భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేశ పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా తాజాగా ప్రారంభించారు. రూ.20,000 కోట్ల సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా కొత్త పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌ను నిర్మించారు.
65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాత భవనం కంటే మూడు రెట్లు అధిక పరిమాణంలో ఆకట్టుకునే హంగులతో కొత్త పార్లమెంట్ భవనం రూపొందింది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పార్లమెంట్ భవనాన్ని ఏ నిర్మాణ సంస్థ కట్టింది. భవన నిర్మాణానికి ఎంత ఖర్చయింది.. వంటి ఆసక్తికరమైన విషయాలు మీ కోసం...
నిర్మాణ సంస్థ ఇదే..
భారత పార్లమెంట్ నూతన భవనాన్ని టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ నిర్మించింది. 2020లో లార్సెన్ అండ్ టూబ్రో (L&T)పై రూ. 3.1 కోట్ల స్వల్ప మార్జిన్‌తో రూ. 861.9 కోట్లకు ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. మొదట్లో షాపూర్జీ పల్లోంజీ సంస్థ పోటీలో నిలిచినా తరువాత బిడ్డింగ్ ప్రక్రియ నుంచి వైదొలింది.
రూ.940 కోట్లు.. 21 నెలల్లోనే పూర్తి
సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.940 కోట్లు. కొత్త పార్లమెంటు భవన నిర్మాణాన్ని కేవలం 21 నెలల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించింది టాటా కంపెనీ.
ఇదీ చదవండి: రూ.75 నాణెం విడుదల.. కొత్త కాయిన్ ఇలా పొందండి..
Comments
Please login to add a commentAdd a comment