డాలస్‌లో శ్రీనివాసుడి కల్యాణం | Lord Srinivasa wedding and Special pujas in Dallas: TPAD | Sakshi
Sakshi News home page

డాలస్‌లో శ్రీనివాసుడి కల్యాణం

Published Tue, Jun 7 2022 8:26 PM | Last Updated on Tue, Jun 7 2022 8:46 PM

Lord Srinivasa wedding and Special pujas in Dallas: TPAD - Sakshi

డాలస్‌: అమెరికాలోని డాలస్‌లో శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.డాలస్‌లోని క్రెడిట్‌ యూనియన్‌ ఆఫ్‌ టెక్సాస్‌ ఈవెంట్‌ సెంటర్‌లో తెలుగువారి ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, అభిషేకం, కల్యాణ సేవలను అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.  

జూన్‌ 25వ తేదీన అలెన్‌ ఈవెంట్‌ సెంటర్‌ (క్రెడిట్‌ యూనియన్‌ ఆఫ్‌ టెక్సాస్‌ ఈవెంట్‌ సెంటర్‌) వేదికగా డాలస్‌ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్‌) చేపడుతున్న ఈ విశేష కార్యక్రమానికి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  పాల్గొననున్నారు. స్వయంగా దేవదేవతల ప్రతిరూపాలను, పూజారులను ఆయన వెంటబెట్టుకుని రానున్నారు. ఈ సందర్భంగా డాలస్‌లో ఉంటున్న తెలంగాణ, తెలుగు వారి సౌకర్యార్థం టీపాడ్‌ తగిన ఏర్పాట్లను చేస్తోంది.  

పద్మావతీ అలిమేలు సమేత శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికి స్వామివారి లడ్డూ ప్రసాదం, విశేష పూజల్లో భాగస్వాములయ్యే వారికి తిరుమల లడ్డూతోపాటు వస్త్రం అందజేయనున్నట్టు టీపాడ్‌ ప్రతినిధులు తెలిపారు. అలాగే స్వామివారి విశేష సేవా కైంకర్యాల్లో పాల్గొనేవారు ముందుగా తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటించారు. అందరూ ఆహ్వానితులేనని, పార్కింగ్‌ కూడా ఉచితమని తెలిపారు. డాలస్‌లో తిరుమల వెంకన్న దర్శన భాగ్యం  కల్పించడం పట్ల స్థానిక భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారనీ టీపాడ్‌ ప్రతినిధులు  చెప్పారు.  మరిన్ని వివరాల కోసం tpadus.org ని సంప్రదించవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement