new Parliament building
-
Parliament Opposition leaders: బయట పేపర్.. లోపల వాటర్ లీకేజీ
న్యూఢిల్లీ: ఢిల్లీని ముంచెత్తిన వరుణుడు పార్లమెంట్ వేదికగా విపక్షాలకు కొత్త విమర్శనాస్త్రాన్ని అందించాడు. గత ఏడేళ్లలో 15 రాష్ట్రాల పరిధిలో ఏకంగా పలురకాలైన 70 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకవడంపై కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే. గురువారం పడిన వర్షాలకు నూతన పార్లమెంట్ భవంతిలోని లాబీ పైకప్పు నుంచి వర్షపు నీరు ధారగా పడుతోంది. దీంతో పేపర్ లీకేజీలను వాటర్ లీకేజీతో ముడిపెడుతూ విపక్షాలు భవన నిర్మాణ పటిష్టతను ఎత్తిచూపాయి. ‘‘ పేపర్ లీకేజీ బయట. వాటర్ లీకేజీ లోపల. రాష్ట్రపతి విచ్చేసినపుడే వినియోగించే లాబీ పైకప్పు నుంచి ధారగా పడుతున్న వర్షపు నీరు.. భవంతి ఏ మేరకు పటిష్టంగా ఉందనే చేదు నిజాన్ని చాటుతోంది. ఈ విషయమై లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడతా’ అని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు మాణిక్కం ఠాకూర్ ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. వర్షపు నీటి కోసం బకెట్ పట్టడం, అక్కడి వారంతా చూస్తూ వెళ్తున్న వీడియోను పోస్ట్‌చేశారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సైతం విమర్శించారు. ‘‘ ఈ భవంతి కంటే పాత భవనమే నయం. ఎంపీలంతా మాట్లాడుకోవడానికి వర్షపు నీరు పడని చోటు ఉండేది. వేల కోట్లతో మళ్లీ కొత్త భవంతి రిపేర్లు పూర్తయ్యేదాక ఎంపీలు పాత భవంతికి మారితే మంచిదనుకుంటా’ అని వ్యంగ్య పోస్ట్ చేశారు. గాజు డోమ్‌ల మధ్య ప్రాంతాలను అతికించే జిగురు జారిపోవడంతో అక్కడి నుంచి మాత్రమే నీరు లీక్ అయిందని, వెంటనే సమస్యను పరిష్కరించామని లోక్‌సభ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. -
పార్లమెంట్లో వర్షపు నీరు లీకేజీ!.. కాంగ్రెస్ వాయిదా తీర్మానం
పార్లమెంట్ భవనంలో వర్షపు నీరు లీకేజీ కావడం.. ఆ వీడియోలు కాస్త నెట్టింటకు చేరడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. ఢిల్లీలో నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న వానకు రాష్ట్రపతి ఛాంబర్ దగ్గరి లాబీలో పైకప్పు నుంచి నీరు కారుతోంది. అయితే.. ఈ లీకేజీపై పార్లమెంట్ నిర్వాహణ అధికారులు స్పందించాల్సి ఉంది. మరోవైపు కిందటి ఏడాది మే నెలలో సన్సద్ భవనం ప్రారంభం కావడం తెలిసిందే. ఈ భవనం.. అందులో హంగుల కోసం 1,000 కోట్ల రూపాయల్ని వెచ్చించారు. అయితే.. ప్రస్తుతం వాటర్ లీకేజీ అంశాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ వాటర్ లీకేజీ అంశాన్ని సభలో చర్చించాలని భావిస్తోంది. ఈ మేరకు.. వాటర్ లీకేజీ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ విప్ మాణిక్కం ఠాగూర్.. లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వం దీనికి ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. Paper leakage outside, water leakage inside. The recent water leakage in the Parliament lobby used by the President highlights urgent weather resilience issues in the new building, just a year after completion. Moving Adjournment motion on this issue in Loksabha. #Parliament pic.twitter.com/kNFJ9Ld21d— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) August 1, 2024 -
మోదీ ప్రమాణ స్వీకారానికి ట్రాన్స్జెండర్లు, పారిశుధ్య కార్మికులు, కూలీలు
న్యూఢిల్లీ: మోదీ ప్రమాణ స్వీకారానికి భిన్న వర్గాల ప్రజలు హాజరయ్యారు. ట్రాన్స్జెండర్లు, పారిశుధ్య కార్మికులతోపాటు నూతన పార్లమెంట్ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలు సైతం హాజరుకావడం విశేషం. ప్రమాణ స్వీకారం కంటే ముందు ట్రాన్స్జెండర్లను కేంద్ర మాజీ మంత్రి వీరేంద్ర కుమార్, పారిశుధ్య కార్మికులను బీజేపీ ఎంపీ గజేంద్రసింగ్ షెకావత్ ఘనంగా సత్కరించారు. ‘సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్’ అంటూ ప్రధాని మోదీ ఇచి్చన పిలుపును అందిపుచ్చుకుంటూ ట్రాన్స్జెండర్లను సత్కరించినట్లు వీరేంద్ర కుమార్ తెలిపారు. -
విగ్రహాలకు స్థానచలనం
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ ప్రాంగణంలో చూడగానే ఎదురుగా కనిపించే మహాత్మా గాంధీజీ, బీఆర్ అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ మహరాజ్, జ్యోతిబా ఫూలే సహా పలువురు దేశ ప్రముఖుల విగ్రహాలను ప్రభుత్వం వేరే చోటుకు తరలించింది. ఉన్న చోటు నుంచి పాత పార్లమెంట్(సంవిధాన్ సదన్)లోని ఐదో నంబర్ గేట్ దగ్గరి లాన్ వద్దకు మార్చింది. ఈ లాన్లో ఇప్పటికే గిరిజన యోధుడు బిర్సా ముండా, మహారాణాప్రతాప్‌ల విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాల తరలింపుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘మహాత్ముడు, అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ విగ్రహాలను ఉద్దేశపూర్వకంగా అప్రాధాన్య చోట్లో ప్రతిష్టించడం అరాచకం’అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్లు బీజేపీని తిరస్కరించారు. అందుకే మహారాష్ట్రతో అనుబంధమున్న ఛత్రపతి శివాజీ, అంబేడ్కర్ల విగ్రహాలను వేరే చోటుకు మార్చేశారు. గుజరాత్లో బీజేపీ ఈసారి క్లీన్‌స్వీప్ చేయలేకపోయింది. అందుకే గుజరాతీలపై ఆగ్రహంతో గాం«దీజీ విగ్రహాన్నీ తరలించారు’ అని మరో నేత పవన్ ఖేడా వ్యాఖ్యానించారు. ‘మహానుభావుల విగ్రహాలు తొలగించి గాడ్సే, మోదీ విగ్రహాలు పెడతారా?’ అని టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ ప్రశ్నించారు. విమర్శలపై లోక్‌సభ సచివాలయం స్పందించింది. పార్లమెంట్‌కు విచ్చేసే సందర్శకులు చూసేందుకు అనువుగా ‘ప్రేరణ స్థల్’కు విగ్రహాలను తరలించామని పేర్కొంది. ఏ విగ్రహాన్ని పక్కనపడేయలేదని స్పష్టంచేసింది. -
నేడు మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
-
Interim Budget 2024: నేడే బడ్జెట్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల సమరశంఖం పూరించకముందే ఎన్నికల తాయిలాలతోపాటు సామాన్య ప్రజానీకం ఆశలను సాకారం చేస్తుందని అంతా భావిస్తున్న కేంద్ర మధ్యంతర బడ్జెట్ ఈరోజే పార్లమెంట్ ముందుకురానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటల సమయంలో నూతన పార్లమెంట్ భవనంలోని లోక్‌సభలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ముందుగా బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి మంత్రి నిర్మల చేరుకుంటారు. బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములైన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆమె రాష్ట్రపతి భవన్‌కు వెళ్తారు. ఉదయం 9.30 నిమిషాలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ గురించి వివరించి ఆమె అనుమతిని తీసుకోనున్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు నూతన పార్లమెంట్ భవనానికి నిర్మల, ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల బృందం చేరుకుంటుంది. బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రి మండలి ఒకసారి భేటీకానుంది. ఈ భేటీలోనే మధ్యంతర బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు మంత్రి లోక్‌సభలో అడుగుపెడతారు. బడ్జెట్ ప్రతులను చదివి ఆయా శాఖలకు నిధుల కేటాయింపులుసహా సమగ్ర బడ్జెట్ స్వరూపాన్ని ఆవిష్కరిస్తారు. లోక్‌సభలో ఆమె బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాక ఆయా పద్దుల ప్రతులను రాజ్యసభలో సభ్యులకు అందజేస్తారు. నిర్మల ఇలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరసగా ఆరోసారి. గురువారం నాటి బడ్జెట్‌తో కలుపు కుని ఐదు పూర్తి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టినవారవుతారు. దీంతో గతంలో మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును నిర్మల సమంచేయనున్నారు. మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హాలు ఐదు సార్లే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ మెరుపులు ఉంటాయా ? అద్భుత ప్రకటనలు ఆశించవద్దని విత్త మంత్రి విస్పష్టంగా చెప్పారు. మధ్యంతర బడ్జెట్లో ప్రకటించే నూతన పథకాల అమలు బాధ్యత కొత్త ప్రభుత్వానిదే. అయినాసరే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మధ్యంతర బడ్జెట్లోనూ కొన్ని ఎన్నికల తాయిలాలు ప్రకటించే ధోరణి ఏనాడో మొదలైంది. 2004లో ఇదే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 50 శాతం డియర్నెస్ అలవెన్స్‌ను మూలవేతనంతో కలుపుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ప్రణబ్ ముఖర్జీ, పీయుశ్ గోయల్ ఆర్థిక మంత్రిగా ఉన్నపుడూ ఇలాంటి ప్రకటనలు వెలువడ్డాయి. అందుకే ఈసారీ బడ్జెట్ ఊరటలు ఉంటాయని జనం గట్టిగా నమ్ముతున్నారు. పెట్రోల్, డీజిల్‌పై సుంకం తగ్గించి ధరలు కాస్తంత కిందకు దించడం, పీఎం–ఆవాస్ యోజన తరహా కొత్త పథకం, విద్యుత్ వాహనాలకు రాయితీ పొడిగింపు వంటి ‘ఆర్థిక సాయం’ కోసం మధ్యతరగతి వర్గాలు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. పన్ను శ్లాబులను సరళీకరిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. ఆరోసారి పద్దుల చిట్టాతో పార్లమెంట్ గడప తొక్కుతున్న విత్తమంత్రి ఏమేరకు జనాలపై అద్భుత పథకాల పన్నీరు చల్లుతారో చూడాలి మరి. -
పార్లమెంట్ కొత్త భవనం.. మోదీ మల్టీప్లెక్స్
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనం సౌకర్యవంతంగా లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నూతన భవన నిర్మాణ శైలి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినట్లుగా ఉందని ఆరోపించారు. ఈ భవనాన్ని ‘మోదీ మలీ్టప్లెక్స్’ లేదా ‘మోదీ మారియెట్’ అని పిలిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ నూతన భవనం పట్ల జైరామ్ రమేశ్ అభ్యంతరాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను జైరామ్ రమేశ్ కించపర్చారని మండిపడ్డారు. పార్లమెంట్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించడం ఇదే మొదటిసారి కాదని అన్నారు. అవయవదాతలకు -
Womens Reservation Bill 2023: మహిళా బిల్లుకు జై
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 368(2) ప్రకారం ఈ బిల్లు ఆమోదం పొందింది. దీనిప్రకారం సభలోని మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది మద్దతు తెలపాల్సి ఉంటుంది. పార్టీలకు అతీతంగా సభ్యులు బిల్లుకు జై కొట్టారు. పార్లమెంట్ నూతన భవనంలో ఆమోదం పొందిన మొట్టమొదటి బిల్లు ఇదే కావడం విశేషం. ‘నారీశక్తి వందన్ అధినియమ్’ పేరిట కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఈ నెల 19న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ‘రాజ్యాంగ(128వ సవరణ) బిల్లు–2023’పై బుధవారం దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. కేంద్ర మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ సహా వివిధ పార్టీలకు చెందిన దాదాపు 60 మంది సభ్యులు మాట్లాడారు. కొందరు బిల్లుకు మద్దతుగా ప్రసంగించారు. మరికొందరు మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళా కోటా గురించి ప్రశ్నించారు. ఈ రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకురావాలన్న డిమాండ్లు సైతం వినిపించాయి. చర్చ అనంతరం స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 454 మంది సభ్యులు ఓటు వేయగా, ఇద్దరు ఎంపీలు వ్యతిరేకంగా ఓటేశారు. ఓటింగ్ ప్రక్రియలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. చర్చ అనంతరం అదే రోజు ఓటింగ్ నిర్వహిస్తారు. ఎగువ సభలోనూ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే. అనంతరం రాష్ట్రపతి సంతకంతో మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చనుంది. జన గణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాత 2029 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఓటింగ్ జరిగిందిలా.. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉండటంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్లిప్‌ల ద్వారా ఓటింగ్ నిర్వహించారు. మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ జరిగింది. ఎరుపు, ఆకుపచ్చ రంగు స్లిప్‌లను సభ్యులకు అందజేశారు. ఓటు ఎలా వేయాలో లోక్‌సభ సెక్రెటరీ జనరల్ వివరించారు. బిల్లుకు మద్దతు తెలిపితే ఆకుపచ్చ స్లిప్పై ‘ఎస్’ అని రాయాలని, వ్యతిరేకిస్తే ఎరుపు రంగు స్లిప్పై ‘నో’ అని రాయాలని చెప్పారు. ఆ ప్రకారమే ఓటింగ్ జరిగింది. బిల్లుకు మద్దతుగా 454 ఓట్లు, వ్యతిరేకంగా కేవలం 2 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ఏఐఎంఐంఎ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ఆ పార్టీకి లోక్‌సభలో ఓవైసీతోపాటు మరో ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్(ఔరంగాబాద్) ఉన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా వారిద్దరూ ఓటేసినట్లు తెలుస్తోంది. చాలా సంతోషంగా ఉంది: ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో భారీ మెజార్టీతో ఆమోదం పొందడం చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. నారీశక్తి వందన్ అధినియమ్ ఒక చరిత్రాత్మక చట్టం అవుతుందన్నారు. ఈ చట్టంతో మహిళా సాధికారతకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, మన రాజకీయ వ్యవస్థలో మహిళామణుల భాగస్వామ్యం ఎన్నో రెట్లు పెరుగుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ప్రస్తుతం రాజీవ్ గాంధీ కల సగమే నెరవేరింది. బిల్లు చట్టరూపం దాల్చాకే ఆయన కల నెరవేరుతుంది. నాదో ప్రశ్న. మహిళలు తమ రాజకీయ బాధ్యతలు నెరవేర్చుకునేందుకు గత 13 ఏళ్లుగా వేచిచూస్తున్నారు. ఇంకా మనం వాళ్లని రెండేళ్లు, నాలుగేళ్లు, ఆరేళ్లు, ఎనిమిదేళ్లు వేచి ఉండండని చెబుదామా? భారతీయ మహిళల పట్ల ఇలా ప్రవర్తించడం సముచితం కాదు. ఈ బిల్లు వెంటనే అమల్లోకి రావాల్సిందే. కుల గణన తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లలో ప్రాతినిధ్యం దక్కాలి. – సోనియా మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణం అమల్లోకి తేవాలన్న విపక్షాల డిమాండ్ సరికాదు. ఒకవేళ రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్, అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్ అధినేత) ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ లోక్‌సభా స్థానాలు మహిళలకు రిజర్వ్ అయితే మా ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందంటూ అందుకు మళ్లీ మోదీ సర్కారునే నిందిస్తారు. అందుకే నియోజకవర్గాల పునరి్వభజనను సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలోని కమిషన్ పూర్తి పారదర్శకంగా చేపడుతుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో వచ్చే నూతన ప్రభుత్వం వెంటనే జన గణన, నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుంది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ల కలను సాకారం చేస్తుంది. – అమిత్ షా ఈ బిల్లుతో సవర్ణ మహిళలకే మేలు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లుతో అగ్ర వర్ణాల మహిళలకే మేలు జరుగుతుంది. పార్లమెంట్లో అతి తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ఓబీసీ, మైనార్టీ మహిళలకు ఈ రిజర్వేషన్లలో ప్రత్యేకంగా కోటా కలి్పంచకపోవడం దారుణం. దేశ జనాభాలో ముస్లిం మహిళలు 7 శాతం ఉన్నారు. లోక్‌సభలో వారి సంఖ్య కేవలం 0.7 శాతమే ఉంది. లోక్‌సభలో సవర్ణ మహిళల సంఖ్య పెంచాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోంది. ఓబీసీ, మైనార్టీ మహిళలు ఈ సభలో ఉండడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఆయా వర్గాల మహిళలను మోదీ సర్కారు దగా చేస్తోంది – అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం పార్లమెంట్ సభ్యుడు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా పారీ్టలకతీతంగా మహిళా ఎంపీలు బిల్లుకు ఏకగ్రీవంగా జై కొట్టారు. లోక్‌సభలో 82 మంది మహిళా ఎంపీలుండగా బుధవారం చర్చలో 27 మంది మహిళా ఎంపీలు మాట్లాడారు. అందరూ బిల్లుకు మద్దతుగా మాట్లాడారు. అయితే, బిల్లు ఆలస్యంగా అమలయ్యే అంశాన్ని ప్రధానంగా తప్పుబట్టారు. -
పేపర్ లాస్ గా కొత్త పార్లమేంట్ కార్యక్రమాలు
-
'ఆ క్రెడిట్ మాదే..' మహిళా రిజర్వేషన్ బిలుపై సోనియా గాంధీ
న్యూఢిల్లీ: తొలిరోజు పార్లమెంట్ సమావేశాలు ముగిశాక కేంద్ర కేబినెట్ సమావేశమై చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ బిల్లు ఏ క్షణాన్నైనా ప్రవేశపెట్టే అవకాశముంది. దీనిపై కాంగ్రెస్ పార్లమెంటరీ నేత సోనియా గాంధీని ప్రశ్నించగా 'ఈ బిల్లు మాదే'నని సమాధానమిచ్చారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రెండోరోజు కొత్త పార్లమెంట్ భవనంలో కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం ఉదయాన్నే పాత పార్లమెంట్ భవనం వద్ద ఫోటో సెషన్ కొనసాగింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఫోటో సెషన్లో పాల్గొన్నారు. పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన ఎంపీలు ఇవాళ ఉదయమే పార్లమెంట్ భవనం వద్దకు చేరుకున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పార్లమెంటు భవనం వద్దకు వస్తూనే మహిళా రిజర్వేషన్ బిల్లుపై విలేఖరులు ఆమె స్పందన కోరగా ఈ బిల్లు మాదేనని అన్నారు. 2010లో కాంగ్రెస్ అదిఆకారంలో ఉన్నపుడు ఈ బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టగా రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని బిల్లులోని అంశాలను పరిశీలించాల్సి ఉందని అన్నారు. ఒకవేళ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదం పొందితే ఆ క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ భాగస్వామ్య పార్టీలకే దక్కుతుందని అన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత పి.చిదంబరం. "It is ours, अपना है" 🔥#WomenReservationBill पर CPP अध्यक्ष श्रीमती सोनिया गांधी जी। pic.twitter.com/2LDIHhrIGN — Srinivas BV (@srinivasiyc) September 19, 2023 If the government introduces the Women's Reservation Bill tomorrow, it will be a victory for the Congress and its allies in the UPA government Remember, it was during the UPA government that the Bill was passed in the Rajya Sabha on 9-3-2010 In its 10th year, the BJP is… — P. Chidambaram (@PChidambaram_IN) September 18, 2023 ఇది కూడా చదవండి: దేవెగౌడ మనవడు ఎంపీ రేవణ్ణకు ఉపశమనం -
మహిళా బిల్లును కాంగ్రెస్ పట్టించుకోలేదు: అమిత్ షా
Updates.. ► పాత పార్లమెంటుకు సంవిధాన్ సదన్‌గా నామకరణం. నోటిఫికేషన్ జారీచేసిన లోక్‌సభ సెక్రటరీ జనరల్ ►మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ఏనాడు సీరియస్‌గా వ్యహరించలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధ్వజమెట్టారు. అందుకే విపక్షలు నారీశక్తి వందన్ బిల్లును జీర్ణించుకోలేకపోతున్నాయని దుయ్యబట్టారు. ఈ బిల్లులు మహిళలకు సాధికారికత కల్పించేందుకు మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేందన్నారు. మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టడం ద్వారా దేశ వ్యాప్తంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ►మహిళా సాధికారితకు మేం వ్యతిరేకం కాదు. ►చట్టాన్ని రూపొందించినట్లయ్యితే.. ఆ కోటాలో ఓబీసీ, ముస్లిం మహిళలు వాటా పొందడం ముఖ్యం. :: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ►మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ వందకు వంద శాతం మద్దతు ఇస్తుంది. ►వెనుకబడిన వర్గాల మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించాం. ►2010లో మహిళా బిల్లు పెట్టినప్పుడు కూడా ఇదే డిమాండ్ వచ్చింది. ►బీసీలను అణగదొక్కాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయి. :: బీఆర్ఎస్ నేత కేకే మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతించిన వైఎస్సార్సీపీ ►మహిళా రిజర్వేషన్ బిల్లు కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం ►ఈ బిల్లు త్వరగా అమలు చేయాలని కోరుతున్నా ►సీఎం వైఎస్ జగన్ మహిళా పక్షపాతి ►రాష్ట్రంలో అన్ని పథకాలు మహిళల పేరు మీద అమలు చేస్తున్నారు ►ప్రజా ప్రతినిధుల్లో సైతం మహిళలకు పెద్దపీట వేశారు :::మిథున్ రెడ్డి, వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత రాజ్యసభలో ఖర్గే ప్రసంగం ►మహిళా రిజర్వేషన్ బిల్లు 2010లో రాజ్యసభలో ఆమోదం పొందింది. ►ఈ మహిళా బిల్లులో ఓబీసీ, ఎస్సీ రిజర్వేషన్లు చేర్చాలి. ►మహిళా బిల్లుపై క్రెడిట్ మోదీ మాకు ఇవ్వదలుచుకోలేదు. ►మహిళా రిజర్వేషన్లలో మూడో వంతు వెనుబడిన కులాల మహిళలకు ఇవ్వాలని పట్టుబట్టారు. ►వెనకబడిన కులాల మహిళలకు పెద్దగా చదువు ఉండదు. ►అందుకే రాజకీయాల కోసం వెనబడిన కులాల మమహిళ తరపున వాళ్లు మాట్లాడారు. ►గట్టిగా పోరాటం చేసే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం వాళ్లకు ఇష్టం లేదు. ►బలహీన వర్గాల మహిళలను బీజేపీ రాజకీయాల కోసం వాడుకుంటోంది. ►బీజేపీ పాలనలో దేశంలో ఫెడరల్ వ్యవస్థ బలహీనపడుతోంది. ►చాలా రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూలదోసింది. ►చాలా రాష్ట్రాలకు జీఎస్టీ నిధుల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. ఖర్గే ప్రసంగంపై రాజ్యసభలో రగడ ►ఖర్గే ప్రసంగానికి అడ్డు తగిలిన బీజేపీ సభ్యులు ►బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం ►గిరిజన మహిళను రాష్ట్రపతి చేసింది బీజేపీనే: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. ►ఏ రాష్ట్రానికి జీఎస్టీ బకాయిలు పెండింగ్‌లో లేవు. ►బకాయిలు ఉన్నట్లు ఆధారాలుంటే చూపించడండని సవాల్ కొత్త పార్లమెంట్లో కొలువుదీరిన రాజ్యసభ ►ఈరోజు చరిత్రలో నిలిచిపోతుంది: ప్రధాని మోదీ ►పార్లమెంట్‌పై దేశ ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ►ఎన్నో విప్లవాత్మక బిల్లులు తీసుకొచ్చాం ►లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి రామ్ మెగ్వాల్. ►చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు. ►బిల్లు కాపీలను తమకు ఎందుకివ్వలేదని విపక్షాల ఆందోళన ►డిజిటల్ ఫార్మాట్లో అప్లోడ్ చేశామన్న కేంద్రం ►విధాన నిర్ణయాల్లో మహిళా భాగస్వామ్యం పెంచడమే లక్ష్యంగా బిల్లు ►లోక్‌సభలో రేపు బిల్లు ఆమోదం పొందే అవకాశం ►ఎల్లుండి రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు ►మహిళా బిల్లు పేరు నారీశక్తి వందన్ ► మధ్యాహ్నం మూడు గంటలకు లోక్‌సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు. మహిళా బిల్లును ప్రవేశపెట్టనున్న న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్. ► కొత్త పార్లమెంట్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే మా లక్ష్యం. భవిష్యత్ తరాలకు స్పూర్తినిచ్చేలా మనం పనిచేయాలి. నెహ్రు చేతికి శోభనిచ్చిన సెంగోల్ నేడు సభలో కొలువుదీరింది. స్వాతంత్ర్య ఉద్యమంతో సెంగోల్‌ది కీలక పాత్ర. అమృతకాలంలో కొత్త లక్ష్యాలతో ముందుకెళ్తున్నాం. కొత్త సభలోకి ఎంపీలందరినీ ఆహ్వానిస్తున్నాం. ఆజాదీ అమృత్ కాలంలో ఇది ఉషోదయ కాలం. వినాయక చతుర్థీ రోజు కొత్త పార్లమెంట్‌లోకి అడుగుపెట్టాం. ఆధునికతకు అద్దం పట్టడంతో పాటు చరిత్రను ప్రతిబింబించేలా కొత్త పార్లమెంట్ భవనం. భవనం మారింది, భావనలు కూడా మారాలి. గత చేదు అనుభవాలను మరిచిపోవాలి. #WATCH | In the Lok Sabha of the new Parliament building, Prime Minister Narendra Modi says, "Samvatsari is also celebrated today, this is a wonderful tradition. Today is the day when we say 'micchami dukkadam', this gives us the chance to apologise to someone we have hurt… pic.twitter.com/ssbHT1Hdzf — ANI (@ANI) September 19, 2023 ►మహిళా బిల్లు 1996లో సభ ముందుకు వచ్చింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముందడుగు వేయబోతున్నాం. ఈరోజు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుంది. నారీ శక్తి బిల్లుకు చట్టం చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను. మహిళా రిజర్వేషన్ బిల్లుకు నారీశక్తి వందన్ పేరు. ► భారత్ నేతృత్వంలో జీ20ని విజయవంతంగా నిర్వహించాం. మహిళా సాధికారతపై ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు. ఆటల నుంచి అంతరిక్షం వరకు మహిళలు ముందంజలో ఉన్నారు. మహిళా కోటా చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. నేడు చరిత్రలో నిలిచిపోయే రోజు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించే భాగ్యం భగవంతుడు నాకు ఇచ్చాడు. ► కొత్త పార్లమెంట్లో లోక్‌సభ ప్రారంభం. మధ్యాహ్నం 2.30 గంటలకు రాజ్యసభ ప్రారంభం కానుంది. ► కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభం. పేపర్‌లెస్‌గా కొత్త పార్లమెంట్ కార్యక్రమాలు. ఎంపీలకు సభా కార్యక్రమాల వివరాలు కనిపించేలా డిజిటల్ స్క్రీన్స్. #WATCH | Proceedings of the Lok Sabha begin in the New Parliament building. pic.twitter.com/LafXM9xUD9 — ANI (@ANI) September 19, 2023 ►కొత్త పార్లమెంట్ భవనానికి మారిన కార్యకలాపాలు #WATCH | Prime Minister Narendra Modi enters the New Parliament building. pic.twitter.com/ypAAxM0BBX — ANI (@ANI) September 19, 2023 ►పాత పార్లమెంట్ భవనం నుంచి ఎంపీల మార్చ్ ►పాత పార్లమెంట్ భవనంలో ప్రధాని ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో కొత్త పార్లమెంట్ భవనం సంవిధానం సదన్‌లోకి ఎంపీలు నడుచుకుంటూ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ ముందు నడవగా మిగిలినవారు ఆయనను అనుసరించారు. #WATCH | Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh, Union Ministers Piyush Goyal, Nitin Gadkari and other parliamentarians move out of the old Parliament building and proceed to the new building. pic.twitter.com/sLAeTEV5km — ANI (@ANI) September 19, 2023 ► పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రజలకు, పార్లమెంట్ సభ్యులకు గణేష్ చతుర్తి శుభాకాంక్షలు. కొత్త సంకల్పంతో కొత్త భవనంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ సందర్బంగా భారత తిరంగా యాత్ర గుర్తుకువస్తోంది. ఈ హాల్‌తో ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో భావోద్వేగాలు. పార్లమెంట్ భవనం, సెంట్రల్ హాల్ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. #WATCH | Special Session of Parliament | Prime Minister Narendra Modi says, "...Muslim mothers and sisters got justice because of this Parliament, law opposing 'triple talaq' was unitedly passed from here. In the last few years, Parliament has also passed laws giving justice to… pic.twitter.com/gnOY7JDtu3 — ANI (@ANI) September 19, 2023 లోక్‌సభ, రాజ్యసభ కలిసి 4వేల చట్టాలు చేశాయి. ఇక్కడే మన రాజ్యాంగం రూపుదిద్దుకుంది. ఇక్కడే జాతీయ గీతం, జాతీయ పతాకం ఎంచుకున్నాం. 86 సార్లు సెంట్రల్ హాల్లో దేశ అధక్ష్యుల ప్రసంగం జరిగింది. 41 దేశాల అధినేతలు ఇక్కడి నుంచి ప్రసగించారు. ఇక్కడ చట్టాలు చేసి ముస్లిం మహిళలకు న్యాయం చేశాం. తలాక్‌పై నిర్ణయాలు తీసుకున్నాం. ట్రాన్స్జెండర్ల కోసం చట్టాలు చేశాం. ఆర్టికల్ 370ను రద్దు చేశాం. భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం. #WATCH | Special Session of Parliament | PM Narendra Modi says, "Today, we are going to have the beginning of a new future in the new Parliament building. Today, we are going to the new building with the determination to fulfil the resolve of a developed India." pic.twitter.com/FNuI8c4lzz — ANI (@ANI) September 19, 2023 ► ఇదే సరైన సమయం. ఇదే మార్గంలో ముందుకు వెళ్తే మన లక్ష్యాలన్నీ నెరవేరుతాయి. సరికొత్త లక్ష్యాలను సాధించేందుకు ముందుకెళ్తున్నాం. చిన్నా కాన్వాస్‌పై పెద్ద బొమ్మ గీయలేం. ఇకపై మనం పెద్ద కాన్వాస్‌ను ఉపయోగించాలి. మన ఆలోచనలు పెద్దగా ఉండాలి. ప్రపంచ స్థాయిలో అన్ని రంగాల్లో ఎదగాలి. భారత యూనివర్సిటీలు ప్రపంచ స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే నూతన ఎడ్యుకేషన్ పాలసీని తీసుకువచ్చాం. ప్రపంచమంతా ఆత్మనిర్భర్ భారత్ గురించే చర్చిస్తోంది. చిన్న చిన్న విషయాలపై రాద్దాంతం చేయవద్దు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మనం ఉండాలి. మనకు 75 ఏళ్ల అనుభవం ఉంది. #WATCH | Special Session of Parliament | Prime Minister Narendra Modi says, "Every law made in the Parliament, every discussion held in the Parliament, and every signal given by the Parliament should encourage the Indian aspiration. This is our responsibility and the expectation… pic.twitter.com/edShzmevhY — ANI (@ANI) September 19, 2023 ► మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఈ చారిత్రాత్మక సెంట్రల్ హాల్లో భారత పార్లమెంటు గొప్ప వారసత్వాన్ని స్మరించుకోవడానికి సమావేశమవడం ఆనందకరం. ఈ సెంట్రల్ హాల్లోనే రాజ్యాంగ సభ జరిగింది. 1946 నుండి 1949 వరకు కూర్చొని సభ జరిగింది. ఈరోజు మనం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్, అంబేద్కర్ అందించిన సేవలను వినమ్రంగా స్మరించుకుంటున్నాము. #WATCH | Special Session of Parliament: Leader of LoP in Rajya Sabha Mallikarjun Kharge says "We have all gathered here today the commemorate the rich legacy of the Parliament of India in this historic Central Hall. It is in this very Central Hall that the Constituent Assembly… pic.twitter.com/qURMbGuQHo — ANI (@ANI) September 19, 2023 ► అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. అధిక నిరుద్యోగం రేటు పెరిగిపోయింది. ఇది దేశ అభివృద్ధి ఆటంకంగా మారనుంది. యువ జనాభా దేశ ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడేలా చేయడం చాలా అవసరం. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ, మన తలసరి జీడీపీ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉంది. ఈ ఆర్థిక వృద్ధి సవాలును ఎదుర్కోవడానికి ప్రభుత్వ విధానాలు, తక్కువ ద్రవ్యోల్బణానికి మార్గదర్శకత్వం, వడ్డీ రేట్లు తగ్గించడం, నిరుద్యోగాన్ని తగ్గించడం, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని ప్రోత్సహించడం అవసరం. కొనుగోలు శక్తిని పెంపొందించడం, డిమాండ్‌ను ప్రేరేపించడం, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాన్ని మెరుగుపరచడం అవసరం. #WATCH | Special Session of Parliament: Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury says "...High unemployment rates pose a significant hurdle to leveraging this demographic advantage...It is essential to enable India's youthful population to contribute substantially… pic.twitter.com/eaFzZseQ91 — ANI (@ANI) September 19, 2023 ► బీజేపీ ఎంపీ మేనకా గాంధీ మాట్లాడుతూ.. ఈరోజు చారిత్రాత్మకమైన రోజు. ఈ చారిత్రాత్మక క్షణంలో నేను భాగమైనందుకు గర్వపడుతున్నాను. కొత్త పార్లమెంట్ భవనం కొత్త ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని ఆశిస్తున్నాము. లోక్‌సభలో అత్యంత సీనియర్ పార్లమెంటేరియన్‌గా ఈ గౌరవనీయమైన అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించే బాధ్యత నాకు అప్పగించినందుకు ధన్యవాదాలు. నా రాజకీయ జీవితం ఎక్కువ కాలం పార్లమెంట్‌లోనే గడిపాను. నా రాజకీయ జీవితంలో నేను ఏడుగురు ప్రధాన మంత్రులతో పనిచేశాను. స్వతంత్ర సభ్యురాలిగా ఉండి.. చివరకు అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో బీజేపీలో చేరాను. ప్రతీ క్షణం ప్రజల కోసం పనిచేశాను. #WATCH | Special Session of Parliament: BJP MP Maneka Gandhi says "This is a historic day today and I am proud to be a part of this historic moment. We are going to a New Building and hopefully, this grand edifice will reflect the aspirations of a new Bharat. Today, I have been… pic.twitter.com/sqoQEEDomb — ANI (@ANI) September 19, 2023 ►పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ప్రధాని ఊహించిన విధంగా అభివృద్ధి చెందిన దేశానికి మార్గం సుగమం చేస్తున్న కొత్త, అభివృద్ధి చెందుతున్న భారత్‌కు చిహ్నంగా ఉన్న కొత్త భవనం నుండి పార్లమెంటు ఉభయ సభల విధుల పట్ల నేను చాలా సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉన్నాను. ► పాత పార్లమెంట్‌లోని సెంట్రల్ హాల్లో ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పార్లమెంట్‌లోని తమ అనుభవాలను చెప్పుకొచ్చారు. ► నేడు మహిళా బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘవాల్ మహిళా బిల్లును ప్రవేశపెట్టనున్నారు. రేపు మహిళా బిల్లుపై సభలో చర్చించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈనెల 21న మహిళా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ► కొత్త పార్లమెంట్ ప్రారంభమైంది. ► నూతన పార్లమెంట్‌లోకి ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా ప్రవేశించారు. ► చివరగా పాత పార్లమెంట్లో సభ్యులకు అభివాదం చేసిన ప్రధాని మోదీ. #WATCH | Prime Minister Narendra Modi meets the members of Parliament at the Central Hall of the Old Parliament building. pic.twitter.com/6MzaosDQr9 — ANI (@ANI) September 19, 2023 ► పార్లమెంట్ సభ్యుల గ్రూప్ ఫొటో సందర్భంగా బీజేపీ ఎంపీ నరమరి అమిన్ నీరసంతో కూప్పకూలిపోయారు. అనంతరం, సభ్యులు సపర్యలు చేయడంతో లేచి కూల్చున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడ ఉంది. అనంతరం.. ఫొటో సెషల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. #WATCH | BJP MP Narhari Amin fainted during the group photo session of Parliamentarians. He has now recovered and is a part of the photo session. pic.twitter.com/goeqh9JxGN — ANI (@ANI) September 19, 2023 #WATCH | Special Session of Parliament | Members of Parliament gather for a joint photo session. The proceeding of the House will take place in the New Parliament Building from today. pic.twitter.com/7NZ58OmInm — ANI (@ANI) September 19, 2023 ► పార్లమెంట్ వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ.. #WATCH | Delhi: Prime Minister Narendra Modi arrives for the joint photo session ahead of today's Parliament Session. pic.twitter.com/dwLgLPSswE — ANI (@ANI) September 19, 2023 ►మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్ వద్ద సోనియా గాంధీ స్పందించారు. ఈ సందర్బంగా ఈ బిల్లు తమదేనన్నారు. ఈ సమావేశాల్లో మహిళా బిల్లును పెట్టాలన్నారు. #WATCH | On the Women's Reservation Bill, Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says "It is ours, Apna Hai" pic.twitter.com/PLrkKs0wQo — ANI (@ANI) September 19, 2023 ► ఈరోజు మధ్యాహ్నం నుంచి కొత్త పార్లమెంట్లో సమావేశాలు జరుగుతాయి. ► మధ్యాహ్నం 1:15 గంటలకు కొత్త పార్లమెంట్లో లోక్‌సభ సమావేశం. ► మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ సమావేశం. ► సాయంత్రం 4 గంటలకు స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరుగనుంది. ►నేడు పాత పార్లమెంట్ భవనం ముందు ఫొటో సెషన్. గ్రూప్ ఫొటో దిగనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఎంపీలు. ►పేపర్ లెస్‌గా కొత్త పార్లమెంట్ కార్యక్రమాలు. ఎంపీలకు సభా కార్యక్రమాల వివరాలు కనిపించేలా డిజిటల్ స్క్రిన్స్ ఏర్పాటు. గెజిట్ విడుదల.. ► పార్లమెంట్ కొత్త భవనాన్ని నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది. ఇందులో కొత్తగా నిర్మించిన భవనమే ఇక నుంచి పార్లమెంట్ అని పేర్కొంది. New building of Parliament to be hereon designated as the Parliament House of India, Gazette notification issued. pic.twitter.com/AmV5InWCdG — ANI (@ANI) September 19, 2023 ► నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కొత్త భవనంలోనే జరగనున్నాయి. ప్రత్యేక సమావేశాల సందర్బంగా ప్రధాని మోదీ.. నిన్న(సోమవారం) పాత పార్లమెంట్‌కు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. మరోవైపు.. సభ్యులు కొత్త పార్లమెంట్‌లోకి అడుగుపెడుతున్న వేళ.. కేంద్రం వినూత్నంగా ప్లాన్ చేసింది. ఎంపీలకు ప్రత్యేక కానుక.. ► ప్రత్యేక సమావేశాల సందర్భంగా పార్లమెంట్ సభ్యులు తొలిసారి నూతన భవనంలో అడుగుపెట్టనున్నారు. ఈ విశిష్ట సందర్భానికి గుర్తుగా పార్లమెంట్ సభ్యులకు కేంద్రం ప్రత్యేక కానుకలు అందజేయనున్నట్లు తెలుస్తోంది. జనపనారతో రూపొందించిన బ్యాగులో భారత రాజ్యాంగ ప్రతి, పాత, కొత్త పార్లమెంటు భవనాల చిత్రాలతో కూడిన స్టాంపులు, స్మారక నాణెం వారికి ఇవ్వనుంది. ఇక, ఆ బ్యాగులపై ఎంపీల పేర్లు రాసి ఉన్నాయి. ప్రధాని మోదీ సైతం పాత పార్లమెంట్ నుంచి కొత్త పార్లమెంట్‌కు రాజ్యాంగ ప్రతిని తన వెంట తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ప్రధానిని ఎంపీలు అనుసరించనున్నట్టు తెలుస్తోంది. A gift bag with a copy of the Indian Constitution, commemorative coins, postal tickets will be given to every MP as Parliament proceedings resume from the new building tomorrow#NewParliamentBuilding pic.twitter.com/dHEI03DjyP — ET NOW (@ETNOWlive) September 18, 2023 -
కొత్త భవనంలో సమావేశాలు: లోక్‌సభ స్పీకర్
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ పాత భవనం శకం ముగిసింది. నేటి నుంచి కొత్త భవనంలోనే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తొలి రోజు సమావేశాలు జరగ్గా.. ముగించే ముందర ఆయన ఈ విషయం సభ్యులకు తెలియజేశారు. సభని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ ఓం బిర్లా.. మంగళవారం నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు నడుస్తాయని తెలిపారు. ముందుగా నేటి ఉదయం 9.30గం. ప్రాంతంలో ఫొటో సెషన్ నిర్వహిస్తారు. ఆపై సెంట్రల్ హాల్లో ఎంపీలు సమావేశం అవుతారు. కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రధాని మోదీ.. ఎంపీలతో పాటు ఎంట్రీ ఇస్తారు. ఈ సందర్భంగా ఎంపీలందరికీ గిఫ్ట్ బ్యాగ్ ఇవ్వనున్నారు. ఆ గిఫ్ట్ బ్యాగ్‌లో రాజ్యాంగం బుక్, పార్లమెంట్ పుస్తకాలు, స్మారక నాణెం, స్టాంప్ ఉండనున్నట్లు సమాచారం. ఆపై మధ్యాహ్నాం 1.15 నిమిషాలకు లోక్‌సభ ప్రారంభం కానుంది. మరోవైపు రాజ్యభస 2.15 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. Special Session of Parliament | Lok Sabha adjourned to meet at 1:15 pm in the new Parliament building tomorrow. — ANI (@ANI) September 18, 2023 క్లిక్ చేయండి: ప్రజాస్వామ్య సౌధం.. 96 ఏళ్ల సేవలు.. ఇక సెలవు -
Parliament Special Sessions:సమావేశాలకు ముందు ప్రధాని ప్రసంగం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ప్రారంభానికి ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భాంగా ప్రధాని చంద్రయాన్-3, జీ20 సదస్సు విజయాలను ప్రస్తుతిస్తూ భారతదేశం సత్తా ఏంటో ప్రపంచానికి నిరూపించమని అన్నారు. ఎంతో సాధించాం.. ఐదు రోజుల పాటు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో తొలి రోజు సెషన్ ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా భారత దేశం సాధించిన అనేక విజయాల గురించి ఆయన ప్రస్తావించారు. ప్రధాని మాట్లాడుతూ.. భారతదేశం ఇప్పుడు అన్ని అంశాల్లో దూసుకెళ్తోంది. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. జీ20 సమావేశాలను అత్యంత విజయవంతంగా నిర్వహించుకున్నాం. భారత దేశం సత్తా ఏంటో ప్రపంచానికి నిరూపించాం. సకల వసతులతో యశోభూమిని నిర్మించుకున్నామని ప్రపంచ దేశాలన్నీ మనవైపే చూస్తున్నాయని అన్నారు. #WATCH | Prime Minister Narendra Modi says "...India will always be proud that we became the voice of the Global South during the G20 Summit and that the African Union became a permanent member of the G20. All this is a signal of India's bright future. 'YashoBhoomi' an… pic.twitter.com/UXhtqEZ0GJ — ANI (@ANI) September 18, 2023 ప్రత్యేకమైన సెషన్లు.. ఈ పార్లమెంటు సమావేశాలకు సమయం చాలా తక్కువగా ఉన్నప్పటికీ సమయానుకూలంగా చూస్తే అది చాలా పెద్దదనే చెప్పాలి. ఇక ఈ సెషన్ గురించి చెప్పాలంటే ఇది చారిత్రక నిర్ణయాలకు వేదిక కానున్న సెషన్. ఈ సెషన్ ప్రత్యేకత ఏమిటంటే. 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్తానం కొత్త గమ్యం నుంచి మొదలవుతోంది. ఇప్పుడు సరికొత్త ప్రదేశం నుంచి మన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. భారత దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుబోయే నిర్ణయాలన్నీ కొత్త పార్లమెంటు భవనంలోనే నిర్ణయించబడతాయని అన్నారు. #WATCH | PM Narendra Modi says, "...This session of the Parliament is short but going by the time, it is huge. This is a session of historic decisions. A speciality of this session is that the journey of 75 years is starting from a new destination...Now, while taking forward the… pic.twitter.com/suOuM2pnyH — ANI (@ANI) September 18, 2023 మాపై ఏడవచ్చు.. ఇది సెషన్‌కు తక్కువ సమయం ఉన్నందున సెషన్ ఉత్సాహంగానూ ఫలప్రదంగానూ కొనసాగడానికి అనుకూల వాతావరణాన్ని కలిగించాలని వారి ఎంపీలు గరిష్ట సమయాన్ని దేనికి కేటాయించాలని కోరుతున్నానన్నారు. (రోనే ధోనే కే లియే బహుత్ సమయ హోతా హై, కర్తే రహియే) మాపై ఏడవటానికి, మమ్మల్ని ప్రశ్నించడానికి చాల సమయం ఉంటుంది మీరు ఆ పనే చేయండని అన్నారు. జీవితంలో కొన్ని క్షణాలు మనలో ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని నింపుతాయి. నేను ఈ చిన్న సెషన్‌నలో అలాంటి సందర్భాలను ఆశిస్తున్నాను అన్నారు. #WATCH | Special Session of Parliament | PM Narendra Modi says, "This is a short session. Their (MPs) maximum time should be devoted (to the Session) in an environment of enthusiasm and excitement. Rone dhone ke liye bahut samay hota hai, karte rahiye. There are a few moments in… pic.twitter.com/eLEy9GOmV4 — ANI (@ANI) September 18, 2023 రేపే కొత్త భవనంలోకి.. రేపు వినాయక చవితి సందర్బంగా మనం కొత్త పార్లమెంటుకు వెళ్ళబోతున్నాము. గణేశుడిని 'విఘ్నహర్త' అని కూడా అంటారు అంటే విఘ్నాలను హరించే వాడని అర్ధం.. ఇప్పుడు దేశాభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండవని.. ఎటువంటి విఘ్నాలు లేకుండా భారతదేశం స్వప్నాలన్నిటినీ సాకారం చేసుకుంటుందని (నిర్విఘ్న రూప్ సే సారే సప్నే సారే సంకల్ప్ భారత్ పరిపూర్ణ్ కరేగా) ఈ పార్లమెంట్ సమావేశాలకు సమయం తక్కువగా ఉన్నప్పటికీ చారిత్రాత్మకంగా నిలవనున్నాయని అన్నారు. #WATCH | Prime Minister Narendra Modi says "Tomorrow, on Ganesh Chaturthi, we will move to the new Parliament. Lord Ganesha is also known as ‘Vighnaharta’, now there will be no obstacles in the development of the country... 'Nirvighna roop se saare sapne saare sankalp Bharat… pic.twitter.com/P2DZmG3SRF — ANI (@ANI) September 18, 2023 అంతటా ఆసక్తి.. తొలిరోజు పార్లమెంట్ సమావేశాలు పాత పార్లమెంట్ భవనంలోనే జరగనుండగా రెండో రోజునుంచి మాత్రం ప్రత్యేక సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో జరుగుతాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జరిగబోయే ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశాల్లో మోదీ ప్రభుత్వం ఏవైనా అనూహ్య నిర్ణయాలను తీసుకోనుందా అన్న అనుమానాలు అంతటా వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా చదవండి: దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇలా.. -
రేపటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
-
పాత భవనంలో ప్రారంభమై... కొత్త భవనంలోకి
న్యూఢిల్లీ: ఈ నెల 18న మొదలై ఐదురోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగనున్న విషయం విదితమే. ఈ సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమై.. మరుసటి రోజు 19న కొత్త పార్లమెంటు భవనంలోకి మారుతాయని అధికారవర్గాలు బుధవారం తెలిపాయి. 19న వినాయక చవితి శుభదినం కాబట్టి ఆ రోజునుంచి కొత్త పార్లమెంటు భవనంలో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 9, 10 తేదీల్లో జరిగే జీ–20 సదస్సు తర్వాత పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా ఖరారు చేస్తారని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. సమావేశాల అజెండాపై స్పష్టత ఇవ్వాలని, అజెండా ఏమిటో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ వివరణ రావడం గమనార్హం. -
వచ్చే నెలలో ఢిల్లీలో జీ20 పార్లమెంట్ స్పీకర్ల భేటీ
న్యూఢిల్లీ: జీ20 కూటమి దేశాల పార్లమెంట్ స్పీకర్ల సమావేశం వచ్చే నెలలో ఢిల్లీలో జరగనుంది. అక్టోబర్ 12, 13, 14వ తేదీల్లో పార్లమెంట్ నూతన భవనం పార్లమెంట్–20 భేటీకి వేదిక కానుందని జీ20 ఇండియా స్పెషల్ సెక్రటరీ ముక్తేశ్ పర్దేశి చెప్పారు. జీ20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాల పార్లమెంట్ ప్రిసైడింగ్ అధికారులు పాల్గొని చర్చలు జరుపుతారని తెలిపారు. ‘పార్లమెంటేరియన్లు సంబంధిత ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. కాబట్టి, పీ20 సమావేశాలు ప్రపంచ పాలనకు పార్లమెంటరీ కోణాన్ని తీసుకురావడం, అవగాహన పెంచడం, అంతర్జాతీయ నిబంధనలకు రాజకీయ మద్దతును సాధించడం, వీటిని సమర్థంగా కార్యరూపం దాల్చేలా చేయడమే ఈ సమావేశాల లక్ష్యం’అనిముక్తేశ్ వివరించారు. భారత్‌ను ప్రజాస్వామ్యానికి తల్లిగా చూపేందుకు ఉద్దేశించిన ఒక ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. 2010లో జీ20 అధ్యక్ష స్థానంలో కెనడా ఉన్నప్పటి నుంచి పీ20 గ్రూప్ భేటీలు జరుగుతున్నాయని, ఆ క్రమంలో ఇది 9వదని వివరించారు. -
ప్రజల వద్దకు అభివృద్ధి పనులు
న్యూఢిల్లీ: గత తొమ్మిదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని ప్రధాని మోదీ చెప్పారు. వచ్చే తొమ్మిది నెలల కాలంలో ఈ పనుల గురించి ప్రజలకు వివరించాలని మంత్రివర్గ సహచరులను ఆయన కోరారు. సోమవారం రాత్రి ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రధానిమాట్లాడారు. 2047లో వందో స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే నాటికి మౌలిక వసతులు మొదలుకొని బడ్జెట్ పరిమాణం వరకు ప్రగతి ప్రయాణాన్ని వివరించే పవర్ ప్రజెంటేషన్ కూడా జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటి నుంచి 2047వ సంవత్సరం వరకు స్వర్ణయుగం, అమృత్ కాల్‌గా ప్రధాని మోదీ పేర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించిన ప్రధాని, అదే సమయంలో దేశం సాధించిన ప్రగతిని ప్రశంసించారు. విదేశాంగ, రక్షణ సహా పలు మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా, ఈజిప్టు దేశాల్లో పర్యటనల సందర్భంగా సాధించిన విజయాలను వారు వివరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సుమారు నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ కేటాయింపులను సరిగ్గా వినియోగించుకోవడమెలాగనే అంశంపైనా చర్చించారు. అనంతరం ప్రధాని మోదీ ట్విట్టర్లో..‘కేబినెట్ సమావేశం ఫలప్రదంగా సాగింది. వివిధ విధివిధానాలపై అభిప్రాయాలను పంచుకున్నాం’ అని పేర్కొన్నారు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు జరగనుండటం, ఇటీవల బీజేపీ అగ్ర నాయకత్వం వరుస సమావేశాలు జరుపుతున్న నేపథ్యంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కేబినెట్ భేటీ చర్చిస్తుందన్న వార్తలు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారమవుతున్న విషయం తెలిసిందే. -
దేశ మనోభావాలను కించపర్చారు
అజ్మీర్: పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. దేశ మనోభావాలను కాంగ్రెస్ కించపర్చిందని, 60,000 మంది కార్మికుల కఠోర శ్రమను అగౌరవపర్చిందని ధ్వజమెత్తారు. రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో బుధవారం ఓ ర్యాలీలో మోదీ ప్రసంగించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తొమ్మిదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. మూడు రోజుల క్రితం పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభించుకున్నామని, ప్రజలంతా గర్విస్తున్నారని, దేశ ప్రతిష్ట మరింత పెరగడంతో వారంతా సంతోషిస్తున్నారని మోదీ తెలిపారు. అన్నింటిలోనూ బురదజల్లే రాజకీయాలు చేసే కాంగ్రెస్, ఇతర పార్టీలు పార్లమెంట్ కొత్త భవనం విషయంలోనూ అదే పని చేస్తున్నాయని విమర్శించారు. పార్లమెంట్ కొత్త భవవాన్ని ప్రారంభించుకొనే అవకాశం కొన్ని తరాలకు ఒకసారి మాత్రమే వస్తుందని, కాంగ్రెస్ దాన్ని ‘స్వార్థపూరిత నిరసన’ కోసం వాడుకుందని ఆరోపించారు. మన దేశం సాధిస్తున్న ప్రగతిని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని వ్యాఖ్యానించారు. వారి అవినీతిని, కుటుంబ వారసత్వ రాజకీయాలను తాము ప్రశ్నిస్తున్నామని, అందుకే తమపై కోపంగా ఉన్నారని పరోక్షంగా సోనియా గాంధీ కుటుంబంపై విమర్శలు ఎక్కుపెట్టారు. వారి ఆరాచకాలను ఒక ‘నిరుపేద బిడ్డ’ సాగనివ్వడం లేదని, అది వారు తట్టుకోలేకపోతున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి వ్యవస్థ ‘‘పేదరికాన్ని సమూలంగా నిర్మూలిస్తామని 55 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, పేదలను దగా చేసింది. పేదలను తప్పుదోవ పట్టించడం, వారిని ఎప్పటికీ పేదలుగానే ఉంచడం కాంగ్రెస్ విధానం. కాంగ్రెస్ పాలనలో రాజస్తాన్ ప్రజలు ఎంతగానో నష్టపోయారు. తొమ్మిదేళ్ల బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజాసేవకు, సుపరిపాలనకు, నిరుపేదల సంక్షేమానికి అంకితం చేస్తున్నాం. 2014కు ముందు దేశంలో అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చేవారు. నగరాల్లో ఉగ్రవాద దాడులు జరిగేవి. అప్పట్లో రిమోట్ కంట్రోల్‌తో పాలన సాగేది. కాంగ్రెస్ పాలనలో ప్రజల రక్తాన్ని పీల్చే అవినీతి వ్యవస్థను అభివృద్ధి చేశారు. దేశ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ గురించి మాట్లాడుకుంటోంది. దేశంలో పేదరికం అంతమవుతోందని నిపుణులు చెబుతున్నారు. మన దేశం సాధించిన ప్రతి విజయం వెనుక ప్రజల చెమట చుక్కలు ఉన్నాయి. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి భారతీయులు ప్రదర్శిస్తున్న అంకితభావం ప్రశంసనీయం. కొందరు వ్యక్తులకు మాత్రం ఇది అర్థం కావడం లేదు’’ అని ప్రధాని మోదీ తప్పుపట్టారు. అజ్మీర్‌లో సభలో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ -
అరుదైన ఘట్టం!..జీవిత కాలంలో చూస్తానని ఊహించలేదు: దేవెగౌడ
న్యూఢిల్లీలోని కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ(91) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జీవిత కాలంలో ఈ కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకను చూస్తానని గానీ అందులోకి అడుగుపెట్టి కూర్చొంటానని గానీ ఊహించ లేదన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టమని, దాన్ని చూడటం తన అదృష్టమని ఆనందం వ్యక్తం చేశారు. తాను 1962లో కర్ణాట శాసనసభలో అడుగుపెట్టానని, 1961 నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాని చెప్పారు. 32 ఏళ్ల క్రితం ఈ గొప్ప ప్రజల సభలోకి అగడుపెట్టానన్నారు. ఐతే తాను ప్రధానిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని, ప్రజా జీవితంలో ఇంతకాలం కొనసాగుతానని కూడా ఊహించలేదన్నారు. అన్నింటికంటే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం.. కొత్త పార్లమెంట్‌లోకి అడుగుపెట్టడం, కూర్చొవడమే అన్నారు. 91 ఏళ్ల వయసులో ఇలా చేస్తానని కలలో కూడా అనుకోలేదని చెప్పారు. పాత పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించినప్పుడూ భారతదేశం ఇంకా వలసపాలనలోనే ఉందని, పూర్తి స్వేచ్ఛ రాలేదని పేర్కొన్నారు. నాటి జాతిపిత, ప్రముఖ జాతీయ వ్యక్తులను స్మరించుకుంటూ..మన దేశ పార్లమెంట్‌పై రక్తంతో తడిసిన కళంకం లేదన్నారు. తాము శాంతియుతంగా, అహింసా మార్గాల ద్వారా దేశానికి బానిస విముక్తి కలిగించి స్వతంత్యాన్ని సమపార్జించామని చెప్పారు. ఇది అత్యంత అమూల్యమైన విజయం అని, విలువలతో కూడిన వ్యవస్థను కాపాడు కోవడమే గాక మన భావితరాలకు అందించాలన్నారు. "అలాగే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పార్లమెంట్ ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. అది పలువురు నాయకుల అహంకారం, వినయం, గెలుపోటములు చూసింది. మొత్తంగా అది సమతుల్యతను కాపాడుకుంటూ.. భారతదేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రయత్నించింది. ఈ పార్లమెంట్ అన్ని కులాలు, జాతులు, మతాలు, భాషలు తోసహ అన్ని భౌగోళికాలను పోషించింది. ఇది అన్ని రకాల అభిప్రాయాలు, ఆలోచనలు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంది. ఇలా భారతదేశ వైవిధ్యాన్ని కాపాడే ప్రజాస్వామ్యానికి కొత్త ఇల్లు. ఈ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ సెల్యూట్ చేస్తున్నా. మన సుసంపన్నమైన ప్రజాస్వామ్య సంప్రదాయం కొనసాగాలని, కాలం గడిచే కొద్ది అభివృద్ధి చెందుతూ ప్రకాశవంతంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా" అని అన్నారు దేవెగౌడ. (చదవండి: 'సెంగోల్' ఒరిగిపోయింది!: స్టాలిన్) -
పార్లమెంట్ నూతన భవనం: ఖర్చెంత.. కట్టిందెవరు? ఆసక్తికర విషయాలు..
భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేశ పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా తాజాగా ప్రారంభించారు. రూ.20,000 కోట్ల సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా కొత్త పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. 65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాత భవనం కంటే మూడు రెట్లు అధిక పరిమాణంలో ఆకట్టుకునే హంగులతో కొత్త పార్లమెంట్ భవనం రూపొందింది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పార్లమెంట్ భవనాన్ని ఏ నిర్మాణ సంస్థ కట్టింది. భవన నిర్మాణానికి ఎంత ఖర్చయింది.. వంటి ఆసక్తికరమైన విషయాలు మీ కోసం... నిర్మాణ సంస్థ ఇదే.. భారత పార్లమెంట్ నూతన భవనాన్ని టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ నిర్మించింది. 2020లో లార్సెన్ అండ్ టూబ్రో (L&T)పై రూ. 3.1 కోట్ల స్వల్ప మార్జిన్‌తో రూ. 861.9 కోట్లకు ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. మొదట్లో షాపూర్జీ పల్లోంజీ సంస్థ పోటీలో నిలిచినా తరువాత బిడ్డింగ్ ప్రక్రియ నుంచి వైదొలింది. రూ.940 కోట్లు.. 21 నెలల్లోనే పూర్తి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ప్రకారం.. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.940 కోట్లు. కొత్త పార్లమెంటు భవన నిర్మాణాన్ని కేవలం 21 నెలల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించింది టాటా కంపెనీ. ఇదీ చదవండి: రూ.75 నాణెం విడుదల.. కొత్త కాయిన్ ఇలా పొందండి.. -
తొలిరోజే 'సెంగోల్' ఒరిగిపోయింది!: స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
పార్లమెంట్ ప్రారంభోత్సవం తొలిరోజే ప్రతిష్టించిన చారిత్రాత్మక సెంగోల్ ఒరిగిపోయిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చారిత్రాత్మక సెంగోల్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని మాటల దాడి చేశారు. సరిగ్గా ప్రారంభోత్సవం రోజే ధర్మానికి ప్రతీక, మన చారిత్రక సంప్రదాయం అపహాస్యం పాలైందంటూ విమర్శలు కురిపించారు స్టాలిన్. భారత రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత రెజ్లర్లు పార్లమెంట్ కొత్త భవనం వెలుపల నిరసన చేసేందుకు యత్నించడంతో ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు సీఎం బీజేపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ గత కొన్ని నెలలుగా నిరసనలు చేస్తున్నా ఇంతవరకు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పైగా శాంతియుతంగా పార్లమెంట్ వెలుపల నిరసన చేసేందుకు వచ్చిన రెజ్లర్లను ఈడ్చుకెళ్తూ..వారిని అదుపులోకి తీసుకెళ్లడం అనేది తీవ్రంగా ఖండించదగినదన్నారు. న్యాయం చేయలేక ధర్మానికి ప్రతీక అయిన సెంగోల్ తొలిరోజే వంగినట్లు కనిపించింది అని మండిపడ్డారు. రాష్ట్రపతిని పక్కకు తప్పించి, ప్రతిపక్షాల బహిష్కరణల మధ్య కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం రోజున ఇలాంటి దారుణం జరగడం న్యాయమేనా? అని డీఎంకే నేత స్టాలిన్ ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు. (చదవండి: శుభోదయం.. నవోదయం) -
దేశానికి గర్వకారణం: రాష్ట్రపతి
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావడాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వాగతించారు. ‘దేశానికి ఇది గర్వకారణం, సంతోషకరమైన విషయం. దేశ చరిత్రలో పార్లమెంట్ నూతన భవన ప్రారంభం స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ అంశం. పార్లమెంట్‌పై విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించడం చాలా సంతృప్తినిచ్చింది’అని ఆమె అన్నారు. భారత ప్రజాస్వామ్యం గొప్ప సంప్రదాయాలు, ఆదర్శాలకు కొత్త ప్రమాణాలను నెలకొల్పాలని ఆకాంక్షించారు. ఈ మేరకు రాష్ట్రపతి పంపిన సందేశాన్ని పార్లమెంట్ ప్రారంభం సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చదివి వినిపించారు. దేశ ప్రగతికి సాక్షి : ఉప రాష్ట్రపతి పార్లమెంట్ కొత్త సౌధంపార్లమెంట్ నూతన భవనం, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, భారత ప్రజాస్వామ్యం, రాజకీయ ఏకాభిప్రాయ సాధనకు, బానిస మనస్తత్వం నుంచి పొందిన స్వేచ్ఛకు ప్రతీకగా ఉపయోగపడాలని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆకాంక్షించారు. కొత్త భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ మేరకు సందేశమిచ్చారు. ఈ సందేశాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ లోక్‌సభ చాంబర్లో చదివి వినిపించారు. ప్రజల ఆకాంక్షలను నిజం చేయడానికి, వారి సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి ఈ భవనం తోడ్పడాలని జగదీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు. అమృతకాలంలో నిర్మించిన ప్రజాస్వామ్య సౌధం ఇప్పుడు మాత్రమే కాదు, భవిష్యత్తులోనూ మన దేశ ప్రగతికి సాక్షిగా నిలుస్తుందని వివరించారు. రాబోయే కాలంలో ఎన్నెన్నో చారిత్రక అధ్యాయాలను లిఖించడానికి ఇదొక వేదిక అవుతుందన్నారు. ప్రధాని మోదీ పార్లమెంట్ కొత్త భవనాన్ని జాతికి అంకితం చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని దన్ఖడ్ వెల్లడించారు. -
శుభోదయం.. నవోదయం
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం దేశ అభివృద్ధి ప్రయాణంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. స్వావలంబన, అభివృద్ధి భారత్‌కు ఇదొక శుభోదయమని చెప్పారు. మన పార్లమెంట్ కొత్త భవనం ఇతర దేశాల ప్రగతికి సైతం స్ఫూర్తిగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. ఆదివారం పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవం సందర్భంగా లోక్‌సభ సభామందిరంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘నవ భారత్’ ఆశలు ఆకాంక్షలను, నూతన లక్ష్యాలను కొత్త భవనం ప్రతిబింబిస్తోందని అన్నారు. ఇక్కడ తీసుకొనే ప్రతి నిర్ణయం దేశ మహోన్నత భవిష్యత్తుకు పునాది వేస్తుందని చెప్పారు. పేదలు, దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు, దివ్యాంగులు, ఇతర అణగారిన వర్గాల సాధికారతకు ఇక్కడే ముందడుగు పడుతుందని వివరించారు. పార్లమెంట్ కొత్త భవనంలోని ప్రతి ఇటుక, ప్రతి గోడ పేదల సంక్షేమానికే అంకితమని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... బానిస మనస్తత్వాన్ని వదిలించుకుంటున్నాం ‘‘75వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని దేశ ప్రజలు అమృత మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పార్లమెంట్ కొత్త భవనాన్ని తమ ప్రజాస్వామ్యానికి కానుకగా ఇచ్చుకున్నారు. దేశ ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నా. మన దేశ వైవిధ్యాన్ని, ఘనమైన సంప్రదాయాన్ని పార్లమెంట్ కొత్త భవన నిర్మాణశైలి చక్కగా ప్రతిబింబిస్తుండడం హర్షణీయం. వందల సంవత్సరాల వలస పాలన వల్ల అణువణువునా పాకిపోయిన బానిస మనస్తత్వాన్ని నవ భారతదేశం వదిలించుకుంటోంది. మహాత్మాగాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం దేశ ప్రజలను మేల్కొల్పింది. నూతన చైతన్యాన్ని నింపింది. స్వాతంత్య్ర కాంక్షను రగిలించింది. స్వాతంత్య్ర పోరాటానికి అంకితమయ్యేలా ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలిగించింది. రాబోయే 25 ఏళ్లలో దేశ అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు అదే తరహాలో పనిచేయాలి. సహాయ నిరాకరణ ఉద్యమం 1922లో ముగిసింది. మరో 25 ఏళ్లకు.. 1947లో స్వాతంత్య్రం వచ్చింది. 2047లో మనం వందో స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకోబోతున్నాం. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవడానికి మనమంతా కంకణబద్ధులమై పనిచేయాలి. కొత్త భవనం.. ప్రజాస్వామ్య దేవాలయం ఇది కేవలం ఒక నిర్మాణం కాదు, 140 కోట్ల మంది ఆకాంక్షలకు, కలలకు ప్రతిరూపం. మన స్వాతంత్య్ర సమర యోధుల కలలను సాకారం చేయడానికి ఇదొక వేదిక. ఇది మన ప్రజాస్వామ్య దేవాలయం. భారతదేశ దృఢసంకల్పం ప్రపంచానికి ఇస్తున్న సందేశమిది. ప్రతి దేశ చరిత్రలో అమరత్వం పొందిన క్షణాలు కొన్ని ఉంటాయి. కాలం ముఖచిత్రంపై కొన్ని తేదీలు చెరిగిపోని సంతకంగా మారుతాయి. 2023 మే 28 కూడా అలాంటి అరుదైన సందర్భమే. పేదల ప్రజల సాధికారత, అభివృద్ధి, పునర్నిర్మాణం కోసం గత తొమ్మిదేళ్లుగా కృషి చేస్తున్నాం. ఇది నాకు సంతృప్తినిస్తున్న క్షణం. పేదలకు 4 కోట్ల ఇళ్లు నిర్మించి ఇచ్చాం. 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం. గ్రామాలను అనుసంధానించడానికి 4 లక్షల కిలోమీటర్లకుపైగా రహదారులు నిర్మించాం. 50,000కుపైగా అమృత సరోవరాలు(చెరువులు), 30,000కుపైగా కొత్త పంచాయతీ భవనాలు నిర్మించాం. పంచాయతీ భననాల నుంచి పార్లమెంట్ కొత్త భవనం దాకా కేవలం ఒకేఒక్క స్ఫూర్తి మమ్మల్ని ముందుకు నడిపించింది. అదే.. దేశ అభివృద్ధి, ప్రజల అభివృద్ధి. కొత్త దారుల్లో నడిస్తేనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. భారత్ ఇప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది. నూతనోత్సాహం కనిపిస్తోంది. కొత్త ఆలోచన, కొత్త ప్రయాణం. దిశ కొత్తదే, విజన్ కొత్తదే. మన విశ్వాసం, తీర్మానం కూడా కొత్తవే. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. భారత్ ముందుకు నడిస్తే ప్రపంచం కూడా ముందుకు నడుస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ ఆవిర్భావానికి సాక్షి ఇప్పటి అవసరాలకు పాత భవనం సరిపోవడం లేదు. అందుకే కొత్తది నిర్మించాం. కొత్తగా మరికొంత మంది ఎంపీలు చేరనున్నారు. 2026 తర్వాత పునర్వ్యస్థీకరణతో పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. సెంగోల్‌కు తగిన గౌరవం దక్కుతుండడం సంతోషకరం. చోళ సామ్రాజ్యంలో సెంగోల్‌ను కర్తవ్య మార్గం, సేవా మార్గం, జాతీయ మార్గానికి గుర్తుగా పరిగణించేవారు. కొత్త భవన నిర్మాణంలో 60,000 మంది కార్మికులు పాల్గొన్నారు. ఇక్కడి డిజిటల్ గ్యాలరీని వారికే అంకితమిస్తున్నాం. ఈ కొత్త భవనం ఆత్మనిర్భర్ భారత్ ఆవిర్భావానికి, వికసిత భారత్ దిశగా మన ప్రయాణానికి ఒక సాక్షిగా నిలుస్తుంది. భారత్ విజయం ప్రపంచ విజయం భారత్‌లాంటి పూర్తి వైవిధ్యం, అధిక జనాభా ఉన్న దేశం పరిష్కరించే సవాళ్లు, సాధించే విజయాలు చాలా దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. రాబోయే రోజుల్లో భారత్ సాధించే ప్రతి విజయం ప్రపంచం సాధించే విజయంగా మారుతుంది. భారత్ కేవలం ఒక ప్రజాస్వామ్య దేశం కాదు, ప్రజాస్వామ్యానికి తల్లి కూడా. మన ప్రజాస్వామ్యమే మనకు స్ఫూర్తి. మన రాజ్యాంగమే మన బలం. ఈ స్ఫూర్తికి, బలానికి ఉత్తమమైన ప్రతీక పార్లమెంట్. పాత కొత్తల కలయికకు పరిపూర్ణ ఉదాహరణ పార్లమెంట్ నూతన భవనం. శతాబ్దాల బానిసత్వం కారణంగా మన ఉజ్వలమైన భవన నిర్మాణ శైలికి, పట్టణ ప్రణాళికకు దూరమయ్యాం. ఇప్పుడు ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించుకుంటున్నాం. పార్లమెంట్ కొత్త భవనాన్ని చూసి ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారు. మన వారసత్వం వైభవం, నైపుణ్యాలు, సంస్కృతితోపాటు రాజ్యాంగ వాణికి సైతం ఈ భవనం ప్రాతినిధ్యం వహిస్తోంది. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన సామగ్రితో కొత్త భవనం నిర్మించాం. ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్‌కు ఇదొక గుర్తు. ప్రారంభోత్సవం సాగింది ఇలా..! అత్యాధునిక హంగులు, సకల సదుపాయాలతో నిర్మించిన ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటు కొత్త భవనాన్ని ఆదివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అట్టహాసంగా ఒక ఉత్సవంలా సాగిన ఈ వేడుకలో ప్రధాని చారిత్రక ప్రాధాన్యమున్న అధికార మార్పిడికి గుర్తయిన రాజదండం (సెంగోల్)ను లోక్‌సభ ఛాంబర్లో ప్రతిష్టించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితమిచ్చారు. ► సంప్రదాయ దుస్తులు ధరించిన ప్రధాని మోదీ ఉదయం 7.30 గంటలకి పార్లమెంటుకు వచ్చారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధానికి ఎదురేగి స్వాగతం పలికారు. ► పార్లమెంటు ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ప్రధాని మోదీ నివాళులర్పించారు ► అక్కడ నుంచి నేరుగా కొత్త భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన పూజామండపానికి చేరుకున్నారు. అక్కడ ప్రధానికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కర్ణాటక శృంగేరి మఠాధిపతులు వేద మంత్రాలు పఠిస్తూ ఉంటే ప్రధాని మోదీ గణపతి హోమం నిర్వహించారు. దీంతో పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ► అనంతరం వేద పండితులు ప్రధానికి శాలువా కప్పి ఆశీర్వాదాలు అందజేశారు. ► అక్కడ నుంచి తమిళనాడు నుంచి వచ్చిన 21 మంది పీఠాధిపతులు వద్దకి వెళ్లారు. వారికి నమస్కరించారు. అప్పటికే పూజలు చేసి సిద్ధంగా అక్కడ ఉంచిన చారిత్రక సెంగోల్ ఎదుట ప్రధాని సాష్టాంగ నమస్కారం చేశారు. వారు అందించిన సెంగోల్‌ను చేత పుచ్చుకున్న ప్రధాని మోదీ వీనుల విందుగా నాదస్వరం వాయిస్తూ ఉంటే, వేద పండితులు మంత్రాలు పఠిస్తూ ఉంటే స్పీకర్ ఓం బిర్లా వెంటరాగా ఒక ఊరేగింపుగా వెళ్లి సెంగోల్‌ను లోక్‌సభ ఛాంబర్లోకి తీసుకువెళ్లి స్పీకర్ కుర్చీకి కుడివైపు ప్రతిష్టించారు. ► అనంతరం స్పీకర్ ఆసీనులయ్యే సీటు దగ్గర ప్రధాని జ్యోతి ప్రజ్వలన చేశారు. ► లోక్‌సభ నుంచి తిరిగి ప్రధాని మోదీ పూజాస్థలికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో ఆవిష్కరించి నూతన పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేశారు. ► అనంతరం కొత్త భవన నిర్మాణంలో పాలుపంచుకున్న కొంతమంది కార్మికులకు శాలువాలు కప్పి సత్కరించారు. వారి ప్రతిభకి గుర్తింపుగా జ్ఞాపికలను బహూకరించారు. ► అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ► దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూ.75 స్మారక నాణేన్ని ప్రధాని ఆవిష్కరించారు. త్రిభుజాకారంలో ఉన్న కొత్త భవనం ముద్రించి ఉన్న స్టాంపు, కవర్ని కూడా ఆవిష్కరించారు. ► రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పంపించిన సందేశాలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చదివి వినిపించారు. ► కార్యక్రమంలో భాగంగా లోక్‌సభలో నేతల సమక్షంలో జాతీయ గీతం అయిన జనగణమన వినిపించారు. ► ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్. జైశంకర్, అశ్వినీ వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. ► నూతన భవనం ప్రారంభోత్సవానికి కనీసం 20 విపక్ష పార్టీలు హాజరు కాలేదు. -
రూ.75 నాణెం విడుదల.. కొత్త కాయిన్ ఇలా పొందండి..
Rs 75 coin: భారత పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (మే 28) 75 రూపాయల స్మారక నాణేన్ని విడుదల చేశారు. ఈ కాయిన్‌ను విడుదల గురించి మొదటగా గురువారం (మే 25) విడుదల చేసిన నోటిఫికేషన్లో కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా 75 రూపాయల స్మారక నాణేన్ని టంకశాలలో తయారు చేస్తున్నట్లు తెలిపింది. కొత్త కాయిన్ ఎక్కడ లభిస్తుంది? ప్రత్యేక సందర్భాల్లో వివిధ డినామినేషన్లలో విడుదల చేసే కాయిన్లు, స్మారక నాణేలు నేరుగా చలామణిలోకి రావు. ఇవి చలామణి కోసం ఉద్దేశించినవి కావు. ఈ స్మారక నాణేలు కావాలంటే సెక్యూరిటీస్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ దానికి సంబంధించి పేర్కొన్న ధరను చెల్లించి ఆ కాయిన్లు పొందవచ్చు. అటువంటి నాణేలు కేవలం సేకరించదగినవిగా మాత్రమే ఉంటాయి. ఎందుకంటే వాటి విలువ వాటి ముఖ విలువకు సమానంగా ఉండకపోవచ్చు. వాటిని వెండి లేదా బంగారం వంటి విలువైన లోహాలతో తయారు చేస్తారు. తాజా విడుదల చేసిన రూ.75 స్మారక నాణెంలో కూడా 50 శాతం వెండి లోహం ఉంది. 2018లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గౌరవార్థం 100 రూపాయల స్మారక నాణాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. సెక్యూరిటీస్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) వెబ్సైట్లో రూ.5,717కు అందుబాటులో ఉంది. ఈ నాణెంలో 50 శాతం వెండి, మిగిలినవి ఇతర లోహాలు ఉన్నాయి. ప్రముఖ వ్యక్తులకు నివాళులు అర్పించడం, ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించడం లేదా కీలకమైన చారిత్రక సంఘటనలకు గుర్తుకు దేశంలో 1960ల నుంచి స్మారక నాణేలను విడుదల చూస్తున్నారు. Hon'ble Prime Minister Shri @narendramodi releases the commemorative Rs 75 coin in the new Parliament during the inauguration ceremony. #MyParliamentMyPride pic.twitter.com/BpFmPTS5sT — NSitharamanOffice (@nsitharamanoffc) May 28, 2023 ఇదీ చదవండి: బ్యాంక్ లాకర్ డెడ్‌లైన్: ఖాతాదారులకు బ్యాంకుల అలర్ట్.. -
శాంతియుత నిరసన.. రెజ్లర్లకు ఘోర అవమానం
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు కొన్ని వారాలుగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. లైంగికంగా వేధించిన రెజ్లర్ సంఘ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్‌పై చర్యలు తీసుకోవాలని మహిళా రెజ్లర్లు గత కొన్నాళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరికి పలు వర్గాల నుంచి పూర్తి మద్దతు లభించింది. అయితే ఆదివారం రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా తదితరులు ఆదివారం కొత్త పార్లమెంటు వైపు నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. ఇవాళే కొత్తగా ప్రారంభమైన నూతన పార్లమెంట్ భవనం ముందు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలకు డిమాండ్ చేస్తూ ''మహిళా మహాపంచాయత్'' నిర్వహించాలని రెజ్లర్లు నిర్ణయించారు. ఈ మేరకు నూతన పార్లమెంట్ భవనం వైపు ర్యాలీగా వెళ్తున్న రెజ్లర్లను పోలీసులు జంతర్‌మంతర్ వద్ద అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆందోళనలో పాల్గొన్న పలువురు రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్, మరో రెజ్లర్ బజరంగ్ పూనియా ఉన్నారు. కాగా, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని రెజ్లర్లు మండిపడుతున్నారు. మేం బారీకేడ్లు విరగొట్టామా..? ఇంకేమైనా హద్దులు మీరామా..? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. #WATCH | Delhi: Security personnel stop & detain protesting wrestlers as they try to march towards the new Parliament from their site of protest at Jantar Mantar.Wrestlers are trying to march towards the new Parliament as they want to hold a women's Maha Panchayat in front of… pic.twitter.com/3vfTNi0rXl— ANI (@ANI) May 28, 2023 #WATCH | Mahapanchayat will certainly be held today. We're fighting for our self-respect.They're inaugurating the new Parliament building today, but murdering democracy in the country.We appeal to the administration to release our people detained by police: Wrestler Bajrang Punia pic.twitter.com/VI4kGLxGWV— ANI (@ANI) May 28, 2023 To all my international fraternity Our Prime Minister is inaugurating our new parliamentBut on the other hand, Our supporters has been arrested for supporting us.By arresting people how we can call us “mother of democracy”India’s daughters are in pain.— Sakshee Malikkh (@SakshiMalik) May 28, 2023 जंतर मंतर पर सरेआम लोकतंत्र की हत्या हो रही एक तरफ़ लोकतंत्र के नये भवन का उद्घाटन किया है प्रधानमंत्री जी ने दूसरी तरफ़ हमारे लोगों की गिरफ़्तारियाँ चालू हैं. pic.twitter.com/ry5Wv9xn5A— Vinesh Phogat (@Phogat_Vinesh) May 28, 2023 చదవండి: స్కూటీపై చక్కర్లు; ఆ ఇద్దరు గుజరాత్ బలం.. జాగ్రత్త -
ప్రారంభోత్సవమా? పట్టాభిషేకమా?
న్యూఢిల్లీ: పార్లమెంట్ అనేది ప్రజల గొంతుక అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని పట్టాభిషేక కార్యక్రమంలా నిర్వహించారని ఆక్షేపించారు. ఈ మేరకు రాహుల్ ట్వీట్ చేశారు. ప్రజస్వామ్యం మనగలిగేది భవనాల్లో కాదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. ప్రజల గొంతుకల్లో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యం, జాతీయవాదం, ఆడశిశువుల సంరక్షణపై బీజేపీ–ఆర్ఎస్ఎస్ పాలకులు చెబుతున్న మాటల్లోని డొల్లతనం బయటపడిందన్నారు. పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవం సందర్భంగా మహిళా రెజ్లర్లపై దాడి చేయడం దారుణమని విమర్శించారు. పార్లమెంట్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పుడు అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను దూరంగా ఉంచారని, ఇప్పుడు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును దూరం పెట్టారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. ఎన్నికల రాజకీయాల కోసం దళితులను, గిరిజనులను పావులుగా వాడుకోవడం ప్రధాని మోదీకి అలవాటేనని దుయ్యబట్టారు. చరిత్రాత్మక సందర్భానికి రాష్ట్రపతిని దూరం పెట్టడం ఏమిటని నిలదీశారు. ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ ట్వీట్‌పై బీజేపీ ఎంపీ సుశీల్‌కుమార్ సింగ్ స్పందించారు. నరేంద్ర మోదీకి దేశ ప్రజలు రెండుసార్లు అధికారం కట్టబెట్టడాన్ని రాహుల్ గాంధీ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే మోదీపై అసూయ పెంచుకున్నారని విమర్శించారు. భారీ ప్రచార కార్యక్రమం.. పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించిన తీరుపై వామపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమం చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవంలా ఉందని వ్యాఖ్యానించాయి. దేశ ప్రజలను భాగస్వాములుగా చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘న్యూ ఇండియా’అనే ప్రకటనతో భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రతిపక్ష పార్టీలు ఎవరూ లేకుండానే పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన మోదీ ప్రభుత్వం దీనిని భారీ ప్రచార కార్యక్రమంగా మార్చుకుందని సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు. ఒక వైపు సెంగోల్‌కు పూజలు చేసిన మోదీ ప్రభుత్వం మరోవైపు రెజ్లర్లపై లాఠీలను ఝళిపించిందని సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వమ్ ఆరోపించారు. మున్ముందు నిరంకుశ ఫాసిస్ట్ విధానాలు సాగుతాయనేందుకు ఈ ఘటనలే నిదర్శనమన్నారు. చక్రవర్తి పట్టాభిషేకం మాదిరిగా పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం జరుగుతుండగానే మహిళా రెజ్లర్లు, మహిళా పంచాయత్‌కు వచ్చిన మహిళలపై పోలీసు జులుం సాగింది. ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తిపై నిరంకుశ దాడి’అని సీపీఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య పేర్కొన్నారు. मैं भारत की आवाज़ के लिए लड़ रहा हूं। मैं हर कीमत चुकाने को तैयार हूं। — Rahul Gandhi (@RahulGandhi) March 24, 2023 తిరోగమనానికి నిదర్శనం: పవార్ పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ వివిధ మతసంబంధ పూజలు చేయడంపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశం వెనక్కి వెళుతోందనటానికి ఇవే నిదర్శమన్నారు. ‘మన సమాజంలో శాస్త్రీయ దృక్పథం పెంపొందాలని భారత ప్రథమ ప్రధాని నెహ్రూ ఆకాంక్షించారు. కొత్త పార్లమెంట్ భవన సముదాయం ప్రారంభం సందర్భంగా నిర్వహించిన మతాచారాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి’అని పవార్ పుణేలో మీడియాతో పేర్కొన్నారు. మన దేశం కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్తున్నట్లు భయం కలుగుతోందన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కూడా ఆహ్వానించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతోనే ప్రారంభమవుతున్నప్పుడు వారిని ఆహ్వానించకపోవడమేంటన్నారు. ‘పార్లమెంట్ నూతన భవనం ప్రారంభానికి నాకు ఆహ్వానం పంపిందీ లేనిదీ తెలియదు. ఒక వేళ ఢిల్లీలోని నా కార్యాలయానికి ఆహ్వానం వచ్చి ఉంటుందేమో తెలియదు’అని వ్యాఖ్యానించారు. శవపేటికలా పార్లమెంట్ భవనం: ఆర్జేడీ వివాదాస్పద ట్వీట్ బిహార్‌లోని అధికార పార్టీ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ )పార్లమెంట్ నూతన భవనాన్ని శవపేటికతో పోల్చింది. పార్లమెంట్ కొత్త భవనం శవపేటిక మాదిరిగా త్రిభుజాకారంలో ఉందంటూ బిహార్ అధికార ఆర్జేడీ ఆదివారం ట్వీట్ చేసింది. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఆర్జేడీని శవపేటికలోనే సమాధి చేస్తారంటూ వ్యాఖ్యానించింది. ‘ఆర్జేడీ అథమ స్థితికి దిగజారింది. త్రికోణానికి భారతీయ వ్యవస్థలో ఎంతో ప్రాధాన్యం ఉంది. శవపేటిక షట్కోణంగా గానీ బహుభుజిగా కానీ ఉంటుందని తెలుసుకోవాలి’అని పేర్కొంది. అయితే, ఆర్జేడీ తన వ్యాఖ్యలను సమర్థించుకుంది. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టింది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని గానీ, రాజ్యసభాధ్యక్షుడైన ఉపరాష్ట్రపతిని గానీ పిలవలేదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి జరగవు’అంటూ ఆ పార్టీ ట్వీట్ చేసింది. ఇదీ చదవండి:త్వరలో ఎంపీల సీట్లు పెరుగుతాయి: ప్రధాని మోదీ -
భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచమూ అభివృద్ధి చెందుతుంది
-
త్వరలో ఎంపీల సీట్లు పెరుగుతాయి: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం, కొత్త పార్లమెంట్లో సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణసింగ్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ప్రతీ దేశ చరిత్రలో కొన్ని సందర్భాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. అమృత్‌మహోత్సవ్ వేళ నూతన పార్లమెంట్ భవనాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇది కేవలం భవనం మాత్రమే కాదు. 140 కోట్ల భారతీయుల ఆక్షాంకలకు ప్రతీక. కొత్త పార్లమెంట్ భవనం భారతీయల ధృడ సంకల్పాన్ని చాటి చెబుతుంది. స్వాతంత్ర్య పోరాట ఆకాంక్షలను పూర్తి చేసేందుకు కొత్త పార్లమెంట్ భవనం సాధనంగా ఉపయోగపడుతుంది. ఈ భవనం పూరాతన నుంచి నూతనత్వానికి మాధ్యమం. ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఆధునిక భారత్‌కు కొత్త పార్లమెంట్ అద్దం పడుతుంది. పాత పార్లమెంట్ భవనంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. #WATCH | India is the mother of democracy. It is also the foundation of global democracy. Democracy is our 'Sanskaar', idea & tradition: PM Modi#NewParliamentBuilding pic.twitter.com/IGMkWlhqrm — ANI (@ANI) May 28, 2023 ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయం. ప్రవితమైన సెంగోల్‌ను పార్లమెంట్లో ప్రతిష్టించాం. సెంగోల్.. చోళుల కాలంలో కర్తవ్య నిష్టకు ప్రతీక. ఆత్మనిర్భర్ భారత్‌కు సాక్షిగా పార్లమెంట్ నిలుస్తుంది. భారత్ కొత్త లక్ష్యాలను ఎంచుకుంది. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిలాంటిది. భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలను పార్లమెంట్ గౌరవిస్తుంది. #WATCH | It is our good fortune that we have been able to restore the pride of the holy 'Sengol'. Whenever proceedings start in this House the 'Sengol' will inspire us: PM Modi in the new Parliament pic.twitter.com/6E2F9f2RSp — ANI (@ANI) May 28, 2023 లోక్‌సభ ప్రాంగణం నెమలి రూపంలో రాజ్యసభ ప్రాంగణం కమలాన్ని ప్రతిబింబిస్తుంది. గత 9 ఏళ్లలో 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు కట్టించాం. ఎక్కడైనా ఆగిపోతే అభివృద్ధి అక్కడే ఆగిపోతుంది. ప్రజాస్వామ్యంలో ముందుకెళ్తూనే ఉండాలి. వచ్చే 25 ఏళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుంది. #WATCH | "There was a need for new Parliament. We also have to see that the number of seats and MPs will increase in the coming time. That's why it was need of the hour that a new Parliament is made": PM Modi#NewParliamentBuilding pic.twitter.com/npVAbuyIec — ANI (@ANI) May 28, 2023 రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుంది. లోక్‌సభ సీట్లు పెరిగితే మరింత ఎక్కువ మంది కూర్చునే విధంగా కొత్త పార్లమెంట్ భవనంలో వెసులుబాటు ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పార్లమెంట్ నిర్మించాం. ఇతర దేశాలకు భారత్ సాగించిన ప్రయాణం ఆదర్శంగా నిలుస్తుంది. అందరిలోనూ దేశమే ముందు అన్న భావన కలగాలి. వచ్చే 25 ఏళ్లు దేశాభివృద్ధికి పాటుపడాలి. భారత్ విజయ ప్రస్తానం రాబోయే రోజుల్లో మిగిలిన దేశాలకు ప్రేరణ. పార్లమెంట్లో తీసుకునే ప్రతీ నిర్ణయం రాబోయే తరాలను బలోపేతం చేస్తుంది. ఈరోజ చరిత్రలో నిలిచిపోతుంది’ అని అన్నారు. #WATCH | Prime Minister Narendra Modi interacts with several leaders after concluding his speech in Lok Sabha in the new Parliament. pic.twitter.com/NWiWZA1WRW — ANI (@ANI) May 28, 2023 -
కొత్త పార్లమెంట్ భవనం వద్ద రెజ్లర్లు నిరసనకు ప్లాన్..కానీ అనూహ్యంగా..
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ని అరెస్టే చేయాల్సిందే అంటూ జంతర్‌మంతర్ వద్ద భారత అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆదివారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం జరగుతున్నందున్న ఒలింపియన్లు, కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్లతో సహా భారత అగ్రశ్రేణి రెజ్లర్లంతా అక్కడే నిరసనలు చేసేందుకు ప్లాన్ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని, నిరసనను ఆపించేశారు. ఈ నేపథ్యంలో కొందరు రెజ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా రెజ్లర్లు నిర్వహిస్తున్న మహిళా మహా పంచాయత్ కోసం వేలాదిగా భద్రతా సిబ్బంది మోహరించారు. అదీగాక పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం కోసం అదనపు పోలీసులు ఢిల్లీ సరిహద్దుల వెంబడి మెహరింపు తోపాటు బహుళ బారికేడ్లు, కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేసేలా డిల్లీ మెట్రోలోని సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ భవన్ స్టేషన్లలోని అన్ని ప్రవేశ మార్గాలను అదికారులు మూసేశారు. #WATCH | Delhi: Security personnel stop & detain protesting wrestlers as they try to march towards the new Parliament from their site of protest at Jantar Mantar. Wrestlers are trying to march towards the new Parliament as they want to hold a women's Maha Panchayat in front of… pic.twitter.com/3vfTNi0rXl — ANI (@ANI) May 28, 2023 ఈ మేరకు ఢిల్లీ పోలీసు కమిషనర్ దేవేంద్ర పాఠక్ మీడియాతో మాట్లాడుతూ..రెజ్లర్ల నిరసనకు అనుమతి నిరాకరించినప్పటికీ..వారంతా కొత్త భవనం సమీపంలో మహిళా మహా పంచాయత్‌ను నిర్వహించాలని పట్టుబట్టారు. ఐతే తాము అథ్లెట్లను గౌరవిస్తాం. కానీ లా అండ్ ఆర్డర్‌కి విఘాతం కలిగించే పనులకు అనుమతివ్వం. అలాగే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో ఎలాంటి ఆటంకాలు రానివ్వం అని చెప్పారు. మరోవైపు రెజ్లర్లకు సంఘీభావం తెలిపేందుకు ఢిల్లీలోని ఘాజీపూర్ సరిహద్దు వద్ద వేలాది మంది రైతులు తరలివస్తారని ప్రముఖ రైతు నాయకుడు రాకేష్ టికైత్ ప్రకటించారు. ఈ రైతులు వివిధ సరిహద్దు ప్రాంతాల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించాలని ప్లాన్ చేసుకున్నారు. దీంతో భద్రత బలగాలు ఢిల్లీ సరిహద్దుల వెంబడి నిఘా ఉంచడమే గాక తనిఖీలు నిర్వహించకుండా ఎవ్వరినీ అనుమతించకుండా గట్టి పహారా నిర్వహించారు. (చదవండి: కొత్త పార్లమెంట్ భవనం కోసం షారూఖ్, అక్షయ్ కూమార్‌ల వాయిస్ ఓవర్) -
నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ.. (ఫొటోలు)
-
కొత్త పార్లమెంట్ భవనంపై ఆర్జేడీ వివాదాస్పద ట్వీట్
-
విభజన సమస్యలు పరిష్కరించండి: సీఎం వైఎస్ జగన్
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఏపీ సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి ఆయన హోం మంత్రి నివాసంలో అమిత్ షా తో సుమారు 40 నిమిషాలు భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ పరిష్కారం కాని పలు అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు వీలైనంత త్వరగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపేలా చూడాలని కోరారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో ఏపీ భవన్ సహా షెడ్యూల్ 9, 10 ఆస్తుల విభజనపై కూడా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశాన్నీ హోం మంత్రి దృష్టికి తెచ్చారు. ఏపీ విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని, వెంటనే ఈ బకాయిలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు -
కొత్త పార్లమెంట్ భవనంపై లాలు యాదవ్ పార్టీ వివాదాస్పద ట్వీట్
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అట్టహాసంగా ప్రారంభించిన కొత్త పార్లమెంట్ భవనంపై పెను రాజకీయ దుమారం రేగుతోంది. ఇప్పటికే 19 ప్రతిపక్ష పార్టీలు బైకాట్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే సరిగ్గా పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ.. బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలు యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చేసిన ట్వీట్ పెను వివాదాని దారితీసింది. కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఆర్జేడీ. ఈ భవనం శవపేటిక మాదిరిగా సమాధి చేసిన ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, దీన్ని దేశం అంగీకరించదంటూ ఆర్జేడీ పార్టీ బీజేపీని విమర్శిస్తూ ట్వీట్ చేసింది. వాస్తవానికి పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం, చర్చల వేదిక కానీ దాన్ని బీజేపీ అవమానపర్చిలే ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసిందని ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేసింది ఆర్జేడీ. దీంతో ఈ ట్వీట్‌పై స్పందించిన బీజేపీ నేత సుశీల్ మోదీ ఇలా పార్లమెంట్ కొత్త భవనాన్ని శవపేటికతో పోల్చిన వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలంటూ మండిపడ్డారు. మరో బీజేపీ నేత దుష్యంత్ గౌతమ్ ఇలాంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం అన్నారు. కొత్త పార్లమెంట్‌ని శవపేటికతో పోల్చారు, పాత భవనాన్ని జీరోతో పోల్చారా? ఎందుకంటే మనం అప్పుడూ జీరోలానే కూర్చొన్నాం కదా అని చురకలంటించారు. ఇదిలా ఉండగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని చరిత్రలో అవమానకరంగా లిఖించబుడుతుందని విమర్శించారు. కాగా, ఈ పరిణామాలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఆయా నాయకులెవరూ ఆ కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగు పెట్టకుండా రాజీనామే చేయడమే ఉత్తమమని గట్టి కౌంటరిచ్చింది. ये क्या है? pic.twitter.com/9NF9iSqh4L — Rashtriya Janata Dal (@RJDforIndia) May 28, 2023 (చదవండి: కొత్త పార్లమెంట్ భవనం కోసం షారూఖ్, అక్షయ్ కూమార్‌ల వాయిస్ ఓవర్) -
నూతన పార్లమెంట్ భవనం శిలాఫలకం ఆవిష్కరించిన ప్రధాని
-
New Parliament Building: షారూఖ్, అక్షయ్ కూమార్‌ల వాయిస్ ఓవర్
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్శిస్తున్న కొత్త పార్లమెంట్ భవనం గురించి మీ వాయిస్ ఓవర్లతో కూడిన వీడియోలతో సామాజిక మాధ్యమంలో భాగస్వామ్యం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అభ్యర్థించారు. ఈ మేరకు మోదీ మే 26న తొలిసారిగా కొత్త పార్లమెంట్‌కి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.. ఈ భవనంపై మీ ఆలోచనల తెలియజేస్తూ..వాయిస్ ఓవర్ వీడియోలను షేర్ చేయాలని, వాటిలో కొన్నింటిని మళ్లీ ట్వీట్ చేస్తానని చెప్పారు. మోదీ ప్రత్యేక అభ్యర్థన మేరకు పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు తమ వాయిస్ ఓవర్లతో కూడిన వీడియోలను షేర్ చేశారు. ఆయా పోస్టులను శనివారం ప్రధాని మోదీ.. తాను చెప్పినట్లుగానే కొన్నింటిని రీట్వీట్ చేశారు. అందులో భాగంగా బాలీవుడ్ సూపర్ స్టార్లు షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్‌లు పోస్ట్ చేసిన వాయిస్ ఓవర్ వీడియోలను మోదీ రీట్వీట్ చేశారు.మోదీ.. ఆయా వీడియోలో భవనం గురించి వ్యాఖ్యానం లేదా నేపథ్య సంగీతం ఉండాలనే నియమం ఏమిలేదని, కేవలం మీ ఆలోచనలు తెలుసుకునేందుకేనని పేర్కొన్నారు. ఈ మేరకు షారూఖ్ షేర్ చేసిన వీడియాలో.. మన రాజ్యంగాన్ని సమర్థించే ప్రజలకు కొత్త ఇల్లు అని పిలిచారు. ఇది మన ఆశల కొత్త ఇల్లు. 140 కోట్ల మంది భారతీయులు ఒకే కుటుంబంగా మారిన మన రాజ్యంగాన్ని సమర్థించే ప్రజల ఇల్లు. ఈ ఇల్లు చాలా పెద్దగా ఉండనివ్వండి.. ఎదుకంటే ప్రతి గ్రామం, నగరం, దేశంలోని ప్రతి మూలలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి తగినంత చోటు ఉంటుంది. ఈ కొత్త ఇల్లు అన్ని కులాలు, మతాలకు చెందిన ప్రజలను ఆలింగనం చేసుకుంటుందని చెబుతూ..న్యూ ఇండియా కోసం కొత్త పార్లమెంట్ భవనం అనే క్యాప్షన్ జోడిస్తూ వాయిస్ ఓవర్ వీడియోని పోస్ట్ చేశారు షారుఖ్. Beautifully expressed! The new Parliament building is a symbol of democratic strength and progress. It blends tradition with modernity. #MyParliamentMyPride https://t.co/Z1K1nyjA1X — Narendra Modi (@narendramodi) May 27, 2023 అంతేగాదు దీన్ని పురాతన సంప్రదాయ మేళవికతో భారతదేశ కీర్తిని మరింత అందంగా ఇనుమడింప చేశారంటూ మోదీని కొనియాడాడు షారూఖ్. అలాగే అక్షయ్ కుమార్ వాయిస్ ఓవర్ వీడియోని కూడా రీట్వీట్ చేశారు మోదీ. ఆ వీడియోలో..అక్షయ్ కుమార్ కొత్త పార్లమెంటు భవనాన్ని భారతదేశ వృద్ధి కథకు ఐకానిక్ సింబల్‌గా అభివర్ణించారు. ఈ భవనం మన గొప్ప వారసత్వానికి ప్రతీక అన్నారు. అక్షయ్ మాటలతో ఏకభవిస్తూ మోదీ ఈ వీడియోని పంచుకున్నారు. ఈ మేరకు ఆయన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడానికి ఒక్క రోజు వ్యవధి ఉందనంగా.. కొన్ని గంటల ముందు మోదీ ఆ వాయిస్ ఓవర్ వీడియోలను నెటిజన్లతో పంచుకున్నారు. You have conveyed your thoughts very well. Our new Parliament is truly a beacon of our democracy. It reflects the nation's rich heritage and the vibrant aspirations for the future. #MyParliamentMyPride https://t.co/oHgwsdLLli — Narendra Modi (@narendramodi) May 27, 2023 వీడియోల తోపాటు మోదీ అనుపమ్ ఖేర్, స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో సహా ప్రముఖుల, రాజకీయ నాయకులు కొత్త పార్లమెంట్ భవనంపై పంచుకున్న తమ ఆలోచనలను రీట్వీట్ చేశారు. ఇకపోతే అనుపమ్ ఖేర్ పద్యాలతో పార్లెమంట్ భవనం విశిష్టతను ప్రశంసించగా, మోదీ మీ కవితలు ప్రజలకు ఈ భవనం పట్ల మరింత విశ్వాసాన్నిపెంచుతాయని అనుపమ్‌ని మెచ్చుకున్నారు. The new Parliament building will make every Indian proud. This video offers a glimpse of this iconic building. I have a special request- share this video with your own voice-over, which conveys your thoughts. I will re-Tweet some of them. Don’t forget to use #MyParliamentMyPride. pic.twitter.com/yEt4F38e8E — Narendra Modi (@narendramodi) May 26, 2023 ఉండగా, తమిళనాడు ప్రముఖ సిని హిరో రజనీకాంత్ సైత మోదీ సెంగోల్‌ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ..తమిళులు గర్వపడేలా చేశారన్నారు. అందుకు మోదీ కొత్త పార్లమెంట్ భవనంలో తమిళనాడు సంస్కృతి గర్వించదగ్గ స్థాయికి చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ.. రజనీకాంత్‌కు సమాధానమిచ్చారు. కాగా, అధీనం సీర్స్ ప్రధాని మోదీకి సెంగోల్‌ను అందజేశారు. దీన్ని కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్‌సభ ఛాంబర్లో మే 28న ప్రధాని మోదీ ఏర్పాటు చేయనున్నారు. (చదవండి: పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. లైవ్ అప్ డేట్స్) -
భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుంది: మోదీ
Updates.. ► ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రతీ దేశ చరిత్రలో కొన్ని సందర్భాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. అమృత్‌మహోత్సవ్ వేళ నూతన పార్లమెంట్ భవనాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇది కేవలం భవనం మాత్రమే కాదు. 140 కోట్ల భారతీయుల ఆక్షాంకలకు ప్రతీక. కొత్త పార్లమెంట్ భవనం భారతీయల ధృడ సంకల్పాన్ని చాటి చెబుతుంది. #WATCH | This new Parliament will become witness to the rise of a self-reliant India: PM Narendra Modi pic.twitter.com/NXKMeVSmoh — ANI (@ANI) May 28, 2023 ► స్వాతంత్ర్య పోరాట ఆకాంక్షలను పూర్తి చేసేందుకు కొత్త పార్లమెంట్ భవనం సాధనంగా ఉపయోగపడుతుంది. ఈ భవనం పూరాతన నుంచి నూతనత్వానికి మాధ్యమం. ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఆధునిక భారత్‌కు కొత్త పార్లమెంట్ అద్దం పడుతుంది. ► ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయం. ప్రవితమైన సెంగోల్‌ను పార్లమెంట్లో ప్రతిష్టించాం. సెంగోల్.. చోళుల కాలంలో కర్తవ్య నిష్టకు ప్రతీక. ఆత్మనిర్భర్ భారత్‌కు సాక్షిగా పార్లమెంట్ నిలుస్తుంది. భారత్ కొత్త లక్ష్యాలను ఎంచుకుంది. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిలాంటిది. భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలను పార్లమెంట్ గౌరవిస్తుంది. ► పార్లమెంట్లో రూ.75 కాయిన్, స్టాంప్ రిలీజ్ చేసిన ప్రధాని మోదీ. #WATCH | Prime Minister Narendra Modi releases a stamp and Rs 75 coin in the new Parliament. pic.twitter.com/7YSi1j9dW9 — ANI (@ANI) May 28, 2023 ► లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సంకల్పంతోనే రెండున్నర ఏళ్ల తక్కువ సమయంలోనే పార్లమెంట్ నూతన భవన నిర్మాణం జరిగింది. ప్రజాస్వామ్య విలువలు, పారదర్శకత విషయంలో ప్రపంచానికి భారతదేశం ఆదర్శంగా నిలిచింది. భిన్నత్వంలో ఏకత్వం భారత్ ప్రత్యేకత. పర్యావరణానికి అనుకూలంగా కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం జరిగింది. దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం. ప్రజాస్వామ్య సమస్యలకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది. మన దేశంలో ప్రజాస్వామ్యం ఎంతో ధృడమైనది. In this Amrit Kaal, India's prestige in the world has increased. Our parliament has the ability to convert challenges into opportunities. Democracy is the foundation of our strong future. Unity in diversity is our strength: Lok Sabha Speaker Om Birla in the new Parliament pic.twitter.com/aZNGi7Us0i — ANI (@ANI) May 28, 2023 ► రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ కొత్త పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశాన్ని చదవి వినిపించారు. ► దేశంలో పార్లమెంట్‌కు ఎంతో విశిష్ట స్థానం ఉంది. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ ఒక ధృవతార లాంటిది. గత ఏడు దశాబ్దాల్లో మన పార్లమెంట్ ఎన్నో ఒడిదొడుకులను చూసింది. ప్రధాని మోదీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషం. పార్లమెంట్ భవన నిర్మాణానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. కొత్త పార్లమెంట్ భవనం ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని మరింత పెంచుతుందని ఆశిస్తున్నాను.- ద్రౌపది ముర్ము. #WATCH | Rajya Sabha Deputy Chairman Harivansh reads out a message of President Droupadi Murmu in the new Parliament building pic.twitter.com/8kupF9h0h8 — ANI (@ANI) May 28, 2023 ► నూతన పార్లమెంట్లో సభ ప్రారంభం 12:33 PM ► కొత్త పార్లమెంట్ ఆరంభ వేడుకలకు పలు దేశాల ప్రతినిధులు హాజరు. ► నూతన పార్లమెంట్ భవనంలో జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు. ► కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్. ► ఆత్మ నిర్బర్ భారత్‌కు ప్రతీక కొత్త పార్లమెంట్ భవనం. 2020 డిసెంబర్ 10న కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన. భవన నిర్మాణ సమయం 2ఏళ్ల 5నెలల 18 రోజులు. నిర్మాణ వ్యయం దాదాపు రూ.1200 కోట్లు. ► నాలుగు అంతస్తుల్లో కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం. లోక్‌సభలో 888 సీట్లు, రాజ్యసభలో 384 సీట్లు. లోక్‌సభ హాల్లో 1272 సీట్లు ఏర్పాట్లు చేసే వెసులుబాటు. ప్రతీ సభ్యుడి సీటు వద్ద మల్టీ మీడియా డిస్ప్లే సిస్టమ్. ► జాతీయ పక్షి నెమలి ఆకృతిలో లోక్‌సభ ఛాంబర్. జాతీయ పుష్పం కమలం ఆకృతిలో రాజ్యసభ ఛాంబర్. కొత్త భవనంలో మంత్రుల కోసం 92 గదులు. పార్లమెంట్ సభ్యుల సీట్లకు డిజిటల్ టచ్ స్క్రీన్లు. ► నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. #WATCH | PM Modi unveils the plaque to mark the inauguration of the new Parliament building pic.twitter.com/quaSAS7xq6 — ANI (@ANI) May 28, 2023 ► నూతన పార్లమెంట్ భవనం శిలాఫలకం ఆవిష్కరించిన ప్రధాని మోదీ. #WATCH | PM Narendra Modi felicitates the workers who helped in the building and development of the new Parliament House. pic.twitter.com/r6TkOQp4PX — ANI (@ANI) May 28, 2023 ► కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ కార్మికులకు ప్రధాని మోదీ సత్కారం. ► అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా. ► స్పీకర్ కుర్చీ వద్ద సెంగోల్‌ను ప్రతిష్టించిన ప్రధాని మోదీ. #WATCH | PM Modi installs the historic 'Sengol' near the Lok Sabha Speaker's chair in the new Parliament building pic.twitter.com/Tx8aOEMpYv — ANI (@ANI) May 28, 2023 #WATCH | PM Modi carries the historic 'Sengol' into the Lok Sabha chamber of the new Parliament building pic.twitter.com/wY206r8CUC — ANI (@ANI) May 28, 2023 ► పూజ తర్వాత సెంగోల్‌కు ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం. ► ప్రధాని మోదీకి సెంగోల్‌ను అందజేసిన వేద పండితులు. #WATCH | PM Narendra Modi carries the historic 'Sengol' post the pooja ceremony after it is handed over to him by the Adheenam seers. pic.twitter.com/FCAkjD90jK — ANI (@ANI) May 28, 2023 ► నూతన పార్లమెంట్ భవన మండపాల్లో పూజా కార్యక్రమం జరుగుతోంది. #WATCH PM Modi and Lok Sabha Speaker Om Birla begin pooja for the inauguration of the new Parliament building The puja ceremony will continue for about an hour. After the puja, the PM will receive the 'Sengol' and install it in the new Parliament. pic.twitter.com/S13eVwZZD3 — ANI (@ANI) May 28, 2023 ► పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా. ► జాతిపిత మహాత్మా గాంధీకి వందనం చేసిన ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా. #WATCH | PM Modi and Lok Sabha Speaker Om Birla pay floral tributes to Mahatma Gandhi at the Parliament House, ahead of the inauguration of the new building pic.twitter.com/NCt7kf5xQj — ANI (@ANI) May 28, 2023 ► కొత్త పార్లమెంట్ వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ. #WATCH PM Modi and Lok Sabha Speaker Om Birla arrive at the new Parliament building for the inauguration ceremony pic.twitter.com/nHbfqFFYZh — ANI (@ANI) May 28, 2023 ఇలలో ఇంద్రభవనం: నూతన పార్లమెంట్ భవన విశేషాలు ►ఉదయం 7.30 గంటలకు నూతన పార్లమెంటు భవన మండపాల్లో పూజ ప్రారంభం. ►ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ►ఉదయం 8.30 గంటలకు పార్లమెంట్ ఛాంబర్లను సందర్శించనున్న ప్రధానమంత్రి మోదీ, ప్రముఖులు ►ఉదయం 9.00 గంటలకు ప్రార్థన సభ ►ఉదయం 9.30 గంటలకు వేదిక నుంచి బయలుదేరనున్న ప్రధాని ►11.30 గంటలకు అతిథుల రాక ప్రారంభం ►మధ్యాహ్నం 12.00 గంటలకు వేదికపైకి ప్రధాని రాక ►మధ్యాహ్నం 12.07 గంటలకు జాతీయ గీతం ►మధ్యాహ్నం 12.10 గంటలకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ స్వాగత ప్రసంగం ►మధ్యాహ్నం 12.29కి ఉపరాష్ట్రపతి సందేశం ►మధ్యాహ్నం 12.33 గంటలకు రాష్ట్రపతి సందేశం ►12.38 గంటలకు ప్రతిపక్ష నేతల ప్రసంగం ►మధ్యాహ్నం 12.43 గంటలకు లోక్‌సభ స్పీకర్ ప్రసంగం ►మధ్యాహ్నం 1.00 గంటలకు 75 రూపాయల నాణెం మరియు స్టాంపును విడుదల చేయనున్న ప్రధాని ►మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. షెడ్యూల్ ప్రకారం తెల్లవారుజాము నుంచే యాగం, పూజలు, ప్రార్థనలతో ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ పార్టీల నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరవుతారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు.. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో లుటెన్స్ ఢిల్లీ ప్రాంతంలో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్లమెంట్ చుట్టుపక్కల ఏరియాలను పోలీసుల తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అదనపు బలగాలను మోహరించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగిస్తున్నారు. సెంట్రల్ ఢిల్లీలో ప్రత్యేకంగా పికెట్లు ఏర్పాటు చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో కొత్త భవనం వద్ద ధర్నా చేస్తామని మహిళా రెజ్లర్లు ప్రకటించగా, అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. India’s magnificent #NewParliamentBuilding stands as tall as India’s resolve to go all guns blazing into a glorious future, & embodies the spirit of the India growth story, under the visionary leadership of PM @narendramodi Ji, that has captivated the world.#MyParliamentMyPride pic.twitter.com/z3n8e7tznM — Hardeep Singh Puri (@HardeepSPuri) May 26, 2023 Delhi | The arrival of VIPs at the new Parliament House begins ahead of the inauguration ceremony Visuals from Vijay Chowk pic.twitter.com/COD31un8HO — ANI (@ANI) May 28, 2023 Delhi | Adheenams from different mutts across Tamil Nadu leave for the new Parliament building to attend the inauguration ceremony pic.twitter.com/PnUv8wd8Ou — ANI (@ANI) May 28, 2023 -
నేడే ప్రజాస్వామ్య సౌధం ప్రారంభం
న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా అభివర్ణించిన పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రజాస్వామ్య సౌధాన్ని ఆదివారం ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. షెడ్యూల్ ప్రకారం తెల్లవారుజాము నుంచే యాగం, పూజలు, ప్రార్థనలతో ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ పార్టీల నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖు లు హాజరవుతారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహ్వానించనందుకు నిరసనగా పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని తాము బహిష్కరిస్తున్నట్లు 20 విపక్ష పార్టీలు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉండగా, 25 పార్టీల నాయకులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య దేవాలయాన్ని నిర్మించుకోవడానికి దేశ ప్రజలంతా ఒక్కటై, చేతులు కలపిన తీరు అసలు సిసలైన ‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్’ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో లుటెన్స్ ఢిల్లీ ప్రాంతంలో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్లమెంట్ చుట్టుపక్కల ఏరియాలను పోలీసుల తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అదనపు బలగాలను మోహరించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగిస్తున్నారు. సెంట్రల్ ఢిల్లీలో ప్రత్యేకంగా పికెట్లు ఏర్పాటు చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో కొత్త భవనం వద్ద ధర్నా చేస్తామని మహిళా రెజ్లర్లు ప్రకటించగా, అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. అధీనం మఠం పెద్దలతో మోదీ భేటీ ప్రధాని మోదీ శనివారం తన నివాసంలో అధీనం మఠం పెద్దలతో సమావేశమయ్యారు. వారు ఆయనకు ఆశీస్సులు అందించారు. సెంగోల్తోపాటు కొన్ని బహుమతులు అందజేశారు. అనంతరం మోదీ వారిని సత్కరించారు. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి అధీనం మఠం పెద్దలు, ప్రతినిధులు తమిళనాడు నుంచి శనివారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు. ప్రతి శకంలో భారత జాతీయవాదానికి తమిళనాడు కేంద్రంగా నిలిచిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో తమిళనాడు ప్రజల భాగస్వామ్యానికి తగిన గుర్తింపు దక్కకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సెంగోల్‌కు గౌరవం దక్కాల్సి ఉండగా, దాన్నొక ‘వాకింగ్ స్టిక్’గా ప్రయాగ్‌రాజ్‌లోని ఆనంద్ భవన్లో మూలన పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం దాన్ని ఆనంద్ భవన్ నుంచి బయటకు తీసుకువచ్చిందన్నారు. దేశ మహోన్నత సంప్రదాయానికి ప్రతీక అయిన సెంగోల్‌ను పార్లమెంట్ నూతన భవనంలో ప్రతిష్టిస్తుండడం సంతోషకరమని ప్రధాని మోదీ చెప్పారు. హాజరయ్యే పార్టీలు, ఉభయ సభల్లో వాటి ఎంపీల సంఖ్య ఎన్డీయే పార్టీలు 1. బీజేపీ (394) 2. శివసేన (15) 3. నేషనలిస్టు పీపుల్స్ పార్టీ – మేఘాలయా(2) 4. నేషనలిస్టు డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(1) 5. సిక్కిం క్రాంతికారీ మోర్చా(1) 6. జననాయక్ జనతా పార్టీ 7. ఏఐఏడీఎంకే(5) 8. ఐఎంకేఎంకే 9. ఏజేఎస్‌యూ(1) 10. ఆర్పీఐ–అథవాలే(1) 11. మిజో నేషనల్ ఫ్రంట్(2) 12. తమిళ మానిల కాంగ్రెస్(1) 13. ఐటీఎఫ్‌టీ–త్రిపుర 14. బోడో పీపుల్స్ పార్టీ 15. పీఎంకే(1) 16. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ 17. ఆప్నా దళ్(2) 18. అస్సాం గణపరిషత్ (1) నాన్–ఎన్డీయే పార్టీలు 1. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (31) 2. తెలుగుదేశం పార్టీ(4) 3. లోక్ జనశక్తి పార్టీ– రామ్ విలాస్ పాశ్వాన్(1) 4. బిజూ జనతాదళ్(21) 5. బీఎస్పీ(10) గైర్హాజరయ్యే పార్టీలు 1. కాంగ్రెస్ (81) 2. డీఎంకే (34) 3. శివసేన–యూబీటీ(7) 4. ఆమ్ ఆద్మీ పార్టీ (11) 5. సమాజ్‌వాదీ పార్టీ (6) 6. సీపీఐ (4) 7. జేఎంఎం (2) 8. కేరళ కాంగ్రెస్–మణి(2) 9. విడుదలై చిరుతైగళ్ కట్చీ(1) 10. రాష్ట్రీయ లోక్‌దళ్ (1) 11. తృణమూల్ కాంగ్రెస్ (35) 12. జేడీ–యూ (21) 13. ఎన్సీపీ (9) 14. సీపీఎం (8) 15. ఆర్జేడీ (6) 16. ఐయూఎంఎల్ (4) 17. నేషనల్ కాన్ఫరెన్స్ (3) 18. ఆర్ఎస్పీ (1) 19. ఎండీఎంకే (1) 20. ఎంఐఎం (2) -
ఇలలో ఇంద్రభవనం: నూతన పార్లమెంట్ భవన విశేషాలు
కొత్త పార్లమెంటు ఇంద్రభవనాన్ని తలపిస్తోంది. మిర్జాపూర్ కార్పెట్లు, నాగపూర్ టేక్ వుడ్, త్రిపుర వెదురు ఫ్లోరింగ్, రాజస్తాన్ శిల్పకళాకృతులతో మన దేశ ప్రత్యేకత అయిన భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ధగధగలాడిపోతోంది. ఏక్ భారత్ శ్రేష్టభారత్ అన్న ప్రధాని మోదీ నినాదం అడుగడుగునా కనిపించేలా వివిధ రాష్ట్రాల్లో పేరు పొందిన సామగ్రితో భవన నిర్మాణం జరిగింది. కలర్స్ ఆఫ్ ఇండియాను తలపించేలా కలర్ ఫుల్ గా ఉన్న పార్లమెంట్ భవన విశేషాలు.. ► పార్లమెంటు భవన నిర్మాణంలో వినియోగించిన ఎరుపు, తెలుపు శాండ్ స్టోన్‌ను రాజస్థాన్‌లోని సర్‌మథుర నుంచి తెచ్చారు. ఢిల్లీలోని ఎర్రకోట, హుమాయూన్ సమాధి ఈ రాతితో చేసిన నిర్మాణాలే. ► భవన నిర్మాణంలో తలుపులు, కిటికీలకు వాడిన టేకు చెక్కని మహారాష్ట్ర నాగపూర్ నుంచి తెప్పించారు. ► రాజస్తాన్ ఉదయపూర్ నుంచి కెషారియా గ్రీన్ స్టోన్, అజ్మీర్ సమీపంలోని లఖ నుంచి రెడ్ గ్రానైట్, అంబాజీ నుంచి తెల్ల పాలరాయిని వాడారు ► పార్లమెంటులో అమర్చిన కళ్లు చెదిరే ఫర్నిచర్‌ను ముంబైలో చేయించారు. ► లోక్‌సభ, రాజ్యసభ ఫాల్స్ సీలింగ్‌లో వాడిన ఉక్కుని కేంద్ర పాలిత ప్రాంతమైన డామన్, డయ్యూ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. ► భవనంలోకి సహజంగా గాలి వెలుతురు వచ్చేలా ఉత్తరప్రదేశ్ లోని నోయిడా, రాజస్థాన్ రాజ్ నగర్ నుంచి జాలీల రాయిని తెప్పించి వేయించారు ► లోక్‌సభ, రాజ్యసభ చాంబర్లలో అశోక చక్రం డిజైన్ ఆకృతి అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, రాజస్తాన్ జైపూర్ నుంచి ఈ డిజైన్ రూపొందించడానికి కావాల్సిన సామాగ్రిని తీసుకువచ్చారు. ► శిల్ప కళాకృతుల్ని రూపొందించడానికి ఉదయ్‌పూర్ నుంచి వచ్చిన శిల్పులు రేయింబవళ్లు శ్రమించారు. ► అహ్మదాబాద్ ఇత్తడిని వాడారు. ► త్రిపుర రాష్ట్రంలో లభించే అరుదైన వెదురుతో తయారు చేసిన ఫ్లోరింగ్‌పై యూపీలోని మిర్జాపూర్‌లో తయారు చేసిన కార్పెట్లను పరిచారు. ► సనాతన సంప్రదాయాలు ఉట్టిపడేలా, వాస్తు శాస్త్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని దేశంలో వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన 5 వేల కళాకృతులైన బొమ్మలు, పెయింటింగ్‌లు, కొన్ని ఫోటోలను ఏర్పాటుచేశారు. రెండు భవనాలకి ఎంత తేడా..! 1- పాత భవనంలో లోక్‌సభ సభ్యులు 543 మంది రాజ్యసభలో 250 మంది కూర్చొనే సదుపాయం ఉంది. అదే కొత్త భవనంలో సామర్థ్యాన్ని బాగా పెంచారు. లోక్‌సభలో 888 మందికి రాజ్యసభలో 300 మందికి సీట్లు ఏర్పాటు చేశారు. 2- బ్రిటిష్ ఆర్కిటెక్ట్ సర్ ఎడ్విన్ ల్యుటెన్స్, హెర్బర్ట్ బేకర్ పాత భవనం డిజైన్ చేస్తే, కొత్త పార్లమెంటు భవనాన్ని అహ్మదాబాద్‌కు చెందిన హెచ్సీపీ డిజైన్ ఆధునికంగా రూపొందించింది. ప్రముఖ ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ పర్యవేక్షణలో డిజైన్ రూపొందించారు. 3- పాత భవనం గుండ్రంగా ఉంటూ 24, 281 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తే, కొత్త భవనాన్ని త్రిభుజాకారంలో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. 4- పాత భవనం నిర్మాణం రెండు అంతస్తుల్లో ఉంటే, కొత్తది 4 అంతస్తుల్లో నిర్మించారు. 5- పాత నిర్మాణానికి ఆరేళ్లు పడితే కొత్త భవనాన్ని రెండున్నర ఏళ్లలో నిర్మించారు. 6- 1927లో ప్రారంభోత్సవం జరుపుకున్న పాత భవనానికి అప్పట్లోనే రూ.85 లక్షలైతే , కొత్త భవనానికి వెయ్యి కోట్ల వరకు ఖర్చు అయింది. 7- పాత భవనంలో ఉభయ సభల సంయుక్త సమావేశాల కోసం సెంట్రల్ హాలులో నిర్మిస్తే, కొత్త భవనంలో లోక్‌సభ చాంబర్‌నే ఉభయ సభల సభ్యులు ఒకేసారి కూర్చొనేలా ఎక్కువ సీట్లతో సిద్ధంచేశారు. 8- పార్లమెంటు పాత భవనంలో అగ్ని ప్రమాద నిరోధక వ్యవస్థ అత్యంత ఆందోళనకరంగా ఉండేది. కొత్త భవనంలో అత్యంత ఆధునిక వ్యవస్థలన్నీ ఒక ప్రణాళిక ప్రకారం అమర్చారు. అందుబాటులో ఉన్న డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి సీసీటీవీ, ఆడియో వీడియో వ్యవస్థ, ఓటింగ్‌కు బయోమెట్రిక్ వ్యవస్థ, ట్రాన్స్లేషన్ వ్యవస్థలు, ప్రోగ్రామబుల్ మైక్రోఫోన్స్, రీసౌండ్లు వినిపించకుండా వర్చువల్ సౌండ్ సిస్టమ్ వంటివన్నీ ఏర్పాటు చేశారు. భూకంపాలు వస్తే తట్టుకునే వ్యవస్థ ఏర్పాటు చేశారు. 150 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా భవన నిర్మాణం సాగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీపై పోరులో మాది ప్రత్యేక శైలి!
సాక్షి, హైదరాబాద్: నూతన పార్లమెంటు భవన ప్రారంభ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్, ఆప్ సహా 19 పార్టీలు చేసిన సంయుక్త ప్రకటనపై తాము సంతకం చేయకున్నా.. కార్యక్రమానికి తాము కూడా దూరంగా ఉంటామని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేర్కొంది. బీజేపీ అనుసరిస్తున్న ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు తమదైన శైలిలో పనిచేస్తామని స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కుదించేలా కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలని కోరుతూ ఆప్ అధినేత, ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు తదితరులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీపై కేంద్ర ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించడం మొదలు జాతీయ రాజకీయాలు, బీజేపీ, ప్రధాని మోదీ విధానాలపై కేసీఆర్, కేజ్రీవాల్ మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర నేతలు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలతో జరిగిన చర్చల సారాంశాన్ని కేసీఆర్‌కు కేజ్రివాల్ వివరించినట్టు తెలిసింది. విపక్షాల ఐక్యతకు విశాల ఎజెండా విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కార్యకలాపాలను విస్తరిస్తూనే, భావసారూప్య పార్టీ లను కలుపుకొని ముందుకెళ్లే ధోరణితో వ్యవహరించాల న్నది తమ విధానంగా సమావేశంలో సీఎం కేసీఆర్ వివరించినట్టు తెలిసింది. రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం బీజేపీపై జాతీయ స్థాయిలో పోరాడేందుకు భావ సారూప్య పార్టీల నడుమ విశాల ఎజెండా అవసరమని పేర్కొన్నట్టు సమాచారం. విపక్షాల ఓట్ల చీలిక ద్వారానే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందంటూ పలు ఉదాహరణలను పేర్కొన్నట్టు తెలిసింది. 1970వ దశకంలో ఎమర్జెన్సీ విధింపు దేశంలో కొత్త రాజకీయ పార్టీల ఆవిర్భావం, ప్రత్యామ్నాయ భావజాలానికి పురుడు పోసిందని.. ప్రస్తుత బీజేపీ విధానాలు కూడా దేశ రాజకీయాల్లో మార్పులకు కారణమవుతాయని కేసీఆర్ వివరించినట్టు సమాచారం. ప్రధాని మోదీ మోడల్ విఫలమైందని, కర్ణాటక ఫలితాలే ఇందుకు నిదర్శనమని ముగ్గురు సీఎంలు అభిప్రాయపడినట్టు తెలిసింది. బీజేపీ కార్యాలయాలుగా గవర్నర్ ఆఫీసులు విపక్షాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై అధికారం చేపట్టిన రాష్ట్రాల్లో గవర్నర్లను అడ్డుపెట్టుకుని బీజేపీ అరాచకాలకు పాల్పడుతోందని ముగ్గురు సీఎంల భేటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. గవర్నర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఢిల్లీ, పంజాబ్‌లలో బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని కేజ్రీవాల్, భగవంత్‌సింగ్ మాన్ పేర్కొనగా.. తెలంగాణలోనూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టిన వైనం, దీనిపై సుప్రీంకోర్టు దాకా వెళ్లిన విషయాన్ని కేసీఆర్ వివరించినట్టు సమాచారం. దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణ కోసం జరిగే పోరాటంలో ముందు వరుసలో ఉంటామని కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే జూన్ మొదటి వారంలో జాతీయస్థాయిలో విపక్షాల నేతలు, సీఎంల సమావేశం జరిగే అవకాశం ఉందని కేజ్రీవాల్ వెల్లడించినట్టు సమాచారం. అయితే ఇతర విపక్షాలతో కలిసి నడిచే అంశంలో కేసీఆర్ కొంత ఆచితూచి స్పందించినట్టు తెలిసింది. -
పార్లమెంటు భవన ప్రారంభోత్సవ బహిష్కరణ నిర్ణయం...
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలన్న విపక్షాల నిర్ణయాన్ని ప్రముఖులు ఖండించారు. కుటుంబ పార్టీల నిర్వాకం ఇలాగే ఉంటుందని విమర్శించారు. ఈ మేరకు 270 మంది ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు. వీరిలో మాజీ ఉన్నతాధికారులు, రాయబారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రారంభించుకోవడం దేశ ప్రజలు గర్వపడాల్సిన సందర్భమని వివరించారు. ప్రతిపక్షాలు అపరిపక్వ, డొల్ల వాదనలతో బహిష్కరణ నిర్ణయం తీసుకోవడం సరికాదని హితవు పలికారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రధాని ప్రారంభిస్తే తప్పుపట్టడానికి ఏముందని ప్రశ్నించారు. ‘ఇండియా ఫస్ట్’ నినాదంతో కేంద్రం ముందుకు సాగుతోందని, కొన్ని పార్టీలు ‘ఫ్యామిలీ ఫస్ట్’ అంటున్నాయని ఎద్దేవా చేశారు. -
సెంగోల్పైరగడ
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనంలోని లోక్‌సభ సభామందిరంలో ప్రతిష్టంచనున్న సెంగోల్ (రాజదండం)పై వివాదం ముదురుతోంది. బ్రిటిష్ పాలకుల నుంచి అధికార మార్పిడికి గుర్తుగా సెంగోల్‌ను ఉపయోగించినట్లు ఆధారాలు లేవని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన భజనపరులు కేవలం తమిళనాడులో రాజకీయ లబ్ధి కోసమే సెంగోల్‌ను తెరపైకి తెచ్చారంటూ శుక్రవారం ట్వీట్ చేశారు. ‘‘నిజానికి సెంగోల్‌ను మద్రాసు ప్రావిన్స్‌లోని ఓ మత సంస్థ మద్రాసు లో తయారు చేయించి 1947 ఆగస్టులో నెహ్రూకు బహుమతిగా ఇచ్చింది. తర్వాత దాన్ని అలహాబాద్ మ్యూజియానికి తరలించారు. దాన్ని నెహ్రూ రాజదండంగా వాడినట్లు ఆధారాల్లేవు. మోదీ ప్రభుత్వ వాదన బోగస్. సెంగోల్‌పై మోదీ భజనపరులు సోషల్ మీడియాలో, ప్రధాన స్రవంతి మీడియాలో తప్పుడు ప్రచారం సాగిస్తున్నారు’’ అన్నారు. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించడం లేదని నిలదీశారు. ప్రజాస్వామ్యంపై మోదీ సర్కారు దాడి చేస్తోందన్నారు. సెంగోల్‌ను అవమానించడం దారుణం: షా సెంగోల్‌పై కాంగ్రెస్ నేతల విమర్శలను కేంద్ర మంత్రి అమిత్ షా ఖండించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై కాంగ్రెస్‌కు ద్వేషం ఎందుకని ప్రశ్నించారు. ‘‘అధికార మార్పిడికి ప్రతీకగా తమిళనాడు మఠం నిర్వాహకులు పవిత్ర సెంగోల్‌ను నెహ్రూకు అందజేశారు. దాన్ని ‘చేతికర్ర’గా పేర్కొంటూ కాంగ్రెస్ పాలకులు మ్యూజియంలో పడేశారు’’ అంటూ తప్పుపట్టారు. ఇప్పుడేమో అదే కాగ్రెస్ నేతలు సెంగోల్‌ను దారుణంగా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు మఠం చరిత్ర బోగస్ అంటూ మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలన్న విపక్షాల నిర్ణయం దురదృష్టకరమని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. రాజకీయాలకూ ఓ పరిమితి ఉండాలన్నారు. నూతన భవన ప్రారంభోత్సవాన్ని ప్రజలంతా పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. బహిష్కరణ పిలుపుతో మన స్వాతంత్య్ర సమరయోధులను విపక్ష నేతలు అవమానిస్తున్నారని కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురి విమర్శించారు. తప్పుడు ప్రచారం! తిరువావదుత్తురై పీఠం చెన్నై: సెంగోల్ రాజదండంపై తప్పుడు ప్రచారం సాగుతుండడం చాలా విచారకరమని తమిళనాడులోని తిరువావదుత్తురై అధీనం పీఠాధిపతి అంబలావన దేశిక పరమాచార్య స్వామి శుక్రవారం అన్నారు. అధికార మార్పిడికి గుర్తుగా ఈ రాజదండాన్ని లార్డ్ మౌంట్‌బాటన్ 1947 ఆగస్టులో నెహ్రూకు అందజేశారని చెప్పారు. దీనిపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఫొటోలతోపాటు అప్పట్లో పత్రికల్లో ప్రముఖంగా వార్తలు ప్రచురితమయ్యాయని గుర్తుచేశారు. ‘‘సెంగోల్‌ను రాజదండంగా వాడలేదన్నది కొందరి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారమే. సెంగోల్ తమిళనాడుకు గర్వకారణం. తిరుక్కురళ్తో పాటు తమిళ ప్రాచీన సాహిత్యంలో సెంగోల్ ప్రస్తావన ఉంది’’ అని తెలిపారు. ప్రారంభోత్సవంపై పిల్... కొట్టేసిన సుప్రీం పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవం రాష్ట్రపతి జరిపేలా ఆదేశించాలన్న పిల్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీన్ని ఎందుకు, ఎలా దాఖలు చేశారో అర్థమవుతోందని న్యాయమూర్తులు జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ పి.ఎస్. నరసింహలు అన్నారు. విచారణకు స్వీకరించకపోతే పిల్ వెనక్కి తీసుకోవడానికి అనుమతినివ్వాలని కోరినా దాన్ని కొట్టేస్తున్నట్టుగా తెలిపారు. ప్రారంభోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయడం రాష్టపతిని అవమానించడమేనని విమర్శిస్తూ ఇప్పటికే 20కి పైగా రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. -
పార్లమెంట్ నూతన సౌధం ప్రారంభోత్సవం ఇలా...
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 7.15 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. రెండు దశలుగా ప్రారంభోత్సవం ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉదయం 7.15 గంటలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన భవనం వద్దకు చేరుకుంటారు. 7.30: యజ్ఞం, పూజ ప్రారంభం. దాదాపు గంటపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 8.30: ప్రధాని మోదీ లోక్‌సభ చాంబర్లోకి ప్రవేశిస్తారు. 9.00: చరిత్రాత్మక రాజదండం సెంగోల్‌ను లోక్‌సభ స్పీకర్ స్థానం సమీపంలో ప్రతిష్టిస్తారు. 9.30: పార్లమెంట్ లాబీలో ప్రార్థనా కార్యక్రమం ప్రారంభమవుతుంది. పార్లమెంట్ నుంచి ప్రధాని మోదీ బయటకు వెళ్తారు. 11.30: ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అతిథులు కొత్త భవనం వద్దకు చేరుకుంటారు. 12.00: ప్రధాని మోదీ రాక. జాతీయ గీతాలాపాన ప్రారంభం. 12.10: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రసంగం. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పంపించిన సందేశాన్ని చదివి వినిపిస్తారు. 12.17: రెండు షార్ట్ ఫిలింలు ప్రదర్శిస్తారు. 12.38: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగిస్తారు. 1.05: రూ.75 నాణెం, స్మారక పోస్టల్ స్టాంప్‌ను ప్రధాని మోదీ విడుదల చేస్తారు. 1.10: ప్రధానమంత్రి ప్రసంగం ప్రారంభం 2.00: అధికారికంగా వేడుకుల ముగింపు -
మోదీనే పార్లమెంట్‌లా వ్యవహరిస్తున్నారు: ఉత్తమ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ ప్రారంభానికి ముహుర్తం ఫిక్స్ అయ్యింది. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం మే 28(ఆదివారం)న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఇక, పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభించడాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో ప్రధానిపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఏవిధంగా ఉండాలో ఆర్టికల్ 79 స్పష్టంగా వివరించింది. పార్లమెంట్ వ్యవస్థలో రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ ఉంటాయన్నారు. పార్లమెంట్ సమావేశాలకు అతి తక్కువ రోజులు హాజరైన ప్రధానమంత్రులలో నరేంద్ర మోదీ మొదటి స్థానంలో ఉన్నారన్నారు. పార్లమెంట్ అందరిదీ.. మోదీనే పార్లమెంట్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ ఎంపీలు హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: కొత్త పార్లమెంట్ ఇన్సైడ్ ఫస్ట్ లుక్.. వీడియో అదుర్స్ -
కొత్త పార్లమెంట్ ఇన్సైడ్ ఫస్ట్ లుక్.. వీడియో అదుర్స్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముస్తాబైంది. అధికార బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆధునిక హంగులతో పార్లమెంట్ భవనాన్ని నిర్మించింది. ఇక, కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం మే 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఈ నేపథ్యంలో కొత్త భవనం ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో పార్లమెంట్ లోపలి, బయటి దృశ్యాలు ఉన్నాయి. లోక్‌సభ, రాజ్యసభ.. ఆ రెండు సభల్లో సీటింగ్ అమరికకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. కాగా, కొత్త పార్లమెంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. - పార్లమెంట్ లోపలి భాగంలో మూడు జాతీయ చిహ్నాలు ఉన్నాయి. - కమలం, నెమలి, మర్రి చెట్టు - దాని ఇతివృత్తాలు. - త్రిభుజాకారంలో నాలుగు అంతస్తుల పార్లమెంటు భవనం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. - ఈ భవనంలో మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి - జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్ మరియు కర్మ ద్వార్. - స్పీకర్ కుర్చీకి సమీపంలో సెంగోల్‌ను ఏర్పాటు చేస్తారు. #WATCH | Delhi: First look at the New Parliament building that will be inaugurated by Prime Minister Narendra Modi on May 28.#NewParliamentBuilding pic.twitter.com/ouZoz6dLgu — ANI (@ANI) May 26, 2023 ఇది కూడా చదవండి: రెగ్యులర్ పాస్‌పోర్టు కోసం రాహుల్ గాంధీ.. లైన్ క్లియర్ -
మేం జోక్యం చేసుకోం.. పిల్ కొట్టివేత
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టేసింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా కాకుండా.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభింపజేసేలా లోక్‌సభ సెక్రటేరియెట్, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ ఓ న్యాయవాది పిల్ దాఖలు చేశారు. అయితే.. ఇందులో జోక్యం చేసుకోలేమంటూ పిల్‌ను కొట్టేసింది సుప్రీం కోర్టు. మే 18వ తేదీన లోక్‌సభ సెక్రటేరియెట్ విడుదల చేసిన ఒక ప్రకటనతో పాటు లోక్‌సభ స్పీకర్ సైతం ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రావాలంటూ ఇచ్చిన ఆహ్వానం.. రాష్ట్రపతిని అవమానించడంతో పాటు రాజ్యాంగ ఉల్లంఘనేనంటూ అడ్వొకేట్ జయ సుకిన్ పిల్ దాఖలు చేశారు. దీనిని శుక్రవారం వెకేషన్ బెంచ్ పరిశీలనకు తీసుకుంది. అయితే.. ఈ నిర్ణయం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ఉల్లంఘన(పార్లమెంటు రాజ్యాంగాన్ని వివరించేక్రమంలో.. ఉభయ సభలకు రాష్ట్రపతి ప్రతినిధిగా ఉంటారని వివరిస్తుంది) కిందకు ఎలా వస్తుందని, ఒక న్యాయవాదిగా అది రుజువు చేయాలని జస్టిస్ జేకే మహేశ్వరి కోరారు. కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నందునా.. ఫైన్ విధిస్తామని సున్నితంగా మరో జస్టిస్ నరసింహ సున్నితంగా హెచ్చరించారు. ఈ తరుణంలో పిటిషన్ వెనక్కి తీసుకునేందుకే మొగ్గు చూపించారు. -
పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా..
ఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మే 28వ తేదీన (ఆదివారం) ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్‌ను ప్రారంభిస్తారు. అయితే ఈ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణను సంతరింపజేయాలని కేంద్ర ఆర్థిక శాఖ భావించింది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ. 75 ప్రత్యేక నాణెం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను ప్రతిబింబించేలానూ ఈ నాణేం ఉండనుందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నాణేనికి ఒక వైపు నాలుగు సింహాల అశోక స్థూపం.. క్రింద సత్యమేవ జయతే అని ఉండనుంది. అలాగే.. ఎడమవైపు దేవనాగరి లిపిలో భారత్ అని, కుడి వైపున ఆంగ్లంలో భారత్ అనే పదం చేర్చారు. నాణేనికి రెండో వైపు పార్లమెంట్ బొమ్మతో పాటు ఎగువ అంచున దేవనాగరి లిపిలో సంసద్ సంకుల్ అని, దిగువన ఆంగ్లంలో పార్లమెంట్ కాంప్లెక్స్ అనే పదాలు రాసి ఉంటాయి. 44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉండబోయే నాణేం.. 50% వెండి, 40% రాగి, 5% నికెల్ మరియు 5% జింక్‌తో తయారు చేశారు. Ministry of Finance to launch a special Rs 75 coin to commemorate the inauguration of the new Parliament building on 28th May. pic.twitter.com/NWnj3NFGai — ANI (@ANI) May 26, 2023 -
పార్లమెంటు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం
న్యూఢిల్లీ: ముందుగా హోమం, తర్వాత సర్వమత ప్రార్థనలతో ఆదివారం పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలుకానుంది. ప్రధాన కార్యక్రమంలో 18 ఎన్డీఏ పక్షాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు దాదాపు 25 పక్షాలు పాలుపంచుకోనున్నాయి. బిజూ జనతాదళ్, జేడీ(ఎస్), అకాలీదళ్, బీఎస్పీ, లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్), టీడీపీ వీటిలో ఉన్నాయి. కాంగ్రెస్ సారథ్యంలో దాదాపు 21 పార్టీలు కార్యక్రమాన్ని బహిష్కరించిన వేళ లోక్‌సభలో 50 మంది ఎంపీల బలమున్న ఈ ఏడు పార్టీల సంఘీభావం పాలక బీజేపీకి నైతిక స్థైర్యమిస్తుందని భావిస్తున్నారు. ప్రారంభోత్సవాన్ని పూర్తిగా అధికార పార్టీ కార్యక్రమంగా మార్చేస్తున్నారన్న విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు కూడా ఇది ఉపకరిస్తుందని బీజేపీ భావిస్తోంది. పాల్గొంటున్న బీఎస్పీ, టీడీపీ పార్లమెంటు భవనాన్ని మోదీ ప్రారంభించనుండటాన్ని స్వాగతిస్తున్నట్టు బీఎస్పీ అధినేత మాయావతి ప్రకటించారు. విపక్షాల బహిష్కరణ నిర్ణయం సరికాదన్నారు. ఆదివాసీ గౌరవం గురించి మాట్లాడుతున్న విపక్షాలకు రాష్ట్రపతి పదవి కోసం ద్రౌపదీ ముర్ముపై పోటీ పెట్టినప్పుడు ఆ విషయం గుర్తుకు రాలేదా అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు ప్రకటించింది. చరిత్రాత్మక సందర్భాన్ని రాజకీయం చేయకుండా హాజరై పెద్ద మనసు చూపాలని విపక్షాలకు బీజేపీ విజ్ఞప్తి చేసింది. ప్రధాని కూడా పార్లమెంటులో భాగమేనని ఆ పార్టీ నేత రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు. ‘‘రాష్ట్రపతి అంటే మనందరికీ గౌరవమే. ద్రౌపదీ ముర్ము గురించి కాంగ్రెస్ నేతలు ఎలా మాట్లాడారో గుర్తు చేసి ఆ పదవిని వివాదాల్లోకి లాగదలచుకోలేదు’’ అన్నారు. కార్యక్రమం ఇలా... ► పార్లమెంటు నూతన భవన ప్రాంగణంలో ఆదివారం ఉదయం ఏడింటికి హోమం జరుగుతుంది. తర్వాత సర్వమత ప్రార్థనలుంటాయి. ► అనంతరం హోమ వేదిక వద్దే తమిళనాడు తంజావూరు శైవ మఠ పెద్దలు చోళుల రాజదండమైన సెంగోల్‌ను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేస్తారు. ► అనంతరం లోక్‌సభ చాంబర్‌ను మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారు. ► మధ్యాహ్నం ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, మాజీ ప్రధాని దేవెగౌడ తదితరులు పాల్గొంటారు. ► మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, లోక్‌సభ మాజీ స్పీకర్ శివరాజ్ పాటిల్, కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో పాటు విపక్ష పార్టీల నేతలందరికీ ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. -
ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే వారిదే
న్యూఢిల్లీ: పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవంపై వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారిపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఎలా ఉంటుందో ఆస్ట్రేలియా పర్యటనలో తెలిసిందంటూ విపక్షాల్ని విమర్శించారు. ఆరు రోజుల విదేశీ పర్యటన ముగించుకొని గురువారం స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రధాని మోదీ ఢిల్లీలోని పాలం విమానాశ్రయం వెలుపల తనకు స్వాగతం పలికిన బీజేపీ కార్యకర్తలు, అభిమానులనుద్దేశించి మాట్లాడారు. సిడ్నీలో భారత సంతతికి చెందిన సదస్సులో పాల్గొన్నప్పుడు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోని అల్బానెసెతో పాటుగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు, మాజీ ప్రధాని కూడా హాజరయ్యారన్నారు. ‘‘భారతీయులకు చెందిన ఒక కార్యక్రమానికి ప్రతీ ఒక్కరూ హాజరై తమ దేశానికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని, బలాన్ని అలా చాటారు’’ అని మోదీ కొనియాడారు. పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించే విపక్ష పార్టీలపై ఆయన నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆస్ట్రేలియాలో భారతీయ ప్రతినిధులందరికీ అరుదైన గౌరవం దక్కిందంటే అది మోదీకున్న కీర్తిప్రతిష్టల వల్ల కాదని, భారత్‌కున్న పటిష్టమైన బలం వల్లనేనని ప్రధాని స్పష్టం చేశారు. భారత్ చెప్పేది విదేశాలన్నీ వింటున్నాయని, మెజార్టీ ప్రభుత్వం ఉండడమే దానికి కారణమని చెప్పారు. తాను వినిపించేది 140 కోట్ల భారతీయుల గళమేనని ప్రపంచ నాయకులందరికీ బాగా తెలుసునన్నారు. భారత్‌ను ప్రపంచంలో అగ్రగామిగా తీర్చిదిద్దడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నామన్నారు. అయితే సవాళ్లనే సవాల్ చేయడం తన స్వభావమని చెప్పుకొచ్చారు. కరోనా సంక్షోభ సమయంలో కోవిడ్ టీకాలు విదేశాలకు ఎందుకు పంపిణీ చేస్తున్నారని ప్రతిపక్షాలు అప్పట్లో నిలదీశాయని, కానీ ఎందరో ప్రాణాలు నిలిపినందుకు వారంతా భారత్‌కు కృతజ్ఞతగా ఉన్నారని అన్నారు. బుద్ధుడు, గాంధీ నడయాడిన నేలపై శత్రువులపైన కూడా కరుణ చూపిస్తామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలు అభివృద్ధి నిరోధం డెహ్రాడూన్: దేశాన్ని ఏళ్ల తరబడి పరిపాలించి హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకునే పార్టీలు వారసత్వ రాజకీయాల నుంచి బయటపడలేకపోతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఇలాంటి వారసత్వ రాజకీయాలే అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయని అన్నారు. ఉత్తరాఖండ్‌లో మొట్టమొదటి వందేభారత్ రైలుని మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ డెహ్రాడూన్–ఢిల్లీ రైలు ప్రారంభోత్సవంలో కాంగ్రెస్‌పై పలు విమర్శలు చేశారు. ఉత్తరాఖండ్ రైల్వేలో మౌలిక సదుపాయాల కోసం బడ్జెట్‌ను పెంచామన్నారు. 2014కి ముందు రూ.200 కోట్ల కంటే తక్కువ ఉంటే, ప్రస్తుతం రూ.5 వేల కోట్లు ఉందన్నారు. రైల్వే శాఖలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, ట్రాకుల్ని ఆధునీకరిస్తే మరింత హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టవచ్చన్నారు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీ దానిని గుర్తించకుండా అవినీతి, కుంభకోణాలతో మునిగిపోయిందని విమర్శించారు. వారసత్వ రాజకీయాల నుంచి ఆ పార్టీ బయటపడలేకపోవడంతో దేశాభివృద్ధికి అడ్డంకిగా మారిందన్నారు. -
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఘన విజయానికి ప్రతీక నూతన సన్సద్ భవన్!
భారత పార్లమెంటు నూతన భవనం మే 28న ప్రారంభమవుతోంది. 1927లో నిర్మించిన ప్రస్తుత సన్సద్ భవన్‌కు సమీపంలోని సెంట్రల్ విస్తాలో నిర్మించిన కొత్త భవనంలో పార్లమెంటు ఉభయసభలు రాజ్యసభ, లోక్ సభ కార్యకలాపాలు ఇక కొనసాగుతాయి. ఈ సందర్భంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటు భవనాల చరిత్ర క్లుప్తంగా తెలుసుకుందాం. ఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు పుట్టినిల్లుగా ఇంగ్లండ్‌ను పరిగణిస్తారు. అయితే, బ్రిటిష్ పార్లమెంటును పొరపాటున ఇప్పటికీ చాలా మంది ప్రపంచంలోని పార్లమెంట్లకు మాతృక అని భావిస్తారు. అసలు విషయం ఏమంటే–ప్రఖ్యాత బ్రిటిష్ రాజకీయవేత్త, సంస్కర్త జాన్ బ్రయిట్ 1865 జనవరి 18న బర్మింగ్ హామ్ నగరంలో ప్రసంగిస్తూ ఇంగ్లండ్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ‘ఇంగ్లండ్ ఈజ్ ద మదర్ ఆఫ్ పార్లమెంట్స్’ అని అభివర్ణించారు. ప్రాతినిధ్య పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంచుకుని, ఆచరణలో అనుసరిస్తున్న అన్ని దేశాలకు మోడల్ ఇంగ్లండ్ అనే అర్థంలో జాన్ బ్రయిట్ అలా మాట్లాడారు. కాని, యునైటెడ్ కింగ్ డమ్ రాజధాని లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబి ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ పార్లమెంటు భవనాన్ని (అంటే అందులో సమావేశమవుతూ పనిచేసే పార్లమెంటు ఉభయ సభలు–హౌస్ ఆఫ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్) అన్ని దేశాల పార్లమెంట్లకు మాతృక అనే భావనతో కొందరు బ్రయిట్ అన్న మాటలను వాడుతుంటారు. ఈ సందర్భంగా బ్రిటిష్ పార్లమెంటు చరిత్రను ఒకసారి గుర్తుచేసుకుందాం. 1707-1800 మధ్య లండన్ లోని ఈ పార్లమెంటు గ్రేట్ బ్రిటన్ పార్లమెంటుగా పనిచేసింది. 1801 జనవరి 1 నుంచి పార్లమెంట్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్గా నడుస్తోంది. వెస్ట్ మినిస్టర్ ఆబీ ప్రాంతంలో ఉన్న భవనాల్లో బ్రిటిష్ పార్లమెంటు ఉభయసభలు సమావేశమవుతుండడం వల్ల బ్రిటిష్ తరహా పార్లమెంటరీ వ్యవస్థను వెస్ట్ మినిస్టర్ మోడల్ అని కూడా పిలుస్తారు. గతంలో రెండుసార్లు అగ్నిప్రమాదాల్లో పార్లమెంటు భవనాలు ధ్వంసం కావడం, మళ్లీ నిర్మించడం జరిగింది. లండన్ థేమ్స్ (టెమ్జ్) నది తీరాన ఉన్న పార్లమెంటు భవనాలను ఇప్పుడు మళ్లీ ఆధునికీకరించే పనిచేపడుతున్నారు. 2025లో ప్రారంభమయ్యే నవీకరణ ఆరేళ్ల పాటు సాగుతుందని అంచనా. ప్రారంభం తర్వాత 100 ఏళ్లు నిండక ముందే కొత్త భవనంలోకి భారత పార్లమెంటు మారిన పరిస్థితులు, సాంకేతికత, పెరుగుతున్న అవసరాల దృష్ట్యా భారత పార్లమెంటు ఉభయ సభలకు కొత్త భవనం అవసరం ఏర్పడింది. 1927లో నిర్మాణం పూర్తయి నాటి ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కార్యకలాపాలతో ప్రారంభమైన ప్రస్తుత సన్సద్ భవన్ ను అలాగే ఉంచి దగ్గర్లో కొత్త పార్లమెంటు భవనం నిర్మించడం, ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా కొత్త సన్సద్ భవన్ ప్రారంభించడం నేడు చర్చనీయాంశాలయ్యాయి. భారత రాజ్యాంగ రచనకు వేదికగా ఉపకరించిన పార్లమెంటు భవనంలో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్లమెంటు ఉభయసభల నిర్వహణకు వీలు కల్పించారు. 1952 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకూ 15 మంది ప్రధానమంత్రులు (రెండుసార్లు 13 రోజులు చొప్పున ప్రధానిగా ఉన్న జీఎల్ నందాతో కలిపి), 15 మంది రాష్ట్రపతులు ఈ పార్లమెంటు భవనంలో తమ విధుల్లో భాగంగా ప్రసంగించారు. 14 మంది ఉపరాష్ట్రపతులు (సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి జగదీప్ ధన్‌ఖడ్ వరకూ) రాజ్యసభ అధ్యక్షుల హోదాలో ఎగువసభ సమావేశాలు నిర్వహించారు. చదవండి: బంగారం కొనుగోళ్లకు డాలర్‌కు సంబంధమేంటీ? అలాగే, 17 మంది స్పీకర్ల (జీవీ మావలంకర్ నుంచి ఓం బిర్లా వరకూ) ఆధ్వర్యంలో లోక్ సభ సమావేశాలను ఈ భవనంలోనే జరిపించారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న పాత సన్సద్ భవన్ నుంచి ఇక ఉభయ సభల సమావేశాలు, కార్యకలాపాలు కొత్త భవనంలోకి మారడం నిజంగా 21వ శతాబ్దం మొదటి పాతికేళ్లలో గొప్ప పరిణామం. భారత రాజ్యాంగం 73 ఏళ్ల క్రితం అమలులోకి వచ్చినప్పుడు అనేక మంది ఇతర దేశాల మేధావుల వ్యతిరేక అంచనాలకు భిన్నంగా ఇండియాలో ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కాలపరీక్షను తట్టుకుని నిలిచింది. విజయవంతమైంది. ఈ విజయానికి నూతన సన్సద్ భవన్ ప్రతీకగా నిలుస్తుంది. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
‘ఇది రాజ్యాంగ ఉల్లంఘనే!’.. సుప్రీం కోర్టులో పిల్
ఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో పరిణామం చోటుచేసుకుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఓ పిల్ దాఖలైంది. ప్రధాన మంత్రితో కాకుండా.. రాష్ట్రపతి చేత పార్లమెంట్‌ను ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నెల 28న నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనున్నట్లు లోక్‌సభ కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది. ప్రారంభోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి. Amidst the political controversy regarding the new Parliament building being inaugurated by the Prime Minister, a Public Interest Litigation has been filed in the Supreme Court seeking a direction that the inauguration should be done by the President of India. Read more:… pic.twitter.com/76YuPd185X — Live Law (@LiveLawIndia) May 25, 2023 ఈ లోపు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (Public interest litigation - PIL, పిల్) దాఖలైంది. పార్లమెంట్‌ను ప్రారంభించాల్సింది రాజ్యాంగానికి అధినేతగా ఉన్న రాష్ట్రపతి. అంతేగానీ ప్రధాని కాదు అంటూ పిల్లో పేర్కొన్నారు. PIL filed in Supreme Court seeking a direction that the #NewParliamentBuilding should be inaugurated by the President of India. pic.twitter.com/IG8y4gQn4i — ANI (@ANI) May 25, 2023 ఈ విషయంలో లోక్‌సభ సెక్రటేరియేట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియెట్‌ను, కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ నూతన భవనాన్ని రాష్ట్రపతి చేత ప్రారంభింపజేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిల్లో కోరారు. ఈ కారణం చేతనే విపక్షాలు కూడా ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. -
విపక్షాల బాయ్‌కాట్ నిర్ణయంపై ప్రధాని చురకలు!
ఢిల్లీ: పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విపక్షాలన్నీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత కాకుండా.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరుగుతుండడమే ఇక్కడ ప్రధాన అభ్యంతరం. అయితే.. ఈ నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా విపక్షాలకు చురకలు అంటించారు. విపక్షాల బాయ్‌కాట్ నిర్ణయం సరైంది కాదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఇదివరకే పేర్కొన్నారు. నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం నవ భారతాన్ని, ప్రాచీన సంప్రదాయాలతో అనుసంధానం చేయడమని, దీనిని రాజకీయం చేయవద్దని ప్రతిపక్ష పార్టీలకు హితవు పలికారు. ప్రజలను ఆలోచించనిద్దామని, వారికి నచ్చిన విధంగా స్పందించనిద్దామని చెప్పారు. అయినప్పటికీ విపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. ఈలోపు.. ప్రధాని నరేంద్ర మోదీ సైతం పరోక్షంగా ఈ అంశంపై స్పందించారు. విదేశీ పర్యటన ముగించుకుని ఈ ఉదయం ఢిల్లీలో అడుగుపెట్టిన మోదీ.. అక్కడ బీజేపీ ఏర్పాటు చేసిన స్వాగత సభలో ఈ అంశంపై మాట్లాడారు. ‘‘సిడ్నీలో జరిగిన కమ్యూనిటీ ఈవెంట్లో నేను మాట్లాడింది వినడానికి 20 వేల మంది హాజరయ్యారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్, అధికారపార్టీ ఎంపీలు మాత్రమే కాదు.. ఆ దేశ మాజీ ప్రధాని, ప్రతిపక్ష పార్టీ ఎంపీలు కూడా హాజరయ్యారు. దేశం ఐక్యంగా ఉందని చాటి చెప్పేందుకే వాళ్లంతా ఒకే వేదికపైకి చేరుకున్నారు’’ అంటూ ప్రధాని మోదీ ఇక్కడి విపక్షాలకు చురకలు అంటించారు. అలాగే.. కరోనా టైంలో విదేశాలకు వ్యాక్సిన్ అందించడంపై విపక్షాలు చేసిన విమర్శలనూ ఆయన ప్రస్తావించారు. ఇది గాంధీ, బుద్ధుడు లాంటి మహానుభావులు పుట్టి నడయాడిన నేల. వాళ్లే మనకు స్ఫూర్తిదాయకం. అందుకే శత్రువుల్ని సైతం ఆదరించే గుణం మనుకుంది అంటూ పేర్కొన్నారాయన. ఇదిలా ఉంటే.. మే 28వ తేదీన పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. అయితే ఉభయ సభల ప్రతినిధి అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పక్కన పెట్టేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా పార్లమెంట్‌ను ప్రారంభించడం తీవ్రంగా ఖండిస్తున్నాయి విపక్షాలు. ఈ మేరకు 20 పార్టీలు కలిసి బాయ్‌కాట్ చేస్తున్నట్లుసంయుక్త ప్రకటన చేశాయి. వైఎస్సార్సీపీతో పాటు ఒడిషా అధికార పక్షం బీజేడీ మాత్రం కార్యక్రమానికి హాజరవుతామని ప్రకటించాయి. ఇదీ చదవండి: పార్లమెంట్ ప్రారంభోత్సవానికి వైసీపీ హాజరవుతుంది: ఏపీ సీఎం జగన్ -
రాజ్యసభలో రెడ్, లోక్‌సభలో గ్రీన్ కార్పెట్.. ఎందుకో తెలుసా?
ఢిల్లీ: మన దేశంలోని నూతన పార్లమెంట్ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంపై రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. కాగా, పార్లమెంట్ నూతన భవన ప్రారంభాన్ని బహిష్కరించేందుకు 19 విపక్షపార్టీలు ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో కొత్త పార్లమెంట్ నిర్మాణ శైలి, హంగుల గురించి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. అధికార బీజేపీ పక్షం నూతన పార్లమెంట్ భవన నిర్మాణం మొదలుకొని వివిధ అంశాలలో రికార్డులు నెలకొల్పిందని చెబుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ఫొటోలలో రాజ్యసభ హాలులో రెడ్ కార్పెట్, లోక్‌సభ హాలులో గ్రీన్ కలర్ కార్పెట్ ఉండటాన్ని మనం గమనించవచ్చు. చాలామంది దీనిని డిజైన్ అని అనుకుంటారు. కానీ, దీని వెనుక ఒక కారణం ఉంది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ విధానం నూతన పార్లమెంట్‌లోనే కాదు పాత పార్లమెంట్ భవనంలోనూ కొనసాగింది. కొత్త భవనంలో పలు మార్పులు చోటుచేసుకున్నప్పటికీ కార్పెట్ రంగుల విషయంలో ఎటువంటి మార్పులేదు. పార్లమెంట్‌లోని ఉభయ సభలకు భిన్నమైన ప్రత్యేకత ఉంది. రెండు సభలలో సభ్యులను ఎన్నుకునే ప్రక్రియలోనూ ఎంతో తేడా ఉంది. లోక్‌సభలోని సభ్యులు నేరుగా ప్రజల చేత ఎన్నికయినవారై ఉంటారు. అదేవిధంగా రాజ్యసభ విషయానికొస్తే సభ్యులను ప్రజా ప్రతినిధులు ఎన్నుకుంటారు. లోక్‌సభ సభ్యులంతా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే వీరు కింది స్థాయి(నేల)తో విడదీయరాని అనుబంధం కలిగివుంటారు. భూమితో ముడిపడివున్న వ్యవసాయానికి గుర్తుగా పచ్చరంగును పేర్కొంటారు. అందుకే లోక్‌సభలో పచ్చరంగు కార్పెట్ వినియోగిస్తారు. రాజ్యసభలో రెడ్ కార్పెట్ ఎందుకంటే.. రాజ్యసభలోని సభ్యులు.. ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికైనవారై ఉంటారు. వీరి ఎంపిక ప్రక్రియ విభిన్నంగా ఉంటుంది. ఎరుపు రంగును గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. రాజ్యసభలోని ప్రజాప్రతినిధులను ప్రత్యేక సభ్యులుగా గుర్తిస్తారు. అందుకే రాజ్యసభలో ఎరుపురంగు కార్పెట్‌ను వినియోగిస్తారు. ఇది కూడా చదవండి: రాజదండం సాక్షిగా... పార్లమెంటులో చోళుల సెంగోల్ -
India new parliament building: ప్రారంభ ‘గౌరవం’పై.. పెను దుమారం
పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ తీవ్ర రూపు దాలుస్తోంది. కొత్త భవన ప్రారంభోత్సవం ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుండటం తెలిసిందే. అయితే కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగాధిపతి, దేశాధిపతి, ప్రథమ పౌరుడైన రాష్ట్రపతిని కాదని ప్రధాని ఎలా ప్రారంభిస్తారంటూ ముక్త కంఠంతో ఆక్షేపిస్తున్నాయి. భవనాన్ని ప్రారంభించాల్సిందిగా మోదీని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆహ్వానించడంపై మండిపడుతున్నాయి. అంతేగాక వి.డి.సావర్కర్ వంటి హిందూత్వవాది జయంతి రోజునే ప్రారంభోత్సవం జరపనుండటాన్ని కూడా విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని ఒకే వర్గానికి పరిమితయ్యే రోజున చేయనుండటం తప్పేనని వాదిస్తున్నాయి. దాంతో ఈ వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది. చివరికి పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్‌తో సహా ఏకంగా 19 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించే దాకా వెళ్లింది. 2024 లోక్‌సభ ఎన్నికలు అంతకంతకూ సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీపై నిర్ణాయకమైన సమైక్య పోరుకు పార్లమెంటు భవనం అంశంతోనే శ్రీకారం చుట్టే యోచనలో విపక్షాలున్నట్టు కనిపిస్తోంది. మొత్తమ్మీద జాతీయ రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకునే వాతావరణం కనిపిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏడాది ముందే ఎన్నికల వేడి రాజుకుంటోందనేందుకు దీన్ని స్పష్టమైన సూచికగా భావిస్తున్నారు. ప్రతిపక్షాల అభ్యంతరాలేంటి..? పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతే ప్రారంభించాలని ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. అవేమంటున్నాయంటే... ► ఆర్టికల్ 79 ప్రకారం ఉభయ సభలైన లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతి కలిస్తేనే పార్లమెంటు. ► సాధారణంగా అంతా రబ్బరు స్టాంపుగా పరిగణించే భారత రాష్ట్రపతి పదవికి రాజ్యాంగం అంతటి ప్రాధాన్యం కట్టబెట్టింది. ► ఉభయ సభలకు అధిపతి గనుక దేశ ప్రథమ పౌరుని హోదాలో కొత్త భవనాన్ని ప్రారంభించే హక్కు కచ్చితంగా రాష్ట్రపతిదే. ► ఎందుకంటే ప్రధాని పార్లమెంటు లోని ఒక అంగమైన లోక్‌సభకు మాత్రమే నేతృత్వం వహిస్తారు. ► ఆ కోణం నుంచి చూస్తే రాజ్యాంగపరంగా కూడా పార్లమెంటు భవనాన్ని ప్రధాని ఆవిష్కరించడానికి వీల్లేదు. ► ఏటా పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించే అధికారం, సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం ఆర్టికల్ 87 ప్రకారం రాష్ట్రపతిదే. ► పార్లమెంటు ఆమోదించే బిల్లులన్నీ ఆర్టికల్ 111 మేరకు రాష్ట్రపతి సంతకంతో మాత్రమే చట్ట రూపం దాలుస్తాయి. ► అలాంటప్పుడు రాష్ట్రపతిని ఉద్దేశపూర్వకంగా విస్మరించడం అధికార బీజేపీ అహంకారానికి, లెక్కలేనితనానికి తాజా నిదర్శనం. గతానుభవాలు ఏం చెబుతున్నాయి? ఇలాంటి విషయాల్లో నిర్దిష్టంగా ఇలా వ్యవహరించాలంటూ నియమ నిబంధనలేవీ లేవు. కాకపోతే గత ప్రధానులు తమ వ్యవహార శైలి ద్వారా వీటి విషయమై చక్కని సంప్రదాయాలను నెలకొల్పి ఉంచారన్నది విపక్షాలు చెబుతున్న మాట. వారిలో కేంద్రం బీజేపీ ప్రభుత్వానికి సారథ్యం వహించిన వాజ్‌పేయి కూడా ఉన్నారని గుర్తు చేస్తున్నాయి. ఆ సంప్రదాయాలను పాటించడం విజ్ఞత అనిపించుకుంటుందని అవి అభిప్రాయపడుతున్నాయి. విపక్షాలు ఏమంటున్నాయంటే... నాడు ‘గాంధీ’ గిరి.. లోక్‌సభ సచివాలయమైన ‘పార్లమెంట్ హౌస్ ఎస్టేట్’ ప్రచురణల రికార్డుల ప్రకారం పార్లమెంటు అనుబంధ భవన నిర్మాణానికి 1970 ఆగస్టు 3న నాటి రాష్ట్రపతి వి.వి.గిరి శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తయ్యాక భవనాన్ని 1975 అక్టోబర్ 24న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు. అంటే రెండు కార్యక్రమాలుగా ఇద్దరూ పంచుకున్నారు. అలా చూసినా పార్లమెంటు కొత్త భవన నిర్మాణానికి 2020 డిసెంబర్ 10న మోదీ భూమి పూజ చేశారు. కనుక ప్రారంభోత్సవం రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా జరగాలన్నది విపక్షాల వాదన. వాజ్‌పేయిదీ అదే బాట... 2002లో వాజ్‌పేయి హయాంలో కొత్తగా నిర్మించిన పార్లమెంటు లైబ్రరీ భవనాన్ని నాటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ ప్రారంభించారు. లోక్‌సభ సచివాలయం సంప్రదాయాల ప్రకారం భవనాన్ని ప్రారంభించాల్సిందిగా రాష్ట్రపతినే స్పీకర్ ఆహ్వానించారు. ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తూ పార్లమెంటు కొత్త భవనాన్ని రాష్ట్రపతే ప్రారంభించాలన్నది విపక్షాల డిమాండ్. ‘‘2002లో కేంద్రంలో ఉన్నది మీ బీజేపీ ప్రభుత్వమే. వాజపేయి ప్రధాని హోదాలో రాష్ట్రపతి పదవికి అలాంటి గౌరవమిచ్చారు. కనీసం దీన్నుంచైనా మోదీ నేర్చుకోవాలి’’ అని మోదీకి విపక్ష నేతలు హితవు పలుకుతున్నారు. అలాంటి అవమానాలు వద్దు రాష్ట్రపతి కేవలం దేశ ప్రథమ పౌరుడు మాత్రమే కాదు. ఆర్టికల్ 53 ప్రకారం త్రివిధ బలగాలకు సుప్రీం కమాండర్. మోదీ చేయ బోతున్న పని అక్షరాలా అలాంటి దేశ అత్యున్నత పదవిని విస్మరించించడం, కించపరచడమేనని విపక్షాలంటున్నాయి. రాష్ట్రపతిని ఇలా అవమాని స్తుంటే సహించేది లేదంటూ గట్టిగా హెచ్చరిస్తున్నాయి. రాష్ట్రపతినిలా న్యూనత పరచడం మోదీకి కొత్తేమీ కాదంటూ గత ఉదంతాలను గుర్తు చేస్తు న్నాయి. ‘‘2019 ఫిబ్రవరి 25న ఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్‌ను ప్రధాని హోదాలో మోదీయే ప్రారంభించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కార్యక్రమానికి దూరం పెట్టి ఘోరంగా అవమానించారు. గణతంత్ర పరేడ్‌లో త్రివిధ బలగాల నుంచి రాష్ట్రపతే గౌరవ వందనం స్వీకరిస్తారు. యుద్ధంలో వీరమరణం పొందే సైనిక యోధులకు వీర చక్ర, అశోక చక్ర వంటి గౌరవ పురస్కారాలనూ ఆయనే ప్రదానం చేస్తారు. అలాంటిది యుద్ధ వీరుల జ్ఞాపకార్థం నిర్మించిన వార్ మెమోరియల్ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతికి భాగస్వామ్య మే లేకుండా చేయడం అతి పెద్ద తప్పిదం. మోదీ లెక్కలేనితనానికి ఇది రుజువు’’ అంటూ మండిపడుతున్నాయి. కనీసం ఇప్పుడైనా అలాంటి తప్పిదాన్ని పునరావృతం చేయొద్దని సూచిస్తున్నాయి. కేంద్రం ఏమంటోంది.? ఎటుపోయి ఎటొస్తుందోనని పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ రగడపై ఇప్పటిదాకా నోరు మెదపని బీజేపీ నేతలు ఇప్పుడిక తప్పనిసరై ఒక్కోలా స్పందిస్తున్నారు. బహిష్కరణ నిర్ణయంపై విపక్షాలు పునరాలోచించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అనునయించే ధోరణిలో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాత్రం, ‘కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించాం. రావడం, రాకపోవడమన్నది వారి విజ్ఞతకే వదిలేస్తాం’ అంటూ కుండబద్దలు కొట్టడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై 19 ప్రతిపక్ష పార్టీల కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 28న లాంఛనంగా ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, జేడీ(యూ), ఎన్సీపీ, ఎస్పీ, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), కమ్యూనిస్ట్‌లు సహా 19 ప్రతిపక్ష పార్టీలు ముక్త కంఠంతో ప్రకటించాయి ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ప్రజాస్వామ్యానికి అవమానం పార్లమెంట్ భవనాన్ని ప్రధాని తన చేతుల మీదుగా ప్రారంభించడాన్ని విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రణాళికలో భాగంగనే మోదీ ఇలా చేస్తున్నారని మండిపడ్డాయి. రాష్ట్రపతితో ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే విధంగా మహాత్మాగాంధీని జీవితాంతం వ్యతిరేకించిన హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ జయంతి రోజు ఈ కార్యక్రమం షెడ్యూల్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. (చూడండి : కొత్త పార్లమెంటు లోపల ఎలా ఉంది?) ద్రౌపది ముర్ముని పూర్తిగా పక్కకు పెట్టి కొత్త పార్లమెంట్ భవనాన్ని తానే స్వయంగా ప్రారంభించాలనుకున్న మోదీ నిర్ణయం ప్రజాస్వామ్యానికి తీవ్ర అవమానమని తెలిపాయి. ఈ చర్య రాష్ట్రపతి అత్యున్నత పదవికి, రాజ్యంగ స్పూర్తిని, తొలి ఆదివాసీ మహిళా గౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుందని ప్రతిపక్షాలు తమ ప్రకటనలో పేర్కొన్నాయి. అందరికీ ఆహ్వానం: అమిత్ షా ప్రతిపక్షాల ఆరోపణలపై కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్క పార్టీని ఆహ్వానించామని తెలిపారు. ఉభయ సభల ఎంపీలకు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలకు.. ఇతర నేతలకు భౌతిక, డిజిటల్ రూపాల్లో ఆహ్వానాలు పంపినట్లు పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి రావడం.. రాకపోవడంపై నిర్ణయం వారి విజ్ఙతకే వదిలేస్తున్నామన్నారు. మరోవైపు కార్యక్రమాన్ని బహిష్కరించాలనేకునే తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ప్రతిపక్షాలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సూచించారు. చదవండి: కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక రాజదండం 'సెంగోల్'.. విశేషాలివే.. రాష్ట్రపతిని విస్మరించారు కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడంపై ప్రతిపక్షాల అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేడుకను బహిష్కరిస్తున్నట్లు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అలాగే రాష్ట్రపతిని ప్రధాని మోదీ దాటవేస్తున్నారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన జరిగినప్పుడు మోడీ రాష్ట్రపతిని విస్మరించారని. ఇప్పుడు ప్రారంభోత్సవంలో కూడా అలాగే చేస్తున్నారని, ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేస్తున్నామని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రకటించారు. పార్లమెంట్ కేవలం భవనం కాదు అంతకుముందు.. ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. రాష్ట్రపతిని ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడంపై తలెత్తుతున్న ప్రశ్నల దృష్ట్యా ఆప్ ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ తెలిపింది. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ట్విటర్ ద్వారా పార్టీ నిర్ణయాన్ని ప్రకటించారు. ‘పార్లమెంట్ కేవలం కొత్త భవనం కాదు. ఇది పాత సంప్రదాయాలు, విలువలు, నియమాలతో కూడిన స్థాపన. ఇది భారత ప్రజాస్వామ్యానికి పునాది. ప్రధాని మోదీకి అది అర్థం కాదు. ఆదివారం నాటి కొత్త భవనం ప్రారంభోత్సవం నేను, నాకోసం అనే ఆయన ఆలోచిస్తున్నారు’ అని ఆయన ట్వీట్ చేశారు. ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన 19 పార్టీలు: 1. కాంగ్రెస్ 2. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 3. ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) 4.రాష్ట్రీయ జనతా దళ్ 5. శివసేన (ఉద్దవ్ వర్గం) 6. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 7. జనతాదల్ యునైటెడ్(జేడీయూ) 8. సమాజ్ వాదీ పార్టీ 9. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 10. జార్ఖండ్ ముక్తి మోర్చా 11 కేరళ కాంగ్రెస్ (మణి) 12 విడుతలై చిరుతైగల్ కట్చి 13. రాష్ట్రీయ లోక్ దళ్ 14. తృణమూల్ కాంగ్రెస్ 15. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 16. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 17 నేషనల్ కాన్ఫరెన్స్ 18 రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ 19. మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం -
కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక రాజదండం 'సెంగోల్'.. విశేషాలివే..
పార్లమెంట్ నూతన భవనాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28న ఆదివారం లాంఛనంగా ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆభవనంలో స్పీకర్ సీటు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రక రాజందండాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. దీన్ని నాటి బ్రిటీషర్లు నుంచి బారతీయులకు అధికార మార్పిడి జరిగిందనేందుకు గుర్తుగా ఈ రాజదండాన్ని మన దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకి అందజేసినట్లు అమిత్ షా తెలిపారు. ఈ రాజదండాన్ని 'సెంగోల్' అని పిలుస్తారు. ఇది తమిళ పదం సెమ్మై నుంచి వచ్చింది. దీని అర్థం ధర్మం. రాజదండం నేపథ్యం.. బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు అధికార మార్పిడికి గుర్తుగా మన మధ్య ఏదోకటి విలువైనది ఉండాలని నాటి తొలి ప్రధాని నెహ్రుని అడిగారు. అప్పడు ఆయన సలహ కోసం నాటి గవర్నర్ రాజాజీగా పిలిచే సీ రాజగోపాలాచారిని ఆశ్రయించారు. ఆయన ఈ 'సెంగోల్‌ని' సూచించారు. చోళుల పాలనలోని సంప్రదాయాన్ని అనుసరించి 'సెంగోల్' అనే రాజదండాన్ని సూచించారు. ఇది భారతదేశానికి స్వేచ్ఛ లభించిందని సూచించగలదని, పైగా అధికార మార్పిడికి చిహ్నంగా ఉండగలదని నెహ్రుతో రాజాజి చెప్పారు. దీంతో ఈ రాజదండాన్ని ఏర్పాటు చేసే బాధ్యత రాజాజీపై పడింది. రాజదండాన్ని ఎలా రూపొందించారు ఈ రాజదండాన్ని ఏర్పాటు కష్టతర బాధ్యతను తీసుకున్న రాజాజీ తమిళనాడులోని ప్రముఖ మఠమైన తిరువడుతురై అథీనంను సంప్రదించారు. ఆ మఠం దీన్ని రూపొందించే బాధ్యతను స్వీకరించింది. అప్పటి మద్రాసులో నగల వ్యాపారి వుమ్మిడి బంగారు చెట్టి ఈ సెంగోల్‌ను తయారు చేశాడు. ఇది ఐదుడుగుల పొడువు ఉండి, పైన న్యాయానికి ప్రతిక అయిన నంది, ఎద్దు ఉంటాయి. అప్పగించిన విధానం సదరు మఠంలోని పూజారి రాజదండాన్ని మౌంట్ బాటన్‌కి అప్పగించి తిరిగి తీసుకున్నారు. ఆ తర్వాత భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అర్థరాత్రి 15 నిమిషాల ముందు గంగాజలంతో అభిషేకించి, ప్రధానమంత్రి నెహ్రు వద్దకు ఊరేగింపుగా వెళ్లి ఆయనకు అప్పగించారు(అధికార మార్పిడి జరిగనట్లుగా). ప్రధాని నెహ్రు ప్రత్యేక గీతంతో ఆ రాజందండాన్ని అందుకున్నారు. కొత్త పార్లమెంట్లో సెంగోల్ స్థానం ఈ సెంగోల్ చరిత్ర ప్రాముఖ్యత గురించి చాలా మందికి తెలియదని హోం మంత్రి అన్నారు. కొత్త పార్లమెంట్లో దీనిని ఏర్పాటు చేయడం వల్ల మన సంస్కృతి సంప్రదాయాలను నేటి ఆధునికతకు జోడించే ప్రయత్నం చేశారన్నారు. కొత్త పార్లమెంట్లో 'సెంగోల్'ను ఏర్పాటు చేయాలనే ప్రణాళిక కూడా ప్రధాని మోదీ దూరదృష్టిని ప్రతిబింబిస్తోందని షా అన్నారు. 'సెంగోల్' ఇప్పుడు అలహాబాద్‌లోని మ్యూజియంలో ఉంది. ఇప్పుడు దాన్ని కొత్త పార్లమెంటుకి తీసుకురానున్నట్లు అమిత్ షా చెప్పుకొచ్చారు. అలాగే దయచేసి దీన్ని రాజకీయాలకు ముడిపెట్టోదని నొక్కి చెప్పారు. తాము చట్టబద్ధంగా పరిపాలన సాగించాలని కోరుకుంటున్నామని, ఆ చారిత్రక రాజదండం ఎల్లప్పుడూ మాకు దీనిని గుర్తు చేస్తుందని అమిత్ షా చెప్పుకొచ్చారు. మరిచిపోయిన చరిత్రను గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా ఈ చారిత్రత్మక రాజదండంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. (చదవండి: పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించనున్న విపక్షాలు!) -
పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించనున్న విపక్షాలు!
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీయే ప్రారంభిస్తే ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని యోచిస్తున్నట్లు సమాచారం. కొత్త భవనాన్ని ఈ నెల 28న లాంఛనంగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నూతన భవన ప్రారంభోత్సవానికి తాము హాజరు కావడం లేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఈకార్యక్రమాన్ని బహిష్కరించాలని, దీనిపై అతిత్వరలో ఒక ఉమ్మడి ప్రకటన జారీ చేయాలని పలు భావసారూప్యం కలిగిన ప్రతిపక్షాలు భావిస్తున్నట్లు సమాచారం. బుధవారం తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. పార్లమెంట్ అనేది కేవలం ఒక భవనం కాదని, దేశ ప్రజాస్వామ్యానికి అది పునాది అని తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ చెప్పారు. ఇది ప్రధాని మోదీ సొంత వ్యవహారం కాదని అన్నారు. 2020 డిసెంబర్లో కొత్త పార్లమెంట్ నిర్మాణ శంకుస్థాపన పనులను ప్రతిపక్షాలు బహిష్కరించాయి. ఇది కూడా చదవండి: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం: సావర్కర్ జయంతి.. రాష్ట్రపతికి నో ఆహ్వానం.. రాజకీయ రగడ -
New Parliament Opening: రాజకీయ రగడ
కొత్త పార్లమెంట్ ప్రారంభంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. మే 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పార్లమెంట్‌ను ప్రారంభించే ప్రయత్నాలు కొనసాగుతుండగా.. అదే తేదీన సావర్కర్ జయంతి కావడం, పైగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో ఇరుపక్షాలు నడుమ సోషల్ మీడియాలో విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. వీడీ సావర్కర్ జయంతి రోజు కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడాన్ని.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబడుతోంది. ఇది స్వాతంత్ర్య సమరయోధుల్ని పూర్తిగా అవమానించడమేనని విమర్శిస్తోంది. లేని చోట వివాదాలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటైంది. రాష్ట్రపతి దేశాధినేత. కానీ, ప్రధానిప్రభుత్వాధినేత.. ప్రభుత్వం తరపున పార్లమెంటుకు నాయకత్వం వహిస్తారు. ఆ నాయకత్వంలోనే విధానాలు చట్టాల రూపంలో అమలు చేయబడతాయి. రాష్ట్రపతి ఉభయ సభలలో సభ్యులు కాదు. కానీ, ప్రధాని మాత్రం సభ్యులే కదా అని కేంద్ర హోం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్వీట్ చేశారు. Congress has a habit of raking controversies where none exist. While President is the Head of State, PM is the Head of Govt & leads the Parliament on behalf of the Govt, whose Policies are effected in form of Laws. The President is not a Member of either House, whereas PM is. pic.twitter.com/73Ns7NP8EK — Hardeep Singh Puri (@HardeepSPuri) May 22, 2023 కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సైతం ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రపతిని, మాజీ రాష్ట్రపతిని ఆహ్వానించకుండా.. ప్రభుత్వం పదే పదే ఔచిత్యాన్ని ఉల్లంఘిస్తోందని మండిపడ్డారాయన. గతంలో పార్లమెంట్ శంకుస్థాపనకు అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆహ్వానించలేదు.. ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదు అని ట్వీట్ ద్వారా ఖర్గే విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం, ప్రతిపక్షం, ఆఖరికి దేశంలోని ప్రతీ పౌరుడికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఆమె. దేశానికి ప్రథమ పౌరురాలు. It looks like the Modi Govt has ensured election of President of India from the Dalit and the Tribal communities only for electoral reasons. While Former President, Shri Kovind was not invited for the New Parliament foundation laying ceremony… 1/4 — Mallikarjun Kharge (@kharge) May 22, 2023 ఆయన (ప్రధాని మోదీ) కార్యనిర్వాహక మండలికి అధిపతి అంతేగానీ చట్టసభకు కాదు. ఆ చట్ట సభలోనూ మాకు అధికారాల విభజన ఉంది. గౌరవనీయులైన లోక్‌సభ స్పీకర్ లేదంటే రాజ్యసభ చైర్లు పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించొచ్చు. ఇది ప్రజల సొమ్ముతో కట్టింది. ప్రధాని ఏదో తన స్నేహితులు వాళ్ల ప్రైవేట్ నిధుల నుంచి స్పాన్సర్ చేసినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అంటూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. Why should PM inaugurate Parliament? He is head of the executive, not legislature. We have separation of powers & Hon’ble @loksabhaspeaker & RS Chair could have inaugurated. It’s made with public money, why is PM behaving like his “friends” have sponsored it from their private… https://t.co/XmnGfYFh6u — Asaduddin Owaisi (@asadowaisi) May 19, 2023 మోదీగారి ఫొటోలకు ఫోజులు, సెల్ఫ్ ఇమేజ్ కోసం పాకులాట.. మర్యాదను, నిబంధనలను పక్కనపడేసిందని సీబీఐ నేత డీ రాజా విమర్శించారు. 26 నవంబర్ 2023- దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బహుమతిగా ఇచ్చిన భారత రాజ్యాంగం 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని.. కొత్త భవనం ప్రారంభోత్సవానికి ఇది తగినది.. అయితే ఇది సావర్కర్ పుట్టినరోజు మే 28న జరుగుతుంది- ఇది ఎంతవరకు సముచితం?” అంటూ తృణమూల్ ఎంపీ సుఖేందు శేఖర్ రే పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని ట్వీట్ చేశారు రాహుల్. नए संसद भवन का उद्घाटन राष्ट्रपति जी को ही करना चाहिए, प्रधानमंत्री को नहीं! — Rahul Gandhi (@RahulGandhi) May 21, 2023 కాంగ్రెస్ పనికిమాలిన పార్టీ అని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శించారు. వీర సావర్కర్.. ప్రతీ భారతీయుడికి గర్వకారణమైన వ్యక్తి. ఆయన కాలి దుమ్ముకు కూడా పనికి రాని వాళ్లు ఇవాళ విమర్శిస్తున్నారని ఘాటుగా మండిపడ్డారు. పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తే వస్తే నష్టం ఏంటి?. రాహుల్ గాంధీవి ఏడుపుగొట్టు రాజకీయాలు. ఏదైనా చరిత్రాత్మక ఘట్టం చోటుచేసుకోబోతున్న సమయంలోనే.. ఏదో జరిగిపోతోందన్న రేంజ్లో తన గుండెలు బాదుకుంటారు. దేశం ప్రగతి వైపు వెళ్తుంటే.. అపశకునంలా రాహుల్ అడ్డుపడుతున్నారు అని గౌరవ్ భాటియా మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ నేత, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ సైతం కొత్త పార్లమెంట్ భవనం ఆవశ్యకతను చెప్పారని, అలాంటి కలను నిజం చేస్తుంటే పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారాయన. ఇదిలా ఉంటే.. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వ్యతిరేకించేలా విపక్షాలన్నీ కలిసి మెగా సమావేశం నిర్వహించాలని భావిస్తున్నాయి. -
కొత్త పార్లమెంట్ లోపల ఎలా ఉందో చూశారో? (ఫొటోలు)
-
నెలాఖరుకు పార్లమెంట్ నూతన భవనం సిద్ధం
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనం ఈ జనవరి చివరి నాటికి సిద్ధమవుతుందని అధికారవర్గాలు తెలిపాయి. బడ్జెట్ సమావేశాలను కొత్త భవనంలోనే జరిపేదీ లేనిదీ త్వరలోనే కేంద్రం నిర్ణయించే అవవకాశాలున్నాయని తెలిపాయి. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టాలో భాగమే పార్లమెంట్ కొత్త భవనం. రాష్ట్రపతి భవన్– ఇండియా గేట్ మధ్యలోని మూడు కిలోమీటర్ల పొడవైన రాజ్‌పథ్ నవీకరణ, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, ప్రధాని కొత్త కార్యాలయం, నివాసం, ఉపరాష్ట్రపతి ఎన్క్లేవ్ వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి. నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ చేపట్టింది. -
అంబేడ్కర్ పేరు ఎందుకు పెట్టాలంటే...
ప్రపంచంలో ఇప్పటివరకూ ఏ దేశస్థులూ తమ పార్లమెంట్ భవనానికి ఒక వ్యక్తి పేరు పెట్టుకున్న దాఖలాలు లేవు. కానీ భారత నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ బయలుదేరింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణమిది. కొంతమంది ఇది సమంజసమైనది కాదంటున్నారు. కానీ ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సంక్షేమం, లౌకికత్వం వంటి ప్రజాస్వామ్య లక్షణాలు పాదుకొల్పడానికీ, అవి సజావుగా మనగలగడానికీ రాజ్యాంగంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినవారు అంబేడ్కర్. అటువంటి వ్యక్తి పేరు ప్రజాస్వామ్యానికి వాహికైన పార్లమెంట్ భవనానికి పెట్టడం ముమ్మాటికీ సబబే అని మరికొందరు అంటున్నారు. పేరు అంటూ పెట్టాల్సి వస్తే రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థీకరించడంలో కీలక పాత్ర పోషించిన అంబేడ్కర్ పేరు పెట్టడమే సముచితం. ప్రపంచానికి పరివర్తన సంకేతం ప్రస్తుతం ఒక సరికొత్త డిమాండ్ పుట్టుకొచ్చింది. న్యూఢిల్లీలోని సెంట్రల్ విస్టాలో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనానికి తప్పకుండా అంబేడ్కర్ పేరు పెట్టాలన్నదే ఆ డిమాండ్. హైదరాబాద్ నగరంలో కొత్తగా నిర్మి స్తున్న సచివాలయ భవనానికి బీఆర్ అంబేడ్కర్ పేరు పెడుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 15న ప్రకటించింది. కొత్త పార్లమెంట్ భవనానికి ‘అంబేడ్కర్ పార్లమెంట్’ అని పెట్టాల్సిందిగా తాను ప్రధానికి ఉత్తరం రాస్తానని కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. దీని చుట్టూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో సోషల్ మీడియా చర్చలు మొదలైపోయాయి. దీనిపై రెండు ముఖ్య మైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక వ్యక్తికి ఎంత స్థాయి, ఆమోదనీ యత ఉన్నా సరే... దేశం కోసం దీర్ఘకాలంగా చట్టాలను రూపొందిస్తున్న పార్లమెంట్‌కు ఆ వ్యక్తి పేరు పెట్టవచ్చా? భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలుగా నిలిచిన మరికొందరిని పక్కనబెట్టి ఈ కొత్త భావనకు అంబేడ్కర్ అర్హుడేనా? తొలి ప్రశ్నకు సమాధానం పూర్తిగా నైతిక పరమైనది. సాధారణంగా పార్లమెంట్ భవంతికి ఒక వ్యక్తి పేరు పెట్టరు. ఆ వ్యక్తి ఎంత గొప్ప వారైనా సరే. కానీ భారతదేశంలో ప్రతి విషయానికీ వ్యక్తుల పేర్లను తగిలించే పద్ధతి, సంస్కృతి ఉన్నాయి కదా. అలాంటప్పుడు దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించడంలో గొప్పగా దోహదం చేసిన ఏ వ్యక్తి పేరయినా పార్లమెంట్ భవనానికి ఎందుకు పెట్టకూడదు? ఇక రెండో ప్రశ్నకు సమాధానంగా భారత దేశంలో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థీక రించడంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు వ్యక్తులను తులనాత్మకంగా మదింపు చేయవలసి ఉంది. వారెవరో కాదు. అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయి పటేల్. వీరిలో నెహ్రూ పట్ల ద్వేషపూరిత దృక్పథం రాజ్యమేలుతోంది. ప్రధాని మోదీ ఇప్పుడు నెహ్రూతో, ఆయన కుటుం బంతో ప్రత్యక్షంగా ఘర్ష ణాత్మక వైఖరితో వ్యవహ రిస్తున్నారు. మోదీ ప్రభుత్వం సానుకూలత ప్రద ర్శించడానికి అవకాశం గల పేర్లు రెండే. అవి అంబేడ్కర్, పటేల్. పటేల్ నేపథ్యం, పరిణామక్రమం చూస్తే ఆయన గొప్ప పోరాటయోధుడిగా, కార్యకర్తగా, నేతగా, పాలనా దురంధరుడిగా నిరూపించుకున్నారు. ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఐక్యం చేసిన వానిగా నిలిచిపోయారు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాది. కానీ పటేల్ ఎన్నడూ న్యాయ తత్వ వేత్త, చరిత్రకారుడు, ఆర్థికవేత్త, ప్రాపంచిక వ్యవహారాలలో నిపుణుడు కాలేదు. మరోవైపు దయనీయంగా అస్పృశ్యతను అను భవించి వచ్చిన అంబేడ్కర్, అనేకమందిలో ఒకే ఒక్కడుగా పరిణమించారు. ఆయన కూడా పోరాట యోధుడు, యాక్టివిస్టు, లీడర్, తనదైన కోణంలో పాలనా దురంధరుడు కూడా. న్యాయ, నైతిక పరమైన తత్వవేత్త. చరిత్ర, సామాజిక శాస్త్రం, రాజకీయ అర్థ శాస్త్రం వంటి అంశాలలో శిక్షణ పొందారు. భారతీయ చరిత్రపై, బౌద్ధ, వైదిక, జైన, ఇస్లాం, క్రైస్తవ వగైరా బహుళ ప్రాపంచిక ఆలోచనా విధానాలపై అపారమైన పట్టు ఉండేది. రాజ్యాంగ రచన చేస్తూ, దాంట్లోని అన్ని ఆర్టికల్స్నీ రాజ్యాంగ సభలో ఆమోదింపజేసుకుంటున్నప్పుడు ఆయన దీక్ష గానీ, ఆయన జోక్యం చేసు కున్న తీరు గానీ మరే వ్యక్తిలో కంటే ఎక్కువగా ప్రదర్శితమయ్యేవి. ఢిల్లీ అధికార వ్యవస్థలు కాంగ్రెస్ పూర్తి నియం త్రణలో ఉన్నంతకాలం ఆయన్ను నిర్లక్ష్యం చేశారు. మండల్ కమిషన్ అనంతర కాలంలో భారత్ అంబేడ్కర్‌ను అధికాధికంగా కనుగొంది. రాజ్యాంగ సభలో ఆయన రాసిన రచనలు, చేసిన ప్రసంగాలు భారత్ సంక్షోభంలోకి ప్రవేశించిన ప్రతి సందర్భంలోనూ ప్రజాస్వామ్య రక్షణకు ఆయుధాలుగా మారాయి. అందుకే భారతీయ ప్రజాస్వామ్యం, అంబేడ్కర్ పర్యాయ పదాలైపోయాయి. ‘మండల్’ అనంతర కాలాలు భారత్‌ను ఒక జాతిగా మల్చడంలో ఆయన నిబద్ధతా శక్తిని పునరుత్థానం చెందించాయి. భారతీయ ప్రజాస్వామిక సంప్రదాయ జ్ఞానాన్ని ఆయన సంశ్లేషించారు. ప్రత్యేకించి బౌద్ధులు, గిరిజన జనాభాకు చెందిన సంప్రదాయిక జ్ఞానాన్ని ఆయన రాజ్యాంగంలోకి తీసుకురావడమే కాదు.. రాజ్యాం గంలోని ప్రతి ఒక్క నిబంధనకు న్యాయం చేయడా నికి, రాజ్యాంగ సభ ఉపన్యాసాలలో వాటిని పొందుపర్చారు. ప్రత్యేకించి ఇంగ్లండ్, అమెరికా ల్లోనూ; ఇంకా అనేక దేశాల్లోనూ ఉద్భవించిన పాశ్చాత్య రాజ్యాంగ మూల సూత్రాలు ఆయనకు తెలిసినప్పటికీ, భారతీయ చరిత్ర నుంచి సాధికారి కమైన సందర్భోచితమైన ఎన్నో మూలసూత్రాలను రాజ్యాంగంలో పొందుపర్చారు. అందుచేత మన జాతీయవాదాన్ని ఆయన ఏ ఒక్కదాని కంటే మిన్నగా ఉన్నత స్థానంలో నిలిపారు. బుద్ధుడి ఉపమానాలను, అశోకుడి పాలనా సూత్రాలు, చిహ్నాలను ఆధునిక కాలంలో కూడా పునశ్చరణ కావడానికి అంబేడ్కరే కారణం. ఫ్రెంచ్ ఆలోచనా విధానం నుంచి కాకుండా, మన ప్రాచీన భారత చరిత్ర నుండి ప్రజా స్వామ్యం, స్వేచ్చ, సమానత్వం–సౌభ్రాతృత్వం అనే మూడు కీలక సూత్రాలను పదే పదే వల్లించేవారు. ఆయన జాతీయవాదానికి మూలాలు... పురాణాల్లో కాకుండా భారతీయ ప్రజారాశుల సజీవ ఉత్పాదకతా జీవితం నుంచి పుట్టు కొచ్చాయి. చారిత్రకంగా పీడితులైన దళితులు, ఆదివాసులు, శూద్ర ప్రజానీకం ఈరోజు తమ జీవితాల్లో నెమ్మదిగా అయినా సరే కచ్చితంగా మార్పులు వస్తున్నందుకు అంబేడ్కర్‌కు రుణపడి ఉంటున్నారు. ఈ అన్ని కారణాల వల్ల భారత నూతన పార్లమెంట్ భవంతికి అంబేడ్కర్ పేరు పెట్టినట్ల యితే, భారతదేశంలో ఒక నిజమైన నాగరికతా పరివర్తన చోటు చేసుకుంటోందని ప్రపంచం గుర్తిస్తుంది. అప్పుడు మాత్రమే భారతీయ సంపూర్ణ నిర్వలసీకరణ ప్రక్రియ కొత్త ఉదాహర ణను ప్రతిష్ఠించుకుంటుంది. (క్లిక్: ప్రత్యామ్నాయ భావజాల దార్శనికుడు) - కంచె ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
పార్లమెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ మేరకు మంగళవారం మంత్రి కేటీఆర్ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చింది. ఆయన చూపిన బాటలోనే నడుస్తున్నాం. అంబేడ్కర్తత్వాన్ని టీఆర్ఎస్ ఆచరణలో చూపింది. అంబేడ్కర్ లక్ష్యం సమానత్వం. ఆయన భాషా ఆధిపత్యం, ప్రాంతీయ ఆధిపత్యంతోపాటు అన్నిరకాల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయనలా సమగ్రంగా సమాజాన్ని అర్థం చేసుకున్నవారు ఎవరూ లేరు. తాను రాసిన రాజ్యాంగం దుర్వినియోగమైతే దాన్ని తానే ముందుగా తగలబెడతానని అంబేడ్కర్ అన్నారు. దేవుడు కోసం గుడి కడితే... దెయ్యాలు ముందే వచ్చి కూర్చుంటే గుడిని ధ్వంసం చేయక తప్పదు. అంబేడ్కర్ కొన్ని కులాలు, వర్గాలకు మాత్రమే ప్రతినిధి కాదు. ఆయన మహాత్ముడితో సరిసమాన వ్యక్తి. అంబేడ్కర్ మహిళలకు కూడా సమాన హక్కులుండాలన్నారన్నారు. ఆ బిల్లు ఆమోదం పొందకపోవడంతో రాజీనామా చేశారన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక పార్లమెంట్. దానికి ఆ పేరు పెట్టడానికి ఇంతకు మించిన వ్యక్తి లేరు. అందుకే అంబేడ్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం’అని ఆ తీర్మానంలో కోరారు. ఏకగ్రీవ ఆమోదం కాంగ్రెస్ సభాపక్ష నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు. ఈ దేశంలో స్వేచ్ఛ లేదని, ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడితే ఐటీ, ఈడీ దాడులతో భయపెడుతున్నారని ఆరోపించారు. ఈ దేశ సంపద కొన్ని వర్గాలకు మాత్రమే అందుతోందన్నారు. ఈ దేశంలో సోదరభావం లేకుండా పోయిందని ఆరోపించారు. పార్లమెంట్‌కు అంబేడ్కర్ పేరు పెడితే.. ఈ దేశ నిర్మాణం సరిగ్గా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పంజగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపింది. అనంతరం పార్లమెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జనవరిలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ తమ తీర్మానానికి మద్దతు తెలిపిన భట్టి, ఇతర నేతలకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపితే బాగుండేదన్నారు. పంజగుట్టలో విగ్రహం ఏర్పాటు అంశంపై కేటీఆర్ స్పందిస్తూ... గతంలో విగ్రహాలు పెట్టిన విషయాన్ని తానేమీ కాదనడం లేదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అయినా ట్యాంక్‌బండ్ సమీపంలో 125 అడుగుల విగ్రహాన్ని పెడుతున్నామని, ప్రస్తుతం విగ్రహ నిర్మాణం సాగుతోందన్నారు. జనవరిలో ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. ఇదీ చదవండి: ఆనాటి తారకరాముడి డైలాగ్‌తో అదరగొట్టిన కేటీఆర్.. అసెంబ్లీలో చప్పట్ల మోత! -
National Emblem: అవసరమా! ఆ సింహాలు క్రూరంగా, కోపంగా కనిపించాలా?
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనంపై ప్రధాని మోదీ సోమవారం ఆవిష్కరించిన భారీ జాతీయ చిహ్నం(నాలుగు సింహాల)పై ప్రతిపక్షాలు, చరిత్రకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ చిహ్నాన్ని సైతం మోదీ ప్రభుత్వం వక్రీకరించిందని ఆరోపించారు. అశోక చక్రంపై ఎంతో ఠీవిగా, విశ్వాసంతో కనిపించే సింహాలకు బదులు.. భయపెట్టే, దూకుడు భంగిమలో ఉన్న సింహాల ప్రతిమను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. దీనిని వెంటనే మార్చాలంటూ ప్రధానిని డిమాండ్ చేశారు. ‘‘మోదీ జీ, సింహాల ముఖ భంగిమ గమనించండి. ఇది ఘనమైన సార్నాథ్ చిహ్నమా లేక గిర్ సింహానికి వక్రీకరణ రూపమా? పరిశీలించి, అవసరమైన మేరకు మార్పులు చేయండి’’అంటూ లోక్‌సభలో కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురి ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘గంభీరంగా కనిపించే మన జాతీయ చిహ్నం అశోక సింహాలకు అవమానమిది. రాజసానికి బదులుగా గర్జిస్తూ, దూకుడుతో మోదీ మార్కుతో ఉన్న సింహాల ప్రతిమను పార్లమెంట్ కొత్త భవనంపై ఏర్పాటు చేయడం సిగ్గుచేటు. వెంటనే మార్చండి’అంటూ టీఎంసీ రాజ్యసభ సభ్యుడు జవహర్ సర్కార్ ట్విట్టర్లో డిమాండ్ చేశారు. చరిత్ర కారుడు ఇర్ఫాన్ హబీబ్ కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘జాతీయ చిహ్నాన్ని స్వతంత్ర భారతంలో 1950లో మనం స్వీకరించాం. ఈ చిహ్నం విషయంలో ప్రస్తుత జోక్యం పూర్తిగా అవాంఛనీయం, అనవసరం. అశోక చక్రంపైని సింహాలు క్రూరంగా, కోపంగా కనిపించాలా?’అని పేర్కొన్నారు. ‘గాంధీ నుంచి గాడ్సే దాకా.. ప్రశాంతంగా, దర్పంగా కూర్చుని కనిపించే మన జాతీయ చిహ్నంలోని సింహాల నుంచి.. పార్లమెంట్ నూతన భవనంపై ఆవిష్కరించిన కోపంతో, కోరలు చాచి కనిపించే సింహాల వరకు..ఇదే మోదీ నూతన భారతం’అంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి: బీజేపీ పార్లమెంట్ నూతన భవనంపైన ఆవిష్కరించి నాలుగు సింహాల ప్రతిమ సార్నాథ్ స్తంభంపైనున్న సింహాలకు ప్రతిరూపమేనని బీజేపీ పేర్కొంది. నిస్పృహలో ఉన్న ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. ప్రధాని మోదీ లక్ష్యంగా ఏదో ఒక అంశాన్ని ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటున్నాయని బీజేపీ ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ అనిల్ బలూని పేర్కొన్నారు. బ్రిటిష్ జమానాలో 150 క్రితం నిర్మించిన భవనానికి బదులుగా కొత్తగా పార్లమెంట్ భవనాన్ని ఏర్పాటు చేయడమే ప్రతిపక్షాల కడుపుమంటకు కారణమన్నారు. -
సెంట్రల్ విస్టాపైనా విమర్శలా?
న్యూఢిల్లీ: ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ప్రధాని∙మోదీ విమర్శించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో రక్షణ శాఖ కార్యాలయ భవనాలు భాగమేనని, ఈ విషయంలో ప్రతిపక్షాలు నోరెత్తడం లేదని పేర్కొన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కస్తూ ర్బాగాంధీ మార్గ్, ఆఫ్రికా అవెన్యూలో నిర్మించిన రెండు నూతన బహుళ అంతస్తుల రక్షణ శాఖ కార్యాలయ కాంప్లెక్స్‌లను మోదీ గురువారం ప్రారంభించారు. ఇక్కడ 7,000 మందికిపైగా రక్షణ శాఖ, సైనిక దళాల ఉద్యోగులు పని చేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం నిర్దేశిత గడువులోగా పూర్తవుతుందన్న నమ్మకం ఉందన్నారు. భారత రక్షణ దళాలు మరింత సమర్థంగా, ప్రభావవంతంగా పని చేసేందుకు మనం కొనసాగిస్తున్న ప్రయత్నాలకు ఈ నూతన డిఫెన్స్ ఆఫీసు కాంప్లెక్స్‌లు బలం చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని అంటే కేవలం నగరమేనా? రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నిర్మించిన స్థావరాల నుంచే ఇప్పటిదాకా రక్షణ శాఖకు సంబంధించిన కార్యకలాపాలు సాగాయని, ఆధునిక అవసరాల దృష్ట్యా కొత్త భవనాలు నిర్మించినట్లు మోదీ వివరించారు. ఇకపై దేశ రక్షణకు సంబంధించి త్రివిధ దళాల కార్యకలపాలు ఇక్కడి నుంచి నడుస్తాయని అన్నారు. రాజధానిలో ఆధునిక రక్షణ వ్యవస్థను సృష్టించే యజ్ఞంలో ఇదొక భారీ ముందడుగు అని వ్యాఖ్యానించారు. డిఫెన్స్ ఆఫీసు కాంప్లెక్స్‌ల గురించి మాట్లాడితే ఆరోపణల్లోని డొల్లతనం బయటపడుతుందనే భయంతో దీనిపై నోరువిప్పడం లేదని ప్రతిపక్ష నేతలపై మోదీ ధ్వజమెత్తారు. రాజధాని అంటే కేవలం ఒక నగరం మాత్రమే కాదని, దేశ బలం, సంస్కృతి, ఆలోచనా శక్తి, అంకితభావానికి చిహ్నమని ఉద్ఘాటించారు. డిఫెన్స్ ఆఫీసు కాంప్లెక్స్‌లను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించారు. నిధులు, వనరులను రక్షణ శాఖ సమకూర్చింది. వీటితో 9.60 లక్షల చదరపు అడుగుల్లో ఆఫీసు స్పేస్ అందుబాటులోకి వచ్చింది. 14 కార్యాలయాలను కేజీ మార్గ్ కాంప్లెక్స్‌లోకి, 13 కార్యాలయాలను ఆఫ్రికా అవెన్యూ కాంప్లెక్స్‌లోకి తరలించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆఫ్రికా అవెన్యూలోని డిఫెన్స్ ఆఫీసు కాంప్లెక్స్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. త్రివిధ దళాల అధికారులతో సమావేశమయ్యారు. -
వివాదాల్లో ప్రతిష్టాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా ప్రతీరోజు వేలమంది ప్రాణాలు కోల్పోతుంటే... ఆసుపత్రుల్లో బెడ్ల కోసం, ఆక్సిజన్ కోసం జనం హాహాకారలు చేస్తున్నారు. మరోవైపు వేల కోట్ల రూపాయలతో ఢిల్లీలో చేపట్టిన సెంట్రల్ విస్టా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రశ్నించేందుకు ఇది ఆస్కారం కల్పిస్తోంది. వైద్య వ్యవస్థలో మౌలిక వసతుల కొరత కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయని విదేశాలు సైతం ముందుకు వచ్చి సహాయం చేస్తున్న సమయంలో, దేశ రాజధానిలో వేలకోట్ల రూపాయల ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతుండడంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. కరోనా సెకండ్ వేవ్‌తో దేశం తీవ్ర అవస్థలు పడుతోంది. ఎటుచూసినా భయాందోళనలే తాండవిస్తున్నాయి. ప్రతీరోజు 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ఒక్కసారిగా సంక్రమణ కేసుల సంఖ్య పెరిగిపోవడంతో చికిత్సకు కావాల్సిన మందులు, పడకలు, ఆక్సిజన్‌కు కొరత తలెత్తుతోంది. మరోవైపు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ దేశ రాజధాని ఢిల్లీలో రూ.20 వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను నిలిపివేయాలని డిమాండ్ రోజురోజుకి తీవ్రమవుతోంది. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దేశంలో కరోనా పరిస్థితులను చక్కదిద్దేందుకు విదేశాల నుంచి సహాయాన్ని అంగీకరిస్తున్న కేంద్రప్రభుత్వం, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఆరోగ్య వ్యవస్థపై ఇప్పటికైనా దృష్టిసారించి మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాలని డిమాండ్ మొదలైంది. శ్వాస అవసరం: రాహుల్ సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సంబంధించి మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాల నుంచి నిరంతరం దాడికి గురవుతోంది. తాజాగా ఆదివారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రస్తుత సమయంలో దేశానికి ప్రధాని నివాసం అవసరం కాదని, దేశానికి శ్వాస అవసరమని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ట్విట్టర్లో రెండు ఫోటోలను పోస్ట్ చేశారు. మొదటి ఫోటోలో ప్రజలు ఆక్సిజన్ సిలిండర్ల కోసం పొడవైన క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు. రెండో ఫోటో... సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కోసం రాజ్‌పథ్ సమీపంలో జరుగుతున్న తవ్వకం పనులకు సంబంధించినది. అంతేగాక గతంలోనూ రాహుల్‌గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నేరపూరిత వ్యర్థంగా ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. చదవండి: (కేంద్రం చేసింది క్రూరమైన నేరం: సిసోడియా) మాజీ ప్రధానమంత్రులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్‌సింగ్‌లు 70 ఏళ్లుగా సృష్టించిన వ్యవస్థ ఈ రోజు ఎదుర్కొంటున్న క్లిష్ట సమయాన్ని అధిగమించడానికి దేశానికి సహాయపడిందని శివసేన... భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేసింది. కరోనా నియంత్రణ కోసం పొరుగున ఉన్న చిన్న దేశాలు భారతదేశానికి సహాయం అందిస్తుండగా, వేల కోట్ల సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులను ఆపడానికి మోదీ ప్రభుత్వం ఏమాత్రం సిద్ధంగాలేదని శివసేన తమ పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో రాసింది. బంగ్లాదేశ్ రెమిడెసివిర్ 10వేల డోస్‌లను పంపగా, భూటాన్ మెడికల్ ఆక్సిజన్ పంపింది. నేపాల్, మయన్మార్, శ్రీలంకలు కూడా ఆత్మనిర్భర భారతదేశానికి సహాయం అందించాయని పేర్కొంది. అంతకుముందు ఏవైనా విపత్తులు వస్తే పాకిస్తాన్, రువాండా, కాంగో వంటి దేశాలు ఇతర దేశాల సహాయం పొందేవి. కానీ ప్రస్తుత పాలకుల తప్పుడు విధానాల కారణంగా భారత్ నేడు ఈ పరిస్థితిని ఎదుర్కొంటోందని శివసేన ఘాటుగా విమర్శించింది. అయితే రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రతిపక్ష నాయకులు సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ ప్రతిపాదనకు ఇదే నాయకులు మద్దతు ఇచ్చారని, కొత్త పార్లమెంటు భవనం ఆవశ్యకత గురించి యూపీఏ ప్రభుత్వ సమయంలో కాంగ్రెస్ నాయకులు లేఖలు రాశారని కేంద్రమంత్రి గుర్తు చేశారు. అసలేంటి సెంట్రల్ విస్టా..? ఢిల్లీలోని రైసినా హిల్స్ సమీపంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంట్ భవనం, కొత్త నివాస సముదాయం నిర్మించనున్నారు. ఇందులో ప్రధాని, ఉపరాష్ట్రపతి నివాసాలతో పాటు అనేక కొత్త కార్యాలయ భవనాలు, మంత్రిత్వ శాఖల కార్యాలయాల కోసం కేంద్ర సచివాలయం నిర్మించనున్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును 2019 సెప్టెంబర్‌లో ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు 2020 డిసెంబర్ 10న ప్రధాని నరేంద్ర మోదీ పునాది వేశారు. దీనితో పాటు ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు మూడు కిలోమీటర్ల పొడవైన ‘రాజ్‌పథ్’ మార్పును కూడా ప్రతిపాదించారు. కొత్త సచివాలయం అందుబాటులోకి వచ్చాక... సెంట్రల్ విస్టా ప్రాంతంలోని నార్త్, సౌత్ బ్లాక్‌లను మ్యూజియమ్లుగా మార్చనున్నారు. ఇదే కాకుండా, ఈ ప్రాంతంలో ఉన్న ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్‌ను కూడా మార్చాలని ప్రతిపాదించారు. ఈ ప్రాంతంలో వివిధ మంత్రిత్వ శాఖలు, వాటి విభాగాలకు కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. -
ఆవిష్కారం.. ఆత్మ నిర్భర్ భారతం
సాక్షి, న్యూఢిల్లీ : నూతన పార్లమెంటు భవనం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో కీలక మైలురాయని ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు గురువారం ప్రధాని శంకుస్థాపన చేశారు. నూతన భవనం ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికతలో అంతర్భాగమని, స్వాతంత్య్ర అనంతర కాలంలో మొదటిసారిగా ఓ ప్రజా పార్లమెంటు నిర్మించేందుకు చరిత్రాత్మక అవకాశం వచ్చిందని అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ(2022) సమయానికి పూర్తయ్యే ఈ భవనం దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందన్నారు. ప్రతి పార్లమెంటు సభ్యుడు ప్రజలకు, రాజ్యాంగానికి జవాబుదారీగా ఉండాలని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘2014లో పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంటు భవనంలో మొదటిసారి అడుగుపెట్టిన క్షణం ఇంకా గుర్తుంది. ఆ సమయంలో ప్రజాస్వామ్యానికి ఆలయం అయిన ఈ భవనానికి శిరసు వంచి ప్రణామం చేశా. పాత పార్లమెంటు భవనం స్వాతంత్య్రం అనంతర కాలంలో దేశానికి ఒక దిశను అందిస్తే కొత్త భవనం ఆత్మ నిర్భర్ భారత్ ఆవిష్కారానికి సాక్షిగా మారనుంది. 21వ శతాబ్దపు ఆకాంక్షలను నెరవేరుస్తుంది.’’ అన్నారు. ప్రజాస్వామ్యమే బలం భారత ప్రజాస్వామ్య మూలాలు 13వ శతాబ్దికి చెందిన మాగ్నాకార్టాలో ఉన్నాయని మోదీ గుర్తు చేశారు. ‘‘భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే జీవన విలువలు, జీవన మార్గం దేశ ప్రజల ఆత్మ. భారత్‌లో ప్రజాస్వామ్యం విఫలమవుతుందని మొదట్లో చాలామంది భావించారు, కానీ అది తప్పని ప్రస్తుత తరం గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఒక జీవన క్షమానుగత వ్యవస్థ ఉన్నాయి.’’ అన్నారు. కొత్త బిల్డింగ్ భవిష్యత్ రాజ్యాంగ అవసరాలు తీరుస్తుందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభిప్రాయపడ్డారు. పలువురు కేంద్రమంత్రులు, విదేశీ రాయబారులు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ఏఐడీఎంకే, బీజేడీ, టీఆర్ఎస్ తదితర పార్టీల ప్రతినిధులు, రతన్‌టాటా వంటి వ్యాపారవేత్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా తమ సందేశాలు పంపారు. భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆచార్య శివకుమార్ శర్మ, కేఎస్ లక్ష్మీనారాయణ సోమయాజి తదితరులు పూజలు నిర్వహించారు. శృంగేరి పీఠం నుం చి శంఖం, నవరత్న పీఠాలను శృంగేరి శారద పీఠం జగద్గురు భారతీ తీర్థ ఆశీర్వదించి పంపారు. ఈ కార్యక్రమంలో సర్వమత ప్రార్థనలు చేశారు. కాంగ్రెస్ విమర్శలు: ప్రజాస్వామ్యాన్ని ఛిన్నాభిన్నం చేసిన అనంతరం నిర్మించే కొత్త భవనం దేన్ని ప్రతిబింబిస్తుందని కాంగ్రెస్ విమర్శించింది. హక్కుల కోసం రైతులు పోరాటం చేస్తున్న తరుణంలో ప్రధాని భవనాలకు శంకుస్థాపనలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి సూర్జేవాలా దుయ్యబట్టారు. పార్లమెంట్ బిల్డింగంటే ఇసుక, ఇటుకలు కాదని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించేదని చెప్పారు. విశేషాలు.. ► నూతన భవన నిర్మాణ కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్ గెలుచుకుంది. ► 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. ► ప్రాజెక్టు అంచనా దాదాపు రూ.971 కోట్లు. 2022కి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ► నిర్మాణం పూర్తయితే లోక్‌సభ సీటింగ్ సామ ర్థ్యం 888 మంది సభ్యులకు పెరుగుతుంది. ► సంయుక్త సమావేశాలప్పుడు 1224 మందివరకు సామర్ధ్యం పెంచుకునే వీలుంది. ► రాజ్యసభ సీటింగ్ సామర్ధ్యం 384 సీట్లు. ► ప్రాజెక్టులో భాగంగా నిర్మించే శ్రమ్శక్తి భవన్లో ఒక్కో ఎంపీకి 40 చదరపు మీటర్ల ఆఫీసు ఇస్తారు. ఈ భవనం నిర్మాణం 2024లో పూర్తవుతుంది. ► ప్రస్తుత పార్లమెంట్ భవన నిర్మాణం 1921లో ప్రారంభమై 1927 జనవరి 18న ముగిసింది. ► ప్రస్తుత నిర్మాణంపై సుప్రీంకోర్టులో పలు దావాలున్నాయి. అందుకే కోర్టు కేవలం పేపర్ వర్క్ పూర్తి చేసేందుకు మాత్రమే అనుమతినిచ్చింది. తీర్పు వచ్చేవరకు కొత్త కట్టడాలు నిర్మించడం, కూల్చడం, చెట్లు నరకడం చేయవద్దని ఆదేశించింది. -
భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : నూతన పార్లమెంట్ భవనం దేశ ప్రజలందరికీ గర్వకారణమని, భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుత భవనం భారత ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసిందని పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్ మార్గ్‌లో నూతనంగా అన్ని వసతులతో నిర్మించనున్న పార్లమెంట్ భవనానికి ప్రధాని భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకటేశ్ జోషీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణసింగ్ తదితరులు హాజరయ్యారు. భూమి పూజ అనంతరం ప్రధాని మోదీ దేశ ప్రజల్ని ఉద్ధేశిస్తూ మీడియాతో మాట్లాడారు.. ‘‘అంబేడ్కర్ వంటి మహనీయులు సెంట్రల్ హాల్లో రాజ్యాంగ రచన చేశారు. చరిత్రను గౌరవిస్తూనే వాస్తవ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ( నాలుగు అంతస్తుల్లో కొత్త పార్లమెంట్ ) నూతన భవనంలో అనేక సౌకర్యాలు రానున్నాయి. కొత్త భవనం ఎన్నో విశిష్టతలతో రూపుదిద్దుకోబోతోంది. ప్రస్తుత భవనం స్వాతంత్ర్యం తర్వాత దేశానికి దశదిశ నిర్దేశించింది. నూతన భవనం ఆత్మనిర్భర్ భారత్‌కు దిశానిర్దేశం చేయనుంద’’ని అన్నారు. కాగా, నూతన పార్లమెంట్ భవనాన్ని 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇందుకోసం దాదాపు రూ.971 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. 888 మంది లోక్‌సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులకు చోటు ఉండేలా దీని నిర్మాణం జరగనుంది. 2022 ఆగస్టు 15 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. -
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్‌కు ప్రధాని మోదీ భూమి పూజ
-
నూతన పార్లమెంట్‌కు ప్రధాని మోదీ భూమి పూజ
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకటేశ్ జోషీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణసింగ్ తదితరులు హాజరయ్యారు. మొత్తం 200 మంది అతిథులు హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్ మార్గ్‌లో మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ నూతన పార్లమెంట్ భవన నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుత భవనానికి వందేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలోనే ఈ కొత్త భవన నిర్మాణానికి సంకల్పించినట్లు కేంద్రం తెలిపింది. చదవండి: నాలుగు అంతస్తుల్లో కొత్త పార్లమెంట్ శంకుస్థాపన చేసిన ఈ కొత్త భవనం నిర్మాణాన్ని 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న 2022 ఆగస్టు 15 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నాలుగు అంతస్తుల కొత్త పార్లమెంట్ భవనాన్ని రూ.971 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించారు. త్రిభుజకారంలో ఉండే ఈ భవనాన్ని పర్యావరణ హిత విధానాలను పెద్దపీట వేస్తూ, భూకంపాలను కూడా తట్టుకునేలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్నారు. ఈ భవనంలో 888 మంది లోక్‌సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులకు చోటు ఉండేలా నిర్మాణం చేయనున్నారు. -
నాలుగు అంతస్తుల్లో కొత్త పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్ మార్గ్‌లో నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం భూమి పూజ చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పునాది రాయి వేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకటేశ్ జోషీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణసింగ్ తదితరులు పాల్గొంటారు. మొత్తం 200 మంది అతిథులు హాజరవుతారని అధికారులు చెప్పారు. ► 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న 2022 ఆగస్టు 15 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ► నాలుగు అంతస్తుల కొత్త పార్లమెంట్ భవనాన్ని రూ.971 కోట్ల అంచనా వ్యయంతో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రతిపాదించారు. ► త్రిభుజకారంలో ఉండే ఈ భవనాన్ని, పర్యావరణ హిత విధానాలను పెద్దపీట వేస్తూ, భూకంపాలను కూడా తట్టుకునేలా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ► ప్రస్తుత పార్లమెంట్ భవనంలో ఉన్న లోక్‌సభ, రాజ్యసభల కంటే ఇందులోని సభలు చాలా పెద్దవి. భవిష్యత్తు అవసరాల కోసమే విస్తీర్ణం భారీగా పెంచారు. ఈ భవనంలో 888 మంది లోక్‌సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులకు సరిపడా చోటుంది. ► దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అంతర్గత అలంకరణ ఉంటుంది. ► విశాలమైన సెంట్రల్ కాన్స్టిట్యూషన్ గ్యాలరీని సామాన్య ప్రజలు సందర్శించవచ్చు. -
ప్రతిష్టాత్మక ప్రాజెక్టు దక్కించుకున్న టాటా
సాక్షి, న్యూఢిల్లీ : నూతన పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్టును టాటా దక్కించుకుంది. ఆర్థిక బిడ్స్‌లో బుధవారం ఎల్అండ్టీతో పోటీ పడి టాటా ప్రాజెక్ట్స్ పార్లమెంట్ నూతన భవన నిర్మాణ కాంట్రాక్టును చేజిక్కించుకుంది. ఈ ప్రాజెక్టును 861.90 కోట్ల రూపాయలతో పూర్తి చేయనున్నట్టు టాటా ప్రాజెక్ట్ పేర్కొంది. నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి ఎల్అండ్టీ దాఖలు చేసిన రూ .865 కోట్ల కంటే తక్కువ మొత్తం దాఖలు చేసి టాటా గ్రూప్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మాణాన్ని దక్కించుకుంది. నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రజా పనుల శాఖ ఈ రోజు ఆర్థిక వేలం నిర్వహించింది. కాగా, పార్లమెంట్ భవన నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తి చేయనున్నట్లు సమాచారం. త్రిభుజాకారంలో నిర్మించనున్న ఈ భవనానికి మొత్తంగా 940 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ప్రభుత్వ ప్రజా పనుల శాఖ అంచనా వేసింది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ప్రస్తుత భవనానికి మరమ్మత్తులు చేసిన అనంతరం ఇతర అవసరాల కోసం వినియోగించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, పార్లమెంట్ నూతన భవన నిర్మాణానికి సంబంధించి ఈ ఏడాది ఆరంభంలోనే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తులు త్రిభుజాకార భవనంగా దీన్ని నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్టు సమాచారం. నూతన పార్లమెంట్ భవనంపై భారత జాతీయ చిహ్నం ముద్రిస్తారని తెలిసింది. పార్లమెంట్ హౌస్ ఎస్టేట్‌లోని 118వ నెంబర్ ప్లాట్‌లో 60,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నూతన భవనం కొలువుతీరనుంది. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్‌లో భాగంగా తొలి ప్రాజెక్టుగా పార్లమెంట్ నూతన భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. చదవండి : ప్రశ్నోత్తరాల రద్దుపై విపక్షాల ఆందోళన -
పార్లమెంటుకు కొత్త భవనం!
ప్రతిపాదనకు లోక్‌సభ స్పీకర్ ఆమోదం ♦ శిథిలావస్థకు చేరుతోంది ♦ సిబ్బంది పెరిగారు, కార్యకలాపాలు పెరిగాయి ♦ అవసరాలకు తగ్గట్లు స్థలం లేదు ♦ ఆధునిక సాంకేతికతకు తగ్గట్లు నిర్మించండి ♦ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు లేఖ న్యూఢిల్లీ: మనకు అధునాతన సాంకేతిక వసతులతో కూడిన కొత్త పార్లమెంటు భవనం వచ్చే అవకాశముంది. ఈమేరకు వచ్చిన ప్రతిపాదనకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదం తెలిపారు. 88 ఏళ్ల కిందట నిర్మించిన ప్రస్తుత పార్లమెంటు భవనం శిథిలావస్థకు చేరుకునేలా ఉందని, దీనికితోడు పెరుగుతున్న అవసరాలకు సరిపడా స్థలం అందుబాటులో లేదని ఆమె పేర్కొన్నారు. కొత్త భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుకు రాసిన లేఖలో కోరారు. దీనికోసం ఆమె రెండు ప్రత్యామ్నాయ స్థలాలను సూచించారు. ఒకటి, ప్రస్తుత పార్లమెంటు కాంప్లెక్స్‌లో, ఇంకొక స్థలాన్ని రాజ్‌పథ్‌కు అటు వైపు సూచించారని విశ్వసనీయ వర్గాలు పీటీఐ వార్తాసంస్థకు తెలిపాయి. దీనిపై పట్టణాభివృద్ధి శాఖ నోట్ రూపొందిస్తుందని, తదనంతరం దీన్ని కేబినెట్ పరిశీలిస్తుందని చెప్పాయి. కొత్త భవనం అవసరాల గురించి చెబుతూ స్పీకర్ పలు కారణాలను లేఖలో పొందుపరిచారు. 2026 నాటికి ఆర్టికల్ 81లోని క్లాజ్ (3) మేరకు జనాభా ప్రాతిపదికన లోక్‌సభలోని సీట్ల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం లోక్‌సభలో సీట్ల సామర్థ్యం 550 ఉండగా, ఈ సంఖ్య పెరిగితే అందుకు తగిన స్థలం సభలో లేదు. ప్రస్తుత భవనం 1927లో నిర్మితమైందని, అప్పుడు ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, మీడియా సందర్శకులు, పార్లమెంటు కార్యకలాపాలు పరిమితంగా ఉండేవని, అయితే కాలం గడిచేకొద్దీ ఇవన్నీ పలు రెట్లు పెరిగాయని ఆమె పేర్కొన్నారు. కమిటీలు, భద్రతా అవసరాలు పెరిగిపోయాయని, స్థల అవసరాల డిమాండ్లు చాలా రెట్లు పెరిగాయంటూ కొత్త భవన నిర్మాణ అవసరం ప్రాధాన్యతను వివరించారు. దీంతోపాటు కొత్తపుంతలు తొక్కుతున్న ఆధునిక సాంకేతికతను దృష్టిలో పెట్టుకొని ఎంపీలకు సరికొత్త గ్యాడ్జెట్లను అందుబాటులోకి తీసుకురావాలని, కాగితరహిత పార్లమెంటుగా మార్చేందుకు ప్రణాళికలున్నాయని స్పీకర్ తెలిపారు. అలాగే లోక్‌సభ చాంబర్‌ను రీడిజైనింగ్ చేయాలని, సిట్టింగ్ ఏర్పాట్లను పునరుద్ధరించాలన్నారు. ఇప్పుడున్న భవనం ‘హెరిటేజ్ గ్రేడ్ -1’ కింద ఉందని, అందువల్ల నిర్మాణాత్మక మరమ్మతులు, ఆధునీకరణలకు చాలా పరిమితులున్నాయని చెప్పారు. ప్రస్తుత కాంప్లెక్స్‌లో కొత్త భవనం నిర్మిస్తే కొన్ని సౌకర్యాలను, సేవలను అటూ ఇటూ మార్చాల్సి ఉంటుందని, అయితే రాజ్‌పథ్‌కు మరోవైపున అవసరాలకు తగ్గట్లు ఎక్కువ స్థలముందని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని, రాజ్‌పథ్‌లోని ప్రతిపాదిత కాంప్లెక్స్‌ను అనుసంధానిస్తూ భూగర్భంలో మార్గం నిర్మించవచ్చని స్పీకర్ సూచించారు. కొత్త పార్లమెంటును నిర్మించాలన్న ప్రతిపాదన ఏడాది క్రితం జరిగిన బడ్జెట్ కమిటీ సమావేశంలో తెరపైకి వచ్చింది. రానున్న 100 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ కేవీ థామస్ నాడు చెప్పారు. ప్రస్తుత పార్లమెంటు విశేషాలు ► ఢిల్లీలోని అద్భుత కట్టడాల్లో ఒకటి. ► ఈ భవంతి డిజైన్‌ను ఎడ్విన్ లూటెన్స్, హార్బర్ట్ బేకర్లు రూపొందించారు. ►1927 జనవరి 18న నాటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ భవనాన్ని ప్రారంభించారు. ► అప్పట్లో ఈ భవనం నిర్మాణ వ్యయం రూ.83 లక్షలు. ఆరేళ్లలో నిర్మించారు. ► ఆరు ఎకరాల స్థలంలో 570 అడుగుల(170 మీటర్లు) వ్యాసంతో వృత్తాకారంలో కట్టారు. ► సంసద్ మార్గ్( నం.1 గేటు)సహా దీనికి మొత్తం 12 గేట్లు(ద్వారాలు) ఉన్నాయి. లోపల.. ► భవనంలో ప్రధానమైనది సెంట్రల్ హాల్. దీనిలో భాగంగానే మూడు చాంబర్లు అంటే లోక్‌సభ, రాజ్యసభ, లైబ్రరీ హాల్ ఉన్నాయి. ► ఈ మూడింటి మధ్యలోని ఖాళీ స్థలంలో చిన్నపాటి తోటలున్నాయి. ► ఈ మూడు చాంబర్లను చుట్టూతా కలుపుతూ వృత్తాకారంలో నాలుగు అంతస్తులుగా కేంద్ర మంత్రులు, చైర్మన్, పార్లమెంటు కమిటీలు, పార్టీ ఆఫీసులు, లోక్‌సభ, రాజ్యసభ కార్యదర్శుల ముఖ్య ఆఫీసులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యాలయాలకు వసతి కల్పించారు. ► సెంట్రల్‌హాల్ గుండ్రంగా ఉంటుంది. దీని గుమ్మటం వ్యాసం 98 అడుగులు(29.87 మీటర్లు). ► సెంట్రల్‌హాల్ చారిత్రక ఘట్టాలకు నెలవు. ఇక్కడే భారత రాజ్యాంగం మొత్తం ప్రక్రియ పూర్తయింది. ► గతంలో దీనికి ముందు ఇదే స్థలంలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లైబ్రరీ ఉండేవి. ► 1946లో రూపురేఖలు మార్చేసి సెంట్రల్ హాల్‌గా తీర్చిదిద్దారు. ► అప్పటి నుంచీ లోక్‌సభ, రాజ్యసభల సంయుక్త సమావేశాలకు వాడుతున్నారు. ► ప్రతీసారి సార్వత్రిక ఎన్నికలు ముగిశాక ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ఈ హాల్లోనే తొలిసారిగా ప్రసంగిస్తారు.