో, విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో తెలంగాణలో పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో స్కూల్స్ రీఓపెన్‌పై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. పాఠశాలలకు సెలవుల పొడిగింపు లేదని పొడిగింపు లేదని అధికారులు ప్రకటించారు. ఇది కూడా చదవండి: బీజేపీ బిగ్ ప్లాన్.. ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు! -
Afghan Women: చదువుల్లేక.. ఉద్యోగాల్లేక.. ఉరికొయ్యలే దిక్కై!
‘‘నాకు జీవితంపై ఇక ఎలాంటి ఆశలు లేవు. మమ్మల్ని చదువుకోనివ్వడం లేదు. స్వేచ్ఛగా బతికే అవకాశం లేదు. కుంగుబాటు, ఆందోళన నన్ను వేధిస్తున్నాయి. ఈ జీవితాన్ని ముగించాలన్న ఆలోచనలు తరచుగా వస్తున్నాయి. ఈ బాధలు భరించలేను. నా ఆవేదన ఎవరైనా వింటే బాగుండు. ఇది కేవలం నా ఒక్కరి దుస్థితి కాదు. నాతోపాటు యూనివర్సిటీలో చదువుకున్న యువతులంతా ఇలాగే మదన పడుతున్నారు. ఆత్మహత్య ఆలోచనలతో నిత్యం సతమతం అవుతున్నారు. బతకలేక చావలేక కుమిలిపోతున్నారు’’ – అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్లకుపైగా వయసున్న ఓ యువతి కన్నీటి గాథ ఇది. రాక్షస పాలనలో నిత్య నరకం అఫ్గానిస్తాన్‌లో 2021 ఆగస్టు నుంచి తాలిబన్ల పరిపాలన మళ్లీ మొదలైంది. అమెరికా సేనలు వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్ ముష్కరులు అధికారంలోకి వచ్చారు. తాము పూర్తిగా మారిపోయామని, ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడుకుంటామని తొలుత ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆచరణలో మాత్రం రాక్షస పాలనకు తెరతీశారు. మహిళలపై కఠినమైన ఆంక్షలు విధించారు. వారిపై దారుణమైన వివక్ష కొనసాగుతోంది. చదువులు లేవు, ఉద్యోగాలు లేవు. ఆర్థిక స్వేచ్ఛ అసలే లేదు. అఫ్గాన్ బాలికలకు కొన్నిచోట్ల ప్రాథమిక విద్య మాత్రమే అందుబాటులో ఉంది. అంటే ఆరో తరగతి వరకూ పాఠశాలలకు వెళ్లి చదువుకోవచ్చు. ఆ తర్వాత ఇంటికి పరిమితం కావాల్సిందే. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు నిరాకరిస్తున్నారు. కాలేజీ, యూనివర్సిటీ చదువులు యువకులకు మాత్రమే అన్నట్లుగా అనధికార శాసనం అమల్లోకి వచ్చింది. ఈ పరిణామాలన్నీ యువతుల్లో మానసిక సమస్యలను, అనారోగ్యాలను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వందలాది మంది అర్ధంతరంగా జీవితాలను చాలించినట్లు తెలుస్తోంది. సైకాలజిస్టులను సంప్రదించే బాధితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని సంగ్చారక్ జిల్లాలో రెండు పాఠశాలల్లో ఇటీవలే దాదాపు 80 మంది విద్యార్థినులపై విష ప్రయోగం జరిగింది. స్కూళ్లకు రాకుండా బాలికలను భయపెట్టడానికే విద్రోహులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. శరీరంలోకి విషం ఎక్కించినట్లుగా.. అఫ్గాన్ యువతుల్లో ఆత్మహత్య ఆలోచనలు ఒక మహమ్మారిలా వ్యాప్తి చెందుతున్నాయని సైకాలజిస్టు డాక్టర్ అమల్ చెప్పారు. పరిస్థితి దిగజారుతోందని, ఇక్కడి వాస్తవాలు ప్రపంచానికి తెలియడం లేదని అన్నారు. ఆకలి చావులు, ఆహార సంక్షోభం గురించి మాత్రమే వార్తా పత్రికల్లో రాస్తున్నారని, మానసిక అనారోగ్య సమస్యల గురించి ఎవరూ రాయడం లేదని, మాట్లాడడం లేదని వెల్లడించారు. శరీరంలోకి నెమ్మదిగా విషం ఎక్కించినట్లుగా యువత ప్రవర్తిస్తున్నారని, జీవితంపై ఆశలు కోల్పోతున్నారని డాక్టర్ అమల్ ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీల్లో యువతులకు ప్రవేశం లేదంటూ తాలిబన్లు ప్రకటించినప్పుడు మొదటి రెండు రోజుల్లో తనకు 170 ఫోన్‌కాల్స్ వచ్చాయన్నారు. ఇప్పుడు నిత్యం దాదాపు 10 కాల్స్ వస్తున్నాయని తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది బాలికలు, యువతులే ఉంటున్నారని వివరించారు. వారిలో ఆత్మహత్య ఆలోచనలు పోగొట్టి, స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించాలి అఫ్గానిస్తాన్‌లో పితృస్వామ్య వ్యవస్థ బలంగా పాతుకుపోయింది. మహిళలపై ఆంక్షలు, వివక్ష, వేధింపులు అనేవి సహజంగా మారిపోయాయి. దేశంలో ప్రతి ఇద్దరిలో ఒకరు మానసికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. బాధితుల్లో మహిళలే గణనీయంగా ఉంటారని తెలియజేసింది. తాలిబన్ల పెత్తనం మొదలయ్యాక పరిస్థితి మరింత దిగజారిందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఆంక్షలు, వివక్షకు ఆర్థిక సంక్షోభం కూడా తోడయ్యిందని, ఇవన్నీ మహిళలను ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తున్నాయని అంటున్నారు. హెరాత్ ప్రావిన్స్‌లో ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో.. కౌమార వయసులో ఉన్నవారిలో మూడింట రెండొంతుల మందిలో ఆందోళన, కుంగుబాటు లక్షణాలు ఉన్నట్లు వెల్లడయ్యింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సకాలంలో చికిత్స అందించకపోతే వారు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. దేశంలో ఆత్మహత్యల సంఖ్యను తాము రికార్డు చేయడం లేదని తాలిబన్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, తాలిబన్ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు అధికారికంగా గుర్తించాలని అఫ్గాన్ ప్రజలు కోరుతున్నారు. అలాగైతే తాలిబన్ల వైఖరిలో మార్పు వచ్చే అవకాశం ఉందని, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, దేశం అభివృద్ధి చెందుతుందని, మహిళలపై ఆంక్షలు రద్దవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మహిళా కళాశాలలను తాలిబన్లు మూసేశారు. దాంతో నా ఉద్యోగం పోయింది. ఎక్కడా ఉపాధి దొరకలేదు. ఇంట్లో అందరినీ పోషించాల్సింది నేనే. పని దొరక్క చేతిలో చిల్లిగవ్వ లేకుండాపోయింది. నిర్భయంగా బయట తిరగలేం. ఇంట్లోనే ఉండిపోవాలి. ఎలా బతకాలో తెలియడం లేదు. అందుకే మరోదారి లేక రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశా. –మెహర్ అనే అధ్యాపకురాలి ఆవేదన ఇది ఈ ఏడాది మార్చి నెలలో స్కూల్ పునఃప్రారంభం కాగా, తరగతులకు హాజరయ్యేందుకు తన కుమార్తె ఉత్సాహంగా సిద్ధమైందని, తీరా అక్కడికి వెళ్లాక రావొద్దని చెప్పడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని నాదిర్ అనే వ్యక్తి చెప్పాడు. పెద్ద చదువులు చదువుకొని, దేశానికి సేవ చేయాలని తన బిడ్డ కలలు కనేదని తెలిపాడు. తాలిబన్ పాలకులు బాలికల పాఠశాలలను మూసివేశారని వెల్లడించాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యూకేలో ఉద్యోగుల భారీ సమ్మె
లండన్: యూకేలో దశాబ్ద కాలంలోనే అతిపెద్ద సమ్మె బుధవారం జరిగింది. సుమారు 5 లక్షల మంది ఉపాధ్యాయులు, కాలేజీ లెక్చరర్లు, ఇతర ప్రభుత్వ సిబ్బంది, రైల్ డ్రైవర్లు విధులను బహిష్కరించారు. ఫలితంగా 85% స్కూళ్లు మూతబడ్డాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో రైళ్లు నిలిచిపోయాయి. నాలుగు దశాబ్దాల్లోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం 10% మించి పోవడంతో అందుకు తగినట్లుగా వేతనాలు పెంచాలంటూ ఆరోగ్య, రవాణా రంగ సిబ్బంది దగ్గర్నుంచి అమెజాన్ వేర్ హౌస్ ఉద్యోగులు, రాయల్ మెయిల్ పోస్టల్ ఉద్యోగుల వరకు సమ్మెలకు దిగుతున్నారు. వేతనాల పెంపు డిమాండ్‌తో వచ్చే వారంలో విధులు బహిష్కరిస్తామంటూ నర్సులు, అంబులెన్సు సిబ్బంది, పారామెడిక్స్, ఎమర్జెన్సీ, ఆరోగ్య సిబ్బంది ఇప్పటికే ప్రకటించారు. కాగా, సమ్మెలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని రిషి సునాక్ ఆందోళన వ్యక్తం చేశారు. బదులుగా ఉద్యోగులు చర్చలకు రావాలని ఆయన కోరారు. అయితే, సమస్యలను పరిష్కరించడానికి బదులుగా..కొన్ని రంగాల్లో సమ్మెలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల వల్ల సంబంధాలు మరింత దెబ్బతింటాయని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. -
అమెరికాలో మంచు వడగండ్ల వాన
ఆస్టిన్/న్యూయార్క్: అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల్లో మూడు రోజులుగా అతిశీతల పరిస్థితులు కొనసాగుతున్నాయి. టెక్సాస్ మొదలుకొని వెస్ట్ వర్జీనియా వరకు భారీగా కురిసిన మంచు వడగండ్ల వానతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మంచు వాన కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు చనిపోయారు. వాహనదారులు రోడ్లపైకి వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఉదయం 1,400 విమాన సర్వీసులు రద్దయ్యాయి. డల్లాస్, ఆస్టిస్, టెక్సాస్, నాష్విల్లె, టెన్నెస్సీ విమానాశ్రయాల్లో విమానాలు నిలిచిపోయాయి. ప్రమాదకర అతిశీతల వాతావరణంతో డల్లాస్, మెంఫిస్, టెన్నెస్సీల్లో స్కూళ్లు మూతబడ్డాయి. లక్షలాది మంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. అర్కాన్సస్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. న్యూయార్క్‌లో అసాధారణం న్యూయార్క్ వాసులు ఏటా డిసెంబర్– జనవరి ఆఖరు వరకు కురిసే మంచులో స్లెడ్జిలపై తిరుగుతూ, స్నోబాల్స్తో కొట్లాడుతూ ఎంజాయ్ చేసేవారు. కానీ, ఈసారి.. దాదాపు 50 ఏళ్ల తర్వాత అలాంటి పరిస్థితులు కనిపించకుండా పోయాయి. గడిచిన 325 రోజుల్లో నగరంలో ఒక్కసారైనా అరంగుళం మంచు కూడా పడలేదని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 1973 తర్వాత ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం ఇదే మొదటిసారని వాతావరణ శాస్త్రవేత్తలు అన్నారు. వరుసగా 332 రోజులు అతి తక్కువ మంచుకురిసిన 2020 నాటి రికార్డు త్వరలో బద్దలు కానుందని కూడా చెప్పారు. ఏడాదికి సరాసరిన 120 అంగుళాల మంచు కురిసే సిరాక్యూస్‌లో ఈసారి 25 అంగుళాలు మాత్రమే నమోదైంది. రొచెస్టర్, బఫెల్లోలోనూ దాదాపు ఇవే పరిస్థితులున్నాయి. ఉటాహ్‌లోని వెల్స్విల్లెలో మంచును తొలగిస్తున్న ఓ వ్యక్తి -
చెన్నైలో వాన బీభత్సం.. మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు
సాక్షి, చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరం, శివారు జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం పడుతోంది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వివరాలు.. రాష్ట్రంలోకి గత నెల 29వ తేదీన ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన విషయం తెలిసిందే. వీటికి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తోడైంది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు మొదలయ్యాయి. సోమవారం రాత్రి నుంచి చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, నాగపట్నం, తంజావూరు, తిరువారూరు జిల్లాలను వరుణుడు వణికించాడు. దీంతో ఆయా జిల్లాల్లో మంగళవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ వర్షాలు 4వ తేదీ వరకు కొనసాగుతాయని చెన్నై వాతావరణ కేంద్రం ప్రకటించింది. Pathetic condition of Chennai just after single day rain. Searching for naysayers who kept ranting about Bengaluru rains few months back. #chennairains pic.twitter.com/NeLlXl5bqU — G Pradeep (@pradeep_gee) November 1, 2022 ఒక్క రాత్రి వానకే చెన్నై.. చెన్నైలో వరద ముంపును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం కొన్ని నెలల ముందుగానే అప్రమత్తమైంది. అయితే వర్షపు నీటి కాలువల నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా, సోమవారం రాత్రి భారీ వర్షానికి నగరం జలమయమైంది. కుండపోతగా కురిసిన వర్షానికి నగరంలోని ప్రధాన మార్గాలపై వరద పోటెత్తింది. చెన్నై సెంట్రల్, ఎగ్మూర్, మైలాపూర్, టీనగర్, వడపళని, గిండి, వేళచ్చేరి, కీల్పాక్కం, కోయంబేడు, మదురవాయల్, పోరూర్, కుండ్రత్తూర్, మీంజూరు, పొన్నేరి, పుళల్, చోళవరం, రెట్టేరి, తాంబరం, గూడువాంజేరి పరిసరాల్లో భారీ వర్షం పడింది. ఇక్కడున్న లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరాయి. మంగళవారం కూడా వర్షాలు కొనసాగడంతో చెన్నై, తాంబరం, ఆవడి కార్పొరేషన్ల అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. రోడ్లపై నిలిచిపోయిన నీటిని ఎప్పటికప్పుడు తొలగించారు. గాలి కారణంగా 5 చోట్ల చెట్లు నేలకొరిగాయి. వర్షాలు మరో రెండు రోజులు కొనసాగనుండడంతో ముందు జాగ్రత్తలపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా చెన్నై రిప్పన్ బిల్డింగ్‌లో సహాయక చర్యల నిమిత్తం అన్ని విభాగాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. @cmrlofficial this is the condition of St.Thomas Mount metro station today at 10:30. Parking has been closed since water logging inside is more than that of the road. The situation is the same as it was last year. Can't even sustain even 1 day rain. Poor#chennairains pic.twitter.com/JcABUyMNuZ — Navin (@navinnova) November 2, 2022 కార్పొరేషన్ మేయర్ ప్రియ, కమిషనర్ గగన్‌దీప్ సింగ్ బేడీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఒక్క రాత్రి వానకే నగరం జలమయం కావడంతో.. మున్ముందు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందోనని చెన్నై వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు ఎక్కువకాలం నిల్వవున్నా, ఇతర సహాయక చర్యల కోసం 1919, 044–25619206, 25619207, 25619208 నంబర్లను సంప్రదించాలని చెన్నై కార్పొరేషన్ మేయర్ ప్రియ తెలిపారు. For past one hour no rain. But situation in perambur Cooks road and jamalia road are looks very worst. Chennai mayor Priya madam's residence is near by 1 km from this location. #NortheastMonsoon #ChennaiRain #chennairains #ChennaiCorporation @chennaicorp pic.twitter.com/mZCDMuU02f — Prakash Narasimman (@Prakash_2803) November 2, 2022 రిజర్వాయర్లలో.. చెన్నైకు తాగునీటి అందించే చెరువులు, రిజర్వాయర్లలోకి ఇన్ ఫ్లో పెరిగింది. 3,300 మిల్లియన్ ఘనపుటడుగుల సామర్థ్యం కలిగిన పుళల్ రిజర్వాయర్‌లోకి సెకనుకు 967 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 21 అడుగులు కలిగిన ఈ రిజర్వాయర్ నీటిమట్టం ప్రస్తుతం 18 అడుగులకు చేరుకుంది. 3,645 మిల్లియన్ ఘనపుటడుగుల సామర్థ్యం కలిగిన చెంబరంబాక్కం రిజర్వాయర్‌కు నీటి రాక పెరిగింది. కందన్కోట సేరువాయ్ కండ్రిగ రిజర్వాయర్ నిండింది. ఇందులో నుంచి సెకనుకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. చెన్నై, పూండి రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చెన్నైలో ప్రవహిస్తున్న కూవం నదిలో నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఈ నది తీరంలోని నేల వంతెన రోడ్డు మార్గాన్ని కూలి్చవేశారు. ఇద్దరి మృతి చెన్నైలో వర్షం కారణంగా విద్యుదాఘాతానికి ఒకరు, ఇంటి బాల్కని కూలి మరొకరు మృతి చెందారు. వ్యాసర్పాడికి చెందిన దేవేంద్రన్(55) సోమవారం ఈబీ కాలనీలోని నివాసానికి వెళుతుండగా విద్యుదాఘాతానికి గురై ఘటనా స్థలంలోనే మరణించాడు. పుళియాంతోపు, ప్రకాశ్‌రావు కాలనీకి చెందిన కబాలి, శాంతి (45) దంపతులు ఓ బహుళ అంతస్థుల భవనంలో నివాసం ఉన్నారు. అది పాత భవనం కావడంతో మంగళవారం ఉదయం తొలి అంతస్తు భవనం బాల్కని కూలి శాంతిపై పడింది. ఘటనా స్థలంలోనే ఆమె మరణించారు. ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటన తిరువళ్లూరు: వర్షపునీటి నిల్వ వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మంత్రి నాజర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆవడిలోని పరుత్తిపట్టు, శ్రీరామ్నగర్ల్లోని లోతట్టు ప్రాంతాల్లో మంత్రి నాజర్ పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆవడి ప్రాంతంలో వర్షపు నీటికాలువల నిర్మాణం 90 శాతం పూర్తయ్యిందన్నారు. నీరు నిలిచిన వెంటనే మోటార్ల ద్వారా తొలగించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట మేయర్ ఉదయకుమార్ ఉన్నారు. 23 చోట్ల వరద ముప్పు వేలూరు: వేలూరు జిల్లాలో మొత్తం 23 చోట్ల వరద ముప్పు ఉన్నట్లు ఎస్పీ రాజేష్ కన్నన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్న నేపథ్యంలో వేలూరు జిల్లాలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులను ఆయన అప్రమత్తం చేశారు. వేలూరు నేతాజీ మైదానంలో పోలీసులు, అగి్నమాపక సిబ్బందికి వరద ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని కాపాడడం, రోడ్లపై చెట్లు పడిన వెంటనే వాటిని తొలగించడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. వారికి అవసరమైన పరికరాలను ఎస్పీ అందజేశారు. వరద సమాచారాన్ని అందించేందుకు 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను కలెక్టరేట్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు వాగులు, వంకల వద్దకు వెల్లకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలోని ఆయా తాలుకా కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీఎం సమీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఈశాన్య రుతు పవనాల ప్రభావం తీవ్రం కావడంతో అధికారులను ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ అప్రమత్తం చేశారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన నివాసం నుంచి పలు జిల్లాల కలెక్టర్లతో పరిస్థితిని సమీక్షించారు. మంత్రి కె.కె.ఎస్.ఎస్.ఆర్ రామచంద్రన్, సీనియర్ ఐఏఎస్‌లు ఎస్.కె.ప్రభాకర్, కుమార్ జయంత్ కూడా హాజరయ్యారు. చెన్నై, శివారుల్లో యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న నీటి తొలగింపు పనుల వివరాలను తెలుసుకున్నారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేక శిబిరాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షపు నీటి కాలువల నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, హెచ్చరిక బోర్టులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మంత్రి దురైమురుగన్, సీఎస్ ఇరై అన్బు, సచివాలయం నుంచి ఎప్పటికప్పుడు వర్షం పాతం వివరాలను తెలుసుకోవడంతో పాటు సహాయక చర్యలను పర్యవేక్షించారు. చెన్నైలో నీరు నిల్వ ఉండకుండా మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. -
న్యూయార్క్‌లో స్కూళ్లకు దీపావళి సెలవు.. ప్రియాంకా చోప్రా హర్షం
లాస్ఏంజెలెస్: న్యూయార్క్‌లోని పాఠశాలలకు దీపావళి పండుగ రోజును సెలవుగా ప్రకటించడంపై బాలీవుడ్ నటి, నిర్మాత ప్రియాంకా చోప్రా జొనాస్ హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని పబ్లిక్ స్కూళ్లకు 2023 నుంచి దీపావళి రోజున సెలవు ఉంటుందని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ గురువారం ప్రకటించడంపై శనివారం రాత్రి ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. తన చిన్నతనంలో న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో స్కూలుకు వెళ్లినప్పటి రోజులను గుర్తుకు వచ్చి ఏడ్చేశానని పేర్కొన్నారు. న్యూయార్క్ నగరంలో భారత సంతతికి చెందిన సుమారు 2 లక్షల మంది హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతస్తులున్నారు. వీరంతా దీపావళి పండుగను జరుపుకుంటారని, అందుకే సెలవుగా ప్రకటించాలని నిర్ణయించామని మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు. ప్రియాంకా చోప్రా ప్రస్తుతం లాస్ఎంజెలెస్లో నివాసం ఉంటున్నారు. -
TS: దసరా సెలవులు కుదింపు వాస్తవమేనా?.. విద్యాశాఖ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని.. సెలవుల కుదింపుపై వస్తున్న వార్తలను తెలంగాణ విద్యాశాఖ ఖండిచింది. కుదింపుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 9 వరకు దసరా సెలవులు కొనసాగుతాయని విద్యాశాఖ ప్రకటించింది. అక్టోబర్ 10న పాఠశాలల పునఃప్రారంభమవుతాయని పేర్కొంది. చదవండి: నెహ్రూ జూపార్కులోనే ఓ చీతా ఉంది.. కావాలనుకుంటే వెళ్లి చూడొచ్చు! కాగా, విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా దసరా సెలవులను తగ్గించాలని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యు కేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్–ఎస్సీఈఆర్టీ) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి మంగళవారం.. పాఠశాల విద్య డైరెక్టర్‌కు ఓ లేఖ రాశారు. జూలైలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ నెల 11 నుంచి 16 రోజులపాటు సెలవులు, ఈ నెల 17న జాతీయ సమైక్యతాదినోత్సవాన్ని పురస్కరించుకుని మరో సెలవు.. ఇలా అనుకోకుండా వచ్చిన సెలవుల వల్ల స్కూళ్లు మూతపడ్డాయని పేర్కొన్నారు. -
ఏపీలో పాఠశాలలకు దసరా సెలవులు.. ఎప్పటినుంచంటే..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు సెప్టెంబర్ 26 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 6వరకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. క్రిస్టియన్, మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్ 1 నుంచి 6వరకు సెలవులు ఇచ్చారు. 7వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలకు 220 పనిదినాలు, 80 సెలవులుగా ప్రకటించారు. చదవండి: (అరుదైన రికార్డ్.. ఆ విషయంలో దేశంలోనే ఏపీ నంబర్ వన్) -
TS: దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు తీపి కబురు అందించింది. మంగళవారం ఈ ఏడాది దసరా పండుగకు 13 రోజులపాటు సెలవులను అధికారికంగా ప్రకటించింది. దసరా పండుగ నేపథ్యంలో సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, అక్టోబర్ 10వ తేదీన విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇక, 5వ తేదీన దసరా పండుగగా ప్రభుత్వం నిర్ణయించింది. -
భారీ వర్షాల ఎఫెక్ట్.. ఐదు జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలు బంద్
దేశవ్యాప్తంగా కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలకు దాదాపు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా మంగళవారం అనేక జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటం, భారీ వరదలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో వాహనాల రాకపోకలు సాగిస్తున్న ఐదు రహదారులను అధికారులు మూసివేశారు. ఇక, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులు అప్రమతమయ్యారు. బాగేశ్వర్, తెహ్రీ, పౌరి, పితోరాఘర్, నైనిటాల్ జిల్లాల్లో 1-12వ తరగతి వరకు పాఠశాలలు, అన్ని అంగన్వాడీ కేంద్రాలు బుధవారం మూసివేసినట్టు తెలిపారు. ఇక, డెహ్రాడూన్, టెహ్రీ, పౌరీ, నైనిటాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్, హరిద్వార్ జిల్లాలకు జూలై 20న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. #WATCH उत्तराखंड: बारिश की वजह से टनकपुर में एक स्कूल बस पानी के तेज़ बहाव में बह गई। pic.twitter.com/BQYlA7dqVb — ANI_HindiNews (@AHindinews) July 19, 2022 ఇదిలా ఉండగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మంగళవారం జోషిమత్‌లోని పుర్సరి వద్ద జాతీయ రహదారి ఎన్‌హెచ్-58 కుంగిపోయింది. దీంతో, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటిచింది. Only driver was present in the bus at the time of the incident on Tuesday morning. #Champawat #UttarakhandRains pic.twitter.com/wQ4GYwiuag — TOI Cities (@TOICitiesNews) July 19, 2022 -
ఇంగ్లండ్‌లో ఎండ దెబ్బకు కరిగిన రన్‌వే
లండన్: ఇంగ్లాండ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. వాహనాలకు నిప్పంటుకుంటోంది. గడ్డి భూములు అగ్నికి ఆహూతవుతున్నాయి. రైళ్లను రద్దు చేయాల్సి వస్తోంది. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఎండలను తట్టుకోలేక ప్రజలు బీచ్‌లకు పరుగులు తీస్తున్నారు. ఈత కొలన్లలో సేదతీరుతున్నారు. ఎండ దెబ్బకు లూటన్ ఎయిర్‌పోర్టులో రన్‌వే కరిగిపోయింది! దాంతో విమానాశ్రయాన్ని మూసేయాల్సి వచ్చింది. సోమవారం కేంబ్రిడ్జ్‌లో 38 డిగ్రీలు, లండన్‌లో 37.5 డిగ్రీలు నమోదైంది! సూర్యప్రతాపం వల్ల అడవుల్లో కార్చిచ్చు రగులుతోంది. లండన్‌లోని వాక్స్హాల్ ప్రాంతంలో రైలు పట్టాలు వ్యాకోచించి, వంగిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. లండన్‌లో వుడ్గ్రీన్ క్రౌన్ కోర్టులో ఏసీ యూనిట్ పేలిపోవడంతో ఓ మర్డర్ కేసులో విచారణను వాయిదా వేశారు. యూకేలో వాతావరణం సహారా ఎడారిని తలపిస్తోందంటూ జనం సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే ప్రమాదముందన్న హెచ్చరికలు ఇంకా భయపెడుతున్నాయి. -
Monsoon Rains: వాన జ్ఞాపకం.. తడిసిన బడిగంట
ఎండాకాలం సెలవులు ఫిక్స్డ్. వానాకాలం సెలవులు అలా కాదు. వానదేవుడి మూడ్‌ని బట్టి ఉంటాయి. రెండు రోజులు దంచి కొడితే మూడోరోజు సెలవు. తెల్లారి కుమ్మరిస్తే మధ్యాహ్నం సెలవు. రాత్రంతా ఉరుములు మెరుపులు ఉంటే ఉదయానికి సెలవు. వానదేవుడు నిజంగా పిల్లల ఫ్రెండు. ‘రేయ్... ఎంజాయ్ చేయండ్రా’ అని అప్పుడప్పుడు స్కూల్‌కు మబ్బులతో తాళాలు వేస్తాడు. ఎవరూ అడుగు పెట్టకుండా వాన ధారలను కాపలా పెడతాడు. ముసురులో స్కూల్... బలే జ్ఞాపకం. చాలా మంది పిల్లల దగ్గర గొడుగులు ఉండవు. కొంచెం చినుకులు పడుతూ ఉంటే గొడుగు ఉన్న ఫ్రెండ్ పక్కన చేరడం, కింద ఉన్న నీళ్ల గుంతలను ఫుట్‌బాల్‌గా తన్నడం, స్లిప్పర్లు బురద ఎగరేస్తూ ఉంటే వెనుక షర్ట్ మీద, చెడ్డీ మీద డిజైన్లు వేసుకోవడం బాగుంటుంది. గొడుగు ఉన్నా పక్కకు జరిగి తల తడుపుకుంటారు కొందరు. తడిసి లేతగా ఒణకడం, పళ్లు కటకటలాడించడం, చేతులు రెండూ కలిపి పిడికిలి బిగించి గుండెల దగ్గర పెట్టుకోవడం బాగుంటుంది. మనం తడవొచ్చుగాని పుస్తకాలు... సవాలే లేదు. షర్ట్ కిందకు తీసుకోవాల్సిందే. మంచి ప్లాస్టిక్ కవర్లో చుట్టి నెత్తి మీద పెట్టుకుంటే అదే గొడుగు. కొన్ని క్లాస్‌రూమ్‌లు స్ట్రిక్ట్‌గా ఉంటాయి. ఎంత పెద్ద వాన కురిసినా ఉరవవు. కొన్ని పోనీలే పాపం అనుకుంటాయి. కాస్త జల్లుకే చుక్కలు కార్చి బల్లలన్నీ తడిపేస్తాయి. అప్పుడు ఉరవని క్లాస్‌రూమ్‌లోకి ఉరిసే క్లాస్‌లోని పిల్లలను తోలుతారు. ఈ టీచర్ ఆ టీచర్ కబుర్లలో పడతారు. ఈ పిల్లలకు ఆ పిల్లలకూ పండగే. ఒక్కో బెంచీలో ఇరుక్కుని కూచుని ఊరికూరికే నవ్వుకుంటూ నెట్టుకుంటూ కిటికీలో నుంచి వానను చూస్తూ లాంగ్ బెల్లు కోసం ఎదురు చూస్తూ ఉండటం బాగుంటుంది. ప్లే గ్రౌండ్లో నీళ్లు చేరుతాయి. ఓల్డ్ స్టూడెంట్స్ నాటిన గుల్మొహర్ చెట్లు పూర్తిగా తడిసిపోతాయి. ఎప్పుడూ చక్కగా నడుచుకునే సార్లు మోకాళ్లు దాకా ప్యాంట్లు మడుచుకుని గమ్మత్తుగా కనిపిస్తారు. టీచర్లు తలల మీద పవిటను పరుచుకుంటారు. స్కూల్ అటెండర్ ఫ్లాస్క్ పట్టుకుని హెడ్మాస్టర్ కోసం టీ తేవడానికి పరిగెడుతూ ఉంటాడు. వాన ఆగుతుందా... ఆగదా... సెలవు ఇవ్వడమా వద్దా... అని హెడ్మాస్టర్ రూమ్‌లో ఆయనకు ఇష్టమైన సీనియర్ టీచర్లతో చర్చ ఉంటుంది. మధ్యాహ్నం స్కూల్ లేదంటే మేట్నీకి వెళ్లడం గురించి ఆలోచనలు వస్తాయి. ఏ ఫ్రెండ్ ఇంట్లో నలుగురూ కూడి ఏ ఆట ఆడవచ్చో ప్లానింగు ఉంటుంది. ఉప్పు సెనగలు, బటానీలకు పెద్దలు వద్దన్నా డబ్బు ఇస్తారు. కలిగిన కుటుంబాలలో ఆ సాయంత్రం వేసే ఉల్లిబజ్జీలు గుర్తుకు వస్తాయి. లేనివారికి బడి బయటి పిడితకింద పప్పే గతి. ఉండి ఉండి వాన పెరుగుతుంది. క్లాస్రూమ్లోఎక్కువ గోలో బయట వానది ఎక్కువ గోలో అర్థం కాకుండా ఉంటుంది. హెడ్మాస్టర్ గది బయట వేళ్లాడుతున్న గంట తడిసి తడిసి ‘ఇక చాల్లే లాంగ్ బెల్ కొట్టండి’ అంటుంది. టంగ్... టంగ్.. టంగ్... అని లాంగ్‌బెల్ వినపడగానే పిల్లలు బిలబిలమని క్లాస్రూమ్ బయటకు వస్తారు. గొడుగులు ఉన్నవాళ్లు తెరుస్తారు. కచ్చబోతోళ్లు ఎవరినీ పిలవకనే ఒక్కరే గొడుగులో వెళ్లిపోతారు. సైకిల్ మీద వెళ్లాల్సిన వాడు స్పీడ్‌గా తొక్కితే తక్కువ తడుస్తానని భ్రమపడతాడు. ప్లాస్టిక్ కవర్ని గాంధీ టోపీలా తగిలిస్తాడొకడు. పరీక్షల అట్ట ఒక గట్టి అడ్డం వానకు. తాటాకు పట్టుకుని పింఛం చేసుకుంటాడొకడు. ఆడపిల్లల ముఖాన పౌడరే మిగలదు. వానకు ఆగే ఉద్దేశం ఉండదు. ఇల్లు చేరేసరికి అంతా చిత్తడి చిత్తడిగా ఉంటుంది. అమ్మ కరెంటు పోతే ఇబ్బంది అని రాత్రి వంట తొందరగా ముగిద్దామని చూస్తుంది. నాన్న తొందరగా వస్తే బాగుండు అనిపిస్తుంది. గాలి ఈలలు భయంగా, ఇష్టంగా అనిపిస్తాయి. ముంగిట్లో ఉన్న మల్లెతీగ అంత ఊగగలదని అస్సలు తెలియదు. పెరట్లో జామ పిందెలన్నీ తడిసి మెరుస్తుంటాయి. పాలు తాగెళ్లే దొంగపిల్లి ఈసారికి ఊరుకోండి అని వరండాలో ఒక మూల చేరుతుంది. వీధి కుక్క సొంతంత్రంగా గేటు తోసుకుని తడిలేని మట్టిలో వెచ్చగా పడుకుంటుంది. ఆ రాత్రి రొట్టెలు, పప్పూ రుచిగా ఉంటాయి. కిరోసిన్ దీపం రెడీ అవుతుంది. కరెంటు పోయినా వాన పోనంటూ కురుస్తూనే ఉంటుంది. తలుపులేసుకొని వెచ్చగా పడుకుంటే బోలెడు కబుర్లు నడుస్తాయి. మరుసటి ఉదయం బాగా నానిన వాల్‌పోస్టర్ ఊడబెరికి అట్టలు వేసుకోవచ్చన్న ఊహ ఉత్సాహాన్ని ఇస్తుంది. దూరంగా ధడేలున ఎక్కడో పిడుగుపడుతుంది. రేపు స్కూలు ఏ విధంగానూ ఉండదన్న సంతోషంతో నిద్ర భలేగా పడుతుంది. వానకు జేజే. వానకు ఆగే ఉద్దేశం ఉండదు. ఇల్లు చేరేసరికి అంతా చిత్తడి చిత్తడిగా ఉంటుంది. అమ్మ కరెంటు పోతే ఇబ్బంది అని రాత్రి వంట తొందరగా ముగిద్దామని చూస్తుంది. నాన్న తొందరగా వస్తే బాగుండు అనిపిస్తుంది. గాలి ఈలలు భయంగా, ఇష్టంగా అనిపిస్తాయి. ముంగిట్లో ఉన్న మల్లెతీగ అంత ఊగగలదని అస్సలు తెలియదు. పెరట్లో జామ పిందెలన్నీ తడిసి మెరుస్తుంటాయి. -
TS: తెలంగాణలో మూడు రోజులు బడులు బంద్
సాక్షి, హైదరాబాద్: గత రెండు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షాల పరిస్థితిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఇందులో భాగంగా వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో మూడు రోజుల(సోమ, మంగళ, బుధవారాలు) పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి మళ్లీ విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఇది కూడా చదవండి: బయటికి రావొద్దు!.. సీఎం కేసీఆర్ హెచ్చరిక -
తెలంగాణ: స్కూళ్ల రీ-ఓపెన్‌పై మరోసారి ప్రకటన
-
తెలంగాణ: స్కూళ్ల రీ-ఓపెన్‌పై మరోసారి ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వేసవి సెలవుల పొడగింపుపై తల్లిదండ్రుల్లో కాస్త అయోమయం, కరోనా కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన నెలకొంది. అయితే పొడగింపు ఎట్టిపరిస్థితుల్లో ఉండబోదని, యథాతథంగా స్కూల్స్ తెరుచుకుంటాయని తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే ఒక స్పష్టత ఇచ్చింది. ఈ తరుణంలో ఇవాళ మరోసారి ప్రకటన చేశారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సెలవుల పొడిగింపు లేదని ఆదివారం మీడియాకు తెలిపిన ఆమె.. రేపటి నుంచి(జూన్ 13, సోమవారం) స్కూళ్లు రీ ఓపెన్ అవుతాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి అయోమయానికి గురికావొద్దని చెప్పారామె. అలాగే ఈ ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు ఆమె. అదే విధంగా ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. తెలంగాణలో కొవిడ్ కేసులు పెరుగుతున్నందున పాఠశాలలకు సెలవులకు పొడగింపులు ఉండొచ్చనే కథనాలు జోరందుకున్నాయి. అయితే అలాంటిదేం ఉండబోదని విద్యాశాఖ ఆ వెంటనే స్పష్టత ఇచ్చేసింది. కరోనా కేసుల పరిస్థితి అదుపులోనే ఉన్నందున.. సెలవులు పొడగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. కరోనా జాగ్రత్తలతో పాఠశాలలు నడిపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. -
TS: జూన్ 13 నుంచి స్కూల్స్ రీఓపెన్.. మంత్రి సబిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో విద్యాసంస్థల రీ-ఓపెనింగ్‌పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే సోమవారం(జూన్13) నుంచి విద్యా సంస్థలను తెరవనున్నట్టు స్పష్టం చేశారు. వేసవి సెలవుల్లో ఎలాంటి పొడిగింపులేదని క్లారిటీ ఇచ్చారు. -
తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు..?
-
తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు..?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ అధికారిక లెక్కల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే 155 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో విద్యా సంస్థలు తెరుచుకోవడంతో ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలు తెరుచుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నుంచి విద్యాసంస్థలు ఓపెన్ కానుండటంతో పాఠశాలలకు సెలవులు పొడిగింపు ఉంటుందా..? అనే చర్చ నడుస్తోంది. అయితే, కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే వైద్యశాఖ నివేదిక ఇవ్వడం, హెచ్చరించడంతో విద్యా సంస్థలు తెరుచుకోవడంపై ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో పాఠశాలల ప్రారంభంపై ఆదివారం సాయంత్రానికి ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: బడి పిల్లల మధ్యాహ్న భోజనంలో మార్పులకు కేంద్రం నిర్ణయం -
పాఠశాలల్లో కరోనా కలకలం.. స్కూల్స్ మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 366 కోవిడ్-19 కొత్త పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో పాజిటివిటీ రేటు 3.95 శాతానికి పెరిగిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 18,67,572కి చేరింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీలోని స్కూల్స్‌లో కరోనా బీభత్సం సృష్టించింది. ఇప్పటికే కరోనా సోకి 53 మంది విద్యార్థులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. శనివారం మరో 14 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో పాఠశాలలను మూసివేస్తున్నట్టు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ సందర్బంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ఢిల్లీ స్కూల్స్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. అందుకే వేరే మార్గం లేక పాఠశాలలను మూసివేస్తున్నట్టు చెప్పారు. -
తెలంగాణ: నేటి నుంచి స్కూళ్లకు సెలవులు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ రెండో దశతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు ఊరట కోసం పల్లెబాట పడుతున్నారు. బుధవారం నుంచి పిల్లలకు దసరా సెలవులు కావడంతో సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే నగరం నుంచి వివిధ మార్గాల్లో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించిన దక్షిణమధ్య రైల్వే రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ఆర్టీసీతో పాటు ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలు కాచుకొని ఉన్నాయి. చదవండి: తీరొక్క పూల పండుగ.. బతుకమ్మ నేటి నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ► నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 4200 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ► నుంచే ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ► తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా ఎక్కువ మంది తరలి వెళ్లనున్న దృష్ట్యా మహాత్మాగాంధీ, జూబ్లీబస్‌స్టేషన్‌లతో పాటు ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ చౌరస్తా, కూకట్పల్లి తదితర ప్రాంతాల నుంచి నేరుగా బస్సులు బయలుదేరనున్నాయి. ► ఈ బస్సుల్లో చార్జీలు రెగ్యులర్ కంటే అదనంగా ఉంటాయి. కనీసం 30 మంది ఉంటే డైరెక్ట్ బస్సు దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని మరో ప్రత్యేక సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ఏదో ఒక కాలనీ నుంచి లేదా పనిచేసే స్థలం నుంచి కనీసం 30 మంది లేదా అంతకంటే ఎక్కువ ప్రయాణికులు ఉంటే వాళ్లు బయలుదేరే స్థలం నుంచి చేరుకోవలసిన గమ్యస్థానం వరకు డైరెక్ట్ బస్సును ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. నగరంలోని ఆర్టీసీ సమాచార కేంద్రాలను సంప్రదిస్తే ఈ సదుపాయం లభిస్తుందన్నారు. అలాగే సమీపంలోని డిపో నుంచి కూడా బస్సును బుక్ చేసుకోవచ్చు. భవన నిర్మాణ రంగంలో, పారిశ్రామిక ప్రాంతాల్లో పని చేసే ఒకే ప్రాంతానికి చెందిన కార్మికులు, కాంట్రాక్టర్ల వద్ద పని చేసే ఒకే ప్రాంతానికి చెందిన వలస కూలీలు, ఒకే ప్రాంతానికి వెళ్లవలసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పండుగ బస్సుల సమాచారం కోసం ఏర్పాటు చేసిన కేంద్రాల ఫోన్ నెంబర్లు ► రేతిఫైల్ బస్ స్టేషన్- 9959226154 ► కోఠి బస్ స్టేషన్-9959226160 ► ఎంజీబీఎస్-9959226257 ► జూబ్లీ బస్‌స్టేషన్-9959226246 -
స్కూళ్ల మూసివేత.. తరగతులు రద్దు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతుండడంతో ముందు జాగ్రత్తగా పాఠశాలలను మూసివేస్తూ/ తరగతులను రద్దు చేస్తూ కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయం తీసుకున్నాయి. స్కూళ్లను నిరవధికంగా మూసివేస్తున్నట్లు గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ తదితర రాష్ట్రాలు ప్రకటించాయి. ఇక తరగతులను రద్దు చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, బిహార్, పంజాబ్ ప్రభుత్వాలు వెల్లడించాయి. ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించాలని పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశాయి. తదుపరి ఉత్తర్వులు విడుదల చేసే వరకూ విద్యార్థులెవరూ పాఠశాలలకు రావొద్దని ఢిల్లీ సర్కారు స్పష్టం చేసింది. 9వ తరగతి వరకూ పాఠశాలలను ఏప్రిల్ 5 నుంచి రెండు వారాల పాటు మూసివేస్తున్నట్లు జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగం తెలియజేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 8వ తరగతి వరకు స్కూళ్ల మూసివేత గడువును ఏప్రిల్ 11 దాకా పొడిగించింది. మహారాష్ట్రలో 10, 12వ తరగతుల విద్యార్థులు, పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు మాత్రమే క్లాసులకు హాజరు కావొచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 10 దాకా స్కూళ్లను మూసివేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం పేర్కొంది. గుజరాత్, రాజస్తాన్‌లోనూ స్కూళ్లు మూతపడ్డాయి. బిహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరిలో కరోనా కారణంగా స్కూళ్లకు తాళాలేయడంతో చదువులకు ఆటంకం కలుగుతోంది. మహమ్మారి ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో మూసివేత గడువును ప్రభుత్వాలు ఇంకా పొడిగిస్తున్నాయి. షిర్డీ ఆలయం మూసివేత కేసులు శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం షిర్డీ సాయి ఆలయాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం రాత్రి నుంచి తిరిగి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసే ఉంటుందని స్పష్టం చేసింది. కోవిడ్‌ను కట్టడి చేసేందుకు షిర్డీ ఆలయంతో పాటు ఇతర దేవాల యాలన్నింటిని మూసేస్తున్నట్లు చెప్పింది. షిర్డీ ఆలయం మూసినప్పటికీ, అర్చకుల ఆధ్వర్యంలో నిత్య పూజలు కొనసాగుతూనే ఉంటాయని శ్రీ షిర్డీ సాయిబాబా ట్రస్టు ముఖ్య కార్యనిర్వహణాధికారి రవీంధ్ర ఠాక్రే చెప్పారు. -
మార్చి 8దాకా బడి బంద్
లండన్: ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్ ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో పాఠశాలలను మార్చి 8వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. ఆయన తాజాగా పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడారు. మార్చి 8 తర్వాత పాఠశాలలను తెరవడంపై అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నరు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోందని గుర్తుచేశారు. దేశంలో లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేయడానికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి 15న దీనిపై నిపుణులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగానే లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యదాకా అర్హులైన విద్యార్థులకు ఫుడ్ పార్సెళ్లు/ఓచర్లు అందుతాయని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. -
బడులు తెరిచేందుకు ఆదేశాల్లేవు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యం లో పాఠశాలలు పునఃప్రారంభించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ స్ప ష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవే టు, ఎయిడెడ్ స్కూల్స్ తెరిచేందుకు జిల్లాల విద్యాశాఖ అధికారులు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని ఆదేశించింది. (విద్యార్థులకు పాఠం చెప్పేదెలా?) అదేవిధంగా పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు సంబం ధించి రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిత్రా రామచంద్రన్ బుధవారం ప్రొసీడింగ్ జారీచేశారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రొసీడింగ్‌లో స్పష్టం చేశారు. -
ఢిల్లీలో జూలై 31 వరకు స్కూళ్లు బంద్
న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఢిల్లీలోని పాఠశాలలను జూలై 31 వరకు తెరవకూడదని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ‘జూలై 31 వరకు పాఠశాలల మూసివేత కొనసాగుతుంది. అయితే, ఆన్లైన్ క్లాసెస్‌ను నిర్వహించుకోవచ్చు’ అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా శుక్రవారం తెలిపారు. పాఠశాలల పునః ప్రారంభంపై అధికారులతో చర్చించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. విద్యార్థులపై భారం తగ్గించేందుకు సిలబస్‌ను 50% తగ్గించడం, ప్రతీ తరగతికి ప్రత్యేక ఆన్లైన్ యాక్టివిటీస్‌ను రూపొందించడం.. తదితర అంశాలపై వారు చర్చించారు. ‘ఒక్కో క్లాస్‌లో 12 నుంచి 15 మంది విద్యార్థులు ఉండేలా, వారానికి ఒకటి, లేదా రెండు రోజులు, రొటేషన్ పద్ధతిలో ప్రైమరీ క్లాస్‌లను నడపాలి. అవకాశమున్న ప్రతీ సందర్భంలో ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహించాలి’ అనే సూచనలు ఈ సందర్భంగా వచ్చాయి. ‘కరోనాకు భయపడకుండా, పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయాలి’ అని మనీశ్ వ్యాఖ్యానించారు. -
మరణాలు 5 వేలు.. కేసులు 1.34 లక్షలు
టెహ్రాన్/ఒట్టావా/పారిస్/వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళనృత్యం కొనసాగుతూనే ఉంది. ఈ కోవిడ్–19 వల్ల ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5 వేలు దాటింది. కేసుల సంఖ్య 1.34 లక్షలకు చేరింది. మృతుల సంఖ్య చైనాలోనే అత్యధికం. అక్కడ 3,176 మంది చనిపోయారు. ఇరాన్ లాక్డౌన్ కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న 24 గంటల్లో సైనిక దళాలు ఇరాన్ వీధులన్నింటినీ స్వాధీనం చేసుకుంటాయని, ఆ తరువాత ప్రతీ పౌరుడికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపుతామని శుక్రవారం ప్రకటించింది. కరోనాపై యుద్ధంలో సైనిక దళాలు ప్రధాన పాత్ర పోషించాలని సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ఆదేశించారు. ఇప్పటికే శుక్రవారం సామూహిక ప్రార్థనలను ఇరాన్ రద్దు చేసింది. పాఠశాలలను మూసివేసింది. ఈ వైరస్ కారణంగా ఇరాన్లో గురువారం ఒక్కరోజే 85 మంది మృత్యువాత పడ్డారు. 1,289 మందికి కొత్తగా ఈ వైరస్ సోకింది. మొత్తంగా ఆ దేశంలో కోవిడ్–19 వల్ల మృతి చెందిన వారి సంఖ్య 514కి, మొత్తం కేసుల సంఖ్య 11,364కి చేరింది. కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయినవారిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా ఖమేనీ విదేశీ వ్యవహారాల సలహాదారు అలీ అక్బర్ వెలాయతి కూడా ఉన్నారు. దేశ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రెవల్యూషనరీ గార్డ్స్ సభ్యులు, ఆరోగ్య శాఖలోని పలువురు అధికారులు కూడా ఈ వైరస్ బారిన పడినట్లు అధికార టీవీ ప్రకటించింది. అమెరికా విధించిన ఆంక్షల కారణంగా.. ఈ వైరస్ కట్టడికి అవసరమైన ఔషధాలు, ఇతర వైద్య పరికరాల దిగుమతిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అందువల్ల తమపై విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తేయాలని ఇరాన్ యూఎస్‌ను కోరింది. మరోవైపు, ఇటలీలో చిక్కుకుపోయిన భారతీయులను భారత్‌కు తీసుకువచ్చేందుకు వీలుగా.. వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు భారత వైద్యుల బృందం శుక్రవారం ఇటలీ చేరుకుంది. ఇప్పుడు కరోనా కేంద్రం.. యూరోప్ కరోనా వైరస్ కేంద్ర స్థానం ఇప్పుడు యూరోప్‌కి మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం యూరోప్‌లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయని, అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది. ఈ విశ్వవ్యాప్త మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్నదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ పేర్కొన్నారు. ఇటలీలో మృతుల సంఖ్య 1000 దాటింది. మొత్తం 15 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇటలీలోని లాంబర్డీ ప్రాంతంలో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీల్లో కేసుల సంఖ్య 2 వేల చొప్పున నమోదయ్యాయి. ఫ్రాన్స్, ఐర్లాండ్, డెన్మార్క్, నార్వే, లిథువేనియా, అల్జీరియా, స్లొవేకియాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వైరస్ భయానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు విదేశాల నుంచి రాకపోకలపై నియంత్రణలను విధించాయి. కళాశాలలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. సంస్థలు తమ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసుకునే సౌకర్యం కల్పించాయి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలు కూడా నిలిచిపోయాయి. విమానాశ్రయాలు, రహదారులు నిర్మానుష్యమయ్యాయి. ప్రజలు విందు, వినోదాల కు దూరంగా, ఇంట్లోనే ఉంటున్నారు. బృంద కార్య క్రమాలపై అప్రకటిత నిషేధం అమలవుతోంది. అమెరికాలో కేసుల సంఖ్య 16 వందలకు చేరింది. మరోవైపు, నేపాల్ ఎవరెస్ట్ సహా అన్ని పర్వతారోహణ కార్యక్రమాలపై నిషేధం విధించింది. అమెరికా నుంచే ఆ వైరస్? అమెరికా నుంచి వచ్చిన యూఎస్ సైన్యం ద్వారానే కరోనా వైరస్ చైనాకు చేరిందని చైనా అధికారి ఒకరు చేసిన ఒక ట్వీట్ అమెరికా, చైనాల మధ్య వివాదానికి దారితీసింది. కెనడా ప్రధాని భార్యకు కోవిడ్–19 కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో భార్య సోఫీ గ్రెగరీ ట్రూడోకు కరోనా వైరస్ సోకినట్లు తాజాగా నిర్ధారణ అయింది. దాంతో, భార్యతో పాటు జస్టిన్ ట్రూడో స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆస్ట్రేలియా సీనియర్ మంత్రి పీటర్ డటన్‌కు కూడా కరోనా కన్ఫర్మ్ అయింది. -
భారత్‌లో 30 కోవిడ్ కేసులు
న్యూఢిల్లీ: ప్రపంచం నలుమూలలకీ అత్యంత వేగంగా విస్తరిస్తోన్న కోవిడ్ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. వైరస్ విజృంభణతో ప్రపంచ ప్రజల దైనందిన జీవితంలోనూ పెనుమార్పులు సంభవిస్తున్నాయి. విదేశీయుల రాకపోకలపై ఆంక్షలు పెరిగాయి. పాఠశాలలు, ప్రార్థనాలయాలు మూతపడ్డాయి. చైనాలో వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతోంటే, ఇటలీ, ఇరాన్ లాంటి ఇతర దేశాల్లో తీవ్రతరమౌతోంది. కరోనా కలకలం అంతర్జాతీయంగా దాదాపు 30 కోట్ల మంది విద్యార్థులను వారంపాటు విద్యాలయాలకు దూరం చేసింది. భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 30కి చేరడంతో ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం మూసివేసింది. ఇటలీ, దక్షిణ కొరియాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. విదేశీయులను కోవిడ్ సోకలేదని వైద్యుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని భారత్ కోరుతోంది. భారత్‌లో 30 కోవిడ్ కేసులు ఇటలీకి చెందిన పర్యాటకులతో సహా మార్చి 4వ నాటికి భారత్‌లో 29 కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పార్లమెంట్లో ప్రకటించారు. 28,529 మందిని వైద్యపరిశీలనలో ఉంచినట్టు వెల్లడించారు. ఇటీవలే ఇరాన్లో పర్యటించి వచ్చిన ఘజియాబాద్‌కు చెందిన వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 30కి చేరింది. వైరస్‌ను గుర్తించేందుకు జిల్లా, గ్రామస్థాయిల్లో బృందాలను ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. (చదవండి: కోవిడ్‌ను జయించిన కేరళ విద్యార్థిని) మొత్తం 95 వేల మంది.. ప్రపంచవ్యాప్తంగా 95,000 మంది ప్రజలకు వైరస్ సోకగా, 3,200 మంది మరణించారు. ఇప్పటి వరకు 80 దేశాలకు కోవిడ్–19 వ్యాపించింది. చైనాలో తగ్గుముఖం పట్టిన వైరస్ వ్యాప్తి, చైనాలో కన్నా ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరిస్తోంది. గురువారం 31 మంది మృతిచెందగా ఇప్పటి వరకు మరణాల సంఖ్య 3,012కి చేరింది. 80,400 మందికి వైరస్ సోకినట్టు తేలింది. అమెరికాలో కోవిడ్ మృతుల సంఖ్య 11కు చేరడంతో కరోనాపై పోరాడేందుకు 8 బిలియన్ డాలర్లను వెచ్చించాలని అమెరికన్ కాంగ్రెస్ తీర్మానించింది. ఇరాన్లో మృతుల సంఖ్య 107కి చేరింది. 3,515 మందికి వైరస్ సోకినట్టు చేరింది. ఇటలీలోనూ కరోనా మృతుల సంఖ్య 107, బాధితులు 3000 మంది. దక్షిణ కొరియాలో బాధితుల సంఖ్య 6,000కు చేరింది. జీసస్ జన్మస్థలమైన పాలస్తీనాలోని బెత్లెహాం చర్చ్‌ని తాత్కాలికంగా మూసివేశారు. జపాన్, ఫ్రాన్స్‌లలో పాఠశాలలు మూసివేశారు. ఢిల్లీలోని మొగల్ గార్డెన్‌లోకి ప్రజల సందర్శనలను నిలిపి వేస్తున్నట్టు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ఫ్లూతో బాధపడే ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే అవకాశం ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 16 ఏళ్ల భారతీయ బాలికకు కోవిడ్ సోకినట్టు తేలింది. చాలా దేశాలు ఏమీ చేయడం లేదు.. ప్రపంచంలోని చాలా దేశాలు కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు తగు చర్యలు తీసుకోవడం లేదని, ఇది సరైన విధానం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ముప్పునకు తగ్గ చర్యలు తీసుకోవడంలో పట్టుదల చూపడం లేదని తెలిపింది. మోదీ బెల్జియం పర్యటన వాయిదా యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య ఒప్పందాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరగాల్సిన సదస్సు వాయిదా పడినట్లు భారత్ తెలిపింది. ఈ నెల 13న ఈ సమావేశం కోవిడ్ కారణంగా ఈ పర్యటన వాయిదా పడింది. ఇరు వర్గాలకూ కుదిరే మరో సమయంలో భేటీ జరుగనుంది. ఆక్టెమ్రాతో కోవిడ్‌కు చెక్? ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు దొరికిందా? అవును అంటోంది స్విట్జర్లాండ్ ఫార్మా కంపెనీ రోష్! ఆర్థరైటిస్ రోగుల్లో మంట/వాపులను తగ్గించేందుకు ఉపయోగించే అక్టెమ్రా అనే మందు కరోనా వైరస్ కట్టడికీ ఉపయోగపడవచ్చునని రోష్ చెబుతోంది. వ్యాధికి కేంద్రబిందువైన చైనాలో అక్టెమ్‌రాను వాడేందుకు ఇప్పటికే చైనా ప్రభుత్వ అనుమతి పొందిన రోష్ సుమారు 20 లక్షల డాలర్ల విలువైన మందులను చైనా ప్రభుత్వానికి ఉచితంగా అందజేసింది. అక్టెమ్‌రాను వైద్య పరిభాషలో టోసిలిజుమాబ్ అని పిలుస్తారు. 2010 నుంచి దీనిని అమెరికాలో ఆర్థరైటిస్ చికిత్సలో వాడుతున్నారు. దీంట్లో అత్యధిక మోతాదులో తెల్ల రక్తకణాలు విడుదల చేసే ప్రొటీన్లు ఉంటాయి. చైనా ప్రచురించిన మార్గదర్శకాల ప్రకారం కరోనా కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతిన్న వారికి అక్టెమ్‌రాను వాడవచ్చు. -
బడి బలోపేతం
కరీంనగర్‌ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలో ఈనెల 14 నుంచి 19 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టేందుకు జిల్లా విద్యాశాఖ పూర్తి ఏర్పాట్లు చేస్తోంది. రోజుకో కార్యక్రమం ద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచడం, హాజరు , ఉత్తీర్ణత పరిశీలించడం, విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, బాలకార్మికుల నమోదు, పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ, ప్రత్యేక కేంద్రాల్లో చేరికకు విద్యార్థుల ఎంపిక, తదితర వాటిపై దృష్టిపెట్టనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయనున్నారు. ఆరు రోజులపాటు సాగనున్న బడిబాటకు కరపత్రాలు, బ్యానర్లతో విసృత ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులను ఇప్పటికే ఆదేశించింది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని అవాస ప్రాంతాల్లోని బడిఈడు పిల్లలను గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచి నాణ్యమైన విద్యను అందించడం, ప్రభుత్వ పాఠశాలల్లో సమాన భాగస్వామ్యంతో బలోపేతం చేయడం, అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు నిండిన బాలబాలికలను సమీపంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం, గ్రామ విద్య రిజిస్టర్ అప్లోడ్ చేయడం, ప్రాథమిక పాఠశాలల్లో 5వ తరగతి పూర్తి చేసుకున్న వారిని ప్రాథమికోన్నత పాఠశాలల్లో, ప్రాథమిక పాఠశాలలో 7వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో చేర్పించి నూరుశాతం ఎన్రోల్మెంట్ పూర్తి చేయడం, తక్కువ ఎన్రోల్ ఉన్న పాఠశాలలను గుర్తించి తల్లిదండ్రుల భాగస్వామ్యంతో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళిక రూపొందించనున్నారు. బాలిక విద్య ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు వివరించి బాలికలను పాఠశాలల్లో చేర్పించడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయనుంది. నిధులు మంజూరు... బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రచార సామగ్రి, ప్రగతి నివేదికలు, బ్యానర్లు వంటి వాటికి ఒక్కో పాఠశాలకు రూ.1000 చొప్పున డీఈవోల నుంచి ఎంఈవోలకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని 620 పాఠశాలలకు రూ.6,20,000 మంజూరు చేసింది. ఆంగ్ల మాధ్యమంపై విస్తృత ప్రచారం... ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేస్తున్నట్లు విసృతంగా ప్రచారం చేయాలని విద్యా కమిటీలకు ఇప్పటికే జిల్లా విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యతోపాటు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు విసృతంగా ప్రచారం చేపట్టడంతోపాటు కొత్తగా ఆంగ్ల మాధ్యమ తరగతులను ప్రారంభించే విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో బడిబయట ఉన్న పిల్లల నమోదును పెద్ద ఎత్తున పెంచేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతుంది. రోజువారీ బడిబాట కార్యక్రమాలు... 14వ తేదీన బడిబాట ప్రాధాన్యతను గుర్తించేలా అవాస పాఠశాలలను అందంగా అలంకరించాలి. గ్రామంలో ర్యాలీ నిర్వహించి కరపత్రాలను పంచాలి. విద్యార్థులతో ‘మన పాఠశాల మన గ్రామం’ నినాదంతో ప్రచారం. పాఠశాల పనితీరుపట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం. 15వ తేదీన పాఠశాలల్లో బాలికలకు బాలిక విద్యపట్ల ప్రత్యేక అవగాహన కల్పించడం. బాలికల జీవనైపుణ్యం పెంపొందించేలా కార్యక్రమాలు. 16న సామూహిక అక్షరాభ్యాసం, పిల్లల తల్లిదండ్రులతో సమావేశం, ఉన్నత పాఠశాలల్లో నూతనంగా చేరిన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం. 17న స్వచ్చ పాఠశాలలో భాగంగా తరగతి గదులను, మరుగుదొడ్లను, పాఠశాల ఆవరణను శుభ్రం చేసుకోవడం, చెట్ల సంరక్షణ, చెట్లకు నీరుపోయడం, చెట్ల బాధ్యతను విద్యార్థులకు అప్పగించడం. 18న బాలకార్మికులకు గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం, అవసరమైతే బాల కార్మిక నిర్మూలనాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికా«ధికారులను భాగస్వామ్యులు చేయడం. పాఠశాల యాజమాన్య కమిటితో సమావేశం నిర్వహించాలి. 19న ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలపై ప్రచారం... మాతృభాష, ఆంగ్ల భాషలో విద్యాబోధన, డిజిటల్ తరగతి గదులు, నాణ్యమైన విద్య, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, పాఠశాల యాజమాన్య కమిటి ఏర్పాటు. రవాణా భత్యం, స్కాలర్షిప్లు, ఎస్కార్ట్ అలవెన్స్‌లపై అవగాహన కల్పిస్తారు. ప్రత్యేక శ్రద్ధ చూపాలి జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని ఈనెల 14 నుంచి 19 వరకు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. విద్యాకమిటీల భాగస్వామ్యంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మండలస్థాయి అధికారులను, స్వచ్ఛంద సంస్థలను, మహిళ సంఘాలను, యువతను సమావేశాలకు ఆహ్వానించి విద్యార్థుల సంఖ్యను పెంచేలా కృషి చేయాలి. ఈమేరకు ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. – వెంకటేశ్వర్లు, డీఈవో, కరీంనగర్ -
హమ్మయ్య.. సెలవిచ్చారు!
శ్రీకాకుళం: ఎట్టకేలకు కలెక్టర్‌గారు స్పందించారు. విద్యార్థుల కష్టాలు గుర్తించారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని గురువారం జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆదేశించారని డీఈవో అరుణకుమారి బుధవారం తెలిపారు. జిల్లాలో మళ్లీ ఎండలు, వేడిగాలుల తీవ్రత పెరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. వాస్తవానికి పది రోజులుగా జిల్లాతోపాటు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల స్థాయిలో నమోదవుతున్నాయి. వీటికితోడు తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి. దీంతో పలు జిల్లాల కలెక్టర్లు ఆయా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ శ్రీకాకుళంలో మాత్రం సెలవు ప్రకటించలేదు. ఐదారు రోజుల క్రితం బూర్జ మం డలం గుత్తావల్లి పాఠశాలలో ఐదుగురు విద్యార్థు లు వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోయారు కూడా. అప్పటికి గానీ కలెక్టర్ స్పందించలేదు. అది కూడా ఆ మరుసటి రోజు విద్యార్థులందరూ స్కూళ్లకు వెళ్లిన తర్వాత మధ్యాహ్నం పూటే సెలవు ప్రకటించారు. దాంతో విద్యార్థులు ఎండలో ఉసూరుమంటూ తిరిగి ఇళ్లకు వెళ్లాల్సి వచ్చింది. కాగా ఇటీవల రెండు రోజులు వాతావరణం కాస్త చల్లబడినా మంగళవారం నుంచి మళ్లీ ఎండలు ముదిరాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కోస్తా జిల్లాలైన విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో పాఠశాలలకు అక్కడి కలెక్టర్లు మంగళవారం నుంచే సెలవు ప్రకటించారు. ఇప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్పందించలేదు. బుధవారం పిల్లలు ఎండలోనే స్కూళ్లకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఆలస్యంగానే స్పందించి గురువారం జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటిం చారు. అయితే బుధవారం రాత్రి జిల్లాలో చాలా చోట్ల వర్షాలు కురిసి వాతావరణం చల్లబడటం కొసమెరుపు.