
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఐరా ఎండీ పోశం నర్సిరెడ్డిని చాంపియన్ ఆఫ్ ఛేంజ్ తెలంగాణ అవార్డ్ వరించింది. సుప్రీంకోర్టు్ట మాజీ న్యాయమూర్తి, ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్ కేజీ
బాలక్రిష్ణన్ చేతుల మీదుగా ఈ అవార్డ్‌ను అందుకున్నారు. ధైర్యం, సమాజ సేవ, సమ్మిళిత సామాజిక అభివృద్ధి విలువలను ప్రోత్స హించడంలో వ్యక్తులు, సంస్థ లు చేసిన కృషికి గుర్తింపుగా చాం పియన్స్ ఆఫ్ ఛేంజ్ నేషనల్ అవార్డ్‌లను ప్రదానం చేస్తుంటుంది. నిర్మాణ రంగం నుంచి మైహోమ్ గ్రూప్ ఫౌండర్ అండ్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్‌రావుకు కూడా అవార్డ్ దక్కింది. ఈ అవార్డ్‌తో బాధ్యత పెరిగిందని, నంబర్ 1 రియల్టీ టెక్నాలజీ కంపెనీగా నిలిపేలా కృషి చేస్తానని నర్సిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment