ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అర్థవంతమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అన్ని పార్టీలు సహకరించాలని, ఈ సమావేశాలు సజావుగా సాగుతాయని భావిస్తున్నట్లు తెలిపారు.
ఇక ఇటీవల ఉపఎన్నికల్లో గెలిచిన కొత్త ఎంపీలు నేడు లోక్‌సభలో ప్రమాణం చేయనున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ తిరుపతి లోక్‌సభస్థానం నుంచి గెలిచిన వైఎస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి లోక్‌సభలో ప్రమాణం చేయనున్నారు. అనంతరం ఇటీవల ఎంపీకైన కొత్త మంత్రులను ప్రధాని నరేంద్ర మోదీ సభకు పరిచయం చేయనున్నారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎంపీలకు ఉభయ సభలు నివాళులర్పించనున్నాయి.
తొలిరోజు(సోమవారం) లోక్‌సభలో 2 బిల్లులు.. ది ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ చట్టం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ ప్రెన్యూర్షిప్, మేనేజ్‌మెంట్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ సమావేశాలు ఉదయం 11గంటకు ప్రారంభమై సాయంత్రం 6గంటల వరకు కొనసాగుతాయి. నేటి నుంచి ఆగస్టు 13వరకూ నిర్వహించే వర్షాకాల సమావేశాల్లో మొత్తం 19సార్లు సభ సమావేశం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment