పార్లమెంట్‌ నూతన సౌధం ప్రారంభోత్సవం ఇలా... | New Parliament Inauguration Ceremony Time Table | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ నూతన సౌధం ప్రారంభోత్సవం ఇలా...

Published Sat, May 27 2023 6:01 AM | Last Updated on Sat, May 27 2023 6:01 AM

New Parliament Inauguration Ceremony Time Table - Sakshi

న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నూతన పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 7.15 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. రెండు దశలుగా ప్రారంభోత్సవం ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి.  

ఉదయం 7.15 గంటలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన భవనం వద్దకు చేరుకుంటారు.  
7.30: యజ్ఞం, పూజ ప్రారంభం. దాదాపు గంటపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.  
8.30: ప్రధాని మోదీ లోక్‌సభ చాంబర్‌లోకి ప్రవేశిస్తారు.  
9.00: చరిత్రాత్మక రాజదండం సెంగోల్‌ను లోక్‌సభ స్పీకర్‌ స్థానం సమీపంలో ప్రతిష్టిస్తారు.   
9.30: పార్లమెంట్‌ లాబీలో ప్రార్థనా కార్యక్రమం ప్రారంభమవుతుంది. పార్లమెంట్‌ నుంచి ప్రధాని మోదీ బయటకు వెళ్తారు.  
11.30: ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అతిథులు కొత్త భవనం వద్దకు చేరుకుంటారు.  
12.00: ప్రధాని మోదీ రాక. జాతీయ గీతాలాపాన ప్రారంభం.   
12.10: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ ప్రసంగం. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ పంపించిన సందేశాన్ని చదివి వినిపిస్తారు.  
12.17: రెండు షార్ట్‌ ఫిలింలు ప్రదర్శిస్తారు.   
12.38: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రసంగిస్తారు.  
1.05: రూ.75 నాణెం, స్మారక పోస్టల్‌ స్టాంప్‌ను ప్రధాని మోదీ విడుదల చేస్తారు.  
1.10: ప్రధానమంత్రి ప్రసంగం ప్రారంభం   
2.00: అధికారికంగా వేడుకుల ముగింపు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement