ఢిల్లీ: గత కొన్ని రోజులుగా ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్రంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీకి సాయంగా మిగులు నీటిని విడుదల చేయాలని తాజాగా సుప్రీంకోర్టు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసింది. రేపు(శుక్రవారం) 137 క్యూసెక్కుల నీటిని ఢిల్లీకి విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
నీటి విడుదలకు హిమాచల్ ప్రదేశ్ అంగీకారం తెలిపిందని కోర్టు తెలిపింది. అదేవింధంగా వాజీరాబాద్ బ్యారేజ్ ద్వారా నీటి విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని హర్యానాను సుప్రీం కోర్టు ఆదేశించింది. నీటి విడుదల చేసే సమయంలో హర్యానాకు ముందుస్తు సమాచారం అందించాలని హిమాచల్ ప్రదేశ్‌కు కోర్టు సూచించింది.
సంక్షోభ సమయంలో నీటిని ఎట్టిపరిస్థితుల్లో వృథా చేయవద్దని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఢిల్లీలో తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొనడంతో తమ రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా నుంచి నీటిని అందించాలని ఆప్ ప్రభుత్వం గతవారం సుప్రీకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
దేశ రాజధాని ఢిల్లీ వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రత కారణంగా నీటి సంక్షోభం ఏర్పడింది. ఇలాంటి సమయంలో నీటిని వృథా చేస్తే రూ. 2 వేలు జరిమానా వేస్తామని ఆప్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటక చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment