
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు తీపి కబురు అందించింది. మంగళవారం ఈ ఏడాది దసరా పండుగకు 13 రోజులపాటు సెలవులను అధికారికంగా ప్రకటించింది. దసరా పండుగ నేపథ్యంలో సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, అక్టోబర్ 10వ తేదీన విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇక, 5వ తేదీన దసరా పండుగగా ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment