డల్లాస్లో ఘనంగా వన భోజనాలు
Published Mon, May 9 2016 3:56 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM
డల్లాస్: అమెరికాలోని తెలంగాణ పీపుల్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టిపాడ్) వనభోజనాలు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫ్రిస్కోలోని హిడెన్ కోవ్ పార్కులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 2000 మంది హాజరయ్యారు.
ఇందులో పాల్గొన్నవారు ఆట పాటలతో హుషారుగా గడిపారు. తెలంగాణ వంటకాలను నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దుర్గ పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో టీపాడ్ కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.



Advertisement
Advertisement