న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలన్న విపక్షాల నిర్ణయాన్ని ప్రముఖులు ఖండించారు. కుటుంబ పార్టీల నిర్వాకం ఇలాగే ఉంటుందని విమర్శించారు. ఈ మేరకు 270 మంది ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు. వీరిలో మాజీ ఉన్నతాధికారులు, రాయబారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.
పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రారంభించుకోవడం దేశ ప్రజలు గర్వపడాల్సిన సందర్భమని వివరించారు. ప్రతిపక్షాలు అపరిపక్వ, డొల్ల వాదనలతో బహిష్కరణ నిర్ణయం తీసుకోవడం సరికాదని హితవు పలికారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రధాని ప్రారంభిస్తే తప్పుపట్టడానికి ఏముందని ప్రశ్నించారు. ‘ఇండియా ఫస్ట్’ నినాదంతో కేంద్రం ముందుకు సాగుతోందని, కొన్ని పార్టీలు ‘ఫ్యామిలీ ఫస్ట్’ అంటున్నాయని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment