Parliament Special Sessions:సమావేశాలకు ముందు ప్రధాని ప్రసంగం  | PM Modi Speech Before Parliament Special Sessions - Sakshi
Sakshi News home page

Parliament Special Sessions:పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని ప్రసంగం 

Published Mon, Sep 18 2023 11:06 AM | Last Updated on Mon, Sep 18 2023 12:01 PM

PM Mdi Speech Before Parliament Special Sessions - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ప్రారంభానికి ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భాంగా ప్రధాని చంద్రయాన్-3, జీ20 సదస్సు విజయాలను ప్రస్తుతిస్తూ భారతదేశం సత్తా ఏంటో ప్రపంచానికి నిరూపించమని అన్నారు. 

ఎంతో సాధించాం..
ఐదు రోజుల పాటు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో తొలి రోజు సెషన్ ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా  భారత దేశం సాధించిన అనేక విజయాల గురించి ఆయన ప్రస్తావించారు. ప్రధాని మాట్లాడుతూ.. భారతదేశం ఇప్పుడు అన్ని అంశాల్లో దూసుకెళ్తోంది. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. జీ20 సమావేశాలను అత్యంత విజయవంతంగా నిర్వహించుకున్నాం. భారత దేశం సత్తా ఏంటో ప్రపంచానికి నిరూపించాం. సకల వసతులతో యశోభూమిని నిర్మించుకున్నామని ప్రపంచ దేశాలన్నీ మనవైపే చూస్తున్నాయని అన్నారు. 

ప్రత్యేకమైన సెషన్లు.. 
ఈ పార్లమెంటు సమావేశాలకు సమయం చాలా తక్కువగా ఉన్నప్పటికీ సమయానుకూలంగా చూస్తే అది చాలా పెద్దదనే చెప్పాలి. ఇక ఈ సెషన్ గురించి చెప్పాలంటే ఇది చారిత్రక నిర్ణయాలకు వేదిక కానున్న సెషన్. ఈ సెషన్ ప్రత్యేకత ఏమిటంటే. 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్తానం కొత్త గమ్యం నుంచి మొదలవుతోంది. ఇప్పుడు సరికొత్త ప్రదేశం నుంచి మన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. భారత దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుబోయే నిర్ణయాలన్నీ కొత్త పార్లమెంటు భవనంలోనే నిర్ణయించబడతాయని అన్నారు. 

మాపై ఏడవచ్చు.. 
ఇది సెషన్‌కు తక్కువ సమయం ఉన్నందున సెషన్‌ ఉత్సాహంగానూ ఫలప్రదంగానూ కొనసాగడానికి అనుకూల వాతావరణాన్ని కలిగించాలని వారి ఎంపీలు గరిష్ట సమయాన్ని దేనికి కేటాయించాలని కోరుతున్నానన్నారు. (రోనే ధోనే కే లియే బహుత్ సమయ హోతా హై, కర్తే రహియే) మాపై ఏడవటానికి, మమ్మల్ని ప్రశ్నించడానికి చాల సమయం ఉంటుంది మీరు ఆ పనే చేయండని అన్నారు. జీవితంలో కొన్ని క్షణాలు మనలో ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని నింపుతాయి. నేను ఈ చిన్న సెషన్‌నలో అలాంటి సందర్భాలను ఆశిస్తున్నాను అన్నారు.

రేపే కొత్త భవనంలోకి.. 
రేపు వినాయక చవితి సందర్బంగా మనం కొత్త పార్లమెంటుకు వెళ్ళబోతున్నాము. గణేశుడిని 'విఘ్నహర్త' అని కూడా అంటారు అంటే విఘ్నాలను హరించే వాడని అర్ధం.. ఇప్పుడు దేశాభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండవని.. ఎటువంటి విఘ్నాలు లేకుండా భారతదేశం స్వప్నాలన్నిటినీ సాకారం చేసుకుంటుందని (నిర్విఘ్న రూప్ సే సారే సప్నే సారే సంకల్ప్ భారత్ పరిపూర్ణ్ కరేగా) ఈ పార్లమెంట్ సమావేశాలకు సమయం తక్కువగా ఉన్నప్పటికీ చారిత్రాత్మకంగా నిలవనున్నాయని అన్నారు. 

అంతటా ఆసక్తి.. 
తొలిరోజు పార్లమెంట్ సమావేశాలు పాత పార్లమెంట్ భవనంలోనే జరగనుండగా రెండో రోజునుంచి మాత్రం ప్రత్యేక సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో జరుగుతాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జరిగబోయే ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశాల్లో మోదీ ప్రభుత్వం ఏవైనా అనూహ్య నిర్ణయాలను తీసుకోనుందా అన్న అనుమానాలు అంతటా వ్యక్తమవుతున్నాయి.  

ఇది కూడా చదవండి: దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇలా.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement