సాక్షి, న్యూఢిల్లీ: స్కూల్ విద్యార్థులకు ఢిల్లీ ప్రభుత్వం శీతాకాల సెలవులు ప్రకటించింది. 2023-2024 విద్యా సంవత్సరానికి గాను వచ్చే ఏడాది.. జనవరి 1 నుంచి 6 వరకు స్కూల్స్‌కు శీతాకాల సెలవులు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం డెరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓ సర్య్కూలర్‌ను విడుదల చేసింది. సాధారణంగా ప్రతి ఏడాది పాఠశాల విద్యార్థులకు ఢిల్లీ ప్రభుత్వం శీతాకాల సెలవులు ప్రకటిస్తుందన్న విషయం తెలిసిందే.
Delhi Government’s Directorate of Education issues circular for winter vacation in Delhi Govt Schools. The Winter Vacation for Academic Session 2023-2024 is scheduled to be observed from 1st January 2024 (Monday) to 6th January 2024 (Saturday) pic.twitter.com/P1GXIROySN
— ANI (@ANI) December 6, 2023
15 రోజులు పాటు ఉండే సెలవులను ఈసారీ 6 రోజులకే పరిమితం చేశారు. ఢిల్లీలోని తీవ్రమైన వాయు కాలుష్యం కారణంగా గత నవంబర్ నెల మొదట్లో 9వ తేదీ నుంచి 18వరకు స్కూల్స్ మూసివేసిన సంగతి విదితమే. అందుకే ప్రతి యేటా జనవరి 1 నుంచి 15 వరకు ఇవ్వాల్సిన సెలవును ఈసారి ఆరు రోజులకే తగ్గించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment