డల్లాస్: డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి (టీపాడ్), జనవరి 26న నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఫ్రిస్కో నగరములోని సభ శుభం బాన్క్వెట్ హాల్‌లో నిర్వహించారు. డల్లాస్ ప్రాంతీయులు, స్థానిక, తెలుగు జాతీయ సంస్థల నాయకులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు. ముందుగా డల్లాస్ చిరంజీవి శ్రేయస్ కొర్లపాటి ప్రార్థన గీతాన్ని ఆలపించగా అనంతరం అమెరికా, భారత దేశం జాతీయ గీతాలు పాడి కార్యవర్గ బృందం జ్యోతి ప్రజ్వలన చేసింది. ఈ కార్యక్రమాన్ని రఘువీర్ బండారు ఫౌండేషన్ కమిటి, శారద సింగిరెడ్డి బోర్డు అఫ్ ట్రస్టీ సంయుక్తంగా నిర్వహించారు.
ముందుగా రఘువీర్ బండారు సభకి ఆహ్వానం తెలుపుతూ, 2014 లో సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు ఆరు సంవత్సరాల సంస్థ సాధించిన వైభవాన్ని, ఘనతను పంచుకున్నారు. విజయం వెనక పనిచేస్తున్న నాయకత్వాన్ని కార్యవర్గ బృందాన్ని, పోషక దాతలను మనస్పూర్తిగా అభినందిస్తూ వారి సేవలను అంకిత భావాన్ని కొనియాడారు. శారద సింగిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ ఏటా చేసిన సాంస్కృతిక, సామజిక సేవ రక్తదాన శిబిరాలు, నిరాశ్రయులకు ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన సదస్సులు, వనభోజనాలు, మాతృ దేశం నుంచి వచ్చిన నిపుణులతో ‘మీట్ అండ్ గ్రీట్’, సాంఘిక కార్యక్రమాలతో టీపాడ్ దూసుకుపోతున్న శైలిని వివరించారు.
పూర్వ ఫౌండేషన్ కమిటీ చైర్ జానకి మందాడి నూతన కార్యవర్గ బృందాన్ని అభినంధించారు. అనంతరం జానకి మందాడి.. ఫౌండేషన్ కమిటీ చైర్ రావు కలవలతో ప్రమాణ స్వీకారం చేయించగా అజయ్ రెడ్డి, రఘువీర్ బండారు, పుష్ప గుచ్చం అందచేసి శాలువాతో సన్మానించారు. రావు కలవల గారు ఈ సంవత్సరం తాము చేసే కార్యక్రమాల గురించి మాట్లాడుతూ..అత్యున్నతమైన సేవలందించడములో కమ్యూనిటీ ముందుంటుందని తెలిపారు. తరువాత అజయ్ రెడ్డి ప్రసంగిస్తూ ‘టీపాడ్’ కార్యవర్గ బృందం నిస్వార్థంగా, ఆనందముతో కలిసి చేసే సేవ ఈ కమ్యూనిటీకి ఒక ఆదర్శమని కొనియాడారు.
పూర్వ బోర్డు అఫ్ ట్రస్టీ చైర్ పవన్ గంగాధర, పూర్వ అధ్యక్షుడు చంద్రా రెడ్డి పోలీస్ గతేడాది జరిగిన కార్యక్రమాలకు సహకరించిన కమిటీ సభ్యులందరికి ధన్యవాదాలు తెలిపారు. పవన్ గంగాధర నూతనంగా ఎన్నుకోబడిన బోర్డు అఫ్ ట్రస్టీస్ రామ్ అన్నాడి, అశోక్ కొండల, పాండురంగారెడ్డి పాల్వే, ఇంద్రాణి పంచార్పులచే ప్రమాణ స్వీకారాలను చేయించగా, చంద్రా రెడ్డి పోలీస్.. ఎగ్జిక్యూటివ్ కమిటీ రవికాంత్ రెడ్డి మామిడి, మంజుల పంజాల, శ్రీధర్ వేముల, బాల గనవరపు, శ్రీనివాస్ అన్నమనేనితో ప్రమాణ స్వీకారం చేయించారు. తదనంతరం రఘువీర్ బండారు శారద సింగిరెడ్డి కలిసి ఈ సంవత్సరానికి బోర్డు అఫ్ ట్రస్టీ చైర్‌గా మాధవి సుంకిరెడ్డి, బోర్డు అఫ్ ట్రస్టీ వైస్ చైర్‌గా ఇంద్రాణి పంచార్పుల, ఎగ్జిక్యూటివ్ కమిటీ కోఆర్డినేటర్‌గా బుచ్చిరెడ్డి గోలి, ప్రెసిడెంట్‌గా రవికాంత్ రెడ్డి మామిడి, వైస్ ప్రెసిడెంట్‌గా రూప కన్నెయ్యగారి, జనరల్ సెక్రటరీగా అనురాధ మేకల, జాయింట్ సెక్రటరీగా లింగా రెడ్డి అల్వా, ట్రెజరర్ గా శంకర్ పరిమళ్, జాయింట్ ట్రెజరర్గా మధుమతి వ్యాసరాజుచే ప్రమాణ స్వీకారాలను చేయించారు. ప్రమాణ స్వీకారాల తర్వాత మాధవి సుంకిరెడ్డి, రవికాంత్ రెడ్డి మామిడి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం మరిన్ని సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామని చెబుతూ వారికి పదవీ బాధ్యతలను ఇచ్చిన నాయకత్వానికి ధన్యవాదాలు తెలియ చేశారు.
నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కొత్త బోర్డు అఫ్ ట్రస్టీస్‌తో పాటు సుధాకర్ కలసాని, శారద సింగిరెడ్డితో పదవీ బాధ్యతలు కొనసాగించగా రఘువీర్ బండారు, అజయ్ రెడ్డి, జానకి మందాడి కూడా బోర్డు అఫ్ ట్రస్టీ సభ్యులుగా ఈ సంవత్సరం సహకరించి ఆర్థికంగా, కార్యనిర్వహణ సలహాల పటిష్టత కోసం కార్యవర్గ బృందంతో కలవడం సంస్థకు గర్వ కారణమన్నారు. కొత్తగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎగ్జిక్యూటివ్ కమిటీతో మాధవి లోకిరెడ్డి, లక్ష్మి పోరెడ్డి, రత్న ఉప్పల, రోజా అడెపు, అడ్వైజరీ కమిటీగా అరవింద్ రెడ్డి ముప్పిడి, ,విక్రమ్ రెడ్డి జంగం, వేణు భాగ్యనగర్, కరణ్ పోరెడ్డి, నరేష్ సుంకిరెడ్డి, రమణ లష్కర్, గంగా దేవర, జయ తెలకల పల్లి, సతీష్ నాగిళ్ల, కళ్యాణి తాడిమేటి వారి పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నారు. ప్రెసిడెంట్ రవికాంత్ రెడ్డి మామిడి కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికి, మీడియా ప్రతినిధులకు, శుభం బాన్క్వెట్ హాల్, ఆనంద్ అడియార్ భవన్ ఇండియన్ రెస్టారెంట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment