సాక్షి, షిల్లాంగ్ : మేఘాలయా 12వ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) చీఫ్ కన్రాడ్ సంగ్మా ప్రమాణస్వీకారం చేశారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ అమిత్ షా హాజరైన ఈ కార్యక్రమంలో సంగ్మాచే గవర్నర్ గంగా ప్రసాద్ ప్రమాణం చేయించారు. లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా కుమారుడు కన్రాడ్ సంగ్మా 2016లో తండ్రి మరణానంతరం ఎన్‌పీపీ పగ్గాలు చేపట్టారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌పీపీ సొంతగా 19 స్ధానాల్లో గెలుపొందగా, ఆరుగురు యూడీపీ ఎమ్మెల్యేలు, నలుగురు పీడీఎఫ్ ఎమ్మెల్యేలు, ఇద్దరేసి బీజేపీ, హెచ్‌ఎస్‌పీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి మద్దతు తెలిపారు. మరికొందరు ఇండిపెండెంట్లతో ఎన్‌పీపీ బలం 34కు పెరిగింది. యూడీపీ చీఫ్ దంకూపర్ రాయ్ ఎన్‌పీపీకి మద్దతు తెలపడంతో కన్రాడ్ సంగ్మా సర్కార్ కొలువుతీరేందుకు మార్గం సుగమమైంది.
కాంగ్రెసేతర ఫ్రంట్‌కు సంగ్మా నాయకత్వాన్ని బలపరుస్తామని రాయ్ ముందుకొచ్చారు. పదేళ్లుగా మేఘాలయాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో 28 స్ధానాలు గెలుచుకోగా ప్రస్తుతం 21 మంది ఎమ్మెల్యేలకు పరిమితమై ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment