దుబాయ్: కువైట్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ ఖరాఫీ నేషనల్ కంపెనీకి చెందిన 700 మందికి పైగా భారత కార్మికులకు అక్కడి ప్రభుత్వం పరిహారం ఇవ్వనుంది. ఒక్కో కార్మికుడికి రూ.56,680 అందుతుందని కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ మొత్తం కార్మికుల బ్యాంకు అకౌంట్లలో నేరుగా జమ అవుతుందని పేర్కొంది.
వీరంతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, రాజస్తాన్ రాష్ట్రాలకు చెందిన వారంది. ఖరాఫీ నిర్మాణ సంస్థ గత ఏడాది దివాలా తీయడంతో ఆ సంస్థలో పనిచేస్తున్న 3,600 మంది భారతీయ కార్మికులకు వేతనాలు, పరిహారం అందించాల్సిన అవసరం ఏర్పడింది. భారత ప్రభుత్వం జోక్యం మేరకు చివరికి అర్హులైన 1,262 మంది కార్మికుల జాబితాను అక్కడి అధికారులకు అందజేసింది. అయితే, 710 మందికి మాత్రమే పరిహారం ఇచ్చేందుకు అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment