Ira
-
పారిశ్రామికవేత్తలుగా.. యువకెరటాలు!
ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన కార్టియర్ ఫెలోషిప్‌ను ఈ యేడాది ముగ్గురు భారతీయ మహిళలు దక్కించుకున్నారు. ఆ ముగ్గురూ ఢిల్లీ వాసి అయిన అక్షితా సచిదేవా, బెంగళూరు వాసులైన మాన్సీ జైన్, ఇరా గుహ లు. మన దేశం నుంచి వీరు మాత్రమే ఎంపిక అవడంలోని ప్రత్యేకత సామాజికంగా ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలుగా వీరికున్న గుర్తింపు.ప్రపంచంలోని అత్యంత కీలకమైన సవాళ్లను పరిష్కరిస్తున్న వేలాది మంది మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించి, వారిలో 33 మందిని ఎంపిక చేసిన కార్డియర్ ఉమెన్స్ ఇనిషియేటివ్ మీట్ ఇటీవల చైనాలో జరిగింది. ఇందులో ముగ్గురు యువ భారతీయ మహిళా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాల ద్వారా ప్రభావ వంతమైన గుర్తింపు పొందారు.మాన్సీ జైన్..‘డిజిటల్పానీ’ అనే సాఫ్ట్వేర్ ల్యాట్ ఫారమ్ వ్యవస్థాపకురాలు మాన్సీ జైన్. ఇది మురుగునీటి శుద్ధి కార్యకలాపాలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఫలితంగా కలుషితమైన నీటిని సమర్థవంతంగా శుద్ధి చేయవచ్చు. తిరిగి ఉపయోగించుకోవచ్చు. డిజిటల్పానీ రోజుకు 90 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. భారత దేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలోని దాదాపు 50 యూనిట్లలోని నీటిలో అధిక నాణ్యత, అనుకూలమైన సౌకర్యాలుగా మార్చి తన శక్తిని నిరూపించింది. అక్షితా సచిదేవా..ఏఐ ఆధారిత సాంకేతికత ‘కిబో’ను ఉపయోగించి అంధత్వం ఉన్న వ్యక్తులకు సమగ్ర విద్య, ఉపాధినిప్రోత్సహించడానికి ట్రెస్టిల్ ల్యాబ్‌లను స్థాపించింది బెంగళూరుకు చెందిన అక్షితా సచిదేవా. 60 భాషల్లో ప్రింట్, హ్యాండ్ రైటింగ్, డిజిటల్ కంటెంట్‌ను డిజిటైజ్ చేస్తుంది, అనువదిస్తుంది, ఆడియోలోకి మారుస్తుంది. జూలై 2019 నుండి కిబో 650 సంస్థలను కలుపుకొని 25 దేశాలలో 1.5 లక్షల మందికి పైగా వ్యక్తులు సాధికారత సాధించేలా చేసింది. కంటెంట్‌ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి అక్షిత చేసిన కృషికి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి.ఇరాగుహ..స్త్రీల పీరియడ్ సమస్యలను పరిష్కరించడానికి, ల్యాస్టిక్ శానిటరీ ప్యాడ్ల నుండి వ్యర్థ కాలుష్యాన్ని తగ్గించడానికి మెనుస్ట్రువల్ కప్‌ను రూపొందించి, పేటెంట్ రైట్స్ పొందింది ఇరాగుహ. సామాజిక కార్యక్రమాల ద్వారా గ్రామీణ కుటుంబాలలోని మహిళలు మెనుస్ట్రువల్ కప్‌ని ఉపయోగించడం ద్వారా మిలియన్ల డాలర్లను ఆదా చేసింది. అలాగే, లక్షల టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలను నివారించింది. వినూత్నమైన పీరియడ్ ట్రాకర్ యాప్‌ను అభివృద్ధి చేయడం ద్వారా కెనడా ప్రభుత్వం నుండి అవార్డును అందుకుంది.సామాజిక వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్న ఈ ముగ్గురు యువపారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి తమ మద్దతును ప్రకటించింది కార్టియర్ ఫెలోషిప్. కోట్లాది మంది వీక్షకుల ముందు అవార్డులు అందుకున్న వారిలో ఈ ముగ్గురు ప్రత్యేకంగా నిలిచారు. తమ వ్యాపారాల ద్వారా సమాజంలో తీసుకు వస్తున్న మార్పులను పంచుకుని, అందరికీ ఆదర్శంగా నిలిచారు. -
‘నేరుగా బ్యాంకు నుంచే రుణాలు ఇప్పించండి’
బ్యాంకుల నుంచి నేరుగా రుణాన్ని పొందే సదుపాయాన్ని కల్పించాలని భారత స్థిరాస్తి పెట్టుబడుల ట్రస్టు (రీట్స్) పరిశ్రమ ఇండియన్ రీట్స్ అసోసియేషన్ (ఐఆర్ఏ)ను కోరింది. దాంతోపాటు రీట్స్‌ను ఈక్విటీలుగా వర్గీకరించాలని తెలిపింది. ప్రస్తుతం బాండ్ల జారీ లేదా బ్యాంకింగేతర సంస్థలు, మ్యూచువల్ ఫండ్ల ద్వారా మాత్రమే రుణాలు తీసుకునే అవకాశం రీట్స్‌కు ఉంది. బ్యాంకుల ద్వారా రుణాలకు అనుమతి లేదని ఇండియన్ రీట్స్ అసోసియేషన్ (ఐఆర్ఏ) తెలిపింది. కొత్తగా ఏర్పాటైన ఐఆర్‌ఏలో 5 నమోదిత సంస్థలు ఉన్నాయి. ఐఆర్ఏకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎంబసీ రీట్స్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అరవింద్ మైయా మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా రుణాలకు అనుమతి పొందే విషయమై ఆర్బీఐతో చర్చిస్తున్నామని తెలిపారు. స్థిరాస్తి పరిశ్రమకు నిధులు భారీ స్థాయిలో కావాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ప్రస్తుతం రీట్స్‌ను ‘హైబ్రిడ్’ పెట్టుబడి మార్గంగా వర్గీకరించారని, ఇది మదుపర్లను అయోమయానికి గురి చేస్తోందని బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ ఎండీ, ముఖ్య కార్యనిర్వహణ అధికారి అలోక్ అగర్వాల్ వెల్లడించారు. రీట్స్‌ను ఈక్విటీలుగా వర్గీకరిస్తే.. ఇవి కూడా సూచీల్లో (ఇండెక్స్) చేరే వీలుండి, రీట్స్‌లోకి నిధుల రాక పెరిగేందుకు తోడ్పడుతుందని తెలిపారు. భారత్ రీట్స్ నిబంధనల నుంచి ప్రేరణ పొందిన సింగపూర్‌తో పాటు అమెరికాలో రీట్స్‌ను ఈక్విటీగా పరిగణిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. భారత్‌లో రీట్స్ రంగ అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని, స్థిరాస్తి రంగంలో గిరాకీ పెరుగుతూనే ఉందని ఐఆర్ఏ తెలిపింది. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో దూసుకెళ్తున్న రియల్టీ రంగం -
పురాణ స్త్రీల మరో అన్వేషణ
‘నేను రాసిన మహా భారతంలో ద్రౌపది వస్త్రాపహరణం ఉంటుంది... కాని శ్రీ కృష్ణుడు వచ్చి దుస్తులు ఇవ్వడు... ద్రౌపది తానే ఆ ఘట్టాన్ని ఎలా ఎదుర్కొని ఉంటుందో రాశాను’ అంటుంది ఇరా ముఖోటి. మహా భారతాన్ని అందులోని స్త్రీ పాత్రల కోణంలో వ్యాఖ్యానిస్తూ ఇరా ముఖోటి రాసిన ‘సాంగ్ ఆఫ్ ద్రౌపది’ ఎన్నో ఆలోచనలు రేపుతోంది. ప్రశంసలూ పొందుతోంది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో నేచురల్ సైన్సెస్ చదివిన ఇరా పురాణ స్త్రీలను పునర్దర్శించే పనిలో ఎందుకు పడిందో ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో పాఠకులతో పంచుకుంది. ‘సమాజం చాలా ఆధునిక స్థాయికి చేరింది. ఇంగ్లిష్ భాషలో మాట్లాడి ఆలోచించే వర్గం మన దేశంలో స్థిరపడింది. అదే సమయంలో ప్రతి ఇల్లూ మూలాలకు దూరంగా జరుగుతూ ఏకాకిగా మారుతోంది. అలాంటి సమయాలలో పురాణాల వైపు చూసి వాటిని మళ్లీ చదవడం ద్వారా అంతో ఇంతో ఓదార్పు పొందడం జరుగుతోంది. పురాణాలను మళ్లీ వ్యాఖ్యానిస్తూ ఇంగ్లిష్‌లో వస్తున్న రచనలను కూడా అలాగే చూడాలి’ అంటుంది ఇరా ముఖోటి. ఫార్మస్యూటికల్ రంగంలో చాలా ఏళ్లు ఉన్నతోద్యోగం చేసిన ఇరా రచన పట్ల తన ఆసక్తిని కూడా పెంచుకుంటూ వచ్చింది. ఒక దశలో ఉద్యోగం మానేసి గమ్యం లేనట్టుగా తిరుగుతూ రచయితగా ఉండటమే తన నిర్ణయంగా బలపరుచుకుంది. ఆ తర్వాత ఆమె ఉద్యోగం వైపు చూళ్లేదు. ఫుల్‌టైమ్ రైటర్‌గా మారిపోయింది. ‘నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నా కూతుళ్లు ఇద్దరూ చిన్నవాళ్లు. వాళ్లను తీసుకుని ప్రతి సంవత్సరం రామ్‌లీల చూడటానికి వెళ్లేదాన్ని. నాటకం చివరలో సీత రాముడి పక్కన సింహాసనం పై కూచోవడం చూసి నా కూతుళ్లు చప్పట్లు కొట్టేవాళ్లు. నాకు అనిపించేది... సీత అలా కూచోవడం వెనుక ఎన్ని సవాళ్లను ఎదుర్కొంది.. ఎన్ని పరీక్షలకు తల ఒంచింది... ఇవన్నీ నా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలనిపించేది. సీత ఎంతో ఆదర్శప్రాయమైన స్త్రీ. ఆమెకు కష్టాలు తప్పలేదు. అదే సమయంలో ‘నిర్భయ’ ఘటన జరిగింది. అది నా మనసు కలచి వేసేలా చేసింది. స్త్రీలు ఎంత ఆదర్శప్రాయంగా ఉన్నా, ఎంత ముందంజ వేసినా వారిపై దాష్టీకాలు ఉంటాయి అనిపించింది. ఆ సమయంలోనే పురాణపాత్రలను మళ్లీ రాయాలనుకున్నాను. వెంటనే ‘సాంగ్ ఆఫ్ ద్రౌపది’ నవల రాశాను.’ అందామె. అలా రైటర్ అయిన ఇరాను ఆమె పబ్లిషర్ ప్రోత్సహించాడు. ‘నీకు చరిత్ర అవగాహన బాగా ఉంది. ముందు హిస్టారికల్ నాన్ ఫిక్షన్ రాయి’ అని సలహా ఇచ్చాడు. దాంతో ఇరా రాయడం మొదలెట్టింది. ‘హీరోయిన్స్: పవర్ఫుల్ ఇండియన్ విమెన్ ఆఫ్ మిత్ అండ్ హిస్టరీ’, ‘క్వీన్స్ అండ్ బేగమ్స్ ఆఫ్ మొఘల్ అంపైర్’, ‘అక్బర్– ది గ్రేట్ మొఘల్’ పుస్తకాలు వచ్చాయి. ఆ తర్వాత అన్నింటి కంటే ముందు రాసిన ‘సాంగ్ ఆఫ్ ద్రౌపది’ నవల బయటకు వచ్చింది. అయితే ‘ద్రౌపది’ పాత్ర మీద పున ర్వా్యఖ్యానం, పునఃచిత్రణ కొత్త కాదు. ప్రాంతీయ భాషలలో, ఇంగ్లిష్‌లో ఎన్నో రచనలు వచ్చాయి. తెలుగులో యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ రాసిన ‘ద్రౌపది’ (2009) నవల చాలా చర్చోపచర్చలకు కారణమైంది. 2010లో అదే నవలకు సాహిత్య అకాడెమీ బహుమతి దక్కితే దుమారం రేగింది. కాని ఇరా రాసిన ‘సాంగ్ ఆఫ్ ద్రౌపది’ అమె రచనా శైలి, ఆలోచనా శైలితో ఆకట్టుకుంటోంది. ‘ద్రౌపది భారతీయ స్త్రీల కోపానికి ప్రతిరూపం. స్త్రీ ఆగ్రహానికి పురుష సమాజంలో అనుమతి లేదు. కాని ద్రౌపది తన కోపాన్ని ప్రదర్శించగలిగింది. ఆమె నిండు కౌరవసభలో తన భర్తలను నిలదీయ గలిగింది. ఆత్మగౌరవం కోసం పెనుగులాడింది. ఆ సమయంలో ఆమె ఏకవస్త్ర. అయినా సరే కౌరవసభకు సమాధానం చెప్పగలిగింది.’ అంటుందామె. అయితే అందరూ తరతరాలుగా చెప్పుకుంటున్న ఆ ‘వస్త్రాపహరణం’ ఘట్టంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యి చీరలు ఇవ్వడాన్ని ఇరా రాయలేదు. ‘1930లో మన దేశంలో ఒక పండిత వర్గం, చరిత్రకారుల వర్గం కలిసి కొన్నాళ్లు పూణెలో కూచుని మహాభారతంలోని ప్రక్షిప్తాలన్నీ తొలగిస్తూ సిసలైన మహాభారతాన్ని తేల్చారు. నేను వారు కూర్చిన మహాభారతాన్ని నా రచనలకు ప్రామాణికంగా తీసుకున్నాను. వాస్తవ దృష్టితో చూస్తే అది రాజ్యం కోసం అన్నదమ్ముల మధ్య తగవు. కృష్ణుడు కూడా ఈ వాస్తవిక దృష్టిలో ఒక రాజకీయవేత్తగా కనిపించాడు నాకు. అందుకే దైవశక్తులు ఉన్న కృష్ణుడిని నా వస్త్రాపహరణ ఘట్టంలో పెట్టలేదు. ద్రౌపదినే ఆ ఘటనను ఎదుర్కోనిచ్చాను’ అంటుందామె. పురాణాలలో ఉన్నత వర్గాల ప్రయోజనాలు నిమ్నవర్గాల ప్రజలకు ఎలా చేటు చేశాయో చూపే ప్రయత్నం చేస్తుంది. ‘లక్క ఇంటిలో పాండవులను కాపాడటానికి కుంతి ఒక గిరిజన తల్లిని, ఐదుమంది పిల్లలను తమకు మారుగా పడుకోబెడుతుంది. ఆ అమాయకులు అగ్నికి ఆహుతి అవుతారు. ఇది ఎంత అన్యాయం. ఏకలవ్యుడు, ఘటోత్కచుడు పాండవ, కౌరవులతో సమగౌరవం ఎందుకు పొందలేదో చూడాలి’ అంటుంది. కురుక్షేత్ర యుద్ధం వల్ల వితంతువులుగా మారిన కౌరవుల భార్యల దిక్కులేని స్థితిని ఇరా తన పుస్తకంలో రాస్తుంది. ‘సతీ సహగమనం’ ఆ సమయంలోనే ఉనికిలోకి విస్తారంగా వచ్చి ఉంటుందని ఆమె ప్రతిపాదన. ఏమైనా ఇది అంతులేని అన్వేషణే. కాలం గడిచేకొద్ది నాటి పాత్రలు కొత్త అర్థాలతో భారతజాతిని మేల్కొలుపుతూనే ఉంటాయి. ఇరా ముఖోటి వంటి మహిళా రచయితలు ఆ పనిలో భాగం కావడమే ఇప్పుడు వార్త. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
ఐరా రియల్టీ ఎండీ నర్సిరెడ్డికి అవార్డ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఐరా ఎండీ పోశం నర్సిరెడ్డిని చాంపియన్ ఆఫ్ ఛేంజ్ తెలంగాణ అవార్డ్ వరించింది. సుప్రీంకోర్టు్ట మాజీ న్యాయమూర్తి, ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ కేజీ బాలక్రిష్ణన్ చేతుల మీదుగా ఈ అవార్డ్‌ను అందుకున్నారు. ధైర్యం, సమాజ సేవ, సమ్మిళిత సామాజిక అభివృద్ధి విలువలను ప్రోత్స హించడంలో వ్యక్తులు, సంస్థ లు చేసిన కృషికి గుర్తింపుగా చాం పియన్స్ ఆఫ్ ఛేంజ్ నేషనల్ అవార్డ్‌లను ప్రదానం చేస్తుంటుంది. నిర్మాణ రంగం నుంచి మైహోమ్ గ్రూప్ ఫౌండర్ అండ్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్‌రావుకు కూడా అవార్డ్ దక్కింది. ఈ అవార్డ్‌తో బాధ్యత పెరిగిందని, నంబర్ 1 రియల్టీ టెక్నాలజీ కంపెనీగా నిలిపేలా కృషి చేస్తానని నర్సిరెడ్డి తెలిపారు. -
తమ్ముడు బ్రహ్మాజీకి సపోర్ట్ కావాలి.. నాగశౌర్య ట్వీట్ వైరల్
యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఆయన వరుడు కావాలి, ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి, లక్ష్య, పోలీస్ వారి హెచ్చరిక, నారీనారీనడుమ మురారీతో పాటు అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాతో షెర్లీ సెటియా హీరోయిన్గా పరిచయమవుతోంది. ఒక ముఖ్యమైన పాత్రలో బ్రహ్మాజీ నటిస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి హైదరాబాదులో ఈ సినిమా షూటింగు జరుగుతోంది. నాగశౌర్య .. బ్రహ్మాజీ తది తరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా షూటింగ్ సెట్లో బ్రహ్మాజీతో దిగిన ఓ ఫోటోని నాగశౌర్య సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో నాగశౌర్య నుదుటున కుంకుమరేఖను ధరించి కనిపిస్తూ ఉండగా, బ్రహ్మాజీ నుదుటున నామాలు ధరించి ఉన్నాడు. అయితే ఈ ఫొటోను పోస్ట్ చేసిన నాగశౌర్య ఫన్నీగా ఒక కామెంట్ పెట్టాడు. ‘నా తమ్ముడు బ్రహ్మాజీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాడు .. మీ అందరి సపోర్టు కావాలి .. దయచేసి యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించండి’అంటూ సరదాగా రాసుకొచ్చాడు. బ్రహ్మాజీ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయింది. అయినా ఆయన ఇప్పటికీ కుర్రాడిలా చాలా ఫిట్ నెస్ తో ఉంటాడు. ఈ విషయంపై సన్నిహితులు ఆయనను ఆటపట్టిస్తూనే ఉంటారు. అలాగే నాగశౌర్య కూడా, ఆయనను తమ్ముడు అంటూ అలా ఆటపట్టించాడు. ప్రస్తుతం నాగశౌర్య ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. Na thammudu @actorbrahmaji kothaga industry ki vachadu. Mi andari support thanaki undali. Please support young talent 💪😜#NS22#IRA4 pic.twitter.com/OIgx5UFkSK — Naga Shaurya (@IamNagashaurya) July 23, 2021 -
ఐరాపై ఆసక్తి
సినిమా: సినీ వర్గాల్లో ఐరా చిత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దక్షిణాదిలో స్టార్ హీరోల చిత్రాలకు దీటుగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు ఉంటున్నాయంటే అవి నయనతార నటించినవేనని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ అగ్రనటి నటించిన హీరోయిన్ సెంట్రిక్ చిత్రాలు ఒకటి రెండు ఏవరేజ్ అయ్యాయేమో. మిగిలినవన్నీ హిట్టే. అలా మాయ చిత్రంతో ప్రారంభమైన నయనతార కథలో నాయకిగా నటించిన చిత్రాల సక్సెస్ అరమ్ వరకూ సాగింది. అ తరువాత ఈ జాణ నటించిన ఇమైకా నొడగళ్ వంటి చిత్రాల విజయాన్ని కూడా నయనతార ఖాతాలోనే పడుతుంది. తాజాగా నటిస్తున్న చిత్రం ఐరా. ఇదీ హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రమే. ఇందులో విశేషం ఏమిటంటే నయనతార తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడం. ఈ చిత్రంలో నయనతార బాడీలాంగ్వేజ్ చాలా కొత్తగా ఉంటుందంటున్నాడు దర్శకుడు సర్జన్. ఈయన లక్ష్మీ అనే లఘు చిత్రం ద్వారా మంచి పేరు తెచ్చుకుని ఐరా ద్వారా సినీరంగానికి పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర టైటిల్ మాత్రమే కాదు, ఇటీవల విడుదలైన టీజర్ కూడా చాలా ఆసక్తిగా ఉంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్న ఐరా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ దీని కోసం నయనతార చాలా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. తన మేకప్ నుంచి అన్ని విషయాలు కొత్తగా ఉండాలని సాధారణ మేకప్ వదిలేశారని చెప్పారు. నయనతార ఇంత వరకూ నటించనటువంటి పాత్రలో నటింపజేయాలన్న ప్రయత్నమే ఐరా చిత్రం అన్నారు. ఇందులో నయనతార బాడీలాంగ్వేజ్‌ను చూసి ప్రేక్షకులు విస్మయం చెందుతారని అన్నారు. నయనతార ఈ చిత్రంలో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం అన్నారు. భవానీ అనే పాత్రలో బ్లాక్ అండ్ వైట్‌లోనే ఆమె కనిపిస్తుందని చెప్పారు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఆ సన్నివేశాలు తనకే చాలా నచ్చాయన్నారు. అలా చూపిం చాలని కథ రాసుకున్నప్పుడే నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇక రెండో పాత్రలో నయనతార ఒక సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపిస్తుందని తెలిపారు. సాధారణం ఇద్దరూ ఒకేలా ఉంటే వారు కవలపిల్లలైనా అయిఉండాలి, లేక అక్కచెళ్లెళ్లు అయినా అయి ఉంటారన్నారు. అయితే ఐరా చిత్రంలో నయనతార రెండు పాత్రలకు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పారు. చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా చాలా మంచి స్పందన ప్రేక్షకుల నుంచి వచ్చిందన్నారు. దీంతో చిత్ర విజయం ఖాయం అనే నమ్మకం ఏర్పడిందని, త్వరలోనే ఐరాను తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
ఐరాగా వస్తున్న నయనతార
సినిమా: తెలుగులో చిరంజీవికి జంటా సైరా చిత్రంలో నటిస్తున్న నటి నయనతార తమిళంలో ఐరా చిత్రంలో నటిస్తుండడం విశేషం. దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న ఏకైక కథానాయకి నయనతార. అదేవిధంగా చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటి ఈమె. ఈమె సెంట్రిక్ కథా పాత్రల్లో నటించిన మాయ, ఆరం వంటి చిత్రాలు సక్సెస్ కావడంతో ఆ తరహా చిత్రాలు నయనతార వైపే చూస్తున్నాయి. ఇటీవల ఈ సంచలన నటి నటించిన కోలమావు కోకిల, ఇమైకా నొడిగళ్ చిత్రాలు వరుసగా విజయం సాధించడంతో నయనతార క్రేజ్ మరింత పెరిగింది. తాజాగా మరోసారి హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంతో తెరపైకి రావడానికి నయనతార సిద్ధం అవుతోంది. ఇంతకుముందు అరమ్, గులేభకావళి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కేజేఆర్ స్టూడియోస్ సంస్థ తాజాగా నయనతార హీరోయిన్గా నిర్మిస్తున్న చిత్రానికి సర్జిన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు హెచ్చరికై ఇదు మణిదర్గళ్ నడమాడుం ఇదం అనే సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. ఈయన తాజా చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. దీని ఫస్ట్‌లుక్, టైటిల్‌ను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. దీనికి ఐరా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీని గురించి దర్శకుడు సర్జన్ తెలుపుతూ నయనతార తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఇదని చెప్పారు. హర్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఐరా చిత్రంలో ఆమె ఇంతకు ముందెప్పుడూ నటించనటువంటి పాత్రలో కనిపించనున్నారని తెలిపారు. ఇందులో రెండు పాత్రలు ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా కాంట్రస్ట్‌గా ఉంటాయని చెప్పారు. ఐరా అంటే ఇంద్రుడి వాహనం ఐరావతం అని అర్థం, ఇందులో ఏనుగు లాంటి బలమైన పాత్రలో నయనతార నటించారని తెలిపారు. ఈ చిత్రాన్ని డిసెంబరులో క్రిస్మస్ పండగ సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ఐరా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చూసి నయనతార అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. రోబో సేవలు
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. రెండేళ్లలో వివిధ బ్రాంచ్‌ల్లో 20 వరకూ హ్యుమనాయిడ్(రోబో)లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. బ్యాంక్ ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలందించేందుకు 18–24 నెలల్లో 15–20 హ్యుమనాయిడ్స్ను ఇన్స్టాల్ చేయనున్నామని బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ హెడ్ నితిన్ చుగ్ చెప్పారు. ఇక్కడి ఒక బ్రాంచ్‌లో ఐరా పేరుతో ఏర్పాటు చేసిన హ్యుమనాయిడ్‌ను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. వెల్కమ్ డెస్క్ దగ్గర ఖాతాదారులకు ఐరా సూచనలందిస్తుందని వివరించారు. లావాదేవీలతో సహా ఇతర పనులను కూడా వీటితో చేయించే అవకాశాలున్నాయని తెలిపారు. ఖాతాదారుల అవసరాలను గుర్తించి వాటిని సమర్థవంతంగా అందించే ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీలపై కసరత్తు చేస్తున్నామని వివరించారు. కాగా బ్రాంచ్‌లో రోబోలను వినియోగించిన తొలి భారత బ్యాంక్‌గా సిటీ యూనియన్ బ్యాంక్ నిలిచింది. గత ఏడాది తొలి రోబోను ఈ బ్యాంక్ ఏర్పాటు చేసింది. కేరళకు చెందిన ఆసిమోవ్ రోబొటిక్స్ సంస్థ ఐరాను రూపొందించింది. -
కూతురి పెయింటింగ్‌ను కొన్న అమీర్ ఖాన్
ముంబై: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, తన కూతురు ఇరా గీసిన పెయింటింగ్‌ను కొన్నాడు. అమీర్ ఖాన్ కూతురు ఇరా తొలిసారిగా తను గీసిన చిత్రాలతో ముంబైలో ప్రదర్శనను నిర్వహించింది. కూతురు ఏర్పాటు చేసిన ప్రదర్శనను చూసేందుకు వచ్చిన అమీర్ ఖాన్ ఓ పెయింటింగ్‌ను ముచ్చటపడి కొనుగోలు చేశాడు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ ట్విట్టర్లో.. 'నా కూతురు ఇరా తొలిసారిగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను చూడటం ఆనందంగా ఉంది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న 'టైగర్స్ నెస్ట్' అనే చిత్రం ఎంతగానో ఆకట్టుకోవడంతో దానిని కొనుగోలు చేశా' అని తెలిపారు. అమీర్ ఖాన్, మాజీ భార్య రీనా దత్తల కూతురు ఇరా. అయితే ప్రస్తుతం అమీర్ ఫిల్మ్ మేకర్ కిరణ్ రావ్ని వివాహమాడారు. ప్రస్తుతం అమీర్ ఖాన మల్ల యోధుల క్రీడా నేపథ్యంలో గల 'దంగల్' చిత్రంలో నటిస్తున్నాడు. My daughter Ira's first exhibition, and I managed to buy this one. It's called 'The Tiger's Nest'. I love it! pic.twitter.com/NLWsHHSyfv — Aamir Khan (@aamir_khan) October 25, 2015 -
‘సాక్షి’తో సివిల్స్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ఇరా