టీపీఏడీ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు | tpad Grand Bathukamma Kick off event | Sakshi
Sakshi News home page

టీపీఏడీ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు

Published Thu, Aug 18 2016 9:43 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

tpad Grand Bathukamma Kick off event

డల్లాస్: అమెరికాలోని తెలుగువారి బతుకమ్మ, దసరా సంబరాల కోలాహలం మొదలైంది. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపీఏడీ) ఆధ్వర్యంలో భారీ ఎత్తున 2016 బతుకమ్మ, దసరా వేడుకలను నిర్వహించడానికి సన్నాహకాలు ప్రారంభించారు. టెక్సాస్ సైజ్ బతుకమ్మ- దసరా సంబరాలు 2016 పేరిట అక్టోబర్ 8న డాక్టర్ పెప్పర్ ఎరీనా స్టేడియంలో ఉత్సవాలను నిర్వహించనున్నట్లు టీపీడీఏ ప్రకటించింది. వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని టీపీఏడీ తెలిపింది.

టీపీఏడీ ఆధ్వర్యంలో గతేడాది వైభవంగా జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో 8 వేల మందికిపైగా తెలుగువారు పాల్గొన్నారు. ఈ సారి జరిగే ఉత్సవాల్లో 10 వేల మందికి పైగా ప్రజలు పాల్గొంటారని టీపీఏడీ సభ్యులు తెలిపారు.

ఉత్సవాల కిక్ ఆఫ్ ఈవెంట్‌లో టీపీడీఏ చైర్మన్ అజయ్ రెడ్డి, వైస్ చైర్మన్ రఘువీర్ బండారుతో పాటూ, రావు కల్వల, జానకీ మందాడి, ఉపేందర్ తెలుగు, మహేందర్ కామిరెడ్డి, రాజ్ గోంది,  సుధాకర్ కలసాని, రామ్ అన్నాడీ, పవన్ గంగాధర, గంగ దేవర, అశోక్ కొండాల, ప్రవీణ్ బిల్ల, మనోహర్ కసగాని, మాధవి సుంకి రెడ్డి, రాజేందర్ తొగాడియా, సుమన్ భాసాని, కరణ్ పోరెడ్డి రమణ లష్కర్, చంద్ర పోలీస్, లింగారెడ్డి అల్వ, సురేంధర్ చింతల, శ్రీనివాస్ వేముల, శ్రీని గంగాధర, సత్య పెర్కరి, రవికాంత్ మామిడి, శరత్ యెర్రం, రూప కన్నయగరి, రోజ ఆడెపు, సతీష్ జనుమ్ పల్లి, వేణు భాగ్యనగర్, విక్రం జనగాం, సంతోష్ కోరె, నరేష్ సంకిరెడ్డి, జయ తెలకలపల్లి, రవి శంకర్ పటేల్, అఖిల్  చిదిరాల, సునిల్ కుమార్ ఆకుల, లక్ష్మీ పోరెడ్డి, కళ్యాణి తడిమేటి, మధుమతి వ్యాసరాజు, కారుణ్య దామర్ల, క్రాంతి తేజ పండ, పల్లవి తోటకూర, రత్న ఉప్పాల, రోహిత్ నరిమేటి, శంకర్ పరిమల్, వసుధా రెడ్డి, అనూష వనం, కవిత ఆరుట్ల, మాధవి లోకిరెడ్డి, సతీష్ నాగెల్లలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement