
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై పది రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి అతిత్వరలో తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీన సాయంత్రం 4.30 నిమిషాలకు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
కొత్త సీఎంను బీజేపీ పెద్దలు ఇంకా ఎంపిక చేయలేదు. బీజేపీ శాసనసభాపక్ష భేటీ నిర్వహించలేదు. మార్చి 8న ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లివచ్చారు. సోమవారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగాల్సి ఉండగా.. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం, ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట నేపథ్యంలో ఈ భేటీ వాయిదా పడింది. బుధవారం శాసనభాపక్షం సమావేశం కానున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఎంపికతోపాటు మంత్రివర్గ కూర్పుపై ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలియజేశాయి.
Comments
Please login to add a commentAdd a comment