boddemma
-
Dussehra 2024 : బతుకమ్మ బిడ్డ, బొడ్డెమ్మ పండుగ గురించి తెలుసా?
‘బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో నీ బిడ్డ పేరేమి ఉయ్యాలో నీ బిడ్డ నీలగౌరు ఉయ్యాలో నిచ్చమల్లె చెట్టెసె ఉయ్యాలో చెట్టుకు చెంబెడు ఉయ్యాలో నీళ్లయినా పోసె ఉయ్యాలోకాయలు పిందెలు ఉయ్యాలో గనమై ఎగిసె ఉయ్యాలోబతుకమ్మ పండుగలో అతి ముఖ్యమైంది బొడ్డెమ్మ పండగ. కొన్ని ప్రాంతాలలో అమావాస్యకు ఐదు రోజుల ముందు బహుళ దశమి తిధి నుండి దీన్ని ప్రారంభించుకుంటారు. మరికొన్ని ప్రాంతాలలో మూడు రోజుల ముందు బహుళ ద్వాదశి నుండి బొడ్డెమ్మను పేర్చుకుంటారు. ఇంకొన్ని ప్రాంతాలలో భాద్రపద బహుళ అమావాస్య (మహాలయ) ముందు ప్రారంభించి తొమ్మిది రోజులు బొడ్డెమ్మను పూజించి,ఘ ఆటపాటలతో గౌరీ దేవిని పూజించి, తొమ్మిదవ రోజున అంటే మహాలయ అమావాస్య రోజున నిమజ్జనం చేస్తారు.బతుకమ్మ బిడ్డె బొడ్డెమ్మ అని భక్తుల విశ్వాసం. అందుకే ఇది ఆడబిడ్డలకు ప్రత్యేకం. ఈ పండుగను బొడ్డెమ్మ పున్నమి కూడా అంటారు. బాలికలు, పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే బొడ్డెమ్మ ఆడుతారు.బొడ్డెమ్మ పండుగను తెలంగాణలోని వివిధ జిల్లాల్లో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. బొడ్డెమ్మను తయారు చేసుకునే విధానాన్ని బట్టి నాలుగు రకాలుగా ప్రాంతాల వారిగా తయారు చేస్తారు. పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ , పందిరి బొడ్డెమ్మ, బాయి(వి) బొడ్డెమ్మ. పీటమీద పూజించే బొడ్డెమ్మను పీట బొడ్డెమ్మ అనీ, గుంటల రూపంలో ఉండే బొడ్డెమ్మను 'గుంట బొడ్డెమ్మ' అనీ, పందిరిలా అలంకరించే బొడ్డెమ్మను 'పందిరి బొడ్డెమ్మ', బావిలాగా గొయ్యి తయారు చేసే బొడ్డెమ్మను 'బాయి బొడ్డెమ్మ' అని పిలుచుకుంటారు. ఆకారం ఏదైనా, పూజా విధానం మాత్రం ఒకేలా ఉంటుంది.బొడ్డెమ్మ ఆటలుభాద్రపద బహుళ పంచమి నుంచి చతుర్ధశి వరకు బొడ్డెమ్మ ఆడతారు. చెరువు మట్టి లేదా పుట్ట మట్టిని తెచ్చి చెక్కపీటపై ఐదు దొంతరులుగా వలయాకారంలో బొడ్డెమ్మను తయారు చేస్తారు. దీన్ని ఎర్రమట్టితో అలికి బియ్యం పిండి, కుంకుమ, పసుపుతో అలంకరించి, ముగ్గులు వేస్తారు. ఐదు అంతస్తులపైన కలశం పెట్టి అందులో బియ్యం పోస్తారు. పైన కొత్త గుడ్డతో చుట్టి తమలపాకులో పసుపు గౌరమ్మను ప్రతిష్ఠిస్తారు. ఈ గౌరమ్మకు ఉదయం ఇంట్లో భక్తితో పూజింజి సాయంత్రం ఇంటి వాకిట్లో అలుకు చల్లి చుక్కల ముగ్గులు వేసి పీట బొడెమ్మను తెచ్చి ప్రతిష్టించి సాయంత్రం పూసే ఉద్రాక్ష, బీర, మల్లె, జాజిపూలతో అలంకరించి ఫలహారాలు పెట్టి చుట్టూ తిరుగుతూ బొడ్డెమ్మ పాటలు పాడుతారు. చివరగా బొడ్డెమ్మను నిద్రపుచ్చే పాటలు పాడుతారు. పాడడం అయిపోయాక తెచ్చుకున్న ఫలహారాలు ఒకరినొకరు ఇచ్చి పుచ్చుకుని బొడ్డెమ్మను ఎవరింట్లో ఆడుతున్నారో వారింట్లోనే దేవుని దగ్గర పెట్టి వెళ్లిపోతారు. ఇలా తొమ్మిదిరోజులు ఆడిన తర్వాత చివరిరోజు సాగనంపే పాటలు పాడి బావిలో నిమజ్జనం చేస్తారు. బొడ్డెమ్మను బావిలో వేసిన తెల్లారి బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. తెలంగాణా పల్లెల్లో కొన్ని చోట్ల బొడ్డెమ్మ పండుగ సంబరాలు మొదలు కాగా, అక్టోబరు 2వ తేదీనుంచి ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు షురూ అవుతాయి. -
టీపీఏడీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
డల్లాస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) నేతృత్వంలో గురువారం బొడ్డెమ్మ పూజను ఫ్రిస్కోలోని ఐటీ స్పిన్‌లో ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ పండగ నేపథ్యంలో వేడుకలకు తొమ్మిది రోజుల ముందు బొడ్డెమ్మ పూజ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు ప్రత్యేకించి సెలవు లేకున్నా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొనడం విశేషం. తెలంగాణలో అనాధిగా వస్తున్నబతుకమ్మ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అక్కడి మహిళలు, యువతులు బతుకమ్మ పాటలతో అందరిని అలరించారు. మట్టితో చేసిన బోడెమ్మను నీటిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ సభ్యులు మాట్లాడుతూ.. ఈ వేడుకలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తలిపారు. అలాగే సెప్టెంబర్ 27న కోపెల్లోని ఆండ్ర్యూ బ్రౌన్ పార్క్‌లో జరిగే చిన్న బతుకమ్మ, అక్టోబర్ 5న అలెన్ ఈవెంట్ సెంటర్లో జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలను దిగ్విజయం చేయాలని కోరారు. కాగా, ఈ ఏడాది నిర్వహించే దసరా వేడుకలకు సుమారుగా 10,000 మంది ప్రవాసాంధ్రులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. -
టీపీఏడీ ఆధ్వర్యంలో ఘనంగా బొడ్డెమ్మ పండుగ
ప్రిస్కో : బొడ్డెమ్మ.. బొడ్డెమ్మ కోల్ బిడ్డాలెందరో కోల్.. అంటూ బొడ్డెమ్మ పాటలు ఫ్రిస్కోలో మార్మోగాయి. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (టీపీఏడీ) ఆధ్వర్యంలో బొడ్డెమ్మ పండగను ఘనంగా జరిపారు. చిన్న బతుకమ్మ పండుగకు ముందే బొడ్డెమ్మ వేడుకలు మొదలవుతాయి. పీటపై మట్టితో చేసిన బొడ్డెమ్మను పెట్టి.. పూలతో అలంకరించి.. ఎర్రమట్టి(జాజు)తో చుట్టూ అలికి.. ఆడపడుచులు బొడ్డెమ్మ పాటలు పాడారు. ఈ వేడుకల్లో 100మందికి పైగా మహిళలు, యువతులు పాల్గొన్నారు. బతుకమ్మ టీమ్ ఛైర్ మాధవి లోకిరెడ్డి, కో ఛైర్ మంజూల తోడుపునూరి, టీపీఏడీ వాలంటీర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డల్లాస్‌లోని వివిధ ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను నిర్వహించాలని టీపీఏడీ అధ్యక్షులు శ్రీని గంగాధర, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఛైర్ శారదా సింగిరెడ్డి, ఫౌండేషన్ కమిటీ ఛైర్ రఘువీరా బండారు, టీపీఏడీ నాయకులు రమణ లష్కర్, చంద్రా పోలీస్‌లు ప్రణాళికలు సిద్దం చేశారు. కొపెల్‌లో అక్టోబర్ 8న ఎంగిలిపూలు బతుకమ్మ, అక్టోబర్ 13న అల్లెన్ ఈవెంట్ సెంటర్లో సద్దులు బతుకమ్మ నిర్వహించనున్నట్టు తెలిపారు. -
ఘనంగా బొడ్డెమ్మ పండగ
నల్లగొండ కల్చరల్ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో బొడ్డెమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు బొడ్డెమ్మలను తీసుకువచ్చి ఒక్క దగ్గర చేర్చి చుట్టూ చేరి పాటలు పాడుతూ అలరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సభ్యులు క్రాంతి, అరుణశ్రీ, సింగం లక్ష్మి, కౌన్సిలర్ మారగోని నవీన్‌కుమార్‌గౌడ్, ఎడ్ల గీత, జాగృతి జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, రాష్ట్ర నాయకులు వేణు సంకోజు, కవిత, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
డల్లాస్‌లో ఘనంగా బొడ్డెమ్మ పండుగ
డల్లాస్ : డల్లాస్‌లో బొడ్డెమ్మ పండుగతో అప్పుడే బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్( టీపీఏడీ) ఆధ్వర్యంలో బంతుకమ్మ పండుగకు మందు నిర్వహించే బొడ్డెమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. డా. పెప్పర్ ఏరియన్ ఫ్రిస్కోలో అక్టోబర్ 8న బతుకమ్మ జరిపే సంబురాలకు ముందు టెక్సాస్‌లో ఇర్వింగ్‌లోని నార్త్ లేక్ రాంచ్ పార్క్‌లో బొడ్డెమ్మ పండుగను జరిపారు. బతుకమ్మ పాటలతో బొడ్డెమ్మ పండుగ వేడుకల్లో పాల్గొన్న మహిళలు ఆ ప్రాంతాన్నంతా హోరెత్తించారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. టీపీఏడీ కన్వీనర్ సుధాకర్ కలసాని, సెక్రటరీ కరన్ పోరెడ్డి, కో కన్వీనర్ సుమన బసాని, మాజీ కన్వీనర్ మాధవి సుంకి రెడ్డి, రమణ లష్కర్(జాయింట్ సెక్రటరీ), ఛైర్ ఆఫ్ బోర్డ్ ట్రస్టీ రామ్ అన్నాడి, టీపీఏడీ సలహాదారులు ఇందు పంచేరుపుల, సంతోష్ కోరె, అజయ్ రెడ్డి చైర్మన్, రఘువీర్ బండారు వైస్ ఛైర్మన్, టీపీఏడీ వ్యవస్థాపక కమిటీ సభ్యులు రావు కల్వల, జానకి మందాడి, ఉపేందర్ తెలుగు, మహేందర్ కామిరెడ్డి, రాజ్ గోందీ, బోర్డు ట్రస్టీలు పవన్ గంగాధర, గంగదేవర, అశోక్ కొండాల, ప్రవీణ్ బిల్ల, మనోహర్ కాసగాని, మాధవి సుంకి రెడ్డి, రాజేందర్ తొడిగాల, చంద్ర పోలీస్, లింగారెడ్డి అల్వ, సురేందర్ చింతల, శ్రీనివాస్ వేముల, శ్రీని గంగాధర, సత్య పేర్కాని, రవికాంత్ మామిడి, శరత్ ఎర్రం, రూప కన్నవాగరి, రోజ ఆడెపు, సతీష్ జనుంపల్లి, వేణు భాగ్యనగర్, విక్రం జనగాం, నరేష్ సుంకిరెడ్డి, జయ తెలకలపల్లి, రవి శంకర్ పటేల్, అఖిల్ చిదిరాల, సునిల్ కుమార్ ఆకుల, లక్ష్మీ పోరెడ్డి, కల్యాణి తడిమేటి, మధుమతి వ్యాసరాజు, కారుణ్య దామెర్ల, క్రాంతి తేజ పండ, పల్లవి తోటకూర, రత్నా వుప్పాల, రోహిత్ నరిమేటి, శంకర్ పరిమళ్, వసుధారెడ్డి, అనూష వనం, కవిత ఆరుట్ల, మాధవి లోకిరెడ్డి, సతీష్ నాగెల్లలు కార్యక్రమం విజయవంతలో తమ వంతు కృషి చేశారు. బతుకమ్మ పండగకు కోసం టీపీఏడీ ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను అజయ్ రెడ్డి ఏలేటి వివరించారు. బతుకమ్మ పండగ వేడుకల్లో పాల్గొనే దాదాపు 10 వేల మంది కోసం కమిటీ సభ్యులు, వాలంటీర్లతో కలిసి స్టేడియాన్ని ముస్తాబు చేయనున్నట్టు అజయ్ పేర్కొన్నారు.