కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్
తొలి సీఎం కానున్న ఎన్‌సీ ఉపాధ్యక్షుడు
శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ తొలి ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా నేడు ప్రమాణం చేయనున్నారు. ఆర్టీకల్ 370 ఆర్టీకల్ రద్దు అనంతరం మొదటిసారిగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్‌సీ, కాంగ్రెస్ కూటమి విజయం సాధించడం తెలిసిందే. బుధవారం శ్రీనగర్‌లోని షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్‌కేఐసీసీ)లో జరిగే కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సీఎంగా ఒమర్‌తో ప్రమాణం చేయించనున్నారు.
పలువురు మంత్రులుగా ప్రమాణం చేస్తార ని భావిస్తున్నారు. ఇందుకోసం ఎస్‌కేఐసీసీలో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమానికి ఇండియా కూటమి పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన ఐదుగురితో కలుపుకుంటే జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సభ్యుల సంఖ్య 95కు చేరుకుంది. ఇటీవలి ఎన్నికల్లో ఎన్‌సీ 40, భాగస్వామ్య కాంగ్రెస్ ఆరు, సీపీఎం ఒక సీటు గెలుచుకున్నాయి. ఇవికాకుండా, ఒమర్ అబ్దుల్లాకు ఆప్ ఏకైక సభ్యుడు, ఐదుగురు ఇండిపెండెంట్లు మద్దతు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment