సామాజిక సేవలో టీప్యాడ్‌ | Telangana peoples Association Of Dallas Blood Drive | Sakshi
Sakshi News home page

సామాజిక సేవలో టీప్యాడ్‌

Published Tue, Mar 22 2022 2:02 PM | Last Updated on Tue, Mar 22 2022 2:42 PM

 Telangana peoples Association Of Dallas Blood Drive - Sakshi

తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డల్లాస్‌ ఆధ్వర్యంలో 2022 ఏప్రిల్‌ 2న బ్లడ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు టీప్యాడ్‌ ప్రతినిధులు తెలిపారు. టెక్సాస్‌లోని ఫ్రిక్స్‌ నగరంలో లెబనాన్‌రోడ్‌లో ఉన్న ఐటీ స్పిన్‌ భవనంలో ఈ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. 

సమాజానికి తిరిగి ఏదైనా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రతీ ఏడు టీప్యాడ్‌ ఈ బ్లడ్‌డ్రైవ్‌ను కొనసాగిస్తోంది. ఈ ఏడాది జరిగే బ్లడ్‌ డ్రైవ్‌లో పాల్గొనే ఆసక్తి ఉన్న వారు తమ వివరాలు రిజిస్ట్రర్‌ చేసుకోవాలని టీప్యాడ్‌ కోరింది. గడిచిన 90 రోజుల్లో విదేశీ ప్రయాణం చేసిన అమెరికన్లను ఈ బడ్ల్‌డ్రైవ్‌కు అనుమతించడం లేదని టీప్యాడ్‌ స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్‌ కోసం https://ww3.greatpartners.org/donor/schedules/drive_schedule/131481 లింక్‌ను ఉపయోగించుకోవాలని టీప్యాడ్‌ కోరింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement