
డల్లాస్ : తెలుగు పీపుల్స్ అసోసియేషన్ (టీపాడ్) ఆధ్వర్యంలో అమెరికాలోని డల్లాస్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ సంబరాల్లో నటి అనూ ఇమ్మాన్యుయేల్ ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ ఆడి, జమ్మి పూజలో పాల్గొన్నారు. డల్లాస్‌లోని అలెన్ ఈవెంట్ సెంటర్‌ని మహిళలు, యువతులు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. టీపాడ్ సభ్యులతో పాటు, పక్కనున్న ఓక్లాహోమా, కన్సాస్, ఆర్కాన్సాస్ రాష్ట్రాలకు చెందిన భారతీయులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. టీపాడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాల్లో దాదాపు 10 వేల మంది పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో వేణు భాగ్యనగర్, విక్రమ్ జనగాం, జయ తెలకపల్లి, రత్న ఉప్పల, నరేష్ సంకిరెడ్డి, సతీష్ నగిల్లా, కళ్యాణి తాడిమెటి, గంగ దేవర, అనురాధ మేకల, లక్ష్మీ పొరెడ్డి, బుచి రెడ్డి గోల్, వంశీ కృష్ణ ఉప్పలదాడియం, అపర్ణ కొల్లూరి, అనుష వనం, జయశ్రీ మురుకుట్ల, అపర్ణ ఎద్దుల, రేణుక చనుమోలు, శ్రీనివాస్ తుల, శ్రీనివాస్ కంచర్ల, రవీంద్రనాథ్ దూళిపల్లి, స్వప్న తుమ్మపాల, శశిరెడ్డి కర్రి, వందన గౌరు, మాధవి మెంట, మంజుల తొడుపునూరి, గాయత్రి గిరి, మాధవి ఓంకార్, శ్రీనివాస్ అన్నమనేని, శ్రీనివాస్ కూటికంటి, శ్రవణ్ నిదిగంటి, శ్రీకాంత్ రౌతు, తిల్‌క వన్నంపుల, శరత్ పున్రెడ్డి పాల్గొన్నారు.









Comments
Please login to add a commentAdd a comment