డలాస్ : తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్) ఆధ్వర్యంలో అమెరికాలోని డాలస్‌లో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలెన్ ఈవెంట్ సెంటర్, ఆలెన్, టెక్సాస్‌లో నిర్వహించిన ఈ సంబరాల్లో మహిళలు, యువతులు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. జానకి రామ్ మందాడి ఫౌండేషన్ కమిటీ చైర్, పవన్ గంగాధర బోర్ట్ ఆప్ ట్రస్టీ చైర్ చంద్రారెడ్డి, పోలీస్ ప్రెసిడెంట్ సుధాకర్ కలసాని, ఎగ్జిక్యూటీవ్ కమిటీ కోఆర్డినేటర్ మాధవి సుంకిరెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ వైస్ చైర్మన్ రవికాంత్ మామిడి, వైఎస్ ప్రెసిడెంట్ మాధవి లోకిరెడ్డి, జనరల్ సెక్రటరీ అనురాధ మేకల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కనీ, వినీ ఎరుగని రీతిలో ఈ వేడుకలు జరిగాయి. పొటెత్తిన జనసందోహాన్ని కట్టడి చేయలేక ఆలెన్ ఈవెంట్ సెక్యూరిటీ యాజమాన్యం సైతం కొంతమందిని వెలుపలే నిలిపివేసింది. ఈ సంబరాల్లో ప్రముఖ మాటల రచయిత కోనా వెంకట్, సినీ నటి మెహ్రీన్ ముఖ్య అతిథులుగా హాజరై బతుకమ్మ ఆడి, జమ్మి పూజలో పాల్గొన్నారు.
శనివారం సాయంత్రం (అక్టోబర్ 5) డాలస్ మహిళలు అందరూ అందంగా ముస్తాబాయ బతుకమ్మలు పేర్చుకొని వచ్చారు. కోలాటాలతో, దీపాలతో చప్పట్లతో బతుకమ్మ చుట్టూ ఆడిపాడి, గౌరీదేవికి నైవేద్యాలు సమర్పించారు. టీపాడ్ సంస్థ ప్రత్యేంగా సత్తుపిండి నైవేద్యాలు చేయించి ప్రజలందరికీ పంచిపెట్టింది. అనంతరం ఆడవాళ్లందరికి సంప్రదాయబద్దంగా గాజులు, పసుపు బోట్టు, ఇతర కానుకలు భారీ మొత్తంలో అందజేశారు.
బతుకమ్మ కార్యక్రమం తర్వాత దసరా, జమ్మి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పల్లకి ఊరేగింపులు, నృత్యాలు, పరస్పరం జమ్మి ఆలింగానాల మధ్య ఎంతో వైభవంగా దసరా వేడుకలు జరిగాయి. టీపాడ్ సంస్థ 2019వ సవంత్సరానికి గాను చేసిన బతుకమ్మ స్వాగత పాట, కార్యవర్గ సభ్యులందరితో చేసిన వీడియోను అందరి సమక్షంలో విడుదల చేశారు. ప్రముఖ గాయని గాయకులు ప్రవీణ్ కొప్పోలు, అంజనా సౌమ్య, శిల్పారావు, వ్యాఖ్యాత రవళి సాయంత్రం సంగీత విభవారిలో పాల్గొని ఆటపాటలతో అందరిని ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీపాడ్ సంస్థ ప్రెసిడెంట్ చంద్రారెడ్డి, రావ్ కల్వల, రామ్ అన్నాడి, అశోక్ కొండల, శ్రీనివాస్ గంగాధర, లక్ష్మీ పోరెడ్డి, శంకర్ పరిమళ, శ్రీనివాస్ వేముల, రత్న ఉప్పాల, రూప కన్నయ్యగిరి, మధుమతి వైస్యరాజు, దీప్తి సూర్యదేవర, శరత్ ఎర్రం, రోజా ఆడెపు, లింగారెడ్డి, వంశీకృష్ణ, స్వప్న తుమ్మపాల, గాయత్రిగిరి, శ్రీనివాస్ తుల, విజయ్ రెడ్డి, అపర్ణ కొల్లూరి, అనూష వనం, శశిరెడ్డి కర్రి, మంజుల తొడుపునూరి, మాధవి ఓంకార్, రవీంద్ర ధూళిపాళ, శరత్ పునిరెడ్డి, శ్రీధర్ కంచర్ల, శ్రీనివాస్ అన్నమనేని, శ్రవణ్ నిడిగంటి, నితిన్ చంద్ర, మాధవి మెంట, వందన గోరు, శ్రీకాంత్ రౌతు, తిలక్ వన్నంపుల, రఘు ఉత్కూర్, అభిషేక్‌రెడ్డి, కిరణ్ తళ్లూరి, దీపిక, ఇంద్రాణి పంచార్పుల, బుచ్చిరెడ్డి గోలి, శారద సింగిరెడ్డి, వేణు భాగ్యనగర్, విక్రమ్ జంగం, అరవింద్ రెడ్డి ముప్పిడి, నరేష్ సుంకిరెడ్డి, కరణ్‌పోరెడ్డి, జయ తెలకలపల్లి, గంగదేవర, సతీష్ నాగిళ్ల, కల్యాణి తాడిమెట్టి. రఘువీర్ బంగారు, అజయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment