డల్లాస్లో ఘనంగా బొడ్డెమ్మ పండుగ | Telangana Peoples Association of Dallas (TPAD) celebrated Boddemma in Dallas | Sakshi
Sakshi News home page

డల్లాస్లో ఘనంగా బొడ్డెమ్మ పండుగ

Published Mon, Sep 26 2016 2:58 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

డల్లాస్లో ఘనంగా బొడ్డెమ్మ పండుగ

డల్లాస్లో ఘనంగా బొడ్డెమ్మ పండుగ

డల్లాస్ :
డల్లాస్లో బొడ్డెమ్మ పండుగతో అప్పుడే బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి.  తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్( టీపీఏడీ) ఆధ్వర్యంలో బంతుకమ్మ పండుగకు మందు నిర్వహించే బొడ్డెమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. డా. పెప్పర్ ఏరియన్ ఫ్రిస్కోలో అక్టోబర్ 8న బతుకమ్మ జరిపే సంబురాలకు ముందు టెక్సాస్లో ఇర్వింగ్లోని  నార్త్ లేక్ రాంచ్ పార్క్లో బొడ్డెమ్మ పండుగను జరిపారు. బతుకమ్మ పాటలతో బొడ్డెమ్మ పండుగ వేడుకల్లో పాల్గొన్న మహిళలు ఆ ప్రాంతాన్నంతా హోరెత్తించారు.  అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

టీపీఏడీ కన్వీనర్ సుధాకర్ కలసాని, సెక్రటరీ కరన్ పోరెడ్డి, కో కన్వీనర్ సుమన బసాని, మాజీ కన్వీనర్ మాధవి సుంకి రెడ్డి, రమణ లష్కర్(జాయింట్ సెక్రటరీ), ఛైర్ ఆఫ్ బోర్డ్ ట్రస్టీ రామ్ అన్నాడి, టీపీఏడీ సలహాదారులు ఇందు పంచేరుపుల, సంతోష్ కోరె, అజయ్ రెడ్డి చైర్మన్, రఘువీర్ బండారు వైస్ ఛైర్మన్, టీపీఏడీ వ్యవస్థాపక కమిటీ సభ్యులు రావు కల్వల, జానకి మందాడి, ఉపేందర్ తెలుగు, మహేందర్ కామిరెడ్డి, రాజ్ గోందీ, బోర్డు ట్రస్టీలు పవన్ గంగాధర, గంగదేవర, అశోక్ కొండాల, ప్రవీణ్ బిల్ల, మనోహర్ కాసగాని, మాధవి సుంకి రెడ్డి, రాజేందర్ తొడిగాల, చంద్ర పోలీస్, లింగారెడ్డి అల్వ, సురేందర్ చింతల, శ్రీనివాస్ వేముల, శ్రీని గంగాధర, సత్య పేర్కాని, రవికాంత్ మామిడి, శరత్ ఎర్రం, రూప కన్నవాగరి, రోజ ఆడెపు, సతీష్ జనుంపల్లి, వేణు భాగ్యనగర్, విక్రం జనగాం, నరేష్ సుంకిరెడ్డి,  జయ తెలకలపల్లి, రవి శంకర్ పటేల్, అఖిల్ చిదిరాల, సునిల్ కుమార్ ఆకుల, లక్ష్మీ పోరెడ్డి, కల్యాణి తడిమేటి, మధుమతి వ్యాసరాజు, కారుణ్య దామెర్ల, క్రాంతి తేజ పండ, పల్లవి తోటకూర, రత్నా వుప్పాల, రోహిత్ నరిమేటి, శంకర్ పరిమళ్, వసుధారెడ్డి, అనూష వనం, కవిత ఆరుట్ల, మాధవి లోకిరెడ్డి, సతీష్ నాగెల్లలు కార్యక్రమం విజయవంతలో తమ వంతు కృషి చేశారు.

బతుకమ్మ పండగకు కోసం టీపీఏడీ ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను అజయ్ రెడ్డి ఏలేటి వివరించారు. బతుకమ్మ పండగ వేడుకల్లో పాల్గొనే దాదాపు 10 వేల మంది కోసం  కమిటీ సభ్యులు, వాలంటీర్లతో కలిసి స్టేడియాన్ని ముస్తాబు చేయనున్నట్టు అజయ్ పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement