
సాక్షి, న్యూఢిల్లీ : ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం లోక్‌సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్బంలో బీజేపీ సభ్యులు జై శ్రీరాం, వందేమాతరం నినాదాలతో హోర్తెతించడం పట్ల ఓవైసీ స్పందించారు. బీజేపీ సభ్యులకు తనను చూడగానే అలాంటి విషయాలు గుర్తుకురావడం మంచిదేనని, అయితే వారు భారత రాజ్యాంగాన్ని, ముజ్‌ఫర్‌పూర్‌లో చిన్నారుల మరణాలను కూడా వారు గుర్తుకు తెచ్చుకుంటారని ఆశిస్తానని చురకలు అంటించారు.
కాగా, బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో గత రెండు వారాల్లో 200 మందికి పైగా చిన్నారులు మెదడువాపు వ్యాధితో మరణించిన సంగతి తెలిసిందే. ముజఫర్‌పూర్‌లో చిన్నారుల మృతిపై విపక్షాలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న సర్జికల్ స్ర్టైక్స్‌ను ఆర్జేడీ ప్రస్తావిస్తూ ఆ మెరుపు దాడులను చిన్నారులను కబళిస్తున్న మెదడువాపు వ్యాధిపై చేయాలని ఎద్దేవా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment