డల్లాస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) నేతృత్వంలో గురువారం బొడ్డెమ్మ పూజను ఫ్రిస్కోలోని ఐటీ స్పిన్‌లో ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ పండగ నేపథ్యంలో వేడుకలకు తొమ్మిది రోజుల ముందు బొడ్డెమ్మ పూజ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు ప్రత్యేకించి సెలవు లేకున్నా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొనడం విశేషం. తెలంగాణలో అనాధిగా వస్తున్నబతుకమ్మ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అక్కడి మహిళలు, యువతులు బతుకమ్మ పాటలతో అందరిని అలరించారు. మట్టితో చేసిన బోడెమ్మను నీటిలో నిమజ్జనం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ సభ్యులు మాట్లాడుతూ.. ఈ వేడుకలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తలిపారు. అలాగే సెప్టెంబర్ 27న కోపెల్‌లోని ఆండ్ర్యూ బ్రౌన్ పార్క్‌లో జరిగే చిన్న బతుకమ్మ, అక్టోబర్ 5న అలెన్ ఈవెంట్ సెంటర్‌లో జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలను దిగ్విజయం చేయాలని కోరారు. కాగా, ఈ ఏడాది నిర్వహించే దసరా వేడుకలకు సుమారుగా 10,000 మంది ప్రవాసాంధ్రులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment