కూతురి పెయింటింగ్ను కొన్న అమీర్ ఖాన్ | Aamir Khan buys daughter's painting | Sakshi
Sakshi News home page

కూతురి పెయింటింగ్ను కొన్న అమీర్ ఖాన్

Oct 26 2015 12:05 PM | Updated on Mar 22 2019 1:41 PM

కూతురి పెయింటింగ్ను కొన్న అమీర్ ఖాన్ - Sakshi

కూతురి పెయింటింగ్ను కొన్న అమీర్ ఖాన్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, తన కూతురు ఇరా గీసిన పెయింటింగ్ను కొన్నాడు.

ముంబై:  బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, తన కూతురు ఇరా గీసిన పెయింటింగ్ను కొన్నాడు. అమీర్ ఖాన్ కూతురు ఇరా తొలిసారిగా తను గీసిన చిత్రాలతో ముంబైలో ప్రదర్శనను నిర్వహించింది. కూతురు ఏర్పాటు చేసిన ప్రదర్శనను చూసేందుకు వచ్చిన అమీర్ ఖాన్ ఓ పెయింటింగ్ను ముచ్చటపడి కొనుగోలు చేశాడు.

ఈ సందర్భంగా అమీర్ ఖాన్ ట్విట్టర్లో.. 'నా కూతురు ఇరా తొలిసారిగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను చూడటం ఆనందంగా ఉంది. బ్లాక్ అండ్ వైట్లో ఉన్న 'టైగర్స్ నెస్ట్' అనే చిత్రం ఎంతగానో ఆకట్టుకోవడంతో దానిని కొనుగోలు చేశా' అని తెలిపారు. అమీర్ ఖాన్, మాజీ భార్య రీనా దత్తల కూతురు ఇరా. అయితే ప్రస్తుతం అమీర్ ఫిల్మ్ మేకర్ కిరణ్ రావ్ని వివాహమాడారు. ప్రస్తుతం అమీర్ ఖాన మల్ల యోధుల క్రీడా నేపథ్యంలో గల 'దంగల్' చిత్రంలో నటిస్తున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement