తెలంగాణ పీపుల్స్ అసోషియేషన్ ఆఫ్ డల్లాస్ బృందం
అమెరికా: తెలంగాణ పీపుల్స్ అసోషియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) ఆధ్వర్యంలో డల్లాస్, ఫ్రిస్కో, టెక్సాస్‌లలో గత శనివారం (మార్చి 31) రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మంది ఔత్సాహికులు, విద్యార్థులు పాల్గొని బ్లడ్ డొనేట్ చేశారు. 25 యూనిట్ల రక్తం సేకరించామని నిర్వాహకులు తెలిపారు. ఒక్కో యూనిట్ రక్తంతో మూడు ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. బ్లడ్ డోనేట్ చేసిన దాతలు టీపీఏడీకి అభినందనలు తెలిపారు.
పుట్టిన గడ్డకు సేవ చేయాల్సిన బాధ్యత ప్రతి అమెరికన్‌పై ఉందని కార్యక్రమ నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. బ్లడ్ డ్రైవ్ నిర్వహించడం వ్యక్తిగతంగా తమకెంతో సంతృప్తినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.వలంటీర్లు, బ్లడ్ డోనర్లకు బసేర ఇండియన్ రెస్టారెంట్‌లో అల్పాహరం అందించారు. జస్ట్‌బై ఆన్‌లైన్ స్టోర్ నిర్వహిస్తున్న మహిళా ఎంటర్‌ప్రిన్యూర్ వలంటీర్లకు టీ-షర్టులు, క్యాప్‌లు అందించారు.
టీపీఏడీ ప్రెసిడెంట్ శ్రీని గంగాధర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో .. బ్లడ్ డ్రైవ్ కో-ఆర్డినేటర్ మాధవి లోకిరెడ్డి, టీపీఏడీ మెంబర్లు. రఘువీర్ బండారు, జానకిరాం మందాడి, ఉపేందర్ తెలుగు, అజయ్ రెడ్డి, రావు కల్వల, రాజ్‌వర్ధన్ గోంధీ, మహేందర్ కామిరెడ్డి, శారదా సింగిరెడ్డి, పవన్‌కుమార గంగాధర, ఇంద్రాణి పంచార్పుల, రామ్ అన్నాడి, మనోహర్ కాసగాని, అశోక్ కొండల, మాధవి సుంకిరెడ్డి, సుధాకర్ కలసాని..
టీపీఏడీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు.. శ్రీని గంగాధర, రమణ లష్కర్, కరణ్ పోరెడ్డి, చంద్ర పోలీస్, సత్య పెర్కరి, రవికాంత్ మామిడి, రూప కన్నయ్యగారి, లింగారెడ్డి ఆల్వ, శ్రీనివాస్ వేముల, సురేందర్ చింతల, రోజా ఆడెపు, శరత్ ఎర్రం, మధుమతి వైశ్యరాజు, మాధవి లోకిరెడ్డి, దీప్తి సూర్యదేవర, శంకర్ పరిమళ్...
టీపీఏడీ అడ్వయిజర్లు.. వేణు భాగ్యనగర్, విక్రం జంగం, నరేష్ సుంకిరెడ్డి, గంగా దేవర, జయ తెలకపల్లి, సంతోష్ కోరె, అరవింద్ ముప్పిడి, రత్న ఉప్పల, సతీష్ నాగిళ్ల, కల్యాణి తడిమేటి,
కొలాబొరేషన్ టీమ్ సభ్యులు ... లక్ష్మీ పోరెడ్డి, పల్లవి తోటకూర, రోహిత్ నరిమేటి, అనూష వనం, నితిన్ చంద్ర, శిరీష్ గోనే, మాధవి ఓంకార్, అపర్ణ సింగిరెడ్డి, కామేశ్వరి దివాకర్ల, కవితా బ్రహ్మదేవర, అనురాధ మేకల, సునిత, నితిన్ కొర్వి, శశిరెడ్డి కర్రి, మంజుల తొడుపునూరి, మాధవి ఓంకార్, సుగత్రి గూడూరు, మాధవి మెంట, లావణ్య యాకర్ల, ధనలక్ష్మి రావుల, మంజులా రెడ్డి ముప్పిడి, శాంతి నూతి లు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్త దానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తమ రక్తాన్ని దానం చేయడంతో పాటు టీపీఏడీ చారిటబుల్ ట్రస్ట్‌లో భాగస్వాములయ్యారని నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment