సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ శనివారం కొలువుదీరింది. ఉదయం 11.00 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు ప్రమాణం చేశారు.
అనంతరం మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసిన తరువాత అక్షర క్రమంలో సభలోని సభ్యులతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 61 మంది, బీఆర్‌ఎస్ నుంచి 32 మంది, ఎంఐఎం నుంచి ఆరుగురు, సీపీఐ నుంచి గెలిచిన ఒక్కరు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడాన్ని నిరసిస్తూ బీజేపీకి చెందిన 8 మంది సభ్యులు సభకు హాజరు కాలేదు.
కాలు జారి పడిన కారణంగా శస్త్ర చికిత్స చేయించుకొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయనకు సహాయకారిగా ఉన్న మాజీ మంత్రి కె. తారక రామారావు సహా ఏడుగురు బీఆర్‌ఎస్ సభ్యులు, వ్యక్తిగత కారణాలతో ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.
ప్రమాణం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీరే..
రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, దామోదర రాజ నర్సింహ, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, చిట్టెం పర్ణికా రెడ్డి, మట్టా రాగమయి, పద్మావతి రెడ్డి, యశస్విని రెడ్డి, ఆది శ్రీనివాస్, ఆదినారాయణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అనిరుధ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, బాలు నాయక్ నేనావత్, చిక్కుడు వంశీకృష్ణ, చింతకుంట విజయ రమణారావు, దొంతి మాధవరెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, గడ్డం వినోద్, గండ్ర సత్యనారాయణ రావు, జి. మధుసూదన్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, రామ్‌చందర్ నాయక్, కేఆర్ నాగరాజు, కే శంకరయ్య, కసిరెడ్డి నారాయణరెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కోరం కనకయ్య, కె.రాజేశ్‌రెడ్డి, కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, కుందూరు జయవీర్‌రెడ్డి, తోట లక్ష్మీకాంతారావు, కె. మదన్ మోహన్ రావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మల్ రెడ్డి రంగారెడ్డి, మందుల సామ్యేల్, మేడిపల్లి సత్యం, తుడి మేఘారెడ్డి, మురళీ నాయక్ భుక్యా, మైనంపల్లి రోహిత్, నాయిని రాజేందర్‌రెడ్డి, పి. సుదర్శన్‌రెడ్డి, పటోళ్ల సంజీవ్ రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ మాలోత్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, రేకులపల్లి భూపతి రెడ్డి, టి. రామ్మోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వెడ్మ బొజ్జు, వేముల వీరేశం, గడ్డం వివేక్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి.
బీఆర్‌ఎస్ నుంచి 32 మంది
కోవా లక్ష్మి, లాస్య నందిత, పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్, అరికెపూడి గాంధీ, బండారి లక్ష్మారెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, చింతా ప్రభాకర్, దానం నాగేందర్, దేవిరెడ్డి సు«దీర్ రెడ్డి, గంగుల కమలాకర్, గూడెం మహిపాల్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, కేపీ వివేకానంద, కాలే యాదయ్య, కాలేరు వెంకటేశ్, కల్వకుంట్ల సంజయ్, మాణిక్ రావు, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, మర్రి రాజశేఖర్ రెడ్డి, ముఠా గోపాల్, వేముల ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, టి. ప్రకాశ్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, తెల్లం వెంకట్రావ్, హరీశ్‌రావు, విజయుడు.
ఎంఐఎం నుంచి అందరూ
ఎంఐఎం నుంచి అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, జాఫర్ హుస్సేన్, కౌసర్ మెయినుద్దీన్, జుల్ఫీకర్ అలీ, మహ్మద్ మాజీద్ హుస్సేన్, మహ్మద్ మోబిన్ ప్రమాణం చేయగా, ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన అక్బరుద్దీన్ ఒవైసీ అంతకు ముందే గవర్నర్ సమక్షంలో ప్రమాణం చేశారు. సీఐపీ నుంచి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
గైర్హాజరైన సభ్యులు ఎవరంటే
కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ నుంచి రాజాసింగ్ , ఏలేటి మహేశ్వర్ రెడ్డి, హరీశ్బాబు, కె. వెంకట రమణా రెడ్డి, పాయల్ శంకర్, రామారావు పవార్, పైడి రాకేశ్ రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా గైర్హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment