inagriration
-
అయోధ్యలో ప్రతిష్టాపనకు ప్రధానికి ఆహ్వానం
అయోధ్య: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. జనవరిలో జరుగనున్న ఆలయ ప్రారంబోత్సవానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. గర్భాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. విగ్రహ ప్రతిష్టాపన వేడుకలో పాల్గొనాలని కోరుతూ ప్రధాని మోదీకి అధికారికంగా ఆహా్వనం పంపించినట్లు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి 24వ తేదీల మధ్య సమయం ఇవ్వాలని కోరామని, ఈ మేరకు ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ సంతకంతో లేఖ రాశామని తెలిపారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి దేశ విదేశీ ప్రముఖులతోపాటు లక్షలాది మంది సామాన్య భక్తులు తరలివస్తారని, ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని ట్రస్టు భావిస్తోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ 2020 ఆగస్టులో స్వయంగా భూమిపూజ చేశారు. -
పార్లమెంట్ నూతన సౌధం ప్రారంభోత్సవం ఇలా...
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 7.15 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. రెండు దశలుగా ప్రారంభోత్సవం ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉదయం 7.15 గంటలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన భవనం వద్దకు చేరుకుంటారు. 7.30: యజ్ఞం, పూజ ప్రారంభం. దాదాపు గంటపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 8.30: ప్రధాని మోదీ లోక్‌సభ చాంబర్లోకి ప్రవేశిస్తారు. 9.00: చరిత్రాత్మక రాజదండం సెంగోల్‌ను లోక్‌సభ స్పీకర్ స్థానం సమీపంలో ప్రతిష్టిస్తారు. 9.30: పార్లమెంట్ లాబీలో ప్రార్థనా కార్యక్రమం ప్రారంభమవుతుంది. పార్లమెంట్ నుంచి ప్రధాని మోదీ బయటకు వెళ్తారు. 11.30: ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అతిథులు కొత్త భవనం వద్దకు చేరుకుంటారు. 12.00: ప్రధాని మోదీ రాక. జాతీయ గీతాలాపాన ప్రారంభం. 12.10: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రసంగం. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పంపించిన సందేశాన్ని చదివి వినిపిస్తారు. 12.17: రెండు షార్ట్ ఫిలింలు ప్రదర్శిస్తారు. 12.38: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగిస్తారు. 1.05: రూ.75 నాణెం, స్మారక పోస్టల్ స్టాంప్‌ను ప్రధాని మోదీ విడుదల చేస్తారు. 1.10: ప్రధానమంత్రి ప్రసంగం ప్రారంభం 2.00: అధికారికంగా వేడుకుల ముగింపు -
సాహిత్యంలో ‘వ్యాసం’ విశిష్టం
సాహితీవేత్త డాక్టర్ పతంజలి దివా¯ŒSచెరువు (రాజానగరం) : సాహిత్యంలో ‘వ్యాసం’ అత్యంత సమర్థంగా నిర్వహించాల్సిన ప్రక్రియని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పతంజలిశాస్త్రి అన్నారు. వ్యాసరచనను ముఖ్య వ్యాసంగంగా స్వీకరించి కొనసాగిస్తున్న అతి కొద్దిమందిలో డాక్టర్ రెంటాల ఒకరని ప్రశంసించారు. కొత్తపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఇటీవల పదవీ విరమణ చేసిన ప్రముఖ కవి, విమర్శకుడు డాక్టర్ రెంటాల శ్రీవెంకటేశ్వర్రావు రచించిన ‘ఒలుపు’ సాహితీ వ్యాస సంకలనాన్ని ఆవిష్కరించారు. దివా¯ŒSచెరువులో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ పంతంజలిశాస్త్రి అధ్యక్షత వహించగా వెలమాటి సత్యనారాయణ గ్రంథావిష్కరణ చేశారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ రచయిత్రి డాక్టర్ వాడ్రేవు వీరలక్షీ్మదేవి మాట్లాడుతూ పుస్తకానికి ‘ఒలుపు’ అని పేరు పెట్టడంలో ఉన్న ఔచిత్యాన్ని తెలియజేశారు. కవులు బీవీ ప్రసాద్, కాండూరి శ్రీరామచంద్రమూర్తి, మధునాపంతులు సత్యనారాయణమూర్తి, పుష్పరాజ్, ఎ.పేరయ్యనాయుడు, భగ్వాస్ కనకయ్య, డాక్టర్ జ్యోస్యుల కృష్ణబాబు, అవధానుల మణిబాబు డాక్టర్ ధూళిపాళ అన్నపూర్ణ పాల్నొన్నారు.