
యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఆయన వరుడు కావాలి, ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి, లక్ష్య, పోలీస్ వారి హెచ్చరిక, నారీనారీనడుమ మురారీతో పాటు అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాతో షెర్లీ సెటియా హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఒక ముఖ్యమైన పాత్రలో బ్రహ్మాజీ నటిస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి హైదరాబాదులో ఈ సినిమా షూటింగు జరుగుతోంది. నాగశౌర్య .. బ్రహ్మాజీ తది తరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
తాజాగా షూటింగ్ సెట్‌లో బ్రహ్మాజీతో దిగిన ఓ ఫోటోని నాగశౌర్య సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో నాగశౌర్య నుదుటున కుంకుమరేఖను ధరించి కనిపిస్తూ ఉండగా, బ్రహ్మాజీ నుదుటున నామాలు ధరించి ఉన్నాడు. అయితే ఈ ఫొటోను పోస్ట్ చేసిన నాగశౌర్య ఫన్నీగా ఒక కామెంట్ పెట్టాడు.
‘నా తమ్ముడు బ్రహ్మాజీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాడు .. మీ అందరి సపోర్టు కావాలి .. దయచేసి యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించండి’అంటూ సరదాగా రాసుకొచ్చాడు. బ్రహ్మాజీ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయింది. అయినా ఆయన ఇప్పటికీ కుర్రాడిలా చాలా ఫిట్ నెస్ తో ఉంటాడు. ఈ విషయంపై సన్నిహితులు ఆయనను ఆటపట్టిస్తూనే ఉంటారు. అలాగే నాగశౌర్య కూడా, ఆయనను తమ్ముడు అంటూ అలా ఆటపట్టించాడు. ప్రస్తుతం నాగశౌర్య ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Na thammudu @actorbrahmaji kothaga industry ki vachadu. Mi andari support thanaki undali. Please support young talent 💪😜#NS22#IRA4 pic.twitter.com/OIgx5UFkSK
— Naga Shaurya (@IamNagashaurya) July 23, 2021
Comments
Please login to add a commentAdd a comment