Dussehra Holidays 2022: Telangana Education Department Clarity No Changes - Sakshi
Sakshi News home page

దసరా సెలవులు కుదింపు వాస్తవమేనా?.. తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ

Published Wed, Sep 21 2022 3:06 PM | Last Updated on Wed, Sep 21 2022 4:12 PM

Telangana Education Department Clarity No Changes In Dussehra Holidays - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని.. సెలవుల కుదింపుపై వస్తున్న వార్తలను తెలంగాణ విద్యాశాఖ ఖండిచింది. కుదింపుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 9 వరకు దసరా సెలవులు కొనసాగుతాయని విద్యాశాఖ ప్రకటించింది. అక్టోబర్ 10న పాఠశాలల పునఃప్రారంభమవుతాయని పేర్కొంది.
చదవండి: నెహ్రూ జూపార్కులోనే ఓ చీతా ఉంది.. కావాలనుకుంటే వెళ్లి చూడొచ్చు!

కాగా, విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా దసరా సెలవులను తగ్గించాలని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యు కేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌–ఎస్‌సీఈఆర్‌టీ) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ రాధారెడ్డి మంగళవారం.. పాఠశాల విద్య డైరెక్టర్‌కు ఓ లేఖ రాశారు. జూలైలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ నెల 11 నుంచి 16 రోజులపాటు సెలవులు, ఈ నెల 17న జాతీయ సమైక్యతాదినోత్సవాన్ని పురస్కరించుకుని మరో సెలవు.. ఇలా అనుకోకుండా వచ్చిన సెలవుల వల్ల స్కూళ్లు మూతపడ్డాయని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement