మహిళా బిల్లును కాంగ్రెస్‌ పట్టించుకోలేదు: అమిత్‌ షా | Parliament Special Sessions 2nd Day Live Updates | Sakshi
Sakshi News home page

మహిళా బిల్లును కాంగ్రెస్‌ పట్టించుకోలేదు: అమిత్‌ షా

Published Tue, Sep 19 2023 9:02 AM | Last Updated on Tue, Sep 19 2023 8:34 PM

Parliament Special Sessions 2nd Day Live Updates - Sakshi

Updates..

► పాత పార్లమెంటుకు  సంవిధాన్  సదన్‌గా నామకరణం. నోటిఫికేషన్ జారీచేసిన లోక్‌సభ సెక్రటరీ జనరల్

►మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కాంగ్రెస్‌ ఏనాడు సీరియస్‌గా వ్యహరించలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ధ్వజమెట్టారు. అందుకే విపక్షలు నారీశక్తి వందన్‌ బిల్లును జీర్ణించుకోలేకపోతున్నాయని దుయ్యబట్టారు. ఈ బిల్లులు మహిళలకు సాధికారికత కల్పించేందుకు మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేందన్నారు. మహిళా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టడం ద్వారా దేశ ‍వ్యాప్తంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

►మహిళా సాధికారితకు మేం వ్యతిరేకం కాదు. 
►చట్టాన్ని రూపొందించినట్లయ్యితే.. ఆ కోటాలో ఓబీసీ, ముస్లిం మహిళలు వాటా పొందడం ముఖ్యం. 
:: ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

►మహిళా రిజర్వేషన్లకు బీఆర్‌ఎస్‌ వందకు వంద శాతం మద్దతు ఇస్తుంది. 
►వెనుకబడిన వర్గాల మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించాం. 
►2010లో మహిళా బిల్లు పెట్టినప్పుడు కూడా ఇదే డిమాండ్‌ వచ్చింది. 
►బీసీలను అణగదొక్కాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయి. 
:: బీఆర్‌ఎస్‌ నేత కేకే

మహిళా రిజర్వేషన్‌ బిల్లును స్వాగతించిన వైఎస్సార్‌సీపీ
►మహిళా రిజర్వేషన్ బిల్లు కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం 
►ఈ బిల్లు త్వరగా అమలు చేయాలని కోరుతున్నా
►సీఎం వైఎస్ జగన్ మహిళా పక్షపాతి
►రాష్ట్రంలో అన్ని పథకాలు మహిళల పేరు మీద అమలు చేస్తున్నారు
►ప్రజా ప్రతినిధుల్లో సైతం మహిళలకు పెద్దపీట వేశారు
:::మిథున్ రెడ్డి, వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత 

రాజ్యసభలో ఖర్గే ప్రసంగం
►మహిళా రిజర్వేషన్‌ బిల్లు 2010లో రాజ్యసభలో ఆమోదం పొందింది.
►ఈ మహిళా బిల్లులో ఓబీసీ, ఎస్సీ రిజర్వేషన్లు చేర్చాలి.
►మహిళా బిల్లుపై క్రెడిట్‌ మోదీ మాకు ఇవ్వదలుచుకోలేదు.
►మహిళా రిజర్వేషన్లలో మూడో వంతు వెనుబడిన కులాల మహిళలకు ఇవ్వాలని పట్టుబట్టారు.
►వెనకబడిన కులాల మహిళలకు పెద్దగా చదువు ఉండదు.
►అందుకే రాజకీయాల కోసం వెనబడిన కులాల మమహిళ తరపున వాళ్లు మాట్లాడారు.
►గట్టిగా పోరాటం చేసే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం వాళ్లకు ఇష్టం లేదు.

►బలహీన వర్గాల మహిళలను బీజేపీ రాజకీయాల కోసం వాడుకుంటోంది.
►బీజేపీ పాలనలో దేశంలో ఫెడరల్‌ వ్యవస్థ బలహీనపడుతోంది.
►చాలా రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూలదోసింది.
►చాలా రాష్ట్రాలకు జీఎస్టీ నిధుల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఖర్గే ప్రసంగంపై రాజ్యసభలో రగడ
►ఖర్గే ప్రసంగానికి  అడ్డు తగిలిన బీజేపీ సభ్యులు
►బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యుల మధ్య వాగ్వాదం
►గిరిజన మహిళను రాష్ట్రపతి చేసింది బీజేపీనే: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌.
►ఏ రాష్ట్రానికి జీఎస్టీ బకాయిలు పెండింగ్‌లో లేవు.
►బకాయిలు ఉన్నట్లు ఆధారాలుంటే చూపించడండని సవాల్‌

కొత్త పార్లమెంట్‌లో కొలువుదీరిన రాజ్యసభ
►ఈరోజు చరిత్రలో నిలిచిపోతుంది: ప్రధాని మోదీ
►పార్లమెంట్‌పై దేశ ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు
►ఎన్నో విప్లవాత్మక బిల్లులు తీసుకొచ్చాం

►లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి రామ్‌ మెగ్వాల్‌.
►చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ  బిల్లు.
►బిల్లు కాపీలను తమకు ఎందుకివ్వలేదని విపక్షాల ఆందోళన

►డిజిటల్‌ ఫార్మాట్‌లో అప్‌లోడ్‌ చేశామన్న కేంద్రం
►విధాన నిర్ణయాల్లో మహిళా భాగస్వామ్యం పెంచడమే లక్ష్యంగా బిల్లు
►లోక్‌సభలో రేపు బిల్లు ఆమోదం పొందే అవకాశం
►ఎల్లుండి రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు

మహిళా బిల్లు పేరు నారీశక్తి వందన్‌ 

► మధ్యాహ్నం మూడు గంటలకు లోక్‌సభ ముందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు. మహిళా బిల్లును ప్రవేశపెట్టనున్న న్యాయశాఖ మంత్రి అర్జున్‌ మేఘ్వాల్‌. 

► కొత్త పార్లమెంట్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే మా లక్ష్యం. భవిష్యత్‌ తరాలకు స్పూర్తినిచ్చేలా మనం పనిచేయాలి. నెహ్రు చేతికి శోభనిచ్చిన సెంగోల్‌ నేడు సభలో కొలువుదీరింది. స్వాతంత్ర్య ఉద్యమంతో సెంగోల్‌ది కీలక పాత్ర. అమృతకాలంలో కొత్త లక్ష్యాలతో ముందుకెళ్తున్నాం. కొత్త సభలోకి ఎంపీలందరినీ ఆహ్వానిస్తున్నాం. ఆజాదీ అమృత్‌ కాలంలో ఇది ఉషోదయ కాలం. వినాయక చతుర్థీ రోజు కొత్త పార్లమెంట్‌లోకి అడుగుపెట్టాం. ఆధునికతకు అద్దం పట్టడంతో పాటు చరిత్రను ప్రతిబింబించేలా కొత్త పార్లమెంట్‌ భవనం. భవనం మారింది, భావనలు కూడా మారాలి. గత చేదు అనుభవాలను మరిచిపోవాలి. 

మహిళా బిల్లు 1996లో సభ ముందుకు వచ్చింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ముందడుగు వేయబోతున్నాం. ఈరోజు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుంది. నారీ శక్తి బిల్లుకు చట్టం చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు నారీశక్తి వందన్‌ పేరు. 

► భారత్‌ నేతృత్వంలో జీ20ని విజయవంతంగా నిర్వహించాం. మహిళా సాధికారతపై ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు. ఆటల నుంచి అంతరిక్షం వరకు మహిళలు ముందంజలో ఉన్నారు. మహిళా కోటా చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. నేడు చరిత్రలో నిలిచిపోయే రోజు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించే భాగ్యం భగవంతుడు నాకు ఇచ్చాడు. 

► కొత్త పార్లమెంట్‌లో లోక్‌సభ ప్రారంభం. మధ్యాహ్నం 2.30 గంటలకు రాజ్యసభ ప్రారంభం కానుంది. 

► కొత్త పార్లమెంట్‌ భవనంలో సమావేశాలు ప్రారంభం. పేపర్‌లెస్‌గా కొత్త పార్లమెంట్‌ కార్యక్రమాలు. ఎంపీలకు సభా కార్యక్రమాల వివరాలు కనిపించేలా డిజిటల్‌ స్క్రీన్స్‌.

కొత్త పార్లమెంట్‌ భవనానికి మారిన కార్యకలాపాలు


పాత పార్లమెంట్‌ భవనం నుంచి ఎంపీల మార్చ్‌

పాత పార్లమెంట్ భవనంలో ప్రధాని ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో కొత్త పార్లమెంట్ భవనం సంవిధానం సదన్‌లోకి ఎంపీలు నడుచుకుంటూ వెళ్లారు.  ప్రధాని నరేంద్ర మోదీ ముందు నడవగా మిగిలినవారు ఆయనను అనుసరించారు.

► పాత పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రజలకు, పార్లమెంట్‌ సభ్యులకు గణేష్‌ చతుర్తి శుభాకాంక్షలు. కొత్త సంకల్పంతో కొత్త భవనంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ సందర్బంగా భారత తిరంగా యాత్ర గుర్తుకువస్తోంది. ఈ హాల్‌తో ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో భావోద్వేగాలు. పార్లమెంట్‌ భవనం, సెంట్రల్‌ హాల్‌ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

లోక్‌సభ, రాజ్యసభ కలిసి 4వేల చట్టాలు చేశాయి. ఇక్కడే మన రాజ్యాంగం రూపుదిద్దుకుంది. ఇక్కడే జాతీయ గీతం, జాతీయ పతాకం ఎంచుకున్నాం. 86 సార్లు సెంట్రల్‌ హాల్‌లో దేశ అధక్ష్యుల ప్రసంగం జరిగింది. 41 దేశాల అధినేతలు ఇక్కడి నుంచి ప్రసగించారు. ఇక్కడ చట్టాలు చేసి ముస్లిం మహిళలకు న్యాయం చేశాం. తలాక్‌పై నిర్ణయాలు తీసుకున్నాం. ట్రాన్స్‌జెండర్ల కోసం చట్టాలు చేశాం. ఆర్టికల్‌ 370ను రద్దు చేశాం. భారత్‌ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం. 


► ఇదే సరైన సమయం. ఇదే మార్గంలో ముందుకు వెళ్తే మన లక్ష్యాలన్నీ నెరవేరుతాయి. సరికొత్త లక్ష్యాలను సాధించేందుకు ముందుకెళ్తున్నాం. చిన్నా కాన్వాస్‌పై పెద్ద బొమ్మ గీయలేం. ఇకపై మనం పెద్ద కాన్వాస్‌ను ఉపయోగించాలి. మన ఆలోచనలు పెద్దగా ఉండాలి. ప్రపంచ స్థాయిలో అన్ని రంగాల్లో ఎదగాలి. భారత యూనివర్సిటీలు ప్రపంచ స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉంది. అందులో​ భాగంగానే నూతన ఎడ్యుకేషన్‌ పాలసీని తీసుకువచ్చాం. ప్రపంచమంతా ఆత్మనిర్భర్‌ భారత్‌ గురించే చర్చిస్తోంది. చిన్న చిన్న విషయాలపై రాద్దాంతం చేయవద్దు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మనం ఉండాలి. మనకు 75 ఏళ్ల అనుభవం ఉంది. 

► మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఈ చారిత్రాత్మక సెంట్రల్ హాల్‌లో భారత పార్లమెంటు గొప్ప వారసత్వాన్ని స్మరించుకోవడానికి సమావేశమవడం ఆనందకరం. ఈ సెంట్రల్ హాల్‌లోనే రాజ్యాంగ సభ జరిగింది. 1946 నుండి 1949 వరకు కూర్చొని సభ జరిగింది. ఈరోజు మనం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్, అంబేద్కర్ అందించిన సేవలను వినమ్రంగా స్మరించుకుంటున్నాము.


► అధిర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ.. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. అధిక నిరుద్యోగం రేటు పెరిగిపోయింది. ఇది దేశ అభివృద్ధి ఆటంకంగా మారనుంది. యువ జనాభా దేశ ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడేలా చేయడం చాలా అవసరం. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ, మన తలసరి జీడీపీ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉంది. ఈ ఆర్థిక వృద్ధి సవాలును ఎదుర్కోవడానికి ప్రభుత్వ విధానాలు, తక్కువ ద్రవ్యోల్బణానికి మార్గదర్శకత్వం, వడ్డీ రేట్లు తగ్గించడం, నిరుద్యోగాన్ని తగ్గించడం, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని ప్రోత్సహించడం అవసరం. కొనుగోలు శక్తిని పెంపొందించడం, డిమాండ్‌ను ప్రేరేపించడం, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాన్ని మెరుగుపరచడం అవసరం. 

► బీజేపీ ఎంపీ మేనకా గాంధీ మాట్లాడుతూ.. ఈరోజు చారిత్రాత్మకమైన రోజు. ఈ చారిత్రాత్మక క్షణంలో నేను భాగమైనందుకు గర్వపడుతున్నాను. కొత్త పార్లమెంట్‌ భవనం కొత్త ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని ఆశిస్తున్నాము. లోక్‌సభలో అత్యంత సీనియర్ పార్లమెంటేరియన్‌గా ఈ గౌరవనీయమైన అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించే బాధ్యత నాకు అప్పగించినందుకు ధన్యవాదాలు. నా రాజకీయ జీవితం ఎక్కువ కాలం పార్లమెంట్‌లోనే గడిపాను. నా రాజకీయ జీవితంలో నేను ఏడుగురు ప్రధాన మంత్రులతో పనిచేశాను. స్వతంత్ర సభ్యురాలిగా ఉండి.. చివరకు అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో బీజేపీలో చేరాను. ప్రతీ క్షణం ప్రజల కోసం పనిచేశాను. 


పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ప్రధాని ఊహించిన విధంగా అభివృద్ధి చెందిన దేశానికి మార్గం సుగమం చేస్తున్న కొత్త, అభివృద్ధి చెందుతున్న భారత్‌కు చిహ్నంగా ఉన్న కొత్త భవనం నుండి పార్లమెంటు ఉభయ సభల విధుల పట్ల నేను చాలా సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉన్నాను.
 

► పాత పార్లమెంట్‌లోని సెంట్రల్‌ హాల్‌లో ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పార్లమెంట్‌లోని తమ అనుభవాలను చెప్పుకొచ్చారు. 

► నేడు మహిళా బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. లా మినిస్టర్‌ అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ మహిళా బిల్లును ప్రవేశపెట్టనున్నారు. రేపు మహిళా బిల్లుపై సభలో చర్చించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈనెల 21న మహిళా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

► కొత్త పార్లమెంట్‌ ప్రారంభమైంది. 

► నూతన పార్లమెంట్‌లోకి ప్రధాని మోదీ, స్పీకర్‌ ఓం బిర్లా ప్రవేశించారు. 

► చివరగా పాత పార్లమెంట్‌లో సభ్యులకు అభివాదం చేసిన ప్రధాని మోదీ. 

► పార్లమెంట్‌ సభ్యుల గ్రూప్‌ ఫొటో సందర్భంగా బీజేపీ ఎంపీ నరమరి అమిన్‌ నీరసంతో కూప్పకూలిపోయారు. అనంతరం, సభ్యులు సపర్యలు చేయడంతో లేచి కూల్చున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడ ఉంది. అనంతరం.. ఫొటో సెషల్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

► పార్లమెంట్‌ వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ.. 

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై పార్లమెంట్‌ వద్ద సోనియా గాంధీ స్పందించారు. ఈ సందర్బంగా ఈ బిల్లు తమదేనన్నారు. ఈ సమావేశాల్లో మహిళా బిల్లును పెట్టాలన్నారు. 

ఈరోజు మధ్యాహ్నం నుంచి కొత్త పార్లమెంట్‌లో సమావేశాలు జరుగుతాయి. 
మధ్యాహ్నం 1:15 గంటలకు కొత్త పార్లమెంట్‌లో లోక్‌సభ సమావేశం.
మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ సమావేశం. 
సాయంత్రం 4 గంటలకు స్పీకర్‌ ఓం బిర్లా ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరుగనుంది. 

నేడు పాత పార్లమెంట్‌ భవనం ముందు ఫొటో సెషన్‌. గ్రూప్‌ ఫొటో దిగనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఎంపీలు. 

పేపర్‌ లెస్‌గా కొత్త పార్లమెంట్‌ కార్యక్రమాలు. ఎంపీలకు సభా కార్యక్రమాల వివరాలు కనిపించేలా డిజిటల్‌ స్క్రిన్స్‌ ఏర్పాటు. 

గెజిట్‌ విడుదల..
పార్లమెంట్‌ కొత్త భవనాన్ని నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్‌ విడుదల చేసింది. ఇందులో కొత్తగా నిర్మించిన భవనమే ఇక నుంచి పార్లమెంట్‌ అని పేర్కొంది. 

నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కొత్త భవనంలోనే జరగనున్నాయి. ప్రత్యేక సమావేశాల సందర్బంగా ప్రధాని మోదీ.. నిన్న(సోమవారం) పాత పార్లమెంట్‌కు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. మరోవైపు.. సభ్యులు కొత్త పార్లమెంట్‌లోకి అడుగుపెడుతున్న వేళ.. కేంద్రం వినూత్నంగా ప్లాన్‌ చేసింది. 

ఎంపీలకు ప్రత్యేక కానుక..
ప్రత్యేక సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌ సభ్యులు తొలిసారి నూతన భవనంలో అడుగుపెట్టనున్నారు. ఈ విశిష్ట సందర్భానికి గుర్తుగా పార్లమెంట్‌ సభ్యులకు కేంద్రం ప్రత్యేక కానుకలు అందజేయనున్నట్లు తెలుస్తోంది. జనపనారతో రూపొందించిన బ్యాగులో భారత రాజ్యాంగ ప్రతి, పాత, కొత్త పార్లమెంటు భవనాల చిత్రాలతో కూడిన స్టాంపులు, స్మారక నాణెం వారికి ఇవ్వనుంది. ఇక, ఆ బ్యాగులపై ఎంపీల పేర్లు రాసి ఉన్నాయి. ప్రధాని మోదీ సైతం పాత పార్లమెంట్ నుంచి కొత్త పార్లమెంట్‌కు రాజ్యాంగ ప్రతిని తన వెంట తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ప్రధానిని ఎంపీలు అనుసరించనున్నట్టు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement