టీపీఏడీ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ | TPAD Collaborates In Administering COVID19 Vaccine | Sakshi
Sakshi News home page

టీపీఏడీ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌

Published Tue, Apr 13 2021 8:45 PM | Last Updated on Tue, Apr 13 2021 8:58 PM

TPAD Collaborates In Administering COVID19 Vaccine  - Sakshi

డల్లాస్‌ : కరోనా మహమ్మారి సమయంలో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఫ్రంట్‌లైన్ కమ్యూనిటీకి బాసటగా నిలిచింది. టెక్సాస్‌లోని డల్లాస్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అందించడానికి టీపీఏడి టెక్సోమా ఫార్మసీతో కలిసి పనిచేసింది. డల్లాస్, ఫ్రిస్కో, ప్లానో, అలెన్, మెకిన్నే ప్రాంతాలలో నివసించే తెలుగు వారికి వ్యాక్సిన్‌ను అందించడానికి టీపీఏడి వాలంటీర్లు షెడ్యూలింగ్, టీకా గ్రహీతల చెక్-ఇన్ వంటి పనులలో వారికి సపోర్ట్ చేశారు. వారాంతపు రోజున వ్యాక్సిన్ తీసుకునే అవకాశాన్ని స్థానిక నివాసితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనురాధ మేకల టీకాల ప్రయత్నాన్ని సమన్వయపరిచారు, టీకా గ్రహీతల టెక్సోమా ఫార్మసీతో షెడ్యూల్ ఏర్పాటు చేశారు. సుమారు 96 మంది టీకా డ్రైవ్‌ను సద్వినియోగం చేసుకున్నారు.

కరోనా తీవ్రతను తగ్గించటానికి వ్యాక్సిన్‌ వేయించుకోవటం తప్పనిసరని టీపీఏడీ నాయకత్వం పేర్కొంది. తెలుగు వారికోసం మరో వ్యాక్సిన్‌ డ్రైవ్‌ నిర్వహించటానికి టీపీఏడీ ఎల్లప్పుడు ముందుంటుందని తెలిపింది. ఈ కార్యక్రమంలో రావు కల్వల, రఘువీర్‌ బండారు, మాధవి సుంకిరెడ్డి, రవికాంత్‌ మామిడి, గోలి బుచ్చి రెడ్డి, చంద్ర పోలీస్‌, రూప కన్నయ్యగారి, లక్ష్మి పోరెడ్డి, మంజుల తొడుపునూరి, ఇందు పంచెరుపుల, విజయ్‌ తొడుపునూరి, పవన్‌ గాంగాధర, పండు పాల్వాయ్‌, అశోక్‌ కొండాల, రామ్‌ అన్నడి, లింగారెడ్డి అల్వ, రత్న ఉప్పల, రోజా అదెపు, శ్రీధర్‌ వేముల, జయ తెలకపల్లి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement