డల్లాస్ : తెలంగాణ పీపుల్స్ ఆఫ్ డల్లాస్(టీపాడ్) ఆధ్వర్యంలో జరిగే బతుకమ్మ, దసరా వేడుకలకు నటి అనూ ఇమ్మాన్యుయేల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని నిర్వాహకులు తెలిపారు. 2018 బతుకమ్మ-దసరా ఉత్సవాలను అక్టోబర్ 13 (శనివారం) అలెన్ ఈవెంట్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. కాగా, గత కొన్నేళ్లుగా విదేశాల్లోనే అతి పెద్ద బతుకమ్మ పండగను టీపాడ్ నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా 12 వేల మంది ఉత్సవాల్లో పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. బతుకమ్మ-దసరా ఉత్సవాలకు ముందు ప్రతియేడు జరిగే ‘ఉత్సవ సన్నాహక, నిధుల సమీకరణ కార్యక్రమం’ ఆగస్టు 18 మినర్వా బాంకెట్ హాల్‌లో ఘనంగా జరిగింది.
డల్లాస్‌తో అమెరికన్ ఇండియన్ అయిన అనూ ఇమ్మాన్యుయేల్‌కు అవినాభావ సంబంధం ఉందని, ఉత్సవాల్లో భాగంగా ఆమె బతుకమ్మ ఆడి, జమ్మి పూజలో పాల్గొనున్నారని టీపాడ్ పేర్కొంది. గత ఏడాది జరిగిన బతుకమ్మ వేడుకలకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మన సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలోని భారతీయులకు, భవిష్యత్ తరలా వారికి అందేలా కృషి చేస్తామని టీపాడ్ ఫౌండేషన్ కమిటీ చైర్మన్ రఘువీర్ బండారు, ప్రెసిడెంట్ శ్రీని గంగాధర, బోట్ ఛైర్‌పర్సన్ శారదా సింగిరెడ్డి తెలిపారు. తమ ఆహ్వానాన్ని మన్నించినందుకు అనూ ఇమ్మాన్యుయేల్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రవాసులు పెద్దమొత్తంలో హాజరై ఈ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment