డల్లాస్: అమెరికాలో కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా 2016 బతుకమ్మ, దసరా సంబురాలు ఘనంగా నిర్వహించారు. దాదాపు పది వేల మంది ఈ వేడుకకు హాజరయ్యారు. వీరిలో దాదాపు 1500 మంది మహిళలు బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తించారు. డల్లాస్ నగరంలో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) ఆధ్వర్యంలో దసరా-బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. తొమ్మిది రోజులుగా తెలుగు సంప్రదాయ బద్ధంగా నిర్వహించిన ఈ సంబురాల్లోని చివరి రోజు వేడుకను ఫ్రిస్కోలోని డా. పెప్పర్ ఎరినాలో నిర్వహించారు.
ఈ వేడుకలకు తెలుగు ఎన్ఆర్ఐల నుంచి మంచి స్పందన వచ్చింది. ఏటీఏ, టీఏటీఏ, ఎన్ఏటీఏ, టీఏఎన్ఏ, ఎన్ఏటీఎస్, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్, టీఏఎన్టీఈఎక్స్, ఐఏఎన్టీ, టీఈఏ, మనబడి లాంటి సంఘాలు ఈ వేడుకలకు పూర్తి మద్దతు తెలిపాయి. వేడుకలకు హాజరయ్యే భారీ సమూహానికి సౌకర్యంగా ఉండటం కోసం వేదిక వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. ఒకేసారి 1500 మంది మహిళలు బతుకమ్మ ఆడేలా ఏర్పాట్లు చేయడం విశేషం. సంబరాలను వీక్షించడానికి భారీ తెరలను ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వినోద కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం నుంచి బతుకమ్మ, జమ్మిపూజ, మ్యూజిక్ బొనాంజా కార్యక్రమాలు నిర్వహించారు.
అమెరికా మొత్తంలో ఇక్కడే అతిపెద్ద బతుకమ్మ ఉత్సవం జరిగిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సినీనటులు, రాజకీయ ప్రముఖులు పలువురు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బుల్లితెర యాంకర్, నటీ శ్రీముఖి, అందాల తార రాశీఖన్నా, రెజీనా, ఈషా రెబ్బా, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే, సినీనటి ఆర్కే రోజా, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, గాయనీగాయకులు గీతా మాధురీ, సతీష్, నరేంద్ర తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
టీపీఏడీ కన్వీనర్ సుధాకర్ కలసాని, కో-కన్వీనర్ సుమన్ బాసాని, సెక్రటరీ కరణ్ పోరెడ్డి, జాయింట్ సెక్రటరీ రమణ లష్కర్, ట్రెజరర్ చంద్రా పోలీస్, జాయింట్ ట్రెజరర్ లింగారెడ్డి అల్వ, శ్రీనివాస్ వేముల, శ్రీని గంగాధర, సత్య పెర్కరి, రవికాంత్ మామిడి, సురేందర్ చింతల, రోజా ఆడెపు, రూపా కన్నయ్యగరి, శరత్ యెర్రం, సతీష్ జనుం పల్లి, బీఓటీ టీం అధ్యక్షులు రామ్ అన్నాడీ(ఛైర్), పవన్ గంగాధర(కోఆర్డినేటర్), గంగదేవర(కో ఛైర్), అశోక్ కొండాల, ప్రవీణ్ బిల్ల, మనోహర్ కాసాగ్ని, రాజేందర్ తొడిగల, మాధవి సుంకిరెడ్డి, టీపీఏడీ చైర్మన్ అజయ్ రెడ్డి, వైస్ చైర్మన్ రఘువీర్ బండారు, రావు కల్వల, జానకి మందాడి, ఉపెందర్ తెలుగు, మహేందర్ కామిరెడ్డి, రాజ్ గోంది, అడ్వైజరీ టీంసభ్యులు వేణు భాగ్యనగర్, విక్రమ్ జనగాం, నరేష్ సుంకిరెడ్డి, జయ తెలకలపల్లి, సంతోష్ కోరె, రవిశంకర్ పటేల్, ఇంద్రాణి పంచార్పుల, అరవింద్ ముప్పిడి, కొలాబ్రెషన్ కమిటీ సభ్యులు అఖిల్ చిదిరాల, సునీల్ కుమార్, ఆకుల, లక్ష్మీ పోరెడ్డి, కళ్యాణి తడిమేటి, మధుమతి వ్యాసరాజు, కారుణ్య దామెర్ల, క్రాంతి తేజ పండ, పల్లవి తోటకూర, రత్న ఉప్పాల, రోహిత్ నరిమేటి, శంకర్ పరిమళ్, అనూష వనం, మాధవి లోకి రెడ్డి, దీప్తి సూర్యదేవర, మాధవి ఓంకార్, అపర్ణ సింగిరెడ్డి, కామేశ్వరి దివాకర్ల, కవిత బ్రహ్మదేవర, సతీష్ నాగెల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహణ బాధ్యతలను చూసుకున్నారు.
అత్యంత అట్టహాసంగా బతుకమ్మ ఉత్సవాలు
Published Thu, Oct 13 2016 8:40 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
Advertisement
Advertisement