న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. వాయు నాణ్యత పడిపోతోంది. వరుసగా ఆరో రోజు ఆదివారం సైతం పొగ మంచు దట్టంగా కమ్మేసింది. నగరంలో కాలుష్యం మరోసారి ‘అత్యంత తీవ్రం’ కేటగిరీలోకి చేరింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) శనివారం సాయంత్రం 4 గంటలకు 415 ఉండగా, ఆదివారం ఉదయం 7 గంటలకు 460గా దిగజారింది. కలుíÙత గాలితో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలకు సెలవులను ప్రభుత్వం మరో ఐదు రోజులపాటు పొడిగించింది. ఈ నెల 10వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. 6 నుంచి 12వ తరగతి వరకు స్కూళ్లు తెరిచే ఉంటాయని పేర్కొంది. విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులు కూడా వినవచ్చని ఢిల్లీ విద్యా శాఖ మంత్రి సూచించారు. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండడం, పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాలను దహనం చేస్తుండడంతో ఢిల్లీలో వాయు నాణ్యత పడిపోతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల రాజధానుల కంటే ఢిల్లీలో వాయు నాణ్యత అత్యంత దారుణంగా ఉన్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది.
వాణిజ్య వాహనాలకు నో ఎంట్రీ
ఢిల్లీలో వాయు నాణ్యత నానాటికీ పడిపోతుండడం, కాలుష్యం పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిర్మాణ పనులపై నిషేధం విధిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కాలుష్యానికి కారణమయ్యే రవాణా వాహనాలు, వాణిజ్య వాహనాల ప్రవేశాన్ని నిషేధించింది.
Comments
Please login to add a commentAdd a comment