సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ‍్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 366 కోవిడ్-19 కొత్త పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో పాజిటివిటీ రేటు 3.95 శాతానికి పెరిగిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 18,67,572కి చేరింది.
ఇదిలా ఉండగా.. ఢిల్లీలోని స్కూల్స్‌లో కరోనా బీభత్సం సృష్టించింది. ఇప్పటికే కరోనా సోకి 53 మంది విద్యార్థులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. శనివారం మరో 14 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో పాఠశాలలను మూసివేస్తున్నట్టు మార్గదర‍్శకాలను జారీ చేసింది.
ఈ సందర్బంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ఢిల్లీ స్కూల్స్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. అందుకే వేరే మార్గం లేక పాఠశాలలను మూసివేస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment