oath taking
-
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్
-
నేడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం
శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ తొలి ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా నేడు ప్రమాణం చేయనున్నారు. ఆర్టీకల్ 370 ఆర్టీకల్ రద్దు అనంతరం మొదటిసారిగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి విజయం సాధించడం తెలిసిందే. బుధవారం శ్రీనగర్‌లోని షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కేఐసీసీ)లో జరిగే కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సీఎంగా ఒమర్‌తో ప్రమాణం చేయించనున్నారు.పలువురు మంత్రులుగా ప్రమాణం చేస్తార ని భావిస్తున్నారు. ఇందుకోసం ఎస్కేఐసీసీలో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమానికి ఇండియా కూటమి పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన ఐదుగురితో కలుపుకుంటే జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సభ్యుల సంఖ్య 95కు చేరుకుంది. ఇటీవలి ఎన్నికల్లో ఎన్సీ 40, భాగస్వామ్య కాంగ్రెస్ ఆరు, సీపీఎం ఒక సీటు గెలుచుకున్నాయి. ఇవికాకుండా, ఒమర్ అబ్దుల్లాకు ఆప్ ఏకైక సభ్యుడు, ఐదుగురు ఇండిపెండెంట్లు మద్దతు పలికారు. -
‘జై సమ్మక్క.. జై తుల్జాభవాని.. జై భీం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎంపీలు తమదైన శైలిలో లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు 15 మంది తెలంగాణ ఎంపీలు ఒకరి తర్వాత ఒకరు హిందీ, ఇంగ్లిష్ తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రమాణం చేశారు. పలువురు ఎంపీలు జై తెలంగాణతోపాటు జై సమ్మక్క, జై లక్ష్మీనరసింహ, జై భద్రకాళి, జై తుల్జాభవాని, జైభీం.. జై రాజ్యాంగం అంటూ ప్రమాణం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క లు లోక్‌సభకు హాజరై రాష్ట్ర ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. తమిళనాడులోని కృష్ణగిరి ఎంపీ కె.గోపీనాథ్ తెలుగులోనే ప్రమాణం చేశారు. నగేష్‌తో మొదలు... ముందుగా ఆదిలాబాద్ ఎంపీ జి,నగేష్ హిందీలో ప్రమాణం చేశారు. అనంతరం గడ్డం వంశీకృష్ణ, ధర్మపురి అర్వింద్, మాధవనేని రఘునందన్‌రావు, ఆర్.రఘురాంరెడ్డిలు ఇంగ్లి‹Ùలో ప్రమాణం చేయ గా, మిగతా ఎంపీలు సురేశ్ షెట్కార్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, డా.మల్లు రవి, కుందూరు రఘువీర్, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, డా.కడియం కావ్య, పోరిక బలరాంనాయక్‌లు తెలుగులో, అసదుద్దీన్ ఒవైసీ ఉర్దూలో లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. కాగా ప్రమాణ సమయంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ జై సమ్మక్క– సారలమ్మ అని, వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య జై భద్రకాళి అని, నాగర్‌కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి జైభీం అని, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ జై తుల్జాభవాని అంటూ ప్రమాణం ముగించారు. ఒవైసీ వ్యాఖ్యపై సభలో గందరగోళం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సభలో జై పాలస్తీనా అని అనడంపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీ మల్లు రవి ప్రమాణం చేసేందుకు సిద్ధమైన వెంటనే అసదుద్దీన్ ఒవైసీ జై పాలస్తీనా అనడాన్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో కొద్దిసేపు మాటల యుద్ధం జరిగింది.గందరగోళ పరిస్థితుల మధ్యే మల్లు రవి ప్రమాణాన్ని కొనసాగించారు. అయితే బీజేపీ సభ్యులు గట్టిగా కేకలు వేస్తుండడంతో మల్లు రవి కాస్త అసహనం వ్యక్తం చేశారు. కాగా ప్రమాణ పత్రంలో ఉన్నది మాత్రమే రికార్డుల్లోకి వెళుతుందని ప్యానెల్ స్పీకర్ రాధామోహన్‌సింగ్ చెప్పడంతో పరిస్థితి చక్కబడింది. ఆ తర్వాత మిగతా సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. సోనియాగాం«దీని కలిసిన రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎంపీలుగా ప్రమాణం చేసిన వారిని రేవంత్ సోనియాగాంధీకి పరిచయం చేశారు. సీఎం వెంట మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి ఏపీ.జితేందర్‌రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి ఉన్నారు. -
ఎంపీ తనూజా రాణి ప్రమాణస్వీకారం
-
లోక్ సభలో మోడీ ప్రమాణస్వీకారం
-
ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార తేదీ లోక్‌సభ ఎన్నికల తేదీ ఖరారైంది
-
ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్
-
ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: బీ ఆర్ఎస్ అధ్యక్షుడు, మా జీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫిబ్రవరి ఒకటో తేదీన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్ర శాసనసభకు గత ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరగ్గా డిసెంబర్ 3న ఫలితాలు వెలువడ్డాయి. డిసెంబర్ 9న అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్త గా ఎన్నికైన వారిలో చాలా మంది ఎమ్మె ల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే డిసెంబర్ 8న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బాత్రూంలో కేసీఆర్ జారి పడగా తుంటి ఎముకకు గాయమైంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కేసీఆర్‌కు శస్త్ర చికిత్స జరిగింది. నాటి నుంచి కేసీఆర్ వైద్యుల సూ చన మేరకు విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నారు. త్వరలో రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి క్రియాశీలం కాబోతున్న కేసీఆర్ ఫిబ్రవరి 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేస్తారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం నేప థ్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి తరలిరానుండటంతో అసెంబ్లీ వర్గాలు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించాయి. -
కొలువుదీరిన మూడో శాసనసభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ శనివారం కొలువుదీరింది. ఉదయం 11.00 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు ప్రమాణం చేశారు. అనంతరం మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసిన తరువాత అక్షర క్రమంలో సభలోని సభ్యులతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 61 మంది, బీఆర్ఎస్ నుంచి 32 మంది, ఎంఐఎం నుంచి ఆరుగురు, సీపీఐ నుంచి గెలిచిన ఒక్కరు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడాన్ని నిరసిస్తూ బీజేపీకి చెందిన 8 మంది సభ్యులు సభకు హాజరు కాలేదు. కాలు జారి పడిన కారణంగా శస్త్ర చికిత్స చేయించుకొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయనకు సహాయకారిగా ఉన్న మాజీ మంత్రి కె. తారక రామారావు సహా ఏడుగురు బీఆర్ఎస్ సభ్యులు, వ్యక్తిగత కారణాలతో ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ప్రమాణం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీరే.. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, దామోదర రాజ నర్సింహ, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, చిట్టెం పర్ణికా రెడ్డి, మట్టా రాగమయి, పద్మావతి రెడ్డి, యశస్విని రెడ్డి, ఆది శ్రీనివాస్, ఆదినారాయణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అనిరుధ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, బాలు నాయక్ నేనావత్, చిక్కుడు వంశీకృష్ణ, చింతకుంట విజయ రమణారావు, దొంతి మాధవరెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, గడ్డం వినోద్, గండ్ర సత్యనారాయణ రావు, జి. మధుసూదన్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, రామ్‌చందర్ నాయక్, కేఆర్ నాగరాజు, కే శంకరయ్య, కసిరెడ్డి నారాయణరెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కోరం కనకయ్య, కె.రాజేశ్‌రెడ్డి, కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, కుందూరు జయవీర్‌రెడ్డి, తోట లక్ష్మీకాంతారావు, కె. మదన్ మోహన్ రావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మల్ రెడ్డి రంగారెడ్డి, మందుల సామ్యేల్, మేడిపల్లి సత్యం, తుడి మేఘారెడ్డి, మురళీ నాయక్ భుక్యా, మైనంపల్లి రోహిత్, నాయిని రాజేందర్‌రెడ్డి, పి. సుదర్శన్‌రెడ్డి, పటోళ్ల సంజీవ్ రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ మాలోత్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, రేకులపల్లి భూపతి రెడ్డి, టి. రామ్మోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వెడ్మ బొజ్జు, వేముల వీరేశం, గడ్డం వివేక్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి 32 మంది కోవా లక్ష్మి, లాస్య నందిత, పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్, అరికెపూడి గాంధీ, బండారి లక్ష్మారెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, చింతా ప్రభాకర్, దానం నాగేందర్, దేవిరెడ్డి సు«దీర్ రెడ్డి, గంగుల కమలాకర్, గూడెం మహిపాల్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, కేపీ వివేకానంద, కాలే యాదయ్య, కాలేరు వెంకటేశ్, కల్వకుంట్ల సంజయ్, మాణిక్ రావు, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, మర్రి రాజశేఖర్ రెడ్డి, ముఠా గోపాల్, వేముల ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, టి. ప్రకాశ్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, తెల్లం వెంకట్రావ్, హరీశ్‌రావు, విజయుడు. ఎంఐఎం నుంచి అందరూ ఎంఐఎం నుంచి అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, జాఫర్ హుస్సేన్, కౌసర్ మెయినుద్దీన్, జుల్ఫీకర్ అలీ, మహ్మద్ మాజీద్ హుస్సేన్, మహ్మద్ మోబిన్ ప్రమాణం చేయగా, ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన అక్బరుద్దీన్ ఒవైసీ అంతకు ముందే గవర్నర్ సమక్షంలో ప్రమాణం చేశారు. సీఐపీ నుంచి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గైర్హాజరైన సభ్యులు ఎవరంటే కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ నుంచి రాజాసింగ్ , ఏలేటి మహేశ్వర్ రెడ్డి, హరీశ్‌బాబు, కె. వెంకట రమణా రెడ్డి, పాయల్ శంకర్, రామారావు పవార్, పైడి రాకేశ్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గైర్హాజరయ్యారు. -
ఎమ్మెల్యేగా సబితమ్మ ప్రమాణం
-
Telangana: కొలువుదీరనున్న కొత్త సభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ శనివారం ఉదయం 11 గంటలకు తొలిసారిగా కొలువు దీరనుంది. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి శుక్రవారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేశారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానం తదితరాల కోసం నాలుగు రోజుల పాటు అసెంబ్లీ తొలి సమావేశాలు జరుగనున్నాయి. రాజ్‌భవన్‌లో అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం తొలిరోజు సమావేశంలో కొత్తగా ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమా న్ని నిర్వహించేందుకు ఏఐఎంఐఎం సీనియర్ శాసన సభ్యు డు అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్‌గా నామినేట్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్‌తో రాజ్‌భవన్‌లో శనివారం ఉదయం 8.30కు గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సీఎం ఎ.రేవంత్‌రెడ్డితో పాటు మంత్రివర్గ సభ్యులు ఈ కార్యక్ర మంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ప్రొటెమ్ స్పీకర్ అధ్యక్షతన తెలంగాణ మూడో శాసనసభ తొలిరోజు సమావేశం ప్రారంభమవుతుంది. తొలుత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత తెలుగు అక్షరమాలలోని అక్షర క్రమంలో ఎన్నికైన ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తొలిసారిగా అసెంబ్లీకి 51 మంది అన్ని పార్టీల తరఫున కలుపుకుని మొ త్తం 51 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కాగా, కరీంనగర్ జిల్లా నుంచి 8 మంది తొలిసారిగా ఎన్నికైన వారున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇద్దరు తొలిసారి అడు గు పెడుతున్నారు. 51 మందిలో 18 మంది క్రియాశీల రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేస్తున్న వారే. కేసీఆర్, రాజాసింగ్ దూరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదు. బీజేపీ తరఫున ఎన్నికైన రాజాసింగ్.. ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యేను నియమించినందున తాను ఆయన ఎదుట ప్రమాణ స్వీకారం చేయబోనని ప్రకటించారు. నేడు స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత స్పీకర్ ఎన్నిక కోసం శనివారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల కానుంది. వికారాబాద్ శాసనసభ్యుడిగా ఎన్నికైన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను శాసనసభ స్పీకర్‌గా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఆయన శనివారం సాయంత్రం సీఎం రేవంత్, మంత్రివర్గం సమక్షంలో నామినేషన్ సమర్పిస్తారని తెలిసింది. కాగా రెండో రోజు ఆదివారం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బాధ్యతల స్వీకరణ కార్యక్రమం, ఆ తర్వాత కొత్త స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. ఈ నెల 11న సోమవారం జరిగే మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత వాయిదా పడే సభ తిరిగి 12వ తేదీ మంగళవారం ఉదయం ప్రారంభమవుతుంది. నాలుగో రోజు సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది. బీఆర్ఎస్కు విపక్ష హోదా శాసనసభలో మొత్తం 119 మంది సభ్యులకు గాను తెలంగాణ మూడో శాసనసభలో అధికార కాంగ్రెస్‌కు 64, మిత్రపక్షం సీపీఐకి ఒకరు చొప్పున ఎమ్మెల్యేల బలం ఉంది. బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఏఐఎంఐఎంకు ఏడుగురు సభ్యుల బలం కలిగి ఉన్నాయి. అధికార కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్కు విపక్ష హోదా దక్కే అవకాశముంది. ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్ మూడో శాసనసభ తొలి సమావేశాలు శనివారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా ఏర్పాట్లను పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం అసెంబ్లీలో అధికారులతో సమీక్ష తర్వాత భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు, అసెంబ్లీ చీఫ్ మార్షల్ కరుణాకర్, ఐఏఎస్ అధికారులు అశోక్‌రెడ్డి, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్‌రెడ్డి అనే నేను..
ఉదయం నుంచి కాంగ్రెస్ అగ్రనేతల రాక, ఆహ్వానాలు.. మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారాలు, సభ.. కొత్త సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం.. అధిష్టానం నేతలకు వీడ్కోలు.. సాయంత్రం సచివాలయం వద్ద హడావుడి.. సీఎం చాంబర్లో రేవంత్ బాధ్యతల స్వీకరణ.. తర్వాత కాసేపటికే కొత్త కేబినెట్ తొలి సమావేశం.. రాత్రిదాకా వాడీవేడిగా చర్చలు.. మొత్తంగా రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిరోజు హడావుడిగా కనిపించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలకు రేవంత్‌రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. వారంతా తాజ్‌కృష్ణ హోటల్‌కు వెళ్లగా.. రేవంత్ తన నివాసానికి వెళ్లి, అక్కడి నుంచి కుటుంబంతో కలసి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మళ్లీ తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకుని, కాంగ్రెస్ అగ్రనేతలతో కలసి ఎల్బీ స్టేడియానికి వచ్చారు. గవర్నర్ తమిళిసై సీఎంగా రేవంత్‌తో, ఇతర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారాలు ముగిశాక గవర్నర్, ఏఐసీసీ నేతలు వెళ్లిపోగా.. రేవంత్ ప్రజలను ఉద్దేశించి సీఎంగా తొలి ప్రసంగం చేశారు. తర్వాత మళ్లీ తాజ్ కృష్ణ హోటల్‌కు వెళ్లారు. ఏఐసీసీ పెద్దలతో కలసి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి వీడ్కోలు పలికారు. అనంతరం రేవంత్‌రెడ్డి సచివాలయానికి వచ్చారు. గౌరవ వందనం స్వీకరించి, సచివాలయమంతా కలియతిరిగారు. సీఎం చాంబర్లో లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత తొలి కేబినెట్ భేటీ నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలుపై మంత్రివర్గం చర్చించింది. ఇక శనివారం అసెంబ్లీ సమావేశం నిర్వహించి కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గురువారం మధ్యా హ్నం 1:19 గంటలకు ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. రేవంత్‌తోపాటు ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్ర మార్క, కేబినెట్ మంత్రులుగా ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ధనసరి అన సూయ (సీతక్క), తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణం చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాందీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాందీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, కర్ణాటక, హిమాచల్ సీఎంలు సిద్ధరామయ్య, సుఖి్వందర్సింగ్ సుక్కు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతోపాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పవిత్ర హృదయంతో అంటూ ఇద్దరు.. ఒకరు ఇంగ్లిష్‌లో.. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు 9 మంది మంత్రులు దైవసాక్షిగా ప్రమాణం చేయగా.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క మాత్రం పవిత్ర హృదయంతో అంటూ ప్రతిజ్ఞ చేశారు. దామోదర రాజనర్సింహ ఇంగ్లి‹Ùలో, మిగతా అందరూ తెలుగులో ప్రమాణం చేశారు. మధ్యాహ్నం 1:04 గంటలకు రేవంత్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నా కొంత ఆలస్యమైంది. ట్రాఫిక్ సమస్య కారణంగా గవర్నర్ 1:17 గంటలకు సభా వేదిక వద్దకు వచ్చారు. రేవంత్ వేదిక దిగి వెళ్లి ఆమెకు స్వాగతం పలికారు. ఆ వెంటనే ప్రమాణ స్వీకారాలు మొదలయ్యా యి. 28 నిమిషాల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం 1:46 గంటలకు ముగిసింది. తర్వాత గవర్నర్ తమిళిసై, కాంగ్రెస్ అగ్రనేతలు వెళ్లిపోయారు. ఓపెన్ టాప్ జీపులో.. కలియదిరిగి.. సోనియాగాంధీతో కలసి రేవంత్‌రెడ్డి ఓపెన్‌టాప్ జీప్‌లో ఎల్బీ స్టేడియంలోకి వచ్చారు. సోనియా గాంధీ ముందు నిలబడగా.. ఆమెకు కాస్త వెనుకగా రేవంత్ నిలబడి స్టేడియంలో కలియదిరిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. తర్వాత రేవంత్ స్వయంగా సోనియాను తోడ్కొని వేదికపైకి వచ్చారు. రాహుల్, ప్రియాంక నడుచుకుంటూ, ప్రజలకు అభివాదం చేస్తూ వేదికపైకి చేరుకున్నారు. కార్యక్రమం ముగిశాక సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలకు రేవంత్ స్వయంగా వీడ్కోలు పలికారు. తర్వాత మళ్లీ వేదికపైకి వచ్చి ముఖ్యమంత్రిగా తన తొలి ప్రసంగం చేశారు. సీతక్క.. హోరెత్తిన స్టేడియం మంత్రులందరిలో సీతక్క ప్రమాణ స్వీకారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంత్రిగా సీతక్క పేరు ప్రకటించగానే ఎల్బీ స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో హోరెత్తింది. ఆ హోరులో సీతక్క ఒక నిమిషం పాటు ఆగిపోవాల్సి వచ్చింది. ఇది చూసి వేదికపై ఉన్న పెద్దలు, నేతలంతా ఆశ్చర్యపోయారు. ప్రమాణం కొనసాగించాలంటూ గవర్నర్ తమిళిసై సైగ చేయడంతో సీతక్క ఆ హోరులోనే ప్రమాణ స్వీకారం కొనసాగించారు. తర్వాత సోనియా వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు. సోనియా లేచి నిలబడి సీతక్కను హత్తుకుని అభినందించారు. అగ్రనేతలతో.. ఒకే వాహనంలో.. గురువారం ఉదయం రేవంత్‌రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరి పెద్దమ్మ గుడికి వెళ్లారు. అక్కడ పూజలు చేసిన తర్వాత తాజ్‌కృష్ణ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్‌గా ఎల్బీ స్టేడియానికి బయలుదేరారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకలతో కలసి రేవంత్ ఒకే వాహనంలో కూర్చున్నారు. సోనియా సభావేదికపై వచ్చాక రేవంత్‌రెడ్డి మనువరాలిని చూసి ముద్దాడారు. ప్రమాణ స్వీకారాలు ముగిశాక.. రేవంత్‌రెడ్డి వేదికపైనే ఉన్న తన సతీమణితో కలసి సోనియా దగ్గరికి వెళ్లి పాదాభివందనం చేశారు. తన కుమార్తెను, అల్లుడిని సోనియా, రాహుల్, ప్రియాంకలకు పరిచయం చేశారు. ప్రమాణ స్వీకారం.. పదనిసలు ► గురువారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. ► ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మొదట, చివరిలో నల్లగొండ గద్దర్ స్వయంగా రాసి, పాడిన ‘మూడు రంగుల జెండా పట్టి’ పాట పార్టీ శ్రేణులకు హుషారెక్కించింది. ► సాధారణంగా ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉండే సోనియాగాంధీ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ం కొలువుదీరే సందర్భంగా హాజరవడం గమనార్హం. గురువారం ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆమెతోపాటు, రాహుల్, ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ► మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరిని రేవంత్‌రెడ్డి దగ్గరికి తీసుకుని శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత మంత్రులు వేదికపై ఉన్న సోనియా, రాహుల్, ప్రియాంక, ఇతర అగ్రనేతలకు మర్యాదపూర్వకంగా నమస్కరించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రతి మంత్రిని భుజం తట్టి ఆశీర్వదించారు. ► ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా హాజరయ్యారు. ► రేవంత్ ప్రసంగిస్తూ.. ‘ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంటే, అక్కడ ప్రగతిభవన్ చుట్టూ ఉన్న కంచెలు బద్దలుగొట్టాం. ఇకపై అందరూ ప్రగతిభవన్‌కు రావొచ్చు’ అని పేర్కొన్నారు. ఈ సమయంలో స్టేడియం మొత్తం చప్పట్లతో మారుమోగింది. ► ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి వస్తున్న పలువురు ప్రముఖుల వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. కాగా,ఏపీకి చెందిన టీడీపీ నాయకులు ఆ పార్టీ జెండాలు పట్టుకొని స్టేడియంలో హల్చల్ చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతూ.. టీడీపీ కార్యకర్తలను చితకబాదడంతో అక్కడి నుంచి పారిపోయారు. కాంగ్రెస్ సభలో టీడీపీ జెండాలు ఏమిటని, మళ్లీ టీడీపీ జెండాలు కనిపిస్తే పీకి పారేయాలని సీనియర్ లీడర్లు కార్యకర్తలకు సూచించారు. -
ఉ.10.28 గంటలకు ఎల్బీ స్టేడియంలో రేవంత్ ప్రమాణ స్వీకారం
-
కొత్త సర్కారుకు శ్రీకారం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా.. తాజా ఎన్నికల్లో గెలిచినవారి జాబితాతో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ సోమవారం గెజిట్ జారీ చేశారు. ఆ వెంటనే సీఈఓ వికాస్‌రాజ్ రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు గెజిట్ నోటిఫికేషన్ ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా సీఈఓ వికాస్‌రాజ్ నేతృత్వంలోని ఎన్నికల అధికారుల బృందం గవర్నర్ తమిళిసైతో కొంతసేపు మర్యాదపూర్వకంగా సమావేశమైంది. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ శాససభాపక్ష (సీఎల్పి) నేతను ఎన్నుకోవడానికి సోమవారం సమావేశమయ్యారు. సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డి ఎన్నికవుతున్నారని, ఆయన రాజ్‌భవన్‌కు చేరుకుని సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని, మరో ఒకరిద్దరు మంత్రులుగా ప్రమాణం చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రాజ్‌భవన్ ఉన్నతాధికారులు సోమవారం ఉదయమే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభించారు. రాజ్‌భవన్ దర్బార్‌హాల్‌లో కొత్త సీఎం, మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించడానికి వీలుగా పొడియంను, కార్యక్రమానికి వచ్చే ఆహ్వానితుల కోసం కుర్చిలను సిద్ధం చేశారు. దర్బార్ హాల్‌ను అలంకరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీర్మానం తీసుకుని సీఎల్పీ నేత రాజ్‌భవన్‌కు వచ్చే అవకాశం ఉండటంతో గవర్నర్ తమిళిసై, రాజ్‌భవన్ అధికారులు సాయంత్రం వరకు వేచిచూశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రాజ్‌భవన్ వద్దకు చేరుకోవడంతో సందడి నెలకొంది. కాన్వాయ్‌లనూ సిద్ధం చేసినా.. కొత్త సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రొటోకాల్ ప్రకారం వారికి ప్రత్యేక కాన్వాయ్‌ల కోసం కూడా ఏర్పాట్లు జరిగాయి. రాజ్‌భవన్ పక్కనే ఉన్న దిల్కుషా అతిథి గృహం వద్ద ఈ మేరకు వాహనాలను సిద్ధంగా ఉంచారు. అయితే సీఎల్పీ నేత ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం రాలేదని, కొత్త సీఎం ప్రమాణ స్వీకారం సోమవారం ఉండదనే స్పష్టత రావడంతో జీఏడీ అధికారులు రాజ్‌భవన్ నుంచి వెనుతిరిగారు. కొత్త కొత్తగా సచివాలయం నూతన సీఎం, మంత్రులకు రాష్ట్ర సచివాలయంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. సచివాలయంలో పాత ప్రభుత్వంలోని కీలక ప్రజాప్రతినిధుల నేమ్ ప్లేట్లను అధికారులు సోమ వారం తొలగించారు. కొత్త సీఎం, మంత్రుల కోసం చాంబర్లను సిద్ధం చేస్తున్నారు. కొత్త సీఎం, మంత్రులకు సంబంధించి తమకు ఎలాంటి కబురు అందలేదని, అధికారికంగా సమాచారం అందగానే వారి కి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని సాధారణ పరిపాలన విభాగం అధికారులు తెలిపారు. అసెంబ్లీ కూడా ముస్తాబు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, కొత్తగా ఎన్నికైన వారితో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని కూడా ముస్తాబు చేస్తున్నారు. అసెంబ్లీ భవనానికి రంగులు వేయడంతోపాటు పాత ఫర్నిచర్‌ను తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు, సీఎం చాంబర్లను అందంగా తీర్చిదిద్దే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రెండో శాసనసభ రద్దు కేసీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గం సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రద్దు ఉత్తర్వులు ఆదివారం (డిసెంబర్ 3) మధ్యాహ్నం నుంచే వర్తిస్తాయని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉపసంహరణ సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనానియమావళి అమలును కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అజయ్‌కుమార్ వర్మ సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)కు లేఖ రాశారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అక్టోబర్ 9న రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనానియమావళి అమల్లోకి వచి్చన విషయం తెలిసిందే. -
బ్రాహ్మణులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజికవర్గానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పి.విశ్వరూప్, జోగి రమేశ్, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని బ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్యాలయంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్‌గా పేరి కామేశ్వరరావు (పీకే రావు) ప్రమాణ స్వీకారం చేశారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ సమాజంలో బ్రాహ్మణుల సమస్యలు తెలిసిన పేరి కామేశ్వరరావు వంటి సీనియర్ నాయకుడిని కార్పొరేషన్ చైర్మన్‌గా సీఎం జగన్ నియమించడం అభినందనీయమన్నారు. విశ్వరూప్ మాట్లాడుతూ సుదీర్ఘ అనుభవం కలిగిన పేరి కామేశ్వరరావు బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. జోగి రమేష్ మాట్లాడుతూ రానున్నకాలంలో బ్రాహ్మణులకు మరింత మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కోన రఘుపతి మాట్లాడుతూ వంశపారంపర్య అర్చకత్వం, అర్చకులకు వేతనాల పెంపు సీఎం జగన్ పాలనలోనే జరిగాయని చెప్పారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ అర్హులైన బ్రాహ్మణులకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రూ.600 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. పేరి కామేశ్వరరావును దేవదాయశాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, విజయవాడ మాజీ మేయర్ జంధ్యాల శంకర్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సుందరరామ శర్మ, ఏపీ అర్చక సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు ఆత్రేయ బాబు, అనంతబాబు, కార్పొరేషన్ జీఎం జి.నాగసాయి, పలు బ్రాహ్మణ సంఘాల నాయకులు అభినందించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీ సుసర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సీఐసీ చీఫ్ కమిషనర్‌గా హీరాలాల్ సమారియా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్ (సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్) ప్రధాన కమిషనర్‌గా హీరాలాల్ సమారియా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో ద్రౌపదీ ముర్ము సమక్షంలో హీరాలాల్ ప్రమాణ స్వీకారం చేశారు. వైకే సిన్హా పదవీ కాలం అక్టోబర్ 3న ముగియడంతో.. సమాచార కమిషన్ నియామకాలను చేపట్టాలంటూ కేంద్రానికి ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌కు చెందిన హీరాలాల్ సమారియాను సీఐసీ చీఫ్ కమిషనర్‌గా రెండేళ్ల కాలానికి గాను కేంద్రం నియమించింది. ఈ పదవిని దళిత వర్గానికి చెందిన అధికారి చేపట్టడం ఇదే మొదటిసారి. 1985వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి హీరాలాల్ సమారియా గతంలో కేంద్ర కారి్మక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పలు విభాగాల్లో కూడా ఆయన సేవలందించారు. -
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే అవకాశం కల్పించండి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం తనకు కల్పించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పు, ఈసీ ఇచ్చిన ఆదేశాల మేరకు తనతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించేలా చూడాలన్నారు. శుక్రవారం ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావుతో కలిసి అరుణ వినతిపత్రం సమర్పించారు. ఈసీ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన రాజపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. గద్వాల అసెంబ్లీ స్థానానికి సంబంధించిన పరిణామాల గురించి అడిగి తెలుసుకున్న గవర్నర్, అరుణతో ప్రమాణస్వీకారం చేయించేలా అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్‌తో మాట్లాడతానని చెప్పినట్టు బీజేపీ వర్గాల సమాచారం. అనంతరం అరుణ మీడియాతో మాట్లాడుతూ తన ప్రమాణానికి ఏర్పాట్లు చేయాలని రెండుసార్లు అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్‌ను కలిసేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరన్నారు. దీనిపై వారి నుంచి ఎలాంటి సమాధా నం రాకపోవడంతో గవర్నర్‌ను కలిసినట్లు తెలిపారు. ఈ అంశంలో ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. -
జస్టిస్ సామ్ కోషి ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సామ్ కోషి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఉద యం 10 గంటలకు హైకోర్టు మొదటి హాల్లో ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తు న్న జస్టిస్ సామ్ కోషిని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో జస్టిస్ సామ్ కోషి కుటుంబ సభ్యులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లో నా సీనియర్‌గా జస్టిస్ అరాధే కొత్తగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సామ్ కోషిని హైకోర్టు బార్ అసోసియేషన్ సన్మానించింది. ఈ సందర్భంగా జస్టిస్ కోషి మాట్లాడుతూ.. నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో న్యాయవాద వృత్తిలో ఉన్నప్పుడు తన సీనియర్ న్యాయవాదిగా జస్టిస్ అలోక్ అరాధే ఉన్నారని, మళ్లీ ఆయన సీజేగా ఉన్న తెలంగాణ హైకోర్టుకు జడ్జిగా రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తెలంగాణ హైకోర్టుకు మంచి పేరు ఉందని, దాన్ని కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. తనతో న్యాయవాదిగా పనిచేసిన జస్టిస్ సామ్ కోషి.. తెలంగాణ హైకోర్టుకు రావడం ఆనందంగా ఉందని సీజే జస్టిస్ అరాధే పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్రావు, వైస్ చైర్మన్ కల్యాణ్‌రావు చెంగల్వ పాల్గొన్నారు. అనంతరం సీజేతోపాటు న్యాయ మూర్తులు బార్ అసోసియేషన్‌ను సందర్శించారు. -
8 మంది నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి: శాసన మండలికి స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన 8 మంది కొత్త సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు నూతన సభ్యులతో ప్రమాణం చేయించారు. పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి (వైఎస్సార్ జిల్లా), మేరిగ మురళీధర్ (నెల్లూరు జిల్లా), కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాధ్ (పశ్చిమ గోదావరి జిల్లా), కుడిపూడి సూర్యనారాయణరావు (తూర్పు గోదావరి జిల్లా), నర్తు రామారావు (శ్రీకాకుళం జిల్లా), సిపాయి సుబ్రహ్మణ్యం (చిత్తూరు జిల్లా), డాక్టర్ ఎ.మధుసూదన్ (కర్నూలు జిల్లా) ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు, శాసనమండలి చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్సీలు, శాసనసభ సెక్రటరీ జనరల్ రామాచార్యులు, శాసనమండలి ఓఎస్డీ సత్యనారాయణరావు, ఉప కార్యదర్శి విజయరాజు పాల్గొన్నారు. తోడేళ్ల మందలా దాడి సీఎం జగన్ రాజకీయ నిర్ణయాలు చంద్రబాబుకు రాజకీయంగా ఉరితాడు లాంటివని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అందుకే తోడేళ్ల మందలా ఏకమై కుట్రపూరితంగా ప్రజా ప్రభుత్వంపై దాడి మొదలుపెట్టారని మండిపడ్డారు. ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ మేనిఫెస్టోలో 98 శాతానికిపైగా హామీలు అమలు చేసి చూపించారన్నారు. నిజాయతీ, విశ్వసనీయతకు నిదర్శనమైన సీఎం జగన్‌కు, అబద్ధానికి, మోసానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబుకు, తోడేళ్ల మందకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. చంద్రబాబు ఏజెంట్లా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పెత్తందార్ల పక్షాన నిలిచిన చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియాతో ప్రజల పక్షాన నిలిచిన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు. టీడీపీ హయాంలో అమరావతి భూముల్లో కుంభకోణం జరిగిందన్నారు. చంద్రబాబు బరితెగింపు, అక్రమాలకు ఆయన కరకట్ట నివాసం నిదర్శనమని దుయ్యబట్టారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ద్వారా చంద్రబాబు గొడవ చేయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్‌ల కుట్ర రాజకీయాలను సీఎం జగన్ సమాధి చేస్తున్నారు కాబట్టే ఈ కుట్రదారులు వైఎస్సార్సీపీ విముక్త రాష్ట్రం అని మాట్లాడుతున్నారని చెప్పారు. -
అసెంబ్లీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
సాక్షి, విజయవాడ: నూతనంగా ఎన్నికైన శాసన మండలి సభ్యులు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రులు అంబటి , కారుమురి, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన 9 మంది ఎమ్మెల్సీలు.. మర్రి రాజశేఖర్, చంద్రగిరి ఏసురత్నం, పోతుల సునీత, బొమ్మి ఇస్రాయిల్, జయ మంగళ వెంకటరమణ, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, పెనుమత్స సూర్యనారాయణ రాజు, మంగమ్మ. చదవండి: ‘జగనన్నే మా భవిష్యత్తు’.. అడిగి మరీ తీసుకుని ఇళ్లకు, ఫోన్లకు స్టిక్కర్లు.. -
Gujarat Election 2022: రేపే భూపేంద్రకు పట్టం
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ (60) వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. శనివారం జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలంతా ఆయన్ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం ‘కమలం’లో జరిగిన ఈ భేటీకి పార్టీ కేంద్ర పరిశీలకులుగా సీనియర్ నేతలు రాజ్‌నాథ్‌సింగ్, యడ్యూరప్ప, అర్జున్ ముండా హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 2021లో విజయ్ రూపానీ స్థానంలో సీఎంగా భూపేంద్ర పగ్గాలు చేపట్టారు. గురువారం వెలువడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 182 స్థానాలకు గాను ఏకంగా 156 సీట్లను కొల్లగొట్టి బీజేపీ రికార్డు విజయం సొంతం చేసుకోవడం తెలిసిందే. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా మంత్రివర్గంతో పాటుగా భూపేంద్ర శుక్రవారం రాజీనామా చేశారు. శనివారం ఎల్పీ నేతగా ఎన్నికయ్యాక గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు. సోమవారం ఆయన రాష్ట్ర 18వ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గాందీనగర్‌లోని హెలిప్యాడ్ మైదానంలో జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. ఇదీ చదవండి: హిమాచల్ సీఎంగా సుఖు -
Viral: సీఎం జగన్ ప్రమాణ స్వీకారం వీడియో చూస్తూ ఆపరేషన్
సాక్షి, గుంటూరు: ఎనిమిదేళ్లుగా ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. గతంలో నెలకు రెండుసార్లు, వారానికి ఒకసారి మాత్రమే ఫిట్స్ వచ్చేవి. ఈ మధ్యకాలంలో రోజులోనే రెండు, మూడుసార్లు ఫిట్స్ వస్తున్నాయి. అయితే ఆపరేషన్ అంటే భయపడిపోయిన రోగికి తనతో మాట్లాడుతూ మెలకువగా ఉండి కూడా ఆపరేషన్ చేయించుకోవచ్చని అవేక్ సర్జరీలలో బాహుబలి సర్జన్‌గా గుర్తింపు తెచ్చుకున్న న్యూరోసర్జన్ భరోసా ఇచ్చారు. వెంటనే రోగి తనకు ఎంతో ఇష్టమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని చూపిస్తూ తనకు ఆపరేషన్ చేయాలని కోరాడు. రోగి మెలకువగా ఉండగానే రోగికి ఇష్టమైన సీఎం ప్రమాణస్వీకార వీడియోలను ల్యాప్‌టాప్‌లో చూపిస్తూ బాహుబలి సర్జన్ ఆపరేషన్ చేశారు. శనివారం గుంటూరు అరండల్‌పేటలోని శ్రీసాయి హాస్పటల్స్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ భవనం హనుమశ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రూ.4లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్ ఆరోగ్యశ్రీలో ఉచితంగా.. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండటం ఇసుకత్రిపురవరం గ్రామానికి చెందిన 43 ఏళ్ల గోపనబోయిన పెద్ద ఆంజనేయులు రోజువారి కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సుమారు ఎనిమిది సంవత్సరాలుగా ఇతను ఫిట్స్ బాధపడుతున్నాడు. గతంలో నెలలో రెండు సార్లు లేదా వారంలో ఒకసారి మాత్రమే ఫిట్స్ వచ్చేవి. ఈ మధ్యకాలంలో రోజుకు మూడుసార్లు ఫిట్స్ వస్తూ బాగా ఇబ్బంది పడిపోతున్నాడు. ఫిట్స్‌తో పాటుగా బ్రెయిన్లో సుమారు ఏడు సెంటిమీటర్ల పరిమాణంలో ట్యూమర్ ఏర్పడింది. ఆపరేషన్ చేయించుకున్న పెద్ద ఆంజనేయులుతో వైద్యులు భవనం హనుమశ్రీనివాసరెడ్డి, త్రినాథ్ ట్యూమర్ వల్ల కాలు చేయి పటుత్వం కోల్పోయి వస్తువులేమీ చేతితో పట్టుకునే అవకాశం లేకుండా పోయింది. పలు ఆస్పత్రుల్లో మందులు వాడినా సమస్య తగ్గలేదు. గత నెలలో గుంటూరులోని తమ ఆస్పత్రికి రోగి వచ్చాడని డాక్టర్ భవనం హనుమశ్రీనివాసరెడ్డి చెప్పారు. అతడికి ఎమ్మారై స్కానింగ్, బ్రెయిన్ తీడీ మ్యాప్ టెక్నాలజీ చేసి బ్రెయిన్లో అతిసున్నిత భాగమైన ఫ్రాంటల్ ప్రీమోటార్ ఏరియా నుంచి మిడిల్ ప్రాంటల్ గైరస్ వరకు సుమారు ఏడు సెంటీమీటర్ల పరిమాణంలో ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారించామన్నారు. అతి సున్నితమైన భాగాల్లో ట్యూమర్ ఉండటం వల్ల మెలకువగా ఉండి(అవేక్ సర్జరీ) ఆపరేషన్ చేయించుకుంటే బాగా ఉపయోగముంటుందని రోగికి కౌన్సెలింగ్ చేశామని తెలిపారు. చదవండి: (మంత్రి ఆదిమూలపు సురేష్‌కు తప్పిన ప్రమాదం) రోగి అవేక్ సర్జరీకి అంగీకరించటంతో అత్యాధునికమైన న్యూరో నావిగేషన్ బ్రెయిన్ త్రీడీ మ్యాపింగ్ అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్ ఉపయోగించి నవంబర్ 25న ఆపరేషన్ చేశామన్నారు. ఆపరేషన్ చేసేందుకు రెండు గంటల సమయం పట్టిందని, ఆపరేషన్ చేస్తున్న సమయంలో రోగి కోరిక మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిల ప్రమాణ స్వీకార కార్యక్రమాలను చూపించి రోగితో మాట్లాడుతూ విజయవంతంగా ఆపరేషన్ చేశామని చెప్పారు. సుమారు రూ.4లక్షల ఖరీదు చేసే ఆపరేషన్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేశామన్నారు. ఆపరేషన్ ప్రక్రియలో తనతోపాటుగా న్యూరో ఎనస్థటిస్ట్ డాక్టర్ త్రినాథ్, పీజీ వైద్య విద్యార్థి డాక్టర్ ఆకాష్, వైద్య సిబ్బంది రెడ్డి, నరేందర్ పాల్గొన్నట్లు వెల్లడించారు. సకాలంలో ఆపరేషన్ చేయని పక్షంలో రోగికి బ్రెయిన్లో ట్యూమర్ పెరిగిపోయి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేదని తెలిపారు. అవేక్ సర్జరీ విజయవంతంగా చేసి రోగి ప్రాణాలు కాపాడిన వైద్యబృందాన్ని శ్రీసాయి హాస్పటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ వసంత కృష్ణప్రసాద్ అభినందించారు. తన ప్రాణాలు కాపాడిన వైద్యులకు పెద్ద ఆంజనేయలు, అతడి కుటుంబ సభ్యులు కృతజ్ఙతలు తెలిపారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం లేకపోతే ఆపరేషన్ చేయించుకునే స్థోమత తమకు లేదని, సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
మంచిపేరు తెచ్చుకుంటా.. శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానమ్
సాక్షి, అమరావతి: శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా అత్యున్నత స్థానంలో మంచిపేరు తెచ్చుకునే విధంగా నడుచుకుంటానని జకియా ఖానమ్ చెప్పారు. డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆమె శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆమెను ముఖ్యమంత్రి వైఎస్ జగన్, బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు సాదరంగా తీసుకెళ్లి అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మైనార్టీ గృహిణిగా ఉన్న తనను శాసనమండలి సభ్యురాలిగా చేయడమే కాకుండా ఏకంగా డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఎంపిక చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కి ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా తొలిసారిగా మైనార్టీ మహిళను ఎంపిక చేయడం పట్ల మైనార్టీ సోదర సోదరీమణులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. సీఎం వైఎస్ జగన్ మహిళా పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సామాజిక సంక్షేమ పథకాలను పక్క రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. సీఎం మంచి వ్యూహకర్త అని, ముందు చూపున్న వ్యక్తి అని ఆమె అన్నారు. మహిళా సాధికారత కోసం సీఎం ఎంతో కృషిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని మహిళలంతా ఆయనకు అండగా ఉంటారని చెప్పారు. మహిళలు అన్ని రకాలుగా పైకిరావాలి సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ‘ఈ రోజు అధ్యక్షా అని సంబోధించే స్థానంలో నా అక్క జకియా ఖానమ్ కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక సాధారణ కుటుంబం నుంచి ఒక గృహిణిగా చట్టసభల్లో అడుగుపెట్టడమే కాకుండా డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఈ రోజు ఆ స్థానంలో కూర్చున్నారు. నిజంగా మైనార్టీ అక్కచెల్లెమ్మలందరికీ ఇది ఒక సంకేతం, ఒక సందేశం. మహిళలు అన్ని రకాలుగా పైకి రావాలి.. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలి.. ప్రభుత్వమన్నది తోడుగా ఉండాలి.. అన్న మన ప్రయత్నం ఈ రెండున్నర సంవత్సరాలుగా జరుగుతోంది. అందులో భాగంగా దేవుడు ఈ రోజు నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను. మీకు మంచి జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ శెలవు తీసుకుంటున్నాను..’ అంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు మాట్లాడుతూ మండలి చైర్మన్‌గా దళితవర్గానికి చెందిన మోషేన్‌రాజు, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ మహిళ జకియా ఖానమ్‌ను ఎంపిక చేసిన సీఎంని అభినందించారు.కాగా, సీఎంను అసెంబ్లీలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం జకియా ఖానమ్ కలిసి తనను ఈ పదవికి ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. -
లోక్‌సభలో ప్రమాణం చేయనున్న ఉపఎన్నికల్లో గెలిచిన ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అర్థవంతమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అన్ని పార్టీలు సహకరించాలని, ఈ సమావేశాలు సజావుగా సాగుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక ఇటీవల ఉపఎన్నికల్లో గెలిచిన కొత్త ఎంపీలు నేడు లోక్‌సభలో ప్రమాణం చేయనున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ తిరుపతి లోక్‌సభస్థానం నుంచి గెలిచిన వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి లోక్‌సభలో ప్రమాణం చేయనున్నారు. అనంతరం ఇటీవల ఎంపీకైన కొత్త మంత్రులను ప్రధాని నరేంద్ర మోదీ సభకు పరిచయం చేయనున్నారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎంపీలకు ఉభయ సభలు నివాళులర్పించనున్నాయి. తొలిరోజు(సోమవారం) లోక్‌సభలో 2 బిల్లులు.. ది ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ చట్టం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ ప్రెన్యూర్షిప్, మేనేజ్మెంట్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ సమావేశాలు ఉదయం 11గంటకు ప్రారంభమై సాయంత్రం 6గంటల వరకు కొనసాగుతాయి. నేటి నుంచి ఆగస్టు 13వరకూ నిర్వహించే వర్షాకాల సమావేశాల్లో మొత్తం 19సార్లు సభ సమావేశం అవుతుంది. -
డల్లాస్ తెలంగాణ ప్రజాసమితి కార్యవర్గ బృందం..
డల్లాస్: డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి (టీపాడ్), జనవరి 26న నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఫ్రిస్కో నగరములోని సభ శుభం బాన్క్వెట్ హాల్లో నిర్వహించారు. డల్లాస్ ప్రాంతీయులు, స్థానిక, తెలుగు జాతీయ సంస్థల నాయకులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు. ముందుగా డల్లాస్ చిరంజీవి శ్రేయస్ కొర్లపాటి ప్రార్థన గీతాన్ని ఆలపించగా అనంతరం అమెరికా, భారత దేశం జాతీయ గీతాలు పాడి కార్యవర్గ బృందం జ్యోతి ప్రజ్వలన చేసింది. ఈ కార్యక్రమాన్ని రఘువీర్ బండారు ఫౌండేషన్ కమిటి, శారద సింగిరెడ్డి బోర్డు అఫ్ ట్రస్టీ సంయుక్తంగా నిర్వహించారు. ముందుగా రఘువీర్ బండారు సభకి ఆహ్వానం తెలుపుతూ, 2014 లో సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు ఆరు సంవత్సరాల సంస్థ సాధించిన వైభవాన్ని, ఘనతను పంచుకున్నారు. విజయం వెనక పనిచేస్తున్న నాయకత్వాన్ని కార్యవర్గ బృందాన్ని, పోషక దాతలను మనస్పూర్తిగా అభినందిస్తూ వారి సేవలను అంకిత భావాన్ని కొనియాడారు. శారద సింగిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ ఏటా చేసిన సాంస్కృతిక, సామజిక సేవ రక్తదాన శిబిరాలు, నిరాశ్రయులకు ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన సదస్సులు, వనభోజనాలు, మాతృ దేశం నుంచి వచ్చిన నిపుణులతో ‘మీట్ అండ్ గ్రీట్’, సాంఘిక కార్యక్రమాలతో టీపాడ్ దూసుకుపోతున్న శైలిని వివరించారు. పూర్వ ఫౌండేషన్ కమిటీ చైర్ జానకి మందాడి నూతన కార్యవర్గ బృందాన్ని అభినంధించారు. అనంతరం జానకి మందాడి.. ఫౌండేషన్ కమిటీ చైర్ రావు కలవలతో ప్రమాణ స్వీకారం చేయించగా అజయ్ రెడ్డి, రఘువీర్ బండారు, పుష్ప గుచ్చం అందచేసి శాలువాతో సన్మానించారు. రావు కలవల గారు ఈ సంవత్సరం తాము చేసే కార్యక్రమాల గురించి మాట్లాడుతూ..అత్యున్నతమైన సేవలందించడములో కమ్యూనిటీ ముందుంటుందని తెలిపారు. తరువాత అజయ్ రెడ్డి ప్రసంగిస్తూ ‘టీపాడ్’ కార్యవర్గ బృందం నిస్వార్థంగా, ఆనందముతో కలిసి చేసే సేవ ఈ కమ్యూనిటీకి ఒక ఆదర్శమని కొనియాడారు. పూర్వ బోర్డు అఫ్ ట్రస్టీ చైర్ పవన్ గంగాధర, పూర్వ అధ్యక్షుడు చంద్రా రెడ్డి పోలీస్ గతేడాది జరిగిన కార్యక్రమాలకు సహకరించిన కమిటీ సభ్యులందరికి ధన్యవాదాలు తెలిపారు. పవన్ గంగాధర నూతనంగా ఎన్నుకోబడిన బోర్డు అఫ్ ట్రస్టీస్ రామ్ అన్నాడి, అశోక్ కొండల, పాండురంగారెడ్డి పాల్వే, ఇంద్రాణి పంచార్పులచే ప్రమాణ స్వీకారాలను చేయించగా, చంద్రా రెడ్డి పోలీస్.. ఎగ్జిక్యూటివ్ కమిటీ రవికాంత్ రెడ్డి మామిడి, మంజుల పంజాల, శ్రీధర్ వేముల, బాల గనవరపు, శ్రీనివాస్ అన్నమనేనితో ప్రమాణ స్వీకారం చేయించారు. తదనంతరం రఘువీర్ బండారు శారద సింగిరెడ్డి కలిసి ఈ సంవత్సరానికి బోర్డు అఫ్ ట్రస్టీ చైర్‌గా మాధవి సుంకిరెడ్డి, బోర్డు అఫ్ ట్రస్టీ వైస్ చైర్‌గా ఇంద్రాణి పంచార్పుల, ఎగ్జిక్యూటివ్ కమిటీ కోఆర్డినేటర్‌గా బుచ్చిరెడ్డి గోలి, ప్రెసిడెంట్‌గా రవికాంత్ రెడ్డి మామిడి, వైస్ ప్రెసిడెంట్‌గా రూప కన్నెయ్యగారి, జనరల్ సెక్రటరీగా అనురాధ మేకల, జాయింట్ సెక్రటరీగా లింగా రెడ్డి అల్వా, ట్రెజరర్ గా శంకర్ పరిమళ్, జాయింట్ ట్రెజరర్‌గా మధుమతి వ్యాసరాజుచే ప్రమాణ స్వీకారాలను చేయించారు. ప్రమాణ స్వీకారాల తర్వాత మాధవి సుంకిరెడ్డి, రవికాంత్ రెడ్డి మామిడి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం మరిన్ని సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామని చెబుతూ వారికి పదవీ బాధ్యతలను ఇచ్చిన నాయకత్వానికి ధన్యవాదాలు తెలియ చేశారు. నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కొత్త బోర్డు అఫ్ ట్రస్టీస్‌తో పాటు సుధాకర్ కలసాని, శారద సింగిరెడ్డితో పదవీ బాధ్యతలు కొనసాగించగా రఘువీర్ బండారు, అజయ్ రెడ్డి, జానకి మందాడి కూడా బోర్డు అఫ్ ట్రస్టీ సభ్యులుగా ఈ సంవత్సరం సహకరించి ఆర్థికంగా, కార్యనిర్వహణ సలహాల పటిష్టత కోసం కార్యవర్గ బృందంతో కలవడం సంస్థకు గర్వ కారణమన్నారు. కొత్తగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎగ్జిక్యూటివ్ కమిటీతో మాధవి లోకిరెడ్డి, లక్ష్మి పోరెడ్డి, రత్న ఉప్పల, రోజా అడెపు, అడ్వైజరీ కమిటీగా అరవింద్ రెడ్డి ముప్పిడి, ,విక్రమ్ రెడ్డి జంగం, వేణు భాగ్యనగర్, కరణ్ పోరెడ్డి, నరేష్ సుంకిరెడ్డి, రమణ లష్కర్, గంగా దేవర, జయ తెలకల పల్లి, సతీష్ నాగిళ్ల, కళ్యాణి తాడిమేటి వారి పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నారు. ప్రెసిడెంట్ రవికాంత్ రెడ్డి మామిడి కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికి, మీడియా ప్రతినిధులకు, శుభం బాన్క్వెట్ హాల్, ఆనంద్ అడియార్ భవన్ ఇండియన్ రెస్టారెంట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.