TPAD
-
'టీ-పాడ్' నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ 'టీ-పాడ్' నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో డాలస్ ప్రాంతీయులు, అన్ని స్థానిక, తెలుగు జాతీయ సంస్థల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజల్వన, గణపతి ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన కార్యవర్గ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. టీ-పాడ్ 2024 అధ్యక్షురాలిగా కన్నయ్యగారి రూప, కార్యదర్శిగా అన్నమనేని శ్రీనివాస్, కోశాధికారిగా గణపవరపు బాలాలు ఎన్నికయ్యారు. ఫౌండేషన్ కమిటీ అధ్యక్షుడిగా జానకిరాం, ఉపాధ్యక్షుడిగా అజయ్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా బుచ్చి రెడ్డిలు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి సభ్యులు అభినందనలు తెలిపారు. టీ-పాడ్ తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించడమే కాకుండా జట్టు సభ్యులకు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడానికి వేదిక అయిందని సంస్థ అధ్యక్షురాలు పేర్కొన్నారు. టీ-పాడ్ ఏర్పాటు చరిత్ర, అనేక సంవత్సరాలుగా నిర్వహించిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు వివరించారు. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం.. బతుకమ్మ, దసరా సంబరాలను వాటి సిగ్నేచర్ స్టైల్లో నిర్వహించడం గురించి వివరించారు. చివరగా ఈ ఏడాది టీపాడ్ చేపట్టాల్సిన కార్యక్రమాలపై నూతన కార్యవర్గం చర్చించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు ప్రాంతీయ, జాతీయ సంస్థల నాయకులు.. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందించారు. (చదవండి: న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ రామ మయం) -
Dallas Bathukamma : డాలస్‌లో సందడి చేసిన టీపాడ్ చిన్నబతుకమ్మ
తెలంగాణ సంస్కృతిని అమెరికా గడ్డపై వికసింపజేస్తున్న తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (TPAD).. ఈ ఏడాది మరింత ఉత్సాహంతో బతుకమ్మ వేడుకలకు శ్రీకారం చుట్టింది. దాదాపు వేయి మంది మహిళలు అందంగా తీర్చిదిద్దిన తమ బతుకమ్మలతో కుటుంబసభ్యులను వెంటబెట్టుకుని వచ్చి డాలస్‌లోని ఆండ్రివ్ బ్రోన్ పార్క్ ఈస్ట్‌లో సందడి చేశారు. మహిళలందరూ బృందవలయాలుగా ఏర్పడి పాటలు పాడుతూ బతుకమ్మను కొలుస్తూ పులకించిపోయారు. తెలంగాణ నేల నుంచి పూల పండుగే తరలివచ్చిందన్న చందంగా వేడుక సాగింది. పండుగ నిర్వహణకు ప్రత్యేక కమిటీలు చిన్నబతుకమ్మ పండుగను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఫౌండేషన్ కమిటీ చైర్ రఘువీర్ బండారు, బీవోటీ చైర్ సుధాకర్ కలసాని, ప్రెసిడెంట్ లింగారెడ్డి అల్వ, కోఆర్డినేటర్ రోజా ఆడెపు నేతృత్వం వహించారు. టీపాడ్ పూర్వ అధ్యక్షులు రమణ లష్కర్, ఉపాధ్యక్షులు అనురాధ మేకల, కార్యదర్శి రత్న ఉప్పల సూచనలు సలహాలు అందించారు. చిన్నబతుకమ్మ పండుగకు చైర్‌గా గాయత్రి గిరి, కో-చైర్‌గా అనుషా వనం, అడ్వయిజర్‌గా ఇంద్రాణి పంచెర్పుల తమ సేవలందించారు. హరిశంకర్‌రెడ్డి రేసు, ప్రశాంత్ నిమ్మని.. హాజరైన ప్రతి ఒక్కరికి పులిహోర, దద్దోజనం, మిఠాయిలు వడ్డించి తాము పుట్టిపెరిగిన ప్రాంతపు మధురజ్ఞాపకాలను గుర్తుకొచ్చేలా చేయడమే కాకుండా అందరి మన్ననలు అందుకున్నారు. ఆడియో, సౌండ్ సిస్టమ్ బాధ్యతలు స్వీకరించిన బాల గణపవరపు, నరేశ లింగంపల్లి.. మూడు గంటల పాటు బతుకమ్మ పాటలతో హుషారు నింపి హోరెత్తించారు. బతుకమ్మల నిమజ్జనం కోసం శ్రావణ్ నిడిగంటి, సుచేంద్రబాబు ప్రత్యేకంగా టబ్‌లు ఏర్పాటు చేయడం, నీటి సదుపాయం కల్పించడం వంటి పనులు చూసుకున్నారు. రవాణా వ్యవహారాలను సంతోష్ రేగొండ, భోజన సదుపాయాలను సంతోష్, సోషల్ మీడియా వ్యవహారాలను మధుమతి వైశ్యరాజు, ఆదిత్య గాదె చూసుకున్నారు. రిసెప్షన్ బాధ్యతలు మాధవి మెంట, దీపికారెడ్డి చూసుకోగా, శశిరెడ్డి, మాధవి ఓంకార్ డెకరేషన్ దగ్గరుండి చేయించారు. అక్టోబర్ 21న సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలకు ఏర్పాటు అక్టోబర్ 15 ఆదివారం రోజున చిన్న బతుకమ్మ పండుగతో బతుకమ్మ-దసరా వేడుకలకు అంకురార్పణ చేసిన టీపాడ్.. అక్టోబర్ 21న మెగా వేడుకలకు సన్నద్ధమవుతున్నది. ఏటా పదివేల మందితో సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆకర్షించిన టీపాడ్.. ఈ దఫా మరింత వైభవంగా ఆర్గనైజ్ చేస్తున్నది. ఈ వేడుకలకు డాలస్‌లోని కొమెరికా సెంటర్ (పెప్పర్ ఎరెనా) వేదికగా నిలుస్తున్నది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. విశేష అతిథిగా సంయుక్తామీనన్, రాఫెల్ ప్రైజ్‌గా బీఎండబ్ల్యూ బైక్ సినీ కథానాయిక సంయుక్తామీనన్ విశేష అతిథిగా హాజరవనున్న ఈ పండుగలో సుప్రసిద్ధ గాయకులు తమ గాత్రంతో వీనులవిందు చేయనున్నారు. వేడుకల్లో భాగంగా రాఫెల్ ప్రైజ్‌లను అందజేయనున్నారు. వీటిలో బీఎండబ్ల్యు బైక్, బంగారు నాణేలు, పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్, ఆర్టిఫిషియల్ జువెల్లరీతో పాటు గిఫ్ట్ ఓచర్లు ఉన్నాయి. బీఎండబ్ల్యు బైక్ మరియు రాఫెల్ ప్రైజ్‌లను మాధవి లోకిరెడ్డి, హారిక పాల్వాయి అనౌన్స్ చేశారు. వేడుకల వివరాల కోసం టీపాడ్ వెబ్సైట్ టీపాడ్యూఎస్.ఓఆర్జీను బ్రౌజ్ చేయొచ్చు. -
టీపాడ్ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగువారి వనభోజనం
డాలస్ మురిసేటట్టు.. ప్రకృతి పరవశించేటట్టు.. తెలుగువారి వనభోజనం అమెరికాలోని డాలస్ మహానగరంలో జాతరను మరిపించింది. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన ఆఫ్ డాలస్ (టీపాడ్) ఆధ్వర్యంలో ఆర్గైల్‌లోని పైలట్ నాల్ పార్క్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఇక్కడ స్థిరపడిన తెలుగువారి హృదయాలను ఆకట్టుకున్నది. టీపాడ్ బృందం సభ్యులు ఫ్లాష్‌మాబ్‌తో హుషారు నింపుతూ సుమారు 2500 మంది అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికారు. షడ్రసోపేతమైన భోజనాన్ని వడ్డించడమే కాకుండా వీనులవిందైన సంగీతం, నయనానందకరమైన నృత్య ప్రదర్శనలతో మరపురాని వినోదాన్ని పంచారు. అందాల సరస్సు చెంత ఏర్పాటు చేసిన ఈ ఆటవిడుపు కార్యక్రమం అందరి చింతలను పక్కనపెట్టి హాయిగొలిపిందనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత దగ్గరి బంధువులను కలుసుకున్న అనుభూతితో పాటు ప్రతి ఒక్కరిలో ఆత్మీయత ప్రస్ఫుటమైంది. అనుబంధాలను నెమరువేసుకున్నారు. చిన్నా, పెద్దా ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా టీపాడ్ బృందం సభ్యులు కార్యక్రమాన్ని అద్భుతంగా రూపొందించారు. విభిన్నంగా స్టేజ్ నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. డల్లాస్ యువత ఒకరిని మించి మరొకరు పోటాపోటీగా నృత్య ప్రదర్శనలిచ్చి అతిథులను అలరించారు. సరస్సు ఒడ్డున 60 ఎకరాల్లో విస్తరించిన పైలట్ నాల్ పార్క్... 2500 మంది తెలుగువారితో రద్దీగా, కళకళలాడుతూ కనిపించింది. హైదరాబాదీ దమ్-చికెనబిర్యానీ, బగారారైస్, పచ్చిపులుసు, పికిల్స్.. తెలంగాణ టేస్ట్‌ను ఎంజాయ్ చేసేందుకు జనం ఉత్సాహం చూపించారు. భోజనానికి బారులు తీరకుండా, నిమిషాల తరబడి ఎదురుచూసే పరిస్థితి లేకుండా నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం అందరి ప్రశంసలు అందుకున్నది. తెలుగురాషా్ట్రల్లో జాతరలప్పుడు ప్రత్యేక దుకాణాలు కొలువుదీరిన రీతిలో.. ఇక్కడ 17 వెండర్బూత్లకు అవకాశం కల్పించారు. ఫేస్ పెయింటింగ్, మెహందీ ఆర్టిస్టులకు భలే డిమాండ్ లభించింది. కార్యక్రమంలో భాగంగా రఫెల్ ప్రైజులు అందజేశారు. టీపాడ్ వనభోజన కార్యక్రమానికి ఏటేటా విశేష స్పందన లభిస్తుండడంతో.. ఈ ఏడాది ఇంకా వినూత్నంగా ఆర్గనైజ్ చేయాలన్న టీపాడ్ సభ్యుల ఆరువారాల కసరత్తుకు అందరి మద్దతు దొరకడమే కాకుండా ఊహించని ఆదరణ లభించడం విశేషం. టీపాడ్ ఘనంగా నిర్వహించిన ఈ వనభోజన కార్యక్రమాన్ని రఘవీర్ బండారు (చైర్ ఆఫ్ ఫౌండేషన కమిటీ), సుధాకర్ కలసాని (చైర్ ఆఫ్ బీవోటీ), లింగారెడ్డి ఆల్వ (ప్రెసిడెంట్), రోజా ఆడెపు (కోఆర్డినేటర్) మార్గదర్శకత్వంలో మధుమతి వైశ్యరాజు సమన్వయం చేశారు. రావు కల్వల, అజయ్‌రెడ్డి, ఉపేందర్ తెలుగు, రవికాంతరెడ్డి మామిడి (మాజీ అధ్యక్షుడు).. ఈవెంట్ ఆద్యంతం సజావుగా సాగేలా నిరంతరం పర్యవేక్షించారు. ఉమ గడ్డం నేతృత్వంలో మాధవి సుంకిరెడ్డి, ఇందు పంచరుపుల, లక్ష్మి పోరెడ్డి, రూప కన్నయ్యగారి, మంజుల తొడుపునూరి, రేణుక చనుమోలు, నరేష్ సుంకిరెడ్డి, అశోక్ కొండల, విజయ్ తొడుపునూరి, శ్రీధర్ వేముల, గోలి బుచ్చిరెడ్డి స్వయంగా వండివార్చారు. ఆడియో, వీడియో, సోషల్‌మీడియా వ్యవహారాల ఇనచార్జిగా అనురాధ మేకల (టీపాడ్ వైస్ ప్రెసిడెంట్) వ్యవహరించారు. మాధవి లోకిరెడ్డి సాంస్కృతిక కార్యక్రమాలను సమన్వయం చేశారు. స్వప్న తుమ్మకాల, గాయత్రి గిరి, హరిశంకర్ రేసు, శివ కుడిత్యాల, బాల గనపవరపు.. బహుమతులు, పూజలు, ఇతరత్రా బాధ్యతలు చూసుకున్నారు. అతిథులందరూ లొట్టలేసుకుటూ తినేలా గ్రిల్డ్ స్వీట్‌కార్న్, చికెనబార్బిక్యూను అప్పటికప్పుడు వేడివేడిగా అందించేందుకు శ్రమించిన కరన పోరెడ్డి, రత్న ఉప్పల, శ్రీనివాస్ అన్నమనేని, సురేందర్ చింతల, ఆదిత్య గాదెలకు పలువురి నుంచి ప్రశంసలు దక్కాయి. వనభోజనం ఆసాంతం సజావుగా, అంచనాలకు మించి విజయవంతంగా సాగడానికి కారకులైన స్పాన్సర్లకు, తెలుగువారందరికీ టీపాడ్ బృందం కృతజ్ఞతలు తెలిపింది. -
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
డాలస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(TPAD) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. తాజాగా నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో 69 మంది రక్తదానం చేశారనీ, 52 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. కరోనా మహమ్మారి తర్వాత ఏడాదికి రెండు సార్లు బ్లడ్ డోనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నట్టు టీప్యాడ్ వెల్లడించింది. గత ఎనిమిదేళ్లో బ్లడ్ డోనేషన్ క్యాంపు నిర్వహించడం ఇది పదోసారి అని, తాజాగా సేకరించిన బ్లడ్‌ను కార్టర్ బ్లడ్ కేర్‌కు అందించినట్లు తెలిపింది. రక్తదాన శిభిరం విజయవంతం కావడానికి సహకరించిన రఘువీర బండారు, ఉమా బండారుతోపాటు వలంటీర్లకు, కార్టర్ బ్లడ్ కేర్ టెక్నీషియన్లకు ఈ సందర్భంగా నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయత్రి గిరి, చక్రీ నారా, అజయ్ రెడ్డి(ఎఫ్‌సీ చైర్), రమణ లష్కర్(ప్రెసిడెంట్), ఇంద్రాని పంచెరుపుల(బీఓటీ), పాండు పాల్వే(కోఆర్డినేటర్) తదితర సభ్యులు పాల్గొన్నారు. ఏప్రిల్‌లో నిర్వహించిన చివరి డ్రైవ్‌లో 53 రిజిస్ట్రేషన్లు జరగ్గా, తాజాగా 69 మంది రిజిస్ట్రేషన్లతో రోజంతా జరిగిన రక్తదానంలో దాతలు రక్తదానం చేసేందుకు క్యూ కట్టారు. అయితే సమయాభావం వల్ల చాలా మంది దాతలు రక్తదానం చేయలేకపోయారని నిర్వాహకులుతెలిపారు. ఈ డ్రైవ్‌లో సేకరించిన 52 యూనిట్ల రక్తంతో దాదాపు 10 మందికి గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు లేదా, 17 మందికి రక్త మార్పిడి లాంటి ఇతర అవసరాలకు సరిపోతుందన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసినవారికి భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి సహకరించిన అభినందించి బ్లాంకెట్లను బహుమతిగా అందజేశారు. -
టీపాడ్ ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ, దసరా వేడుకలు
కళల నిలయమైన అమెరికాలోని డాలస్.. మన తెలుగువారి పండుగల అందాలనూ అద్దుకుంటోంది. తంగేడు వనాన్ని, గునుగుపూల సోయగాన్ని ఇముడ్చుకుని తెలంగాణ పండుగ బతుకమ్మకు మరింత కళను జోడించింది. చరిత్ర సంరక్షణకూ పెట్టింది పేరైన ఆ పట్టణం.. మన బతుకమ్మ, దసరా పండుగల సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. అక్కడ నివసిస్తున్న తెలంగాణ ప్రజల సమూహం తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్).. ఏ విదేశాలలో నిర్వహించలేనంత వైభవంగా, ఈ పండుగలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ప్రత్యేకతను చాటింది. దాదాపు పదిహేను వేల మంది హాజరై మహా సందడి చేసిన ఈ కార్యక్రమానికి డాలస్ పరిధిలోని ఫ్రిస్కో పట్టణంలో గల కొమెరికా సెంటర్ (డాక్టర్ పెప్పర్ ఎరెనా స్టేడియం) వేదికగా నిలిచింది. ఏటా బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి దృష్టిని టీపాడ్ ఆకర్షించి సంగతి తెలిసిందే. దీంతో టీపాడ్ ఆతిథ్యం గురించి తెలుసుకుని పొరుగు రాష్ట్రాలైన ఓక్లహామా, కాన్సాస్, ఆర్కన్సాస్లో ఉంటున్న తెలుగువారూ అక్కడికి విచ్చేసి సందడి చేశారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సుమారు 6మంది మహిళలు, బాలికలు సామూహికంగా పాడుతూ, చప్పట్లు కొడుతూ లయబద్దంగా కదులుతుంటే స్టేడియం దద్దరిల్లిపోయింది. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజాము వరకు వేడుకలు కొనసాగాయి. స్థానిక డ్యాన్స్ స్కూల్స్ విద్యార్థుల నృత్యాలతో వేడుక మొదలయింది. అమ్మవార్లే కదిలివచ్చారా అన్నట్టుగా నవదుర్గ వేషధారణతో అమ్మాయిల ఊరేగింపు వైభవోపేతంగా సాగింది. నాలుగు గంటల పాటు సాగిన సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బతుకమ్మ వేడుకలు మొదలయ్యాయి. అనంతరం విజయదశమి వేడుకలను నిర్వహించారు. శమీపూజ చేశారు. సినీనటి రీతూవర్మ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఆపై అందరినీ ఆహ్లాదపరుస్తూ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ బృందం తమ పాటలు, సంగీతంతో కొత్త లోకంలో విహరించేలా చేసింది. గాయకులు లిప్సికా, రోల్ లైడా, ధనుంజయ్ తదితరులు తమ పాటలతో ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు గాను తెలంగాణ పీపుల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్) Telangana people’s association of Dallas (T pad) భారీ కసరత్తే చేసింది. దాదాపు నెలరోజుల క్రితమే అసోసియేషన్ బృందం కమిటీలు గా ఏర్పడి బాధ్యతలను తీసుకున్నారు. టీపాడ్ ఫౌండేషన్ కమిటీ చైర్, అధ్యక్షుడు రమణ లష్కర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్ ఇంద్రాణి పంచెర్పుల, కోఆర్డినేటర్లు ఈ కార్యక్రమం ఆసాంతం విజయవంతమయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. నాటా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి కొర్సపాటి తనవంతు సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా, స్థానిక, జాతీయ తెలుగు సంస్థలకు, దాతలకు, మీడియా సంస్థలకు తమ కార్యక్రమాలకు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న డాలస్ లోని తెలుగు వారందరికీ TPAD నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. -
డాలస్‌లో శ్రీనివాసుడి కల్యాణం
డాలస్: అమెరికాలోని డాలస్‌లో శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.డాలస్‌లోని క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్లో తెలుగువారి ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, అభిషేకం, కల్యాణ సేవలను అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. జూన్ 25వ తేదీన అలెన్ ఈవెంట్ సెంటర్ (క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్) వేదికగా డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) చేపడుతున్న ఈ విశేష కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొననున్నారు. స్వయంగా దేవదేవతల ప్రతిరూపాలను, పూజారులను ఆయన వెంటబెట్టుకుని రానున్నారు. ఈ సందర్భంగా డాలస్‌లో ఉంటున్న తెలంగాణ, తెలుగు వారి సౌకర్యార్థం టీపాడ్ తగిన ఏర్పాట్లను చేస్తోంది. పద్మావతీ అలిమేలు సమేత శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికి స్వామివారి లడ్డూ ప్రసాదం, విశేష పూజల్లో భాగస్వాములయ్యే వారికి తిరుమల లడ్డూతోపాటు వస్త్రం అందజేయనున్నట్టు టీపాడ్ ప్రతినిధులు తెలిపారు. అలాగే స్వామివారి విశేష సేవా కైంకర్యాల్లో పాల్గొనేవారు ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటించారు. అందరూ ఆహ్వానితులేనని, పార్కింగ్ కూడా ఉచితమని తెలిపారు. డాలస్‌లో తిరుమల వెంకన్న దర్శన భాగ్యం కల్పించడం పట్ల స్థానిక భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారనీ టీపాడ్ ప్రతినిధులు చెప్పారు. మరిన్ని వివరాల కోసం tpadus.org ని సంప్రదించవచ్చు. -
టీపాడ్ రక్తదాన శిబిరానికి భారీ స్పందన
బ్లడ్‌బ్యాంకుల్లో రక్తం నిల్వల కొరతను దృష్టిలో ఉంచుకొని అమెరికాలోని డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక ఐటీ కంపెనీ అయిన ఐటీ స్పిన్ ఆవరణలో టెక్సాస్‌లోని అతి పెద్ద బ్లడ్‌బ్యాంక్ కార్టర్ బ్లడ్ కేర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఫ్రిస్కో, ఎల్లెన, మెక్కెన్నీ, ప్రాస్పర్, ప్లేనో, ఐర్వింగ్, కాపెల్ తదితర ప్రాంతాల నుంచి రక్తదాతలు తరలివచ్చారు. శిబిరం ఏర్పాటు చేసిన ఐటీ స్పిన్ ఆవరణలో బ్లడ్‌బ్యాంక్ వ్యాన్ ను చూసిన కొందరు స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం విశేషం. ఈ శిబిరంలో 150 మంది చికిత్సకు సరిపోయేలా 50 పింట్ల రక్తాన్ని సేకరించారు. ఇది సుమారు 10 గుండె శస్త్రచికిత్సలకు సరిపోతుందని కార్టర్ బ్లడ్‌కేర్ ప్రతినిధులు తెలిపారు. ఈ శిబిరానికి ఇంతగా స్పందన వస్తుందని తాము ఊహించలేదని, అంచనాలను మించి రక్తాన్ని సేకరించామని సంతోషం వ్యక్తం చేశారు. కాగా, టీపాడ్ గత ఎనిమిదేళ్ల నుంచి ఇది రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తుండగా, ఇది తొమ్మిదవది. ప్రతిసారి రక్తదానానికి అవసరమైన పరిసరాలను కల్పించిన ఐటీ స్పిన్ కంపెనీ యాజమాన్యం రఘువీర్ బండారు, ఉమా బండారులకు టీపాడ్ కృతజ్ఞతలు తెలిపింది. ఎప్పటిలాగే టీపాడ్.. 2022లో కార్యక్రమాలను రక్తదాన శిబిరంతో మొదలుపెట్టడం విశేషం. డాలస్ తెలంగాణ ప్రజాసమితి సగర్వంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని రేణుకా చనమోలు సహాయంతో స్వప్న తుమ్మపాల సమన్వయం చేశారు. అజయ్‌రెడ్డి, రమణ లష్కర్, ఇంద్రాని పంచెర్పుల, పండు పాల్వాయ్ నిర్దేశం చేశారు. టీపాడ్ సేవలను కార్టర్ బ్లడ్‌కేర్ నిర్వాహకులతో పాటు రక్తదాతలు, స్థానికులు అభినందించారు. -
సామాజిక సేవలో టీప్యాడ్
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఆధ్వర్యంలో 2022 ఏప్రిల్ 2న బ్లడ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు టీప్యాడ్ ప్రతినిధులు తెలిపారు. టెక్సాస్‌లోని ఫ్రిక్స్ నగరంలో లెబనాన్రోడ్లో ఉన్న ఐటీ స్పిన్ భవనంలో ఈ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. సమాజానికి తిరిగి ఏదైనా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రతీ ఏడు టీప్యాడ్ ఈ బ్లడ్డ్రైవ్ను కొనసాగిస్తోంది. ఈ ఏడాది జరిగే బ్లడ్ డ్రైవ్‌లో పాల్గొనే ఆసక్తి ఉన్న వారు తమ వివరాలు రిజిస్ట్రర్ చేసుకోవాలని టీప్యాడ్ కోరింది. గడిచిన 90 రోజుల్లో విదేశీ ప్రయాణం చేసిన అమెరికన్లను ఈ బడ్ల్డ్రైవ్కు అనుమతించడం లేదని టీప్యాడ్ స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ కోసం https://ww3.greatpartners.org/donor/schedules/drive_schedule/131481 లింక్‌ను ఉపయోగించుకోవాలని టీప్యాడ్ కోరింది. -
డాలస్‌లో బతుకమ్మ, దసరా పండుగలను మళ్లీ ఘనంగా నిర్వహిస్తాం: టీపాడ్
బతుకమ్మ, దసరా పండుగలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ గర్వించేలా నిర్వహిస్తామని అమెరికాలోని డాలస్ తెలంగాణ ప్రజాసమితి(టీపాడ్) నూతన కమిటీ ప్రకటించింది. కొవిడ్ మహమ్మారి క్రమంగా కనుమరుగవుతున్నందున ఈ ఏడాది పరిస్థితులు అనుకూలిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. బతుకమ్మ పండుగను అత్యంత ఘనంగా నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆకర్షించిన అమెరికాలోని డాలస్ తెలంగాణ ప్రజాసమితి(టీపాడ్)కి 2022 సంవత్సరానికి గాను కొత్తపాలకవర్గం ఎన్నికయింది. నూతన అధ్యక్ష కార్యదర్శులతో పాటు పాలకమండలి సభ్యులందరూ ఫిబ్రవరి 12వ తేదీన ఫ్రిస్కో నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు. స్థానిక నేతలు, టీపాడ్ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా అమెరికా, భారత జాతీయ గీతాలను ఆలపించారు. రూప కన్నయ్యగారి, అనురాధ మేకల నిర్వహణలో స్థానిక గాయకులు స్నిగ్ధ ఏలేశ్వరపు, శ్రావణ్‌కుమార్ శ్రావ్యమైన గీతాలతో ఆహుతులను అలరించారు. గతేడాది బాధ్యతలు నిర్వర్తించిన కమిటీ సభ్యులు కొత్త పాలకవర్గానికి బాధ్యతలు అప్పగిస్తూ ప్రమాణస్వీకారం చేయించారు. లతా మంగేష్కర్‌కు ఘన నివాళి కార్యక్రమంలో భాగంగా పద్మవిభూషణ్, బాబాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ఇటీవలే పరమపదించిన లెజెండరీ సింగర్ లతామంగేష్కర్‌కు నివాళిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. వేలాది మందితో పండుగల నిర్వహణ అనంతరం బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్పర్సన్ ఇంద్రాణి పంచెర్పుల, అధ్యక్షుడుగా ఎన్నికైన రమణ లష్కర్, సమన్వయకర్త పాండురంగారెడ్డి పాల్వాయి, కార్యదర్శి లక్ష్మీ పోరెడ్డి, ఉపాధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి మాట్లాడుతూ.. కొవిడ్ మహమ్మారి నుంచి బయటపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నందున.. ఎప్పటి మాదిరే ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా, తెలుగు ప్రజలు గర్వించేలా బతుకమ్మ, దసరా పండుగలను వేలాది మందితో భారీఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. ఏటా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలను, భోజన వితరణను మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలను సుసంపన్నం చేస్తూ.. ఫౌండేషన్ కమిటీ చైర్మన్ అజయ్‌రెడ్డి, వైస్‌చైర్మన్ జానకీరాం మందాడి, రావు కల్వల, రఘువీర్ బండారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను రేపటితరానికి అందించడంతో పాటు తాము నివసిస్తున్న ప్రాంతాల సంస్కృతిని సుసంపన్నం చేయడమే టీపాడ్ లక్ష్యమని వివరించారు. నరేష్ సుంకిరెడ్డి, కరణ్ పోరెడ్డి, చంద్ర పోలీస్ మరియు సతీష్ నాగిళ్ల మాట్లాడుతూ కొత్త ఎన్నికైన పాలకమండలి సభ్యులను అభినందించారు. మహిళల భాగస్వామ్యంతోనే టీపాడ్ విజయవంతం ఫ్రిస్కో పార్క్స్ అండ్ రిక్రియేషన్ బోర్డ్ సభ్యుడు, టీపాడ్ సలహాదారు అయిన వేణు భాగ్యనగర్ మాట్లాడుతూ.. డాలస్ తెలంగాణ ప్రజాసమితి విజయవంతంగా కార్యకలాపాలను నిర్వహించడానికి కారణం మహిళల భాగస్వామ్యమేనని కొనియాడారు. చివరగా.. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్(టీఏఎన్‌టీఈఎక్స్) మరియు ఇండియన్ అసోసియేషన్ నార్త్ టెక్సాస్ (ఐఏఎన్టీ)లో పలు పదవులను అలంకరించడంతో పాటు ప్రస్తుతం నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) అధ్యక్షుడుగా పనిచేస్తున్న శ్రీధర్‌రెడ్డి కొర్సపాటిని టీపాడ్ నాయకత్వం సత్కరించింది. కొత్త కమిటీలో ఎవరెవరంటే... 2022 సంవత్సరానికి గాను ఎగ్జిక్యూటివ్ కమిటీలో రమణ లష్కర్, మాధవి లోకిరెడ్డి, లక్ష్మీపోరెడ్డి, రత్న ఉప్పల, రవికాంత్ మామిడి, లింగారెడ్డి అల్వా, అనురాధ మేకల, మధుమతి వైశ్యరాజు, మంజుల తొడుపునూరి, శ్రీధర్ వేముల, శ్రీనివాస్ అన్నమనేని, శంకర్ పరిమల్, గాయత్రి బుషిగంపల, స్వప్న తుమ్మపాల, రేణుక చనమోలు ఉంటారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌గా టీపాడ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌గా ఇంద్రాణి పంచెర్పుల, సుధాకర్ కలసాని, పాండురంగారెడ్డి పాల్వాయి, గోలి బుచ్చిరెడ్డి, మాధవి సుంకిరెడ్డి, అశోక్ కొండల, పవన్ గంగాధర, రావు కల్వల, జానకీరాం మందాడి, రఘువీర్ బండారు, రాం అన్నాడి వ్యవహరిస్తారు. -
టీపాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్ కార్యక్రమం
డల్లస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపాడ్) ఒక మహత్తర కార్యక్రమానికి పూనుకుంది. బ్లడ్ డ్రైవ్, వ్యాక్సిన్ డ్రైవ్ , ఫుడ్ డ్రైవ్ రూపంలో మూడు సమాజ సేవా కార్యక్రమాలను మూడు నెలల్లోపు నిర్వహించేలా తన సమాజ సేవా కార్యకలాపాలను నిర్వహించింది. డల్లాస్ ప్రాంతంలో ఆశ్రయం ,ఆహారం లేకుండా ఉన్న పేదలను ఏంచుకొని ఆస్టిన్ స్ట్రీట్ ఆశ్రమం సాయంతో ఈ వలంటీర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫుడ్ డ్రైవ్ కార్యక్రమం అధ్యక్షుడు రవికాంత్ మామిడి ఆధ్వర్యంలో జరిగింది. బాధ్యతాయుతమైన సమాజ సంస్థగా, పేదలకు సహాయం చేయడంమా సామాజిక బాధ్యత అని.. రాబోయే నెలల్లో మరిన్ని ఫుడ్ డ్రైవ్‌లు చేస్తామని రవికాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో రావు కల్వాలా, రఘువీర్ బండారు, మాధవి సుంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీపీఏడీ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్
డల్లాస్ : కరోనా మహమ్మారి సమయంలో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఫ్రంట్‌లైన్ కమ్యూనిటీకి బాసటగా నిలిచింది. టెక్సాస్‌లోని డల్లాస్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అందించడానికి టీపీఏడి టెక్సోమా ఫార్మసీతో కలిసి పనిచేసింది. డల్లాస్, ఫ్రిస్కో, ప్లానో, అలెన్, మెకిన్నే ప్రాంతాలలో నివసించే తెలుగు వారికి వ్యాక్సిన్‌ను అందించడానికి టీపీఏడి వాలంటీర్లు షెడ్యూలింగ్, టీకా గ్రహీతల చెక్-ఇన్ వంటి పనులలో వారికి సపోర్ట్ చేశారు. వారాంతపు రోజున వ్యాక్సిన్ తీసుకునే అవకాశాన్ని స్థానిక నివాసితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనురాధ మేకల టీకాల ప్రయత్నాన్ని సమన్వయపరిచారు, టీకా గ్రహీతల టెక్సోమా ఫార్మసీతో షెడ్యూల్ ఏర్పాటు చేశారు. సుమారు 96 మంది టీకా డ్రైవ్‌ను సద్వినియోగం చేసుకున్నారు. కరోనా తీవ్రతను తగ్గించటానికి వ్యాక్సిన్ వేయించుకోవటం తప్పనిసరని టీపీఏడీ నాయకత్వం పేర్కొంది. తెలుగు వారికోసం మరో వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించటానికి టీపీఏడీ ఎల్లప్పుడు ముందుంటుందని తెలిపింది. ఈ కార్యక్రమంలో రావు కల్వల, రఘువీర్ బండారు, మాధవి సుంకిరెడ్డి, రవికాంత్ మామిడి, గోలి బుచ్చి రెడ్డి, చంద్ర పోలీస్, రూప కన్నయ్యగారి, లక్ష్మి పోరెడ్డి, మంజుల తొడుపునూరి, ఇందు పంచెరుపుల, విజయ్ తొడుపునూరి, పవన్ గాంగాధర, పండు పాల్వాయ్, అశోక్ కొండాల, రామ్ అన్నడి, లింగారెడ్డి అల్వ, రత్న ఉప్పల, రోజా అదెపు, శ్రీధర్ వేముల, జయ తెలకపల్లి పాల్గొన్నారు. -
టీపీఏడీ అధ్వర్యంలో బ్లడ్ డ్రైవ్ కార్యక్రమం
వాషింగ్టన్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపీఏడీ) తగిన భద్రతా జాగ్రత్తలు తీసుకుంటూ తన 8 వ వార్షిక బ్లడ్ డ్రైవ్‌ను నిర్వహించింది. ఎప్పటిలాగే ఈ కమ్యూనిటీ బ్లడ్ డ్రైవ్ కార్యక్రమంతో ఈ సంవత్సరానికి గాను తాము నిర్వహించే సేవా కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ బ్లడ్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా రక్త దానం చేసేందుకు సుమారు 40 మంది నమోదు చేసుకున్నారు. టెక్సాస్‌లోని అతిపెద్ద రక్త కేంద్రాలలో ఒకటైన కార్టర్ బ్లడ్ కేర్ అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కార్టర్ బ్లడ్ కేర్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ‘‘ఇక్కడ సేకరించిన ప్రతి పింట్ రక్తం మూడు ప్రాణాలను కాపాడుతుంది. ఈ ఏడాది 30 యూనిట్ల రక్తం సేకరించాం. ఈ మొత్తం 90 మంది ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది.సేకరించిన 30 యూనిట్ల రక్తం, 5 గుండె శస్త్రచికిత్సలకు గాని.. 10 రక్త మార్పిడి వంటి అత్యధిక రక్తం వినియోగం అవసరం ఉన్న హెల్త్ సమస్యలకు సరిపోతుంది’’ అని తెలిపారు. టీపీఏడీ బృందం రక్తం దానం చేయడానికి వచ్చిన 40 మంది దాతలందరికీ అల్పాహారం, భోజనం అందించింది. స్థానిక ఐటీ కంపెనీ ఐటీ స్పిన్.. బ్లడ్ డ్రైవ్ నిర్వహించడానికి అవసరమైన పార్కింగ్, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసింది. బ్లడ్ డ్రైవ్‌ను లక్ష్మి పోరెడ్డి సమన్వయం చేయగా.. రావు కల్వాలా, మాధవి సున్కిరెడ్డి, రవికాంత్ మామిడియాండ్ గోలీ బుచి రెడ్డి మార్గనిర్దేశం చేయగా.. అనురాధ మేకల ప్రచారం చేశారు. బ్లడ్ డ్రైవ్ కార్యక్రమంతో, టీపీఏడీ ప్రాణాలను కాపాడటంలో సహాయపడటమే కాకుండా, ఫ్రిస్కో, ప్లానో, అలెన్, కొప్పెల్కు చెందిన విద్యార్థులు, యువతకు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా టీపీఏడీ వలంటీర్లు మాట్లాడుతూ.. ‘‘స్థానికులకు సాయం చేయడం కోసం మా వంతుగా బ్లడ్ డ్రైవ్ నిర్వహించాం. ఇది మా బాధ్యత. ఇదే మద్దతుతో భవిష్యత్తులో బ్లడ్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా మరింత మందికి సాయం చేసి.. వారి జీవితాల్లో ప్రభావం చూపుతాము’’ అని తెలిపారు. అంతేకాక రక్తం దానం చేసిన 40 మంది దాతలకు టీపీఏడీ కృతజ్ఞతలు తెలియజేసింది. -
టీపీఏడీ 2021 ఫౌండేషన్ సభ్యుల ప్రమాణ స్వీకారం
డల్లాస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపీఏడీ) ఆధ్వర్యంలో 2021 సంవత్సరానికి ఫౌండేషన్ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారకార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిస్కోలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్, కో-చైర్ పర్సన్, కో-ఆర్టినేటర్, ప్రెసిడెంట్‌తో పాటు ఇతర ఆఫీసు బేరర్లు ప్రమాణం స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రవికాంత్ మాట్లాడుతూ.. 2020 కరోనా కాలంలో టీపీఏడీ స్వచ్ఛంద కార్యకలాపాలను చేపట్టిందన్నారు. న్యూయార్క్‌లోని ఫ్రంట్‌లైన్ సిబ్బందికి ఎన్ 95 మాస్క్‌లు అందించామన్నారు. అలాగే ఇండియాలో ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో నిత్యవసర సరుకులు, అవసరమైన వస్తు సామాగ్రి పంపిణీకి టీపీఏడీ నుంచి విరాళాలు సేకరించి పంపించామన్నారు. హైదరాబాద్‌లోని పేద కళాకారులకు కూడా నిత్యవసర సరుకులు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. అనంతరం మహమ్మారి కాలంలో ప్రజలకు సేవ చేస్తున్న ఫ్రంట్ లైన్ కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత టీపీఏడీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు మధుమతి వైజరాజు మాట్లాడుతూ.. ఫౌండేషన్ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను వివరించారు. ఫౌండేషన్ చైర్ పర్సన్ రావు కల్వాలా మాట్లాడుతూ.. బ్లడ్ డ్రైవ్ ద్వారా టీపీఏడీ గత కొన్ని సంవత్సరాలుగా వందలాది మంది ప్రాణాలను కాపాడిందన్నారు. అవసరమున్న వారికి రక్తదానం ఇవ్వడంలో సహాయపడటానికి బ్లడ్ డ్రైవ్‌ను మరింత కఠినంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ చైర్ మాధవి సుంకిరెడ్డి మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడంతో పాటు సమాజానికి ఏ విధంగానైనా సేవ చేయడమే టీపాడ్ లక్ష్యం అన్నారు. 2021లో టీపీఏడీ మరిన్ని స్వచ్ఛంద కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సంస్థ సీనియర్ నాయకత్వ సభ్యులు అజయ్ రెడ్డి, జానకి రామ్ మాండాడి, రఘువీర్ బండారులు ప్రపంచ శాస్త్రీయ సమాజానికి కృషి చేసి, కోవిడ్-19కు వ్యాక్సిన్‌ను తక్కువ సమయంలో అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా కోఆర్డినేటర్‌గా ఎన్నికైన గోలీ బుచి రెడ్డి బృందాన్ని అభినందించారు, సంస్థకు బలమైన పునాది వేసినందుకు టీపీఏడీ గత అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. 2021 సంవత్సరానికి కొత్తగా ఎన్నికైన ఫౌండేషన్ సభ్యులు.. రావు కల్వాలా (చైర్, ఫౌండేషన్ కమిటీ), రఘువీర్ బండారు (వైస్ చైర్, ఫౌండేషన్ కమిటీ), మాధవి సుంకిరెడ్డి (చైర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు), ఇంద్రాణి పంచెరుపుల (వైస్ చైర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్), బుచి రెడ్డి గోలి (కో-ఆర్డినేటర్), రవికాంత్ మామిడి (ప్రెసిడెంట్), చంద్రరెడ్డి పోలీస్ (గత అధ్యక్షుడు), రూప కన్నయ్యరి (ఉపాధ్యక్షుడు), అనురాధ మేకల (ప్రధాన కార్యదర్శి), లింగా రెడ్డి అల్వా (సంయుక్త కార్యదర్శి), శంకర్ పరిమల్ (కోశాధికారి), మధుమతి వైజరాజు (సంయుక్త-కోశాధికారి), కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మాధవి లోకిరేడ్డి, లక్ష్మి పోరెడ్డి, రత్న వుప్పల, రోజా అడెపు, శ్రీధర్ వేముల, మంజులా తోడినావూరు ధర్మకర్తలు రామ్ అన్నాడి, అశోక్ కొండల, పవన్ గంగాధర, సుధాకర్ కలసాని, పాండురంగ రెడ్డి పాల్వే,అజయ్ రెడ్డి, రఘువీర్ బండారు, జానకిరామ్ మందాడి ఈ ఏడాదికి గాన నూతన ఫౌండేషన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. -
కొత్తగూడెంలో టీపాడ్ సేవా కార్యక్రమాలు
డల్లాస్: డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి (టీపాడ్) ప్రతీ సంవత్సరం డల్లాస్ నగరంలో బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా జరుపుతోంది. ప్రతి వేసవిలో వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండగలను పాశ్చాత్య దేశాలలో ప్రతిబింబించేలా చేయడమే కాకుండా మన లలిత కళలకు జీవం పోస్తూ ఎంతో మంది కళాకారులకు గొప్ప వేదికను అందిస్తోంది. ప్రతి ఏటా రక్తదాన శిబిరాలతో పాటు ఇల్లు, నీడ లేని వారికి అన్నదానాలు చేస్తూ ఆసరాగా నిలబడుతోంది. స్థానిక, జాతీయ సంస్థలు చేసే కార్యక్రమాలకు చేదోడుగా, తోడు నీడలా బాధ్యతలను తన భుజాలపై వేసుకుంటోంది. కరోనా లాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు కూడా అమెరికాలోని ఆరోగ్య కేంద్రాలకు మాస్కులు, వైద్యపరంగా కావాల్సిన సామాగ్రి సమకూర్చడమే కాకుండా ఇండియా నుంచి వచ్చిన విద్యార్థులకు కూడా కావాల్సిన నిరంతర సహాయం చేస్తూ ఉంది. (యూఏఈలో భారత స్వాతంత్ర్య వేడుకలు) టీపాడ్ సంస్థ చేసే కమ్యూనిటీ సర్వీసెస్‌లో భాగంగా ఇండియాలోనూ కరోనా వైరస్ విపరీతంగా ప్రబలుతున్న కారణంగా చాలామంది నిరుపేదలు ఉపాధి కోల్పోయారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో వారు జీవించడానికి నిత్యావసరాలు కూడా సమర్చుకోలేని స్థితిలో ఉన్నారని తెలిసి టీపాడ్ సంస్థ కార్యదర్శి అనురాధ మేకల, కొత్తగూడెం గ్రామస్థులైన సతీష్, జ్యోతి, కాల్వ సుధాకర్, అక్రమ్, షాబుద్దీన్, శ్రీనివాస్, నాగరాజు, స్వరూప, సుజాత, మల్లేశ్వరి తదితరులను సంప్రదించి కొత్తగూడెం సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో 25 కుటుంబాలకు ఒక మాసానికి సరిపడే నిత్యావసర వస్తువులు విరాళంగా అందించారు. టీపాడ్ సంస్థ ఫౌండింగ్ కమిటీ చైర్ రావు కల్వల, బోర్డు ఆఫ్ ట్రస్టీస్ చైర్ మాధవి సుంకిరెడ్డి, కో ఆర్డినేటర్ బుచ్చిరెడ్డి గోలి, అధ్యక్షులు రవికాంత్ రెడ్డి మామిడి, కార్యవర్గ బృందానికి కొత్తగూడెం సెయింట్ జోసెఫ్ హై స్కూల్ ప్రిన్సిపాల్ ప్రేమ్ కుమార్, గ్రామస్థులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. (డల్లాస్ తెలంగాణ ప్రజాసమితి కార్యవర్గ బృందం..) టీపాడ్ నాయకత్వం, సంస్థ కార్యవర్గ బృందంతో కలిసి కోవిడ్ ఆపద సమంలో నారాయణ పేట జిల్లా నర్వ మండలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో, వివిధ విభాగాల్లో నిరంతరం సేవలందిస్తున్న వారికి దాదాపు వెయ్యి డాలర్ల విలువైన ఎన్-95 మాస్కులు, శానిటైజర్ల పంపిణీ చేశారు. తరువాత ఆంధ్రప్రదేశ్‌లో కృష జిల్లా కూచిపూడి గ్రామంలో 20 కుటుంబాలకు ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేశారు. అదే విధంగా కొత్తగూడెంలో కూడా 25 కుటుంబాలకు ఈ సహాయ కార్యక్రమం చేపడుతున్నందుకు, ఆపదలో ఉన్నవారికి చేయూతను ఇస్తున్నందుకు తమకెంతో సంతృప్తిని కలుగజేసిందని తెలియజేశారు. మున్ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి సంస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. -
డల్లాస్ తెలంగాణ ప్రజాసమితి కార్యవర్గ బృందం..
డల్లాస్: డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి (టీపాడ్), జనవరి 26న నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఫ్రిస్కో నగరములోని సభ శుభం బాన్క్వెట్ హాల్లో నిర్వహించారు. డల్లాస్ ప్రాంతీయులు, స్థానిక, తెలుగు జాతీయ సంస్థల నాయకులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు. ముందుగా డల్లాస్ చిరంజీవి శ్రేయస్ కొర్లపాటి ప్రార్థన గీతాన్ని ఆలపించగా అనంతరం అమెరికా, భారత దేశం జాతీయ గీతాలు పాడి కార్యవర్గ బృందం జ్యోతి ప్రజ్వలన చేసింది. ఈ కార్యక్రమాన్ని రఘువీర్ బండారు ఫౌండేషన్ కమిటి, శారద సింగిరెడ్డి బోర్డు అఫ్ ట్రస్టీ సంయుక్తంగా నిర్వహించారు. ముందుగా రఘువీర్ బండారు సభకి ఆహ్వానం తెలుపుతూ, 2014 లో సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు ఆరు సంవత్సరాల సంస్థ సాధించిన వైభవాన్ని, ఘనతను పంచుకున్నారు. విజయం వెనక పనిచేస్తున్న నాయకత్వాన్ని కార్యవర్గ బృందాన్ని, పోషక దాతలను మనస్పూర్తిగా అభినందిస్తూ వారి సేవలను అంకిత భావాన్ని కొనియాడారు. శారద సింగిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ ఏటా చేసిన సాంస్కృతిక, సామజిక సేవ రక్తదాన శిబిరాలు, నిరాశ్రయులకు ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన సదస్సులు, వనభోజనాలు, మాతృ దేశం నుంచి వచ్చిన నిపుణులతో ‘మీట్ అండ్ గ్రీట్’, సాంఘిక కార్యక్రమాలతో టీపాడ్ దూసుకుపోతున్న శైలిని వివరించారు. పూర్వ ఫౌండేషన్ కమిటీ చైర్ జానకి మందాడి నూతన కార్యవర్గ బృందాన్ని అభినంధించారు. అనంతరం జానకి మందాడి.. ఫౌండేషన్ కమిటీ చైర్ రావు కలవలతో ప్రమాణ స్వీకారం చేయించగా అజయ్ రెడ్డి, రఘువీర్ బండారు, పుష్ప గుచ్చం అందచేసి శాలువాతో సన్మానించారు. రావు కలవల గారు ఈ సంవత్సరం తాము చేసే కార్యక్రమాల గురించి మాట్లాడుతూ..అత్యున్నతమైన సేవలందించడములో కమ్యూనిటీ ముందుంటుందని తెలిపారు. తరువాత అజయ్ రెడ్డి ప్రసంగిస్తూ ‘టీపాడ్’ కార్యవర్గ బృందం నిస్వార్థంగా, ఆనందముతో కలిసి చేసే సేవ ఈ కమ్యూనిటీకి ఒక ఆదర్శమని కొనియాడారు. పూర్వ బోర్డు అఫ్ ట్రస్టీ చైర్ పవన్ గంగాధర, పూర్వ అధ్యక్షుడు చంద్రా రెడ్డి పోలీస్ గతేడాది జరిగిన కార్యక్రమాలకు సహకరించిన కమిటీ సభ్యులందరికి ధన్యవాదాలు తెలిపారు. పవన్ గంగాధర నూతనంగా ఎన్నుకోబడిన బోర్డు అఫ్ ట్రస్టీస్ రామ్ అన్నాడి, అశోక్ కొండల, పాండురంగారెడ్డి పాల్వే, ఇంద్రాణి పంచార్పులచే ప్రమాణ స్వీకారాలను చేయించగా, చంద్రా రెడ్డి పోలీస్.. ఎగ్జిక్యూటివ్ కమిటీ రవికాంత్ రెడ్డి మామిడి, మంజుల పంజాల, శ్రీధర్ వేముల, బాల గనవరపు, శ్రీనివాస్ అన్నమనేనితో ప్రమాణ స్వీకారం చేయించారు. తదనంతరం రఘువీర్ బండారు శారద సింగిరెడ్డి కలిసి ఈ సంవత్సరానికి బోర్డు అఫ్ ట్రస్టీ చైర్‌గా మాధవి సుంకిరెడ్డి, బోర్డు అఫ్ ట్రస్టీ వైస్ చైర్‌గా ఇంద్రాణి పంచార్పుల, ఎగ్జిక్యూటివ్ కమిటీ కోఆర్డినేటర్‌గా బుచ్చిరెడ్డి గోలి, ప్రెసిడెంట్‌గా రవికాంత్ రెడ్డి మామిడి, వైస్ ప్రెసిడెంట్‌గా రూప కన్నెయ్యగారి, జనరల్ సెక్రటరీగా అనురాధ మేకల, జాయింట్ సెక్రటరీగా లింగా రెడ్డి అల్వా, ట్రెజరర్ గా శంకర్ పరిమళ్, జాయింట్ ట్రెజరర్‌గా మధుమతి వ్యాసరాజుచే ప్రమాణ స్వీకారాలను చేయించారు. ప్రమాణ స్వీకారాల తర్వాత మాధవి సుంకిరెడ్డి, రవికాంత్ రెడ్డి మామిడి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం మరిన్ని సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామని చెబుతూ వారికి పదవీ బాధ్యతలను ఇచ్చిన నాయకత్వానికి ధన్యవాదాలు తెలియ చేశారు. నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కొత్త బోర్డు అఫ్ ట్రస్టీస్‌తో పాటు సుధాకర్ కలసాని, శారద సింగిరెడ్డితో పదవీ బాధ్యతలు కొనసాగించగా రఘువీర్ బండారు, అజయ్ రెడ్డి, జానకి మందాడి కూడా బోర్డు అఫ్ ట్రస్టీ సభ్యులుగా ఈ సంవత్సరం సహకరించి ఆర్థికంగా, కార్యనిర్వహణ సలహాల పటిష్టత కోసం కార్యవర్గ బృందంతో కలవడం సంస్థకు గర్వ కారణమన్నారు. కొత్తగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎగ్జిక్యూటివ్ కమిటీతో మాధవి లోకిరెడ్డి, లక్ష్మి పోరెడ్డి, రత్న ఉప్పల, రోజా అడెపు, అడ్వైజరీ కమిటీగా అరవింద్ రెడ్డి ముప్పిడి, ,విక్రమ్ రెడ్డి జంగం, వేణు భాగ్యనగర్, కరణ్ పోరెడ్డి, నరేష్ సుంకిరెడ్డి, రమణ లష్కర్, గంగా దేవర, జయ తెలకల పల్లి, సతీష్ నాగిళ్ల, కళ్యాణి తాడిమేటి వారి పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నారు. ప్రెసిడెంట్ రవికాంత్ రెడ్డి మామిడి కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికి, మీడియా ప్రతినిధులకు, శుభం బాన్క్వెట్ హాల్, ఆనంద్ అడియార్ భవన్ ఇండియన్ రెస్టారెంట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. -
శోభాయమానంగా డాలస్ బతుకమ్మ వేడుకలు
డలాస్ : తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్) ఆధ్వర్యంలో అమెరికాలోని డాలస్‌లో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలెన్ ఈవెంట్ సెంటర్, ఆలెన్, టెక్సాస్‌లో నిర్వహించిన ఈ సంబరాల్లో మహిళలు, యువతులు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. జానకి రామ్ మందాడి ఫౌండేషన్ కమిటీ చైర్, పవన్ గంగాధర బోర్ట్ ఆప్ ట్రస్టీ చైర్ చంద్రారెడ్డి, పోలీస్ ప్రెసిడెంట్ సుధాకర్ కలసాని, ఎగ్జిక్యూటీవ్ కమిటీ కోఆర్డినేటర్ మాధవి సుంకిరెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ వైస్ చైర్మన్ రవికాంత్ మామిడి, వైఎస్ ప్రెసిడెంట్ మాధవి లోకిరెడ్డి, జనరల్ సెక్రటరీ అనురాధ మేకల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కనీ, వినీ ఎరుగని రీతిలో ఈ వేడుకలు జరిగాయి. పొటెత్తిన జనసందోహాన్ని కట్టడి చేయలేక ఆలెన్ ఈవెంట్ సెక్యూరిటీ యాజమాన్యం సైతం కొంతమందిని వెలుపలే నిలిపివేసింది. ఈ సంబరాల్లో ప్రముఖ మాటల రచయిత కోనా వెంకట్, సినీ నటి మెహ్రీన్ ముఖ్య అతిథులుగా హాజరై బతుకమ్మ ఆడి, జమ్మి పూజలో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం (అక్టోబర్ 5) డాలస్ మహిళలు అందరూ అందంగా ముస్తాబాయ బతుకమ్మలు పేర్చుకొని వచ్చారు. కోలాటాలతో, దీపాలతో చప్పట్లతో బతుకమ్మ చుట్టూ ఆడిపాడి, గౌరీదేవికి నైవేద్యాలు సమర్పించారు. టీపాడ్ సంస్థ ప్రత్యేంగా సత్తుపిండి నైవేద్యాలు చేయించి ప్రజలందరికీ పంచిపెట్టింది. అనంతరం ఆడవాళ్లందరికి సంప్రదాయబద్దంగా గాజులు, పసుపు బోట్టు, ఇతర కానుకలు భారీ మొత్తంలో అందజేశారు. బతుకమ్మ కార్యక్రమం తర్వాత దసరా, జమ్మి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పల్లకి ఊరేగింపులు, నృత్యాలు, పరస్పరం జమ్మి ఆలింగానాల మధ్య ఎంతో వైభవంగా దసరా వేడుకలు జరిగాయి. టీపాడ్ సంస్థ 2019వ సవంత్సరానికి గాను చేసిన బతుకమ్మ స్వాగత పాట, కార్యవర్గ సభ్యులందరితో చేసిన వీడియోను అందరి సమక్షంలో విడుదల చేశారు. ప్రముఖ గాయని గాయకులు ప్రవీణ్ కొప్పోలు, అంజనా సౌమ్య, శిల్పారావు, వ్యాఖ్యాత రవళి సాయంత్రం సంగీత విభవారిలో పాల్గొని ఆటపాటలతో అందరిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపాడ్ సంస్థ ప్రెసిడెంట్ చంద్రారెడ్డి, రావ్ కల్వల, రామ్ అన్నాడి, అశోక్ కొండల, శ్రీనివాస్ గంగాధర, లక్ష్మీ పోరెడ్డి, శంకర్ పరిమళ, శ్రీనివాస్ వేముల, రత్న ఉప్పాల, రూప కన్నయ్యగిరి, మధుమతి వైస్యరాజు, దీప్తి సూర్యదేవర, శరత్ ఎర్రం, రోజా ఆడెపు, లింగారెడ్డి, వంశీకృష్ణ, స్వప్న తుమ్మపాల, గాయత్రిగిరి, శ్రీనివాస్ తుల, విజయ్ రెడ్డి, అపర్ణ కొల్లూరి, అనూష వనం, శశిరెడ్డి కర్రి, మంజుల తొడుపునూరి, మాధవి ఓంకార్, రవీంద్ర ధూళిపాళ, శరత్ పునిరెడ్డి, శ్రీధర్ కంచర్ల, శ్రీనివాస్ అన్నమనేని, శ్రవణ్ నిడిగంటి, నితిన్ చంద్ర, మాధవి మెంట, వందన గోరు, శ్రీకాంత్ రౌతు, తిలక్ వన్నంపుల, రఘు ఉత్కూర్, అభిషేక్‌రెడ్డి, కిరణ్ తళ్లూరి, దీపిక, ఇంద్రాణి పంచార్పుల, బుచ్చిరెడ్డి గోలి, శారద సింగిరెడ్డి, వేణు భాగ్యనగర్, విక్రమ్ జంగం, అరవింద్ రెడ్డి ముప్పిడి, నరేష్ సుంకిరెడ్డి, కరణ్పోరెడ్డి, జయ తెలకలపల్లి, గంగదేవర, సతీష్ నాగిళ్ల, కల్యాణి తాడిమెట్టి. రఘువీర్ బంగారు, అజయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శోభాయమానంగా డాలస్ బతుకమ్మ వేడుకలు
-
డల్లాస్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
డల్లాస్: బతుకమ్మ పండుగ వేడుకలను దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) అధ్వర్యంలో కొప్పెల్‌లోని ఆండ్రూ బ్రౌన్ పార్క్‌లో శుక్రవారం రోజున ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపంగా వెలుగొందే బతుకమ్మ పండుగ వేడుకలు మహాలయ అమావాస్యతో ప్రారంభమై ఆశ్వయుజ అష్టమి వరకు కొనసాగనున్నాయి. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా గుర్తుకొచ్చేది పూలు, నైవేద్యాలు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్కో రోజు ఒక్కో రకమైన నైవేద్యాలను సమర్పిస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. డల్లాస్‌లో నిర్వహించిన ఈ వేడుకలకు మహిళలు అందమైన పూలతో బతుకమ్మలను తయారు చేసి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ప్రకృతిని ఆరాధిస్తూ బంగారు జీవితానికి ఎలాంటి ఆపద రాకుండా ఆత్మస్థైర్యంతో నిండు నూరేళ్ల బతుకు పండుగలా సాగాలని గౌరీమాతను పూజించారు. కోరికలు తీర్చే అమ్మగా గౌరీమాతను మహిళలు భక్తి శ్రద్ధలతో పూజించారు. వృద్ధులు కూడా వేడుకలకు హాజరై హారతి, నిమర్జన ఆచారాలను అత్యంత ప్రామాణికమైన రీతిలో నిర్వహించడానికి సహాయపడ్డారు. భోజన సౌకర్యం, పార్కింగ్ ఏర్పాట్లు టీపీఏడీ అధ్వర్యంలో ఏర్పాటు చేశారు. బతుకమ్మ పండుగ చివరి రోజు వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నట్లు టీపీఏడీ సభ్యులు తెలియజేశారు. మొదటి రోజు వేడుకలకు హాజరైన మహిళలందరికీ టీపీఏడీ బృందం ధన్యవాదాలు తెలియజేస్తూ, పండుగ చివరి రోజైన అక్టోబర్ 5న సద్దుల బతుకమ్మ వేడుకలకు ఆహ్వానాన్ని అందించారు. చివరి రోజు వేడుకలకు తెలుగు సినీరంగానికి చెందిన అనేక మంది ప్రముఖులు హాజరుకానున్నారు. -
టీపీఏడీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
డల్లాస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) నేతృత్వంలో గురువారం బొడ్డెమ్మ పూజను ఫ్రిస్కోలోని ఐటీ స్పిన్‌లో ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ పండగ నేపథ్యంలో వేడుకలకు తొమ్మిది రోజుల ముందు బొడ్డెమ్మ పూజ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు ప్రత్యేకించి సెలవు లేకున్నా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొనడం విశేషం. తెలంగాణలో అనాధిగా వస్తున్నబతుకమ్మ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అక్కడి మహిళలు, యువతులు బతుకమ్మ పాటలతో అందరిని అలరించారు. మట్టితో చేసిన బోడెమ్మను నీటిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ సభ్యులు మాట్లాడుతూ.. ఈ వేడుకలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తలిపారు. అలాగే సెప్టెంబర్ 27న కోపెల్లోని ఆండ్ర్యూ బ్రౌన్ పార్క్‌లో జరిగే చిన్న బతుకమ్మ, అక్టోబర్ 5న అలెన్ ఈవెంట్ సెంటర్లో జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలను దిగ్విజయం చేయాలని కోరారు. కాగా, ఈ ఏడాది నిర్వహించే దసరా వేడుకలకు సుమారుగా 10,000 మంది ప్రవాసాంధ్రులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. -
టీపాడ్ బతుకమ్మ వేడుకల ‘కిక్ ఆఫ్’ ఈవెంట్
డాలస్ : డాలస్ తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో అక్టోబర్ 5వ తేదీన అతి వైభవంగా నిర్వహించే బతుకమ్మ, దసరా సంబరాలకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. టెక్సాస్ ఇర్వింగ్‌లోని కూచిపూడి ఇండియన్ కిచెన్ బాంక్వెట్ హాల్లో జరిగిన ఈ ‘కిక్ ఆఫ్’ ఈవెంట్‌కు టీపాడ్ అధ్యక్షుడు చంద్రారెడ్డి పోలీస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకి, అమెరికా జాతీయ తెలుగు సంస్థల, ప్రాంతీయ తెలుగు సంస్థల, తెలుగేతర సంస్థల కార్యవర్గ సభ్యులకు ఆయన హృదయపూర్వక స్వాగతం పలికారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ కో ఆర్డినేటర్ సుధాకర్ కలసాని, సెక్రటరీ మాధవి లోకిరెడ్డి కిక్ ఆఫ్ ఈవెంట్‌కు సమన్వయకర్తలుగా వ్యవహరించి కార్యక్రమానికి శోభను తీసుకువచ్చారు. సాంఘికపరమైన బాధ్యతలో భాగంగా ఈ ఏడాది టీపాడ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలను సమన్వయకర్తలు అతిథులకు వివరించారు. మార్చిలో జరిపిన రక్తదాన శిబిరం, ఏప్రిల్‌లో ఆస్టిన్ స్ట్రీట్ సెంటర్లోని 450 మంది నిరాశ్రయులకు భోజన ఏర్పాటు, మే నెలలో నిర్వహించిన యాంగ్జైటీ, డిప్రెషన్ మేనేజ్మెంట్పై అవగాహన సదస్సు, జూన్‌లో జరిపిన వనభోజనాలు, ఆగస్టులో జరిపిన మీట్ అండ్ గ్రీట్ గురించిన వివరాలు తెలియజేశారు. గత ఆరేళ్లుగా కమ్యూనిటీలో జరిగే ప్రతి కార్యక్రమానికి టీపాడ్ సంస్థ ఏ విధంగా సహాయ సహకారాలు అందజేస్తూ.. అండగా నిలబడుతుందో అతిథులకు తెలిపారు. అలాగే అక్టోబర్ 5న డాలస్‌లో టీపాడ్ ఆధ్వర్యంలో జరిపే బతుకమ్మ, దసరా సంబరాల ‘ఫ్లయర్ చిత్రాన్ని’ సంస్థ ఫౌండేషన్ కమిటీ చైర్ జానకి మందాడి, బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్ పవన్ గంగాధర, అధ్యక్షుడు చంద్రారెడ్డి పోలీస్‌లు కార్యక్రమానికి హాజరైన అతిథులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా పన్నెండు వేల మందికి పైగా హాజరు కానున్న బతుకమ్మ దసరా వేడుకల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను చంద్రారెడ్డి, జానకి మందాడి, పవన్ గంగాధర తెలియజేశారు. అలాగే ఈ సంబరాలకు హాజరయ్యే సినిమా, జానపద కళాకారుల, రాజకీయ అతిథుల వివరాలను వెల్లడించారు. ఈ కిక్ ఆఫ్ ఈవెంట్‌కు టీపాడ్ ఫౌండేషన్ టీమ్ అజయ్‌రెడ్డి, రావు కలవల, రఘువీర్ బండారు, మహేందర్ కామిరెడ్డి, బోర్టు ఆఫ్ ట్రస్టీస్ శారద సింగిరెడ్డి, ఇంద్రాణి పంచార్పుల, గోలి బుచ్చిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ శ్రీనివాస్ గంగాధర, లక్ష్మి పోరెడ్డి, అనురాధ మేకల, మధుమతి వ్యాసరాజు, దీప్తి సూర్యదేవర, రత్న ఉప్పల, శ్రీనివాస్ వేముల, లింగారెడ్డి అల్వా, అడ్వైజరీ కమిటీ రామ్ అన్నాడి, అశోక్ కొండల, వేణు భాగ్యనగర్, విక్రమ్ జంగం, జయ తెలకలపల్లి, కరణ్ పోరెడ్డి, కొలాబరేషన్ టీమ్ గాయత్రి గిరి, స్వప్న తుమ్మపాల, రేణుక చనుమోలు, శశి కర్రి, శ్రవణ్ నిడిగంటి, బాల గణపవరపు, కిరణ్ తల్లూరి, శ్రీనివాస్ తుల, విజయ్‌రెడ్డి, సత్య పెర్కారి, నీరజరెడ్డి పడిగెలలు కిక్ ఆఫ్ ఈవెంట్‌కు హాజరయి.. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చిన దాతలకు, కూచిపూడి కిచెన్ యాజమాన్యానికి, మీడియా మిత్రులకు, తానా, ఆటా, నాట్స్, టాటా, ఐఎన్టీ, టాంటెక్సస్, డాటా, జెట్, మనబడి సంస్థలకి, కమ్యూనిటీ లీడర్స్‌కి జానకి మందాడి, చంద్రారెడ్డి పోలీస్, సుధాకర్ కలసానిలు సంయుక్తంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అక్టోబర్ 5 డాలస్‌లోని ఆలెన్ ఈవెంట్ సెంటర్లో జరిగే బతుకమ్మ, దసరా సంబరాలకు ప్రపంచ నలుమూలాల ఉన్న భారతీయులందరికీ స్వాగతం పలికారు. -
డల్లాస్‌లో గాయకుడు రామచారి కోమండూరికి సత్కారం
డల్లాస్ : ఇటీవల డల్లాస్‌కు విచ్చేసిన రామాచారి కోమండూరిని తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) సభ్యులు ఘనంగా సత్కరించారు. గత 20 ఏళ్లుగా తెలుగు సినీ గాయకులకు శిక్షణ ఇస్తున్న గాయకుడు, సంగీత దర్శకుడు, శిక్షకుడు రామాచారి కోమండూరి.. అమెరికాలోని డల్లాస్‌లో పిల్లలకు తన ‘లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ’ ద్వారా సంగీత తరగతులు నేర్పించడం కోసం వచ్చారు. ఇప్పటికే ఈ అకాడమీ ద్వారా అమెరికాలోని డల్లాస్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో యువతకు సంగీతం శిక్షణ అందించారు. సంసృతి, కళలను ప్రోత్సహించడంలో ఆయన చేసిన కృషికి శారదా సింగిరెడ్డి నివాసంలో టీపీఏడి ఆయన్ను సత్కరించింది. టీపీఏడీ భారత సంప్రదాయాలు, ఆచారాలను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్న విషయం తెలిసిందే.. డల్లాస్‌ను సందర్శించే సంగీత కళాకారులు, గాయకులకు ఆహ్వానించడంతోపాటు, సహాయ సహాకారాలను అందిస్తోంది. ఈ సందర్భంగా రామాచారి మాట్లాడుతూ.. నేటి యువతకు మన సంస్కృతి, సంప్రదామాలు నేర్పించాలనేది తన ఆశయమని, దీనికి సంగీతమే ముఖ్య సాధనమని ఈయన పేర్కొన్నారు. ఇది భాషను, ఆచారాలను తెలుసుకోడానికి ఉపయోగపడుతుందని, దీనితోపాటు ఉత్తమ నడవడికకు, క్రమశిక్షణకు దోహదపడుతుందని ఆయన తెలిపారు. అనంతరం సంస్కృతి, సంప్రదాయాల్లో టీపీఏడీ చేస్తున్నఎనలేని కృషిని అభినందించారు. డల్లాస్‌లోని తెలుగు యువత చాలా ప్రతిభావంతులని, యువతలోని ప్రతిభను ప్రోత్సహించడంతోపాటు అవకాశాలు కల్పించడానికి టీపీఏడీ, యుఎస్ఎలోని ఇతర తెలుగు సంస్థల నుంచి ఆయన మద్దతు కోరారు. అజయ్ రెడ్డి, పవన్ గంగాధర, చంద్ర పోలీస్, రఘువీర్ బండారు, శారద సింగిరెడ్డి, మాధవి సుంకి రెడ్డి, సుధాకర్ కలసాని, రవికాంత్ మామిడి, శ్రీనివాస్ వేముల.. కోమండూరి రామాచారిని సత్కరించారు. టీపీఏడీ సంస్థ సభ్యులు శ్రీనివాస్ వేముల, బుచ్చి రెడ్డి గోలి, అనురాధ మేకల, వేణు భాగ్యనగర్, జయ తెలకలపల్లి, ఇందు పంచేరుపుల, నరేష్ సుంకి రెడ్డి, రోజా ఆడెపు, మధుమతి వైశ్యారాజు, రూప కన్నయ్యగారిరి, శ్రీనివాస్ తుల, టీపీఏడీ ప్రారంభ రోజు నుంచి రామచారి అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. వ్యక్తిగతంగా టీపీఏడీ సంస్థ చైర్మన్ జానకిరామ్ మందాడి, రావ్ కల్వాలా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ద్వారా రామాచారి చేస్తున్న సేవలను అభినందించారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు టీపీఏడీ సురేష్ వస్కర్ల, శారద సింగిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. -
డాలస్‌లో టీపాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్
డాలస్ : డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) ఆధ్వర్యంలో నిరాశ్రయులకు ఉచితంగా ఆహారాన్ని అందించడానికి ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. సమాజంపై బాధ్యతతో టీపాడ్ నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 450 మంది ఆస్టిన్ స్ట్రీట్ సెంటర్ నిరాశ్రయులకు అప్పుడే వండిన భోజనాన్ని అందించారు. ఉత్తర టెక్సాస్ డాలస్ ప్రాంతంలో, వేలాదిమంది నిరాశ్రయుల కుటుంబాలు ఆకలి బాధకు గురి అవుతున్నారు. చాలామంది తలదాచుకోవడానికి సొంతగూడు లేక కడుపునిండా తినడానికి నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. టీపాడ్ తన సామాజిక బాధ్యతగా ఆస్టిన్ స్ట్రీట్ సెంటర్ నిరాశ్రయులకు అండగా నిలిచి వారికి గౌరవప్రదమైన జీవనాన్ని గడిపే ప్రతి అడుగులోనూ తోడుగా ఉండేందుకు నిర్ణయించింది. ఈ ఏడాదిలోనే రెండు వారాల వ్యవధిలో టీపాడ్ సంస్థ తీసుకొన్న రెండవ సామాజిక బాధ్యత ఈ ఫుడ్ డ్రైవ్. టీపాడ్ గత నెలలో 23వ తేదీన రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. కేవలం ఆహారాన్ని వండి పెట్టటమే కాకుండా, నిరాశ్రయులకు అవసరమైన, దుస్తులు, అత్యవసర వస్తువులు కూడా సమకూర్చి సహాయపడ్డారు. టీపాడ్ ప్రెసిడెంట్ చంద్రారెడ్డి పోలీస్, వైస్ ప్రెసిడెంట్ రవికాంత్ రెడ్డి మామిడి, జాయింట్ సెక్రటరీ లక్ష్మి పోరెడ్డి, కార్యక్రమ సమన్వయ కర్తలు, టీపాడ్ ఫౌండేషన్ కమిటీ జానకి రామ్ మందాడి, రాజ వర్ధన్ గొంది, అజయ్ రెడ్డి, రావు కలవల, మహేందర్ కామిరెడ్డి, రఘు వీర్ బండారు, ఉపేందర్ తెలుగు, రామ్ అన్నాడి, అశోక్ కొండల, బోర్డు అఫ్ ట్రస్టీస్ పవన్ గంగాధర, మాధవి సుంకిరెడ్డి, సుధాకర్ కలసాని, ఇంద్రాణి పంచార్పుల, బుచ్చి రెడ్డి గోలి, శారద సింగిరెడ్డి, ఆఫీస్ బేరర్స్ కమిటీ మాధవి లోకిరెడ్డి జనరల్ సెక్రటరీ, అనురాధ మేకల ట్రెజరర్, శంకర్ పరిమళ్ జాయింట్ ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ శ్రీనివాస్ వేముల, రత్నఉప్పాల, రూపకన్నయ్య గిరి, మధుమతి వ్యాసరాజు, దీప్తి సూర్యదేవర, శరత్ ఎర్రం, రోజా అడెపు, లింగారెడ్డి, అడ్వైజరి కమిటీ సభ్యులు వేణు భాగ్యనగర్, విక్రమ్ జంగం, నరేష్ సుంకిరెడ్డి , కరణ్ పోరెడ్డి , జయ తెలకలపల్లి, సురేందర్ చింతల,అరవింద్ ముప్పిడి, గంగ దేవర, సతీష్ నాగిళ్ల , సంతోష్ కోరె, కళ్యాణి తాడిమెట్టి , కొలాబరేషన్ కమిటీ, వంశీ కృష్ణ , స్వప్న తుమ్మపాల, శ్రీనివాస్ తుల, విజయ్ రెడ్డి, అపర్ణ కొల్లూరి,అనూష వనం, శశి రెడ్డి కర్రి, మంజుల తొడుపునూరి , మాధవి ఓంకార్, గాయత్రి గిరి , జయశ్రీ మురుకుట్ల, రవీంద్ర ధూళిపాళ, శ్రీనివాస్ కూటికంటి,శరత్ పున్ రెడ్డి,శ్రీధర్ కంచర్ల, శ్రీనివాస్ అన్నమనేని, స్రవణ్ నిడిగంటి, నితిన్ చంద్ర, అపర్ణ సింగిరెడ్డి, కామేశ్వరి దివాకర్ల, కవిత బ్రహ్మదేవర, నితిన్ కొర్వి, సుగాత్రి గుడూరు, మాధవి మెంట, వందన గోరు,ధనలక్ష్మి రావుల, లావణ్య యరకాల, శ్రీకాంత్ రౌతు, తిలక్ వన్నంపుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆస్టిన్ స్ట్రీట్ సెంటర్ యాజమాన్యం టీపాడ్ అందిస్తున్న సహాయసహకారాలను కొనియాడారు. మానవతా ధృక్పథంతో ముందడుగు వేసిన టీపాడ్ సంస్థకు తమ ధన్యవాదములు తెలిపారు. -
టీపాడ్ ఆధ్వర్యంలో ‘రక్తదాన శిబిరం’
డల్లాస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) ఆధ్వర్యములో గత 6 సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న రక్తదాన శిబిరం గడచిన శనివారము మార్చ్ ఐ .టి .స్పిన్ ఆఫీస్ ప్రాంగణము,ప్లేనో డాలస్ నగరములో జరిగినది. ఈ శిబిరంలో ‘కార్టర్ బ్లడ్ కేర్ సంస్థ’ సహాయంతో 50 మంది రక్త దాతల నుండి, 32 యూనిట్లు అనగా 8000ml రక్తం సేకరించబడినది . ప్రతి యూనిట్ రక్తం ముగ్గురు వ్యక్తులను ప్రాణాపాయం నుండి కాపాడవచ్చు అనగా ఈ శిబిరంలో సేకరించిన రక్తము సుమారు 96 మంది ప్రాణము కాపాడగలము. ‘కార్టర్ బ్లడ్ కేర్ సంస్థ’ లెక్క ప్రకారం ఈ శిబిరంలో సేకరించిన రక్తము వలన 7 గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు , 12 సార్లు రక్త మార్పిడి జరుగగలవు. ఈ రక్తదాన శిబిరాన్ని చంద్రారెడ్డి పోలీస్ టీపాడ్ ప్రెసిడెంట్ మధుమతి వ్యాసరాజు రక్తదాన శిబిరం సమన్వయ కర్త, టీపాడ్ ఫౌండేషన్ కమిటీ జానకి రామ్ మందాడి, రాజ వర్ధన్ గొంది, అజయ్ రెడ్డి, రావు కలవల, మహేందర్ కామిరెడ్డి, రఘు వీర్ బండారు, ఉపేందర్ తెలుగు, రామ్ అన్నాడి, అశోక్ కొండల, బోర్డు అఫ్ ట్రస్టీస్ పవన్ గంగాధర, మాధవి సుంకిరెడ్డి, సుధాకర్ కలసాని, ఇంద్రాణి పంచార్పుల, బుచ్చి రెడ్డి గోలి, శారద సింగిరెడ్డి, ఆఫీస్ బేరర్స్ కమిటీ రవికాంత్ రెడ్డి మామిడి వైస్ ప్రెసిడెంట్, మాధవి లోకిరెడ్డి జనరల్ సెక్రటరీ, లక్ష్మి పోరెడ్డి జాయింట్ సెక్రటరీ, అనురాధ మేకల ట్రెసరర్, శంకర్ పరిమళ్ జాయింట్ ట్రెసరర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ శ్రీనివాస్ వేముల, రత్నఉప్పాల, రూపకన్నయ్య గిరి, దీప్తి సూర్యదేవర, శరత్ ఎర్రం, రోజా అడెపు, లింగారెడ్డి, అడ్వైజరి కమిటీ సభ్యులు వేణు భాగ్యనగర్, విక్రమ్ జంగం, నరేష్ సుంకిరెడ్డి , కరణ్ పోరెడ్డి , జయ తెలకలపల్లి, సురేందర్ చింతల,అరవింద్ ముప్పిడి, గంగ దేవర, సతీష్ నాగిళ్ల , సంతోష్ కోరె, కళ్యాణి తాడిమెట్టి , కొలాబరేషన్ కమిటీ, వంశీ కృష్ణ , స్వప్న తుమ్మపాల, శ్రీనివాస్ తుల, విజయ్ రెడ్డి, అపర్ణ కొల్లూరి,అనూష వనం, శశి రెడ్డి కర్రి, మంజుల తొడుపునూరి , మాధవి ఓంకార్, గాయత్రి గిరి , జయశ్రీ మురుకుట్ల, రవీంద్ర ధూళిపాళ, శ్రీనివాస్ కూటికంటి,శరత్ పున్ రెడ్డి,శ్రీధర్ కంచర్ల, శ్రీనివాస్ అన్నమనేని, స్రవణ్ నిడిగంటి, నితిన్ చంద్ర, అపర్ణ సింగిరెడ్డి, కామేశ్వరి దివాకర్ల, కవిత బ్రహ్మదేవర,నితిన్ కొర్వి , సుగాత్రి గుడూరు, మాధవి మెంట ,వందన గోరు,ధనలక్ష్మి రావుల, లావణ్య యరకాల, శ్రీకాంత్ రౌతు, తిలక్ వన్నంపుల ఆధ్వర్యములో నిర్వహించారు. టీపాడ్ కార్యవర్గ బృందం మరియు కార్టర్ బ్లడ్ కేర్ సంస్థ టెక్నిషియన్స్ శిబిరాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరినీ చక్కగా ఆదరించి ఆహ్వానించారు. ఇంత చక్కటి సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు టీపాడ్ సంస్థకి రక్త దాతలు సంతోషముతో కృతజ్ఞతలు తెలిపారు. డాలస్ నగరములో చదివే విద్యార్థులు పెద్ద సంఖ్యలో హజరయ్యి ఈ సేవా కార్యక్రమములో పాల్గొని వారి వంతు సహాయ సహకారాలను అందించారు. టీపాడ్ ప్రెసిడెంట్ చంద్రా రెడ్డి పోలీస్ సంస్థ చేసే కమ్యూనిటీ సేవ కార్య క్రమాల గురించి మాట్లాడుతూ ఏప్రిల్ 6, 2019 న జరుగుబోయే 'ఫుడ్ డ్రైవ్' విషయాలను వొచ్చిన వారందరికి వివరించారు. తదనంతరం పత్రిక మరియు ప్రసార మాధ్యమాలకు, రక్తం ఇవ్వడానికి వచ్చిన రక్త దాతలకు మరియు రక్త దాన శిబిరం నిర్వహించటానికి కావాల్సిన ప్రాంగణ వసతులు కల్పించిన ఐ.టి.స్పిన్ ఆఫీస్ యాజమాన్యం ఉమ గడ్డం గారికి కృతజ్ఞతలు తెలియచేసారు. -
టీపాడ్ నూతన కార్యవర్గం ఎన్నిక
డల్లాస్ : డల్లాస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) 2019 నూతన కార్యవర్గ బృందం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా ముగిసింది. టీపాడ్ 2019 కమిటీ ఎన్నుకోబడిన కొత్త కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార సభ ప్లేనో నగరంలోని మినర్వా బాన్వ్కెట్ హాల్లో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. డల్లాస్ ప్రాంతీయులు, అన్ని స్థానిక, తెలుగు జాతీయ సంస్థల నాయకులు అధిక సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. జనవరి 27, ఆదివారం 2019 డాలస్ టెక్సస్. డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) ఏప్రిల్, 2014లో స్థాపించబడి“ఇన్స్పిరేషన్ , ఇంటరాక్షన్ & ఇంక్లూషన్” అనే నినాదాన్ని అక్షర సత్యంగా అమలు పరుస్తూ అన్ని జాతీయ, స్థానిక సంస్థలతో, విభిన్న సామజిక సేవలలో తనదైన శైలితోఆర్థికంగా, కార్య క్రమాల పరంగా అండదండని యిస్తూ ముందుకు సాగుతుంది. ప్రతీ ఏటావేలాది డాలస్ నగర వాసులతో అతి పెద్ద బతుకమ్మ వేడుకలు మరియు అంబరాన్నంటే దసరా సంబరాలను జరుపుతూ పండగ ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనతని కైవసం చేసుకుంది.శాస్త్రీయ నృత్యాలకి, సంగీత మాధుర్యాలకి పెద్ద పీట వేస్తూ, ఎంతో మంది స్థానిక కళాకారులతో పాటు మాతృభూమి కళాకారుల కి ప్రోత్సాహం యివ్వడములో అగ్రస్థానాన్ని పుణికి పుచ్చుకున్న సంస్థ టీపాడ్. 2017 లో తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలతో అతి వైభవంగా బతుకమ్మ వేడుకలను జరిపామని తెలంగాణ ప్రభుత్వముచే గుర్తించబడి మెప్పుపొందిన ఘనత టీపాడ్ కి దక్కడం గర్వ కారణం వేసవి లో వెచ్చని వనభోజనాలు పచ్చని వనంలో ప్రతీ ఏటా జరుపుతూ వేల కుటుంబాల సంబంధ బాంధవ్యాలఅమరికకు పెద్దరికాన్ని ప్రేమతో నిలబెట్టుకుంటుంది. ప్రతీ ఏటా రక్త దాన శిబిరాలు నిర్వహిస్తూ ప్రాణాధాత గా వ్యవహరిస్తోంది. యువతకి స్పూర్తినిస్తూ మాతృభూమిపై మమకారాలను పెంపొందిస్తూ, సేవా దృక్పథం కలిగిన నాయకులకి స్ఫూర్తిని కలుగజేసే “లీడర్ షిప్ స్కిల్స్ వర్కుషాప్స్”లాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ముందుకు కొనసాగుతుంది. టీపాడ్ 2019 ఎన్నుకొనబడిన కొత్త కార్యవర్గ బృందం ప్రమాణస్వీకారాల సభ మినర్వా బాన్క్వెట్ హాల్ , ప్లేనో నగరములో నిర్వహించారు. డాలస్ ప్రాంతీయులు, అన్ని స్థానిక మరియు తెలుగు జాతీయ సంస్థల నాయకులు అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసారు. ముందుగా డాలస్ చిన్నారులు అవని సుంకిరెడ్డి, సిందూరి కోడూరి, నిగమా రెడ్డి కొండ ప్రార్థన మరియు అమెరికా, భారత దేశం జాతీయ గీతాలు ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అటు తరువాత రఘువీర్ రెడ్డి బండారు(2018 ఫౌండేషన్ కమిటీ చైర్), శారద సింగిరెడ్డి (2018 బోర్డు అఫ్ ట్రస్టీ చైర్ 2018), శ్రీనివాస్ గంగాధర (2018 ప్రసిడెంట్) , ఇంద్రాణి పంచార్పుల (2018 ఎగ్జిక్యూటివ్ కమిటీ కోఆర్డినేటర్) సంయుక్తంగా 2018లో నిర్వహించిన కార్యక్రమాల విజయాన్ని సభకి తెలుపుతూ పనిచేసిన కార్యవర్గాన్ని ప్రశంసిస్తూ అభినందనలు తెలియచేసారు. తదనంతరము రఘువీర్ రెడ్డి బండారు జానకిరామ్ రెడ్డి మందాడి 2019 ఫౌండేషన్ కమిటీ చైర్ గా , రాజ వర్ధన్ రెడ్డి గొంది 2019 ఫౌండేషన్ కమిటీ వైస్ చైర్ గా, రామ్ రెడ్డి అన్నా డి ఫాండషన్ కమిటీ మెంబెర్ గా , అశోక్ రెడ్డి కొండల ఫౌండేషన్ కమిటి మెంబెర్ గా వారిచే ప్రమాణ స్వీకారాలను చేయించారు. శారద సింగిరెడ్డి గోలి బుచ్చి రెడ్డి బోర్డు అఫ్ ట్రస్టీ చైర్ మెంబెర్ గా, పవన్ గంగాధర 2019 బోర్డు అఫ్ ట్రస్టీ చైర్ గా , మాధవి సుంకిరెడ్డి 2019 బోర్డు అఫ్ ట్రస్టీ వైస్ చైర్ గా, సుధాకర్ రెడ్డి కలసాని 2019 ఎగ్జిక్యూటివ్ కమిటీ కోఆర్డినేటర్ గా వారిచే ప్రమాణ స్వీకారాలను చేయించారు. శ్రీనివాస్ గంగాధర చంద్రా రెడ్డి పోలీస్ 2019 ప్రెసిడెంట్ గా, రవికాంత్ రెడ్డి మామిడి 2019 వైస్ ప్రెసిడెంట్ గా , మాధవి రెడ్డి లోకిరెడ్డి 2019 జనరల్ సెక్రటరీ గా , లక్ష్మి పోరెడ్డి 2019 జాయింట్ సెక్రటరీ గా , అనురాధ మేకల 2019 ట్రెసరర్ గా , శంకర్ పరిమళ్ 2019 జాయింట్ ట్రేసరర్ గా, రత్న ఉప్పల ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్ గా వారిచే ప్రమాణ స్వీకారాలను చేయించారు. టీపాడ్ ఫౌండేషన్ కమిటీ చైర్ జానకిరామ్ రెడ్డి మందాడి 2019 సంవత్సరములోకొనసాగే కార్య వర్గబృందం ఫౌండేషన్ కమిటీగా వ్యవహరిస్తున్న రాజవర్ధన్ రెడ్డి గొంది , అజయ్ రెడ్డి, మహేందర్ కామిరెడ్డి,రఘువీర్ రెడ్డి బండారు ,రావు కలవల , ఉపేందర్ తెలుగు, రామ్ రెడ్డి అన్నాడి , అశోక్ రెడ్డి కొండల లను, బోర్డు అఫ్ ట్రస్టీ కమిటీగా వ్యవహరిస్తున్న పవన్ కుమార్ గంగాధర,మాధవి సుంకిరెడ్డి , సుధాకర్ కలసాని, బుచ్చిరెడ్డి గోలి, ఇంద్రాణి పంచార్పుల,శారద సింగిరెడ్డి లను, ఎగ్జిక్యూటివ్ కమిటీగా వ్యవహరిస్తున్న చంద్రా రెడ్డి పోలీస్,శ్రీనివాస్ గంగాధర,రవికాంత్ రెడ్డి మామిడి,మాధవి లోకిరెడ్డి, లక్ష్మి పోరెడ్డి, అనురాధ మేకల, శంకర్ పరిమళ్, దీప్తి సూర్యదేవర,లింగా రెడ్డి అల్వా, మధుమతి వ్యాసరాజు, రత్న ఉప్పల, రోజా అడెపు,రూప కన్నెయ్యగారి,శరత్ ఎర్రం, శ్రీనివాస్ వేముల లను అడ్వైసరి కమిటీగా వ్యవహరిస్తున్న అరవింద్ రెడ్డి ముప్పిడి, గంగా దేవర, జయ తెలకల పల్లి,కరణ్ పోరెడ్డి,నరేష్ సుంకిరెడ్డి,రమణ లష్కర్,సంతోష్ కోరె, సతీష్ నాగిళ్ల , సురేందర్ చింతల,వేణు భాగ్యనగర్,విక్రమ్ రెడ్డి జంగం,కళ్యాణి తాడిమేటి లను, కొలాబరేషన్ కమిటీగా వ్యవహరిస్తున్న అనూష వనం,అపర్ణ కొల్లూరి, అపర్ణ సింగిరెడ్డి,ధన లక్ష్మి రావుల,గాయత్రి గిరి,జయశ్రీ మురుకుట్ల,కవిత బ్రహ్మదేవర,మాధవి మెంట,మాధవి ఓంకార్, మంజుల తొడుపునూరి,నితిన్ చంద్ర, రవీంద్ర ధూళిపాళ, శశి రెడ్డి కర్రి,శరత్ పు న్ రెడ్డి, శ్రవణ్ నిధిగంటి , శ్రీధర్ కంచర్ల,శ్రీకాంత్ రౌతు,శ్రీనివాస్ అన్నమనేని,శ్రీనివాస్ కూటికంటి,శ్రీనివాస్ తుల,స్వప్న తుమ్మపాల, తిలక్ వన్నంపుల, వంశి కృష్ణ, వందన గౌరు లను వేదిక పైకి ఆహ్వానించి అభినందనలు తెలియచేసారు. కార్యక్రమములో చివరిగా ఫౌండేషన్ కమిటి బృందం అజయ్ రెడ్డి, రఘువీర్ రెడ్డి బండారు, రావు కలవల, జానకిరామ్ రెడ్డి మందాడి, రామ్ రెడ్డి అన్నాడి, అశోక్ రెడ్డి కొండల “తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్” సంస్థ ప్రెసిడెంట్ (2019-2020) గా ఎన్నికైన విక్రమ్ రెడ్డి జంగం మరియు “నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్” ప్రెసిడెంట్ (2021-2022) ) గా ఎన్నికైన శ్రీధర్ రెడ్డి కొరసపాటిని పుష్పగుచ్ఛాలతో సత్కరించి, శాలువాతో సన్మానించి తెలుగు సంస్థలకు వారిరువురు చేస్తున్నటువంటి సేవలను కొనియాడారు. బోర్డు అఫ్ ట్రస్టీ వైస్ చైర్ మాధవిసుంకిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ కోఆర్డినేటర్ సుధాకర్ కలసాని కార్యక్రమానికి వొచ్చిన అతిథులందరికి, ప్రసార మాధ్యమాలు మీడియా మరియు బసేరా ఇండియన్ రెస్టారెంట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. -
డల్లాస్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
డల్లాస్ : తెలుగు పీపుల్స్ అసోసియేషన్ (టీపాడ్) ఆధ్వర్యంలో అమెరికాలోని డల్లాస్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ సంబరాల్లో నటి అనూ ఇమ్మాన్యుయేల్ ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ ఆడి, జమ్మి పూజలో పాల్గొన్నారు. డల్లాస్‌లోని అలెన్ ఈవెంట్ సెంటర్‌ని మహిళలు, యువతులు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. టీపాడ్ సభ్యులతో పాటు, పక్కనున్న ఓక్లాహోమా, కన్సాస్, ఆర్కాన్సాస్ రాష్ట్రాలకు చెందిన భారతీయులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. టీపాడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాల్లో దాదాపు 10 వేల మంది పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వేణు భాగ్యనగర్, విక్రమ్ జనగాం, జయ తెలకపల్లి, రత్న ఉప్పల, నరేష్ సంకిరెడ్డి, సతీష్ నగిల్లా, కళ్యాణి తాడిమెటి, గంగ దేవర, అనురాధ మేకల, లక్ష్మీ పొరెడ్డి, బుచి రెడ్డి గోల్, వంశీ కృష్ణ ఉప్పలదాడియం, అపర్ణ కొల్లూరి, అనుష వనం, జయశ్రీ మురుకుట్ల, అపర్ణ ఎద్దుల, రేణుక చనుమోలు, శ్రీనివాస్ తుల, శ్రీనివాస్ కంచర్ల, రవీంద్రనాథ్ దూళిపల్లి, స్వప్న తుమ్మపాల, శశిరెడ్డి కర్రి, వందన గౌరు, మాధవి మెంట, మంజుల తొడుపునూరి, గాయత్రి గిరి, మాధవి ఓంకార్, శ్రీనివాస్ అన్నమనేని, శ్రీనివాస్ కూటికంటి, శ్రవణ్ నిదిగంటి, శ్రీకాంత్ రౌతు, తిల్క వన్నంపుల, శరత్ పున్రెడ్డి పాల్గొన్నారు.