construction company
-
అన్విత గ్రూప్ 2,000 కోట్ల ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ సంస్థ అన్విత గ్రూప్ రూ.2,000 కోట్ల భారీ ప్రాజెక్టు చేపట్టింది. హైదరాబాద్ సమీపంలోని కొల్లూరు వద్ద ఇవానా పేరుతో గృహ నిర్మాణ ప్రాజెక్టును నెలకొల్పుతోంది. 12.9 ఎకరాల్లో రెండు దశల్లో 1,850 ఫ్లాట్లు రానున్నాయి. మొదటి దశలో 15 అంతస్తుల్లో 2 టవర్లలో 450 ఫ్లాట్ల నిర్మాణం పూర్తి కావస్తోంది. వీటిని ఈ ఏడాది చివరికల్లా కస్టమర్లకు అప్పగిస్తారు. రెండవ దశలో 36 అంతస్తుల్లో 4 టవర్లను నిర్మించనుంది. ఇందులో భాగంగా 1,400 ఫ్లాట్లను 2027లో వినియోగదార్లకు అందజేస్తామని అన్విత గ్రూప్ సీఎండీ అచ్యుతరావు బొప్పన గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. 36 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇవానా ఉంటుందని కంపెనీ డైరెక్టర్ అనూప్ బొప్పన చెప్పారు. భారత్‌లో 6, అమెరికాలో 3 స్థిరాస్తి ప్రాజెక్టులను గ్రూప్ చేపట్టింది. -
రామ్కీ ఇన్ఫ్రాకు విశ్వకర్మ పురస్కారాలు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 15వ సీఐడీసీ విశ్వకర్మ అవార్డుల కార్యక్రమంలో వివిధ విభాగాల్లో పురస్కారాలు లభించాయి. ఉత్తమ నిర్మాణ ప్రాజెక్టులు, సామాజిక అభివృద్ధి..ప్రభావం, ప్రొఫెషనల్‌గా అత్యుత్తమంగా నడుస్తున్న సంస్థ తదితర విభాగాల్లో ఈ అవార్డులు దక్కినట్లు కంపెనీ తెలిపింది. నిర్మాణ రంగంలో తాము పాటించే అత్యుత్తమ ప్రమాణాలకు ఇవి నిదర్శనమని రామ్కీ ఇన్ఫ్రా ఎండీ వై.ఆర్. నాగరాజ తెలిపారు. ప్లానింగ్ కమిషన్ (ప్రస్తుతం నీతి ఆయోగ్), భారతీయ నిర్మాణ పరిశ్రమ కలిసి ఏర్పాటు చేసిన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ (సీఐడీసీ) ఈ పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించింది. -
సాహితీ కన్స్ట్రక్షన్ కంపెనీ భారీ మోసం
మంగళగిరి: సినీ నటులతో బ్రోచర్లు ప్రారంభం.. కార్పొరేట్ తరహాలో ప్రకటనలు.. సినీ నటుల సమక్షంలోనే ప్లాట్ల కేటాయింపు.. ఇంధ్రభవనాలను తలపించేలా గ్రాఫిక్స్ తదితర ప్రచారా్రస్తాలతో హోరెత్తించిన ఓ సంస్థ కొనుగోలుదారులకు భారీ ఎత్తున శఠగోపం పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్‌లో 15 వందల మంది కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఈ సంస్థ.. గుంటూరు జిల్లా కాజా వద్ద కూడా వెంచర్ వేసి మోసం చేసేందుకు ప్రయత్నించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించిన ఘటన వెలుగుజూచింది. వివరాల్లోకి వెళితే.. సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బూదాటి లక్ష్మీ నారాయణ హైదరాబాద్‌లోనూ, మంగళగిరి మండలం కాజా వద్ద వెంచర్ వేశారు. పలువురు సినీ నటులతో ప్రచారం చేయడం, సినీ నటులు ప్లాట్లు కొన్నట్లుగా చెప్పడంతో కృష్ణా, గుంటూరు జిల్లాలు, హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది కొనుగోలుదారులు ప్లాట్లు, విల్లాస్‌ను కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లించారు. రిజిస్ట్రేషన్ చేయకుండా ముప్పు తిప్పలు.. హైదరాబాద్‌కు చెందిన పి. శ్రీధర్ అనే వ్యక్తి తన కుమార్తెల కోసం రెండు విల్లాలు కొనుగోలు చేసేందుకు రూ.కోటీ 80 లక్షలు చెల్లించారు. త్వరలోనే విల్లాలు పూర్తి చేసి అప్పగిస్తామని డబ్బులు తీసుకునేటప్పుడు చెప్పిన లక్ష్మీనారాయణ కనీసం స్థలాలను కూడా కొనుగోలు దారుల పేరిట రిజిస్టర్ చేయలేదు. 2020జూన్‌లో బాధితులు లక్ష్మీనారాయణను కలిసి రిజి్రస్టేషన్ అన్నా చేయాలని.. లేనిపక్షంలో డబ్బులు తిరిగి చెల్లించాలని కోరగా.. రెండు ప్రామిసరీ నోట్లు, రూ.90 లక్షల చొప్పున రెండు యూనియన్ బ్యాంకు చెక్కులను ఇచ్చి 2022 అక్టోబర్‌లో బ్యాంకులో వేసుకోమని చెప్పారు. అయితే ఆ రెండు చెక్కులు బౌన్స్ కావడంతో బాధితులు లక్ష్మీనారాయణ కోసం హైదరాబాద్ వెళ్లారు. అయితే ఇలానే పలువురిని మోసగించిన కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అప్పటికే లక్ష్మీనారాయణను అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఇస్తానంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చిన లక్ష్మీనారాయణ ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా.. సాహితీ సంస్థకు చెందిన వెంచర్‌ను ఆయన బంధువు బుచ్చిబాబు హాలాయుధా ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ పేరుతో నడుపుతున్నట్లు తెలుసుకున్న బాధితులు అతనిని సంప్రదించారు. గతంలో జరిగిన లావాదేవీలకు తనకు సంబంధం లేదంటూ సమాధానం ఇవ్వడంతో బాధితులు తాజాగా పోలీసులను ఆశ్రయించారు. కాగా, ఈ సంస్థ ప్రతినిధులు గత ప్రభుత్వ హయాంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు తెలుగుదేశం నేతలకు వాటాలు ఇవ్వడంతో పాటు 2019 ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసిన నారా లోకేశ్ ఎన్నికలకు సైతం భారీ మొత్తంలో చందాలిచ్చినట్లు తెలుస్తున్నది. -
పార్లమెంట్ నూతన భవనం: ఖర్చెంత.. కట్టిందెవరు? ఆసక్తికర విషయాలు..
భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేశ పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా తాజాగా ప్రారంభించారు. రూ.20,000 కోట్ల సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా కొత్త పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. 65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాత భవనం కంటే మూడు రెట్లు అధిక పరిమాణంలో ఆకట్టుకునే హంగులతో కొత్త పార్లమెంట్ భవనం రూపొందింది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పార్లమెంట్ భవనాన్ని ఏ నిర్మాణ సంస్థ కట్టింది. భవన నిర్మాణానికి ఎంత ఖర్చయింది.. వంటి ఆసక్తికరమైన విషయాలు మీ కోసం... నిర్మాణ సంస్థ ఇదే.. భారత పార్లమెంట్ నూతన భవనాన్ని టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ నిర్మించింది. 2020లో లార్సెన్ అండ్ టూబ్రో (L&T)పై రూ. 3.1 కోట్ల స్వల్ప మార్జిన్‌తో రూ. 861.9 కోట్లకు ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. మొదట్లో షాపూర్జీ పల్లోంజీ సంస్థ పోటీలో నిలిచినా తరువాత బిడ్డింగ్ ప్రక్రియ నుంచి వైదొలింది. రూ.940 కోట్లు.. 21 నెలల్లోనే పూర్తి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ప్రకారం.. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.940 కోట్లు. కొత్త పార్లమెంటు భవన నిర్మాణాన్ని కేవలం 21 నెలల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించింది టాటా కంపెనీ. ఇదీ చదవండి: రూ.75 నాణెం విడుదల.. కొత్త కాయిన్ ఇలా పొందండి.. -
దేశం కాని దేశంలో.. మన కుర్రాళ్ల ఇబ్బందులు
సాక్షి, శ్రీకాకుళం(వజ్రపుకొత్తూరు): దేశం కాని దేశంలో మన కుర్రాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. దుబాయ్, మలేషియా, మాల్దీవులు.. దేశాల పేర్లు మారుతున్నాయి గానీ మన వాళ్ల అవస్థలు మారడం లేదు. విదేశీ ఉద్యోగాల ఎరలో చిక్కుకుని శల్యమైపోతున్నారు. తాజాగా శ్రీకాకుళం, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాలకు చెందిన యువత మాల్దీవుల్లో జీతభత్యాలు లేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. తమను ఇండియాకు పంపాలని కంపెనీ యాజమాన్యాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదంటూ బుధవారం పత్రికలకు వీడియోలు, మెసేజీలు పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. తిండి లేదు.. జీతం రాదు ఆరు నెలల కిందట సుమారు 60 మంది యువకులు విశాఖపట్నం పూర్ణామార్కెట్‌కు చెందిన మురళీరెడ్డి, ఇచ్ఛాపురానికి చెందిన పండు అనే ఏజెంట్ల ద్వారా మాల్దీవుల్లోని జాయ్‌షా కన్స్ట్రక్షన్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో వివిధ కేటగిరీల్లో పనిచేసేందుకు వెళ్లారు. ఇందు కోసం ఏజెంట్లకు తామంతా రూ.70 వేలు నుంచి రూ.85 వేలు వరకు చెల్లించామని, రూ.40వేలు వరకు జీతం వస్తుందని వారు చెప్పారని, ఇక్కడికి వ చ్చాక మోసపోయామని వారు తెలిపారు. వీరితో పాటు అప్పటికే విశాఖ, ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చిన నిరుద్యోగులు నాలుగు నెలలుగా జీతాలు రాక, తిండి లేక అనారోగ్యం పాలయ్యారు. ఐడీ కార్డులు, ఆరోగ్య బీమా లేదని, పాస్‌పోర్టులు కూడా కంపెనీ తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని పూండికి చెందిన ఢిల్లేశ్వరరావు, జిల్లాకు చెందిన రుద్రయ్య, సీహెచ్ మురళీకృష్ణ, రంజిత్‌కుమార్, శివకృష్ణ, టి.సింహాచలం, జి.శంకర్, బి. నరిసింహులు, సీహెచ్ రామారావుతో పాటు 60 మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఎలాగైనా స్వదేశానికి రప్పించేందుకు మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు కృషి చేయాలని కోరుతున్నారు. -
సికింద్రాబాద్ స్టేషన్‌కి కొత్త రూపు
సాక్షి, హైదరాబాద్: ఆధునిక వసతులతో నిర్మించబోతున్న సికింద్రాబాద్ కొత్త స్టేషన్ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉన్న స్టేషన్ భవనాన్ని తొలగించి దాని స్థానంలో ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు, పదో నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు రెండు వేరువేరు భవనాలను నిర్మించనున్నారు. ఈ మేరకు ఢిల్లీకి చెందిన గిర్ధారిలాల్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ఇటీవలే కాంట్రాక్టు బాధ్యతను రైల్వే అప్పగించింది. నిర్మాణ సంస్థ వెంటనే పనులు ప్రారంభించేసింది. 36 నెలల్లో, అంటే 2025 అక్టోబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. రూ.699 కోట్లతో చేపట్టే ఈ భవనాలకు సంబంధించి ఐఐటీ ఢిల్లీని ప్రూఫ్ కన్సల్టెంట్‌గా నియమించారు. తాజాగా నిర్మాణానికి సంబంధించి సైట్ టోపోగ్రాఫిక్ సర్వే పూర్తయింది. వివిధ స్థాయిలలో ప్రతిపాదిత ఉపరితలం ఎత్తును గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. బేస్మెంట్, గ్రౌండ్, మిడ్ ఫ్లోర్, మొదటి రెండో అంతస్తులు, ఫుట్ఓవర్ బ్రిడ్జీలు.. తదితరాలకు సంబంధించిన డిజైన్ 3డీ ప్లాట్‌ను రూపొందించేందుకు కూడా ఈ సర్వే ఉపయోగపడుతుంది. స్టేషన్ భవనం ఉత్తర–దక్షిణ టెర్మినల్స్‌లోని వివిధ ప్రదేశాలలో మట్టి నమూనాలను కూడా పరీక్షించారు. కొత్త నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వీలుగా పాత రైల్వే క్వార్టర్స్‌ను కూల్చివేశారు. స్టేషన్ భవనానికి దక్షిణం వైపున సైట్ ఆఫీస్‌తో పాటు సైట్ లేబొరేటరీని ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఆధునిక వస తులతో సౌకర్యవంతమైన ప్రయాణ ప్రాంగణాన్ని అందించటంతోపాటు మెట్రోతో కనెక్టివిటీ కల్పించేందుకు ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ వెల్లడించారు. సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని సాక్షితో చెప్పారు. -
Jyotsna Cheruvu: స్థిరత్వమే సక్సెస్ సూత్రం
హైదరాబాద్ నగరం... దుర్గం చెరువు వంతెనకు సస్పెండెడ్ రోప్ ప్లాట్‌ఫామ్. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో ఓ వలయాకారపు షాఫ్ట్. బహుళ అంతస్తుల నిర్మాణంలో పాసెంజర్ అండ్ మెటీరియల్ హాయిస్ట్. ఇవన్నీ సాంకేతికరంగం రూపొందించుకున్న అద్భుతమైన ఆవిష్కరణలు. వీటి రూపకల్పన... తయారీలో కీలకమైన మహిళ... జ్యోత్స్న చెరువు. ‘ఇండిపెండెంట్‌గా నిలబడాలంటే ఇండిపెండెంట్‌గా ఆలోచించాలి, ఇండిపెండెంట్‌గా నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మీరు పదిమంది నడిచే దారిలో పదకొండవ వ్యక్తిగా మిగలకుండా మీదైన కొత్త çపథాన్ని నిర్మించుకోగలుగుతా’ రంటూ మహిళలకు సందేశమిస్తుంటారు... సీఎమ్ఏసీ, మెకనైజేషన్ అండ్ ఆటోమేషన్ ఇన్ కన్స్ట్రక్షన్ కంపెనీ డైరెక్టర్ జ్యోత్స్న చెరువు. ‘ప్రౌడ్ టు మేక్ ఇన్ ఇండియా, ఎక్స్పోర్ట్ దెమ్ యాజ్ మేడ్ ఇన్ ఇండియా’ నినాదంతో పరిశ్రమను విజయవంతంగా నిర్వహిస్తున్న జ్యోత్స్న చెరువు తన వైవిధ్యభరితమైన పారిశ్రామిక ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు. ► సీబీఐటీ స్టూడెంట్‌ని! ‘‘నేను పుట్టింది నెల్లూరు జిల్లా బిట్రగుంటలో. తాత అప్పుడు అక్కడ రైల్వే ఉద్యోగి. అలా అది మా అమ్మమ్మగారి ఊరైంది. నాన్న బ్యాంకు ఉద్యోగరీత్యా మేము పెరిగిందీ, చదువు, కెరీర్ అంతా హైదరాబాద్‌లోనే. మా కాలేజ్ రోజుల్లో అమ్మాయిలు సివిల్ ఇంజనీరింగ్‌ని పెద్దగా తీసుకునేవాళ్లు కాదు. నాకు సీబీఐటీలో సివిల్ ఇంజనీరింగ్ సీటు వచ్చింది. చేరిన తర్వాత సబ్జెక్ట్‌లో ఉన్న అందం తెలిసి వచ్చింది. ఆనందంగా ఆస్వాదిస్తూ కోర్సు పూర్తి చేశాను. ఆ తర్వాత ఉస్మానియాలో ఎంబీఏ చేశాను. మా వారు మెకానికల్ ఇంజనీర్. పెళ్లి తర్వాత కొంతకాలం ఇద్దరమూ ఉద్యోగం చేశాం. మా వారి ఉద్యోగరీత్యా పూనాకి వెళ్లాం. అప్పుడు పిల్లలు చిన్నవాళ్లు. నేనక్కడ ఉద్యోగంలో చేరలేదు, కానీ హోమ్ బ్యూటిఫికేషన్ వంటి సర్వీస్ ప్రాజెక్టులు మొదలుపెట్టాను. మార్కెట్ అవగాహన ఉంది కాబట్టి నిర్మాణ రంగం మీద దృష్టి పెట్టమని ఓ రిటైర్డ్ పర్సన్ చెప్పిన మాట నన్ను పారిశ్రామికవేత్తగా నిలిపాయి. ► నిర్మాణరంగంలో సాంకేతిక వేగం! పిల్లలు పెద్దవుతున్నారు, హైదరాబాద్‌కి వెళ్లిపోదామనే ఆలోచన వచ్చిన నాటికి హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణరంగం కొత్త రూపు సంతరించుకుంటోంది. 25–30 అంతస్తుల భవనాల నిర్మాణం మొదలైన రోజులవి. అది నాకు బాగా కలిసి వచ్చింది. నిర్మాణరంగంలో అవసరమైన కొత్త టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్ తయారీని ప్రారంభించాం. ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ని అప్పటివరకు చైనా, యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటూ వచ్చిన నిర్మాణసంస్థలకు అవన్నీ ఇండియాలోనే దొరకడం మంచి సౌలభ్యం కదా. అలా 2006లో మొదలైన మా కంపెనీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మూడు వందలకు పైగా సంస్థలకు సేవలందిస్తోంది. వ్యాపారం అంటే... సమాజం లోని అవసరాన్ని గుర్తించి ఆ అవసరాన్ని తీర్చడం, ఒక సమస్యకు పరిష్కారం చూపించడం. అప్పుడే బిజినెస్ విజయవంతమవుతుంది. మా కంపెనీ సిద్ధాంతం నాలుగు ‘ఎస్’లు... స్పీడ్, సేఫ్టీ, సేవింగ్స్, స్ట్రెంగ్త్. పని వేగంగా జరగాలి, పనిలో పాల్గొనే కార్మికులకు రక్షణ కల్పించాలి, ప్రాజెక్టు వ్యయం తగ్గాలి, పని చేసే కార్మికుని శక్తిని ఇనుమడింప చేయాలి. మా క్లయింట్ అవసరానికి తగినట్లు కస్టమైజ్డ్ ఎక్విప్మెంట్ను డిజైన్ చేయడం, తయారు చేయడం, ఇన్స్టాల్ చేయడం, యాన్యుయల్ మెయింటెనెన్స్ సర్వీస్ ఇవ్వడం, ఆ కంపెనీ ప్రాజెక్టు మరో చోటకు మారినప్పుడు ఎక్విప్మెంట్ని ఆ ప్రదేశానికి తీసుకువెళ్లి అమర్చడం... ఇలా ఉంటుంది మా పని. ఇప్పుడు దేశం ఎల్లలు దాటి విదేశాలకు కూడా విస్తరించాం. నా రంగంలో నేను లక్ష్యంగా పెట్టుకున్న శిఖరానికి చేరాననే చెప్పాలి. నా వంతు బాధ్యతగా మహిళా సమాజానికి, యువతకు కెరీర్ ప్లానింగ్ గురించి చెబుతున్నాను. కోవె (కన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్) తెలంగాణ అధ్యక్షురాలిగా వేలాది మహిళలకు, యువతకు ఎంటర్‌ప్రెన్యూరల్ మైండ్‌సెట్ క్లాసులు చెప్తున్నాను. కంపెనీ నిర్వహణలో ఉద్యోగులను కలుపుకుపోవడం చాలా అవసరం. పని వరకే చేయించుకుని మిగిలిన విషయాల్లో వాళ్లను డార్క్‌లో ఉంచరాదు. కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలను వారితో చర్చించాలి. ఈ కంపెనీతో కొనసాగితే కెరీర్లో పైకి ఎదగగలమనే భరోసా కలిగితేనే ఉద్యోగులు మనతో కొనసాగుతారు. ఇలాంటి అనేక విషయాలను చెబుతుంటాను. ఈ జర్నీ నాకు సంతోషంగా ఉంది. ఏటా ఈ ఏడాది ఎంతమంది మహిళలకు దిశానిర్దేశం చేశానని లెక్కచూసుకున్నప్పుడు కనిపించే పెద్ద సంఖ్య నాకు ఆత్మసంతృప్తి కలిగించే విషయం ’’ అని వివరించారు జ్యోత్స్న చెరువు. లీడర్‌గా ఎదిగేది కొందరే! మా దగ్గరకు ట్రైనింగ్‌కు వచ్చిన మహిళలకు నేను చెప్పే తొలిమాట ‘మీ స్ట్రెంగ్త్ ఏమిటో మీరు తెలుసుకోండి’ అని. వాళ్లకు ఏం వచ్చో తెలిసిన తర్వాత వాళ్లకు ఎటువంటి కెరీర్ సౌకర్యంగా ఉంటుందో సూచిస్తాను. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలంటే... మొదటగా ఉండాల్సింది స్థిరత్వం. చిన్న ఉదాహరణ చెబుతాను... ఒక ఇస్త్రీ షాపు వ్యక్తి రోజూ కచ్చితంగా షాపు తెరవకపోతే మనం దుస్తులు ఇవ్వం కదా! రోజూ ఠంచన్‌గా పని చేసే వ్యక్తికి మాత్రమే ఇస్తాం. ఇంటి ముందుకు వచ్చే వాళ్ల దగ్గర కూరగాయలు కొనాలన్నా అంతే. మన సర్వీస్ అందుకునే క్లయింట్ ప్రత్యామ్నాయాన్ని వెతుక్కునే పరిస్థితిని కల్పించకూడదు. ఎందరు వచ్చినా, ఎవరూ రాకపోయినా సరే వర్క్‌ప్లేస్‌ని మూతవేయరాదు. నేను నా రంగంలో సంపాదించుకున్న నమ్మకం అదే. ఏ సమయంలో ఫోన్ వచ్చినా సరే... ఎవరో ఒకరు హాజరవుతారనే భరోసా కల్పించడంలో విజయవంతం అయ్యాం. మా దగ్గరకు కోర్సులో చేరిన పాతిక మందిలో చివరకు ఆ కోర్సును ఉపయోగపెట్టుకునేవాళ్లు పదికి మించరు. కోర్సు సమయంలో ‘ఇంటికి బంధువులు వచ్చార’ని క్లాసు మానేసే వాళ్లు ఎంటర్ ప్రెన్యూర్‌గా కూడా కొనసాగలేరు. బిజినెస్ రంగంలో ఉన్న ఇద్దరు మగవాళ్లు కలిస్తే తమ వ్యాపారం గురించి, ఇతరుల వ్యాపారం గురించి, విస్తరణకు ఉన్న అవకాశాల గురించి మాట్లాడుకుంటారు. అదే ఇద్దరు మహిళలు రిలేషన్ షిప్ మీద మాట్లాడినంతగా తమ ప్రొఫెషన్ గురించి చర్చించరు. ప్రొఫెషన్ గురించి మాట్లాడగలిగిన మహిళలే లీడర్లుగా ఎదుగుతారు, ఫీల్డ్‌లో విజయవంతంగా నిలబడగలుగుతారు. – జ్యోత్స్న చెరువు, డైరెక్టర్, సిఎమ్ఏసీ, ప్రెసిడెంట్, కోవె తెలంగాణ – వాకా మంజులారెడ్డి ఫొటోలు : మోహనాచారి -
Trump Tower: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన డొనాల్డ్ ట్రంప్ కంపెనీ
సాక్షి, హైదరాబాద్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన నిర్మాణ సంస్థ ట్రంప్ రియల్టీ హైదరాబాద్‌లోకి అడుగుపెట్టింది. స్థానికంగా ఓ అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇటీవల ఖానామెట్‌లో హెచ్ఎండీఏ వేలం వేసిన 2.92 ఎకరాలను సొంతం చేసుకున్న ఓ నిర్మాణ సంస్థతో కలసి 27 అంతస్తుల చొప్పున రెండు టవర్లను నిర్మించనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) లభించినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ అనుమతులు తుది దశలో ఉన్నాయని, అవి వచ్చాక రెరాలో నమోదు చేసి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికల్లా అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాణ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. మూడున్నరేళ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక్క ఫ్లాట్ రూ. 5.5 కోట్లపైనే.. ఈ ప్రాజెక్టులో మొత్తం 270 లగ్జరీ ఫ్లాట్లు నిర్మించనున్నారు. అన్నీ 4, 5 పడక గదులే కావడం విశేషం. 4–5 వేల చదరపు అడుగుల (చ.అ.) మధ్య 4 బీహెచ్‌కే, 6 వేల చ.అ.ల్లో 5 బీహెచ్‌కే విస్తీర్ణాలుంటాయి. ప్రాజెక్టు లాంచింగ్ తర్వాత నుంచి ప్రారంభ ధర చ.అ.కు రూ. 13 వేలుగా నిర్ణయించనున్నట్లు సమాచారం. అంటే 4 వేల చ.అ. ఫ్లాట్‌కు ఎంతలేదన్నా రూ. 5.5 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుందన్నమాట. ట్రంప్ టవర్ ప్రాజెక్టులో అన్నీ అంతర్జాతీయ స్థాయి వసతులు ఉండనున్నాయి. ప్రతి ఫ్లాట్‌కు ప్రైవేటు ఎలివేటర్, డబుల్ హైట్‌లో లివింగ్ స్పేస్, బాల్కనీలు ఉంటాయి. రెండు టవర్లను కలుపుతూ రూఫ్‌టాప్‌పై క్లబ్‌హౌస్ ఉంటుంది. ఈ ప్రాజెక్టులోని కామన్ ఏరియా ఇంటీరియర్‌ను ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుజేన్‌ఖాన్ డిజైన్ చేశారు. -
ఎల్బీనగర్–మల్కాపూర్.. ఆరు లేన్లు
సాక్షి, హైదరాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిలో తీవ్ర ట్రాఫిక్ రద్దీతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఎల్బీనగర్–దండుమల్కాపూర్ సెక్షన్‌ను ఆరు వరసలుగా విస్తరించేందుకు రంగం సిద్ధమైంది. రూ.600 కోట్లతో సుమారు 25 కిలోమీటర్ల మేర రహదారిని విస్తరించనున్నారు. రహదారి వెంట సర్వీస్ రోడ్లతోపాటు ఎనిమిది చోట్ల ఫైఓవర్లను నిర్మించనున్నారు. నిజానికి ఎల్బీనగర్–దండుమల్కాపూర్ మధ్య రోడ్డు విస్తరణ ప్రతిపాదన చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. గత ఏడాదే కేంద్రం దీనికి ఆమోదం తెలిపి, డీపీఆర్ తయారీకి ఆదేశించినా.. పనులు కదల్లేదు. నిర్మాణ సంస్థ అలసత్వం వల్ల ఆలస్యమవుతోందని ఇటీవలి భేటీ సందర్భంగా కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వివరించారు. వేరే సంస్థకు అప్పగించి అయినా త్వరగా పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ట్రాఫిక్ చిక్కుల్లేకుండా.. విపరీతంగా రద్దీ ఉండే ఈ రహదారిలో ట్రాఫిక్ ఇబ్బంది తప్పేలా ఎనిమిది చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. పనామా గోడౌన్, అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, కోహెడ క్రాస్‌రోడ్డు, పెద్ద అంబర్‌పేట, అనాజ్పూర్రోడ్డు, ఇనాంగూడ, బాటసింగారం ప్రాంతాల్లో వీటిని చేపడతారు. వనస్థలిపురంతోపాటు మరోచోట రెండు ఫుట్ఓవర్ వంతెనలను కూడా నిర్మిస్తారు. ఈ దారి వెంట సర్వీసురోడ్లు కూడా నిర్మించనున్నారు. ఫలించిన కోమటిరెడ్డి ఒత్తిడి.. హైదరాబాద్–విజయవాడ రహదారిని విస్తరించాలని చాలాకాలంగా కేంద్రమంత్రి నితిన్గడ్కరీపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. ఓవైపు ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు నగరంలో రోడ్డు విస్తరణ, తర్వాత అక్కడి నుంచి విజయవాడ వరకు విస్తరణ జరగాల్సి ఉంది. దీనిపై కోమటిరెడ్డి ఒత్తిడి మేరకు నగరం పరిధిలో రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని గడ్కరీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మేలోనే పనులు మొదలై.. వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సానుకూలంగా స్పందించారు: కోమటిరెడ్డి ‘‘విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించేవారి ప్రాణాలకు గ్యారెంటీ లేదు. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్డు విస్తరణ లేకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. నేను కూడా రెండుమూడు సార్లు ప్రమాదాల నుంచి తప్పించుకున్నాను. ఈ క్రమంలోనే రహదారి విస్తరణ చేపట్టాలని గడ్కరీని పలుమార్లు కలిసి కోరగా.. సానుకూలంగా స్పందించారు’’అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. దీనితోపాటు హైదరాబాద్ గౌరెల్లి ఔటర్ నుంచి పోచంపల్లి, వలిగొండ, భద్రాచలం మీదుగా ఒడిశా వరకు మరో జాతీయ రహదారిని నిర్మించాలని కోరగా.. గడ్కరీ సాసుకూలంగా స్పందించారని చెప్పారు. -
ఒక్క ఫోన్ నెంబర్‌తో లూటీ... రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు
హిమాయత్‌నగర్: అమెజాన్ నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరుపై, మీ ఫోన్ నంబర్‌పై రూ. కోటి లాటరీ వచ్చిందని నగర మహిళకు ఎర వేశారు సైబర్ నేరగాళ్లు. రూ.కోటి మీ సొంతం కావాలంటే ప్రాసెసింగ్ చార్జీల నిమిత్తం కొంత డబ్బు చెల్లించాలన్నారు. దీనికి ఆశపడిన బాధితురాలు వారు కోరిన విధంగా పలు దఫాలుగా 15 రోజుల్లో రూ. 15 లక్షలు వారు చెప్పిన ఖాతాల్లో జమ చేసింది. రోజులు గడుస్తున్నా డబ్బులు మాత్రం చేతికి అందకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంపెనీ నుంచి రూ. 11 లక్షలు... గోల్కొండ కేంద్రంగా పని చేస్తున్న ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి రూ. 11 లక్షలు మాయమైనట్లు కంపెనీ ప్రతినిధులు మంగళవారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యా దు చేశారు. కంపెనీకి సంబంధించిన బ్యాంక్ ఖాతాల ఫోన్ నంబర్లను ఇటీవల మార్చారు. అయితే ఆ తర్వాత కొద్దిరోజులకే కంపెనీ ఖాతా నుంచి రూ. 11 లక్షలు డెబిట్ అయినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సంబంధిత బ్యాంకు అధికారులతో మాట్లాడగా రూ. 4 లక్షలను ఫ్రీజ్ చేయగలిగారు. కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. (చదవండి: పోలీసులకు విదేశీ వనిత కృతజ్ఞతలు) -
ఐరా రియల్టీ ఎండీ నర్సిరెడ్డికి అవార్డ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఐరా ఎండీ పోశం నర్సిరెడ్డిని చాంపియన్ ఆఫ్ ఛేంజ్ తెలంగాణ అవార్డ్ వరించింది. సుప్రీంకోర్టు్ట మాజీ న్యాయమూర్తి, ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ కేజీ బాలక్రిష్ణన్ చేతుల మీదుగా ఈ అవార్డ్‌ను అందుకున్నారు. ధైర్యం, సమాజ సేవ, సమ్మిళిత సామాజిక అభివృద్ధి విలువలను ప్రోత్స హించడంలో వ్యక్తులు, సంస్థ లు చేసిన కృషికి గుర్తింపుగా చాం పియన్స్ ఆఫ్ ఛేంజ్ నేషనల్ అవార్డ్‌లను ప్రదానం చేస్తుంటుంది. నిర్మాణ రంగం నుంచి మైహోమ్ గ్రూప్ ఫౌండర్ అండ్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్‌రావుకు కూడా అవార్డ్ దక్కింది. ఈ అవార్డ్‌తో బాధ్యత పెరిగిందని, నంబర్ 1 రియల్టీ టెక్నాలజీ కంపెనీగా నిలిపేలా కృషి చేస్తానని నర్సిరెడ్డి తెలిపారు. -
శ్రీరామ్ ప్రాపర్టీస్ ఐపీవో @ రూ. 113–118
న్యూఢిల్లీ: నిర్మాణ రంగ సంస్థ శ్రీరామ్ ప్రాపర్టీస్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి సంబంధించి షేరు ధర శ్రేణిని రూ. 113–118గా నిర్ణయించింది. ఐపీవో డిసెంబర్ 8న ప్రారంభమై 10న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లు డిసెంబర్ 7న బిడ్లు వేయాల్సి ఉంటుంది. ఈ ఇష్యూ ద్వారా శ్రీరామ్ ప్రాపర్టీస్ రూ. 600 కోట్లు సమీకరిస్తోంది. ఇన్వెస్టర్లు కనీసం 125 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద విక్రయించే షేర్ల పరిమాణాన్ని శ్రీరామ్ ప్రాపర్టీస్ రూ. 550 కోట్ల నుంచి రూ. 350 కోట్లకు కంపెనీ తగ్గించింది. దీంతో ఐపీవో పరిమాణం కూడా రూ. 800 కోట్ల నుంచి రూ. 600 కోట్లకు తగ్గింది. ఇష్యూలో భాగంగా కొత్తగా రూ. 250 కోట్ల షేర్లను జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో రూ. 350 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. సంస్థలో ఇన్వెస్ట్ చేసిన ఒమెగా టీసీ సేబర్ హోల్డింగ్స్ రూ. 91 కోట్లు, టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సుమారు రూ. 8 కోట్లు, టీపీజీ ఏషియా ఎస్ఎఫ్ రూ. 92 కోట్లు, డబ్ల్యూఎస్ఐ/డబ్ల్యూఎస్‌క్యూఐ 5 మారిషస్ ఇన్వెస్టర్స్ రూ. 133 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నాయి. పబ్లిక్ ఇష్యూలో రూ. 3 కోట్ల విలువ చేసే షేర్లను సంస్థ ఉద్యోగుల కోసం కేటాయించారు. సిబ్బందికి తుది ధరతో పోలిస్తే 11 శాతం డిస్కౌంటుకు షేర్లు లభిస్తాయి. కొత్తగా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపునకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం శ్రీరామ్ ప్రాపర్టీస్ వినియోగించుకోనుంది. -
అరబిందో కన్స్ట్రక్షన్ కంపెనీకి జీహెచ్ఎంసీ షాక్!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత శుక్రవారం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు పేర్కొన్నారు. కాగా కేబుల్ బ్రిడ్జ్ మీదుగా మాదాపూర్ వైపు వెళ్తుండగా సాయి తేజ్ ఐకియా సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.రోడ్డుపై అరబిందో కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి మట్టి, వ్యర్థాలు ఉండటం వల్లే తేజ్ బైక్ స్కిడ్ అయి పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నిర్లక్ష్యంగా వ్యవహరించిన కన్స్ట్రక్షన్ కంపెనీపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెళ్లుతెత్తాయి. ఇందులో భాగంగానే ఖానమేట్ పరిధిలో భవన నిర్మాణం చేపడుతున్న అరబిందో కన్స్ట్రక్షన్ కంపెనీపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) రూ.లక్ష జరిమానా విధించింది . చదవండి: Sai Dharam Tej Accident: కన్స్ట్రక్షన్ కంపెనీ, మున్సిపాలిటీపై కూడా కేసు పెట్టాలి: ఆర్పీ సదరు కంపెనీకి లక్ష రూపాయల జరిమాన విధించిన జీహెచ్ఎంసీ ధృవీకరణ పత్రం సోషల్ మీడియా వైరల్‌గా మారింది.కాగా ఈ ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన ఆయన కాలర్ బోన్ ఫాక్చర్ కాగా ఆదివారం వైద్యులు దానికి శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం అపోలో వైద్యులు సాయి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ.. ప్రస్తుతం అతడి అరోగ్యం నిలకడ ఉందని, త్వరలోనే కోలుకుంటారని తెలిపారు. #SaiDharamTej road accident: The actor sustained injuries and collarbone fracture in a road accident at cable bridge. Now, @GHMCOnline has imposed a fine of Rs 1 lakh on Aurobindo Construction for dumping construction material on the Madhapur-Khanamet road. @IamSaiDharamTej pic.twitter.com/ilE83IA5zo — dinesh akula (@dineshakula) September 14, 2021 -
రూ.7 కోట్లకు రియల్ బురిడీ!
సాక్షి, అమరావతి: ప్రీలాంచింగ్ ఆఫర్ల పేరుతో రూ.7 కోట్ల వరకు వసూలు చేసిన రియల్ఎస్టేట్ సంస్థ ఎంకే కన్స్ట్రక్షన్స్ తమను మోసగించిందని పలువురు బాధితులు శుక్రవారం విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ మహానాడు రోడ్డు సమీపంలోని ఆ సంస్థ కార్యాలయం వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు మేరకు.. విజయవాడ సమీపంలోని గన్నవరం మండలంలో 15 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నట్టు ఎంకే కన్స్ట్రక్షన్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆ సంస్థ ప్రతినిధులుగా విశాఖకు చెందిన పట్నాల శ్రీనివాసరావు, విజయవాడ రూరల్ మండలానికి చెందిన మనోజ్‌కుమార్, రవితేజలు పకడ్బందీ మార్కెటింగ్ వ్యూహంతో అందర్నీ నమ్మించారు. హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయంతోపాటు విజయవాడ బ్రాంచి ఏర్పాటు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నామని చెప్పారు. పలువురిని ఏజెంట్లుగా నియమించుకున్నారు. ప్రీలాంచింగ్ ఆఫర్‌గా నిర్మాణానికి ముందే డబ్బులు చెల్లిస్తే రూ.35 లక్షల ఫ్లాట్‌ను రూ.18 లక్షలకే ఇస్తామని నమ్మించారు. అపార్ట్మెంట్ నిర్మాణం పూర్తయ్యేవరకు రూ.2 వంతున వడ్డీ కూడా చెల్లిస్తామన్నారు. ఫ్లాట్లు బుక్ చేసే ఏజెంట్లకు మంచి కమీషన్ల ఆశ చూపించారు. దీంతో పలువురు ఏజెంట్లు పెద్దసంఖ్యలో ప్రీలాంచింగ్ ఫ్లాట్లు బుక్ చేయించడమే కాకుండా వారు కూడా ఫ్లాట్ల కొనుగోలుకు డబ్బులు చెల్లించారు. ఆ విధంగా సంస్థకు రూ.7 కోట్ల వరకు సొమ్ము వచ్చింది. కొన్ని నెలలుగా సంస్థ ప్రతినిధులు పట్నాల శ్రీనివాసరావు, మనోజ్‌కుమార్, రవితేజల ఆచూకీ కనిపించడంలేదు. ఫోన్లలో కూడా అందుబాటులో లేరు. ఎంకే కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ ఆఫీసును సంప్రదించినా ఫలితం లేకపోయింది. దాంతో తాము మోసపోయామని గుర్తించిన కొనుగోలుదారులు, ఏజెంట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై సంస్థ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా వారి ఫోన్లన్నీ స్విచ్చాఫ్‌లో ఉన్నాయి. -
‘ఆఫీస్ కమ్ హోం’
సాక్షి, హైదరాబాద్: కరోనా విజృంభణ.. లాక్డౌన్ నిబంధనల నేపథ్యంలో మున్ముందు హైదరాబాద్‌లో నిర్మాణ రంగం దశ–దిశ మార్చు కోనుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలకే పరిమితమైన నిర్మాణాలు.. రాబోయే రోజుల్లో ఇల్లు– ఆఫీసు కలిసి ఉండేలా ‘ఆఫీస్ కమ్ హోం ఫ్లాట్ల’ను తెరపైకి తెచ్చే అవకాశం ఉందని బిర్లా ఎస్టేట్స్ సంస్థ నిర్వహించిన తాజా అధ్యయ నంలో తేలింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాలకు చెందిన సుమారు 1,500 కంపెనీలు కార్యకలాపాలు కొనసాగి స్తున్నాయి. వీటిలో ఏడు లక్షల మంది వరకు ఉపాధి పొందు తున్నట్టు హైదరా బాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసి యేషన్ వర్గాల అం చనా. తాజాగా పలు కంపెనీలు 30% ఉద్యో గులు, మరికొన్ని 50, ఇం కొన్ని 70% మందితో కార్యకలా పాలు కొనసాగించేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నాయి. అయితే కరోనా విసిరిన సవాలుకు వృత్తి ఉద్యోగాల్లో పలు మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ‘ఆఫీస్ కమ్ హోమ్’ సౌలభ్యం ఉండే అపార్ట్మెంట్లకు ఐటీ, బహుళజాతి కంపెనీలు ప్రాధాన్యత ఇస్తాయ ని, కనీసం 20% మంది ఉద్యోగులు ఇలాంటి ఫ్లాట్లలో నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతా రని ఈ అధ్యయనం అంచనా వేసింది. హౌస్ కమ్ కామన్ వర్క్ స్పేస్ సమీప భవిష్యత్‌లో గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, నానక్‌రాంగూడ తదితర ఐటీ కారిడార్ ప్రాంతాల్లో నిర్మించే బహుళ అంతస్తుల నిర్మాణాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అపార్ట్మెంట్లలో ఒకవైపు ఉద్యోగులు నివాసం ఉండేందుకు డీలక్స్, సూపర్‌డీలక్స్ ఫ్లాట్లు.. మరోవైపు వివిధ కంపెనీల్లో, లేదా ఒకే కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఒకేచోట..అదీ భౌతికదూరం పాటిస్తూ తమ ఆఫీసు కార్యకలాపాలు కొనసాగించు కునేందుకు వీలుగా కామన్ వర్క్ స్పేస్ ఉండేలా తీర్చిదిద్దాల్సి ఉంటుందని ఈ అధ్యయనం తెలిపింది. నగరంలోని ప్రముఖ నిర్మాణరంగ సంస్థలు ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. బహుళ అంతస్తుల సువిశాలమైన నివాస సముదాయాల నిర్మాణంతో ఆఫీస్ స్పేస్‌కు మోస్తరుగా డిమాండ్ తగ్గడంతోపాటు కామన్ వర్క్‌స్పేస్ ఏర్పాటుతో పలు కంపెనీలకు నూతన బ్రాంచీల ఏర్పాటుకయ్యే వ్యయం కూడా భారీగా తగ్గనుందని అంచనా వేసింది. ఇక ఆఫీస్ కమ్ హోం అపార్ట్మెంట్లలో ఉద్యోగులు రిలాక్స్ అయ్యేందుకు వీలుగా కెఫేటేరియా, కామన్ జిమ్, స్విమ్మింగ్‌పూల్, వీడియో కాన్ఫరెన్స్, బిజినెస్ మీట్ల ఏర్పాటుకు వీలుగా మినీ కాన్ఫరెన్స్ హాల్స్..అందుకు అనుగుణమైన ఫర్నిచర్‌ను కూడా నిర్మాణ సంస్థలే ఏర్పాటుచేసి ఈ భవనాలను తీర్చిదిద్దాల్సి ఉంటుందని పేర్కొంది. నయాట్రెండ్ అనివార్యం.. రాబోయే రోజుల్లో ఐటీ కంపెనీలు, ఉద్యోగులు హోమ్ కమ్ ఆఫీస్ నిర్మాణాల వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయి. ఈ దిశగా బిల్డర్లు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సి ఉంది. మారుతున్న పరిస్థితు లకు అనుగుణంగా నిర్మాణరంగం పురో గమించాలి. – వి.ప్రవీణ్‌రెడ్డి, మైత్రీ కన్స్ట్రక్షన్స్, ఎండీ -
తెరుచుకుంటున్నది అరకొరే..!
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభంలో లాక్డౌన్ కొనసాగుతున్నా ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు), పారిశ్రామిక వాడల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కొన్ని షరతులతో ఏప్రిల్ 28న అనుమతి ఇచ్చింది. అయితే అనుమతిచ్చి వారం కావస్తు న్నా పరిశ్రమల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారం భించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన సామాజిక దూరం, పారిశుద్ధ్యం వంటి చర్యలు చేపట్టినా కార్మికులు పూర్తిస్థాయిలో విధులకు హాజరు కావట్లేదు. టీఎస్ఐఐసీ పరిధిలోని పారిశ్రామికవా డల్లో 30 శాతం పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) చెప్తోం ది. ఇందులో ఎక్కువ గా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉండగా, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలు పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించలేదు. ముడి సరుకులు, ఫినిషింగ్ గూడ్స్‌ను మార్కెట్‌కు తరలించే పరిస్థితి లేకపోవడంతో ఉత్పత్తి ప్రారంభించేందుకు పారి శ్రామిక వర్గాలు వెనుకంజవేస్తున్నాయి. మరోవైపు వ లస కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోతుండటం పరిశ్రమలు తెరుచుకోకపోవడానికి మరో కారణం. ఐటీ రంగంలో లే ఆఫ్‌లు: లాక్‌డౌన్‌తో ప్రాజెక్టులు, ఆదాయం లేక ఉద్యోగులను తొలగించేం దుకు పలు ఐటీ కంపెనీలు ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ మేరకు పలు కంపెనీలు అంతర్గతంగా టెర్మినేషన్ లెటర్లను ఉద్యోగులకు ఇస్తున్నాయి. పలు కంపెనీలు ‘లే ఆఫ్’కు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి ఫిర్యాదులను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక, ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులతో పాటు, ఐటీ పరిశ్రమల ప్రతినిధులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు కమిటీ ముందుకు 42 ఫిర్యాదులు వచ్చినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటివరకు సగానికి పైగా ఫిర్యాదులపై విచారణ పూర్తయిందని, మిగతా ఫిర్యాదులపైనా కమిటీ విచారణ జరుపుతోందన్నారు. కొన్ని కంపెనీలు లే ఆఫ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు సుముఖత చూపినట్లు ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇటు కొన్ని కంపెనీలు లే ఆఫ్ ప్రకటించకుండా వేతనాల్లో కోత, అన్ పెయిడ్ హాలిడేస్ వంటి పద్ధతులను అనుసరిస్తున్నాయి. నిర్మాణ రంగం పరిస్థితి కొంత మెరుగు.. పారిశ్రామికరంగంతో పోలిస్తే నిర్మాణ రంగం పనులు వేగంగా తిరిగి ప్రారంభమవుతున్నట్లు భవన నిర్మాణదారులు, డెవలపర్లు చెప్తున్నారు. వారం వ్యవధిలో 40 శాతం కార్యకలాపాలు ప్రారంభం కాగా, పనులు ప్ర స్తుతానికి ఒకే షిఫ్టులో జరుగుతున్నాయి. హైదరాబాద్ పరిధిలోని మెగా ప్రాజెక్టుల్లో మూడు షిఫ్టుల్లో పనుల ప్రారంభానికి మరికొంత సమయం పట్టొచ్చు. -
కొత్త సంవత్సరం.. కొత్త ఆఫీస్
కేవలం కథానాయికగా మాత్రమే చేస్తూ తన ప్రతిభకు హద్దులు గీసుకోవడం లేదు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. వచ్చే ఏడాది జనవరిలో తన నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నారామె. ‘‘నా కొత్త నిర్మాణ సంస్థను జనవరిలో మొదలు పెట్టడానికి పనులు జరుగుతున్నాయి. ముందుగా చిన్న సినిమాలను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే కథలను సిద్ధం చేస్తున్నాం. నా వద్దకు వచ్చే ప్రతి కథలో నేను నటించడం కుదరకపోవచ్చు. కానీ మంచి కథలు వెండితెరపై రావాల్సిన అవసరం ఉంది. ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారు. వాళ్లతో సినిమాలు తీస్తా. నా ప్రొడక్షన్లో నేను నటించాలనుకోవడం లేదు. అలాగే మా సంస్థను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ విస్తృతపరచాలనుకుంటున్నాం. ఇక నా దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా గురించిన ప్రకటన త్వరలోనే వస్తుంది. కాకపోతే ‘థాకడ్’ సినిమా తర్వాతే దర్శకత్వంపై నేను పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నాను’’ అని కంగనా రనౌత్ తెలిపారు. మణికర్ణిక ఫిల్మ్స్ అనేది కంగనా రనౌత్ ప్రొడక్షన్ టైటిల్ అని బాలీవుడ్ సమాచారం. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’తో కథానాయికగా కంగనా బిజీగా ఉన్నారు. -
రెవెన్యూ అధికారులు కళ్లు తెరిచారు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : టీడీపీ నేత, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత అమిలినేని సురేంద్రబాబు సాగిస్తున్న ఇసుక అక్రమ రవాణాకు చెక్ పడింది. ‘ఇసుక దిబ్బల్లో కాంట్రాక్టు గద్ద’ శీర్షికన శనివారం ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో రెవెన్యూ అధికారులు కళ్లు తెరిచారు. పరిగి మండలంలోని శాసనకోట వద్ద ఇసుక రవాణాను వెంటనే నిలిపివేయించడంతో పాటు మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని మైనింగ్ డీడీని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా పెన్నా నది మీద బ్రిడ్జి నిర్మాణానికి ఇసుక కావాలంటూ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ దరఖాస్తు చేసుకోగా ఐదు వాహనాలకు పరిగి తహసీల్దారు అనుమతి మంజూరు చేశారు. అయితే అనుమతించిన వాహనాల్లో కాకుండా ఇతర వాహనాల్లో రోజూ 10 ట్రక్కులకు పైగా ఇసుకను ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ నిర్వాహకులు తరలిస్తున్నారు. అదీ కూడా ఇసుక తరలింపునకు అనుమతిచ్చిన బాల్‌రెడ్డిపల్లి నుంచి కాకుండా శాసనకోట నుంచి ఇసుక తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకున్నారు. ఈవిధంగా గత మూడు నెలల కాలంలో ఏకంగా రూ.10కోట్లకు పైగా ఆర్జించినట్లు ‘సాక్షి’ ఆధారాలతో సహా ప్రచురించింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు శాసనకోట ప్రాంతాన్ని పరిశీలించి రీచ్ లేకపోయినప్పటికీ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ భారీగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినట్లు నిర్ధారించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్కు హెచ్చరిక జారీ చేశారు. విచారణకు ఆదేశం జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న విషయమై మైనింగ్ డీడీని విచారణకు ఆదేశించాం. ప్రభుత్వ పాలసీకి భిన్నంగా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవు. మైనింగ్ డీడీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. – ఎస్.సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ -
ఇసుక దిబ్బల్లో కాంట్రాక్టు గద్ద
ప్రభుత్వ పనుల ముసుగులో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ దందా చేస్తోంది. ఎక్కడ ఇసుక కనిపించినా అక్కడ వాలిపోతూ సరిహద్దులు దాటించేస్తోంది. కాంట్రాక్టు పనుల్లో లబ్ధిని పక్కనపెడితే.. ఆయా ప్రాంతాల్లోని ఇసుకను యథేచ్ఛగా తరలిస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటోంది. గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి నేతల అండతో చెలరేగిపోయిన ఈ సంస్థ ఇప్పటికీ జిల్లా నలుమూలల నుంచి ఇసుక దోపిడీకి పాల్పడుతుండటం గమనార్హం. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టు పనుల నిర్వహణ సంస్థగా జిల్లాకు సుపరిచితం. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు జిల్లాలోని విలువైన ఇసుక నిల్వలను కర్ణాటకకు తరలిస్తూ సొమ్ము చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. గత ఐదేళ్లుగా ఇదే తంతు. వాస్తవానికి జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా పెన్నా నది మీద బ్రిడ్జి నిర్మాణానికి ఇసుక కావాలంటూ సదరు సంస్థ దరఖాస్తు చేసుకుంది. పనులకు ఇబ్బంది లేకుండా ఐదు వాహనాల్లో ఇసుక తరలించుకునేందుకు పరిగి తహసీల్దారు అనుమతి మంజూరు చేశారు. అయితే, ఇందుకు భిన్నంగా అనుమతించిన వాహనాల్లో కాకుండా ఇతర వాహనాల్లో ప్రతి రోజూ 10 ట్రక్కులకు పైగా ఇసుక అక్రమంగా తరలిపోతోంది. వాస్తవానికి ఇసుకను తీసుకోవాల్సిన ప్రాంతం బాల్‌రెడ్డిపల్లి. ఇక్కడి నుంచి కాకుండా శాసనకోట నుంచి ఇసుకను తరలిస్తూ.. మొదట భారీగా సొమ్ము చేసుకుంటోంది. ఈ విధంగా అక్రమ ఇసుకను అనుమతి లేని ట్రక్కు నుంచి తరలిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇసుక దందా ఇలా.. ఎవరు: ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ: శాసనకోట, పరిగి మండలం ఎలా: రోజూ 10 ట్రక్కుల్లో.. ఎంత: ట్రక్కు ఇసుక రూ.లక్ష ఎప్పటి నుంచి: మూడు నెలలుగా నెలసరి అక్రమార్జన: రూ.3 కోట్లు కళ్ల ముందు కనపడుతున్నా! జాతీయ రహదారి పనుల్లో భాగంగా పెన్నా నది మీద బ్రిడ్జి నిర్మాణానికి ఇసుక తరలించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆర్ అండ్ బీ ఎస్ఈ నుంచి 6వ తేదీ జూలై 2019న లేఖ వెళ్లింది. ఇందుకు పరిగి తహసీల్దారు 31 జూలై 2019న రోజుకు 5 ట్రక్కుల ఇసుకను తరలించుకునేందుకు అనుమతిచ్చారు. ఆ మేరకు ఏపీ02టీహెచ్ 1600, 1603, 1612, 1602, 1604 నెంబర్లు కలిగిన వాహనాల్లో మాత్రమే ఇసుకను తరలించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అది కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు(ఆదివారం మినహాయించి) మాత్రమే. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోంది. వాస్తవానికి ఎవరైనా పేదలు చిన్న చిన్న ట్రాక్టర్లల్లో ఇసుకను తరలిస్తే వాటిని సీజ్ చేసి కేసులు నమోదు చేసే అధికారులు.. కళ్ల ముందు భారీ ట్రక్కు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నప్పటికీ ఎందుకు వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేయలేదనే చర్చ జరుగుతోంది. ఏదీ వాహనాల ట్రాకింగ్ వాస్తవానికి ప్రభుత్వ అవసరాల కోసం ఇసుకను తరలించేందుకు అధికారులు అనుమతి ఇవ్వొచ్చు. అయితే, అనుమతించిన వాహనాల్లో మాత్రమే ఇసుకను తరలించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు కేవలం ట్రాక్టర్ల ద్వారా మాత్రమే ఇసుకను తీసుకెళ్లాల్సి ఉంది. ఇక్కడ మాత్రం ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఏకంగా ట్రక్కుల్లో ఇసుకను తరలిస్తోంది. అంతేకాకుండా అనుమతించిన వాహనాల్లో తరలించాల్సిన సందర్భాల్లో కూడా ఆ వాహనాలను గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్)ను అమర్చుకోవాల్సి ఉంటుంది. ఈ వాహనాల రాకపోకలను రెవెన్యూ యంత్రాంగం ఎప్పటికప్పుడు జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తూ ఉండాలి. పగటి సమయాల్లో కాకుండా రాత్రి వేళ ఇసుకను తరలించకూడదు. అదేవిధంగా ఏ ప్రదేశం నుంచి ఇసుకను తీసుకెళుతున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారనే అనే వివరాలు కూడా జీపీఎస్ ద్వారా నమోదవుతుంటాయి. అయితే, ఇక్కడ మాత్రం ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఈ నిబంధనలేవీ పాటించడం లేదు. నిర్దేశించిన వాహనాలు కాకుండా ఇతర వాహనాల్లో ఇసుకను అక్రమంగా రాష్ట్ర సరిహద్దులను దాటిస్తోంది. మరోవైపు అనుమతించిన వాహనాలకు కూడా జీపీఎస్ పరికరాలు లేవు. దీంతో ఈ ఇసుక నిజంగా ప్రభుత్వ పనులకు తరలుతోందా? ఆ పేరుతో అక్రమంగా అమ్ముకుంటున్నారా అనే వివరాలు కూడా అధికారులకు చేరడం లేదు. అన్నింటినీ మించి నిర్దేశించిన ప్రాంతం నుంచి కాకుండా వేరే ప్రదేశం నుంచి.. అది కూడా ఇసుక రీచ్ కాని ప్రాంతం నుంచి ఇసుకను తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సదరు కంపెనీపై అధికారులు చర్యలు తీసుకుంటారా? మాముళ్ల మత్తులో జోగుతారా అనేది చూడాల్సి ఉంది. ‘ఫిన్స్’తో నేరాలకు చెక్ అనంతపురం సెంట్రల్: నేరాలను నివారించడంతో పాటు నేరస్తులను తెలుసుకునేందుకు ఎస్పీ సత్యయేసుబాబు ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ నెట్వర్కింగ్ సిస్టం (ఫిన్స్) యాప్‌ను తీసుకొచ్చారు. శుక్రవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్హాల్లో జరిగిన కార్యక్రమంలో ఫిన్స్ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనంతపురం రేంజ్ డీఐజీ కాంతిరాణా టాటా, ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు మాట్లడుతూ... నేరాలకు అడ్డుకట్ట వేయడంలో ‘ఫిన్స్’ యాప్ కీలకంగా మారుతుందని వెల్లడించారు. సుమారు 10 లక్షల మంది నేరస్తుల వేలి ముద్రలను డేటాబేస్‌లో నిక్షిప్తమై ఉంటాయన్నారు. దీనికి అనుబంధంగా ట్యాబ్ ద్వారా క్షేత్రస్థాయిలో పోలీసు అధికారులు పాత నేరస్తులు, రౌడీషీటర్లు తదితర వారిని గుర్తించే ఆస్కారముందన్నారు. ఈ యాప్ ద్వారా ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇతర రద్దీ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు వెరిఫై చేసి క్షణాల్లో అతను నేరస్తుడా... కాదా.. అని నిర్దారించుకునే వీలుంటుందన్నారు. వేలి ముద్రల ద్వారా నేరస్తులను గుర్తించే సిస్టం.. ఇప్పటికే ఉన్నప్పటికీ నేరస్తులను గుర్తించేందుకు చాలా సమయం పట్టేదన్నారు. అనంతరం ‘ఫిన్స్’ యాప్‌ను ఎలా వినియోగించాలో డెమో ద్వారా వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు చౌడేశ్వరి, ఎంవీఎస్స్వామి, డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, మురళీధర్, సీఐలు, ఐటీ కోర్ టీం సిబ్బంది పాల్గొన్నారు. -
ఫోన్లో మరణ వాంగ్మూలం రికార్డు చేసి..
సాక్షి, ఆత్మకూర్ (కొత్తకోట): నాలుగేళ్లుగా ప్రేమించిన అమ్మాయి దూరమైందని కలత చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఆరేపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్‌గౌడ్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కిరణ్‌కుమార్‌గౌడ్(25) హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో ఉంటూ కన్ స్ట్రక్షన్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోని మండలంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. కానీ అమ్మాయి కిరణ్ ప్రేమను తిరస్కరించింది. అనంతరం హైదరాబాద్‌లోని నల్లకుంట పోలీస్టేషన్లో, అలాగే షీటీంకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కిరణ్‌కు కౌన్సిలింగ్ నిర్వహించారు. తీవ్ర మనస్తాపానికి గురైన కిరణ్ ఆత్మహత్యకు పాల్పడుతున్న కారణాలను సూసైడ్ నోట్‌తోపాటు తన ఫోన్లో మరణ వాంగ్మూలం రికార్డు చేసి యూట్యూబ్, వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. అనంతరం మండలంలోని శ్రీరాంనగర్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో మధ్యాహ్నం 2.25 గంటలకు ఏపీ సంపర్క్ క్రాంతి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో కిరణ్ మృతదేహం ముక్కలుగా విడిపోయి చాలాదూరం పడిపోయాయి. గద్వాల రైల్వే హెడ్‌కానిస్టేబుల్ రామకృష్ణ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
బీటీఆర్ గ్రీన్స్ సొంతింటి చిరునామా!
సాక్షి, హైదరాబాద్: చుట్టూ పచ్చని ప్రకృతి.. అందమైన గృహాలు.. ఆధునిక వసతులు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆరోగ్యానికి, ఆనందానికి దగ్గర నివాసమంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు చెప్పండి. అచ్చం ఇలాంటి ప్రాజెక్ట్‌నే అభివృద్ధి చేస్తోంది మ్యాక్ నిర్మాణ సంస్థ. శ్రీశైలం జాతీయ రహదారిలో బీటీఆర్ గ్రీన్స్ పేరిట రూపుదిద్దుకుంటోంది. ♦రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 15 నిమి షాలు, ఔటర్ రింగ్ రోడ్డుకు 5 నిమిషాల ప్రయాణ వ్యవధి దూరంలో ఉంది ఈ ప్రాజెక్ట్. 200 ఎకరాల్లో రానున్న బీటీఆర్ గ్రీన్స్‌లో మొత్తం 300 ప్రీమియం విల్లాలుంటాయి. 2,900 చ.అ. నుంచి 3,600 చ.అ.ల్లో 3, 4 పడక గదులుంటాయి. మలేషియాకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ ఎస్ఏ ఆర్కిటెక్ట్స్ ఎస్డీఎన్ బీహెచ్డీ ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేసింది. ప్రీమియం విల్లాలతో పాటూ 325 గజాల నుంచి 1,000 గజాల్లో ఓపెన్ ప్లాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ♦ ఇక వసతుల విషయానికొస్తే.. ల్యాండ్ స్కేపింగ్, నిత్యావసర దుకాణాలు, ఏటీఎం వంటి వసతులతో పాటూ క్లబ్ హౌస్, స్పా అండ్ సెలూన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మల్టిపర్పస్ ప్లే గ్రౌండ్, గోల్ఫ్ కోర్ట్ వంటివి ఉంటాయి. ♦ ప్రాజెక్ట్‌కు చేరువలో అంతర్జాతీయ విద్యా సంస్థలున్నాయి. నివాసితులకు వైద్య సేవలందించేందుకు బీటీఆర్ ప్రత్యేకంగా అపోలో హెల్త్ సర్వీసెస్‌తో ఒప్పందం చేసుకుంది. ప్రాజెక్ట్‌లో 24 గంటల పాటు అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది. -
భారత కార్మికులకు కువైట్ పరిహారం
దుబాయ్: కువైట్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ ఖరాఫీ నేషనల్ కంపెనీకి చెందిన 700 మందికి పైగా భారత కార్మికులకు అక్కడి ప్రభుత్వం పరిహారం ఇవ్వనుంది. ఒక్కో కార్మికుడికి రూ.56,680 అందుతుందని కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ మొత్తం కార్మికుల బ్యాంకు అకౌంట్లలో నేరుగా జమ అవుతుందని పేర్కొంది. వీరంతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, రాజస్తాన్ రాష్ట్రాలకు చెందిన వారంది. ఖరాఫీ నిర్మాణ సంస్థ గత ఏడాది దివాలా తీయడంతో ఆ సంస్థలో పనిచేస్తున్న 3,600 మంది భారతీయ కార్మికులకు వేతనాలు, పరిహారం అందించాల్సిన అవసరం ఏర్పడింది. భారత ప్రభుత్వం జోక్యం మేరకు చివరికి అర్హులైన 1,262 మంది కార్మికుల జాబితాను అక్కడి అధికారులకు అందజేసింది. అయితే, 710 మందికి మాత్రమే పరిహారం ఇచ్చేందుకు అంగీకరించారు. -
టీఎస్–ఐపాస్లోకి రియల్టీ!
120కి పైగా డెవలపర్లు, 600 ప్రాజెక్ట్లల్లో సుమారు 20 వేలకు పైగా వీలుంటుంది. బెంగళూరు, చెన్నై, ముంబై వంటి ఇతర నగరాల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని ధరలు కూడా హైదరాబాద్‌లో లేవు. ఇప్పటికే హైదరాబాద్‌లో కార్యాలయాల స్థలం 70 లక్షల చ.అ.లకు చేరింది. మరో ఆరేడు లక్షల చ.అ. స్థలం నిర్మాణంలో ఉంది. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎస్ రాంరెడ్డి, తెలంగాణ ప్రెసిడెంట్ జి. రాంరెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలను ప్రోత్సహించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టీఎస్–ఐపాస్)లో నిర్మాణ రంగాన్ని కూడా చేర్చాల్సిన అవసరముందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) అభిప్రాయపడింది. రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉండే చిన్న పరిశ్రమలకు సైతం ఎలాగైతే 15 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నారో.. అలాగే రూ.100 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ ఉండే రియల్టీ ప్రాజెక్ట్‌లకు కూడా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని క్రెడాయ్ హైదరాబాద్ ముక్తకంఠంతో కోరింది. అనుమతులు జాప్యం కారణంగా నిర్మాణ వ్యయం పెరుగుతుందని.. అంతిమంగా ధరలు పెరిగి కొనుగోలుదారులకు భారమవుతుందని పేర్కొంది. శుక్రవారమిక్కడ క్రెడాయ్ 6వ ఎడిషన్ ప్రాపర్టీ షో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం జీఎస్డీపీ రూ.40 లక్షల కోట్లుంటే.. ఇందులో రూ.8 లక్షల కోట్లు నిర్మాణ రంగం వాటా ఉందని తెలిపారు. నిరక్షరాస్యులకు సైతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేది నిర్మాణ రంగమే. ప్రస్తుతం ఈ రంగం మీద 10 లక్షలకు పైగా ప్రజలు ఆధారపడి ఉన్నారు. ఇలాంటి నిర్మాణ రంగ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానిది మూడేళ్ల ఎనిమిది నెలల వయసు. అతి తక్కువ కాలంలోనే ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావటానికి ప్రధాన కారణాలు ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహమేనని తెలిపారు. క్రెడాయ్ డిమాండ్లివే ►నిర్మాణ సంస్థలకు ప్రాజెక్ట్ ఫండ్ అందించడంలో బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలకు చిన్నచూపే. అందుకే నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదాను అందించాలి. అప్పుడే నిధుల లభ్యత పెరుగుతుంది. దీంతో అందుబాటు గృహాల నిర్మాణం మరింత ఊపందుకుంటుంది. ►నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లకు తాత్కాలిక విద్యుత్ సరఫరా చార్జీలు యూనిట్‌కు రూ.13–14 విధిస్తున్నారు. ఇతర పరిశ్రమలకైతే ఇది కేవలం రూ.2–3గా ఉంది. దీంతో నిర్మాణ ప్రాజెక్ట్‌ల వ్యయం తడిసిమోపడవుతుంది. అంతిమంగా ఈ భారం గృహ కొనుగోలుదారుల మీదే పడుతుంది. ►నగరంలో చాలా వరకు ప్రాజెక్ట్లల్లో డెవలపర్లు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)లను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా నీటిని శుద్ధి చేసి మొక్కలకు, ల్యాండ్ స్కేపింగ్ ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తున్నారు. ఆయా ఎస్టీపీ నిర్వహణకయ్యే విద్యుత్‌కు వాణిజ్య చార్జీలను విధిస్తున్నారు. దీంతో అపార్ట్‌మెంట్‌ను నిర్వహణ బాధ్యతలను సంక్షేమ సంఘానికి అప్పగించాక.. విద్యుత్ చార్జీల భారంతో ఎస్టీపీలను సరిగా నిర్వహించడం లేదు. దీంతో సమీప కొలనులు కాలుష్యమవుతున్నాయి. అందుకే ఎస్టీపీలున్న ప్రాజెక్ట్‌లకు నామమాత్రపు విద్యుత్ చార్జీలను కేటాయించాలి. ►హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి నీటి లభ్యత పెరిగింది. ఇకనైనా భవన నిర్మాణాలకు బయటి నుంచి నీటిని తీసుకొచ్చే ఇబ్బందులను తొలగించి నామమాత్రపు చార్జీలకు నీటి సరఫరా చేయాలి. ►నాలా చార్జీలను హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ లేదా స్థానిక మున్సిపల్ అథారిటీ వద్దే చెల్లించే వెసులుబాటును కల్పించాలి. అపార్ట్మెంట్లకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని 12 శాతంగా కేటాయించారు. దీనికి తోడు రిజిస్ట్రేషన్ 6 శాతంగా ఉంది. మొత్తంగా 18 శాతం పన్నులు కట్టేందుకు కొనుగోలుదారులకు భారంగా మారుతోంది. అందుకే 12 శాతంగా ఉన్న జీఎస్టీని 6 శాతానికి తగ్గించాలి. -
బడా నిర్మాణ సంస్థలకేమైంది?
బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో సక్సెస్ అయిన ఓ నిర్మాణ సంస్థ.. ఎర్రగడ్డలో ఓ ప్రీమియం ప్రాజెక్ట్‌తో హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఆ ప్రాంతానికి తగ్గ ప్రాజెక్ట్ కాదది. అంటే స్థానిక ధరకి, నిర్మాణ సంస్థ ధరకి చాలా తేడా. ప్రాజెక్ట్ ప్రీమియమే కావచ్చు. కానీ, స్థానిక కొనుగోలుదారుల అవసరాలూ ముఖ్యమే కదా! దీంతోఅమ్మకాల్లేక.. నిర్మాణ పనులకు బ్రేకిచ్చింది సదరు సంస్థ. .. పై అనుభవం ఒక్క ముంబైకి చెందిన నిర్మాణ సంస్థది మాత్రమే కాదండోయ్.. పుప్పాలగూడ, కవాడిగూడ వంటి ప్రాంతాల్లో ప్రాజెక్ట్‌లు చేస్తున్న కోల్‌కతా, బెంగళూరులకు చెందిన నిర్మాణ సంస్థలదీనూ! వీటి సారాంశమేంటంటే.. సంస్థ బ్రాండ్, సక్సెస్ మీద కాదు.. స్థానిక, కొనుగోలుదారుల అవసరాలే ప్రాజెక్ట్ సక్సెస్‌కు కారణమని! సాక్షి, హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు తర్వాత స్థిరాస్తి కొనుగోలుదారులు చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గతంలోలాగా ప్రీలాంచ్లో కొనడం లేదని ఓ నిర్మాణ సంస్థ అధ్యక్షుడు ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. కస్టమర్ ప్రాపర్టీని కొనుగోలు చేయాలంటే ముందుగా నచ్చాల్సింది ప్రాంతం. ఆ తర్వాతే ప్రాజెక్ట్ విజిట్. ధర, వసతుల కంటే ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందని అడుగుతున్నాడని.. 3–4 నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్ట్‌ల్లో ప్రాపర్టీ కొనుగోలుకే ప్రాధాన్యమిస్తున్నారని ఆయన వివరించారు. చ.అ.కు 100–200 ఎక్కువైన సరే వీటిల్లో కొనేందుకు ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. కొనుగోళ్లలో కొత్త కస్టమర్లు.. ఇంతకాలం హైదరాబాద్ స్థిరాస్తి రంగం సింహభాగం ఐటీ, ఫార్మా రంగాల మీదే ఆధారపడి ఉంది. కానీ, గత రెండేళ్లుగా పరిస్థితి మారింది. స్టార్టప్స్, ఈ–కామర్స్, లాజిస్టిక్, కో–వర్కింగ్ స్పేస్ వంటి రంగాలకు చెందిన ఉద్యోగుల కొనుగోళ్లూ పెరిగాయి. వీటికితోడు స్థానిక కస్టమర్లు కొంటున్నారు. ఇతర నగరాల్లో కంటే నగరంలో ధరలు అందుబాటులో ఉండడంతో కొత్త కొనుగోలుదారులు మరీముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కస్టమర్లు ఎక్కువగా వస్తున్నారని అప్పా జంక్షన్‌కు చెందిన ఓ డెవలపర్ అన్నారు. ముందు ప్లాట్.. తర్వాతే ఫ్లాట్.. స్థానిక ప్రభుత్వ ప్రోత్సాహంతో వాణిజ్య, కార్యాలయాల లావాదేవీలు పెరుగుతున్నాయని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. భవిష్యత్తులో వీటిల్లో భారీ ఉద్యోగ అవకాశాలొచ్చే అవకాశాలున్నాయి. అయితే వాణిజ్య లావాదేవీలు జరిగితే ఆయా ప్రాంతాల్లోని 10 కి.మీ. పరిధి వరకూ లే అవుట్లకు గిరాకీ పెరుగుతుంది. ప్రాపర్టీ కొనుగోలుదారులు ముందు జేబులోని సొమ్మునే పెట్టుబడిగా పెడతారు. ఈ సొమ్ము సుమారు 5–8 లక్షల కంటే ఎక్కువుండదు. అందుకే ముందుగా కమర్షియల్ ప్రాపర్టీలకు దగ్గర్లోని లే–అవుట్లు, స్థలాలను కొనుగోలు చేస్తారు. అంటే కమర్షియల్ రంగానికి గిరాకీ పెరిగితే ముందుగా డిమాండ్ పెరిగేది లే–అవుట్లకే. ఆఫీసులు ప్రారంభమై, ఉద్యోగుల రాకపోకలు మొదలయ్యాకే నివాస సముదాయాలకు గిరాకీ పెరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లే అవుట్ల డిమాండ్ దశలో ఉందని.. రెండో త్రైమాసికం నుంచి నివాస రంగం దశ మొదలవుతుందని, 30–40 శాతం ధరలు పెరిగే అవకాశముందని ఓ డెవలపర్ అభిప్రాయపడ్డారు. ప్రాజెక్ట్ ప్రారంభంలో హంగామాలొద్దు.. ప్రీమియం ప్రాంతాల్లోని ఫాట్లు్ల చ.అ. ధర కంటే అందులోని వసతులు, నిర్వహణ రుసుములే ఎక్కువగా ఉంటాయి. అందుకే అమ్మకాలు నెమ్మదిగా ఉంటాయి. అయితే ఆయా ప్రాజెక్ట్‌ల్లో అమ్మకాలు మొదట్లో కాస్త నెమ్మదించినా తర్వాతర్వాత పుంజుకుంటాయని పంజగుట్టకు చెందిన ఓ డెవలపర్ తెలిపారు. అప్పటివరకు చ.అ.కు రూ.3,000 కూడా మించి లేని ప్రాంతాల్లో ఒక్కసారిగా రూ.5,000లకు పైగా అంటే కస్టమర్లు సందిగ్ధంలో పడతారని పేర్కొన్నారు. అంతేకాదండోయ్.. ప్రాజెక్ట్ ఆరంభంలో ఎక్కువ హంగామా చేసినా కూడా కొనుగోలుదారులు ఇందులో ఎక్కువ రేట్లు ఉంటాయనే భావన కలుగుతుందని పేర్కొన్నారు. కొంపల్లి ఎందుకు సక్సెస్ కాలేదు? కస్టమర్ల అవసరాలు, అభిరుచుల మేరకే బిల్డర్లు ప్రాజెక్ట్‌లు కట్టాలి. అంతే తప్ప సంస్థ బ్రాండ్ ఇమేజ్, అవసరాల రీత్యా ప్రాజెక్ట్‌లు కడితే విఫలమవుతాయి. కస్టమర్లు కూడా ఆఫీసులు, పని ప్రాంతాలకు దగ్గర్లో ఇల్లుండాలని కోరుతున్నారని అప్పా జంక్షన్‌కు చెందిన ఓ డెవలపర్ చెప్పారు. వర్క్ ప్లేస్‌లకు కేంద్రంగా లేదు కాబట్టే కొంపల్లి మార్గం రియల్టీ రంగంలో అంతగా అభివృద్ధి చెందలేదని ఆయన ఉదహరించారు. రూ.30–40 వేల మధ్య వేతన జీవులుండే ప్రాంతాల్లో కోటి రూపాయల ప్రాజెక్ట్ చేపడితే విఫలవుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌లో అభివృద్ధి ఉంటే సరిపోదు. అ ప్రాంతం మౌలికంగా, సామాజికంగానూ అభివృద్ధి చెందాలి. అంటే రోడ్లు, నీళ్లు, విద్యుత్, విద్యా, వైద్యం, వినోద కేంద్రాలుండాలి. ఏ ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్ట్‌లు బెటరంటే? దక్షిణంలో లగ్జరీ.. గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ, నానక్‌రాంగూడ వంటి దక్షిణాది ప్రాంతాల్లో ప్రాజెక్ట్‌లు చేస్తుంటే.. ధర కాసింత ఎక్కువైన పర్వాలేదు. కానీ, వసతులు మాత్రం లగ్జరీగా ఉండాల్సిందే. ఇక్కడ 80% అమ్మకాలు రెండో ప్రాపర్టీ కొనుగోలుదారులే ఉంటారు. పన్ను మినహాయింపుల కోసం ప్రాపర్టీ కొంటుంటారు. ఇక్కడి విస్తీర్ణాలు కనీసం 1,500 చ.అ. నుంచి, ధర రూ.2,700 నుంచి మొదలవ్వాలి. ప్రాజెక్ట్‌లో స్క్వాష్ వంటి వినూత్న ఆటలకు ప్రాధాన్యత మివ్వాలి. షాపింగ్, ఎంటర్టైన్మెంట్ జోన్లు వంటివి ఉండాలి. సెక్యూరిటీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి. సెంట్రల్లో సూపర్ రిచ్.. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, హిమాయత్‌నగర్ వంటి సెంట్రల్ ప్రాంతాల్లో బిజినెస్ ఫ్యామిలీలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కనీసం 1,800 చ.అ. విస్తీర్ణం నుంచి మొదలవ్వాలి. ధర చ.అ.కు రూ.3,500–4,500 మధ్య ఉండాలి. సెంట్రల్ ప్రాంతాల్లో స్థలం పెద్దగా అందుబాటులో ఉండదు. కానీ, ఉన్న స్థలంలోనే లగ్జరీ అపార్ట్మెంట్స్ కట్టడం మేలు. ఔట్‌డోర్ గేమ్స్ కంటే ఇండోర్ గేమ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. స్విమ్మింగ్ పూల్, జిమ్, యోగా వంటి వసతులకు స్థలం కేటాయించాలి. షాపింగ్, ఎంటర్టైన్మెంట్ల వంటివి సమీప దూరంలోనే ఉంటాయి కాబట్టి ప్రాజెక్ట్‌లో వీటికి స్థల కేటాయింపులు చేయకపోయినా ఫర్వాలేదు. తూర్పులో గేటెడ్.. ఉప్పల్, ఎల్బీనగర్ వంటి తూర్పు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లు మేలు. ధర రూ.45 లక్షల లోపు ఉంటే అమ్మకాలు బాగుంటాయి. ఇతర జిల్లాల్లోని కొనుగోలుదారులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వసతుల కంటే ముఖ్యంగా నాణ్యమైన నిర్మాణం, అందుబాటు ధర, గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి అంశాల మీద దృష్టిపెడితే బెటర్. అంతర్జాతీయ వసతుల జోలికి వెళ్లకుండా స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటివి ఉండేలా చూసుకోవాలి. -
ఖాజాలో రామకృష్ణ టెక్నో టవర్జ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిర్మాణ సంస్థ రామకృష్ణ హౌజింగ్ మంగళగిరిలోని ఖాజా గ్రామంలో రామకృష్ణ టెక్నో టవర్జ్ పేరిట అధునాతన వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తోంది. 11 లక్షల చ.అ.ల్లో 25 అంతస్తుల్లోని ఈ భవన సముదాయంలో 500 చ.అ. నుంచి 20 వేల చ.అ. స్థలాన్ని కొనుగోలు చేయవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 5 లెవల్స్ పార్కింగ్, 18 ఎలివేటర్స్, ఫిట్నెస్, లైఫ్ స్టయిల్ సెంటర్స్, ఫుడ్ కోర్ట్స్, రెస్టారెంట్లు, షాపింగ్ కేంద్రాలతో పాటూ ఈ ప్రాజెక్ట్‌లో ఆధునిక ఫర్నీచర్, లైటింగ్, ఔట్‌డోర్ వ్యూ, హై స్పీడ్ ఇంటర్నెట్ వంటి అన్ని రకాల వసతులను కల్పిస్తున్నామని పేర్కొంది.