Parliament session starts
-
ఢిల్లీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఎంపీ భాన్సూరి
-
ఆ ప్రస్తావన ఎందుకు?: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ తొలి సెషన్ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ‘ఎమర్జెన్సీ’ని ప్రస్తావిస్తూ తీర్మానం చేయడాన్ని విపక్షనేత రాహుల్ గాంధీ మరోమారు తీవ్రంగా తప్పుబట్టారు. బిర్లాను గురువారం మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాజకీయ అంశమైన ‘ఎమర్జెన్సీ’ని ప్రస్తావించకుండా ఉండాల్సింది అన్నారు. ‘‘రాహుల్, ఇండియా కూటమి నేతలు స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నేతలంతా పార్లమెంటరీ వ్యవహారాలు మాట్లాడుకున్నారు. అందులో భాగంగానే ఎమర్జెన్సీ అంశమూ ప్రస్తావనకు వచి్చంది.రాహుల్ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. రాజకీయ అంశాన్ని సభలో లేవనెత్తకుండా నివారిస్తే బాగుండేదన్నారు’’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ వెల్లడించారు. ఈ అంశంపై కేసీ వేణుగోపాల్ విడిగా స్పీకర్‌కు ఒక లేఖ రాశారు. ‘పార్లమెంట్ విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీసే అంశమిది. స్పీకర్‌గా మిమ్మల్ని ఎన్నుకున్న శుభతరుణంలో అర్ధశతాబ్దకాలంనాటి ఎమర్జెన్సీ అంశాన్ని మీరు సభ ముందుకు తేవడం విపక్షాలన్నింటినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. స్పీకర్ ఎన్నిక, బాధ్యతల స్వీకరణ వేళ రాజకీయాలు మాట్లాడటం పార్లమెంట్ చరిత్రలో ఇదే తొలిసారి.నూతన స్పీకర్‌గా ఎన్నికయ్యాక చేపట్టాల్సిన తొలి విధులకు ఇలాంటి చర్యలు తీవ్ర విఘాతం కల్గిస్తాయి. పార్లమెంటరీ సంప్రదాయాలను అపహాస్యం చేస్తూ సాగిన ఈ ఉదంతంపై మేం ఆందోళన చెందాం’’ అని వేణుగోపాల్ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘‘1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ‘అత్యయిక స్థితి’ అమల్లోకి తెచ్చారు. చాలా మంది ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం జైళ్లలో పడేసింది. మీడియాపై ఆంక్షలు విధించింది.న్యాయ వ్యవస్థపై నియంత్రణ చట్రం బిగించింది. ఎమర్జెన్సీ విధించి 49 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సభ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పరిరక్షించడంతోపాటు దాని విలువలకు కట్టుబడి ఉందని నేను హామీ ఇస్తున్నా’’ అని నూతన స్పీకర్ బిర్లా బుధవారం పేర్కొన్నారు. స్పీకర్ ఆ తీర్మానాన్ని చదువుతున్న సందర్భంలో కాంగ్రెస్ సహా విపక్ష నేతలంతా నిలబడి తీవ్ర నిరసన వ్యక్తం చేయడం తెలిసిందే. -
ఎమర్జెన్సీ.. చీకటి అధ్యాయం
ఎమర్జెన్సీ. నిన్నటికి నిన్న లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికవుతూనే ఓం బిర్లా నోట సభలో విన్పించిన మాట. గురువారం పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంలోనూ ప్రముఖంగా చోటుచేసుకుంది! ఇందిరాగాంధీ హయాంలో 1975లో విధించిన ఎమర్జెన్సీని దేశ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయంగా, రాజ్యాంగంపై దాడిగా రాష్ట్రపతి అభివరి్ణంచారు. ‘‘స్వతంత్ర భారత చరిత్రలో రాజ్యాంగంపై ఇలాంటి దాడులు జరుగుతూ వచ్చాయి. 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీపై దేశమంతా భగ్గుమంది.అంతిమంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులపై దేశం విజయం సాధించి ప్రగతి పథాన సాగుతోంది’’ అన్నారు. ‘‘మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కేవలం పాలనా మాధ్యమంగా మాత్రమే చూడటం లేదు. దాన్ని ప్రజల చేతనలో అవిభాజ్య భాగంగా మార్చేందుకు చర్యలు చేపడుతోంది. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం వంటి చర్యలు అందులో భాగమే’’ అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఎమర్జెన్సీ అంశాన్ని చొప్పించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ ఎమర్జెన్సీపై తరచూ విమర్శలు చేస్తూ వస్తోంది.ప్రధాని మోదీ జూన్ 24న మాట్లాడుతూ ఎమర్జెన్సీని దేశ పార్లమెంటరీ చరిత్రలో చెరగని మచ్చగా అభివ రి్ణంచారు. ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ కూడా బుధవారం గాజియాబాద్‌లో ఒక కార్యక్రమంలో ఎమర్జెన్సీపై విమర్శలు గుప్పించారు. ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నికవుతూనే ఎమర్జెన్సీని నిరసిస్తూ లోక్‌సభలో ఏకంగా తీర్మానమే చేసి రాజకీయ దుమారానికి తెర తీశారు.పరీక్షల విధానంలో సంస్కరణలున్యూఢిల్లీ: ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు ముర్ము గుర్రపు బగ్గీలో సంప్రదాయ రీతిలో పార్లమెంటు ప్రాంగణానికి చేరుకున్నారు. గజ ద్వారం వద్ద ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముర్ము తన ప్రసంగంలో మోదీ 3.0 ప్రభుత్వ ప్రాథమ్యాలను ఒక్కొక్కటిగా వివరించారు. ‘‘ప్రపంచంలోనే అతి పెద్ద సార్వత్రిక ఎన్నికల విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఇవ్వడం ద్వారా దేశ ప్రజలు వరుసగా మూడోసారి సుస్థిరతకే పట్టం కట్టారు’’ అన్నారు.‘‘లోక్‌సభ సభ్యులుగా మీరంతా ప్రజల నమ్మకం చూరగొని నెగ్గారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా’’ అన్నారు. భారత్ తీసుకోబోయే ప్రతి నిర్ణయాన్ని ప్రపంచమంతా వేయి కళ్లతో గమనిస్తోందన్న విషయాన్ని సభ్యులు గుర్తెరగాలన్నారు. పరీక్ష పేపర్ల లీకేజీపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. దీనిపై పారీ్టలకు అతీతంగా దేశవ్యాప్తంగా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.‘‘ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయత చాలా ముఖ్యం. ఈ దిశగా పరీక్షల విధానంలోనే సమూల సంస్కరణలకు కేంద్రం సిద్ధమవుతోంది’’ అని చెప్పారు. ఐఐటీ, ఐఐఎంలను బలోపేతం చేసి వాటిల్లో సీట్లను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా విపక్ష సభ్యులంతా ‘నీట్, నీట్’ అంటూ జోరుగా నినాదాలు చేశారు. పలు ఇతర అంశాలపై రాష్ట్రపతి వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే...⇒ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బ తీసేందుకు జరుగుతున్న ప్రతి ప్రయత్నాన్నీ ఐక్యంగా తిప్పికొట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఈవీఎంలు సుప్రీంకోర్టు నుంచి ప్రజా కోర్టు దాకా అన్ని పరీక్షల్లోనూ నెగ్గి విశ్వసనీయతను నిరూపించుకున్నాయి. ⇒ కొన్నాళ్లుగా భారత్ అనుసరిస్తున్న సమర్థమైన విదేశీ విధానం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి అంతర్జాతీయ సమస్యపైనా తక్షణం స్పందిస్తూ క్రమంగా విశ్వబంధుగా పరిణతి చెందుతోంది. భారత్–మధ్య ప్రాచ్యం–యూరప్ ఆర్థిక కారిడార్ 21వ శతాబ్దంలో అతి పెద్ద గేమ్ చేంజర్‌గా మారనుంది. ⇒ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం వేరు. పార్లమెంటు కార్యకలాపాలను ఆటంకపరచడం వేరు. ఇది పూర్తిగా తప్పుడు చర్య. పార్లమెంటు సజావుగా సాగినప్పుడే ప్రజా సమస్యలపై ఆరోగ్యకరమైన చర్చలు సాధ్యమని అన్ని పారీ్టలూ గుర్తుంచుకోవాలి. ⇒ కశ్మీర్ లోయలో ఈసారి రికార్డు స్థాయి పోలింగ్ జరిగింది. తద్వారా శత్రు దేశాలకు కశ్మీరీ ప్రజలు దిమ్మతిరిగే జవాబిచ్చారు. ఆరి్టకల్ 370 రద్దుతో రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమల్లోకి వచి్చన తర్వాత కశ్మీర్లో పరిస్థితులు ఎంతగానో మెరుగుపడుతున్నాయి. ⇒ మౌలికాభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేస్తోంది. దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు దిశల్లో బులెట్ ట్రైన్ కారిడార్ల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోంది. ⇒ తప్పుడు సమాచార వ్యాప్తి ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు విభజన శక్తులు దీన్ని ఆయుధంగా వాడుతున్నాయి. ఈ బెడద నివారణకు కొత్త మార్గాలు వెదకాల్సిన అవసరం చాలా ఉంది. ⇒ దేశ విభజనతో సర్వం కోల్పోయిన వారు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు పౌరసత్వ సవరణ చట్టం దోహదపడుతుంది. ⇒ శిక్షించడమే ప్రధానోద్దేశంగా రూపొందిన బ్రిటిష్ వలస పాలన నాటి శిక్షా స్మృతులు స్వాతంత్య్రం వచ్చాక కూడా ఏడు దశాబ్దాల పాటు కొనసాగడం దారుణం. న్యాయం శిక్షగా మారకూడదన్నదే లక్ష్యంగా, భారతీయతే మూలమంత్రంగా నూతన నేర న్యాయ చట్టాల రూపకల్పన జరిగింది. జూలై 1 నుంచి అవి ప్రజలకు సరైన న్యాయాన్ని సత్వరంగా అందించనున్నాయి. ⇒ అభివృద్ధితో పాటు దేశ ఘన వారసత్వానికీ మోదీ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇవ్వనుంది. మహిళల సారథ్యంలో అభివృద్ధికి కట్టుబడి ఉంది. చట్టసభల్లో వారికి 33 శాతం రిజర్వేషన్ల వంటి నిర్ణయాలు ఈ దిశగా ముందడుగులు. ⇒ రక్షణ రంగంలో భారీ సంస్కరణలు మరింత వేగంతో కొనసాగుతాయి. పదేళ్లలో రక్షణ ఎగుమతులు 18 రెట్లు పెరిగాయి. అదే సమయంలో గతేడాది మన రక్షణ కొనుగోళ్లలో 70 శాతం స్వదేశీ సంస్థల నుంచే జరిగింది! ఈ రంగంలో మేకిన్ ఇండియాకు ప్రాధాన్యం పెరగనుంది. ⇒ సుపరిపాలనకు ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. పలు ప్రభుత్వోద్యోగాల నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూల రద్దు, స్వీయ ధ్రువీకరణ వంటి నిర్ణయాలు ఇందుకు ఉదాహరణలు. ⇒ సంస్కరణల పథాన్ని వేగవంతం చేసే దిశగా వచ్చే బడ్జెట్లో చరిత్రాత్మక చర్యలుంటాయి. -
పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు అయింది. జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ సమావేశాల్లో నూతన ఎంపీల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం ఉంటాయి. అదే విధంగా రాజ్యసభ సమావేశాలు జూన్ 27 నుంచి జూలై 3 వరకు జరుగుతాయి.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్‌సభ, రాజ్యసభలను ఉద్దేశించి జూన్ 27న ప్రసంగించనున్నారు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో చేసే పాలన గురించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తగా ఎన్నికైన కేంద్ర మంత్రులను పార్లమెంట్‌కు పరిచయం చేయనున్నారు. -
Parliament Special Sessions:సమావేశాలకు ముందు ప్రధాని ప్రసంగం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ప్రారంభానికి ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భాంగా ప్రధాని చంద్రయాన్-3, జీ20 సదస్సు విజయాలను ప్రస్తుతిస్తూ భారతదేశం సత్తా ఏంటో ప్రపంచానికి నిరూపించమని అన్నారు. ఎంతో సాధించాం.. ఐదు రోజుల పాటు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో తొలి రోజు సెషన్ ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా భారత దేశం సాధించిన అనేక విజయాల గురించి ఆయన ప్రస్తావించారు. ప్రధాని మాట్లాడుతూ.. భారతదేశం ఇప్పుడు అన్ని అంశాల్లో దూసుకెళ్తోంది. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. జీ20 సమావేశాలను అత్యంత విజయవంతంగా నిర్వహించుకున్నాం. భారత దేశం సత్తా ఏంటో ప్రపంచానికి నిరూపించాం. సకల వసతులతో యశోభూమిని నిర్మించుకున్నామని ప్రపంచ దేశాలన్నీ మనవైపే చూస్తున్నాయని అన్నారు. #WATCH | Prime Minister Narendra Modi says "...India will always be proud that we became the voice of the Global South during the G20 Summit and that the African Union became a permanent member of the G20. All this is a signal of India's bright future. 'YashoBhoomi' an… pic.twitter.com/UXhtqEZ0GJ — ANI (@ANI) September 18, 2023 ప్రత్యేకమైన సెషన్లు.. ఈ పార్లమెంటు సమావేశాలకు సమయం చాలా తక్కువగా ఉన్నప్పటికీ సమయానుకూలంగా చూస్తే అది చాలా పెద్దదనే చెప్పాలి. ఇక ఈ సెషన్ గురించి చెప్పాలంటే ఇది చారిత్రక నిర్ణయాలకు వేదిక కానున్న సెషన్. ఈ సెషన్ ప్రత్యేకత ఏమిటంటే. 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్తానం కొత్త గమ్యం నుంచి మొదలవుతోంది. ఇప్పుడు సరికొత్త ప్రదేశం నుంచి మన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. భారత దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుబోయే నిర్ణయాలన్నీ కొత్త పార్లమెంటు భవనంలోనే నిర్ణయించబడతాయని అన్నారు. #WATCH | PM Narendra Modi says, "...This session of the Parliament is short but going by the time, it is huge. This is a session of historic decisions. A speciality of this session is that the journey of 75 years is starting from a new destination...Now, while taking forward the… pic.twitter.com/suOuM2pnyH — ANI (@ANI) September 18, 2023 మాపై ఏడవచ్చు.. ఇది సెషన్‌కు తక్కువ సమయం ఉన్నందున సెషన్ ఉత్సాహంగానూ ఫలప్రదంగానూ కొనసాగడానికి అనుకూల వాతావరణాన్ని కలిగించాలని వారి ఎంపీలు గరిష్ట సమయాన్ని దేనికి కేటాయించాలని కోరుతున్నానన్నారు. (రోనే ధోనే కే లియే బహుత్ సమయ హోతా హై, కర్తే రహియే) మాపై ఏడవటానికి, మమ్మల్ని ప్రశ్నించడానికి చాల సమయం ఉంటుంది మీరు ఆ పనే చేయండని అన్నారు. జీవితంలో కొన్ని క్షణాలు మనలో ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని నింపుతాయి. నేను ఈ చిన్న సెషన్‌నలో అలాంటి సందర్భాలను ఆశిస్తున్నాను అన్నారు. #WATCH | Special Session of Parliament | PM Narendra Modi says, "This is a short session. Their (MPs) maximum time should be devoted (to the Session) in an environment of enthusiasm and excitement. Rone dhone ke liye bahut samay hota hai, karte rahiye. There are a few moments in… pic.twitter.com/eLEy9GOmV4 — ANI (@ANI) September 18, 2023 రేపే కొత్త భవనంలోకి.. రేపు వినాయక చవితి సందర్బంగా మనం కొత్త పార్లమెంటుకు వెళ్ళబోతున్నాము. గణేశుడిని 'విఘ్నహర్త' అని కూడా అంటారు అంటే విఘ్నాలను హరించే వాడని అర్ధం.. ఇప్పుడు దేశాభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండవని.. ఎటువంటి విఘ్నాలు లేకుండా భారతదేశం స్వప్నాలన్నిటినీ సాకారం చేసుకుంటుందని (నిర్విఘ్న రూప్ సే సారే సప్నే సారే సంకల్ప్ భారత్ పరిపూర్ణ్ కరేగా) ఈ పార్లమెంట్ సమావేశాలకు సమయం తక్కువగా ఉన్నప్పటికీ చారిత్రాత్మకంగా నిలవనున్నాయని అన్నారు. #WATCH | Prime Minister Narendra Modi says "Tomorrow, on Ganesh Chaturthi, we will move to the new Parliament. Lord Ganesha is also known as ‘Vighnaharta’, now there will be no obstacles in the development of the country... 'Nirvighna roop se saare sapne saare sankalp Bharat… pic.twitter.com/P2DZmG3SRF — ANI (@ANI) September 18, 2023 అంతటా ఆసక్తి.. తొలిరోజు పార్లమెంట్ సమావేశాలు పాత పార్లమెంట్ భవనంలోనే జరగనుండగా రెండో రోజునుంచి మాత్రం ప్రత్యేక సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో జరుగుతాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జరిగబోయే ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశాల్లో మోదీ ప్రభుత్వం ఏవైనా అనూహ్య నిర్ణయాలను తీసుకోనుందా అన్న అనుమానాలు అంతటా వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా చదవండి: దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇలా.. -
పార్లమెంట్ సమావేశాలు: సింగరేణి బొగ్గు గనుల వేలంపై రగడ
03:400PM సింగరేణి బొగ్గు గనుల వేలంపై పార్లమెంటులో రగడ మొదలైంది. ప్రైవేటీకరణ ఆపాలని టీఆర్ఎస్ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన చేపట్టారు. సింగరేణిలో కేంద్రం వాటాను బీజేపీ అమ్మేస్తుందని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కొంటామని అడిగినా.. తమ ప్రతిపాదనను కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సింగరేణిని ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రైవేటుపరం చేయొద్దని డిమాండ్ చేశారు. తెలంగాణ ఎంపీల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. సింగరేణి సంస్థలో కేంద్రం, తెలంగాణ ఉమ్మడి ఓనర్షిప్ ఉందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి 51 శౠతం ఓనర్ షిప్ ఉందన్నారు. ఆక్షన్ మొదలైనప్పటి నుంచి ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, పారదర్శకంగా ఆక్షన్ వేస్తున్నానమని పేర్కొన్నారు. దీనికి అంగీకరిస్తే తెలంగాణ సర్కార్‌కు కూడా ప్రయోజనం ఉంటుందన్నారు. అన్ని రాష్టట్రాల ప్రభుత్వాలు కూడా తమకు సహకరిస్తున్నాయని, ఆక్షన్ ద్వారా వచ్చే రెవెన్యూ అంతా రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తుందన్నారు. 03:00PM పార్లమెంట్‌లోని విపక్ష పార్టీల అధికారాల్ని కేంద్రం లాగేసుకుంటోందని పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ ఆరోపించారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభలోని స్థాయి సంఘం చైర్మెన్ పదవులను విపక్షాల నుంచి ప్రభుత్వం లాక్కుంటోందని అన్నారు. తమ వద్ద ఉన్న ఐటీ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ పదవిని ప్రభుత్వం గుంజుకున్నట్లు అధిర్ ఆరోపించారు. పార్లమెంట్లో విపక్షాలకు ఎటువంటి అధికారం దక్కకుండా చూస్తున్నారని అధిర్ విమర్శించారు. అక్టోబరులో క్యాబినెట్ ఆమోదించిన మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లుపై గల సమస్యను కూడా అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభలో లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ భూభాగాన్ని ఆక్రమిస్తోందని ఆరోపించారు. అందుకే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని. ఇది స్వయంప్రతిపత్తి, బహుళ-రాష్ట్ర సహకార సంఘాల పనితీరుపై ప్రభావం చూపుతుందని తెలిపారు. #WATCH | Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury raises the issue of denying parliamentary standing committee chairmanships to Opposition parties in Lok Sabha. (Video: Sansad TV) pic.twitter.com/pmiNMxI33F — ANI (@ANI) December 7, 2022 02:00PM ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే లోక్‌సభలో మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాద సమస్యను లేవనెత్తారు. “కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మహారాష్ట్రకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్రను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. కర్ణాటకలో మహారాష్ట్ర ప్రజలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీయే అధికారంలో ఉందని, మహారాష్ట్రపై కర్ణాటక చేస్తున్న దాడిని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. 12:50PM లోక్‌సభ తిరిగి ప్రారంభమైన క్రమంలో జీరో అవర్‌లో అత్యవసర ప్రజా సమస్యలపై చర్చ చేపట్టారు సభ్యులు. అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. మరోవైపు.. రాజ్యసభలో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌కు అభినందనల తీర్మానంపై మాట్లాడుతున్నారు. 11:20AM సూపర్‌స్టార్‌కు సంతాపం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మృతిపట్ల లోక్‌సభ సంతాపం తెలిపింది. సంతాప సందేశం చదివిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు స్పీకర్. Lok Sabha adjourned till 12 pm after the reading of the obituaries, on the first day of the Winter Session of Parliament. pic.twitter.com/xit1eInltC — ANI (@ANI) December 7, 2022 ఉపరాష్ట్రపతికి శుభాకాంక్షలు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాజ్యసభ ఛైర్మన్‌గా విధులు స్వీకరించిన జగదీప్ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ఒక రైతు బిడ్డ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి అయ్యారని కొనియాడారు. ఆయన సైనిక్ పాఠశాలలో చదువుకున్నారని, దీంతో అటు సైనికులకు, ఇటు రైతులకు వారధిగా మారారన్నారు. 11:00AM పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలిసారి ఎంపీగా బాధ్యతలు చేపట్టిన వారికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని సభ్యులను కోరారు ప్రధాని మోదీ. Winter Session of the Parliament commences, visuals from the Lok Sabha. pic.twitter.com/UWPiLslA8t — ANI (@ANI) December 7, 2022 అన్ని పార్టీలు చర్చకు విలువనిస్తాయని విశ్వసిస్తున్నా: మోదీ పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభంపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ఏడాది ఆగస్టు 15, 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొన్న తర్వాత తొలిసారి భేటీ అవుతున్నామని గుర్తు చేశారు. అలాగే.. జీ20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశం లభించిన క్రమంలో జరుగుతున్న సమావేశాలని పేర్కొన్నారు. ‘గ్లోబల్ కమ్యూనిటీలో భారతదేశం చోటు సంపాదించిన తీరు, భారత్‌తో అంచనాలు పెరిగిన తీరు, గ్లోబల్ ప్లాట్ఫామ్లో భారతదేశం తన భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్న విధానం ఎంతో గొప్పగా ఉంది. ఇలాంటి సమయంలో భారతదేశం G20 ప్రెసిడెన్సీని అందుకోవడం చాలా గొప్ప అవకాశం. జీ20 సమ్మిట్ అనేది దౌత్యపరమైన కార్యక్రమం కాదు. ప్రపంచం ముందు భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు వచ్చిన సువర్ణావకాశం. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కృషి చేయాలి. అన్ని పార్టీలు చర్చలకు విలువ ఇస్తాయని విశ్వసిస్తున్నాను.’ అని పేర్కొన్నారు ప్రధాని మోదీ. ► సంస్మరణ ప్రకటన తర్వాత లోక్‌సభ గంటపాటు వాయిదా పడనుంది. అయితే.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ మాత్రం సమాజ్‌వాదీ వ్యవస్థాపకుడు ములాయం సంస్మరణార్థం ఒక పూట వాయిదా వేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ► పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 2022 మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ► పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్లో విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. పార్లమెంట్ సమావేశాల్లో అవలంభించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో టీఎంసీ సైతం పాల్గొంది. ► ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్‌పై సైబర్ దాడి జరిగిన ఘటనపై చర్చించాలని లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు కాంగ్రెస్ ఎంపీ మానికం ఠాగూర్. ► విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభలో ప్రసంగించనున్నారు. ► దేశవ్యాప్తంగా నిరుద్యోగం, చైనాతో సరిహద్దు వివాదం, ఎగసిన ధరలు, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి ప్రధాన సమస్యలపై ప్రభుత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా నిలదీసేందుకు ప్రతిపక్షాలు సంసిద్ధమవుతున్నాయి. ► 29వ తేదీ వరకు అంటే 23 రోజుల్లో 17 సిట్టింగ్‌లలో ఈసారి సెషన్ కొనసాగనుంది. ► ఈసారి సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ► పార్లమెంట్ సమావేశాలు మొదలైన మరుసటి రోజే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండటంతో ఆ ఫలితాల ప్రభావం ఈ సమావేశాలపై పడనుంది. ► అయితే.. గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్లలో బిజెపి తిరిగే అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలతో బీజేపీ ఉత్సాహంగా ఉంది. ► పెరుగుతున్న ధరలు, పడిపోతున్న రూపాయి విలువ, పడిపోయిన ఎగుమతులు పెరుగుతున్న జీఎస్టీ పనులు తదితర అంశాలపై చర్చించాలని విపక్షాల డిమాండ్ ► దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై చర్చ జరపాలని టీఆర్ఎస్ పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది. విపక్షాలతో కలిసి అంశాలపై పోరాడతామని టీఆర్ఎస్ ఎంపీలు చెప్తున్నారు. ► ఇక ఏపీ విభజన అంశాల అమలు తమ ప్రధాన ఎజెండా అని ప్రకటించించింది ఏపీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీసే లక్ష్యంతో కాంగ్రెస్ చైనా సరిహద్దు వెంట పరిస్థితులు, కేంద్ర ఎన్నికల సంఘంలో ఆకస్మిక నియామకాలు, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, పైపైకి పోతున్న ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కీలక సమస్యలపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. భారత్ జోడోయాత్రలో ఉన్న రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలలో పాల్గొనే అవకాశం లేదని వెల్లడించింది ఆ పార్టీ. ఈసారి 16 బిల్లులు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభంకాగానే ఇటీవల మరణించిన సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్, నటుడు ఘట్టమనేని కృష్ణ, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు తదితరులకు ఉభయ సభలు సంతాపం తెలపనున్నాయి. ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం యోచిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు రిజర్వ్చేయాలంటూ రూపొందించిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం కోసం అఖిలపక్ష భేటీ నిర్వహించాలని బంధోపాధ్యాయ్ కోరారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో జరిగిన భేటీలో బంధోపాధ్యాయ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఏపీ విభజన అంశాలే ప్రధాన ఎజెండా: వైఎస్ఆర్సీపీ పెరుగుతున్న ధరలు, పడిపోతున్న రూపాయి విలువ, పడిపోయిన ఎగుమతులు, పెరుగుతున్న జీఎస్టీ పన్నులు తదితర అంశాలపై చర్చించాలని విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై చర్చ జరపాలని, విపక్షాలతో కలిసి అన్ని అంశాలపై పోరాడతామని తెలిపారు టీఆర్ఎస్ ఎంపీలు. మరోవైపు.. ఏపీ విభజన అంశాల అమలు తమ ప్రధాన ఎజెండా అని ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదీ చదవండి: మళ్లీ సరిహద్దు రగడ -
Parliament First day: ఏపీ ఇన్ పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ: ఖాతాదారుల లాకర్ల విషయంలో బ్యాంకులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ కారద్ చెప్పారు. లోక్‌సభలో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది జనవరి నుంచి ఆర్బీఐ మార్గదర్శకాలు విడుదల చేసిందని తెలిపారు. అగ్నిప్రమాదం, దొంగతనం, దోపిడీ, భవనం కూలిపోవడం, బ్యాంకు ఉద్యోగుల మోసం తదితర అంశాల్లో లాకరు వార్షిక అద్దెకు వందరెట్లను ఖాతాదారుకు బ్యాంకులు చెల్లించాలనే నిబంధన ఆర్బీఐ చేర్చిందని చెప్పారు. ఏపీ రిసోర్సు గ్యాప్ రూ.4,117.89 కోట్లు చెల్లించాం రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 వరకు ఆంధ్రప్రదేశ్‌కు రిసోర్స్ గ్యాప్ రూ.4,117.89 కోట్లు మాత్రమేనని, ఆ మొత్తాన్ని విడుదల చేశామని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌధరి చెప్పారు. 2014–15లో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెఫిసిట్ రూ.22,949 కోట్లు ఉందా అని వైఎస్సార్సీపీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప అడిగిన ప్రశ్నకు మంత్రి కాదని జవాబిచ్చారు. 2014–15లో 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 వరకు రెవెన్యూ లోటు రూ.16,079 కోట్లు అని ఆంధ్రప్రదేశ్ తెలిపిందని చెప్పారు. 2014–15 ఏపీ, తెలంగాణల అకౌంటెంట్ జనరల్ ప్రచురించిన స్టేట్ ఫైనాన్స్ అకౌంట్స్‌లో ఆ కాలానికి రెవెన్యూలోటు రూ.13,775.76 కోట్లని తెలిపారు. నీతి ఆయోగ్ వాస్తవ అంచనా ప్రకారం కొత్త పథకాలపై వ్యయం, నెలవారీ పింఛను పెంపు ప్రభావంతో రూ.11,960.87 కోట్లు అనుమతించలేదన్నారు. 2013–14కి సంబంధించిన బకాయిలు రూ.91.27 కోట్లను 2014–15 రిసోర్సు గ్యాప్‌లో చేర్చినట్లు తెలిపారు. ఈ మేరకు 2014–15లో పేర్కొన్న కాలానికి రిసోర్సు గ్యాప్ రూ.4,117.89 కోట్లుగా తేలిందని, ఆమొత్తాన్ని రాష్ట్రానికి విడుదల చేశామని చెప్పారు. అనంతరం ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు డిస్కంలకు ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ బాండ్స్ నిమిత్తం రూ.1,500 కోట్లను ఈ ఏడాది మార్చి 21న విడుదల చేసినట్లు తెలిపారు. 7 పాలిటెక్నిక్ కళాశాలలు ఆంధ్రప్రదేశ్‌లో 2017–18 నుంచి 2021–22 మధ్య ఏడు పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నకు కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ జవాబిచ్చారు. ఏనుగుల కదలికల గుర్తింపునకు డ్రోన్లు ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల కదలికలు గుర్తించేందుకు డ్రోన్లు వినియోగించడానికి ప్రాజెక్టు ఎలిఫెంట్ కేంద్ర ప్రాయోజిత పథకం అమలు చేస్తున్నట్లు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ చౌబే చెప్పారు. 2020–21లో రూ.4 లక్షలు, 2021–22లో రూ.3.5 లక్షలు డ్రోన్లు కొనుగోలుకు విడుదల చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ చింతా అనూరాధ ప్రశ్నకు జవాబిచ్చారు. ఈ–శ్రమ్ పోర్టల్‌లో 2.76 కోట్లమంది డొమెస్టిక్ వర్కర్లు నమోదు ఈ–శ్రమ్ పోర్టల్‌లో దేశవ్యాప్తంగా 2.76 కోట్లమంది డొమెస్టిక్ వర్కర్లు నమోదు చేసుకున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిళ్ల గురుమూర్తి ప్రశ్నకు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి సమాధానమిచ్చారు. 33 శాతం సంస్థలు సీఎస్ఆర్ నిధులు ఖర్చు ఆంధ్రప్రదేశ్‌లో 33 శాతం సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులు ఖర్చుచేసినట్లు సీఎస్ఆర్ డాటా విశ్లేషణలో తేలిందని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలు బి.వి.సత్యవతి, లావు శ్రీకృష్ణదేవరాయలు, బెల్లాన చంద్రశేఖర్, గొడ్డేటి మాధవి, మద్దిళ్ల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 2019–20లో రూ.710 కోట్లు, 2020–21లో రూ.662 కోట్లను సంస్థలు ఖర్చు చేశాయని చెప్పారు. మూలధన వ్యయం నిమిత్తం ఏపీకి సాయం మూలధన వ్యయం నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు 2021–22లో రూ.501 కోట్లు, 2020–21లో రూ.688 కోట్లు ప్రత్యేక సాయంగా ఇచ్చినట్లు వైఎస్సార్సీపీ సభ్యులు మిథున్‌రెడ్డి, బి.వి.సత్యవతి, గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి తెలిపారు. పెరుగుతున్న కార్మికుల సంఖ్య అందుబాటులో ఉన్న డాటా ప్రకారం పదేళ్లుగా దేశంలో కార్మికుల సంఖ్య పెరుగుతోందని వైఎస్సార్సీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మికశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సమాధానమిచ్చారు. వెనకబడిన జిల్లాలకు రూ.1,750 కోట్లు విడుదల ఏపీ విభజన చట్టాన్ని అనుసరించి నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని ఏడు జిల్లాలకు రూ.1,750 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి చెప్పారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,049.34 కోట్లకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు పంపినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు వంగా గీతావిశ్వనాథ్, పి.వి.మిథున్‌రెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు. 2022–23లో కేజీబీవీల కేటాయింపు లేదు ఆంధ్రప్రదేశ్‌కు 2022–23లో కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలను కేటాయించలేదని వైఎస్సార్సీపీ ఎంపీలు బి.వి.సత్యవతి, పోచ బ్రహ్మానందరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి అన్నపూర్ణాదేవి సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 499 కేజీబీవీలు ఉన్నాయని తెలిపారు. ఏపీ విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ ప్రాధాన్యం ఉన్న పలు విద్యాసంస్థలు ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఐఐటీ–తిరుపతి, ఎన్ఐటీ–తాడేపల్లిగూడెం, ఐఐఎం–విశాఖపట్నం, ఐసెర్–తిరుపతి, కేంద్రీయ విశ్వవిద్యాలయం–అనంతపురం, పెట్రోలియం యూనివర్సిటీ–విశాఖపట్నం, వ్యవసాయ వర్సిటీ–గుంటూరు ఇప్పటికే కొనసాగుతున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, పోచ బ్రహ్మానందరెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు. ఏపీ నుంచి నాబార్డుకు ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ రహదారుల అభివృద్ధి నిమిత్తం 2021–22, 2022–23ల్లో నాబార్డుకు ప్రతిపాదనలు వచ్చాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కారద్ తెలిపారు. 2021–22లో గుంటూరు, అనంతపురం జిల్లాల్లోని ఆరు రహదారులు ప్రతిపాదించగా రెండు రహదారులకు అనుమతి రాలేదని, 2022–23లో గుంటూరు జిల్లాలోని రహదారి ప్రతిపాదనలు కార్యాచరణ దశలో ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎంపీలు బాలశౌరి, మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఏపీలో యువకళాకారులకు ఉపకారవేతనాలు ఆంధ్రప్రదేశ్‌లో వివిధ సాంస్కృతిక రంగాల్లోని యువ కళాకారులకు ‘స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్, ఫెలోషిప్‌తోపాటు స్కాలర్షిప్–ఫెలోషిప్ పథకం ద్వారా బడ్జెట్ కేటాయిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. 2019–20, 2020–21, 2021–22ల్లో రూ.55 కోట్లు కేటాయించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, గొడ్డేటి మాధవి, గోరంట్ల మాధవ్ ప్రశ్నకు జవాబిచ్చారు. ఏపీలో 48 ఎస్‌హెచ్ఐలు వొకేషనల్ విద్యలో శిక్షణ నిమిత్తం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 48 స్కిల్ హబ్స్ ఇనిషియేటివ్ (ఎస్హెచ్ఐ)లు ఏర్పాటు చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిళ్ల గురుమూర్తి ప్రశ్నకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమాధానమిచ్చారు. ఇదీ చదవండి: లక్షల కుటుంబాలకు న్యాయం జరగాలంటే.. మనం మళ్లీ రావాలి -
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు: ఉభయ సభలు వాయిదా.. కుదిపేసిన రైతుల అంశం
Live Updates: Time 2:20 PM ►కుదిపేసిన రైతుల అంశం.. ఉభయ సభలు వాయిదా Time 2:17 PM ►సాగుచట్టాల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం Time 2:15 PM ► వాయిదా తర్వాత ప్రారంభమైన రాజ్యసభ ►సాగుచట్టాల రద్దు బిల్లుకు మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదం. Time 2:01 PM ►వాయిదా అనంతరం లోక్‌సభ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైంది. సాగు చట్టాల బిల్లు పై చర్చ తప్పనిసరేనని కాంగ్రెస్ ఆందోళనకు దిగడంతో సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. ►విపక్షాల ఆందోళన నడుమ కొనసాగని పార్లమెంట్ సమావేశాలు, మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉభయ సభలు వాయిదా. ఎంఎస్పీ బిల్లు కోసం పోరాడుతాం: రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ ►సాగుచట్టాల రద్దు బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినంత మాత్రన ఆందోళనలపై వెనక్కు తగ్గేది లేదని రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ తేల్చి చెప్పారు. డిసెంబర్ 4 జరిగే సమావేశం తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఎంఎస్పీ బిల్లు కోసం పోరాటం సాగుతుందన్నారు. Time 12:28 PM ► మధ్యాహ్నం రెండింటి వరకు రాజ్యసభ వాయిదా రాజ్యసభలోనూ రద్దు బిల్లుపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ఎంఎస్పీకి చట్టబద్ధత, సాగుచట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో చనిపోయిన రైతులకు పరిహారం, తెలంగాణలో వరి కొనుగోళ్లపై స్పష్టత సహా పలు అంశాలపై విపక్ష ఎంపీలు చర్చకు డిమాండ్ చేశాయి. ఛైర్మన్ వెంకయ్యనాయుడు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసనకు దిగాయి. క్వశ్చన్ అవర్‌లో గందరగోళం సృష్టిస్తున్న విపక్ష ఎంపీల తీరుపై ఛైర్మన్ వెంకయ్య సీరియస్ అయ్యారు. సభను 2 గంటలవరకూ వాయిదా వేశారు. Time 12:24 PM ► వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ Time 12:18 PM ► మధ్యాహ్నం రెండింటి వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ ఓం బిర్లా ► వాయిదా అనంతరం కూడా విపక్షాల ఆందోళన కొనసాగడంతో రెండో సారి ప్రారంభమైన 5 నిమిషాల్లోనే లోక్‌సభ మళ్లీ వాయిదా. ► సాగుచట్టాల రద్దు బిల్లుకు మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదం. Time 12:05 PM ► వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్‌సభ ► లోక్‌సభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన ఉభయ సభలు గంట పాటు వాయిదా Time 11:20 AM ►ఇటీవల మృతి చెందిన పలువురు సభ్యులకు రాజ్యసభలో నివాళులు. అనంతరం సిట్టింగ్ ఎంపీ ఆస్కార్ ఫెర్నాండేజ్ మృతికి సంతాపంగా రాజ్యసభను చైర్మన్ వెంకయ్య నాయుడు గంట వాయిదా వేశారు. Time 11:10 AM..విపక్షాల ఆందోళణ.. లోక్‌సభ గంట వాయిదా ►ప్రశ్నోత్తరాలను రద్దు చేయాలని విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో స్పీకర్ ఓంబిర్లా లోక్‌సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. Time 11:03 AM.. ► లోక్‌సభలో.. కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం ఇటీవల మరణించిన ప్రస్తుత, మాజీ ఎంపీలకు లోక్‌సభ సంతాపం తెలిపింది. తర్వాత ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు స్పీకర్ ఓంబిర్లా ప్రయత్నించగా.. వివిధ అంశాలపై చర్చ చేపట్టాలంటూ విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. సాగుచట్టాల రద్దుపై చర్చించాలంటూ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. Time 11.00 AM పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. Time 10.55 AM ►శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ పార్లమెంట్‌కు చేరుకున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఫలప్రదంగా సాగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. కేంద్రం అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉందని... సభ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. Time 10.50 AM ►సాగు చట్టాలను రద్దు చేయడంతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. గాంధీ విగ్రహం జరిగిన ఈ నిరసనలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రైతు సమస్యలపై చర్చించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. భంగం వాటిల్లకుండా చూసుకోవాలని ఎంపీలకు సూచించారు. ►పెగసస్ వ్యవహారం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, చైనా చొరబాట్లపై సభలో చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. బంగాల్ సహా పలు రాష్ట్రాల్లో సరిహద్దు భద్రతా దళం నియంత్రణ పరిధిని పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. వీటిపై పార్లమెంట్లో వాడీవేడీ చర్చ జరిగే అవకాశం ఉంది. కాగా సాగు చట్టాల రద్దు బిల్లు కాకుండా మరో 25 ముసాయిదా చట్టాలను పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది కేంద్రం. ప్రైవేటు క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధించే బిల్లుతో పాటు, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతన సవరణ బిల్లు 2021, దివాలా రెండో సవరణ బిల్లు, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ సవరణ బిల్లు, 1983 నాటి ఇమ్మిగ్రేషన్ చట్టం స్థానంలో 2021 ఇమ్మిగ్రేషన్ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు 2021, మనుషుల అక్రమ రవాణా నిరోధక, రక్షణ, పునరావాస బిల్లులపై చర్చ జరుగనుంది. న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వివాదాస్పద మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును కేంద్రం ప్రభుత్వం తొలిరోజే లోక్‌సభలో ప్రవేశ పెట్టనుంది. బిల్లును సభ ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. సోమవారం తప్పనిసరిగా సభకు హాజరుకావాలని ఆదేశించాయి. పంటలకు కనీస మద్దతు ధర(ఎస్పీజీ)కు చట్టబద్ధతతోపాటు రైతాంగం డిమాండ్లు, సమస్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికాలంగా కొనసాగుతున్న పోరాటంలో 750 మందికిపైగా రైతులు మరణించారు. ఈ మేరకు ఒక సంతాప తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ నిర్ణయించింది. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23 కొనసాగుతాయి. సెలవులు పోగా ఈసారి పార్లమెంట్లో మొత్తం 19 సెషన్స్ (పనిదినాలు) ఉంటాయి. క్రిప్టోకరెన్సీలపై నిషేధం పార్లమెంట్ సమావేశాల్లో సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుతోపాటు మరో 25 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. క్రిప్టోకరెన్సీలపై నిషేధం బిల్లు కూడా వీటిలో ఉంది. ఆర్బీఐ ఆధ్వర్యంలో అధికారిక డిజిటల్ కరెన్సీని మాత్రమే ప్రభుత్వం అనుమతించనుంది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు–2019పై జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్(జేసీపీ) నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. పౌరుల వ్యక్తిగత సమాచారానికి రక్షణ కల్పించడంతోపాటు డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఏర్పాటు నిమిత్తం ఈ బిల్లును 2019లో ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతిపక్షాల సూచన మేరకు బిల్లును క్షుణ్నంగా పరిశీలించడానికి జేసీపీని ఏర్పాటు చేసింది. ప్రతిపాదిత డేటా ప్రొటెక్షన్ చట్టం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ తదితర కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు మినహాయింపు ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కీలక బిల్లులివే.. గతంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ల స్థానంలో నార్కోటిక్స్ డ్రగ్, సైకోటిక్ సబ్‌స్టాన్సెస్ బిల్లు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సవరణ) బిల్లు, ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్(సవరణ) బిల్లును ఈసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. సీవీసీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలం పొడిగింపునకు సంబంధించిన బిల్లులు ఇందులో ఉన్నాయి. రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీల జాబితా సవరణకు ఉద్దేశించిన ‘కానిస్టిట్యూషన్ (ఎస్సీలు, ఎస్టీలు) ఆర్డర్(సవరణ) బిల్లును సైతం ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ పనితీరుపై సుప్రీం వ్యాఖ్యలు ఆందోళనకరం పార్లమెంట్‌తోపాటు ఇతర చట్టసభల పనితీరు, చట్టాలను రూపొందిస్తున్న విధానం పట్ల ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. చట్టసభల హక్కులకు, మర్యాదలకు భంగం వాటిల్లకుండా, ఇతర రాజ్యాంగబద్ధ వ్యవస్థలు చట్టసభలపై ప్రతికూల వ్యాఖ్యలు చేయకుండా సభాపతులే(ప్రిసైడింగ్ ఆఫీసర్లు) తగిన చర్యలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడి దృష్టికి తీసుకొచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వెంకయ్య ఆదివారం తన నివాసంలో దాదాపు 40 పార్టీల నేతలతో సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై వారు వెలిబుచ్చిన అభిప్రాయాలను తెలుసుకున్నారు. ‘‘మీ ఆందోళనను అర్థం చేసుకోగలను. ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందో గమనించాలి. చట్టసభల్లో తరచూ అంతరాయాలు కలుగుతున్నాయి. సభ్యులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. చట్టసభల్లో మన ప్రవర్తన గౌరవంగా, హూందాగా ఉంటే ప్రజాబాహుళ్యం నుంచి ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు వినిపించవు’’ అని సూచించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 70 శాతం సమయం వృథా అయ్యిందని, శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని పలువురు నేతలు వెల్లడించారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు తరచుగా కలిసి మాట్లాడుకుంటే, పార్లమెంట్లో గొడవలకు ఆస్కారం ఉండదని వెంకయ్యlనాయుడు తెలిపారు. ‘ఎంఎస్పీ’పై చర్యలు తీసుకోవాలి అఖిలపక్ష సమావేశంలో 15 అంశాలను లేవనెత్తాం. రైతుల సమస్యలను ప్రస్తావించాం. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని విన్నవించాం. విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాం. ఎంఎస్పీకి చట్టబద్ధతపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పాం. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని విన్నవించాం. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపాం. పార్లమెంట్ 19 రోజులపాటే పనిచేయనుంది. అన్ని అంశాలపై చర్చించేందుకు సమయం సరిపోదు. లోక్‌సభ సక్రమంగా కొనసాగడానికి డిప్యూటీ స్పీకర్‌ను నియమించాలి. పార్లమెంట్లో మీడియాపై విధించిన ఆంక్షలను తొలగించాలి – మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ నేతలు మహిళా రిజర్వేషన్ బిల్లును చేపట్టాలి పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే తదితర పార్టీలు అఖిలపక్ష సమావేశంలో కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. పార్లమెంట్లో ఈ బిల్లుపై చర్చించాలని కోరాయి. విధాన నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలకు వారి వంతు భాగస్వామ్యం కల్పించాల్సిన సమయం వచ్చిందని సూచించారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు గత 15 ఏళ్లుగా మోక్షం లభించడం లేదు. చదవండి: భారత్‌లో ఒమిక్రాన్ ప్రకంపనలు.. అప్రమత్తమైన రాష్ట్రాలు -
లోక్‌సభలో ప్రమాణం చేయనున్న ఉపఎన్నికల్లో గెలిచిన ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అర్థవంతమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అన్ని పార్టీలు సహకరించాలని, ఈ సమావేశాలు సజావుగా సాగుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక ఇటీవల ఉపఎన్నికల్లో గెలిచిన కొత్త ఎంపీలు నేడు లోక్‌సభలో ప్రమాణం చేయనున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ తిరుపతి లోక్‌సభస్థానం నుంచి గెలిచిన వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి లోక్‌సభలో ప్రమాణం చేయనున్నారు. అనంతరం ఇటీవల ఎంపీకైన కొత్త మంత్రులను ప్రధాని నరేంద్ర మోదీ సభకు పరిచయం చేయనున్నారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎంపీలకు ఉభయ సభలు నివాళులర్పించనున్నాయి. తొలిరోజు(సోమవారం) లోక్‌సభలో 2 బిల్లులు.. ది ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ చట్టం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ ప్రెన్యూర్షిప్, మేనేజ్మెంట్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ సమావేశాలు ఉదయం 11గంటకు ప్రారంభమై సాయంత్రం 6గంటల వరకు కొనసాగుతాయి. నేటి నుంచి ఆగస్టు 13వరకూ నిర్వహించే వర్షాకాల సమావేశాల్లో మొత్తం 19సార్లు సభ సమావేశం అవుతుంది. -
త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వచ్చే నెలలో ప్రారంభంకానున్నాయి. జూలై 19 న ప్రారంభమై ఆగస్టు 13 తో ముగియనున్నాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ సెషన్ జరగనుంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సిఫారసు చేసింది. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలో కోవిడ్‌కు సంబంధించిన అన్ని ప్రోటోకాల్‌లు పాటిస్తారు. అలాగే సభ్యులంతా కనీసం ఒక మోతాదు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని భావిస్తున్నారు. సాధారణంగా పార్లమెంటు మాన్సూన్ సెషన్ జూలై మూడవ వారంలో ప్రారంభమవుతుంది. ఆగస్టు15 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ముగుస్తుంది. -
ఒకే ఒక్కడు: రాష్ట్రపతి ప్రసంగాన్ని అడ్డగించిన ఎంపీ
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు శుక్రవారం పార్లమెంట్లో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం చేయగా 18 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించగా మరికొన్ని పక్షాలు హాజరయ్యాయి. అయితే ఒకప్పుడు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పార్టీ మాత్రం నిరసన తెలిపింది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు గళమెత్తాడు. ప్లకార్డ్ ప్రదర్శించి రైతుల పోరాటానికి మద్దతు పలికాడు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోవడంతో ఎన్డీఏ నుంచి రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ బయటకు వచ్చింది. వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాడుతూ పార్లమెంట్లో కూడా ఆందోళన కొనసాగించింది. అందులో భాగంగా ఆ పార్టీకి చెందిన ఎంపీ హనుమాన్ బెనివాల్ రాష్ట్రపతి ప్రసంగం చేస్తున్న సమయంలో నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఈ సందర్భంగా సభలోనే డిమాండ్ చేశారు. సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సభలో ప్లకార్డు పట్టుకుని దిగిన ఫొటోలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ప్రతిపక్షాలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడంపై కేంద్ర మంత్రులు తప్పుపట్టారు. -
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం
న్యూఢిల్లీ: సోమవారం నాటి పార్లమెంటు ఉభయ సభల సమవేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సప్లిమెంటరీ గ్రాంట్స్ సవరణ బిల్లు-2015 ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. దేశంలోని వ్యవసాయ రంగపరిస్థితిపై చర్చ జరగనుంది. రాజ్యసభలో గనుల మరియు ఖనిజాల ఖనిజాలు (అభివృద్ధి, క్రమబద్ధీకరణ) సవరణ బిల్లు-2015, మోటార్ వాహనాల (సవరణ) బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు బిల్లులకు లోక్‌సభ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది.