
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వైద‍్య ఆరోగ్యశాఖ అధికారిక లెక్కల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే 155 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో విద్యా సంస్థలు తెరుచుకోవడంతో ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలు తెరుచుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నుంచి విద్యాసంస్థలు ఓపెన్ కానుండటంతో పాఠశాలలకు సెలవులు పొడిగింపు ఉంటుందా..? అనే చర్చ నడుస్తోంది.
అయితే, కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే వైద్యశాఖ నివేదిక ఇవ‍్వడం, హెచ్చరించడంతో విద్యా సంస్థలు తెరుచుకోవడంపై ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో పాఠశాలల ప్రారంభంపై ఆదివారం సాయంత్రానికి ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: బడి పిల్లల మధ్యాహ్న భోజనంలో మార్పులకు కేంద్రం నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment