సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలకు నేడు, రేపు సెలవులు ప్రకటించింది. భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్రంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తున్నట్టు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో కుండపోత వాన కురుస్తోంది. చెరువులు, వాగులు, వంగలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. భారీ నుంచి అతిభారీవర్ష హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.
Keeping in view of the heavy rainfall in the state and under the instructions of the Honourable CM, KCR garu, the Govt has decided to declare holidays for two days to all education institutions in the state. That is Thursday and Friday.
— SabithaReddy (@SabithaindraTRS) July 20, 2023
రాత్రి వీచిన ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్‌లో భారీ వర్షం కురుస్తోంది. అటవీ ప్రాంతాల్లో ప్రమాదకరస్థాయిలో వాగులు ప్రవహిస్తున్నాయి. కుమ్రంభీం జిల్లా బెజ్జూర్‌లో 14 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యాయి.
ఇది కూడా చదవండి: తెలంగాణ: అంతటా కుండపోత.. లోతట్టు జలమయం.. అతిభారీ వర్షాల హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment