ఢిల్లీ: శంభూ సరిహద్దు రహదారిని పాక్షికంగా తెరవాలని సుప్రీం కోర్టు హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు శంభూ సరిహద్దు జిల్లాలు పాటియాల, అంబాల ఎస్సీలతో భేటీ అయి వారం రోజుల లోపు శంభూ సరిహద్దు హైవేను తెరవాలని ఆదేశించింది. ఈ విషయంపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు క్రమంలో సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. హైవేలు ఉన్నది పార్కింగ్ స్థలం కోసం కాదని పేర్కొంది. వెంటనే పంజాబ్ ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపి.. హైవే మీద నిలిపిన ట్రాక్టర్లను తొలగించేలా చూడాలని సూచించింది.
అత్యవసర సేవలు అంబులెన్స్ రాకపోకలు, వృద్దులు, మహిళలు, విద్యార్థినీలు, స్థానిక ప్రయాణికుల అవసరాల కోసం శంభూసరిహద్దును పాక్షికంగా ఓపెన్ చేయాలని న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అదేవిధంగా రాజకీయాలతో సంబంధంలేనివారితో ఓ కమిటీ ఏర్పాటు చేసి రైతులతో చర్చలతో జరపడానికి చేసిన కృషికి ఇరు రాష్ట్రా ప్రభుత్వాలను సుప్రీకోర్టు అభినందించింది.
శంభు సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతులతో మాట్లాడేందుకు ఏర్పాటు చేయాల్సిన ప్యానెల్ నిబంధనలపై కూడా ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ఇక.. పంటలకు మద్దతు ధర డిమాండ్ చేస్తూ.. పంజాబ్, హర్యానా రైతులు పెద్దఎత్తున దేశ రాజధాని ఢిల్లీ చేరుకొవాలని ప్రయత్నించగా వారిని పోలీసులు శంభుసరిహద్దుల్లో అడ్డుకున్నారు. దీంతో ఫిబ్రవరి 13 నుంచి శంభు సరిహద్దుల్లో రైతులు తమ ట్రాక్టర్లను రహదారికి అడ్డుపెట్టి నిరసన తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment